కొడుకు, అల్లుడి కోసమే కొత్త జిల్లాలు | TPCC committee member alleges that new districts for KTR and Harishrao | Sakshi
Sakshi News home page

కొడుకు, అల్లుడి కోసమే కొత్త జిల్లాలు

Published Wed, Jun 22 2016 8:52 PM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM

TPCC committee member alleges that new districts for KTR and Harishrao

కరీంనగర్: కొడుకు కే తారకరామారావు, అల్లుడు టీ హరీశ్ రావుల కోసమే సీఎం కే చంద్రశేఖరరావు రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారని పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. స్వార్థం కోసం జరుగుతున్న ఈ ప్రయత్నం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. బిడ్డ కోసం నిజామాబాద్ ఉంది. ఇప్పుడు కొడుకు కోసం సిరిసిల్ల, అల్లుడి కోసం సిద్ధిపేటలను జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. శాస్త్రీయంగా జిల్లాలను విభజిస్తే తామూ సంతోషిస్తామని, కుటుంబసభ్యుల కోసం చేస్తే ఊరుకోమని అన్నారు. కరీంనగర్ కు చెందిన గంగాధర మండలాన్ని సిరిసిల్లలో కలపడం సీఎం స్వార్ధ రాజకీయాలకు నిదర్శనం అని అన్నారు. ప్రజాభీష్టానికి భిన్నంగా జిల్లాలను ఏర్పాటు చేస్తే సహించబోమని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement