in-charge
-
పీసీసీ అధ్యక్షుడిగా నేడు మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బొమ్మా మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 2:45 నిమిషాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి నుంచి మహేశ్‌గౌడ్ బాధ్యతలు తీసుకుంటారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ సమీపంలో గన్‌పార్కు వద్దకు రానున్న మహేశ్‌గౌడ్ అమరవీరులకు నివాళులరి్పస్తారని, అక్కడి నుంచి వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా గాం«దీభవన్‌కు చేరుకుంటారని తెలిపాయి.బాధ్యతలు స్వీకరించిన అనంతరం గాం«దీభవన్‌లో సభ జరగనుంది. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, పెరుమాళ్లతో పాటు రాష్ట్ర కేబినెట్లోని మంత్రులు హాజరుకానున్నారు. ముస్తాబైన గాందీభవన్.. కాగా, పీసీసీ నూతన అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ కోసం గాంధీభవన్ ముస్తాబైంది. గత నాలుగు రోజులుగా గాం«దీభవన్‌కు రంగులు వేసే కార్యక్రమం పూర్తయింది. సభ నిర్వహణ కోసం కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఫిషర్మెన్ సొసైటీ చైర్మన్ మెట్టు సాయికుమార్‌తో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పీసీసీ కొత్త అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పాల్గొంటుండటంతో పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. -
బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం ఎటూ తేలలేదు. దీంతో పార్టీ నాయ కులు, కార్యకర్తల్లో స్తబ్దత నెలకొంది. కేంద్ర కేబినెట్ ఏర్పాటు, తదనంతర పరిణామాల్లో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక తెరపైకి వచ్చి హడావిడి జరిగినా, ఆ తర్వాత మళ్లీ సద్దుమణిగింది. కేంద్రమంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డిని జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్చార్జ్గా నియమించారు. దీంతో ఆయన అటు మంత్రిగా పార్లమెంట్ సమావేశాలు, కశ్మీర్ బాధ్యతలతో బిజీగా ఉంటున్నారు. కశ్మీర్ ఎన్నికలు వచ్చే సెపె్టంబర్ నెలాఖరులోగా జరిగే అవకాశాలు ఉండటంతో అప్పటి దాకా అధ్యక్షుడి గా ఆయన రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించే పరిస్థితులు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అ యితే ఈ పదవిలో ఎవరిని నియమించాలనే దా నిపై బీజేపీ కేంద్రం నాయకత్వం ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రాలేదు. దీంతో ఈ అంశం కొంతకాలం పాటు పెండింగ్‌లో పడినట్టుగానే భావించాల్సి ఉంటుందని పారీ్టవర్గాలు పేర్కొంటున్నా యి. రాష్ట్రంలో అడపాదడపా యువమోర్చా, మహిళా మోర్చా ల వంటి విభాగాలు ఆయా అంశాలు, సమస్యలపై నిరసనలు, దీక్షలు వంటివి చేపడుతున్నా పెద్దనాయకులెవరూ పాల్గొనకపోవడంతో అవి పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి.అ«ధ్యక్ష పదవి కోసం పలువురు ముఖ్యనేతలు పోటీపడుతున్నా, చివరకు ఎవరిని నియమిస్తారనే దానిపై స్పష్టత కొరవడింది. పారీ్టలో ఉన్న ఇప్పటికే ఉన్న కొందరు ముఖ్యనేతలు, పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయలేమి, కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు పవర్సెంటర్లుగా మారడం వంటి కారణాలతో పారీ్టనాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికను వాయిదా వేస్తోందని పారీ్టనాయకులు భావిస్తున్నారు. జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం ముగిసి, ఆయన్ను కూడా కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నందున, కొత్త జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడిని నియమించే అవకాశాలున్నాయని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.కొనసాగుతున్న ఉత్కంఠ కొత్త అధ్యక్షుడి ఎంపికపై రాష్ట్ర బీజేపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, అర్వింద్ ధర్మపురి, ఎం.రఘునందన్‌రావు గట్టిగా పోటీపడుతున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. కేంద్రమంత్రిగా, బీజేఎలీ్పనేతగా రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇచి్చనందున, బీసీ వర్గాల నుంచే అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. దీంతో ఈటల పేరు దాదాపుగా ఖరారై ప్రకటించాల్సిన దశలో మళ్లీ ఏవో కారణాలతో వాయిదా పడినట్టుగా ప్రచారం జరుగుతోంది.ఇదిలా ఉంటే ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి ఒకరి ఎంపిక ఉండొచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు. పారీ్టపరంగా చూస్తే ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పార్టీ సీనియర్ నేతలు చింతా సాంబమూర్తి, మాజీ ఎమ్మెల్సీ ఎ¯న్.రామచంద్రరావు, టి.ఆచారి, ఎం.ధర్మారావు డా.జి. మనోహర్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, దుగ్యాల ప్రదీప్‌కుమార్, కాసం వెంకటేశ్వర్లు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఈ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు.అధ్యక్ష పదవి కోసం పాత,కొత్త నాయకుల మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొనడంతో రాష్ట్ర పారీ్టలోనూ విచిత్ర పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతకాలం క్రితమే పారీ్టలో చేరిన వారికి కీలకమైన అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా అన్న చర్చ కూడా బలంగానే వినిపిస్తోంది. మరోవైపు 1951లో జనసంఘ్ కాలం, 1980లో బీజేపీగా ఏర్పడ్డాక ఇప్పటిదాకా రెండేళ్ల పాటు మాత్రమే బంగారు లక్ష్మణ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించారు. ఇదీగాకుండా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో దళిత సామాజికవర్గాల ఆదరణను పొందలేకపోయినందున ఈసారి ఓ సీనియర్ ఎస్సీ నేతను కొత్త అధ్యక్షుడిగా నియమించడం ద్వారా ఈ వర్గాల్లోనూ పార్టీ విస్తరణకు అవకాశం ఉంటుందని ఓ వర్గం నాయకులు గట్టిగా వాదిస్తున్నారు. -
జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల నియామకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమించింది. కేబినెట్ లోని మంత్రులందరికీ ఉమ్మడి పది జిల్లాలవారీగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మినహా మిగతా 10 మంది మంత్రులను తలా ఓ జిల్లాకు ఇన్చార్జిగా ప్రభుత్వం నియమించింది. కేబినెట్లో ప్రాతిని ధ్యం దక్కని హైదరాబాద్‌కు పొన్నం ప్రభాకర్, ఆదిలా బాద్‌కు సీతక్క, నిజామాబాద్‌కు జూపల్లి కృష్ణా రావు, రంగారెడ్డికి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులను ఇన్చార్జి మంత్రులుగా బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే జిల్లా సమీక్షా మండలి (డీఆర్సీ) లను కూడా పునరుద్ధరించనున్నట్టు తెలుస్తోంది. ఈ మండళ్ల పునరుద్ధరణ ద్వారా ప్రతి మూడు నెలలకోసారి ఆయా జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఇన్చార్జి మంత్రుల నేతృత్వంలో సమీక్షలు నిర్వహించనున్నట్టు సమాచారం. అయితే, ఇన్చార్జి మంత్రులను ప్రజాపాలన కార్యక్రమాల అమలును సమన్వయం చేసేందుకు నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. -
పైలట్‌కు ‘ఛత్తీస్’ బాధ్యతలు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ రాజస్తాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్‌కు పారీ్టలో కీలక పదవి అప్పగించింది. ఛత్తీస్‌గఢ్ ఇన్చార్జ్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ సభ్యులుగా, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సీడబ్ల్యూసీ భేటీ జరిగిన రెండు రోజులకే ఇలా పలువురు ప్రధాన కార్యదర్శలు, ఇన్‌చార్జ్‌ల బాధ్యతలను మార్చడం గమనార్హం. ఢిల్లీ, హరియాణా ఇన్చార్జ్ బాధ్యతలను దీపక్ బబారియాకు అప్పగించారు. కూమారి సెల్జాను ఉత్తరాఖండ్ ఇన్చార్జ్ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. మాణిక్కం ఠాగూర్‌ను అండమాన్ అండ్ నికోబార్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా నియమించారు. జార్ఖండ్ ప్రధాన కార్యదర్శి జీఏ మిర్‌కు పశ్చిమబెంగాల్ బాధ్యతలూ అప్పగించారు. జితేంద్ర సింగ్‌కు మధ్యప్రదేశ్ బాధ్యతలు కట్టబెట్టారు. మహారాష్ట్ర ఇన్చార్జ్గా రమేశ్ చెన్నితల, బిహార్ ఇన్చార్జ్గా మోహన్ ప్రకాశ్ నియమితులయ్యారు. మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్‌లకు ఇన్చార్జ్గా చెల్లకుమార్ ఎంపికయ్యారు. అజయ్ కుమార్‌కు తమిళనాడు, పుదుచ్చేరి అదనపు బాధ్యతలు ఇచ్చారు. జమ్మూకశ్మీర్ ఇన్చార్జ్గా భరత్సిన్హ్ సోలంకీ, హిమాచల్, చండీగఢ్ ఇన్చార్జ్గా రాజీవ్ శుక్లా, రాజస్తాన్ ఇన్చార్జ్గా సుఖ్జీందర్ సింగ్ రణ్‌ధావా, పంజాబ్ ఇన్చార్జ్గా దేవేందర్ యాదవ్, గోవా, డామన్, డయ్యూ, దాద్రానగర్, హవేలా ఇన్చార్జ్గా మాణిక్‌రావు థాకరేను నియమించారు. త్రిపుర, సిక్కిం, మణిపూర్, నాగాలాండ్‌లకు గిరీశ్ చోదంకర్ను ఇన్చార్జ్గా నియమించారు. తెలంగాణ ఇంఛార్జ్‌గా దీపా దాస్‌మున్షీ, ఏపీకి మాణిక్కం ఠాగూర్‌ను నియమించారు. ప్రియాంక చేజారిన యూపీ ఉత్తర్‌ప్రదేశ్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాం«దీని తప్పించడం గమనార్హం. ప్రియాంక గాం«దీకి ప్రధాన కార్యదర్శి పదవి ఉన్నాసరే ఆమెకు ఎలాంటి పోర్ట్‌ఫోలియో కేటాయించలేదు. అవినాశ్ పాండేకు ఉత్తరప్రదేశ్ బాధ్యతలను కట్టబెట్టారు. అజయ్ మాకెన్ పార్టీ కోశాధికారిగా ఉంటారు. -
మధ్యప్రదేశ్ ఇన్చార్జిగా సూర్జేవాలా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ గురువారం సంస్థాగతంగా కీలక మార్పులను ప్రకటించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన మధ్యప్రదేశ్‌కు పార్టీ జనరల్ సెక్రటరీ ఇన్చార్జిగా రణదీప్ సూర్జేవాలాను నియమించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే అజయ్ రాయ్‌కు అప్పగించింది. గుజరాత్ జనరల్ సెక్రటరీ ఇన్చార్జిగా ముకుల్ వాస్నిక్‌ను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారని ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం పార్టీ కర్ణాటక ఇన్చార్జిగా ఉన్న సూర్జేవాలా మధ్యప్రదేశ్ బాధ్యతలు అదనంగా నిర్వహిస్తారు. సూర్జేవాలాను మధ్యప్రదేశ్ సీనియర్ ఎన్నికల పరిశీలకుడిగా ఇటీవలే పార్టీ నియమించింది. అజయ్ రాయ్ 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని మోదీపై పోటీ చేశారు. దళిత నేత, యూపీ పార్టీ చీఫ్ బ్రిజ్‌లాల్ ఖబ్రి స్థానంలో రాయ్ తక్షణమే నూతన బాధ్యతలు చేపడతారని పార్టీ ప్రకటన పేర్కొంది. -
మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జ్గా కల్వకుంట్ల వంశీధర్‌రావు
సాక్షి, హైదరాబాద్: భారత్రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) మహారాష్ట్ర యూనిట్‌కు 15 మందితో కూడిన తాత్కాలిక స్టీరింగ్ కమిటీని పార్టీఅధినేత, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఏర్పాటు చేశారు. కేసీఆర్ చైర్మన్‌గా ఏర్పాటైన ఈ స్టీరింగ్ కమిటీ తక్షణమే మనుగడలోకి వస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ సోదరుడి కుమారుడు కల్వకుంట్ల వంశీధర్‌రావుకు ఈ స్టీరింగ్ కమిటీలో చోటు దక్కగా, కమిటీ సభ్యుడి హోదాలో బీఆర్ఎస్ మహారాష్ట్రశాఖ పార్టీ ఇన్చార్జ్గా ఆయన వ్యవహరిస్తారు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్లో చేరికలు, పార్టీ కార్యకలాపాలు వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో తాత్కాలిక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. తనను మహారాష్ట్రకు ఇన్చార్జ్గా నియమించిన నేపథ్యంలో శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కల్వకుంట్ల వంశీధర్‌రావు ధన్యవాదాలు తెలిపారు. స్టీరింగ్ కమిటీలో సభ్యులు వీరే... స్టీరింగ్ కమిటీలో మాజీ ఎమ్మెల్యేలు శంకరన్న దోండ్గె, భానుదాస్ ముర్కుటే, ఘనశ్యామ్ శేలర్, అన్నాసాహెబ్ మానే, దీపక్ ఆత్రమ్, హరిభావ్ రాథోడ్ (మాజీ ఎంపీ), మానిక్ కదమ్ (కిసాన్ సెల్ అధ్యక్షుడు)తో పాటు ధ్యా నేష్ వకూడ్కర్, సచిన్ సాథే, సురేఖా పునేకర్, కదిర్ మౌ లానా, యశ్పాల్, ఫిరోజ్ పటేల్‌లకు చోటు దక్కింది. ఆరు డివిజన్లకు కోఆర్డినేటర్లు, సహ కోఆర్డినేటర్లు నాగ్‌పూర్ డివిజన్ బీఆర్ఎస్ కోఆర్డినేటర్‌గా ఉన్న ధ్యానేష్ వకూడ్కర్కు స్టీరింగ్ కమిటీలో చోటు కల్పించి, ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే చరణ్ వాంగ్మోరెకు బాధ్యతలు అప్పగించారు. మహారాష్ట్రలోని 36 జిల్లాలను ఆరు డివిజన్లుగా విభజించి కోఆర్డినేటర్, సహ కోఆర్డినేటర్లను నియమించారు. వీరితో పాటు 36 జిల్లాలకు కూడా జిల్లా కో ఆర్డినేటర్లను నియమించినట్టు పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. డివిజన్ల వారీగా కో ఆర్డినేటర్, సహ కోఆర్డినేటర్‌గా నియమితులైన వారిలో సోమనాథ్ థోరట్, దత్తా పవార్ (ఔరంగాబాద్), నిఖిల్ దేశ్‌ముఖ్, డాక్టర్ సుభాష్రాథోడ్ (అమరావతి), చరణ్ వాంగ్మోరె, బాలాసాహెబ్ సలుంకే గురూజి (నాగపూర్), నానా బచవ్, సందీప్ ఖుటే (నాశిక్), బీజే దేశ్‌ముఖ్, భగీరథ్ భల్కే (పుణే), విజయ్ మొహితే, దిగంబర్ విషే (ముంబై) ఉన్నారు. ఆగస్టు ఒకటిన మహారాష్ట్రకు కేసీఆర్ ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాభావ్ సాఠే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ అధి నేత, సీఎం కేసీఆర్ ఆగస్టు 1న మహారాష్ట్రలో పర్యటిస్తారు. సాంగ్లి జిల్లాలోని వటేగావ్లోఅన్నా భావ్ సాఠే చిత్రపటానికి కేసీఆర్ నివాళులర్పిస్తారు. అనంతరం కొల్లాపూర్‌లోని అంబాబాయి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. కేసీఆర్ సమక్షంలో అన్నాభావ్ సాఠే కోడలు, మనుమడు బీఆర్ఎస్లో చేరుతారు. -
ఇన్చార్జులుగా బయటి నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ జాతీయ నాయకత్వం కీలక ప్రణాళికను సిద్ధం చేసింది. 119 అసెంబ్లీ స్థానాలకు ఇతర రాష్ట్రాల ముఖ్యనేతలను ఇన్చార్జులుగా నియమించనుంది. ఏడాది, ఏడాదిన్నరలోగా అసెంబ్లీ ఎన్నికలు లేని రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులను, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే ఆలోచన లేని వారిని ఇందుకోసం ఎంపిక చేయనుంది. కేంద్ర సహాయ మంత్రులు మొదలుకుని పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు, ఎంపీ లు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఆయా రాష్ట్ర పార్టీల ముఖ్య నేతలు, పదాధికారులను నియమించనున్నారు. గెలిచే అవకాశాలున్న స్థానాల్లో మంత్రులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలను ఇన్‌చార్జ్‌లుగా పెట్టనున్నారు. 119 నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌ల పేర్లను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నట్టు సమాచారం. జాతీయ భేటీకి ముందే.. ఇన్‌చార్జ్‌లు ఈ నెల 28న నగరానికి చేరుకుంటారు. జాతీయ కార్యవర్గ భేటీకి ముందు నాలుగురోజులు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత నెలకు ఒకసారి ఆయా స్థానాల్లో పర్యటించడం ద్వారా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసేదాకా పార్టీ బలోపేతంపై దృష్టి కేంద్రీకరిస్తారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిలేని రాష్ట్ర పార్టీ నాయకులను కూడా నియోజకవర్గాల సమన్వయకర్తలుగా ఇటీవల నియమించారు. అయితే వారిలో కొందరు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి మొగ్గుచూపుతున్నట్టు తెలియడంతో వచ్చే రెండు నెలల్లో పార్టీ బూత్ కమిటీల నియామకం పూర్తయ్యాక వారి స్థానంలో కొత్త కోఆర్డినేటర్లను నియమించనున్నట్లు తెలిసింది. -
నూతనోత్సాహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరాల మేరకు ఏర్పాటైన 26 జిల్లాలకు ప్రభుత్వం ఇన్చార్జ్ మంత్రులను నియమించింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రులు.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యకలాపాల అమలుపై సమీక్షలు, పర్యవేక్షణ చేయనున్నారు. అలాగే 26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, 11 మంది ప్రాంతీయ సమన్వయకర్తలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం తొణికిసలాడుతోంది. పాలన వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించి కొత్తగా ఏర్పాటు చేసిన 26 జిల్లాల్లో ఈ నెల 4 నుంచి పరిపాలనను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అదేవిధంగా 25 మందితో ఈ నెల 11న కొత్తగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు జిల్లాలకు ఇన్చార్జి మంత్రులతోపాటు పార్టీ అధ్యక్షులను, ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించారు. వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షుల కో–ఆర్డినేటర్‌గా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇక పార్టీ అనుబంధ విభాగాల ఇన్చార్జిగా రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డిని నియమించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. ఆదిలోనే చెప్పినట్లుగానే.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించి.. అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేసి.. వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని.. మంత్రివర్గంలోకి కొత్తవారిని తీసుకుంటామని.. ఇది నిరంతర ప్రక్రియ అని సీఎం వైఎస్ జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 11న మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలో.. ఎవరికి పార్టీ బాధ్యతలు ఇవ్వాలో తనకు బాగా తెలుసని చెప్పిన సీఎం వైఎస్ జగన్ ఆ మేరకు నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఆదిలోనే చెప్పినట్లుగానే మంత్రివర్గం నుంచి తప్పించినవారికి జిల్లాల పార్టీ అధ్యక్షులుగా, ప్రాంతీయ సమన్వయకర్తలుగా బాధ్యతలు ఇచ్చారు. జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇన్చార్జి మంత్రులు, ప్రాంతీయ సమన్వయకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీని సంస్థాగతంగా మరింతగా బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజు జూలై 8న వైఎస్సార్సీపీ ప్లీనరీ నిర్వహిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఆలోగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలను జిల్లా అధ్యక్షులు సమన్వయం చేసుకుంటూ వైఎస్సార్సీపీ గ్రామ, మండల కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పార్టీ నిర్మాణంలో, పార్టీని బలోపేతం చేయడంలో ప్రాంతీయ సమన్వయకర్తలు క్రియాశీలక పాత్ర పోషించనున్నారు. గడపగడపకూ వెళ్లి ప్రజల ఆశీర్వాదం.. వచ్చే నెల నుంచి ప్రతి నియోజకవర్గంలో నెలకు పది సచివాలయాలను ప్రతి ఎమ్మెల్యే సందర్శించాలని సీఎం వైఎస్ జగన్ నిర్దేశించారు. వాటి పరిధిలోని గ్రామాల్లో 20 రోజులు పర్యటించి.. ప్రతి ఇంటికి వెళ్లాలని సూచించారు. గత మూడేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా ఆ ఇంటిలోని సభ్యులకు అందిన ప్రయోజనాన్ని వివరించాలన్నారు. అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను ఎండగట్టడంతోపాటు తమను ఆశీర్వదించమని ప్రజలను కోరాలని ఇటీవల వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. గడపగడపకూ వెళ్లి ప్రజల ఆశీర్వాదం తీసుకుంటున్న సమయంలోనే బూత్ కమిటీలను పునర్ నిర్మించాలని.. వాటిలో కనీసం 50 శాతం మంది మహిళలు ఉండేలా చూడాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో సగటున 80 సచివాలయాల వరకూ ఉంటాయి. గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమం పూర్తయ్యేసరికి కనీసం ఎనిమిది నెలల సమయం పడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఆశీర్వాదాన్ని పొందడంతోపాటు బూత్ స్థాయి నుంచి పార్టీ మరింతగా బలోపేతమవుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ విస్తృత కార్యక్రమాలు చేపట్టనుండటంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. -
ఐదు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా..
