Anantha Sriram
-
ప్రభాస్ 'కల్కి' సినిమా.. అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్!
టాలీవుడ్ పాటల రచయిత అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు సినిమాల్లో హైందవ ధర్మాన్ని వక్రీకరిస్తున్నారని అన్నారు. సినిమాలు వ్యాపారమే అయినప్పటికీ హిందూ ధర్మాన్ని కించపరచడం సరికాదని హితవు పలికారు. ఇలా వక్రీకరణకు పాల్పడుతున్నందుకు ఒక సినిమా వ్యక్తిగా తాను సిగ్గు పడుతున్నట్లు శ్రీరామ్ అన్నారు. చిత్రపరిశ్రమ తరపున నేను క్షమాపణలు చెబుతున్నా అని మాట్లాడారు. హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలను మనం తిరస్కరించాలని సూచించారు. విజయవాడలో ఆదివారం జరిగిన హైందవ శంఖారావం సభలో ఆయన మాట్లాడారు.కల్కి చిత్రంపై ఆరోపణలు..సినిమాల్లో హైందవ ధర్మంపై మూడుకోణాల్లో జరుగుతోందని అనంత శ్రీరామ్ ఆరోపించారు. తెరపైన కనిపించే పాత్రలు...వినిపించే పాటల్లో హైందవ ధర్మం దుర్వినియోగం.. కావ్యేతిహాసపురాణాల వక్రీకరణ.. తెరవెనుక మా ముందు అన్యమతస్తుల ప్రవర్తన అని తెలిపారు. వినోదం కోసం వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతాన్ని వక్రీకరిస్తున్నారని అన్నారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రకు అనవసర గొప్పతనం ఇచ్చినందుకు సినిమా పరిశ్రమ వ్యక్తిగా సిగ్గుపడుతున్నా అని తెలిపారు. మూడు కోణాల్లో దాడి..అనంత శ్రీరామ్ మాట్లాడుతూ..'సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి మూడు కోణాల్లో జరుగుతోంది. కావ్యేతిహాస పురాణాలను వక్రీకరించడం, తెర మీద కనిపించే పాత్రలు, పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, తెరవెనక, మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతం భారత సాహితీ, వాంగ్మయ శరీరానికి రెండు కళ్లలాంటివి. కానీ అదే రామాయణం, మహభారతాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కొకోల్లలు. గత కొన్నేళ్ల క్రితం వచ్చిన సినిమాల నుంచి.. నిన్న, మొన్న విడుదలైన కల్కి చిత్రంలో కూడా కర్ణుడి పాత్రకు అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నా. ఈ విషయాన్ని నిర్మొహమాటంగా చెబుతున్నా. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డమీదే చెబుతున్నా. అప్పటి చిత్ర దర్శకులు.. ఇప్పటి సినిమా నిర్మాతలు ఇదే జిల్లాకు చెందినవారైనా సరే పొరపాటును పొరపాటు అని చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్లు కాదు.. హైందవ ధర్మాన్ని ఆచరించినట్లు కాదు.. హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థమని గంటాపథంగా తెలియేజేస్తున్నా' అని అన్నారు. కృష్ణాజిల్లా గడ్డపై నిలబడి చెబుతున్నా..అనంతరం మాట్లాడుతూ..'కల్కి సినిమాలో అగ్ని దేవుడిచ్చిన ధనుస్సు పట్టిన అర్జునుడి కంటే... సూర్యదేవుడిచ్చిన ధనుస్సు పట్టిన కర్ణుడు వీరుడని చెప్పారు. ఇలాంటి అభూతకల్పనలు... వక్రీకరణలు జరుగుతున్నా మనం చూస్తూ ఊరుకుంటే ఎన్ని సినిమాలైనా వస్తాయి. చిత్రీకరణ,గీతాలాపనలో ఎన్నో రకాలుగా వక్రీకరణ జరుగుతోంది. హైందవ ధర్మాన్ని అవహేళన చేస్తుంటే మనం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటే ఎలా? మన హైందవ ధర్మాన్ని అవమానిస్తే నిగ్గదీసి నిలదీద్దాం. ఒక సినిమా పాట రాసేందుకు ఒక సంగీత దర్శకుడి దగ్గరకు వెళ్లా. ఆపాటలో బ్రహ్మాండ నాయకుడు అనే హిందూ పదం ఉందని ఆ పాట చేయనన్నాడు. ఆ పాట చేయనన్నందుకు జీవితాంతం ఆ సంగీత దర్శకుడికి పాటలు రాయనని చెప్పా. 15 ఏళ్లుగా ఒక్క పాట కూడా రాయలేదు. పక్క రాష్ట్రం సంగీత దర్శకుడు చిత్ర దర్శకనిర్మాతలతో తిరుపతి పవిత్రతను హేళన చేస్తున్నా నిమ్మకనీరెత్తినట్లు ఉంటాం. కారణం వాళ్లకు మార్కెట్ ఉంది కాబట్టి. సినిమా అనేది వ్యాపారాత్మకమైన, కళాత్మకమైన వ్యాపారం. ఆ వ్యాపారాన్ని సినిమాలకు లేకుండా చేయాలంటే...హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను ప్రభుత్వం బహిష్కరించాలి. హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలను మనం తిరస్కరించాలి. బహిష్కరణ కంటే తిరస్కరణ గొప్పమార్గం. మనం తిరస్కరిస్తే వ్యాపారం నడవదు..డబ్బులు రావు. డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హైందవ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తారో చూద్దాం.' అని అనంత శ్రీరామ్ అన్నారు -
అనంత శ్రీరామ్‌కు ఐఫా అవార్డు
పాటల రచయిత అనంత శ్రీరామ్ ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) అవార్డు అందుకున్నారు. ‘బేబి’ సినిమాలోని ‘ఓ రెండు మేఘాలిలా..’ పాటకు ఈ అవార్డు వచ్చింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బేబి’. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికిగానూ ‘ఓ రెండు మేఘాలిలా..’ పాటకు బెస్ట్ లిరిక్ రైటర్‌గా అనంత శ్రీరామ్ తాజాగా ఐఫా అవార్డు అందుకోవడంతో ఎస్కేఎన్, సాయి రాజేశ్ కలిసి అనంత శ్రీరామ్‌ను అభినందించారు. ‘‘బేబి’ మూవీకి ఇప్పటిదాకా ఫిలింఫేర్, సైమా, గామా వంటి అనేక గొప్ప పురస్కారాలు దక్కాయి. తాజాగా ఐఫా దక్కడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు ప్రేక్షకుల రివార్డ్స్‌తో పాటు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కుతున్నాయంటే ఆ ఘనత సాయి రాజేశ్‌కే దక్కుతుంది. ఈ ప్రేమ కథను హృద్యంగా తెరపై ఆవిష్కరించారాయన’’ అని మేకర్స్ తెలిపారు. కాగా ఎస్కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్లో ‘బేబి’ సినిమా బాలీవుడ్లో రీమేక్ అవుతోంది. -
సూపర్ సింగర్.. ఆరోజే ప్రారంభం!
మధురమైన గాత్రాలను వెలికి తీసుకువచ్చే ప్రయత్నమే సింగింగ్ షో. ఇలాంటి సింగింగ్ షోలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని, ఎన్నో అద్భుత స్వరాలను పరిచయం చేసిన "సూపర్ సింగర్" ఇప్పుడు స్టార్ మాలో మరింత వినూత్నంగా మళ్ళీ ప్రారంభం కాబోతోంది. విభిన్నమైన ఆలోచనతో, విలక్షణమైన వాయిస్‌లతో సర్వం సిద్ధం చేసుకుంది. షో కోసం ఆడిషన్స్ నిర్వహించి.. వాటి నుంచి వడపోసిన స్వరాలు ప్రేక్షకులు ఆస్వాదించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక అమెరికా, కేరళ నుంచి వచ్చి పాటల మీద, సంగీతం మీద ఆసక్తితో, తమను తాము నిరూపించుకోవాలన్న ఆకాంక్షతో కంటెస్టెంట్స్ పాల్గొనేందుకు రావడం ఈ షో ప్రత్యేకత. ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా నలుగురు ప్రతిభావంతులు న్యాయమూర్తులుగా కంటెస్టెంట్స్‌ని తీర్చిదిద్దడంతో పాటు పోటీని మరింత రసవత్తరంగా నడిపించబోతున్నారు. ఇంతకీ ఆ నలుగురు మరెవరో కాదు.. గాయని శ్వేతా మోహన్, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, గేయ రచయిత అనంత శ్రీరామ్. వీరే ఈ సారి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. 20 మంది కంటెస్టెంట్లతో ప్రారంభం కాబోతున్న ఈ షోలో 16 మందితో అసలైన పోటీ మొదలవుతుంది. ఈ నెల 23 నుంచి.. ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు "సూపర్ సింగర్" సంగీతాభిమానుల్నే కాదు.. ప్రతి “స్టార్ మా” ప్రేక్షకుల్ని అలరించనుంది. షో నిర్వహణలో ఈ సారి స్టార్ మా ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. కంటెస్టెంట్స్, వాళ్ళని తీర్చిదిద్దే జడ్జెస్, మార్కులు.. ఇవి మాత్రమే కాకుండా షో ని ఇంకా ఆసక్తిగా మలచబోతున్న ఆ విషయం ఏంటో తెలుసుకోవాలంటే 'స్టార్ మా'లో సూపర్ సింగర్ చూడాల్సిందే. చదవండి: నాకు, నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే ఆ ఐదుగురిదే బాధ్యత!: రైతుబిడ్డ -
'సర్కారు వారి పాట' బ్లాక్ బస్టర్ అవుతుంది: అనంత శ్రీరామ్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' ఆల్బమ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. సంగీత సంచలనం ఎస్.ఎస్. తమన్ మ్యూజిక్ లో ఇప్పటికే విడుదలైన కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్ అన్నీ వర్గాల ఆడియన్స్ ఆకట్టుకొని టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా 'సర్కారు వారి పాట'కి అద్భుతమైన సాహిత్యం అందించిన గేయ రచయిత అనంత శ్రీరామ్ మీడియాతో ముచ్చటించారు. అనంత శ్రీరామ్ పంచుకున్న 'సర్కారు వారి పాట' విశేషాలు... ► పదిహేడేళ్ళ జర్నీ.. 