Kamareddy town
-
విషాదం: మార్కెట్ కమిటీ ఛైర్మన్ భగవంత్ రెడ్డి ఆత్మహత్య
సాక్షి, కామారెడ్డి: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అంతంపల్లి గ్రామంలో అప్పులకు తాళలేక మార్కెట్ కమిటీ ఛైర్మన్ భగవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల ప్రకారం.. భగవంత్ రెడ్డి భిక్కనూర్ వ్యవసాయ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. అయితే, ఇటీవలి కాలంలో అప్పులు ఎక్కువగా కావడంతో ఆయన వేదనకు లోనయ్యారు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో, అంతంపల్లిలో విషాదం నెలకొంది. -
కామారెడ్డి ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌పై తీవ్ర నిరసన: భూమిని మింగే ప్లానొద్దు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి పట్టణ మాస్టర్‌ప్లాన్ ముసాయిదా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ముసాయిదాకు వ్యతిరేకంగా నెల రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు గురువారం తమ కుటుంబ సభ్యులతో కలిసి ‘రైతు కుటుంబ సమేత ర్యాలీ’చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. రైతులు భారీగా తరలివస్తుండటంతో పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. అయితే పోలీసులను దాటుకుని రైతులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తోపులాటలో ఐదుగురు రైతులు గాయపడటంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా ఏఎస్పీ అనోన్య, డీఎస్పీ సోమనాథం తమతో దురుసుగా మాట్లాడారంటూ రైతులు మండిపడ్డారు. కొందరు రైతులు, మహిళా రైతులు.. పోలీసులపైకి చెప్పులు విసిరారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ధర్నా కార్యక్రమం కొనసాగింది. కలెక్టర్ జితేష్ వి పాటిల్ బయటకు వచ్చి తమ గోడు వినాలని, వెంటనే మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కలెక్టర్ బయటకు రాకపోవడంతో ఆయన తీరుపై మండిపడ్డారు. కలెక్టర్ వచ్చేదాకా అక్కడి నుంచి కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించారు. అక్కడే వంటావార్పు నిర్వహించి భోజనాలు చేశారు. దీంతో కలెక్టరేట్‌లోకి రాకపోకలు నిలిచిపోయాయి. చీకటి పడుతుండగా టెంట్లు, కార్పెట్లు వేసుకుని.. ఎంత రాత్రైనా కలెక్టర్ వచ్చే వరకు కదలబోమంటూ బైఠాయించారు. రైతులకు బీజేపీ నేతలు వెంకటరమణారెడ్డి, రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు సుభాష్‌రెడ్డి, జమునా రాథోడ్, టీజేఎస్ నేత నిజ్జన రమేష్ తదితరులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి రైతులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. ఐదుగురు లేదా పది మంది రైతులు కలెక్టర్ వద్దకు వెళ్లి వినతిపత్రం ఇవ్వాలని చెప్పారు. అయినా రైతులు వినలేదు. కలెక్టర్ వచ్చి స్వయంగా తమకు హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. రాత్రి 8 గంటల తర్వాత కూడా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బయటకు రాకపోవడంతో ఆయన దిష్టి»ొమ్మకు వినతిపత్రం సమరి్పంచారు. మహిళలు కలెక్టర్ దిష్టి»ొమ్మపై ఏడు దోసిళ్ల మట్టిని విసిరారు. అనంతరం రైతులు ఆందోళన విరమించారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంతో పాటు నియోజకవర్గం బంద్‌కు రైతు ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. సర్పంచ్ భర్తపై దాడి రైతులు ర్యాలీ నిర్వహిస్తుండగా ఇందిరాచౌక్ వద్ద అడ్లూర్ ఎల్లారెడ్డి సర్పంచ్ జానకి భర్త పైడి జనార్దన్ వారికి కన్పించారు. దీంతో కొందరు మహిళా రైతులు ఆయనపై దాడి చేశారు. ప్లకార్డులు, కర్రలతో చితకబాదారు. నెల రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పించుకుని పరుగులు పెట్టిన జనార్దన్ పక్కనే ఉన్న ఓ దుకాణంలోకి వెళ్లి దాక్కున్నారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని శాంతింపజేశారు. కేటీఆర్ స్పందించాలి: ఎమ్మెల్యే రఘునందన్‌రావు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాస్టర్‌ప్లాన్ ప్రకారం ఇండ్రస్టియల్ జోన్లోకి మారుతున్న 2,500 ఎకరాల రైతుల భూములను వదిలేయాలని డిమాండ్ చేశారు. పుష్కలంగా పంటలు పండే భూములను ఇండ్రస్టియల్ జోన్‌గా మార్చుతారా? అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ స్పందించి రైతులకు న్యాయం చేయాలన్నారు. వేలాది మంది రైతులు కలెక్టరేట్‌కు వస్తే వినతిపత్రం స్వీకరించకపోగా, రైతు ఉద్యమాన్ని హేళన చేసిన కలెక్టర్‌కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కాగా రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలపడానికి కామారెడ్డికి వస్తున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరి్వంద్‌ను పోలీసులు 44 నంబర్ జాతీయ రహదారిపై పట్టణ శివారులో అడ్డుకున్నారు. గుంట భూమి పోయినా పోటీ చేయను: ఎమ్మెల్యే సురేందర్ మాస్టర్‌ప్లాన్‌లో రైతులకు సంబంధించి గుంట భూమి పోయినా తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రైతులకు మేలు చేసే ప్రభుత్వమని ఆయన అన్నారు. మాస్టర్‌ప్లాన్‌లో ఎవరి భూమీ పోకుండా మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తానని చెప్పారు. కొందరు నాయకులు అనవసరంగా రైతులను రెచ్చగొట్టి రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. -
కామారెడ్డిలో అర్ధరాత్రి కలకలం
- కారు, బైకులకు నిప్పుపెట్టిన అగంతకులు - మరో బైకును రైలు పట్టాలపై పడేశారు - ప్రైవేటు బస్సుల్లో నుంచి వస్తువుల చోరీ కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీలో వాసవీస్కూల్కు సమీపంలోని ఓ వీధిలో మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పలు వాహనాలను పెట్రోల్ చల్లి నిప్పంటించారు. ఈ ఘటనలో ఓ కారు, బైకు దహనం కాగా, మరో బైకును రైలు పట్టాలపై పడేయడంతో రైలు ఢీకొని తుక్కుతుక్కయ్యింది. ఇంకో బైకును దహనం చేయడానికి ప్రయత్నించారు. అదే వీధిలో రెండు ప్రైవేటు బస్సుల్లో నుంచి డీవీడీ ప్లేయర్లు, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్లారు. పోలీసుల వివరాల ప్రకారం... 5-8-407/బీ నంబరు గల ఇంటిలో నెల క్రితమే అద్దెకు చేరిన కృష్ణా జిల్లాకు చెందిన ఉప్పు రాజగోపాల్ అనే కాంట్రాక్టర్ రోజులాగే రాత్రి ఇంటి ముందర తన నిస్సాన్ మిక్రా కారు (ఏపీ 16జీ 14 నంబరు)ను నిలిపి ఉంచారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కారు నిప్పంటుకుంది. వీధిలోని వారందరూ లేచి చూసేసరికి కారు కాలుతూ ఉంది. పక్కనే ఉన్న 5-8-407 నంబరు గల ఇంటి గేటుకు తాళం లేకపోవడంతో దుండగులు అందులోకి ప్రవేశించి ఇంట్లో అద్దెకు ఉంటున్న సూరేటి రాజిరెడ్డికి చెందిన (ఏపీ 25ఏపీ 4380) నంబరు గల ప్యాషన్ ప్రో బైకును దహనం చేశారు. రాజిరెడ్డి వారం క్రితమే ఆ ఇంట్లోకి అద్దెకు వచ్చాడు. అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న బి.జగన్ అనే వ్యక్తికి చెందిన (ఏపీ 25 సీ 9147)నంబరు గల స్ల్పెండర్ బైకును సమీపంలోని రైలు పట్టాలపైకి తీసుకెళ్లి పడేశారు. రాత్రిపూట వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో బైకు తుక్కుతుక్కయ్యింది. జగన్ 20 రోజుల క్రితం ఇంట్లో అద్దెకు దిగాడు. సమీపంలోని ప్రధాన రోడ్డుపై నిలిపి ఉంచిన ప్రైవేటు బస్సుల్లో నుంచి డెక్కులు, ఇతర సామగ్రిని కూడా దుండగులు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఎవరూ దొరకలేదు. సంఘటనా స్థలాన్ని కామారెడ్డి డీఎస్పీ సురేందర్‌రెడ్డి, పట్టణ సీఐ కృష్ణ, ఎస్సై మధు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మిస్టరీగా మారిన వాహనాల దహనం... దొంగలైతే వాహనాలను ఎత్తుకెళతారు. ఇక్కడ కారు, బైకును దహనం చేయడం, మరో బైకును పట్టాలపై వదలడం, ఇంకో వాహనాన్ని దహనం చేయడానికి ప్రయత్నించడం వంటి సంఘటనలు మిస్టరీగా మారాయి. వాహనాల యజమానులకు ఎవరితోనైనా వ్యక్తిగత కక్షలతో జరిగాయా అంటే, ఆ ముగ్గురూ ఇతర ప్రాంతాలకు చెందిన వారు కావడం, వారు ఈ మధ్యనే ఆ ఇళ్లలో అద్దెకు దిగడం వల్ల వ్యక్తిగత కక్షలతో జరిగి ఉండకపోవచ ్చంటున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తామని డీఎస్పీ సురేందర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
తెరపైకి ‘కామారెడ్డి’ జిల్లా!
మూడు జిల్లాల కూడలి, వ్యాపార, వాణిజ్య రంగాలలో ముందున్న కామారెడ్డి పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కామారెడ్డిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని మాజీ మంత్రి షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రముఖ న్యాయవాది ఒకరు కొన్నేళ్లుగా ఈ డిమాండ్‌పై పోరాడుతున్నారు. కామారెడ్డి, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజ న జరగనున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లా ఏ ర్పాటు ఎన్నికల హామీల జాబితాలో చేరింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తనను గెలిపిస్తే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తానని, కొత్త జిల్లాల ఏర్పాటులో కామారెడ్డిని జిల్లాగా చేయడానికి తనవంతు కృషి చేస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. షబ్బీర్ అలీ ప్రకటనతో జిల్లా అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కామారెడ్డిని జిల్లా చేయాలనే డిమాండ్‌తో కొంతకాలం గా కరపత్రాలు ముద్రించి ప్రచారం నిర్వహిం చిన న్యాయవాది బత్తిని నాగభూషణం, కా మారెడ్డి అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచాడు. ఆయన ఇదే నినాదంతో ప్రచారం మొదలుపెట్టారు. దీంతో మి గతా అభ్యర్థులు కూడా కామారెడ్డి జిల్లా అంశా న్ని ఎన్నికల హామీగా మలచుకునే అవకాశం ఉంది. తె లంగాణలో ఉన్న ప్రస్తుతం పది జిల్లాలతోపాటు మరో 14 జిల్లాలను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే టీ ఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలి సిందే. ఈ నేపథ్యంలో కామారెడ్డిని జిల్లాగా చేయాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. అన్ని వర్గాల నుంచి డిమాండ్ ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు, న్యాయవాదులు, వ్యాపార, వాణిజ్యవర్గాల వాళ్లంతా కామారెడ్డిని జిల్లా చేయాలనే డిమాండ్‌తో ఉన్నారు. కామా రెడ్డిని జిల్లా ఏర్పాటు చేయడానికి అనేక రకాలుగా వసతులు ఉన్నాయి. రైల్వే లైను, జాతీయ రహదారులతో పాటు రాష్ర్ట రాజధానికి వంద కిలోమీటర్ల దూరంలోనే పట్టణం ఉంది. నాలుగు లైన్ల జాతీయ రహదారి కావడం వల్ల గంటన్నర, రెండు గంటల్లో హైదరాబాద్‌కు వెళ్లే సౌలభ్యం కలిగింది. ఇక్కడ ప్రభుత్వ భూములు ఉన్నా యి. అలాగే రెవెన్యూ డివిజన్ కేంద్రం. దాదాపు లక్ష జనాభా, 33 వార్డులతో ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా పట్టణం వర్ధిల్లుతోం ది. అన్ని శాఖలకు ఒకే చోట భవనాలు నిర్మించేందుకు గాను కావలసిన భూములు ఉండడంతో పాటు జిల్లాకు కావలసిన వసతులన్నీ ఉన్నాయి. కామారెడ్డి నియోజకవర్గంతో పాటు ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలు, అటు నిజామాబాద్ రూరల్ పరిధిలోని సిరికొండ, భీంగల్,ధర్పల్లి మండలాలు భౌగోళికంగా కామారెడ్డికి దగ్గరగా ఉన్నాయి. అలాగే పొరుగు జిల్లాలైన కరీంనగర్‌లోని గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాలు కామారెడ్డికి దగ్గరగా ఉంటాయి. కొత్త మండలాలను ఏర్పాటు చేస్తే రామారెడ్డి, రాజంపేట, బీబీపేట, పెద్దమల్లారెడ్డి వంటివి మండలాలు అయ్యే అవకాశం ఉంది. వీటన్నింటినీ కలిపి జిల్లాను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. కాగా జిల్లా ఏర్పాటు గురించిన చర్చ మరోసారి తెరపైకి రావడంతో ఈ ప్రాంత ప్రజల్లో ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సందర్భంలో కామారెడ్డిని జిల్లాగా చేయొచ్చన్న అంశంపై ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. అప్పటి నుంచే ఇక్కడ జిల్లా డిమాండ్ ప్రజల్లోకి వెళ్లింది. తాజాగా ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా ఎన్నికల హామీగా జిల్లాను పెట్టుకుని ముందుకు కదులుతుండడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. రాబోయే రోజుల్లో జిల్లా కోసం వివిధ వర్గాలు ఉద్యమించే అవకాశాలున్నాయి.