
పాటల రచయిత అనంత శ్రీరామ్ ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) అవార్డు అందుకున్నారు. ‘బేబి’ సినిమాలోని ‘ఓ రెండు మేఘాలిలా..’ పాటకు ఈ అవార్డు వచ్చింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బేబి’. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ నిర్మించిన ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికిగానూ ‘ఓ రెండు మేఘాలిలా..’ పాటకు బెస్ట్ లిరిక్ రైటర్‌గా అనంత శ్రీరామ్ తాజాగా ఐఫా అవార్డు అందుకోవడంతో ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ కలిసి అనంత శ్రీరామ్‌ను అభినందించారు.
‘‘బేబి’ మూవీకి ఇప్పటిదాకా ఫిలింఫేర్, సైమా, గామా వంటి అనేక గొప్ప పురస్కారాలు దక్కాయి. తాజాగా ఐఫా దక్కడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు ప్రేక్షకుల రివార్డ్స్‌తో పాటు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కుతున్నాయంటే ఆ ఘనత సాయి రాజేశ్‌కే దక్కుతుంది. ఈ ప్రేమ కథను హృద్యంగా తెరపై ఆవిష్కరించారాయన’’ అని మేకర్స్ తెలిపారు. కాగా ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్‌లో ‘బేబి’ సినిమా బాలీవుడ్‌లో రీమేక్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment