
నాకు, కన్నాకు సీఎం కావాలన్న ఆశలేదు: డీఎస్
రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని, సీమాంధ్ర నేతలు ఇకనైనా సమైక్యాంధ్ర అనకుండా తమ ప్రాంత ప్రయోజనాల గురించి ఆలోచించడం మంచిదని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు.
రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని, సీమాంధ్ర నేతలు ఇకనైనా సమైక్యాంధ్ర అనకుండా తమ ప్రాంత ప్రయోజనాల గురించి ఆలోచించడం మంచిదని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. విభజన వద్దంటూ వచ్చేదాన్ని పోగొట్టుకోవద్దని తెలిపారు. సీమాంధ్రనేతలు ఆశ్చర్యపోయే రీతిలో కేంద్రం ఆ ప్రాంతానికి ప్యాకేజీ ఇస్తుందని డీఎస్ చెప్పారు. రాయల తెలంగాణ కోరడమంటే ఆ రెండు జిల్లాలు నేతలు విభజనను ఆమోదిస్తున్నట్లే కదా అని ఆయన ప్రశ్నించారు.
371 (డి) అనేది విభజనకు అడ్డంకి కాదని, తాను ముఖ్యమంత్రి పదవిని ఆశించట్లేదని డి.శ్రీనివాస్ చెప్పారు. అలాగే, రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు కూడా సీఎం కావాలన్న ఆలోచన లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తున్నందున తెలంగాణ ప్రజలు కూడా కొన్ని ఇబ్బందులుంటే సర్దుకుపోవాలని డీఎస్ సూచించారు.