‘‘క్రైమ్, కామెడీ, యాక్షన్‌గా ‘గం..గం..గణేశా’ సినిమా రూపొందింది. మరీ ముఖ్యంగా ఇందులోని వినోదం ఆకట్టుకుంటుంది. మన స్నేహితుల్లో ఎవరో ఒకరు మనల్ని సమస్యల్లో ఇరికిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో వచ్చే వినోదం ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తుంది’’ అని నిర్మాత వంశీ కారుమంచి అన్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గం..గం.. గణేశా’. ఉదయ్ శెట్టి దర్శకుడు.
హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై వంశీ కారుమంచి, కేదార్ సెలగంశెట్టి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా వంశీ కారుమంచి మాట్లాడుతూ–‘‘నాది గుంటూరు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. అమెరికాలో ఉద్యోగం, వ్యాపారం చేశా. కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను. ఇండియాలోనే స్థిరపడాలనుకున్నప్పుడు సినిమాలు నిర్మించాలనే ఆలోచన ఉండేది.
ఉదయ్ కథ చెప్పగానే ఆనంద్‌కి సరి΄ోతుందనిపించింది. కొంత ఆకతాయిగా, జులాయిగా ఉండే పాత్ర తనది. గణేష్ విగ్రహం, డబ్బుతో ముడిపడిన యాక్షన్ కామెడీ సినిమా ‘గం గం గణేశా’. ఇద్దరి హీరోయిన్ల పాత్రకి మంచి ప్రాధాన్యం ఉంది. సినిమా ఇండస్ట్రీ చూసేందుకు చిన్నదిగా కనిపించినా లక్షల మంది దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం రెండు కథలు ఫైనలైజ్ చేస్తున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment