సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులను నియమించింది. కేబినెట్ లోని మంత్రులందరికీ ఉమ్మడి పది జిల్లాలవారీగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మినహా మిగతా 10 మంది మంత్రులను తలా ఓ జిల్లాకు ఇన్‌చార్జిగా ప్రభుత్వం నియమించింది.
కేబినెట్‌లో ప్రాతిని ధ్యం దక్కని హైదరాబాద్‌కు పొన్నం ప్రభాకర్, ఆదిలా బాద్‌కు సీతక్క, నిజామాబాద్‌కు జూపల్లి కృష్ణా రావు, రంగారెడ్డికి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులను ఇన్‌చార్జి మంత్రులుగా బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే జిల్లా సమీక్షా మండలి (డీఆర్‌సీ) లను కూడా పునరుద్ధరించనున్నట్టు తెలుస్తోంది.
ఈ మండళ్ల పునరుద్ధరణ ద్వారా ప్రతి మూడు నెలలకోసారి ఆయా జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఇన్‌చార్జి మంత్రుల నేతృత్వంలో సమీక్షలు నిర్వహించనున్నట్టు సమాచారం. అయితే, ఇన్‌చార్జి మంత్రులను ప్రజాపాలన కార్యక్రమాల అమలును సమన్వయం చేసేందుకు నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment