సాక్షి, హైదరాబాద్: భారత్‌రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) మహారాష్ట్ర యూనిట్‌కు 15 మందితో కూడిన తాత్కాలిక స్టీరింగ్ కమిటీని పార్టీఅధినేత, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఏర్పాటు చేశారు. కేసీఆర్ చైర్మన్‌గా ఏర్పాటైన ఈ స్టీరింగ్ కమిటీ తక్షణమే మనుగడలోకి వస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కేసీఆర్ సోదరుడి కుమారుడు కల్వకుంట్ల వంశీధర్‌రావుకు ఈ స్టీరింగ్ కమిటీలో చోటు దక్కగా, కమిటీ సభ్యుడి హోదాలో బీఆర్‌ఎస్ మహారాష్ట్రశాఖ పార్టీ ఇన్‌చార్జ్‌గా ఆయన వ్యవహరిస్తారు. ఈ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు, పార్టీ కార్యకలాపాలు వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో తాత్కాలిక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. తనను మహారాష్ట్రకు ఇన్‌చార్జ్‌గా నియమించిన నేపథ్యంలో శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కల్వకుంట్ల వంశీధర్‌రావు ధన్యవాదాలు తెలిపారు.
స్టీరింగ్ కమిటీలో సభ్యులు వీరే...
స్టీరింగ్ కమిటీలో మాజీ ఎమ్మెల్యేలు శంకరన్న దోండ్గె, భానుదాస్ ముర్కుటే, ఘనశ్యామ్ శేలర్, అన్నాసాహెబ్ మానే, దీపక్ ఆత్రమ్, హరిభావ్ రాథోడ్ (మాజీ ఎంపీ), మానిక్ కదమ్ (కిసాన్ సెల్ అధ్యక్షుడు)తో పాటు ధ్యా నేష్ వకూడ్కర్, సచిన్ సాథే, సురేఖా పునేకర్, కదిర్ మౌ లానా, యశ్‌పాల్, ఫిరోజ్ పటేల్‌లకు చోటు దక్కింది.
ఆరు డివిజన్లకు కోఆర్డినేటర్లు, సహ కోఆర్డినేటర్లు
నాగ్‌పూర్ డివిజన్ బీఆర్‌ఎస్ కోఆర్డినేటర్‌గా ఉన్న ధ్యానేష్ వకూడ్కర్‌కు స్టీరింగ్ కమిటీలో చోటు కల్పించి, ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే చరణ్ వాంగ్మోరెకు బాధ్యతలు అప్పగించారు. మహారాష్ట్రలోని 36 జిల్లాలను ఆరు డివిజన్లుగా విభజించి కోఆర్డినేటర్, సహ కోఆర్డినేటర్లను నియమించారు. వీరితో పాటు 36 జిల్లాలకు కూడా జిల్లా కో ఆర్డినేటర్లను నియమించినట్టు పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
డివిజన్ల వారీగా కో ఆర్డినేటర్, సహ కోఆర్డినేటర్‌గా నియమితులైన వారిలో సోమనాథ్ థోరట్, దత్తా పవార్ (ఔరంగాబాద్), నిఖిల్ దేశ్‌ముఖ్, డాక్టర్ సుభాష్‌రాథోడ్ (అమరావతి), చరణ్ వాంగ్మోరె, బాలాసాహెబ్ సలుంకే గురూజి (నాగపూర్), నానా బచవ్, సందీప్ ఖుటే (నాశిక్), బీజే దేశ్‌ముఖ్, భగీరథ్ భల్కే (పుణే), విజయ్ మొహితే, దిగంబర్ విషే (ముంబై) ఉన్నారు.
ఆగస్టు ఒకటిన మహారాష్ట్రకు కేసీఆర్
ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాభావ్ సాఠే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు బీఆర్‌ఎస్ అధి నేత, సీఎం కేసీఆర్ ఆగస్టు 1న మహారాష్ట్రలో పర్యటిస్తారు. సాంగ్లి జిల్లాలోని వటేగావ్‌లోఅన్నా భావ్ సాఠే చిత్రపటానికి కేసీఆర్ నివాళులర్పిస్తారు. అనంతరం కొల్లాపూర్‌లోని అంబాబాయి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. కేసీఆర్ సమక్షంలో అన్నాభావ్ సాఠే కోడలు, మనుమడు బీఆర్‌ఎస్‌లో చేరుతారు.
Comments
Please login to add a commentAdd a comment