సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సార్వత్రిక ఎన్నికలలో ఒక కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే టికెట్ ఇవ్వాలన్న కాంగ్రెస్ తాజా ప్రతి పాదన కలకలం రేపుతోంది. పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి నుంచి పోటీకి సిద్ధం కాగా, ఆ ఇద్దరు నేతల కుమారులు డి.సంజయ్ నిజామాబాద్ అర్బన్ నుంచి, మహ్మద్ ఇలి యాస్ కామారెడ్డి లేదా ఎల్లారెడ్డి నుంచి టికెట్‌ను ఆశిస్తున్నారు. ఒక కుటుంబంలో ఒక్కరికే టికెట్ అన్న ప్రతిపాదనకు తోడు ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నవారు పదవులకు రాజీ నామాలు చేస్తే అంగీకరించబోమన్న నిర్ణయం కూడా వీరికి ఇబ్బందికరంగా మారనుంది. కాం గ్రెస్ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ సీనియర్లను ఆలోచనలో పడేస్తోంది. వారసుల పోరు ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా డి. శ్రీని వాస్, షబ్బీర్ అలీలు ఏం నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.
ఈసారైనా..
నిజామాబాద్ అర్బన్ నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓటమి చెందిన డీఎస్ ఈసారి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధం అ య్యారు. అయితే ఆయన కుమారుడు సంజయ్ అర్బన్ నుంచి చేసుకున్న దరఖాస్తు కూడా పరి శీలనలో ఉంది. షబ్బీర్ అలీ ఎమ్మెల్సీగా సుమా రు మరో ఐదు సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉన్నందున కామారెడ్డి లేదా ఎల్లారెడ్డి నుంచి తన కు టికెట్ ఇవ్వాలని ఆయన కుమారుడు మహ్మద్ ఇలియాస్ కోరుతున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి, టీపీపీసీ నుంచి ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి జాబితాలు పంపిన క్రమంలో తాజాగా ‘ఒక కుంటుంబం నుంచి ఒక్కరికే టికెట్’ అన్న ప్రతిపాదనతో తండ్రులు బరిలో ఉం టారా? కొడుకులను దింపుతారా? అన్న చర్చ జిలా ్లలో మొదలైంది.
దిగ్గజాలకు ‘ఎమ్మెల్సీ’ అడ్డంకా?
రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే నేతలున్న జిల్లాలో ఏఐసీసీ తాజా ప్రతిపాదనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. రెండు పర్యాయాలు పీసీసీ చీఫ్‌గా ఉన్న డి.శ్రీనివాస్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ప్రస్తుతం కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రచార కమిటీ ఉపాధ్యక్షునిగా షబ్బీ ర్, ఎన్నికల కమిటీ సభ్యుడుగా డీఎస్ వ్యవహరిస్తున్నారు.
ఎమ్మెల్సీగా వీరి పదవీకాలం ఇంకా ఉండగా టికెట్ల సర్దుబాటులో భాగంగా ఒక కుటుంబానికి ఒకటే టికెట్, ఎమ్మెల్సీల రాజీనామాలను అమోదించబోమన్న అధిష్టానం నిర్ణయాలు ఏ పరిణామాలకు దారి తీస్తాయోననని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఆశల పల్లకీలో
ఇదే సమయంలో నిజామాబాద్ అర్బన్, రూరల్‌ల నుంచి డీఎస్, సంజయ్‌లతో పాటు తాహెర్‌బిన్ హందాన్, ఆకుల లలిత, గడుగు గంగాధర్, బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు కూడా టికెట్ ఆశిస్తున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నుంచి ప్రస్తుతం షబ్బీర్ అలీ, ఇలియాస్, ఎడ్ల రాజిరెడ్డిల పేర్లుండగా.. అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు అమలైతే ఇద్దరు నేతలు తమ ఇద్దరు కుమారులను సార్వత్రిక ఎన్నికల రంగంలోకి దింపడం అనివార్యం.
మరో ఆరు రోజులలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫి కేషన్ విడుదల కానుం డగా, తాజా ఏఐసీసీ ప్రతిపాదనలు ఏ మేరకు అమలవుతాయి? ఈ విషయంలో ఇద్దరు అగ్రనేతలు ఏమి చేయనున్నారు? వీరిద్దరు బరిలో ఉండటం అవసరమని అధిష్టానం భావిస్తే ఏం జరుగుతుందనే అం శాలు పార్టీ వర్గాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. మరో వైపు అగ్రనేతలు, వారి వారసులతో పాటు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపిన జాబితాలో పేర్లుఉన్న నేతలలో ఆశలు చిగురిస్తున్నాయి. అధిష్టానం నిర్ణయం తమకు లాభించవచ్చని భావిస్తున్నారు.
తండ్రా.. కొడుకా!
Published Thu, Mar 27 2014 2:59 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement