Vamsi
-
నువ్వు రిటైరైనా సప్త సముద్రాలు దాటినా ఈడ్చుకొస్తాం
-
ఎవ్వరినీ వదిలిపెట్టను.. బట్టలూడతేసి నిలబెడతా!
-
కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి.. ఇదీ ఓ గెలుపేనా!
-
సత్య వర్ధన్ ఫ్యామిలీని బెదిరించి..తప్పుడు కేసు పెట్టించారు!
-
గన్నవరం వెళ్తా.. ఎవడేం పీకుతాడో చూస్తా..!
-
వంశీతో వైఎస్ జగన్ ములాఖత్..మీడియాపై ఆంక్షలు
-
కక్షతోనే వంశీ అరెస్ట్: Devineni Avinash
-
‘గం..గం..గణేశా’ ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తుంది : వంశీ కారుమంచి
‘‘క్రైమ్, కామెడీ, యాక్షన్‌గా ‘గం..గం..గణేశా’ సినిమా రూపొందింది. మరీ ముఖ్యంగా ఇందులోని వినోదం ఆకట్టుకుంటుంది. మన స్నేహితుల్లో ఎవరో ఒకరు మనల్ని సమస్యల్లో ఇరికిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో వచ్చే వినోదం ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తుంది’’ అని నిర్మాత వంశీ కారుమంచి అన్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గం..గం.. గణేశా’. ఉదయ్ శెట్టి దర్శకుడు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్పై వంశీ కారుమంచి, కేదార్ సెలగంశెట్టి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా వంశీ కారుమంచి మాట్లాడుతూ–‘‘నాది గుంటూరు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. అమెరికాలో ఉద్యోగం, వ్యాపారం చేశా. కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను. ఇండియాలోనే స్థిరపడాలనుకున్నప్పుడు సినిమాలు నిర్మించాలనే ఆలోచన ఉండేది. ఉదయ్ కథ చెప్పగానే ఆనంద్కి సరి΄ోతుందనిపించింది. కొంత ఆకతాయిగా, జులాయిగా ఉండే పాత్ర తనది. గణేష్ విగ్రహం, డబ్బుతో ముడిపడిన యాక్షన్ కామెడీ సినిమా ‘గం గం గణేశా’. ఇద్దరి హీరోయిన్ల పాత్రకి మంచి ప్రాధాన్యం ఉంది. సినిమా ఇండస్ట్రీ చూసేందుకు చిన్నదిగా కనిపించినా లక్షల మంది దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం రెండు కథలు ఫైనలైజ్ చేస్తున్నాం’’ అన్నారు. -
నువ్వు ఇంస్ట్రుమెంట్ వాయిస్తున్నావా?.. గేదెను గోకుతున్నావా?.. ఆసక్తిగా టీజర్!
ప్రియతమ్, అంజన, విజయ్, అనంత్, వేద్ ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం నీ దారే నీ కథ. ఈ చిత్రానికి వంశీ జొన్నలగడ్డ నిర్మాతగా ఉంటూ దర్శకత్వం వహిస్తున్నారు. జేవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు తేజేష్ వీర, శైలజ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత తేజేష్ మాట్లాడుతూ.. 'ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అందరూ కొత్త టీం తోనే ఈ సినిమాని నిర్మిస్తున్నాం. ఇది మా మొదటి సినిమా అయినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మీ ముందుకు తీసుకొస్తున్నాం. తర్వాత వచ్చే సినిమాలు కూడా అంతే కొత్తగా ఉంటాయి. మాకు బ్యాక్ బోన్ సపోర్ట్ ఏమీ లేదు. మీడియానే మాకు పెద్ద సపోర్ట్. మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నా మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మమ్మల్ని సపోర్ట్ చేసి ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రముఖులకు ప్రత్యేక ధన్యవాదాలు' తెలిపారు. నిర్మాత శైలజ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. 'సినిమా మీద ఉన్న ప్యాషన్‌తోనే నిర్మించాం. బుడాపెస్ట్‌లో చేసిన మ్యూజిక్ ఆర్కెస్ట్రా థీమ్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. మీడియా, ప్రేక్షకులు మాలాంటి వాళ్లను ఎంకరేజ్ చేసి సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు. దర్శకుడు వంశీ జొన్నలగడ్డ మాట్లాడుతూ..'నేను న్యూయార్క్‌లో డైరెక్షన్ గురించి చదువుకుని వచ్చాను. యూఎస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ని తెలుగు వాళ్లకు నచ్చే విధంగా మార్పులు చేసి చిత్రీకరించాం. ఈ సినిమాతో కథనే ఎంజాయ్ చేయకుండా కథతో పాటు మ్యూజిక్ ఒక మంచి ఫీల్ అందిస్తుంది' అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి ఆల్బర్టో గురియోలి సంగీతమందిస్తున్నారు. -
జనసేనలో జగడం
సాక్షి, విశాఖపట్నం: జనసేనలో అభ్యర్థి ప్రకటన ఇంకా వెలువడక ముందే గ్రూప్ తగాదాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా విశాఖ జనసేనలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వంశీ యాదవ్‌ను విశాఖ వెస్ట్ అభ్యర్థిగా ప్రకటిస్తారనే సమాచారంతో తొలి నుంచి పార్టీలో ఉన్న వర్గం ఆందోళనకు దిగింది. ఈ క్రమంలో.. జనసేన కార్పొరేటర్ సాధిక్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వంశీకి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని.. ఎట్టి పరిస్థితుల్లో సహకరించబోమని.. తామేం మేకలం కాదంటూ సింబాలిక్‌గా మేకలతో నిరసన తెలిపారు. అయితే ఆ సమయంలో వంశీ వర్గీయులు మహిళలపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వంశీ యాదవ్ విషయాన్ని ఇప్పటికే పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లామని.. టికెట్ ఇస్తే మాత్రం తీవ్ర నిర్ణయం తీసుకుంటామని పవన్‌ను పలువురు మహిళలు హెచ్చరిస్తున్నారు. -
ప్రముఖ ఎన్నారై వంశీరెడ్డి కంచరకుంట్లకు అరుదైన గౌరవం!
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్- టీటీఏ సంస్థ అధ్యక్షులు, వాట్స్(WATS), వాటా(WATA), ఇండియన్ కమ్యూనిటీ సెంటర్(Indian Community Center) వ్యవస్థాపకులు, ప్రముఖ ఎన్నారై వంశీరెడ్డి కంచరకుంట్లకు అరుదైన గౌరవం దక్కింది. కమ్యూనిటీ సర్వీస్, వాలంటీర్ లీడర్షిప్ విభాగాల్లో అత్యుత్తమ సేవలు కనబరిచినందుకు గాను అమెరికాలో ప్రతిష్టాత్మకమైనా యూఎస్ ప్రెసిడెన్షియల్ అవార్డ్ వరించింది. ఆయన సేవా నిరతిని గుర్తించిన వాట్స్ సంస్థ.. ప్రెసిడెన్షియల్ వాలంటీర్ సర్వీస్ అవార్డ్ (PVSA), లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను స్వర్ణ పథకంతో సత్కరించింది. సంక్రాంతి, రిపబ్లిక్ డేని పురస్కరించుకుని వాట్స్(WATS) సంస్థ నిర్వహించిన ఈవెంట్లో.. సీటెల్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకాష్ గుప్తా చేతుల మీదుగా ఈ అవార్డ్స్‌ను అందజేశారు. (చదవండి: తానా ప్రపంచ సాహిత్యవేదిక' గా 64 వ సాహిత్య సమావేశం) -
హత్యా? ఆత్మహత్యా?
స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు ప్రధానపాత్రల్లో నటించిన ఇంటరాగేటివ్ ఫిల్మ్ ‘ది ట్రయల్’. రామ్ గన్ని దర్శకత్వంలో స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో శ్రీ విష్ణు విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ది ట్రయల్’ ట్రైలర్ చాలా ఆసక్తిగా ఉంది. రామ్ ఈ సినిమా కథను బాగా డీల్ చేశారనిపిస్తోంది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘కథ రీత్యా సబ్ఇన్స్పెక్టర్ రూప, ఆమె భర్త అజయ్ ఓ అపార్ట్మెంట్ టెర్రస్‌పై తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంటారు. అజయ్ కాలుజారి ఆ బిల్డింగ్‌పై నుంచి పడి చనిపోతాడు. తన భర్తను రూపే చంపిదనే అనుమానం తెరపైకి వస్తుంది. అయితే తన భర్తది ఆత్మహత్య అని రూప చెబుతుంది. అసలు.. అజయ్‌ది హత్యా? ఆత్మహత్యా? అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
సరికొత్త ట్రయల్
స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ది ట్రయల్’. స్మృతీ సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ‘‘ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని కంప్లీట్ ఇంటరాగేటివ్ కథతో, సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌తో ఈ సినిమా కథనం ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: శరవణ వాసుదేవన్, సహనిర్మాత: సుదర్శన్ రెడ్డి. -
మరికాస్త ముందుకు ఎక్స్ట్రా
అనుకున్న సమయానికంటే ముందుగానే థియేటర్స్‌కు వస్తున్నారు హీరో నితిన్ . వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘ఎక్స్ట్రా: ఆర్డినరీ మేన్ ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్, రుచిర ఎంటర్టైన్ మెంట్స్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తొలుత డిసెంబరు 23న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఆ సమయానికి ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్:సీజ్ఫైర్’ చిత్రం రిలీజ్‌కు సిద్ధం కావడంతో ‘ఎక్స్ట్రా’ని కాస్త ముందుగానే డిసెంబరు 8న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారిస్ జైరాజ్ స్వరకర్త. -
దేవుడి పాట నాదే
‘గుంటూరు రైల్వే స్టేషన్.. దేవుడి పాట పాతికవేలు’ అంటూ వేలం పాటతో మొదలైంది ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమా ట్రైలర్. రవితేజ హీరోగా వంశీ దర్శకత్వం వహించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబైలో ‘టైగర్ నాగేశ్వర రావు’ ట్రైలర్‌ని విడుదల చేశారు. పోలీసులకు విజ్ఞప్తి.. కాకినాడ నుంచి మదరాసు వెళ్లు సర్కార్ ఎక్స్‌ప్రెస్ దారిలో దోపిడీకి గురి కాబోతోంది’, ‘కొట్టే ముందు.. కొట్టేసే ముందు వార్నింగ్ ఇవ్వడం నాకు అలవాటు’, ‘రేపటి నుంచి స్టూవర్టుపురంలో దేవుడి పాట నాదే.. చెప్పు.. వాడికి’ అంటూ రవితేజ చెప్పే డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న రవితేజ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంతో హిందీ పరిశ్రమలోకి రావడం హ్యాపీగా ఉంది. హిందీలో నేనే డబ్బింగ్ చెప్పాను. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ వేడుకలో అభిషేక్ అగర్వాల్, వంశీ, నటీనటులు రేణూ దేశాయ్, గాయత్రీ భరద్వాజ్, అనుపమ్ ఖేర్, జిషు సేన్ మాట్లాడారు. -
ఐఐటీ కాదని నటిగా..చివరికి బి-టౌన్‌ని కూడా వదిలేసి..ఇన్ని ట్విస్ట్‌లా!
Mayuri Kango ఐఐటీ చదివి మంచి జాబ్ కొట్టడం ఒక బెంచ్‌మార్క్. లేదా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి, గ్లామర్ ప్రపంచంలో నటిగా వెలిగిపోవాలని కలలు కనడం మరో రకం. ఈ రెండింటి మధ్య మయూరి కాంగో స్టయిలే వేరు. టెక్ దిగ్గజం నేతృత్వంలోని సుందర్ పిచాయ్ కంపెనీ ఉద్యోగిగా ఇప్పుడు కోట్లు సంపాదిస్తోంది. మయూరి కాంగో షాకింగ్ జర్నీ ఏంటో ఒకసారి చూద్దాం. ఐఐటీ కాన్పూర్‌కి ఎంపికైన మయూరి, బాలీవుడ్‌లోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చింది. యాక్టర్ అవ్వాలన్న చిన్ననాటి కల తీరినందుకు సంతోషంలో మునిగి తేలింది. కానీ అంతలోనే సర్ప్రైజింగ్గా బాలీవుడ్‌ని వదిలి కార్పొరేట్ ఉద్యోగాన్ని ఎంచుకుంది. నటిగా గ్లామర్ ప్రపంచానికి దూరమై కార్పొరేట్ వరల్డ్‌లో సెటిల్ అయింది. మయూరి ఇంటర్ చదువుతుండగా సయీద్ అక్తర్ మీర్జా దర్శకత్వంలో బాబ్రీ మసీదు కూల్చివేత ఆధారంగా రూపొందించిన 1995 బాలీవుడ్ చిత్రం నసీమ్లో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది.మొదట వద్దనుకున్నా తరువాత యాక్టర్‌గా ఒప్పుకుంది. ఆ తరువాత దర్శక-నిర్మాత మహేష్ భట్ కంటపడిన మయూరి 1996 చిత్రం పాపా కెహతే హై మూవీలోని హిట్ పాట "ఘర్ సే నికల్తే హై"తో పాపులర్ అయింది. తన అందంతో అభినయంతో ఆకట్టుకుంది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ , అర్షద్ వార్సీలతో కలిసి పనిచేసింది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే టాలీవుడ్లో ప్రిన్స్ మహేష్ సరసన 2000లో వంశీ మూవీలో కూడా మెరిసింది. వీటితోపాటు బాదల్ (2000), హోగీ ప్యార్ కి జీత్ (1999), బేతాబి (1997) వంటి చిత్రాలలో కనిపించింది. డాలర్ బహు (2001), కరిష్మా: ది మిరాకిల్స్ ఆఫ్ డెస్టినీ (2003) సీరియల్లలో కరిష్మా కపూర్ కుమార్తెగా నటించి మెప్పించింది. ఇంకా నర్గీస్, తోడ ఘం తోడి ఖుషీ, డాలర్ బాబు అండ్ కిట్టి పార్టీ వంటి టెలివిజన్ షోలను కూడా చేసింది. అయితే ఇవి కూడా పెద్దగా విజయం సాధించలేదు. 16 సినిమాల్లో నటించినా, చాలా వరకు విడుదల కాలేదు. విడుదలైనా థియేటర్లలో కాసులు కురిపించక పోవడంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. 2003లో ఎన్ఆర్ఐ ఆదిత్య ధిల్లాన్‌ను పెళ్లాడి అమెరికా వెళ్లిపోయింది. ఇక్కడే ఆమె జీవితం మరోటర్న్ తీసుకుంది. బరూచ్ కాలేజీలోని జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్‌లో MBAలో చేరింది. తరువాత, 2004-2012 మధ్య, అమెరికాలో పని చేసింది. 2013లో తిరిగి ఇండియాకు వచ్చి పెర్ఫార్మిక్స్ అనే సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేయడం ప్రారంభించింది. ఇక ఆ తరువాత 2019లో గూగుల్ ఇండియాలో చేరి, ఇండస్ట్రీ హెడ్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం గూగుల్ ఇండియాలో ఇండస్ట్రీ హెడ్ ఆఫ్ ఏజెన్సీ పార్టనర్‌షిప్‌గా పని చేస్తుండటం విశేషం. -
మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జ్గా కల్వకుంట్ల వంశీధర్‌రావు
సాక్షి, హైదరాబాద్: భారత్రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) మహారాష్ట్ర యూనిట్‌కు 15 మందితో కూడిన తాత్కాలిక స్టీరింగ్ కమిటీని పార్టీఅధినేత, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఏర్పాటు చేశారు. కేసీఆర్ చైర్మన్‌గా ఏర్పాటైన ఈ స్టీరింగ్ కమిటీ తక్షణమే మనుగడలోకి వస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ సోదరుడి కుమారుడు కల్వకుంట్ల వంశీధర్‌రావుకు ఈ స్టీరింగ్ కమిటీలో చోటు దక్కగా, కమిటీ సభ్యుడి హోదాలో బీఆర్ఎస్ మహారాష్ట్రశాఖ పార్టీ ఇన్చార్జ్గా ఆయన వ్యవహరిస్తారు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్లో చేరికలు, పార్టీ కార్యకలాపాలు వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో తాత్కాలిక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. తనను మహారాష్ట్రకు ఇన్చార్జ్గా నియమించిన నేపథ్యంలో శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కల్వకుంట్ల వంశీధర్‌రావు ధన్యవాదాలు తెలిపారు. స్టీరింగ్ కమిటీలో సభ్యులు వీరే... స్టీరింగ్ కమిటీలో మాజీ ఎమ్మెల్యేలు శంకరన్న దోండ్గె, భానుదాస్ ముర్కుటే, ఘనశ్యామ్ శేలర్, అన్నాసాహెబ్ మానే, దీపక్ ఆత్రమ్, హరిభావ్ రాథోడ్ (మాజీ ఎంపీ), మానిక్ కదమ్ (కిసాన్ సెల్ అధ్యక్షుడు)తో పాటు ధ్యా నేష్ వకూడ్కర్, సచిన్ సాథే, సురేఖా పునేకర్, కదిర్ మౌ లానా, యశ్పాల్, ఫిరోజ్ పటేల్‌లకు చోటు దక్కింది. ఆరు డివిజన్లకు కోఆర్డినేటర్లు, సహ కోఆర్డినేటర్లు నాగ్‌పూర్ డివిజన్ బీఆర్ఎస్ కోఆర్డినేటర్‌గా ఉన్న ధ్యానేష్ వకూడ్కర్కు స్టీరింగ్ కమిటీలో చోటు కల్పించి, ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే చరణ్ వాంగ్మోరెకు బాధ్యతలు అప్పగించారు. మహారాష్ట్రలోని 36 జిల్లాలను ఆరు డివిజన్లుగా విభజించి కోఆర్డినేటర్, సహ కోఆర్డినేటర్లను నియమించారు. వీరితో పాటు 36 జిల్లాలకు కూడా జిల్లా కో ఆర్డినేటర్లను నియమించినట్టు పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. డివిజన్ల వారీగా కో ఆర్డినేటర్, సహ కోఆర్డినేటర్‌గా నియమితులైన వారిలో సోమనాథ్ థోరట్, దత్తా పవార్ (ఔరంగాబాద్), నిఖిల్ దేశ్‌ముఖ్, డాక్టర్ సుభాష్రాథోడ్ (అమరావతి), చరణ్ వాంగ్మోరె, బాలాసాహెబ్ సలుంకే గురూజి (నాగపూర్), నానా బచవ్, సందీప్ ఖుటే (నాశిక్), బీజే దేశ్‌ముఖ్, భగీరథ్ భల్కే (పుణే), విజయ్ మొహితే, దిగంబర్ విషే (ముంబై) ఉన్నారు. ఆగస్టు ఒకటిన మహారాష్ట్రకు కేసీఆర్ ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాభావ్ సాఠే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ అధి నేత, సీఎం కేసీఆర్ ఆగస్టు 1న మహారాష్ట్రలో పర్యటిస్తారు. సాంగ్లి జిల్లాలోని వటేగావ్లోఅన్నా భావ్ సాఠే చిత్రపటానికి కేసీఆర్ నివాళులర్పిస్తారు. అనంతరం కొల్లాపూర్‌లోని అంబాబాయి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. కేసీఆర్ సమక్షంలో అన్నాభావ్ సాఠే కోడలు, మనుమడు బీఆర్ఎస్లో చేరుతారు. -
అనుమానించి.. హతమార్చారు
సారంగాపూర్ (జగిత్యాల): గతంలో ప్రేమించిన ఓ యువతికి పెళ్లయినప్పటికీ మళ్లీ ప్రేమాయణం సాగిస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని దుండగులు ఆదివారం నరికి చంపిన ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం బీర్పూర్కు చెందిన జువ్వకింది వంశీ (23) తుంగూర్‌లోని ఓ మోటార్ డ్రైవింగ్ స్కూల్లో పనిచేస్తున్నాడు. పని నిమిత్తం బీర్పూర్ మండలం కొల్వాయి వెళ్లి మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో బీర్పూర్ తిరిగి వస్తున్నాడు. అప్పటికే తుంగూర్‌లో మాటు వేసిన కొందరు దుండగులు.. వంశీని ఆపి వెంటతెచ్చుకున్న గొడ్డలి, ఇతర ఆయుధాలతో తలపై నరికారు. తల, నోటికి బలమైన గాయాలు కావడంతో వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి జేబులోని మొబైల్‌ఫోన్‌ను తీసు కున్న దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రేమ వ్యవహారమే కారణమా? బీర్పూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి, వంశీకి మధ్య చాలాకాలం ప్రేమ వ్యవహారం నడిచింది. మరోసారి యువతి జోలికి రావొద్దని ఆమె కుటుంబ సభ్యులు వంశీని అప్పట్లో మందలించారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఆ యువతికి మరో యువకుడితో వివాహం జరిపించారు. అయినా వంశీ ఆమెకు తరచూ ఫోన్ చేస్తూ మాట్లాడటం, కలవడం చేస్తున్నాడని యువతి కుటుంబ సభ్యులు అనుమానించసాగారు. ఇలా అయితే ఆమె కాపురం కూలిపోయే ప్రమాదం ఉందని భావించి వంశీని హతమార్చేందుకు కుట్రపన్నారు. మృతుడి కుటుంబం ధర్నా.. వంశీ హత్య సమాచారం తెలిసిన వెంటనే మృతుడి బంధువులు తుంగూర్ గ్రామానికి చేరుకొని రోడ్డుపై 2 గంటలపాటు బైఠాయించారు. హంతకులను తమకు అప్పగించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని మృతుడి తల్లి భాగ్య, బాబాయ్ అక్కడే ఉన్న లారీ కిందకు వెళ్లారు. అయితే దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఓ గ్రామానికి చెందిన రమేశ్, విష్ణుపై తమకు అనుమానం ఉందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. మృతుడి తల్లి దినసరి కూలీకాగా తండ్రి శ్రీహరి ఉపాధి కోసం ముంబై వెళ్లాడు. వంశీకి ఓ సోదరుడు ఉన్నాడు. -
వైజాగ్‌లో టైగర్
హీరో రవితేజ నటిస్తున్న తొలి పా న్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నూపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ చివరి షెడ్యూల్ వైజాగ్‌లో ప్రారంభమైంది. వంశీ, అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ–‘‘స్టూవర్టు పురంలోని టైగర్ నాగేశ్వరరావు అనే గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోన్న చిత్రమిది. 1970ల నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ పా త్ర కోసం రవితేజ కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. సరికొత్త బాడీ లాంగ్వేజ్, యాసతో అలరిస్తారు. వైజాగ్‌లో ప్రారంభమైన చివరి షెడ్యూల్లో కీలక తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం. ఈ ఏడాది సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: తేజ్ నారాయణ్ అగర్వాల్, సహ నిర్మాత: మయాంక్ సింఘానియా, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: ఆర్. మధి. -
శభాష్ కిరణ్..
టేకుమట్ల(రేగొండ): గుండెపోటుతో కొట్టుమిట్టాడుతున్న ఓ యువకుడికి పోలీస్ కానిస్టేబుల్ సీపీఆర్ ద్వారా ప్రాణం పోశాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఓ చికెన్ సెంటర్లో పనిచేసే వంశీ (35) నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్క సారిగా గుండెపోటుకు గురై రోడ్డుపై పడిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న బ్లూకోట్ కానిస్టేబుల్ కిరణ్ వెంటనే అతనికి సుమారు 15 నిమిషాలపాటు పీసీఆర్ నిర్వహించగా తిరిగి శ్వాస తీసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి పోలీస్ వాహనంలో పరకాల ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఎస్సై తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతనికి సీపీఆర్‌తో తిరిగి ప్రాణం పోసిన పోలీసులను స్థానిక ప్రజలు అభినందించారు. -
'టైగర్ నాగేశ్వరరావు' వేట మొదలైంది.. స్టన్నింగ్‌గా ప్రీ లుక్
Ravi Teja Tiger Nageswara Rao Pre Look Released By Chiranjeevi: ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా డౌన్ టు ఎర్త్ వ్యక్తిగా పేరు సంపాందించుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమా నుంచి ప్రీ లుక్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. 'శ్రీ శుభకృత్ నామ' తెలుగు సంవత్సరం కానుకగా ఉగాది పర్వదినాన ఈ ప్రీలుక్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో రవితేజ ఒక ట్రైన్ ముందు స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. ఈ ప్రీ లుక్ టీజర్లో బీజీఎం అద్భుతంగా ఉంది. వేట మొదలైంది అంటూ ఈ ప్రీ లుక్కు క్యాప్షన్ ఇచ్చారు. చదవండి: టైగర్ నాగేశ్వరరావు మూవీలో గాయత్రి భరద్వాజ్ రవితేజ కెరీర్లోనే మొదటి పాన్ ఇండియా మూవీగా వస్తోంది 'టైగర్ నాగేశ్వరరావు'. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ మూవీ లాంచ్ ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరై ముహుర్తం షాట్‌కు క్లాప్ కొట్టారు. అలాగే సినిమా యూనిట్‌గా విషెస్ తెలియజేశారు. ఈ చిత్రం క్రైమ్ డ్రామాగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కనుంది. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. 'టైగర్ నాగేశ్వరరావు'కు జోడిగా ప్రముఖ మోడల్ గాయత్రి భరద్వాజ్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ అలరించనున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జివి. ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. చదవండి: గజదొంగ బయోపిక్‌లో రవితేజ..ఎవరీ టైగర్ నాగేశ్వరరావు? -
‘ధర్నాల పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలు’
-
పవర్ఫుల్ ప్రత్యర్థి
రవి వర్మ, వంశీ, రోహిత్, అక్షిత ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘ప్రత్యర్థి’. శంకర్ ముడావత్ దర్శకత్వంలో సంజయ్ షా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్థన్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ ఇచ్చారు. నాగం జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘వాణిజ్య అంశాలతో పాటు సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది’’ అన్నారు శంకర్ ముడావత్. ‘‘హిందీ సినిమాలు నిర్మించాను. తెలుగులో ఇది నా తొలి సినిమా’’ అన్నారు సంజయ్ షా. -
సెప్టెంబర్‌లో ‘నిన్ను తలచి’ రిలీజ్
ఎస్ ఎల్ యెన్ ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఓబిలేష్ మొదిగిరి, నేదురుమల్లి అజిత్ కుమార్ నిర్మాతలుగా, అనిల్ తోట దర్శకునిగా తెరకెక్కిన చిత్రం నిన్ను తలచి. క్యూట్ లవ్ స్టోరీ గా రూపొందిన ఈ సినిమాతో వంశీ యాకసిరి, స్టెఫీ పటేల్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. స్వతంత్ర దినోత్సవం, రక్షాబంధన్ సందర్బంగా ఈ సినిమాకి సంబందించిన లేటెస్ట్ పోస్టర్ విడుదల చేశారు. ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు గా నిర్మాతలు తెలిపారు. నిర్మాత అజిత్ కుమార్ మాట్లాడుతూ.. ‘ ఒక హానెస్ట్ అట్టెంప్ట్ చేసాము. ఈ సినిమాను కేవలం ఒక ప్రేమకథలా కాకుండా అటు ఫ్యామిలీ ఇటు యూత్ ని ఆకట్టుకునేలా రెడీ అయ్యింది. మా సినిమాకు మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుందని నేను బలం గా నమ్మతున్నా, త్వరలోనే మా సినిమా లో ఉన్న వీడియో సాంగ్స్ ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. వంశి, స్టెఫీ పటేల్ జంట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నం అన్నారు. దర్శకుడు అనిల్ తోట మాట్లాడుతూ.. ‘అనుకున్న బడ్జెట్, అనుకున్న టైంలో ఈ సినిమాను పూర్తి చేయగలిగాము. నా కథని నమ్మి సినిమా తీయడానికి ముందుకు వచ్చి, నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇక ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న వంశీ.. అసలు కొత్త వాడిలా అనిపించడు. ఈ సినిమాకి వంశీ నటన కచ్చితంగా ప్లస్ అవుతుంది అని నేను నమ్మతున్నా. అలానే స్టెఫీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సెప్టెంబర్ రిలీజ్ కి రెడీ అవుతున్నాం, త్వరలోనే వీడియో సాంగ్స్ , ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాము అని తెలిపారు. హీరో వంశీ మాట్లాడుతూ.. ‘ఓ ఫీల్ గుడ్ మూవీతో నేను టాలీవుడ్ కి పరిచయం అవ్వడం చాలా ఆనందం గా ఉంది, మా డైరెక్టర్ అనిల్ తోట అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను రెడీ చేశారు. అలానే ఎక్కడ లోటు కాకుండ నిర్మాతలు ఈ సినిమాను రూపొందించారు. సెప్టెంబర్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా, మా నిన్ను తలచి టీంని ఆడియన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. -
నాగేశ్వరరావు పాత్రలో రానా..?
స్టార్ ఇమేజ్ తో సంబంధం లేకుండా విభిన్న పాత్రల్లో అలరిస్తున్న యంగ్ హీరో రానా జాతీయ నటుడిగా ఎదుగుతున్నాడు. ఇప్పటికే తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో వరుసగా విభిన్నచిత్రాలు చేస్తూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం పీరియాడిక్ జానర్ లో తెరకెక్కుతున్న 1945 సినిమాలో నటిస్తున్నాడు రానా. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలీవుడ్ క్లాసిక్ హాథీ మేరి సాథీకి రీమేక్ గా అదే పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. తాజాగా రానా మరో ఆసక్తికరమైన సినిమాకు ఓకే చెప్పాడన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు రాబిన్ హుడ్ గా పేరు తెచ్చుకున్న స్టువర్ట్పురం దొంగ టైగర్ నాగేశ్వరరాదవు కథతో సినిమా తెరకెక్కనుందన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఫేం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. బయోపిక్ గా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌లో టైగర్ నాగేశ్వరరావు పాత్రలో రానా నటించనున్నాడట. ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించనున్నాడు. -
ఫ్యాషన్ డిజైనర్లో స్టార్ మేకర్ వారసుడు
సీనియర్ దర్శకుడు వంశీ, ఒకప్పుడు సంచలన విజయం సాధించిన లేడీస్ టైలర్ సినిమాకు సీక్వల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈసినిమాలో మరో కీలక పాత్రలో స్టార్ మేకర్ సత్యానంద్ వారసుడు నటిస్తున్నాడు. లేడీస్ టైలర్ సినిమాలో హీరో పాటు సినిమా అంతా కనిపించే కీలక పాత్ర బట్టల సత్యం, ఈ పాత్రకు కొడుకుగా సత్యానంద్ కొడుకు రాఘవేంద్ర నటిస్తున్నాడు. దాదాపు తెలుగు వెండితెర మీద గత పదిహేనేళ్లలో పరిచయం అయిన స్టార్ వారసులందరికీ గురువుగా గుర్తింపు తెచ్చుకున్న సత్యానంద్, ఫ్యాషన్ డిజైనర్ సినిమాతో తన వారసుడిగా రాఘవేంద్రను పరిచయం చేస్తున్నాడు. తండ్రి దగ్గరే నటనలో శిక్షణ పొందిన రాఘవేంద్ర కామెడీ పాత్రలో ఆకట్టుకుంటాడన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
అలజడి
జీవితం అనే సాగరంలో మన ప్రయాణం కాగితపు పడవలోనే. అలలో జడి లేకున్నా... మనలో అలజడి ఉన్నా ప్రయాణం కష్టం. ఇతరుల కన్నా ముందే ఉండాలన్న అలజడి ఎన్నో జీవితాలను ముంచేస్తోంది. ముందుండాల్సింది ఇతరుల కన్నా కాదు... పోరాడాల్సింది సాటివాళ్లతో కాదు... మీ సామర్థ్యంతో మీరే ప్రతిరోజూ తలపడండి. పోరాడండి. అప్పుడు మీ ప్రతి అడుగూ ఒక ముందడుగు అవుతుంది. కాగితపు పడవలో కూడా సుదూర ప్రయాణం చేస్తారు. కాలింగ్‌బెల్ మోగింది. డైనింగ్ టేబుల్ మీదే తలపెట్టి నిద్రపోతున్న కీర్తి లేచి టైమ్ చూసింది. అర్థరాత్రి దాటింది. డోర్ తీసింది. ఎదురుగా భర్త వంశీ. గుమ్మంలోనే ప్రశ్నించింది కీర్తి. ‘‘కనీసం ఈ ఒక్కరోజైనా ఇంటికి త్వరగా రావచ్చు కదా. ఎప్పుడూ పని పని.. అంటారు. ఈ రోజు దినేష్ బర్త్ డే అనైనా గుర్తుందా. వాడు ఇంత సేపు చూసి చూసి కేక్ కట్ చేయకుండా అలాగే నిద్రపోయాడు..’’ బాధగా అంది కీర్తి.‘‘ఈ పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేసినా ఇంకా వెనకపడిపోతాం. కష్టపడితేనే కదా విజయం సాధించేది. నీకిది చెప్పినా అర్థం కాదు. కేక్ కట్ చేయడమేగా. చేసేయాల్సింది..’’ సింపుల్‌గా అంటూ వెళ్లి పడుకున్నాడు వంశీ. నీళ్లు నిండిన కళ్లతో అలాగే చూస్తూ ఉండిపోయింది. టేబుల్ మీద అలాగే వదిలేసిన కేక్ తీసి ఫ్రిజ్‌లో పెట్టింది. పోటీలో వెనకపడిపోతే... ఆఫీస్ లిఫ్ట్‌డోర్ తెరిచీ తెరుచుకోకముందే లోపలికి పరిగెత్తాడు వంశీ. అంతే వేగంగా తన క్యాబిన్‌కి వెళ్లి సీట్లో కూర్చుని, సిస్టమ్ ఆన్ చేశాడు. ఆయాసంతో గుండె పట్టేసినట్టయింది. రొప్పుతున్నాడు. ఇక కుర్చీలో కూర్చోలేననిపించింది. తప్పనిసరై హాస్పిటల్‌కి వెళ్లాడు. డాక్టర్ పల్స్ చెక్ చేసి ‘‘ఎందుకంత అలజడి పడుతున్నారు. హైబీపి ఉంది. రోజుకి ఎన్నిగంటల పనిచేస్తారు’’ అన్నాడు. ‘‘కనీసం 18 నుంచి 20 గంటలు. ఎందుకలా అడిగారు?’’ అన్నాడు వంశీ ‘‘అలా మిషన్లా పనిచేస్తే ఆరోగ్యం ఇలాగే ఉంటుంది. కొంచెం విశ్రాంతి తీసుకోండి’’ అంటున్న డాక్టర్ని వారిస్తూ.. ‘‘అలా అయితే ఈ పోటీ ప్రపంచంలో బతగ్గలమంటారా?’’అంటూనే లేచి వెళ్లడానికి నాలుగడుగులు వేసి, కళ్లు తిరిగి కిందపడిపోయాడు. ఫైళ్లతోనే కుస్తీ ఫోన్లో సమాచారం తెలియగానే కీర్తి అన్నయ్య రఘు వచ్చాడు. అన్నను చూడగానే ఏడుపు ఆగలేదు కీర్తికి. ‘‘ఆరోగ్యం పాడుచేసుకునేంతగా ఏమైంది?’’ అని అడిగాడు చెల్లెలిని. ‘‘ఇరవై నాల్గంటలూ పని పని అంటూ ఆఫీసులోనే ఉంటున్నాడు. ఇంట్లో ఉన్నా ఆఫీసుకు సంబంధించిన ఫోన్లు, ఫైళ్లతోనే ఉంటాడు. నన్నూ, దినేష్‌ను పూర్తిగా మర్చిపోయాడు. తన తిండి, నిద్ర గురించి కూడా పట్టించుకోవడంలేదు. ఎప్పుడూ మనిషికి ఆందోళనే. అదేమని అడిగితే ‘పనిలో ఉంటున్నాను కదా. పోటీకి తగ్గ స్పీడ్ లేకపోతే ఎలా?’ అంటున్నాడు. చెబితే కోపం, చెప్పకపోతే ఏమైపోతాడో అని భయం. ఎలా చక్కదిద్దాలో అర్థంకావడంలేదన్నయ్యా!’’ ఏడుస్తూనే తమ పరిస్థితి అంతా వివరించింది కీర్తి. శ్రమలోనే కాలమంతా! కౌన్సెలర్ ముందున్నాడు వంశీ. ఈ జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే రిగ్రెషన్ థెరపీ ఒక గైడెన్స్‌లా ఉపయోగపడుతుందని నచ్చజెప్పి వంశీని రిగ్రెషన్ థెరపీకి తీసుకొచ్చాడు రఘు. కళ్లు మూసుకొని మౌనంగా ధ్యానముద్రలో ఉన్న వంశీకి కౌన్సెలర్ సూచనలు ఇవ్వడం ప్రారంభించారు. ఆ సూచనలతో మెల్లగా తన జీవితాన్ని అర్థం చేసుకునే దిశగా ప్రయాణం మొదలుపెట్టాడు వంశీ. కంపెనీలో తను. తన అవసరానికి మించి పనిచేస్తున్నాడు. కింది ఉద్యోగులను బాగా పనిచేయాలని, ఎక్కువ గంటలు పనిచేయాలని గైడ్ చేస్తున్నాడు. అటు నుంచి గతంలో చేసిన ఉద్యోగాల జాబితా పరిశీలించాడు. అంతటా తన తోటివారందరిలోనూ ముందుండాలని ఎక్కువ శ్రమిస్తున్నాడు. అయినా, తనకన్నా తక్కువ గంటలు పనిచేసేవారే ముందుంటున్నారు. కాలేజ్, స్కూల్ రోజుల్లో తను అందరికన్నా ముందుం డాలని అనిపించుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాడు. ఎందుకు? అన్వేషణ మొదలైంది. ఆ శోధనలో బాల్యదశలో ఒక చోట ఆగిపోయాడు వంశీ. కాసేపు ఆగి చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘నేను మూడు, అన్నయ్య ఐదవ తరగతి చదువుతున్నాం. మేమిద్దరం నాన్న ముందు నిల్చుని ఉన్నాం. నాన్నకు మా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇచ్చాం. నాన్న అన్నయ్యను మెచ్చుకుంటున్నాడు. తన జేబులో ఉన్న పెన్ను తీసి అన్నయ్య జేబులో పెట్టి, ‘నా పేరు నిలబెట్టేది నువ్వేరా’ అని ముద్దులు పెడుతున్నాడు. ‘మరి నాకు పెన్ను’ అన్నాను. ‘అన్నయ్యకన్నా మార్కులు ఎక్కువ తెచ్చుకో, అప్పుడు చూద్దాం’ అని వెళ్లిపోయాడు నాన్న. కష్టపడి చదవాలని అప్పుడే అనుకున్నా. అమ్మ అన్నానికి పిలిచినా వెళ్లకుండా చదువుతున్నాను. రాత్రిళ్లు కరెంట్ పోయినా దీపం పెట్టుకొని చదువుతున్నాను. నెక్ట్స్ క్లాస్‌కి స్కూళ్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ అన్నయ్యకే ఎక్కువ మార్కులు వచ్చాయి. నేను ఇంకా ఎక్కువ కష్టపడి చదువుతున్నాను’’ అంటూ ఆగిపోయాడు వంశీ. ‘‘ఇంకా వెనక్కి ప్రయాణించండి. ఆ ప్రయాణంలో మిమ్మల్ని అమితంగా బాధించిన సంఘటన ఏదున్నా చెప్పండి’’ అన్నారు కౌన్సెలర్. వంశీ ప్రయాణం ఇంకా వెనక్కి తిరిగింది. వంశీ చెబుతున్నాడు ‘‘నేను, అమ్మ గర్భంలో నుంచి అప్పుడే బయటకు వచ్చాను. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. నన్ను చూడ్డానికి వచ్చిన నాన్న ‘వీడేంటి ఇంత నల్లగా పుట్టాడు. పెద్దోడిది మంచి రంగు’ అంటున్నాడు. ఆయన చూపులు నన్ను అసహ్యించుకున్నట్టు ఉన్నాయి. అన్నీ సక్రమంగా ఉంటేనే ముందంజనా! ‘‘వంశీ, మీరు ఇప్పుడు అమ్మ గర్భంలో నుంచి మీ గత జన్మలోకి ప్రయాణిస్తున్నారు. ఆ గతం తాలూకు అవశేషం ఎక్కడుందో చూడండి’’ అన్నారు కౌన్సెలర్. తల్లి గర్భంలో.. అటు నుంచి గతజన్మలోకి వంశీ ప్రయాణం సాగింది. ఆ అవశేషం గురించి వంశీ చెబుతూ ‘‘నేను అంధుడిని. రోడ్డుదాటలేకపోతున్నాను. ఎవరో వచ్చి నన్ను రోడ్డు దాటిస్తామన్నారు. అప్పుడు నాకు చాలా బాధ వేసింది. అందరూ పరిగెడుతున్నారు. కనీసం నేను రోడ్డు కూడా దాటలేకపోతున్నాను. దేవుడు నన్ను ఎందుకిలా పుట్టించాడు. అన్నీ సక్రమంగా ఉంటే అందరి కన్నా ముందుండేవాడిని. జీవితమంతా ఆ బాధతోనే గడిపాను. అలాగే మరణించాను’’ చెబుతున్న వంశీ గుండె నీరైంది. పోటీ మీద అవగాహన ‘‘వంశీ ఈ జన్మకు రండి. ప్రస్తుత పరిస్థితికి గత సంఘటనలకు బేరీజు వేసుకొని చూడండి’’ అంటూ కౌన్సెలర్ సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారు. ‘‘వంశీ, మీ జీవనప్రయాణంలోని స్పష్టత మీద దృష్టి పెట్టండి. మొదటిది: ‘అన్నయ్య కన్నా నేను తక్కువ’ అనే భావన మీలో ఎనిమిదేళ్ల వయసులో పడిపోయింది. దీంతో మెప్పు కోసం పోటీ పడాలని నిర్ణయించుకొని కష్టపడటం మొదలుపెట్టారు. మీ కష్టంలో ‘నాలో సామర్థ్యం తక్కువ’ అనే ఆలోచన బలంగా పడిపోయింది. సామర్థ్యాన్ని మెరుగుపెట్టుకుంటే మీ అన్నకన్నా నాలుగు మార్కులు సంపాదించడం పెద్ద కష్టమయ్యేది కాదు. ఇప్పుడు మీరు చేస్తున్నపని కూడా సామర్థ్యంతో కాకుండా కష్టంతో లాక్కొస్తున్నారు. రెండవది: నల్లగా పుట్టానని, అందంగా ఉన్నవారితో పోటీపడలేననే భయాన్ని పెంచుకున్నారు. నల్లగా ఉన్న వారెంతో మంది సాధించిన విజయాలు ఇన్నేళ్లలో మీకు కనిపిం^è లేదా! అవగాహనకు రండి. శ్రీకృష్ణుడు నల్లగానే పుట్టి, అవతారపురుషుడయ్యాడనీ మీకూ తెలుసు కదా. మూడవది: అంధుడిగా గత జన్మ అంతా బాధపడ్డారు. బాగుంటే అందరితో పోటీ పడి, వేగంగా పరిగెత్తేవాడిని అనుకున్నారు. అంధులుగా ఉన్నవారు కూడా ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. వాళ్లు సాధించిన విజయాలను ఒకసారి పరిశీలించండి. ‘నేను ఇలా కాకుండా ఇంకోలా ఉండి ఉంటే’ అనుకోకుండా ‘మేధస్సుతో సాధించగలను’ అని నిర్ణయం తీసుకోండి. అందరితో కాకుండా మీతో మీరు పోటీ పడండి. కష్టంగా కాదు, ఇష్టంగా జీవించండి’’ కౌన్సెలర్ మాటలతో ప్రశాంతంగా మేలుకొన్నాడు వంశీ! ఇప్పుడు అతడికి హాయిగా ఉంది. తుఫాను తీరిన సముద్రంలా ఉన్నాడతను. జీవితం సమతూకం.. కాలింగ్‌బెల్ మోగడంతో వెళ్లి డోర్ తీసింది కీర్తి. ఎదురుగా వంశీ! నమ్మబుద్ధికాక గడియారం కేసి చూసింది, సాయంత్రం ఆరు. హోమ్‌వర్క్ చేసుకుంటున్న దినేష్ తండ్రి చూసి ఆనందంగా ‘డాడీ..’ అంటూ పరిగెత్తుకువచ్చి తండ్రిని చుట్టేశాడు. ‘పని ఎప్పుడూ ఉండేదే. ఇవాళ సినిమాకెళ్దామా’ అంటూ సరదాగా మాట్లాడుతున్న భర్తను ఆశ్చర్యంగా చూస్తూండిపోయింది కీర్తి. ‘‘ఇలాగే ఉంటే ఎలా సినిమాకు లేట్ అయిపోతుంది పద పద..’’ అని తొందరపెడుతున్న వంశీని చూసి తమ జీవితాల్లోకి వసంతం వచ్చేసిందని సంబరపడిపోయింది కీర్తి. మన వాస్తవ పరిస్థితులకు మనమే సృష్టికర్తలం ‘యద్భావం తద్భవతి’ అంటే ఏది ఆలోచిస్తున్నామో అదే జరుగుతుంది. తమ వాస్తవ పరిస్థితులకు తామే సృష్టికర్తలం అని గ్రహిస్తే సమస్యలుగా అనిపించినవన్నీ పరిష్కారమవుతాయి. అన్నింటా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఆలోచనలను నమ్మకాలవైపు పయనింపజేయాలి. అదెలాగంటే, చిత్రకారుడు తెల్లని కాన్వాస్‌పై అద్భుతమైన చిత్రం వేయడానికి ఎంతటి బాధ్యత తీసుకుంటాడో ఎవరికి వారు తమ జీవితాన్ని మలచుకోవడంలో అలా స్వీయ బాధ్యత తీసుకోవాలి. – డాక్టర్ న్యూటన్, పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్ సామర్థ్యాల పెంపుకు కృషి అవసరం చెడు ఆలోచనలకు బలం ఇస్తే అలాంటి వాస్తవమే మనం చూస్తాం. దీంతో మన చుట్టూ అలాంటి వాతావరణమే ఉందనుకుంటాం. వంశీ ఆలోచనలో ఎప్పుడూ ‘అందరికన్నా ముందుండాలి’ అనుకునే వాడు. అయితే, ఆ పోటీని సామర్థ్యంతో కాకుండా, సమయంతో లెక్కించాడు. దీంతో జీవితంలో బ్యాలెన్స్ కోల్పోయాడు. ఆరోగ్యం దెబ్బతింది. కుటుంబంలో సమస్యలు తలెత్తాయి. మన ఆలోచనలను గమనించి, సరైనదారిలో సామర్థ్యాలను పెంచుకున్నప్పుడే విజయం. – డాక్టర్ లక్ష్మి, పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్ అపనమ్మకాలను నమ్మకాలవైపుగా మళ్లించాలంటే... ఏదైనా చెడు ఆలోచన, అపనమ్మకం వంటివి కలిగినప్పుడు దానికి పూర్తి వ్యతిరేక ఆలోచనను పేపర్‌మీద రాయండి. ఇది మీలో ఒక శక్తివంతమైన ఆలోచనవుతుంది.మీకు అనుకూలమైన నిర్ణయాలను రాస్తూ ఉండండి. ఉదాహరణకు: నేను చాలా బాగున్నాను. నేను చేయగలను. నేను సాధించగలను.. ఇలాంటివి స్వీయ ఆనందం, ఆరోగ్యం, చుట్టూ అనుబంధాలు ఏవిధంగా ఉంటున్నాయో గుర్తించివీటి పట్ల ఉంటున్న అపనమ్మకాలను నమ్మకం వైపుగా మల్లించాలి.సినిమా దృశ్యం మాదిరి జీవితాన్ని కళ్లతో అత్యద్భుతంగా ఉన్నట్టు దర్శించాలి. అనుకూలంగా లేని సంఘటనలను చిత్రాలుగా ఊహించుకొని అవన్నీ చాలా బాగవుతున్నట్టు ఊహించాలి.రోజూ 30–40 నిమిషాలు ధ్యానం చేయాలి. దీని వల్ల చెడు ఆలోచనలు మంచివైపుగా ప్రయాణిస్తాయి.విశ్రాంతి లేకపోవడం, ఆందోళనలు, భయాలు అన్నీ ధ్యానంలో కరిగిపోతాయి. పాజిటివ్ ఆలోచనలకు దారి తీసి, ఆత్మవిశ్వాసాన్ని, వికాసాన్ని ధ్యానం పెంపొందింపజేస్తుంది. – నిర్మల రెడ్డి చిల్కమర్రి -
షూటింగ్ పూర్తి చేసుకున్న ఫ్యాషన్ డిజైనర్
డిఫరెంట్ టేకింగ్‌తో ఆకట్టుకునే సీనియర్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ఫ్యాషన్ డిజైనర్. 80లలో తన దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ లేడీస్ టైలర్‌కు సీక్వల్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందుకే ఈ సినిమాకు సన్నాఫ్ లేడీస్ టైలర్ అనే ట్యాగ్ లైన్‌ను జోడించారు. కొంత కాలంగా తన రేంజ్ హిట్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న వంశీ, ఫ్యాషన్ డిజైనర్‌తో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. అంతకు ముందు ఆతరువాత, కేరింత లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాల్లో హీరోగా నటించిన సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈసినిమాను మధుర శ్రీధర్ నిర్మిస్తున్నాడు. సుమంత్ అశ్విన్ సరసన్ అనీషా ఆంబ్రోస్‌తో పాటు మరికొంత మంది ముద్దుగుమ్మలు ఆడిపాడనున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
రన్ ప్రభాస్ రన్
సరిగ్గా నాలుగేళ్లు... ఈ నెల 8వ తేదీకి నాలుగేళ్లు! ప్రేక్షకులు ప్రభాస్ ‘మిర్చి’లో ఘాటెంతో చూసి నాలుగేళ్లు గడిచాయి. అప్పట్నుంచీ ఈ ఆరడుగుల అందగాడు తన టైమంతా ‘బాహుబలి’కి రాసిచ్చేశాడు. దాంతో ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించబోయే కొత్త సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా... అని ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు. వాళ్ల ఎదురుచూపులకు తెరపడింది. ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించనున్న సినిమా సోమవారం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ప్రభాస్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు క్లాప్ ఇవ్వగా, నిర్మాత ‘దిల్’ రాజు కెమేరా స్విచ్చాన్ చేశారు. 150 కోట్లతో ఈ సినిమాను నిర్మించనున్నారట. దీని తర్వాత వేగంగా సినిమాలు చేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నారట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్, నృత్యాలు: రాజు సుందరం, కెమేరా: మది, సంగీతం: శంకర్–ఎహసాన్–లాయ్. -
అమెరికాలో తెలుగు విద్యార్థి కాల్చివేత
-
ఫ్యాషన్ డిజైనర్ కోసం ముగ్గురు భామలు
సీనియర్ దర్శకుడు వంశీ రూపొందించిన సూపర్ హిట్ సినిమాల్లో లేడీస్ టైలర్ ఒకటి. రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అడల్ట్ కామెడీకి దగ్గరగా ఉన్నా.. అప్పట్లో ఘనవిజయం సాధించింది. దీంతో చాలా కాలంగా ఈ సినిమాకు సీక్వల్ ను రూపొందించే ప్లాన్ లో ఉన్నాడు దర్శకుడు వంశీ. గతంలో ఈ రీమేక్ లో హీరోలుగా అల్లరి నరేష్, రవితేజ లాంటి స్టార్ హీరోలు నటిస్తారన్న టాక్ వినిపించినా.. అవేవి సెట్స్ మీదకు రాలేదు. తాజాగా ఈ సినిమాను సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటికే కథా కథనాలు రెడీ అయిన ఈ సినిమాకు ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ముగ్గురు ముద్దుగుమ్మలు ఫైనల్ చేశారు. మనమంతా ఫేం అనీషా ఆంబ్రోస్ తో పాటు, మాసన హివవర్ష, మనాలీ రాథోడ్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
లేడీస్ టైలర్ కొడుకు ఫ్యాషన్ డిజైనర్
వాలు జడ, రూపాయి కాసంత బొట్టు, కళ్లకు కాటుక, కాళ్లకు పట్టీలు, ఒంటి నిండా చీర... దర్శకుడు వంశీ చిత్రాల్లో హీరోయిన్ ఇలా నిండుగా, చూడ్డానికి రెండు కళ్లూ చాలనంత అందంగా ఉంటుంది. ఆయన సినిమా మన ఇంట్లోనో.. మన పక్కింట్లోనో జరుగుతున్న కథలా ఉంటుంది. అంత సహజంగా ఉంటుంది కాబట్టే, వంశీ సినిమాకి బోల్డంత మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా వంశీ దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్న వాటిలో ‘లేడీస్ టైలర్’ ఒకటి. ఈ చిత్రం విడుదలై 30 ఏళ్లవుతోంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా వంశీ ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’ తెరకెక్కించనున్నారు. ఇందులో టైటిల్ రోల్ చేసే అవకాశం సుమంత్ అశ్విన్‌కి దక్కింది. వంశీ వంటి డెరైక్టర్‌తో సినిమా అంటే సుమంత్ అశ్విన్‌కి గోల్డెన్ చాన్స్ లాంటిదే. మధుర ఎంటర్టైన్ మెంట్స్‌పై ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ నిర్మించను న్నారు. ముగ్గురు కథా నాయికలు ఉంటారట. నవంబర్‌లో చిత్రాన్ని ఆరంభిం చాలనుకుంటు న్నారు. -
లేడీస్ టైలర్‌గా స్టార్ వారసుడు.?
టాలీవుడ్లో స్టార్ వారసుల తెరంగేట్రాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో వారసులు వెండితెర మీద సందడి చేస్తుండగా.. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో యంగ్ హీరో చేరబోతున్నాడు. డి.రామానాయుడి మనవడు, నిర్మాత సురేష్ బాబు తనయుడు, హీరో వెంకటేష్ అన్న కొడుకు, యంగ్ హీరో రానా తమ్ముడు అయిన అభిరామ్ త్వరలోనే తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకుంటున్న అభిరామ్, తొలి సినిమాపై ఇంట్రస్టింగ్ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. సీనియర్ దర్శకుడు వంశీ ముప్పయ్యేళ్ల క్రితం, రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కించిన లేడీస్ టైలర్ సినిమాకు సీక్వల్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాతో దగ్గుబాటి అభిరామ్‌ను తెరకు పరిచయం చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా రానుందన్న టాక్ వినిపిస్తోంది. -
దోపిడీ కేసులో నిందితుల అరెస్ట్
సంగారెడ్డి మండలం కొయ్యగుండు తాండ పరిధిలో ఈ నెల 16న జరిగిన దోపిడీ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం మధ్యాహ్నం నలుగురు నేరస్తులు గణేశ్‌గడ్డ దాబా వద్ద సంచరిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు పకడ్బంధీగా వెళ్లి వారిని పట్టుకున్నారు. అరెస్టయిన వారిలో మహేశ్‌కుమార్, వంశీ, మెన్‌సోత్ నరేందర్ నాయక్, భానుచందర్‌లు ఉన్నారు. వీరి నుంచి రూ.6 వేల నగదు, రెండు సెల్ఫోన్లు, ఒక ట్రాలీ ఆటో, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఈ నెల 16న హైద్రాబాద్ నుంచి నాందేడ్ వైపు వెళ్తున్న ఓ లారీని అటకాయించి లారీ డ్రైవర్, క్లీనర్లలను చితకబాది వారి వద్ద నున్న సొమ్ము ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ రోజు నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. -
రైలు కిందపడి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
తుని: ఇంటర్ పరీక్షల్లో తప్పినందుకు మనస్థాపంతో ఓ విద్యార్థి బలవన్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన గొల్లబెల్లి వంశీ(18)కి తల్లిదండ్రులు లేరు. సోదరునితో కలిసి పట్టణంలోనే అద్దెగదిలో ఉంటున్నాడు. ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో వంశీ రెండు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. దీంతో మళ్లీ పరీక్ష రాసేందుకు సమాయత్తమవుతున్నాడు. సోదరుడు ఉద్యోగం నిమిత్తం భద్రాచలం వెళ్లగా కొన్ని రోజులుగా వంశీ ఒక్కడే గదిలో ఉంటున్నాడు. ఒంటరితనం, పరీక్ష ఫెయిలైన బాధతో ఉన్న వంశీ బుధవారం ఉదయం రైల్వేస్టేషన్ వద్దకు వెళ్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
గోదారమ్మ ఒడిలోనే వంశీ...
నిలిచిన గాలింపు చర్యలు వెనుదిరిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందం జలసమాధిగా భావిస్తున్న అధికారులు పుట్టెడు దుఃఖంలో కుటుంబసభ్యులు కాళేశ్వరం : ఆరు రోజులుగా పుట్టెడు దుఃఖంతో వంశీ కుటుంబసభ్యులు ఆఖరిచూపు కోసం ఎదురు చూస్తున్నారు. తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయూరు. పడవ ప్రమాదంలో కాటారం మండలం ఆదివారంపేట గ్రామానికి చెందిన బుర్రి వంశీ(11) జలసమాధి అయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 21న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచా తాలూకాలోని చింతలపల్లి నుంచి మహదేవపూర్ మండలం మెట్పల్లి వద్ద గోదావరి, ప్రాణహితనదులపై వంతెన వద్ద పడవ బోల్తా పడడంతో వంశీ గల్లంతైన విషయం తెలిసిందే. ఈప్రమాదంలో 24 మంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. వంశీ కోసం ఆరు రోజులుగా తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు, రెవెన్యూ అధికారులు, వంతెన కాంట్రాక్టర్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టినా చివరికి నిరాశే మిగిలింది. శుక్రవారం ఎన్డీఆర్ఎఫ్ టీం తిరుగు ప్రయాణమయ్యారు. పోలీసులు కూడా ఆరు రోజులుగా వెతికి వంశీ ఆచూకీ తెలియకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. వంశీతో నీటిలో మునిగిన మూడు బైకులు అతికష్టం మీద లభ్యమయ్యాయి. సుమారు 2 మీటర్ల లోతులో ఇసుక కప్పేసి ఉంది. పొక్లెరుున్ల సాయంతో తాత్కాలిక వంతెనలకు ఇరువైపుల తవ్వి గాలింపు చర్యలు చేశారు. ఇదే ప్రమాదానికి గురైన వంశీ సోదరి సౌజన్య హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి నిలకడ ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు బంధువులు పేర్కొంటున్నారు. వంశీ ఆచూకీ కోసం ఎదురు చూసిన తండ్రి మొగిళి, సోదరుడు అనిల్, బాబాయ్ రాజేశ్ కన్నీరుమున్నీరవుతున్నారు. మనసులో ఏదో ఒక చోట వంశీ వస్తాడనే చిన్న ఆశతో ఆరు రోజులుగా ఎదురుచూస్తున్నారు. చివరికి వారుకూడా వెనుదిరిగిపోతున్నారు. పోలీసులు మళ్లీ గాలింపును పొడి గిస్తామని చెబుతున్నారు. ఆరురోజులుగా సిరొంచా డీఎస్పీ శివాజీ పవార్, సీఐ లుకుడే,తహశీల్దార్ సతీష్‌కుమార్, ఎస్సై కృష్ణారెడ్డి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వీరితోపాటు ఎన్డీఆర్ఎఫ్ టీం 18మంది సభ్యులు తీవ్రంగా గాలించినా ఫలితం లేకపోయింది. అందరూ వెళ్లిపోవడంతో గోదావరి వంతెన ప్రాంతం నిర్మానుష్య వాతావరణ కనిపించింది. -
గోదావరి నదిలో పడవ బోల్తా
నలుగురు గల్లంతు ♦ బోట్ సిబ్బంది సహా 22 మంది సురక్షితం ♦ మహారాష్ట్ర-తెలంగాణ అంతర్రాష్ట్ర వంతెనవద్ద ప్రమాదం కాళేశ్వరం: కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం మెట్పల్లి వద్ద నిర్మిస్తున్న అంతర్రాష్ట్ర వంతెన వద్ద పర్యాటక స్టీమర్(పడవ) బోల్తా పడి నలుగురు గల్లంతయ్యారు. 22 మంది సురక్షితంగా బయటపడ్డారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా చింతలపల్లి మహదేవపూర్ మండలం మెట్‌పల్లిని కలుపుతూ గోదావరి నదిపై వంతెన నిర్మిస్తున్నారు. వంతెన పనుల కోసం తాత్కాలికంగా రహదారి కూడా నిర్మించారు. గోదావరికి అటూ ఇటూ ఉన్న గ్రామాల ప్రజలు ఇక్కడి నుంచి తాత్కాలిక రహదారిపైనుంచి గోదావరి దాటుతుంటారు. ఇటీవల గోదావరికి నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో వంతెన పనులు చేసే నిర్వాహకులు... ఆదివారం తాత్కాలిక రహదారివైపు నీళ్లు రాకుండా కాలువలా చేసి నీటిని మళ్లించారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం వద్ద గోదావరిపై పడవ ద్వారా ప్రయాణికులను అటూ ఇటూ చేరవేసే గంగపుత్రులు ఆదివారం ఈ తాత్కాలిక వంతెన వద్ద ప్రయాణికులను చేరవేసేందుకు వచ్చారు. సాయంత్రం 20 మంది ప్రయాణికులు, పడవ నడిపేవారు ఆరుగురితో కలిపి మొత్తం 26 మందితో వంతెన వద్ద నుంచి మెట్‌పల్లికి పడవలో బయలుదేరారు. వంతెన కింది భాగంలో వెల్డింగ్ పనులు నడుస్తుండడంతో జనరేటర్ వైర్ నీటిలో పడవకు అడ్డు తగిలింది. దీంతో పడవ అకస్మాత్తుగా బోల్తాపడింది. ఈ క్రమంలో అందులో ప్రయాణిస్తున్నవారంతా నీళ్లలో పడిపోయారు. మూడు బైక్‌లు సైతం మునిగిపోయాయి. గంగపుత్రులు వెంటనే నీళ్లలో దూకి పలువురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. క్షేమంగా బయటపడ్డవారిలో మాలే విష్ణు (సిరొంచా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న వ్యక్తి), ఆలం కాజల్, శ్రీరాం పార్వతి (సిరొంచా), నేలటూరి భాగ్య (పరకాల), ధర్మపురి నరేష్, అతడి భార్య అలేఖ్య (నిండుగర్భిణి), శశికళ, అరుణ్ (జగిత్యాల), మతిన్ (సిరొంచా), ఊదరి వినయ్, ఊదరి సమ్మక్క దంపతులు, వీరి కుమారుడు చరణ్ (6), మారగోని జ్యోతి, ఆమె బావ కూతురు శ్రేయశ్రీ (5) (ఆసరెళ్లి), బుర్రి లక్ష్మి ఆమె పది నెలల కూతురు ఉన్నారు. పాప అస్వస్థతకు గురికావడంతో గోదావరిఖని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాటారం మండలం ఆదివారంపేట గ్రామానికి చెందిన బుర్రి వంశీ (11) గల్లంతయ్యాడని అతడి బంధువులు తెలిపారు. వంశీతోపాటు మరో ముగ్గురు నీటిలో గల్లంతయ్యారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. సిరొంచా డీఎస్పీ శివాజీ పవార్, మంథని ఆర్డీవో బాలె శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ రవి, ఎస్సైలు కృష్ణారెడ్డి, రమేశ్, వెంకటేశ్వర్రావు ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
ముచ్చటగా మూడో పేరు..!
ఒకప్పటి స్టార్ డైరెక్టర్ వంశీ ఈ మధ్య కాలంలో అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. సినిమాలో ఏ ఒక్క ఫ్రేమ్ చూసిన ఇది వంశీ సినిమా అనే స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ డైరెక్టర్ ఇటీవల తన మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోతున్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన వంశీ 'ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు', 'గోపి గోపిక గోదావరి' లాంటి డీసెంట్ హిట్స్ అందించినా.. పూర్తి ఫాంలోకి మాత్రం రాలేకపోయాడు. చాలా రోజులు క్రితం వంశీ 'తను మొన్నే వెళ్లిపోయింది' పేరుతో ఓ సినిమాను ఎనౌన్స్ చేశాడు. అంతే వేగంగా ఆ సినిమాను పూర్తి చేశాడు. అయితే సినిమా పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు రిలీజ్‌కు మాత్రం నోచుకోలేదు. సినిమా విడుదల జాప్యం కావటంతో ఆ సినిమా టైటిల్‌ను 'మెల్లగా తట్టింది మనసు తలుపు' అంటూ మార్చాడు. టైటిల్ మార్చినా పరిస్థితి మారలేదు. సినిమా రిలీజ్‌కు మార్గం సుగమం కాలేదు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వంశీ తన సినిమా టైటిల్ ను మార్చాడు. 'తను మొన్నే వెళ్లిపోయింది', 'మెల్లగా తట్టింది మనసు తలుపు' తరువాత ప్రస్తుతం అదే సినిమాను 'వెన్నెల్లో హాయ్ హాయ్' పేరుతో ప్రమోట్ చేస్తున్నాడు వంశీ. అజ్మల్, నిఖితా నారాయన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను డివి సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. మరి టైటిల్ ఛేంజ్ తో అయినా వంశీ సినిమా రిలీజ్ వస్తుందేమో చూడాలి. -
ఫ్యాషన్ డిజైనర్...s/o లేడీస్ టైలర్
వంశీ... ప్రముఖ కథా రచయిత, దర్శకుడు. ఆయన పేరు చెప్పగానే సాహిత్యాభిమానులకు ‘మా పసలపూడి కథలు’ గుర్తుకు వస్తాయి. సినిమా ప్రియులకు ‘సితార’, ‘అన్వేషణ’, ‘లేడీస్ టైలర్’, ‘ఏప్రిల్ 1 విడుదల’, ‘ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ లాంటి విభిన్న తరహా చిత్రాలు, వాటిలోని వినోదం జ్ఞాపకం వచ్చి, పెదవులపై చిరునవ్వు వెలుగుతుంది. మరోసారి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడానికి వంశీ సిద్ధమవుతున్నారు. ‘లేడీస్ టైలర్’లో ‘జమ జచ్చ’ అంటూ ‘జ’ భాష మాట్లాడే లేడీస్టైలర్ రాజేంద్రప్రసాద్ నుంచి ‘బట్టల సత్యం’ మల్లికార్జునరావు దాకా అన్ని పాత్రలూ గుర్తుండేలా చేసిన ఘనత వంశీది. ఇప్పుడు ఆ తరహాలో తాజా సినిమాకు నడుం బిగించారు. ప్రస్తుతం ఆయన ఆ స్క్రిప్ట్ పనిలోనే ఉన్నారు. ఎవరికీ అందుబాటులో లేకుండా ఏకాంతంగా ఆలోచనలకు అక్షరరూపం ఇస్తున్నారు. సూపర్‌హిట్ ‘...టైలర్’కు సీక్వెల్? ‘సాక్షి’కి అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ స్క్రిప్ట్‌కు ‘ఫ్యాషన్ డిజైనర్... సన్నాఫ్ లేడీస్ టైలర్’ అని టైటిల్ పెట్టారు. సినిమాకు కూడా అదే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో యువతీ యువకులకు గిలిగింతలు పెట్టి, కామెడీలోనూ, పాటల్లోనూ చిరస్మరణీయంగా మిగిలిపోయిన ‘లేడీస్ టైలర్’కు ఇది ఒక సీక్వెల్లా ఉంటుందని కృష్ణానగర్ వర్గాల కథనం. అప్పటి సూపర్‌హిట్ ఫిల్మ్‌లో నటించిన రచయిత - నటుడు తనికెళ్ళ భరణి ఇప్పుడీ కొత్త సినిమాకు కథ అందిస్తున్నారు. రచయితగా సినీ రంగప్రవేశం చేసి, నటుడిగా మారాక కొన్నేళ్ళుగా సినీ రచనకు దూరంగా ఉన్న తనికెళ్ళ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం మళ్ళీ కలం పట్టడం విశేషమే! టైటిల్ రోల్‌కు... సక్సెస్ఫుల్ హీరో ఇంతకీ ఈ సారి ఆధునిక లేడీస్ టైలర్‌గా... అదే... అదే... ఫ్యాషన్ డిజైనర్‌గా ఎవరు నటిస్తారన్నది ఆసక్తికరమైన విషయమే. ఈ ‘సన్నాఫ్ లేడీస్ టైలర్’ పాత్రకు ప్రస్తుతం వరుస హిట్లతో జోరు మీదున్న యువ హీరో రాజ్ తరుణ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఏణ్ణర్ధం క్రితం ‘ఉయ్యాల జంపాల’, తాజాగా ‘సినిమా చూపిస్త మావ’ లాంటి హిట్స్‌తో రాజ్‌తరుణ్ ఇప్పుడు ట్రేడ్‌లోనూ, ఆడియన్స్‌లోనూ క్రేజ్ సంపాదించుకున్నారు. ఉత్తరాంధ్ర యాస మీద పట్టున్న ఈ విశాఖపట్నం కుర్రాడు వంశీ మార్కు స్క్రిప్ట్‌కు సరిపోతాడని వేరే చెప్పనక్కర లేదు. ఇంకా ఇతర తారాగణం ఎవరన్నది తెలియాల్సి ఉంది. వంశీ రచనలన్నా, ఆయన సినిమాలన్నా అమితంగా ఇష్టపడే నిర్మాత - స్వయంగా దర్శకుడైన ‘మధుర’ శ్రీధర్ ఈ కొత్త ప్రాజెక్ట్‌కు నిర్మాణ సారథి. స్క్రిప్ట్ పని, ప్రీ-ప్రొడక్షన్ ఏర్పాట్లు పూర్తి చేసుకొని, నవంబర్ నుంచి సెట్స్ మీదకు ఈ సినిమాను తీసుకువెళ్ళనున్నట్లు భోగట్టా. మొత్తానికి, 1980లలో ‘లేడీస్ టైలర్’తో అందరినీ ఒక ఊపు ఊపేసిన వంశీ మళ్ళీ తన పాత వైభవం సంపాదించడానికి ఈ కొత్త ‘లేడీస్ టైలర్’ను మించినది మరేముంటుంది! -
ఒక తార జీవితం
‘సితార’ అంటే సీనియర్ దర్శకుడు వంశీ తీసిన సినిమా టక్కున గుర్తుకొస్తుంది. ఇప్పుడు అదే పేరుతో మరో సినిమా రానుంది. రవిబాబు, రవనీత్కౌర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జి.ఎల్ సురేంద్ర దర్శకత్వంలో డి.ఎస్ రవికుమార్ నిర్మిస్తున్నారు. ‘‘సురేంద్ర కథ ఎంత బాగా చెప్పాడో, అంతకన్నా బాగా తీస్తున్నారు. త్వరలో పతాక సన్నివేశాల చిత్రీకరణ ఆరంభిస్తాం. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని నిర్మాత తెలిపారు. ‘‘అనుభవం ఉన్న దర్శకునిలా సురేంద్ర చాలా బాగా తీస్తున్నారు. కచ్చితంగా అందరికీ నచ్చే సినిమా ఇది’’ అని నటుడు రవిబాబు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, రామ్ పైడిశెట్టి, ఎడిటింగ్: నందమూరి హరి. -
అయితే... ఓకే!
హిట్ క్యారెక్టర్ సుడి తిరగడమంటే ఇదే. రిటైరైపోయి కూర్చున్న కొండవలస లక్ష్మణరావును ఒకే ఒక్క పాత్ర సూపర్ కమెడియన్‌ను చేసేసింది. ఈ 13 ఏళ్లలో వందల పాత్రలు పోషించిన కొండవలసకు మొదటే దొరికిన బంగారు కొండ ఈ పొట్రాజు పాత్ర. ‘నేనొప్పుకోను... అయితే ఓకే...’ అంటూ కొండవలస ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాలో చేసిన వాయిస్ కామెడీని అనుస(క)రించని వాళ్లు లేరని చెబితే... మీకూ ఓకే కదా! సినిమా పేరు : ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు (2002) డెరైక్ట్ చేసింది : వంశీ సినిమా తీసింది : వల్లూరిపల్లి రమేశ్ మాటలు రాసింది : శంకరమంచి పార్థసారథి అతని పేరు సుబ్బరాజే కానీ, అందరూ పొట్రాజు అని పిలుస్తుంటారు. అలాగని పొట్టిగా ఏం ఉండడు. సన్నగా రివటలా ఉంటాడు. రివట రాజు అంటే బాగుండేదేమో! ఈ పొట్రాజు ఇంటిముందు ఎప్పుడూ వచ్చే పోయే జనాలే. అలాగని బాగా పాపులరనుకునేరు. ‘అప్పు’లర్. అంటే అప్పులు బాగా చేసేస్తుంటాడన్నమాట. వసూలు చేసుకోవడానికొచ్చేవాళ్లు, కొత్తగా అప్పిచ్చేవాళ్లతో ఆ ఇల్లు ఎప్పుడూ కొత్త వందరూపాయల నోటులాగా తళతళలాడిపోతూ ఉంటుంది. ఈ పొట్రాజు అప్పుల గురించి రాస్తే నవలవుతుంది. తీస్తే సినిమా అవుతుంది. అతగాడి పెళ్లాంతో చెప్తే గొడవవుతుంది. ఈ పొట్రాజుకి ఒక్కగానొక్క పెళ్లాం. పేరు సరోజిని. గొట్టాల బిజినెస్సు. గొట్టమంటే ఇనుప గొట్టమో, ప్లాస్టిక్‌కు గొట్టమో అనుకునేరు. మీరు భలేటోళ్లే. అవి తినే గొట్టాలు. కొంతమంది పనోళ్లను పెట్టుకుని పాపం ఆవిడే సంసారాన్ని ఈదుకుంటూ వస్తోంది. ఏం చేస్తుంది మరి... మొగుడేమో ఖాళీగా పనిపాటూ లేకుండా తిరుగుతూ ఉంటే. దానికితోడు ప్రతిదానికీ ‘నేనొప్పుకోను’ అంటూ అడ్డు తగులుతూ ఉంటాడు. సరోజిని ఒక్కటిచ్చుకున్నాక ‘అయితే... ఓకే’ అంటాడు. పోనీ... అలాగని తిన్నగా ఉంటాడా అంటే అదీ లేదు. ఏదో ఒక కోతి పని చేసో, వెదవ గొప్పలకు పోయో సరోజిని గల్లాపెట్టె ఖాళీ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్... ఓ కొరియరబ్బాయ్ వచ్చి ‘‘ఇక్కడ రాజుగారెవరండీ?’’ అనడిగాడు వినయంగా. ‘‘ఇక్కడ హోల్ అండ్ సోల్ రాజుని నేనే. ఏంటి విషయం?’’ అడిగాడు మన పొట్రాజు. ‘‘మీకోసం మీ ఫ్రెండు కృష్ణంరాజుగారు కేక్ పంపించారండీ’’ అనగానే, పొట్రాజు చాలా సంబరపబడి ‘‘అయితే నాకే’’ అని ఆ పార్శిల్ లాక్కున్నంత పనిచేశాడు. ‘‘కృష్ణంరాజని నాకు క్లోజ్‌ఫ్రెండ్. ఇద్దరం చిన్నప్పుడు గూటీబిళ్ల ఆడుకునేవాళ్లం’’ అని గొప్పలు చెప్పడం మొదలుపెట్టాడు. బెల్లం చుట్టూ మూగిన ఈగల్లాగా చుట్టుపక్కల పోర్షనోళ్లంతా చేరి కేక్‌ని కసాబిసా తినేశారు. ఈ తినుడు ప్రక్రియ ఇలా జరుగుతూ... జరుగుతూ ఉండగా కొరియరబ్బాయ్ కంగారుగా బింగారుగా వచ్చేశాడు. ‘‘అయ్యో... ఆ కేక్ మీక్కాదు. పక్క వీధిలో రాజుగారికి. అబద్దం చెప్పి కేక్ అంతా తినేస్తారా... ఆయ్’’ అంటూ పొట్రాజు చొక్కా పట్టుకున్నాడు. ఆరొందలిస్తే తప్ప వదల్లేదు వాడు. సరోజినికి చిర్రెత్తుకొచ్చి మొగుణ్ణి ఒక్క తాపు తన్నింది. ‘‘అయితే ఓకే...’’ అంటూ బురదలో బోర్లా పడ్డాడు పొట్రాజు. ఇలా ఉంటాయండీ... మన పొట్రాజుగారి చేష్టలు. ఇందులో పెద్ద ఇదేముందనుకుంటున్నారా? అయితే మీకింకో సీన్ చూపించాలి. అప్పుడుగాని అర్థం కాదు... పొట్రాజు ఫుల్ సైజ్ పిక్చరు. ఆ కాలనీలో సత్యానందమని ఓ పెద్దమనిషి ఉన్నాడు. పేరుకి పెద్దమనిషి కానీ, చేసేవన్నీ చిన్న పనులే... చిల్లర పనులే. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసే స్వాతి రూమ్‌లో, రహస్యంగా ఆమెకు తెలీకుండా నైట్ వాచ్‌మేన్‌గా పని చేసే అనిల్‌ని అద్దెకు దించుతాడీ సత్యానందం. రూమ్‌లో పగలు అనిల్ ఉంటాడు. రాత్రిళ్లు స్వాతి ఉంటుంది. స్వాతి రెంట్ ఓనర్‌కి. అనిల్ రెంట్ సత్యానందానికి. అన్నీ ఇలాంటి తిరకాసులే చేస్తుంటాడతను.ఆ రోజు వంట్లో బాగోక స్వాతి ఎర్లీగా రూమ్కొచ్చేస్తుంది. ఆ టైమ్‌కి రూమ్‌లో అనిల్ గుర్రుపెట్టి నిద్దరోతూ ఉంటాడు.సత్యానందం, అతని బామ్మర్ది చిట్టిబాబు ఓ గొప్ప అవుడియా వేసి అనిల్‌ని గోనె సంచిలో దాచేస్తారు. అందరికీ ఆ గోనె సంచెలో పనసకాయలున్నాయని చెబుతారు. కరెస్టుగా అదే టైమ్‌లో ఎంటరయ్యాడు పొట్రాజు.చిట్టిబాబుకి ఇంకో అవుడియా వచ్చింది. వెంటనే అప్లయ్ చేసి పారేశాడు. పొట్రాజుకి ఓ బంపర్ ఆఫరిచ్చాడు. 400 రూపాయలకే బ్రహ్మాండమైన పనసకాయలు. దాంతో సరోజిని దగ్గర తెగ గప్పాలు కొట్టేసి గంటలో 800 తీసుకొచ్చి ఇస్తానని తెగ బిల్డప్పులిచ్చి... డబ్బులు తెచ్చి చిట్టిబాబుకిచ్చాడు పొట్రాజు. కట్ చేస్తే - పనసకాయల్లేవ్. ఎమ్టీ గోనెసంచె ఎక్కిరిస్తోంది. లబోదిబోమన్నాడు పొట్రాజు. సరోజిని మళ్లీ తన కాలికి పని చెప్పింది. ‘‘నేనొప్పుకోను... నేనొప్పుకోను’’ అంటూ ఎగిరిపడి... ఫైనల్‌గా ‘‘అయితే ఓకే’’ అన్నాడు పొట్రాజు. అయినా బుద్ధి రాలేదు పొట్రాజుకి. ఉంగరం రిపేరు చేయించుకురమ్మని కంసాలి దగ్గరకు పంపించింది సరోజిని. దార్లో ఆ ఉంగరాన్ని చిట్టిబాబు లాగేసుకుని, ‘‘నాకివ్వాల్సిన డబ్బుకి చెల్లు’’ అన్నాడు. పొట్రాజుకి గుండెల్లో రాయి పడింది. సరోజిని మళ్లీ తన్నడం ఖాయం. అందుకే గూట్లో పెట్టానని, ఎవరో దొంగిలించి ఉంటారని అబద్దమాడేశాడు. పాపం పిచ్చి సరోజిని నమ్మేసింది. కానీ ఇక్కడ కథ వేరే మలుపు తిరిగింది. చిట్టిబాబులో పరివర్తన కలిగి ఉంగరం వెనక్కిచ్చేద్దామని వచ్చాడు. దాంతో పొట్రాజు అడ్డంగా బుక్కయిపోయాడు. ఇంకేముంది... మళ్లీ సేమ్ సీన్. ఆమె ఎగిరి తన్నడం... అతను ఎక్కడో పడటం... ఈసారి పొట్రాజు బుర్ర ఐమాక్స్ లెవెల్లో పనిచేసింది. ఉంగరం నుంచి నక్లెస్ దాకా డెవలప్ అయిపోయాడు.సరోజిని బీరువాలో పెట్టిన నెక్లెస్ కొట్టేసి సేటు అప్పు తీర్చేద్దామని బయలుదేరాడు. అక్కడికెళ్లాక... సేటు గుడ్లురిమాక... నాలుగు తగిలించాక తెలిసింది... కాదు తేలింది... అది గిల్టు నెక్లెస్ అని. సేటు మనుషులు కనిపిస్తే చంపేసేట్టున్నారు. పాపం పొట్రాజుకి ఎక్కడ దాక్కోవాలో తెలియలేదు. అందుకే క్రిస్మిస్ తాతలాగా మారువేషం వేసుకుని తన ఇంటి చుట్టుపక్కలే సంచరిస్తున్నాడు. ఇక్కడ సరోజినీ ఏమో - రెండ్రోజులుగా భర్త కనబడక కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. పొట్రాజు ఇక సీన్లోకి ఎంటరవుదామనుకునేసరికి - ‘గోపాలుడు- భూపాలుడు’... ‘రాముడు-భీముడు’... ‘హలో బ్రదర్’... ‘అదుర్స్’... సినిమాల్లోలాగా డబుల్ ఫోజింగ్లో ఇంకో పొట్రాజు ప్రత్యక్షమైపోయాడు. ‘‘ఈడెవడు... నాకు జిరాక్సులాగున్నాడు’’ అంటూ పొట్రాజు అగ్గగ్గలాడిపోయాడు. ఆ జిరాక్స్ గాడి మీద సరోజిని తెగ ప్రేమ ఒలకబోసేస్తోంది. తానే రియల్ మొగుణ్ణి అని చెప్పినా పొట్రాజుని పట్టించుకోవడం లేదు. పాపం... పొట్రాజు ఎలకల బోనులో ఇరుకున్న కోడిలాగా గిలగిల్లాడిపోయాడు.‘‘ఓరి దేవుడో... నా బతుకిలా అయిపోయింది. ఇక నేను బతికి లాభం లేదు’’ అని పొట్రాజు క్రై చేస్తూ... పిట్టగోడెక్కి సూసైడింగ్కి ట్రై చేస్తున్న టైమ్‌లో సత్యానందం ఎంటరయ్యాడు. ‘‘ఒరేయ్ పొట్రాజు... ఈడు నిజంగా జిరాక్సే. నీకు బుద్ధి రావాలనే ఇలా చేశాం’’ అంటూ ఆ జిరాక్సుగాడి ముఖం మీద నుంచి మాస్క్ తీసేశారు. దాంతో పొట్రాజు సికింద్రాబాద్ సిటీబస్సులో సీటు దొరికినంతగా సంబరపడిపోయాడు.సరోజినిని దగ్గరకు తీసుకున్నాడు. భర్త ప్రేమ చూసి సరోజిని కూడా పులకించిపోయింది. ‘‘మూడ్రోజుల నుంచి డూప్లికేట్గాడు ఇంట్లోనే ఉన్నాడుగా...’’ అంటూ సరోజిని చెవిలో ఏదో గొణిగాడు పొట్రాజు. టీవీ సీరియల్ మధ్యలో పవర్‌కట్ వస్తే ఎంత కోపం వస్తుందో, సరోజినికి అంత కోపం వచ్చేసింది. ఒక్క తన్ను తన్నింది. పొట్రాజు బొక్క బోర్లా పడ్డాడు. కుయ్యో... మొర్రో..! ఇంతకూ సరోజిని చెవిలో పొట్రాజు ఏమన్నాడంటారు?అయ్యో... మేం చెప్పకూడదు... మీరు వినకూడదు. సెన్సార్ కట్. అయితే మీకు ఓకే కదా! - పులగం చిన్నారాయణ -
కొడుకు గొంతుకోసి తల్లి ఆత్మహత్య
-
కొడుకు గొంతుకోసి తల్లి ఆత్మహత్య
ధర్మవరం : అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబకలహాలు, వేధింపులతో మనస్తాపం చెందిన ఓ మహిళ కన్న కొడుకును గొంతుకోసి హత్య చేసి అనంతరం తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన సోమవారం అనంతపురం జిల్లా ధర్మవరం మండలం మారుతీనగర్‌లో జరిగింది. వివరాల..గ్రామానికి చెందిన శ్రీరామంజీ స్థానికంగా మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య ప్రియాంక(28)తో గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. వీరికి ఒక కుమారుడు వంశీ (2) ఉన్నాడు. అయితే ఈ నేపథ్యంలో సోమవారం ప్రియాంక కత్తితో తన కొడుకు గొంతు కోసి, అనంతరం తన గొంతు కోసుకుంది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా రక్తస్రావం అయిన ప్రియాంకను వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నా లుక్ విషయంలో ప్రభాస్ కూడా కేర్ తీసుకున్నాడు : గోపీచంద్
‘‘ఇది స్నేహితులతో కలిసి చేసిన సినిమా. ప్రభాస్ పరిచయం అయినప్పట్నుంచీ వంశీ, ప్రమోద్‌తో నాకు పరిచయం ఉంది. ఈ చిత్రంలో నా లుక్ డిఫెరెంట్‌గా, చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దర్శక, నిర్మాతలతో పాటు నా లుక్ విషయంలో ప్రభాస్ కూడా కేర్ తీసుకున్నాడు. ఈ చిత్రం రషెస్ చూశాను. కథ ఎంత బాగా చెప్పాడో దర్శకుడు అంత బాగా తీశాడు. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది’’ అని గోపీచంద్ చెప్పారు. ఆయన కథానాయకునిగా, యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన చిత్రం ‘జిల్’. రాశీ ఖన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి రాధాకృష్ణకుమార్ దర్శకుడు. ఈ నెల 27న విడుదల కానున్న ఈ సినిమా ప్రచార చిత్రాన్ని హైదరాబాద్‌లో నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘ మిర్చి, రన్ రాజా రన్ వంటి విజయాల తర్వాత ఈ సంస్థ నుంచి వస్తున్న చిత్రం ‘జిల్’. ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తారనిపిస్తోంది’’ అన్నారు. ఇంకా ఈ వేడుకలో రాధాకృష్ణకుమార్, రాశీఖన్నా, వంశీ, ప్రమోద్ పాల్గ్గొన్నారు. -
దేవుడికి దగ్గరగా..
గల్లంతైన బాలుడు వంశీ మృతదేహం వెలికితీత తాత, మనుమడి మృతితో శోకసంద్రమైన కళత్తూరు తెప్ప ఎక్కనన్నా బలవంతంగా ఎక్కించానే అని తల్లిడిల్లుతున్న తల్లి స్పృహ కోల్పోరుున బాలుడి తల్లి, అమ్మమ్మ.. చెన్నైకి తరలింపు దేవుడిని చూడ్డానికి వచ్చి దేవుడి దగ్గరకే వె ళ్లిపోయూవా.. కొడుకా.. నువ్వు తెప్ప ఎక్కనన్నా.. నేనే బలవంతంగా మరీ ఎక్కించానే.. అండగా ఉండే తాతతో పాటు నువ్వూ తోడుగా వెళ్లిపోయూవా.. అంటూ తెప్ప బోల్తా పడిన ప్రమాదంలో మృతిచెందిన బాలుడు వంశీ తల్లి.. సుబ్రమణ్యం కుమార్తె మాలతి గుండెలవిసేలా రోదించడం గ్రామస్తులను కలచివేసింది. కళత్తూరులో మంగళవారం రాత్రి వేంకటేశ్వరస్వామి తెప్పోత్సవంలో చోటుచేసుకున్న అపశ్రుతిలో తాత, మనుమడి మృతితో గ్రామం శోకసంద్రమైంది. వరదయ్యుపాళెం: మండలంలోని కళత్తూరులో మంగళవారం రాత్రి తెప్పోత్సవంలో చోటుచేసుకున్న అపశ్రుతి లో కోనేరులో గల్లంతైన బాలుడి మృతదేహాన్ని బుధవారం వెలికితీశారు. బాలుడి తల్లి మాలతి సూళ్లూరు పేట పట్టణం కోళ్లమిట్టలో కొడుకు వంశీ, తండ్రి సుబ్రవుణ్యం, తల్లి విజయులక్ష్మితో కలిసి జీవిస్తోంది. వూలతి షార్ ఉద్యోగి. కళత్తూరులో వేంకటేశ్వర స్వామి తెప్పోత్సవానికి తెలిసిన వారి ఆహ్వానం మేరకు కుటుంబ సమేతంగా వచ్చింది. వంశీని తాత సుబ్రవుణ్యం తెప్ప ఎక్కమని పిలిచాడు. తెప్ప ఎక్కేందుకు ఇష్టపడని వంశీని తల్లి వూలతి దేవుడిని దగ్గరగా చూడొచ్చని చెప్పి ఎక్కించింది. తెప్పోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకోవడంతో తెప్ప కోనేరులో వుునిగి పోరుుంది. ప్రవూదంలో సుబ్రవుణ్యం అక్కిడిక్కడే వుృ తి చెందగా, వునవడు గల్లంతయ్యూడు. ఓవైపు తండ్రి వుృతదేహం పక్కన పెట్టుకొని వురో వైపు కొడుకు ఆచూకీ కోసం వూలతి హృదయువిదారంగా విలపించడం అక్కడివారికి కన్నీరు తెప్పించింది. ఈమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఆమె సృ్పహ కోల్పోరుుంది. వంశీ అవ్మువ్ము విజయులక్ష్మి ఈ సంఘటనను చూసి షాక్‌కు గురైంది. విజయులక్ష్మి, వూలతి పరిస్థితి ఆందోళనకరంగా వూరడంతో స్థానికులు చికిత్సనిమిత్తం చెన్నైకి తరలించారు. బాలుడి వుృతదేహం లభ్యం కోనేరులో గల్లంతైన వంశీ వుృత దేహాన్ని బుధవారం ఉదయుం 9.30 గంటల సవుయుంలో స్థానికులు వెలికి తీశారు. ప్రవూదం జరిగినప్పటి నుంచి అగ్నిమాపక సిబ్బంది సహకారంతో స్థానికులు బుధవారం ఉదయుం ఉత్సవ విగ్రహాలు, బాలుడు వుృత దేహం కోసం పలు దఫాలుగా తీవ్ర గాలింపు జరిపారు. ఉదయుం 9 గంటల సవుయుంలో ఉత్సవ విగ్రహా లను గుర్తించి ఒడ్డుకు చేర్చారు. విగ్రహాలకు సమీపంలోనే ఉన్న బాలుడు వుృత దేహం వెలికి తీసుకురావడంతోనే గ్రావుంలో తీవ్ర ఉద్వేగం నెలకొంది. వుృతదేహాలను పోస్టువూర్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పుత్తూరు డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలో వరదయ్యుపాళెం ఎస్ఐ వంశీధర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పుష్కరిణిలో పడి తాత మృతి.. మనుమడి గల్లంతు
వరదయ్యపాళెం: మండలంలో నిర్వహించిన తెప్పోత్సవంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో బాలుడు గల్లంతయ్యాడు. మండలంలోని కళత్తూరు గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ పుష్కరిణిలో మంగళవారం రాత్రి తెప్పోత్సవాలు నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పుష్కరిణిలో తెప్పపై స్వామి అమ్మవార్లను ఉంచి మూడు మార్లు విహరిస్తారు. మూడోసారి విహరించే ముందు రాత్రి 8.45 గంటలకు మాజీ ఎమ్మెల్యే తలారి మనోహర్ తెప్పపైకి వచ్చారు. అంతకుముందే దాదాపు 20 మంది తెప్పపై ఉన్నారు. ఆయనతో పాటు మరో వందమంది తెలుగుదేశం పార్టీ నాయకులు తెప్పపైకి ఎక్కారు. బరువుకు ఎక్కువ కావడంతో తెప్ప బోల్తాపడింది. దీంతో ఉత్సవమూర్తితో పాటు మాజీ ఎమ్మెల్యే, నాయకులు కింద పడిపోయారు. ఈ సమయంలో సూళ్లూరుపేటకు చెందిన సుబ్రమణ్యం(65) నీటిలో పడి మృతి చెందాడు. అతని మనుమడు వంశీ(11) పుష్కరిణిలో పడి గల్లంతయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాలచందర్ పెట్టిన పేరే జీవా
నన్ను నటుడిగా తీర్చిదిద్దింది... సినీ రంగానికి జీవాగా పరిచయం చేసింది ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ అని నటుడు జీవా తెలిపారు. పారిశ్రామికవేత్త పుట్టగుంట వెంకటసతీష్‌కుమార్ పరిశ్రమలో జరిగే నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు బుధవారం సాయంత్రం హనుమాన్‌జంక్షన్ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. వెయ్యికిపైగా సినిమాల్లో నటించి అన్ని వయసుల వారి ఆదరాభిమానాలు అందుకోవడం తన అదృష్టమన్నారు. తనకు నటుడిగా జన్మనిచ్చిన దర్శకుడు కె.బాలచందర్ మరణం తనకు 2014లో పెను విషాదం మిగిల్చిందన్నారు. ప్రశ్న : జీవాగా బాల చందర్ పరిచయంచేశారని అంటున్నారు.. మీ అసలు పేరు ఏమిటి? జవాబు : నా అసలు పేరు కొచ్చర్ల దయారత్నం. మహాదర్శకుడు బాలచందర్ పెట్టిన పేరుతో ప్రేక్షకులకు చేరువయ్యా. ప్రశ్న : మీ మొదటి చిత్రం ఏది? జవాబు : ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘తొలి కోడి కూసింది’. ప్రశ్న : ఆయన చిత్రానికి ఎలా ఎంపికయ్యారు? జవాబు : ‘తొలి కోడి కూసింది’ సినిమా కోసం నటులు కావాలని పత్రికల్లో ప్రకటన వచ్చింది. అది చూసిన నా స్నేహితులు నా ఫొటోలు పంపించారు. గుట్టలుగుట్టలుగా ఫొటోలు వచ్చినా సినిమా నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఒక్కరినీ కూడా ఎంపికచేయలేదు. ఆ విషయాన్నే బాలచందర్‌కు చెప్పారు. సంస్థ కార్యాలయం నుంచి వెళ్తున్న బాలచందర్‌కు ఫొటోల గుట్టల్లో రెండు కళ్లు కనిపించాయి. ఆ ఫొటోలో కుర్రాడికి కబురుపెట్టండని చెప్పడంతో సంస్థ ప్రతినిధులు నాకు టెలిగ్రామ్ ఇచ్చారు. ఆయనే నా పేరు కూడా మార్చి జీవాగా పరిచయం చేశారు. ప్రశ్న : మీరు తృప్తిపడింది విలన్‌గానా, హాస్యనటుడిగానా? జవాబు : రెండు పాత్రలూ రెండు కళ్లు వంటివి. ప్రతి ఒక్కరిలో అన్ని కోణాలూ ఉంటాయి. అయితే దర్శకుడు తమకు కావాల్సిన విధంగా నటుడిని మలుచుకుంటాడు. వంశీ, కృష్ణవంశీ, పూరిజగన్నాథ్ తదితర దర్శకులు నన్ను హాస్యనటుడిగా తీర్చిదిద్దారు. ప్రశ్న : ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం... జవాబు : నూతన సంవత్సరంలో ఎదుటి మనిషికి మంచి చేయకపోయినా ఫర్వాలేదు. కీడు మాత్రం తలపెట్టవద్దు. తెలుగు ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. -
ఇలాగొచ్చి అలా వెళ్లిపోయావా!
► ఒరేయ్ బిడ్డా...! ► నీకు గుర్తుందో లేదో కానీ నాకు మాత్రం బాగా గుర్తుంది. ► నేను హైదరాబాద్ కమలాపురి కాలనీలోని హుస్సేన్‌గారి అపార్ట్మెంట్లో ఉండేవాణ్ణి. ► ఆ ఎదురుగానే నిర్మాత జయకృష్ణ గారి సినిమా ఆఫీసు. ► నేను బయటికొస్తుంటే నువ్వు గేటు దగ్గర తగిలి, పరిచయం చేసుకున్నావ్. ► అప్పుడింత లావు లేవు... కొంచెం సన్నగా ఉన్నావ్ ► అగ్గగ్గలాడుతూ ‘నాకో ఛాన్సివ్వండి’ అనడిగావ్. ఇది జరిగిన నెలరోజుల తర్వాత- ‘ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమా పని మొదలైంది. మామూలుగా నా సినిమాలకు ఇళయరాజాగారే మ్యూజిక్కు. ఇదేమో చిన్న సినిమా. బడ్జెట్ సహకరించదు. హైదరాబాద్‌లో ఎవరున్నారా అని ఎంక్వైరీ చేస్తుంటే, ‘మళ్లి కూయవే గువ్వా’ పాట విన్నా. ఆ పాట నువ్వు చేసిందే! ‘ఇట్లు శ్రావణి - సుబ్రహ్మణ్యం’ సినిమాలోది. దాని డెరైక్టర్ పూరి జగన్నాథ్ గారిని నీ గురించి అడిగితే, ‘‘తక్కిన వాళ్లకంటే భిన్నంగా అతనిలో ఏదో ఉందండీ’’ అని చెప్పారు. దాంతో నిర్మాతకు నీ పేరే రికమండ్ చేశా.ఆ వేళ ఉదయం తొమ్మిదింటికి కంపోజింగ్ మొదలెట్టాలి. తొమ్మిదిన్నరైంది. నువ్వింకా రాలేదు. ‘మేస్ట్రో’ ఇళయరాజాతో చాలా సినిమాలలో పని చేసిన నాకు నువ్వెలా సింక్ అవుతావోనన్న బెంగ ఉంది. సాయంత్రం నాలుగు వరకూ చూసినా నువ్వు రాలేదు. నాకు భలే కోపం వచ్చేసింది. ‘‘అబ్బే... ఇతనితో కష్టం’’ అనేసుకుని కారెక్కిబోతుంటే నువ్వొచ్చావ్. షార్టు, బనీను వేసుకుని జాగింగ్‌కు వెళ్తున్నట్టుగా వచ్చావ్. ‘గుడీవినింగ్ సార్’ అని నువ్వు చెబితే, నేను కోప్పడి వెళ్ళిపోబోయాను. నువ్వు తెగ బతిమిలాడావ్. నాకు అప్పటికప్పుడు‘వెన్నెల్లో హాయ్‌హాయ్’ పాట వినిపిస్తే అక్కడికక్కడే చతికిలపడిపోయా. నీ మీద కోపమంతా పోయింది. నువ్వేదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా కూడా నేను పట్టించుకోలేదు. అప్పట్నుంచి నువ్వు నన్నొదల్లేదు. నేను నిన్నొదల్లేదు. ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ పాటలు ఎంత హిట్టయ్యాయో చెప్పక్కర్లేదు. ఆ తర్వాత నేను తీసిన ‘దొంగ రాముడు అండ్ పార్టీ’, ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా’, ‘గోపి-గోపిక-గోదావరి’, ‘తను మొన్నే వెళ్లిపోయింది’ సినిమాలకు నువ్వే మ్యూజిక్కిచ్చావ్. అన్నీ మంచి మంచి పాటలే. ‘వెన్నెల్లో హాయ్ హాయ్’, ‘నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల’ పాటలైతే రింగ్టోన్లుగా, కాలర్ ట్యూన్లుగా మార్మోగిపోయాయి కదా! నాకు లాంగ్ డ్రైవ్లిష్టం. నువ్వే నీ కారులో ఎక్కడెక్కడికో తిప్పేవాడివి. ఇద్దరం కలిసి రకరకాల తిండి తినేవాళ్లం. ఓసారి మీ ఊరు కంబాలపల్లి తీసుకెళ్లావ్. నువ్వొస్తున్నావని తెలిసి ఎంతమంది జనమో! ఎవరికి వాళ్లు నిన్ను పలకరించేవాళ్లే. ఇదంతా మ్యూజిక్ డెరైక్టర్‌గా నీ ఫాలోయింగ్ అనుకున్నా. కాదు... ఓ వ్యక్తిగా నీ ఫాలోయింగ్ అని తర్వాత తెలిసింది. మామూలుగా ఆగస్టు తొలి ఆదివార మో ఎప్పుడో ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటారు. కానీ నువ్వేమో ఫిబ్రవరి 10న ఓ ఫ్రెండ్షిప్ డే క్రియేట్ చేసుకున్నావ్. ఆ రోజు నువ్వు చేసే హంగామా అంతా ఇంతా కాదు. మహబూబాబాద్, వరంగల్, కంబాలపల్లి.... ఇలా రకరకాల ఊళ్ళ నుంచి నీ ఫ్రెండ్సంతా వచ్చేస్తారు. ఇక హైదరాబాద్ గ్యాంగ్ ఎలాగూ ఉంటారు. మార్నింగ్ ఎనిమిదింటికి మొదలెడితే నెక్ట్స్డే మార్నింగ్ వరకూ పండగే పండగ. చాలామంది సింగర్స్ నీ పాటలు పాడుతుంటే సంబరపడిపోయేవాడివి. మంచి ఫుడ్ పెట్టేవాడివి. ►నీ బర్త్‌డే రోజు కూడా అంతే... సందడి చేసేవాడివి. ► ఇలాంటివి ఏంటేంటో... అద్భుతాలు చేసేసేవాడివి. ► అన్నదానాలు, రక్తదానాలు కూడా చేసేవాడివి. ఓ రోజు నిన్ను జెల్ల కొట్టాను. ‘గట్టిగా కొట్టకండి’ అన్నావు నువ్వు. ‘ఏం... దేనికి’ అని నేను రెట్టిస్తే, ‘‘నేనొక వ్యవస్థను. నా మీద ఎంతో మంది ఆధారపడి ఉన్నారు’’ అంటూ నువ్వు నీ ట్రస్ట్ గురించి, నువ్వు చేసే సేవా కార్యక్రమాల గురించి చెప్పుకొస్తే చాలా అబ్బురపడిపోయాన్నేను. అప్పట్లో మనం ఎన్నోసార్లు కలుసుకునేవాళ్లం. ఎందుకో ఈ మధ్య నేను బిజీ అయిపోయి నిన్ను కలవడమే తగ్గిపోయింది. సరిగ్గా క్రితం వారమే అనుకుంటా కదా... నిన్ను కలిసింది. అప్పుడు నువ్వో మాటన్నావ్. ‘‘నెక్ట్స్ సినిమా ఓ అద్భుతం చేద్దాం’’ అని బలంగా చెప్పావు. నా లైఫ్‌లో చాలా చాలా అద్భుతమైన వ్యక్తుల్ని కలిశాను. నేను జీవితంలో డబ్బేమీ సంపాదించుకోలేదు. కానీ, అద్భుతమైన వ్యక్తుల సాంగత్యాన్ని సంపాదించుకున్నా. ఆ అద్భుతమైన వ్యక్తుల్లో నువ్వొకడివి. ఎవ్వరికీ సాయమే తప్ప హాని చేయని ఓ మరపురాని మనిషివి నువ్వు. అందరూ నువ్వీ భూమ్మీద నుంచి వెళ్లిపోయావంటున్నారు. నాకైతే నమ్మశక్యంగా లేదు. ఏ కంబాలపల్లో వెళ్లావనుకుంటున్నాను. అయినా నీకెందుకంత తొందర. ఇలాగొచ్చి మరీ... అలా వెళ్లిపోయావ్! నమ్మలేకపోతున్నా బిడ్డా! నీ వంశీ -
వెన్నెల కొంచెమే కురిసింది
మీరు సంపాయించి సర్దిన ఆ పాత సామాన్లలో ఒక సామనులా చూస్తున్నారా మనిషిని. తప్పు చేశారు. నఫీసాకి ప్రేమ కావాలి. తీసుకెళ్లి అది ఇవ్వండి. ‘సాబ్, ఈ చోర్ బజార్లో ఈ అమ్మాయి అమ్మకానికుంది. మీక్కావాలంటే కొనుక్కోవచ్చు... పది లక్షలు’’ అన్నాడు అబూ. కథ వెన్నెల కాంతికి అతని కుడిచేతి వేలికున్న ఉంగరం, ముంజేతికున్న కడియం మెరుస్తున్నాయి. షోడా కలిపిన స్కాచ్గ్లాసుని మృదువుగా సిప్ చేస్తా ఆ ఉంగరాన్నీ కడియాన్నీ చూసుకుంటున్నాడు జయపాల్.మహారాష్ట్రలో బీడు జిల్లాలో పర్లీ వైద్యనాథ్ అనే ఊరి జమీందార్ కొడుకైన జయపాల్‌రెడ్డి వయసు నలభై అయిదేళ్లు. పెళ్లి చేసుకోలేదు.జయపాల్కిష్టమైనవి స్కాచ్, షోడా, పైపుతో పాటు చేతికున్న ఉంగరం, కడియం కూడా.వాటిని తనకి ముందు తన తండ్రి వేసుకున్నాడు. అతనికి ముందు తాత, అలా వాళ్ల వంశీకులంతా వేసుకుంటా వస్తున్న ఈ రెండు వస్తువులూ తన శరీరంలో భాగాలైపోయాయి. రోడ్ నంబర్ సిక్స్‌లో రాక్ కేజిల్ గేటులోకెళ్లడానికి ముందున్న కొండ మీదున్న ఆ బంగళా జయపాల్‌రెడ్డి పూర్వీకులది. బ్రిటిష్ దొరల దగ్గరకొన్నారంటప్పుడు. లోపలంతా రకరకాల ఏంటిక్స్తో ఒక మ్యూజియంలాగుంటుంది.స్త్రీ కళ్లని చాలా పెద్దగా వేసే జెమినీరాయ్తో పాటు రామ్‌కుమార్, సింగాల్ లాంటి పాతకాలం పెయింటర్స్ వేసిన ఒరిజినల్ పెయింటింగ్స్ చాలా ఉన్నాయి. ఇంకా నూటయాభై ఏళ్లనాటి టేక్ వుడ్ రివాల్వింగ్ ఛెయిర్, రాగితో చేసిన గీజర్, మీర్ ఉస్మాన్ అలీ టాంగా చక్రాలు, ఇత్తడికేసున్న ట్యూబులైట్లూ, మార్లిన్ మన్రో బ్రా, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి ముక్కు బేసరి, చార్లీచాప్లిన్ చేతికర్ర, కణ్ణదాసన్ పెన్ను, డొక్కా సీతమ్మగారి చేతి గరిటె, నౌషాద్ హార్మోనియం, మీనాకుమారి చషకం, ద్వారం వెంకటస్వామినాయుడుగారి ఫిడేలు, సత్యజిత్‌రే పైపు, శ్రీశ్రీగారి కళ్లద్దాలు, సావిత్రి ఉంగరం... ఇలా చాలా రకాల వస్తువులు వాళ్ల బంగళా గోడల మీదా బల్లలపైనా ఆర్టిస్టిగ్గా అలంకరించి ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న వస్తువులు అద్దాల బీరువాల్లోనూ, మరీ చిన్నవి అద్దాల పెట్టెల్లోపల ముఖమల్ గుడ్డలకి గుచ్చీ ఉన్నాయి. ఆ వస్తువులన్నీ దేశంలో రకరకాల చోట్ల వేసిన ఆక్షన్లలో కొన్నవి. ఓల్డ్ సిటీలో శుక్రవారం తెల్లవారుఝాము పెట్టే జుమే రాత్ బజార్లో దొరికిన సామాన్లు కూడా చాలా ఉన్నాయిక్కడ. ఆవేళ శుక్రవారం. రాత్రి రెండు గంటలకి నిద్ర లేచిన జయపాల్ అరగంటలో తయారైపోయి కారెక్కి అఫ్జల్‌గంజ్ వచ్చేటప్పటికి మూడు దాటింది. ఎడంపక్కన నయాపూల్ బ్రిడ్జి, కుడిపక్కన కాళీమాత టెంపుల్ దానికెదురుగా జుమేరాత్ బజార్ జంక్షన్. కారు పార్క్ చేసి నడుస్తున్నాడా బజార్లో. అక్కడక్కడా నిజాం కాలం నాటి రంగు వెలిసిన భవనాలు. రోడ్డుకి రెండు పక్కలా సంతల్లో ఉల్లిపాయలూ, పచ్చిమిరపకాయలూ పోగులెట్టినట్టు రకరకాల చోట్ల దొంగతనాలు చేసుకొచ్చిన సామాన్ల పోగులు. ఒకచోట రకరకాల సెల్ఫోన్ల పోగు, పెద్ద మిక్సీల కుప్ప, కంప్యూటర్ల వరస, ఇంకోచోట రకరకాల సైజుల్లో రకరకాల బ్రాండ్స్ పాత బూట్లు, మరోచోట చిన్న పిల్లల్నుంచి పెద్దోళ్ల దాకా తొక్కుకునే సైకిళ్లు అన్నీ దొంగ సామాన్లే. పచ్చరంగేసిన మసీదు, పోచమ్మతల్లి గుడి, మున్నాసింగ్ నివాస్ దాటుతుంటే పెళ్లిళ్లప్పుడు ఊరేగింపులో కొత్త దంపతుల్ని తిప్పే టాంగా బళ్లు, పక్క దొడ్లో మేస్తున్న వాటికి కట్టే గుర్రాలు. నడుస్తున్న జయపాల్‌కి ఎదురొచ్చిన బ్రోకర్ అబూ ఒంగి సలాం చేశాడు. ఆ చోర్ బజార్లోకి కొత్తదేమొచ్చినా తనకి ఇన్ఫర్మేషనిచ్చేది ఇతనే. అతనితో పాటు నడుస్తున్న జయపాల్‌రెడ్డి, ‘‘నగరమంతా నిద్రపోతుంటే చీకట్లో ఈ బజారొక్కటే ఇక్కడ వెలిగిపోవడం... బాగుంది కదూ?’’ అన్నాడు. ‘‘ఇన్నాళ్ల నుంచీ బజార్‌కి వస్తున్నా మీకు ఎప్పటికప్పుడు కొత్తే సాబ్,’’ అన్నాడు అబూ. ఓ నిజాం కాలం నాటి ఇంట్లోంచి అప్పుడే నిద్రలేచి బయటికొచ్చిన ముసలి ఖాన్‌గారు బడే గులాం అలీ గజల్ పాడుకుంటున్నాడు బేస్ గొంతులో. ఎడం పక్కనున్న భజరంగ్ కిరాణాషాపు దాటిన వెంటనే హినాయత్ గంజ్ పోలీస్స్టేషనొచ్చింది. అది కూడా దాటాక కుడిపక్కనున్న ఝాన్సీలక్ష్మీబాయి విగ్రహానికెదురుగా పెద్ద పెద్ద పోగులు పెట్టి అమ్మేస్తున్నారు దొంగ బట్టలు, రకరకాల బ్రాండ్స్ ప్యాంట్లు, షర్టులూ. వాటి చుట్టూ మూగి ఏరుకుంటున్నారు కుర్రాళ్లు. ఇంకో పక్క చీరలూ, జాకెట్లు, ఆఖరికి బ్రాలు కూడా పరమ చౌకగా అమ్మేసుకుంటున్నారాడాళ్లు. ఆ దుకాణాల మధ్యలోంచెళ్తున్న అబూ, జయపాల్ ఇరుగ్గా ఉన్న సందులు, గొందులు దాటుకుంటూ ఒక వీధిలోకొచ్చేటప్పటికి మళ్లీ దుకాణాలు. పందొమ్మిది వందల ఇరవైల నాటి ఇత్తడి సీలింగ్ ఫ్యాన్, దొరల కాలం నాటి రోజ్‌వుడ్ రాకింగ్ ఛెయిర్, ఒక టేకు డెస్క్ పెట్టి, ఇత్తడి హరికేన్ లాంతర్లు, మనిషంత ఎత్తున్న గడియారం, గ్రిండిగ్ స్పూల్ టేప్ రికార్డర్. ఒంగుని ఒకో వస్తువునీ చూసే పన్లో పడ్డాడు జయపాల్. అంతలో వచ్చిన అక్తర్ అనే మనిషి అబూ చెవిలో ఏదో చెప్పెళ్లిపోయాడు. పెద్ద పెద్ద అంగలేసుకుంటూ జయపాల్ దగ్గరకొచ్చిన అబూ, ‘‘కొంచెం పక్కకొస్తారా సాబ్,’’ అనేసరికి వాడ్ని ఫాలో అయ్యాడు జయపాల్.ఒక చీకటి గల్లీ దాటుకుని ముందుకెళ్లాక అక్కడింకో నాలుగు దుకాణాలున్నాయి. అందులో ఒక దుకాణంలో కావ్యనాయికలా నిలబడుందో అమ్మాయి. ఎత్తుగా ఉంది. గులాబీరంగు శరీరం, పెద్ద కళ్లు, ఎర్రటి పెదాలు, నల్లటి జుట్టు, బొట్టులేని నుదురు... పేరు నఫీసా అంట. రెప్పార్పకుండా ఆ మనిషినే చూస్తున్న జయపాల్ ‘ప్రపంచంలో అందం ఇంత గొప్పగా ఉంటుందని ఇప్పుడే తెల్సింది’ అనుకున్నాడు. ‘‘సాబ్, ఈ అమ్మాయి అమ్మకానికుంది. మీక్కావాలంటే కొనుక్కోవచ్చు... పది లక్షలు’’ అన్నాడు అబూ. ‘‘ఏంటి?’’ ‘‘పదిలక్షలకి అమ్మాయి.’’ ‘‘ఏంటి?’’ చెప్పింది మళ్లీ మళ్లీ చెప్పిన అబూ, ‘‘టైమ్ లేదు డెిసిషన్ క్షణాల మీద తీసుకోవాలి మీరు. చాలా పోటీ ఉంది బయట.’’ ఏం మాటాడకుండా... నఫీసాని చూశాడు జయపాల్. పల్చగా నవ్వింది. జయపాల్ ఆలోచనల్లో పెద్ద సంచలనమే వచ్చింది. మరో ముగ్గురొచ్చి ఎగాదిగా ఆమెని చూస్తుంటే అబూని పిల్చిన జయపాల్, ‘‘డబ్బెవరికివ్వాలి?’’ అన్నాడు. అక్కడున్న దుకాణం యజమాన్ని దగ్గరికి పిల్చి, ‘‘ఇతని పేరు జాకీర్. నఫీసా యజమాని’’ అన్నాడు అబూ. ‘‘ఇంటి దగ్గరిస్తాను, నాతో రండి. అబూ నువ్వూ రా’’ అన్నాడు జయపాల్. మొత్తం నలుగురూ కారు దగ్గరికొచ్చేసరికి ఆ కొత్త కారు టైర్లు, డిజిటల్ సౌండ్ ప్లేయరూ, హారనూ కొట్టేశాడెవడో. అది చూసి పెద్దగా నవ్విన జయపాల్ క్యాబ్ తెప్పించి వాళ్లనెక్కించుకుని ఇంటి అడ్రస్ చెప్పాడు డ్రైవర్‌కి. జాకీర్‌కి పది లక్షలూ, మీడియేటర్‌గా పనిచేసిన అబూకి లక్షా ఇచ్చి పంపించేక, కుడిచెయ్యి చాపి నఫీసాని లోపలికి ఆహ్వానించాడు. నవ్వుతూ జయపాల్ చెయ్యి అందుకున్న నఫీసా అతని వేలి ఉంగరం, రిస్ట్కున్న కడియం లాక్కుని తన చేతికి తొడిగేసుకుంటుంటే, ‘వద్దు ఇవి నా ప్రాణం’ అని అరవడం మానేసి, ‘ఇవి నీవే తీసుకో’ అన్నట్టు నవ్వుతూ ఇచ్చేశాడు. వాళ్ల బంగళాలో ఉన్న గదుల్లోకెల్లా గొప్ప గదిని నఫీసా కోసం డెకరేట్ చేయించాడు. ఒకనాడు రాజులు నిద్రలు చేసిన పెద్ద పందిరి మంచం, పైన చెయ్యేస్తే అడుక్కి దిగబడిపోయేంత మెత్తటి పరుపు, సుతిమెత్తటి దిళ్లు, నల్లటి అంచున్న నీలం రంగు ఉలెన్ బ్లాంకెట్లు. పరుపు మెత్తదనానికి తనకి తెలీకుండానే నిద్ర పట్టేసింది నఫీసాకి. మెలకువొచ్చి కళ్లు విప్పేటప్పటికి ఒకానొక తన్మయత్వంతో తననే చూస్తున్నాడా జయపాల్‌రెడ్డి. మర్నాడు పొద్దుట వాళ్ల బంగళాలో ఈశాన్యం మూలగదిలో ఉన్న ఒ.పి.నయ్యర్ పియానోని చాలాసేపు చూసి, ఉత్తరం వేపు గది గోడలకున్న శోభాసింగ్, ఎస్సెమ్ పండిట్ల ఒరిజినల్ పెయింటింగ్స్‌ని పైప్ తాగుతూ ఇంకాస్సేపు పరిశీలించాక తూర్పువైపు గదిలో ఉన్న మీరాబాయి తంబురా, సోక్రటీస్ విషపాత్ర, కట్టబొమ్మన ఉరితాడు, భగత్‌సింగ్ తలపాగా తనివితీరా చూసొచ్చి చివర్లో నఫీసా గదిలోకడుగెట్టి ఆ ఏంటిక్స్ని చూస్తున్నట్టే ఈమెని కూడా తన్మయత్వంతో చూస్తా పైప్ వెలిగించి సోడా కలిసిన స్కాచ్ గ్లాసు అందుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి... తన ఇంట్లో వస్తువుల్ని చూసుకోవడం అయ్యాక నఫీసాని చూసుకుంటున్నాడు. అతని ప్రవర్తన ఒక రకమైన విసుగూ, చిరాకూ... ఒకోసారి విరక్తీ కలిగిస్తున్నాయి. పారిపోదామా అనిపిస్తుంది నఫీసాకి. ‘‘ఆడేదో ఊరికి జమీందారంట. కోట్ల ఆస్తంట. వజ్రాలు కూడా ఉన్నాయంట. నీకు అలవాటే గదా ఒక వజ్రం కొట్టి జంపయిపో, పంచుకుందాం’’ ఫోన్లో జాకీర్. ‘‘ఫోన్ కట్ చెయ్ రా,’’ నఫీసా. ‘‘ఆడి మీద మోజా... పూర్వం మనిద్దరం ఎన్ని చెయ్యలేదూ ఇలాంటి పన్లు...’’ జాకీర్. ‘‘ఎక్కువ వాగావంటే నిన్ను చంపి జైలుకెళ్తాను...’’ ఫోన్ కట్ చేసింది. ఆ సాయంత్రం బయటికెళ్లాడు జయపాల్‌రెడ్డి. చేతికున్న ఉంగరం, కడియం తీసక్కడ పెట్టేద్దాం అనుకుంది కానీ, తియ్యడానికి మనసొప్పుకోలేదు. ఎవ్వరికీ కనబడకుండా ఆ భవనం కొండ దిగి బయట కొంత దూరం నడిచి షేర్ ఆటో ఎక్కేసిందా నఫీసా. శుక్రవారం తెల్లవారుఝామున ఆ జుమేరాత్ బజార్లోకి అడుగెట్టేటప్పటికి సందడే సందడి. పెళ్లి ఊరేగింపు అప్పుడే అయిపోయినట్టుంది. ఆ టాంగా వచ్చి ఆగగానే ఒక కుర్రాడొచ్చి గుర్రాన్ని విప్పి, ఎదురుగా ఉన్న గుర్రపుశాలలోకి దాన్ని తీసుకెళ్లిపోయాడు. పక్కనే ఉన్న రంగులు వెలిసిన భవనంలో నిద్రపట్టని పిచ్చిదైన ముసలి డేన్సరు ఆ పచ్చని అద్దాల వెనుక ఆడతా పడిపోయింది. ఆ కాలంనాటి ఖవ్వాలీ వినిపిస్తుందెక్కడ్నుంచో. అది వింటా ఖలీల్ భాయి మటన్‌షాపు దాటుతుంటే... ఏ నర్సరీలో కొట్టేశారో దొంగలు ఖరీదైన బోన్సాయి మొక్కలు. వాటిని చవగ్గా అమ్మేస్తుంటే తెగ మూగుతున్నారు జనం. ఆ జనం వెనుక నిలబడుంది నఫీసా... దగ్గరికెళ్లాడు. మాయమైపోయింది. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేసే గౌస్ షాపు దాటాకా, ఫాతిమా ఫ్లోర్‌మిల్ దగ్గర నిలువెత్తు గడియారాలు నాలుగు. టైములు తేడా ఉండటం వల్ల రకరకాలుగా మోగుతుంటే వాటి వెనక నిలబడింది. దగ్గరకెళ్లాడు. కనబడలేదు. చాలా సన్నటి సందులూ గొందులూ దాటుకుంటూ ముందుకెళ్తే... పూజా కూల్‌డ్రింక్ షాపుకీ, షబ్బీర్ లాండ్రీ షాపుకీ మధ్య పెట్టుంది జాకీర్ దుకాణం. వాడి పక్కనే కూర్చున్న అబూ, జయపాల్‌రెడ్డిని చూడగానే లేచి దగ్గరికొచ్చాడు. ‘‘తనెళ్లిపోయింది’’ అన్నాడు బాధగా. ‘‘మీరు సంపాయించి ఇంట్లో సర్దిన ఆ పాత సామాన్లలో ఒక సామనులా చూస్తున్నారా మనిషిని. తప్పు చేశారు. ఆ మనిషి జీవితం నిండా అడిగో ఆ జాకీర్గాడి లాంటి ఎదవలే. నఫీసాకి ప్రేమ కావాలి. తీసుకెళ్లి అది ఇవ్వండి. అర్జంటుగా తీసుకెళ్లిపోండి సాబ్.’’ తప్పు చేసినట్టు తలొంచుకున్న జయపాల్ అలాగే అన్నట్టు తలూపాడు. అక్కడే ఉన్నట్టుంది, మెరుపులాగ వాళ్ల మధ్యలోకొచ్చేసింది నఫీసా. ముగ్గురూ కదుల్తుంటే దారికడ్డంగా నిలబడ్డ జాకీర్, ‘‘రీ సేల్ ఎమౌంట్ అయిదు లక్షలు’’ అన్నాడు. చెప్పు తీసిన నఫీసా వాడి చెంప మీదా, ముఖం మీదా టపాటపా కొట్టేటప్పటికి మట్టిలో పడిపోయాడా జాకీర్. వాత్సాయనుడి ‘కామసూత్రాలు’, వేణుదత్తుడి ‘ప్రీతికోసం’ ఇంకా స్మర ప్రదీపం, పంచసాయకం... ఈ గ్రంథాలన్నీ అమాంతంగా ఔపోసన పట్టేసిన జయపాల్ స్వర్గం చూపిస్తున్నాడా నఫీసాకి. ఎక్కడికెళ్లినా నఫీసా తోడుండాలి... ఏం చేసినా నఫీసా భాగస్తురాలు కావాలి! జాకీర్ ఫోన్ చేస్తున్నాడు. ‘‘మీ బంగళాలో ఖరీదైన సామాన్లు ఉన్నాయంట. మనుషుల్ని పంపిస్తాను, నాకు చేరెయ్యాలి. కాదన్నావంటే నా దగ్గరున్న ఏంటిక్ కత్తితో ఒకసారి పొడవను, పొడిచి పొడిచి చంపేస్తాను.’’ వాడి వాగుడికి నోట్లోంచి రాగూడని మాటలొస్తున్నాయి నఫీసాకి. రోజులు గడుస్తున్నాయి. జాకీర్ ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తుంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని హడలగొడ్తోంది. జయపాల్ లేని టైం చూసుకుని కొందరు దొంగల్తో దిగిపోయాడు జాకీర్. నఫీసా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేటప్పటికి వచ్చిన పోలీసులు జాకీర్ని, వాడి జనాన్నీ బాదుకుంటా తీసుకెళ్లిపోయారు. వాళ్లిద్దరూ రంగు రంగుల నీళ్ల వర్షం జల్లుల్లో తడుస్తా, వెచ్చావెచ్చని చలిమంటలు కాగుతున్నారు. ఇంత మధురంగా ఉంటుందని ముందే తెలియని, అప్పుడే తెలిసిన వాళ్లలా శృంగార రసాన్ని ఆరారా తాగుతా దాహం తీర్చుకుంటా నిశ్శబ్దంగా నిర్మించుకున్న రాదారిలో హాయిగా ముందుకెళ్లిపోతున్నారు. చాలా పౌర్ణమి రాత్రులూ, అమావాస్య రాత్రులూ వచ్చి వెళ్లాయి. నఫీసాకి గర్భం. అది తెల్సిన జయపాల్‌రెడ్డి పరమానందంతో ఊగిపోయాడు. నా వారసుడీ భూమ్మీదకి రాబోతున్నాడా... తల్చుకుంటేనే అదో రకం తన్మయత్వం... జయపాల్లోనూ, తనలోనూ ఆ ఆనంద సంబరాలు చూసుకుంటున్న నఫీసా, ‘ఈ జన్మకి ఈ అదృష్టం చాలు’ అంటా ఆకాశంలో ఉన్న అల్లాకి దణ్ణవెట్టుకుంటుంది. దీపావళి రోజులు దగ్గర పడుతుండగా తుఫాను.. ఎప్పుడూ కురుస్తా, ఎప్పుడన్నా ఆగే వర్షాలు, ఎప్పటికీ ఆగని వింత చలిగాలులు... ఇంకా ఆ దీపావళి రాకపోయినా కాంతులీనే కోటి దీపాలు వెలిగించుకుంటున్నాడు. ఆమె నవ్వుల్లా వెలిగే జారే మతాబులు, ఆమె కోపంలా చిరపరలాడ్తున్న కాకర పువ్వత్తులు... ఇంత బావుంటుందా జీవితం? ఎంత వేస్టయిపోయిందింత కాలం? పశ్చాత్తాపపడ్తుండగా కబురు... వాళ్ల ఊరైన పర్లీ వైద్యనాథ్కి ఎవరికీ చెప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి. అలా వెళ్లిన తను సిటీలోకి తిరిగి రావడానికి పదిహేను రోజులు పట్టింది. రాత్రి ఎనిమిదింటికి భవనంలోకి అడుగెట్టిన జయపాల్ నఫీసాని పిలిచాడు. మళ్లీ పిల్చాడు. బంగళా అంతా అరుస్తా వెతికాడు. కనిపించలేదు. అన్నం తినడం, నిద్రపోవడం మానేసిన జయపాల్... ఆ శుక్రవారం తెల్లవారుఝామున నఫీసాని వెతుక్కుంటా జుమేరాత్ బజార్లోకెళ్లాడు. ఇరుకు సందులు దాటి జాకీర్ దుకాణం పెట్టే చోటుకెళ్లాడు. అక్కడాడి దుకాణం లేదు. ముందుకి కదుల్తున్నవాడల్లా ఆ పక్క దుకాణంలో ఉంగరం, కడియం కనబడితే ఒంగి ఆత్రంగా చేతిలోకి తీసుకున్నాడు. ‘ఇవి నావే, నా నఫీసాకి తొడిగినవి’ అని వాటిని గుండెలకద్దుకుంటుండగా వచ్చిన అబూని చూసి, ‘‘నఫీసా మళ్లీ వెళ్లిపోయింది’’ అన్నాడు జయపాల్. అతని మాటలకి అదోలాగ నవ్వి, ఎటో చూసిన అబూ ఎప్పటికో అన్నాడు. ‘‘తనెళ్లిపోలేదు. తన రాజ్యం వదిలి తనెప్పటికీ వెళ్లిపోదు’’ అని. ‘‘జైలు నుంచి విడుదలై వచ్చిన జాకీర్గాడు మీ బంగ్లాకొచ్చి నఫీసాని ఎత్తుకొచ్చాడు. ఇద్దరికీ గొడవైంది. నఫీసా, జాకీర్జబ్బ మీద పొడిస్తే, ఆడా కత్తి లాక్కుని ఆ గర్భిణీ కడుపులో పొడిచి పారిపోయాడు. చచ్చిపోయింది సాబ్... ‘‘మీ కోసం ఎన్ని ఎంక్వైరీలు చేసినా మీ జాడ తెలీకపోవడంతో అనాథ అయిన ఆ మనిషి శవం కార్పొరేషనోళ్ల పాలైపోయింది.’’ - వంశీ -
మేల్కొన్న మానవత్వం
రోడ్డు ప్రమాదంలో ఎవరైనా మరణించారని అంటే జాలి చూపని మనిషి ఉండడు. తెలిసిన వాళ్లు అయినా, తెలియని వాళ్లు అయినా ప్రమాదంలో మరణించారని తెలిస్తే అయ్యోపాపం.. అని అంటాం. అయితే ప్రత్యక్షంగా కళ్లెదుట జరిగే ప్రమాదాల విషయంలో కూడా ఇలాంటి స్పందనే వ్యక్తం చేసే మనుషులు మనలో తక్కువ. ప్రయాణ సమయంలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా, బాధితులు కళ్ల ముందే కనిపిస్తున్నా... తమదారిన తాము వెళ్లిపోయే వాళ్లే ఎక్కువమంది. ఎందుకంటే... పనుల మొదలు పోలీసుల భయం... దాకా ఇలా ఎవరి కారణాలు వాళ్లకు ఉంటాయి. అలాంటి అనుభవమే ఎదురైంది వంశీ, వైశాలి దంపతులకు. ఉద్యోగస్తులైన ఈ భార్యభర్తలు ఇటీవల హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలో కారులో వెళుతున్నారు. అక్కడ ఒక చోట చాలా మంది గుమి కూడి ఉన్నారు. వారిని తప్పించుకొని కొంచెం తొంగిచూస్తే ఒక మనిషి రక్తపుమడుగులో పడి ఉన్నాడు. వయసుకు వృద్ధుడిలానే ఉన్నాడు. ఏదో భారీ వాహనం నడుస్తూ వెళుతున్న ఆ మనిషికి కొట్టేసి వెళ్లిపోయినట్టుగా జనాలు మాట్లాడుకొంటున్నారు. అక్కడ అయ్యోపాపం అనే మాటలు వినిపస్తున్నాయి కానీ... ప్రమాదాన్ని ఎదుర్కొన్న ఆ మనిషిని ఆసుపత్రికి తీసుకెళదామనే ఆలోచన ఎవరి రాలేదు. ఎవరూ అతడిని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడమే అందుకు రుజువు. ఈ పరిస్థితిని గమనించిన వంశీ, వైశాలి దంపతులు వినోదం చూస్తున్న మనుషులను పట్టించుకోకుండా... ప్రమాదంలో ఉన్న మనిషి గురించి ఆలోచించారు. తమ కారును తీసుకొచ్చి ప్రమాదానికి గురైన వ్యక్తిని బ్యాక్ సీటులో కూర్చోబెట్టి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనను అడ్మిట్ చేసి వైద్యం అందేలా చేసి వివరాలను కనుక్కోవడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఆయన పేరు క్రిస్టఫర్ అని తెలిసింది. కుటుంబ సభ్యుల వివరాలు తెలిశాయి. వాళ్లు వచ్చేంత వరకూ క్రిస్టఫర్ బాధ్యతను వంశీ, వైశాలి దంపతులే చూసుకొన్నారు. సమయానికి ఆయనను ఆసుపత్రికి తీసుకొచ్చిన ఆ దంపతులకు క్రిస్టోఫర్ కుటుంబీకులు ఎంతో కృతజ్ఞత చూపారు. ఈ విషయాన్ని వాళ్లే రోడ్క్రాఫ్ట్ అనే ఎన్జీవోకు తెలిపారు. ఆ ఎన్జీవో రోడ్డు ప్రమాద బాధితుల విషయంలో సిసలైన మనుషుల్లా ప్రవర్తించే వ్యక్తులను సత్కరిస్తూ ఉంటుంది. వంశీ, వైశాలి దంపతులకు కూడా ఆ ఎన్జీవో వాళ్లు ‘గుడ్ సమరిటన్’ అవార్డును ఇచ్చారు. ఇలాంటి అవార్డుల మాట ఎలా ఉన్నా.. వంశీ, వైశాలిలు మాత్రం అభినందనీయులు. -
సీరియల్ ‘అయితే ఓకే’
హాస్య నటుడు కొండవలస లక్ష్మణరావు - ఇంటర్వ్యూ కౌతవరం (గుడ్లవల్లేరు) : ప్రముఖ హాస్య నటుడు కొండవలస లక్ష్మణరావు ఇకపై టీవీ సీరియల్స్‌లో కూడా నటించనున్నారు. వంశీ దర్శకత్వంలో నిర్మితమైన ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’లో అయితే ఓకే.. డైలాగ్ చెప్పడం ద్వారా పాపులర్ అయినా కొండవలస ఇకమీదట సీరియల్స్‌లో నటించేందుకు ఓకే అనేశారు. ఆయన నటించే తొలి సీరియల్ షూటింగ్ గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో శనివారం నుంచి జరుగనుంది. శుక్రవారం జన్మదినం జరుపుకుంటున్న ఆయన షూటింగ్లో పాల్గొనేందుకు రాత్రి కౌతవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా కొండవలస ‘సాక్షి’తో ముచ్చటించారు. ప్రశ్న : మీ బర్త్‌డే ప్రత్యేకత ఏంటి? కొండవలస : నా జీవితంలో ఇది 68వ జన్మదినం. ఈ పుట్టిన రోజును మరచిపోలేను. ఎందుకంటే సీరియల్లో తొలిసారిగా నటిస్తున్నాను. ప్రశ్న : సీరియల్లో నటించడానికి కారణం? కొండవలస : ఈ సీరియల్ నిర్మాత చల్లపల్లి అమరప్రసాద్ నా బెస్ట్ ఫ్రెండ్. అందుకే నటిస్తున్నా. ప్రశ్న : ఇకపై సీరియళ్లలో నటిస్తారా? కొండవలస : అభ్యంతరం ఏమీ లేదు కానీ సమయపాలన ఉండదు. మాకూ పెద్ద వయసు వచ్చేసింది కదా.. కొంచెం ఇబ్బందే. ప్రశ్న : సినిమాలకు ముందు ఏం చేసేవారు? కొండవలస : విశాఖపట్నం పోర్టులో ఉద్యోగం చేసేవాడ్ని. ప్రశ్న : మీ స్వస్థలం ఏది? కొండవలస : మాది శ్రీకాకుళం జిల్లా కొండవలస. మా ఇంటి పేరూ అదే. ప్రశ్న : నాటక రంగ ప్రవేశం ఉందా? కొండవలస : ఉండటమేంటి? స్వీయ దర్శకత్వంలోనే 250నాటకాలను రాష్ట్రంలోని 2వేల చోట్ల ప్రదర్శించాం. ప్రశ్న : నాటకాల్లో మీ గురువు ఎవరు? కొండవలస :గురువు ఒకరేమిటి? ఇద్దరున్నారు. అత్తిలికి చెందిన కృష్ణారావు, హైదరాబాదుకు చెందిన చాట్ల శ్రీరాములు. శ్రీరాములు దర్శకత్వంలో మెలకువలు నేర్పారు. ప్రశ్న : నాటకాలకు ఎన్ని అవార్డులు వచ్చాయి? కొండవలస : 378అవార్డులతో పాటు రెండు నంది అవార్డులు లభించాయి. ప్రశ్న : సినిమాల్లో ఏవైనా అవార్డులు వచ్చాయా? కొండవలస : రాలేదు గాని గుంతకల్లుకు చెందిన కళాభిమానులు నాకు హాస్యరత్న అవార్డు ప్రదానం చేసి సత్కరించారు. ప్రశ్న : ఏ సంవత్సరంలో సినీ రంగంలోకి అడుగు పెట్టారు? కొండవలస :2003లో వంశీ దర్శకత్వంలో అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో సినీ రంగానికి పరిచయమయ్యా. ప్రశ్న : వంశీ పరిచయం ఎలా జరిగింది? కొండవలస : రెండువేల సంవత్సరంలో ద్రాక్షారామంలో నాటక ప్రదర్శనకు వెళ్లాను. ఆ నాటకాన్ని వంశీ చూశారన్న విషయమే నాకు తెలియదు. బస్సు కోసం హడావుడిగా వెళ్తుంటే ఆయన్ను పరిచయం చేశారు. నాటకం బాగోకపోయినా నీ యాక్షన్ బాగుందంటూ ఆయన కితాబిచ్చారు. ప్రశ్న : కొత్త సినిమాల్లో ఏమైనా నటిస్తున్నారా? కొండవలస : హాస్య నటుడు ధనరాజ్ హీరోగా నటిస్తున్న సినిమాలో అతనికి మామ పాత్రలో నటిస్తున్నా. నిర్మాత అడ్డాల చంటి సినిమాలో అవకాశం వచ్చింది. పసుపులేటి వెంకటరమణ తీస్తున్న సినిమాలో మరో అవకాశం రానుంది. ప్రశ్న : మీరు నటించే ఈ నేల.. ఈ గాలి ఈ సీరియల్లో మీ పాత్ర ఏమిటి? కొండవలస : ప్రముఖ నటుడు గౌతంరాజుకు మామ క్యారెక్టర్ చేస్తున్నాను. ఐతే ఓకే డైలాగ్ ప్రత్యేకత ఏమిటి? కొండవలస : అది నా సొంత డైలాగ్ కాదు. సితార సినిమాలో వాడేందుకు వంశీ రాసుకున్నారట. ఆ డైలాగ్‌ను నా క్యారెక్టర్‌కు వాడారు. -
కొత్తజంటకు బెదిరింపులు
-
చంపేస్తామంటూ ప్రేమజంటకు బెదిరింపులు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో కులాంతర ప్రేమవివాహం చేసుకున్నందుకు ఓ జంటను చంపేస్తామంటూ బంధువులు బెదిరిస్తున్నారు. నవ వధువు మాజీ ఎమ్మెల్యే మేనకోడలు. పెళ్లికి అమ్మాయి తరపు వారు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రేమజంట తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు మేనకోడలు అయిన సింధూర, వంశీ ఈ నెల 8న సింహాచలం అప్పన్న సన్నిధిలో పెళ్లి చేసుకున్నారు. అయితే సింధూర మైనరని, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సహించేదిలేదని, పురుగుల మందు కలిపి ఇద్దరినీ చంపేస్తామంటూ అమ్మాయి తరపు బంధువుల నుంచి బెదిరింపులు వచ్చాయి. నవ వధూవరులు మహిళా సంఘాల సాయంతో డీసీపీ శ్రీనివాసులును కలిశారు. తమకు రక్షణ కల్పించాల్సిందిగా అభ్యర్థించారు. -
యువ హీరోతో సినిమా
తెలుగు తెరపై దర్శకుడు వంశీది ఓ విభిన్నమైన సంతకం. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన ప్రతి చిత్రాన్ని ఆస్వాదించే అభిమానగణం ఉంది. తాజాగా వంశీ ఓ యువ హీరోతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. వంశీతో సినిమా చేయాలన్నది తన చిరకాల కోరిక అని, పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని నిర్మాత చెప్పారు. -
అక్కినేని- నాటా- వంశీ అవార్డ్స్ ఏర్పాటు
సాక్షి,సిటీబ్యూరో: పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పేర అంతర్జాతీయ సాంస్కృతిక సేవా సంస్థ వంశీ ఇంటర్నేషనల్, నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ వారి సహకారంతో ‘అక్కినేని- నాటా- వంశీ అవార్డ్స్‌ను ఏర్పాటు చేసినట్లు వంశీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు వంశీ రామరాజు శనివారం తెలిపారు. డల్లాస్‌లోని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి అధ్యక్షుడిగా అవార్డులను అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు అక్కినేని నాగార్జున తన నివాసంలో సంబంధిత బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ అవార్డ్స్‌ను జూలై 4,5,6 తేదీల్లో అమెరికాలోని అట్లాంటాలో జరిగే రెండవ నాటా మహాసభలో ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాదేవి, శైలజా తదితరులు పాల్గొన్నారు. అక్కినేని- నాటా- వంశీ -2014 అవార్డ్స్ గ్రహీతలు వీరే.. అమెరికాలో వివిధ రంగాల్లో రాణిస్తున్న డాక్టర్ ప్రేమ్‌రెడ్డి(లాస్ఏంజిల్స్), డాక్టర్ మలిరెడ్డి శ్రీనివాసులురెడ్డి( డెన్వర్), డాక్టర్ పి.మల్లారెడ్డి(న్యూజెర్సీ), గుమ్మడి ధర్మారెడ్డి (లాస్ఏంజిల్స్), ఏవీఎన్ రెడ్డి(హ్యూస్టన్), డాక్టర్ పొలిచెర్ల హర్నాథ్(డెట్రాయిట్), ఇందుర్తి బాలరెడ్డి(అట్లాంటా), డోక్క ఫణి( అట్లాంటా), ఆకునూరి శారదా (హూస్టన్), గుడ్ల మాధురి (ఫారిడా). -
బాలుడి ప్రాణం తీసిన ఈత సరదా
ఫైర్ సిబ్బంది సాయంతో మృతదేహం వెలికితీత కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు వర్ధన్నపేట, న్యూస్‌లైన్ : ఈత సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. స్నేహితులతో ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ బాలుడు బావిలో మునిగి మృతిచెందిన సంఘ టన మండల కేంద్రంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. వర్ధన్నపేటకు చెందిన వల్లెపు వెంకటేశ్వర్లు, ఉపేంద్ర దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు వంశీ(15) తన స్నేహితులైన బొంత సోమనాథం, వేణు ఇతర స్నేహితులతో కలిసి శనివారం ఉదయం 10 గంటలకు వర్ధన్నపేట శివారు కోనాపురం రోడ్డుకు ఆనుకుని ఉన్న బొంత యాకమల్లు వ్యవసాయ ఓడల బావిలో ఈతకు దిగాడు. ఈ క్రమంలో ఒడ్డు నుంచి వెళ్లి బావిలో దూకిన అతడు ఎంతకూ పైకి రాకపోవడంతో స్నేహితులు భయపడి పొరుగున ఉన్న రైతులను పిలిచారు. వారు ఎంత ప్రయత్నించినా బాలు డు దొరకకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వలలు, కొక్కెల సాయంతో ప్రయత్నించినా ఆచూకీ దొరకకపోవడంతో నీటిని తోడేందుకు రెండు విద్యుత్ మోటర్లను వినియోగించారు. సుమారు మూడు గంటల తర్వాత ఫైరింజన్, గజ ఈత గాళ్లను రప్పించి బావిలో నుంచి వంశీ మృతదేహాన్ని బయటకు తీశారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యూరు. ‘కొడుకా ఒక్కసారి మాట్లాడరా’ అంటూ తన ఒడిలోకి తీసుకుని తల్లి ముద్దులు పెడుతూ రోదించిన తీరును అందరిని కలచివేసింది. తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజయ్య, ఎస్సై రవీందర్ తెలిపారు. -
సంగీత వంశీ
కళ ఒక సంగీత దర్శకుడిగా ఎక్కువకాలం నిలబడాలంటే, సంగీతం మీద పిపాస, మంచి ట్యూన్స్ చేయాలనే ఆసక్తి, వృత్తి పట్ల నిబద్ధత, దీక్ష, కృషి, పట్టుదల ఇవన్నీ ఉండితీరాలి. వంశీకి ఇటువంటి బలమైన కోరికలు ఉంటే, ఉత్తమసంగీత దర్శకుడు అవడానికి అంతకన్నా ఇంకేం కావాలి. మ్యూజిక్... వెస్ట్రన్... రాక్... పాప్... నేటి తరానికి ఇదొక ప్యాషన్... ఇంటర్నెట్లో మ్యూజిక్ నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటూ... వాద్యపరికరాలను కూడా అందులోనే తీసుకుంటూ... స్వయంగా సంగీత దర్శకత్వం చేస్తున్నారు... పట్టుమని పాతికేళ్లు కూడా నిండకుండానే సంగీత ప్రపంచంలో... చిన్నదో పెద్దదో... తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకుంటున్నారు. లఘుచిత్రాలతో కెరీర్ ప్రారంభించి... చలనచిత్రాల స్థాయికి ఎదుగుతున్నారు... ‘ఓ సఖీ’ ఆల్బమ్ (టాప్ టెన్‌లో ఉంది) తో 2011లో సంగీత జీవితం ప్రారంభించి, చలనచిత్రాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేసే స్థాయికి ఎదిగాడు వంశీ. ‘‘నాకు చిన్నప్పటి నుంచి కీబోర్డ్ అంటే చాలా ఇష్టం. కీబోర్డులో సరిగమల అభ్యాసానికి నాన్నగారే శ్రీకారం చుట్టారు. నాకు చదువు మీద అంతగా శ్రద్ధ లేదు. అందువల్ల చదువు మానేసి హైదరాబాద్ వచ్చాను. హిందుస్థానీ, పాశ్చాత్యం... ఈ రెండు సంప్రదాయ సంగీతాలనూ నేర్చుకున్నాను. సంగీతంతో పాటు డిజిటల్ రికార్డింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్ నేర్చుకున్నాను. సంగీతం మీద ఉన్న అభిరుచి కొద్దీ, కొద్దిమంది మిత్రులతో కలసి ‘వేవ్ బ్యాండ్’ అని ఒక మ్యూజికల్ బ్యాండ్ ఏర్పాటుచేశాను’’ అంటూ వంశీ తన సంగీత ప్రయాణాన్ని వివరించారు. ‘పెళ్లి పుస్తకం’ లోని పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది’’ అంటున్న వంశీ యూ ట్యూబ్‌లో ప్రముఖుల సంగీత కచ్చేరీలు చూసి పరిజ్ఞానం పెంచుకుంటున్నారు. ఇప్పటి వరకు అనేక చలనచిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేశాడు. కొన్ని చిత్రాలకు అసిస్టెంట్‌గానూ చేశాడు. ఒక పక్కన సంగీతం నేర్చుకుంటూనే మరో పక్క అతి కష్టం మీద పదవ తరగతి పూర్తి చేశాడు. ‘స్వామిరారా’, ‘ఉయ్యాలా జంపాలా’ వంటి చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన సన్నీ దగ్గర అసిస్టెంట్ ఆడియో ఇంజనీర్‌గా కొన్ని నెలలు పనిచేశాక, తాను చేస్తున్న పని పట్ల అంత సంతృప్తి కలగలేదు. ‘‘కీ బోర్డు నేర్చుకోవాలనే కోరిక నానాటికీ పెరుగుతూ వచ్చింది. దాంతో ఉద్యోగం వదిలేసి, పూర్తి సమయాన్ని కీ బోర్డు నేర్చుకోవడం కోసం కేటాయించాను’’ అని చెబుతాడు వంశీ. సినిమా సంగీతానికి ఎంతో అవసరమైన పాశ్చాత్య సంప్రదాయ సంగీతం తనకు తానుగా నేర్చుకున్నారు. పెద్దపెద్ద సంగీత దర్శకుల దగ్గర కీబోర్డు ప్లేయర్‌గా పనిచేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో... ఋషి, కెమిస్ట్రీ, సరదాగా అమ్మాయితో, రొమాన్స్, నువ్వలా నేనిలా, పట్టపగలు... చలనచిత్రాలకు నేపథ్య సంగీతం అందించారు. ‘‘పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే మంచి సంగీతం చేయాలి. నా వరకు నేను మెలొడీలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాను. సంగీతం, సాహిత్యం, ఆర్కెస్ట్రా... ఒకదాన్ని ఒకటి డామినేట్ చేయకుండా ఉండేలా చూస్తున్నాను. ఆర్కెస్ట్రా తగ్గించి, భావం అర్థమయ్యేలాగ చేస్తున్నాను’’ అని చెప్పే వంశీకి ఇళయరాజా అంటే చాలా ఇష్టం. పరోక్షంగా ఆయన ప్రభావం తన మీద ఉందనీ, త్వరలోనే తనకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చేలాంటి పాటలు చేస్తానని అంటున్నారు. సంగీతం చేస్తున్నప్పుడు అందరితోనూ స్నేహంగా ఉంటూ తనకు కావలసిన విధంగా వాళ్ల దగ్గర నుంచి రాబట్టుకుంటున్నారు. ఎంఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చిన జనగణమన, పెళ్లి పుస్తకం, ప్రేమపకోడీ, హూ ఆర్ దే? పొసెసివ్‌నెస్, మధురమే, చిట్టితల్లి... లఘుచిత్రాలకు సంగీతం చేశారు వంశీ. ‘‘పెళ్లిపుస్తకం’ పాటకు 2.5 లక్షల హిట్స్ వచ్చాయి. నాకు మంచి పేరు కూడా వచ్చింది’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు వంశీ. - డా. వైజయంతి -
ఆశ్చర్యపరిచే రన్...
‘‘ఓ కొత్త లుక్‌లో ఉండే సినిమా ఇది. శర్వానంద్ పాత్రచిత్రణ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ప్రేమ, వినోదాల కలబోతగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉంది’’ అని దర్శకుడు సుజీత్ చెప్పారు. ప్రభాస్‌తో ‘మిర్చి’ వంటి బ్లాక్ బస్టర్ తీసిన యు.వి.క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం ‘రన్ రాజా రన్’. శర్వానంద్, సీరత్ కపూర్ ఇందులో హీరో హీరోయిన్లు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘కథకు ఈ టైటిల్ చక్కగా సరిపోతుంది. ‘మిర్చి’కి పని చేసిన మది ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ‘విశ్వరూపం-2’ చిత్రానికి సంగీతం చేసిన ఝిబ్రాన్. యమ్ దీనికి మంచి స్వరాలిచ్చారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అశోక్, లైన్ ప్రొడ్యూసర్: సందీప్. -
భానుప్రియ-వంశీ కాంబినేషన్ అంటేనే...
ముందుతరం సినీ హీరోయిన్ భానుప్రియ అనగానే ఆమె విశాల నేత్రాలు, రూపలావణ్యం, అభినయం, ఆమె నాట్యం, వంశీ కాంబినేషన్.. ఒకటి వెంట ఒకటి వరుసగా గుర్తుకు వస్తాయి. డ్యాన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రావీణ్యం అందరికీ తెలిసిందే. అటువంటి చిరంజీవికి సమఉజ్జీగా నాట్యం చేసి మెప్పించారు. 1967 జనవరి 15న భానుప్రియ జన్మించారు. ఈ రోజు ఆమె పుట్టిన రోజు. అభినేత్రి అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం ఆమె. తన అభినయంతో తెలుగువారిని పులకింపచేసింది. అద్భుతమైన నాట్యాన్ని ప్రదర్శించడమే కాకుండా, వివిధ పాత్రల్లో తనదైన బాణీ పలికించింది. 1980-1993 మధ్య కాలంలో హీరోయిన్గా పలు చిత్రాలలో నటించి ఓ వెలుగువెలిగారు. ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసే నైపుణ్యంలో ఆమెలో ఉంది. తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషలలో దాదాపు 110 చిత్రాలలో ఆమె నటించారు. 'సితార' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన భానుప్రియ, దర్శకుడు వంశీ కాంబినేషన్లో పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు. వంశీ, భానుప్రియ కాంబినేషన్ సినిమాలను అత్యధికమంది ఇష్టపడేవారు. వారి కాంబినేషన్లో సంగీత, నృత్య ప్రధానంగా వరుసగా అనేక చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులకు నచ్చాయి. నటిగా, నర్తకిగా తనదైన ప్రత్యేక బాణీ పలికించిన భానుప్రియ నాటి అగ్రహీరోలందరి సరసన నటించారు. తెలుగు ప్రేక్షకులు మరచిపోలేని తారగా నిలిచారు. చిరంజీవి స్టార్ హీరోగా రాజ్యం చేస్తున్న రోజుల్లోనే భానుప్రియ అరంగేట్రం చేశారు. చిరంజీవి అంటే అప్పట్లో స్పీడ్ డాన్సులకు పెట్టింది పేరు. భానుప్రియ ఆయనతో సమవుజ్జీగా స్టెప్పులు వేసి అభిమానులను అలరించారు. వారిద్దకి కాంబినేషన్ అదుర్స్. చిరంజీవి కూడా ఒక సందర్భంలో భానుప్రియతో కలసి డాన్స్ చేయడంలో ఎంతో ఆనందం ఉందని కితాబిచ్చారు. నందమూరి బాలకృష్ణ విజయవిహారం చేస్తున్న సమయంలోనే భానుప్రియ కూడా తెలుగునాట అడుగు పెట్టారు. బాలకృష్ణ, భానుప్రియ జంట ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసింది. బాలకృష్ణ సొంత చిత్రాల్లో భానుప్రియ నాయికగా జయకేతనం ఎగురవేయడం విశేషం. మరో టాప్ హీరో వెంకటేశ్‌తోనూ భానుప్రియ జోడీ కట్టిన చిత్రాలు విజయవంతమయ్యాయి. వారిద్దరూ జంటగా నటించిన సినిమాలు జనాన్ని ఎంతగానో అలరించాయి. తెలుగు, తమిళ చిత్రరంగంలో ఓ వెలుగు వెలిగిన భానుప్రియ బాలీవుడ్‌పై కూడా కన్నేశారు. అయితే అక్కడ ఆమె అంతగా రాణించలేక పోయారు. 'ఖుద్గర్జ్, ఇన్సాఫ్ కీ పుకార్, మార్ మిటేంగే" వంటి హిందీ చిత్రాల్లో భానుప్రియ నటించారు. భరత నాట్య కళాకారిణి సుమతీ కౌషల్ కుమారుడు, అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌషల్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. వారికి అభినయ అనే అమ్మాయి ఉంది. కారణాలు ఏవైనా భార్యాభర్తలు విడిపోయారు. ప్రస్తుతం భానుప్రియ తనకెంతో ఇష్టమైన దక్షిణ భారతదేశ ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యరీతులైన కూచిపూడి, భరతనాట్యం శిక్షణ, ప్రదర్శనలతో కాలక్షేపం చేస్తున్నారు. తగిన పాత్ర లభించినప్పుడు టివి సీరియల్స్, సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. భానుప్రియకు పుట్టిరోజు శుభాకాంక్షలు. భానుప్రియ నటించిన కొన్ని ముఖ్యమైన సినిమాలు: సితార - రౌడీ - రామాయణంలో భాగవతం - ప్రేమించు-పెళ్లాడు - మొగుడూపెళ్లాలు - ఇల్లాలికో పరీక్ష - అన్వేషణ - చిరంజీవి - జ్వాల - పల్నాటి పులి - విజేత - అపూర్వ సహోదరులు - ఆలాపన - దొంగమొగుడు- చక్రవర్తి - జేబుదొంగ - స్వర్ణకమలం - ఖైదీ నంబర్ 786 - త్రినేత్రుడు - బ్లాక్ టైగర్ - స్టేట్ రౌడీ - ఏడుకొండలస్వామి - పెదరాయుడు - మామా బాగున్నావా? - అన్నమయ్య - ఛత్రపతి - గౌతమ్ ఎస్.ఎస్.సి.- అమెరికా అల్లుడు- పెదరాయుడు. s.nagarjuna@sakshi.com -
విభజన బిల్లును సమైక్యంగా వ్యతిరేకించాలి: అశోక్‌బాబు
చిలకలూరిపేట, న్యూస్‌లైన్: విభజన బిల్లు సీమాంధ్రపాలిట మారణశాసనమని, పార్టీలు విభేదాలు పక్కనపెట్టి కలసికట్టుగా అసెంబ్లీలో బిల్లును వ్యతిరేకించాలని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు చెప్పారు. సోమవారం ఒంగోలు నుంచి గుంటూరు వెళ్తూ మార్గమధ్యంలో తహశీల్దార్ కార్యాలయంలో చిలకలూరిపేట ఎన్జీవోల సంఘం, ఉద్యోగసంఘాలు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమని, బిల్లుపై కేంద్రప్రభుత్వం వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోకపోవచ్చని అభిప్రాయపడ్డారు.రాజకీయాలకు తమకు ఎటువంటి సంబంధం లేదని, తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశంలేదని స్పష్టం చేశారు. ఈ నెల 20 నుంచి 23 వరకు అసెంబ్లీలో జరిగే కీలకఘట్టానికి అనుగుణంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు. సీమాంధ్ర ఎమ్మెల్యేల్లో ఐక్యత కనిపించడం లేదన్నారు. ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకుడు మతాలను కించపరిచే విధంగా మాట్లాడడం సబబుకాదన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ వంశీ మాట్లాడుతూ పార్టీలకతీతంగా అసెంబ్లీలో ఓటింగ్‌లో పాల్గొని బిల్లును ఓడించాలని కోరారు. సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొబ్బరాజు వెంకటేశ్వర్లు, చిలకలూరిపేట తాలూకా ఎన్జీవో సంఘం అధ్యక్షుడు ఎన్.నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
తను మొన్నే వెళ్లిపోయింది ఆడియో వేడుక హైలెట్స్
-
వంశీ - స్టార్ స్టార్ సూపర్ స్టార్
-
నన్నంతా జూనియర్ షారుక్ అంటుంటారు - జాకీర్
పదేళ్లు.. ఎనిమిది సినిమాలు. జాకీర్ సాధించిన స్కోర్ ఇది. చేసిన సినిమాల సంఖ్య చాలా చాలా తక్కువ. కానీ జాకీర్ మాత్రం ఫేమస్. అది తన అదృష్టం అంటారాయన. జాకీర్ తొలి చిత్రం ‘బ్యాచిలర్స్’. ఆ చిత్రంలో ఓ హీరోగా నటించి, ఆ తర్వాత ‘కుచ్చి కుచ్చి కూనమ్మ’, ‘ది ఎండ్’ తదితర చిత్రాల్లో నటించారు. ‘కుచ్చి కుచ్చి..’కి నంది అవార్డు కూడా సాధించారు. నటుడిగానే కాకుండా ‘బ్యాచిలర్స్ 2’ ద్వారా దర్శకుడిగా కూడా మారారు. ప్రస్తుతం ‘విడుదల’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ, నటిస్తున్నారు. ఇక... జాకీర్‌తో మాట్లాడదాం... *** పదేళ్లల్లో పట్టుమని పది సినిమాలు కూడా చేయలేకపోయారు.. అసంతృప్తి ఏమైనా ఉందా? అసంతృప్తి లేదు. సినిమాలంటే చాలా ఇష్టం. ఎప్పటికీ ఈ రంగంలోనే ఉండాలని ఫిక్స్ అయ్యాను. ఏమీ సాధించలేకపోయాం అని బాధపడిపోవడానికి నా కెరీర్‌కి ఫుల్స్టాప్ పడలేదు. ప్రస్తుతం వంశీగారు దర్శకత్వం వహిస్తున్న ‘తను మొన్నే వెళ్లిపోయింది’ చిత్రంలో మంచి పాత్ర చేస్తున్నాను. అంత పెద్ద దర్శకుడి సినిమాలో అవకాశం రావడం హ్యాపీ. *** మరి.. ఎందుకు ఎక్కువ సినిమాలు చేయలేకపోయారు? ‘బ్యాచిలర్స్’ తర్వాత చాలా అవకాశాలొచ్చాయి. కానీ ఏది చెయ్యాలి? ఏది వదులుకోవాలి? అనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉండేది కాదు. దాంతో సినిమాల ఎంపిక విషయంలో కొంచెం పొరపాటు చేశాను. సరైన గెడైన్స్ లేకపోవడంవల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాను. *** ‘బ్యాచిలర్ 2’ ద్వారా దర్శకుడిగా మారడానికి కారణం? నా మనసులో ఉన్న ఆలోచనలను తెరపై చూసుకోవాలనుకున్నాను. అందుకే ఆ సినిమాకి దర్శకత్వం వహించాను. ఇప్పుడు ‘విడుదల’ అనే సినిమా దర్శకత్వం వహించాను. ఇందులో నేనే లీడ్ రోల్ చేశాను. జైలు నుంచి విడుదలైన తర్వాత, ఓ వ్యక్తి జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అనేది ఈ చిత్రం కథాంశం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. *** ఒకవైపు డెరైక్షన్.. మరోవైపు యాక్టింగ్.. ఈ రెంటిలో దేనికి ప్రాధాన్యం? కచ్చితంగా నటనకే. యాక్టింగ్ మీద ఇంట్రస్ట్‌తోనే పరిశ్రమకు వచ్చాను. మంచి కథ కుదరడంతో ‘బ్యాచిలర్స్ 2’కి, ఇప్పుడు ‘విడుదల’కు దర్శకత్వం వహించాను. ఇకముందు ఎప్పుడైనా మంచి కథ కుదిరితే డెరైక్షన్ చేస్తాను. ప్రధానంగా యాక్టింగ్పైనే దృష్టి. *** హీరోగా, కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రమేనా.. విలన్‌గా చేసే ఉద్దేశం ఉందా? చేయాలనే ఉంది. మన తెలుగు పరిశ్రమలో తెలుగు మాట్లాడే విలన్లు పెద్దగా లేరు. నాలాంటి వాళ్లకి అవకాశం ఇస్తే.. విలన్‌గా కూడా నిరూపించుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తాం. *** మీరు జూనియర్ షారుక్ ఖాన్‌లా ఉంటారని ఎవరైనా అన్నారా? చాలామంది అంటుంటారు. బాలీవుడ్ బాద్షా అనిపించుకున్న షారుక్‌తో పోల్చడం ఆనందమే.