మూడు జిల్లాల కూడలి, వ్యాపార, వాణిజ్య రంగాలలో ముందున్న కామారెడ్డి పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కామారెడ్డిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని మాజీ మంత్రి షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రముఖ న్యాయవాది ఒకరు కొన్నేళ్లుగా ఈ డిమాండ్‌పై పోరాడుతున్నారు.
కామారెడ్డి, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజ న జరగనున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లా ఏ ర్పాటు ఎన్నికల హామీల జాబితాలో చేరింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తనను గెలిపిస్తే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తానని, కొత్త జిల్లాల ఏర్పాటులో కామారెడ్డిని జిల్లాగా చేయడానికి తనవంతు కృషి చేస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు.
షబ్బీర్ అలీ ప్రకటనతో జిల్లా అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కామారెడ్డిని జిల్లా చేయాలనే డిమాండ్‌తో కొంతకాలం గా కరపత్రాలు ముద్రించి ప్రచారం నిర్వహిం చిన న్యాయవాది బత్తిని నాగభూషణం, కా మారెడ్డి అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచాడు.
ఆయన ఇదే నినాదంతో ప్రచారం మొదలుపెట్టారు. దీంతో మి గతా అభ్యర్థులు కూడా కామారెడ్డి జిల్లా అంశా న్ని ఎన్నికల హామీగా మలచుకునే అవకాశం ఉంది. తె లంగాణలో ఉన్న ప్రస్తుతం పది జిల్లాలతోపాటు మరో 14 జిల్లాలను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే టీ ఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలి సిందే. ఈ నేపథ్యంలో కామారెడ్డిని జిల్లాగా చేయాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది.
అన్ని వర్గాల నుంచి డిమాండ్
ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు, న్యాయవాదులు, వ్యాపార, వాణిజ్యవర్గాల వాళ్లంతా కామారెడ్డిని జిల్లా చేయాలనే డిమాండ్‌తో ఉన్నారు. కామా రెడ్డిని జిల్లా ఏర్పాటు చేయడానికి అనేక రకాలుగా వసతులు ఉన్నాయి. రైల్వే లైను, జాతీయ రహదారులతో పాటు రాష్ర్ట రాజధానికి వంద కిలోమీటర్ల దూరంలోనే పట్టణం ఉంది. నాలుగు లైన్ల జాతీయ రహదారి కావడం వల్ల గంటన్నర, రెండు గంటల్లో హైదరాబాద్‌కు వెళ్లే సౌలభ్యం కలిగింది.
ఇక్కడ ప్రభుత్వ భూములు ఉన్నా యి. అలాగే రెవెన్యూ డివిజన్ కేంద్రం. దాదాపు లక్ష జనాభా, 33 వార్డులతో ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా పట్టణం వర్ధిల్లుతోం ది. అన్ని శాఖలకు ఒకే చోట భవనాలు నిర్మించేందుకు గాను కావలసిన భూములు ఉండడంతో పాటు జిల్లాకు కావలసిన వసతులన్నీ ఉన్నాయి. కామారెడ్డి నియోజకవర్గంతో పాటు ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలు, అటు నిజామాబాద్ రూరల్ పరిధిలోని సిరికొండ, భీంగల్,ధర్పల్లి మండలాలు భౌగోళికంగా కామారెడ్డికి దగ్గరగా ఉన్నాయి. అలాగే పొరుగు జిల్లాలైన కరీంనగర్‌లోని గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాలు కామారెడ్డికి దగ్గరగా ఉంటాయి.
కొత్త మండలాలను ఏర్పాటు చేస్తే రామారెడ్డి, రాజంపేట, బీబీపేట, పెద్దమల్లారెడ్డి వంటివి మండలాలు అయ్యే అవకాశం ఉంది. వీటన్నింటినీ కలిపి జిల్లాను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. కాగా జిల్లా ఏర్పాటు గురించిన చర్చ మరోసారి తెరపైకి రావడంతో ఈ ప్రాంత ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సందర్భంలో కామారెడ్డిని జిల్లాగా చేయొచ్చన్న అంశంపై ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. అప్పటి నుంచే ఇక్కడ జిల్లా డిమాండ్ ప్రజల్లోకి వెళ్లింది. తాజాగా ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా ఎన్నికల హామీగా జిల్లాను పెట్టుకుని ముందుకు కదులుతుండడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. రాబోయే రోజుల్లో జిల్లా కోసం వివిధ వర్గాలు ఉద్యమించే అవకాశాలున్నాయి.
తెరపైకి ‘కామారెడ్డి’ జిల్లా!
Published Tue, Apr 15 2014 2:05 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement