సాక్షి, ఖమ్మం డెస్‌్క: తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 31 రిజర్వుడ్ నియోజవర్గాలు. వీటిల్లో 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నాయి. 2009లో చేపట్టిన డీ లిమిటేషన్ సందర్భంలో జనాభా ఆధారంగా వీటిని ఖరారు చేశారు. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఎక్కువగా రిజర్వుడ్ నియోజకవర్గాలు ఖమ్మంలోనే ఉన్నాయి. ఇక్కడ పది స్థానాలకు గాను ఏడు రిజర్వుడ్ స్థానాలే. ఇందులో ఐదు ఎస్టీ, రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే.... కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం కూడా లేదు.
ఎస్టీ అసెంబ్లీ సెగ్మెంట్‌లు
ఉమ్మడి ఖమ్మం : పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట, భద్రాచలం, వైరా
ఉమ్మడి ఆదిలాబాద్ : ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్
ఉమ్మడి వరంగల్ : డోర్నకల్, మహబూబాబాద్, ములుగు
ఉమ్మడి నల్లగొండ : దేవరకొండ
ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్‌లు
ఉమ్మడి కరీంనగర్ : ధర్మపురి, చొప్పదండి, మానకొండూరు
ఉమ్మడి ఖమ్మం : మధిర, సత్తుపల్లి
ఉమ్మడి మహబూబ్‌నగర్ : అచ్చంపేట, అలంపూర్
ఉమ్మడి ఆదిలాబాద్ : చెన్నూరు, బెల్లంపల్లి
ఉమ్మడి నల్లగొండ : నకిరేకల్, తుంగతుర్తి
ఉమ్మడి వరంగల్ : స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట
ఉమ్మడి రంగారెడ్డి : చేవెళ్ల, వికారాబాద్
ఉమ్మడి మెదక్ : జహీరాబాద్, అందోల్
హైదరాబాద్ : కంటోన్మెంట్
ఉమ్మడి నిజామాబాద్ : జుక్కల్
Comments
Please login to add a commentAdd a comment