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగబోయే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కమలదళం సన్నద్ధమవుతోంది. అధికారం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఎన్నికల ఇన్చార్జీలను, సహ ఇన్‌చార్జీ్జలను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు 403 అసెంబ్లీ స్థానాలున్న పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. ఆయన టీమ్‌లో సహ ఇన్చార్జులుగా కేంద్ర మంత్రులు అనురాగ్ సింగ్ ఠాకూర్, అర్జున్‌రామ్ మేఘ్వాల్, శోభా కరంద్లాజే, అన్నపూర్ణ దేవీతోపాటు ఎంపీలు సరోజ్ పాండే, కెప్టెన్ అభిమన్యు, వివేక్ ఠాకూర్ ఉన్నారు. రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలకు సంస్థాగత ఇన్‌చార్జీ్జలను సైతం నియమించారు. ఉత్తరాఖండ్‌కు ప్రహ్లాద్ జోషీ పంజాబ్‌పై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ఎన్నికల ఇన్‌చార్జీగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను, కేంద్ర మంత్రులు హర్దీప్సింగ్ పూరి, మీనాక్షి లేఖి, ఎంపీ వినోద్ చావడాను సహ ఇన్‌చార్జీలుగా నియమించింది. ఇక ఉత్తరాఖండ్‌లో రాజకీయంగా కీలకంగా వ్యవహరించే బ్రాహ్మణులను మెప్పించేందుకు ఇన్చార్జీ బాధ్యతలను అదే సామాజిక వర్గానికి చెందిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి అప్పగించింది. సహ ఇన్‌చార్జీలుగా పశ్చిమ బెంగాల్ ఎంపీ లాకెట్ ఛటర్జీ, పార్టీ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్‌ను ఖరారు చేసింది. మణిపూర్‌కు భూపేందర్ యాదవ్ ఇటీవల కేంద్ర మంత్రి అయిన భూపేందర్ యాదవ్‌కు మణిపూర్ ఎన్నికల ఇన్‌చార్జీగా బాధ్యతలను అప్పగించారు. కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్, అస్సాం మంత్రి అశోక్ సింఘాల్‌ను సహ ఇన్చార్జులుగా నియమించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను గోవా ఎన్నికల ఇన్‌చారీ్జగా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి దర్శనా జర్దోశ్‌ను సహ ఇన్‌చార్జీలుగా బీజేపీ అధిష్టానం నియమించింది. -
ఐసిస్ భారత చీఫ్ షఫీ హతం!
సిరియాలో అమెరికా డ్రోన్ దాడిలో మృతి న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థ భారత విభాగం చీఫ్ మహమ్మద్ షఫీ అర్మార్ అలియాస్ యూసుఫ్ ఇటీవల సిరియాలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో హతమైనట్లు తెలుస్తోంది. ‘అతడు మృతి చెందినట్లు తెలిసింది.ఐసిస్ ప్రాబల్యమున్న సిరియా నుంచి సమాచారం రావడానికి కొంత సమయం పట్టొచ్చు’ అని భారత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఐసిస్ అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీకి ముఖ్య సన్నిహితుడైన షఫీ(26) భారత్‌లో ఐసిస్ విభాగాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు సహకరిస్తున్నాడు. అతడు 30 మందిని ఈ ఉగ్రవాద సంస్థలో చేర్పించినట్లు సమాచారం. భారత్‌లో ప్రతి రాష్ట్రంలో ఐసిస్ శాఖ ఏర్పాటుకు అతడు ప్రణాళిక వేశాడని భారత్‌లో అరెస్టయిన ఐసిస్ ఉగ్రవాదులు విచారణలో వెల్లడించినట్లు అధికారులు చెప్పారు. షఫీ ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల్లో దాదాపు 700 మంది భారతీయ యువకులతో సంబంధాలు నెరుపుతున్నట్లు నిఘా అధికారులు చెప్పారు. కర్ణాటకలోని భక్తల్కు చెందిన షఫీ అన్న సుల్తాన్ అర్మార్ కూడా గత ఏడాది వరకు ఐసిస్ భారత విభాగానికి నాయకత్వం వహించాడు. 2015 మార్చిలో అమెరికా ద్రోన్ దాడిలో హత మయ్యాడు.