1295 పాటలు రాశారు, ఈ ప్రయాణం ఎలా అనిపిస్తుంది ? ►నా ప్రయాణం సులువుగానే ప్రారంభమైయింది. పెద్ద సినిమా కష్టాలు పడలేదు. ప్రారంభంలోనే విజయాలు వచ్చేశాయి. ఐతే ఈ విజయాల నిలకడని కొనసాగించడానికి ప్రతి క్షణం శ్రమించాల్సిందే. ఎప్పటికప్పుడు విజయాలు సాధించాలి. పాటకు మించిన పాట ఇస్తేనే ఇక్కడ రచయితగా నిలబడగలం. దీనికి నిదర్శనమే గీత గోవిందం సినిమాలోఇంకేం ఇంకేం పాట. అప్పుడప్పుడే వ్యూస్ లెక్కపెడుతున్న సమయంలో వంద మిలియన్స్ దాటి రికార్డ్ సృష్టించింది. దాన్ని మించిన విజయం మూడేళ్ళ తర్వాత 'సర్కారు వారి పాట' కళావతి సాంగ్ తో వచ్చింది. ► 'సర్కారు వారి పాట' కి రాసే అవకాశం రావడానికి కారణం గీత గోవిందం విజయం అనుకోవచ్చా ? ►ఖచ్చితంగా అనుకోవచ్చు. గీత గోవిందం విజయం తర్వాత నాతో పాట రాయించాలని దర్శకుడు పరశురాం గారికి అనిపించింది. ఐతే సినిమాలో ప్రతీ పాట రాయాలనిపించడం మాత్రం దైవ సంకల్పం. ఒక పాట బావుందని మరో పాట.. ఇలా ఐదు పాటలూ రాయించారు. ► ఐదు పాటలు డిఫరెంట్ జోనర్ లో వుంటాయా ? ►ఐదూ విభిన్నమైన పాటలు. పెన్నీ సాంగ్ హీరో కారెక్టరైజేషన్ కి సంబధించి వుంటుంది. రూపాయి ఎవరిదైన దాన్ని గౌరవించే క్యారెక్టర్ హీరోది. దీన్నే మాస్ ధోరణిలో పెన్నీ సాంగ్ లో చెప్పాం. కళావతి ఇప్పటికే పెద్ద విజయం సాధించింది. ఎంతటి పోగరబోతు కూడా అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ప్రాధేయపడి ఆమె ప్రేమని కోరుతాడనేది ఈ పాటలో అందంగా చెప్పాం. సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ పూర్తి కమర్షియల్ గా వుంటుంది. 'సర్కారు వారి పాట వెపన్స్ లేని వేట'. వేటాడాలంటే ఆయుధం కావాలి. కానీ హీరో ఆయుధం అతని తెలివి. ఇందులో సాహిత్యం పాత్రకి తగ్గట్టుగా కమర్షియల్ గా వుంటుంది. మరో రెండు పాటలు కూడా ఈ వారంలోనే విడుదలౌతాయి. ఆ రెండు పాటలు కూడా అద్భుతంగా కుదిరాయి. అభిమానులని అలరిస్తాయి. ► పాట రాస్తున్నపుడు హీరోలు ఇన్పుట్స్ ఇస్తారా ? వారి ప్రభావం ఉంటుందా ? ►దర్శకుడి ప్రభావమే వుంటుంది. వారి మార్గదర్శకత్వంలోనే వుంటుంది. ఒకవేళ హీరోలు ఏమైనా చెప్పాలనుకున్న దర్శకుల ద్వారానే చెప్తారు. ► సర్కారు వారి పాటలో ఏ సాంగ్ రాయడనికి ఎక్కువ సమయం తీసుకున్నారు ? ►అన్ని పాటలు సమయం తీసుకున్నాయి. సెప్టెంబర్ 2020లో సినిమా పట్టాలెక్కింది. తర్వాత లాక్ డౌన్లు వచ్చాయి. ఐతే ఈ రెండేళ్ళ గ్యాప్ లో కొన్ని సందేహాలు రావడం, మళ్ళీ రాయడం, మార్చడం జరిగేది. ప్రతి పాట నెలలు తరబడే సమయం తీసుకుంది. ► డబుల్ మీనింగ్ వుండే పాటలు రాయాల్సివస్తే ఎలాంటి కసరత్తు చేస్తారు ? ఇబ్బంది పడే సంధర్భాలు ఉన్నాయా ? ►సందర్భాన్ని బట్టి అది శ్రంగారభరితమైన పాటే ఐతే .. దాన్ని రాయడానికి నేనేం ఇబ్బంది పడను. మడి కట్టను. కాకపొతే ఎలాంటి వేదికకి రాస్తున్నాం అనేది చూసుకోవాలి. కుటుంబం మొత్తం కలసి చూసే సీరియల్ కి రాసినప్పుడు మోతాదుకి మించి రాస్తే ఒకరిని ఒకరు చూసి ఇబ్బంది పడతారు. ఇక్కడ శ్రుతిమించికూడదు. సినిమాకి రాస్తున్నపుడు .. స్నేహితులు, కాస్త వయసుపెరిగిన వారు ప్రేక్షకులుగా వుంటారు కొంత కంఫర్ట్ జోన్ వుంటుంది కాబ్బట్టి ఇక్కడ కొంచెం మోతాదు పెంచవచ్చు. సోషల్ మీడియా, మిగతా ఓటీటీ వేదికలలో వ్యక్తిగతంగా చూస్తారు కాబట్టి మోతాదు పెరిగినా పర్వాలేదు. వేదికలు బట్టి మోతాదు చూసుకోవాలి. ► సర్కారు వారి పాట కథ చెప్పినపుడు మీకు ఎలాంటి ఎక్సయిట్మెంట్ కలిగింది. ? ►ఈ కథ వినగానే గత ఐదేళ్ళుగా ఇలాంటి కథ రాలేదు , మళ్ళీ ఐదేళ్ళ తర్వాత గానీ ఇలాంటి కథ మహేశ్ బాబు గారికి రాదనపించింది. విలువలుండి, వ్యాపార విలువలు జోడించిన కథ దొరకడం చాలా కష్టం. ఇలాంటి కథ మహేష్ బాబు గారికి వచ్చింది, ఇలాంటి సినిమాలో భాగమైతే నా భవిష్యత్ కు మంచి పునాది పడుతుందనిపించింది. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ► ఇప్పుడు సినిమాల్లో పాటలు తగ్గిపోయాయి ? వున్న పాటలు కూడా ఇరికించినట్లనిపిస్తున్నాయి. సర్కారు వారి పాటలో సాంగ్స్ ప్లేస్ మెంట్ ఎలా ఉండబోతుంది? ►ఇందులో పాటలుగా నాలుగే వుంటాయి. అవి కూడా అద్భుతమైన ప్లేస్ మెంట్స్ వస్తాయి. అవసరమైన చోటే పాట పెట్టడం జరిగింది. ఇక మిగతా సినిమాల్లో పాటలు తగ్గడానికి మారుతున్న ట్రెండ్ ఒక కారణం కావచ్చు. సినిమా నిడివి ఇప్పుడు తగ్గుతుంది. పాటలు లేకుండా కూడా సినిమాలు చేస్తున్నారు. అయితే తెలుగు ప్రేక్షకులు మాత్రం పాట కోరుకుంటారు. ► తమన్ తో పని చేయడం ఎలా అనిపించింది ? ►తమన్ లయ మాంత్రికుడు. మనం మామూలు సాహిత్యం ఇచ్చినా అతని రిధమ్ తో కొత్తగా అనిపిస్తుంది. తమన్ సౌండ్ చాలా గ్రాండ్ గా వుంటుంది. అతని బీట్ తగ్గట్టు సాహిత్యం రాస్తే అద్భుతంగా వినిపిస్తుంది. ► సింగర్ ని ఎంపికలో గీత రచయిత ప్రమేయం వుంటుందా ? ►తమన్, నేను సమకాలికులం కాబట్టి ఈ పాటకు ఏ గాయకుడు, గాయిని అయితే బావుంటుందని అడుగుతారు. ఐతే అ నిర్ణయం దర్శకుడికి హీరో కి ఎవరైతే పాడాక నచ్చారో వారిదే ఉంచుతారు. ► కళావతి పాట రాసినప్పుడు ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించారా ? ►పాట రాసినప్పుడు విజయం సాదిస్తుందని ఊహిస్తాం కానీ ఇంత స్థాయిలో విజయం సాధిస్తుందని మాత్రం ఊహించలేం. ఎలాంటి ట్యూన్ ప్రేక్షకులికి నచ్చుతుంది. ఎలాంటి సాహిత్యం కావాలి, సౌండ్స్ ఎలా వుండాలి.. ఇలా చర్చలు జరుగుతాయి. అలా బయటికి వచ్చిన పాట అందరికీ నచ్చేస్తే అది సూపర్ హిట్ అవుతుంది. ► రెండేళ్ళ గ్యాప్ లో పాటలపై ఎప్పటికప్పుడు వర్క్ చేస్తూనే వున్నామని తమన్ చెప్పారు . సాహిత్యం పై కూడా పని చేశారా ? ►సర్కారు వారి పాట కి చాలా వర్క్ జరిగింది. సాహిత్యం పరంగా ఎప్పటికప్పుడు కొత్తగా మార్పులు చేర్పులు చేస్తూ వచ్చాం. సర్కారు వారి పాట రచనలో 190 పేజీల వైట్ నోట్ బుక్స్ నాలుగైపోయాయి. ► సర్కారు వారి పాట నుంచి రాబోయే రెండు పాటలు కూడా కళావతి స్థాయిలో ఆకట్టుకుంటాయా ? ►స్థాయి చెప్పలేను కానీ రాబోయే రెండు పాటలు మాత్రం ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తాయి. ► కొంతమంది గాయకులు సాహిత్యాన్ని తప్పుగా ఉచ్చరిస్తున్నారు. గేయ రచయిత చెప్పేవరకూ ఆ సాహిత్యం అర్ధం కావడం లేదు ? ఎవరి గురించి చెబుతున్నామో ఈ పాటకి మీకు తెలిసేవుంటుంది ? ► మీరు సిద్ శ్రీరామ్ గురించి మాట్లాడుతున్నారని నాకు అర్ధమైయింది. కళావతి పాట విషయానికి వస్తే అతని ఉచ్చారణ దోషాలు ఏమీ లేవు. నేను దగ్గర వుండి పాడించాను. ఐతే అతని గత పాటల్లో తెలుగు పరిచయం లేకపోవడంతొ కొన్ని తప్పులు జరిగుండోచ్చు. అదే మూడ్ లో వినేసరికి ఏదో తప్పుగా ఉచ్చరిస్తున్నారనే భావనే తప్పా .. కళావతి పాట ఉచ్చారణలో ఎలాంటి దోషాలు లేవు. దినితో పాటు ఐతే పాట మిక్స్ చేసినపుడు కొన్ని ఎఫెక్ట్స్ వేస్తారు. దాని కారణంగా కూడా కొన్ని పదాలు వేరేగా వినిపించవచ్చు. పెరిగిన టెక్నాలజీకి మన చెవులు ఇంకా సిద్ధపడలేదని నా అభిప్రాయం. ► ఒక పాటని ఇదే విధంగా వినాలని ప్రేక్షకుడికి చెప్పలేం కదా ? ►చెప్పాలి. ఒక బుల్లెట్ పేలిస్తే కనిపించదు. కానీ సినిమాలో దాన్ని స్లో మోషన్ లో చూపిస్తే అది అసహజమే అయినప్పటికీ చూస్తున్నాం కదా. ప్రతిదాంట్లో టెక్నాలజీ వస్తుంది. దీనికి కళ్ళు ఎలా సిద్ధపడుతున్నాయో చెవులు కూడా అలా సిద్ధపడాలి. ► మహేష్ గారితో ఇది ఎన్నో సినిమా ? ►'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాకి రాశాను. సర్కారు వారి పాట రెండోది. పరశురాం గారితో సారొచ్చారు,శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం,,. ఇప్పుడు సర్కారు వారి పాట. ► దర్శకుడు పరశురాం గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? ►దర్శకుడు పరశురాం గారి కథలు సాఫ్ట్ అండ్ క్లాస్ గా వుంటాయి. సర్కారు వారి పాట మాత్రం హైవోల్టేజ్ వున్న కథ. ప్రతి సీన్, డైలాగ్, పాట, సీక్వెన్స్ ఇలా అన్నిటితో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ► గత నాలుగేళ్లతో పాట స్వరూపం, దాని పెట్టె బడ్జెట్ ఓ స్థాయికి వెళ్ళాయి . మరి గీత రచయితకు ప్రతిఫలం వస్తుందా ? ►ప్రతిఫలం బాగానే వస్తుంది. రాయలిటీ చట్టాలు బలంగా వున్నాయి. వందల మిలియన్ల వ్యూస్ వచ్చే పాట రాయగలిగితే రేమ్యునిరేషనే కాకుండా కొన్నేళ్ళు పాటు కూరగాయలు ఖర్చుకి వాల్సిన డబ్బు ఇస్తుంది. ► మహేష్ బాబు గారికి ఈ సినిమాలో ఇష్టమైన పాట ? ►పెన్నీ సాంగ్ మహేష్ బాబుగారికి చాలా ఇష్టం. ఈ కథ ఆయన ఓకే చేయడానికి గల కారణం హీరో పాత్రలో వుండే కొత్తదనం. హీరో క్యారెక్టర్ ని పెన్నీ సాంగ్ లో అద్భుతంగా రావడం వలన ఆయనకి ఇంకా అద్భుతంగా నచ్చింది. ► ఈ సినిమాకి మూడు పెద్ద బ్యానర్లు పనిచేశాయి.. ముగ్గురు నిర్మాతలతో పని చేయడం ఎలా అనిపించింది ? ►ముగ్గురు నిర్మాతలనే భావనే రాలేదు. దర్శకుడి తరపున పరశురాం గారితో పని చేశాను. ప్రొడక్షన్ వైపు నుండి వాళ్ళు ఎంచుకున్న సంధానకర్తతో పని చేశాను. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్.. నిర్మాతలంతా సినిమాపై ప్రేమ వున్న వాళ్ళు. అలాంటి నిర్మాణ సంస్థలతో కలసి పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది.కొత్తగా రాస్తున్న సినిమాలు చిరంజీవి గారి గాడ్ ఫాదర్, రామ్ చరణ్ - శంకర్ గారి సినిమా, నాగ చైతన్య థ్యాంక్ యూ చిత్రాలకు రాస్తున్నాను. ఇవి కాకుండా నవదీప్ హీరోగా లవ్ మౌళి, సత్యదేవ్ కృష్ణమ్మ చచిత్రాలకు సింగెల్ కార్డ్ రాస్తున్నాను. అలాగే ఎస్వీ కృష్ణా రెడ్డిగారి సినిమాకి రాస్తున్నాను. అల్ ది బెస్ట్ ► థ్యాంక్ యూ -
కళావతి పాట రచయిత అనంత శ్రీరామ్ సర్కారు వారి పాట గురించి..
-
ప్రముఖ రచయిత అనంత శ్రీరామ్‌పై పోలీసులకు ఫిర్యాదు
Complaint Against Ananta Sriram: ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎన్నో సూపర్ హిట్ పాటలకు ఆయన లిరిక్స్ అందించారు. అయితే తాజాగా ఆయన రాసిన ఓ పాట వివాదాస్పదం అవుతుంది. దేవుడిని కించపరిచేలా పాటను రచించారంటూ అనంత శ్రీరామ్‌పై బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..నాగశౌర్య, రీతూ వర్మలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాలోని ‘దిగు దిగు నాగ’ అనే పాట ఇటీవలె విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాట హిందువు మనోభావాలను దెబ్బతీసేలా ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బిందూ రెడ్డి ఆరోపిస్తున్నారు. నాగ దేవతను కించపరిచేలా రచించిన అనంత శ్రీరామ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అనంత్ శ్రీరామ్‌తో పాటు చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని నెల్లూరులోని చిల్లకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు అనంత శ్రీరామ్‌పై బ్రాహ్మణ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒరిజినల్ పాటలో ఉన్న అద్భుతమైన భావాన్ని పాడు చేశారని, డబ్బు కోసం దేవతలను కించపరుస్తున్నారని మండిపడ్డారు. వెంటనే చిత్రం నుంచి ఈ పాటను తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా ఈ సినిమాను లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
ఫాదర్ కంటే ముందు మదర్ ఉండాలి కదా?
11 ఏళ్ల ప్రాయం నుండే తన పాటలతో సాహితి దిగ్గజాలతో శభాష్ అనిపించుకున్న సినీగేయ రచయిత సీహెచ్ అనంతశ్రీరామ్ శుక్రవారం గుంటూరు విచ్చేశారు. హిందూ కళాశాల వార్షికోత్సవంలో విద్యా పురస్కారం అందుకున్న అనంతరం అనంత శ్రీరామ్ “సాక్షి’తో తన అంతరంగాన్ని పంచుకున్నారు. ఆయన మాటల్లోనే.. సాక్షి, గుంటూరు : నాకు చిన్ననాటి నుంచి సాహిత్యంపై ఎనలేని అభిరుచి. ప్రత్యేకంగా గురువు ఎవరూ లేకపోయినా మా పాఠశాలలోని తెలుగు మాస్టారు, గొప్ప పండితులతో పరిచయాలు నాలోని సాహితి తృష్ణకు పదును పెట్టాయి. మా నాన్న తరచూ పద్య గానం చేసేవారు.. అవే నాకు ప్రేరణ. నాకు భాష మీద కన్నా భావం మీద పట్టు ఎక్కువ. తెలిసిన భాషలో భావాన్ని వ్యక్తం చేయడమే నా విజయానికి సోపానం. ఇప్పటికి ఎన్ని చిత్రాలకు పాటలు రాశానో గుర్తులేదు కానీ 1006 పాటలు పూర్తయ్యాయి. సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో నేను రచించిన.. తాను నేను అన్నపాట నాకు బాగా ఇష్టమైంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి, వేటూరి నా అభిమాన రచయితలు. దేశభక్తి జోడించిన సినిమాలు ఎక్కువగా ఇష్టపడతాను. పాటపాటకు కొత్తదనం ఉండాలనేది నా తపన. నాకు కొత్తగా అనిపిస్తేనే కాగితం మీద పెడతాను. సినిమా రంగంలో పాటలు రాసేటప్పుడు ఓ ప్రత్యేక పరిస్థితి ఎదుర్కొంటుంటాం. ఒక సిట్టింగ్‌లో భక్తి పాట రాసి వెంటనే మరో సిట్టింగ్‌లో రక్తి పాట రాయాల్సివస్తోంది. నిర్మాత, దర్శకులు ఏది అడిగితే అది రాయగలగాలి. అదే పాటకు, సినిమా పాటకు తేడా. ఏడాదికి వెయ్యి పాటలు సినీ పరిశ్రమకు అవసరమైతే దర్శకుడు కోరుకున్న విధంగా రాయగలిగే రచయితలు పట్టుమని పది మందే ఉన్నారు. కాబట్టే రచయితల మధ్య పోటీ తక్కువ. సినిమా రంగంలో ఎదగాలంటే గాడ్ ఫాదర్స్ తప్పక ఉండాలన్నది నిజం కాదు. ఫాదర్ కంటే ముందు మదర్ ఉండాలి కదా?. నెసెసిటీ ఆఫ్ ఇన్వెన్షన్ అన్న నానుడి అనుసరించి గాడ్ ఫాదర్ లేకపోయిన రచయిత తన ప్రతిభతో ముందుకు వెళ్లగలడు. సామాజిక రుగ్మతలు పెరిగాయి నా విషయానికి వస్తే ఓటేస్తావా అనే పాట నా మదిలో నుంచి రాగానే అప్పటికప్పుడు బల్లపై వేళ్లతో మ్యూజిక్ కొడుతూ పాడాను. అది సామాజిక మాధ్యమాల్లో ఎంత హిట్ కొట్టిందో మీ అందరికీ తెలుసు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల వల్ల మెతుకు సంపాదించడం కోసం బతుకంతా కష్టపడాల్సిన పరిస్థితులు నేడు సామాన్యులకు లేవు. అయితే కడుపు నిండక పోతే వంద సమస్యలు.. నిండితే కోటి సమస్యలు అన్న విధంగా నేటి సామాజిక రుగ్మతలు పెరిగాయి. మద్యం మహమ్మారితో సమస్యలు, ప్రేమ పేరుతో జరిగే అఘాయిత్యాలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. గతంలో తాగేవాడిని వెలివేస్తే నేడు తాగని వారిని వెలివేస్తున్నారు. సినిమా వ్యాపారాత్మక కళ, కళాత్మకమైన వ్యాపారం. దీంతో నిర్మాత, దర్శకులు సగటు యువకుడు ఏమి కోరుకుంటున్నాడో కథా వస్తువుగా తీసుకొని సినిమా తీయాల్సిన పరిస్థితి. ప్రేమ విఫలమై కొందరు యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు అనే అంశంపై అనంత శ్రీరామ్ మాట్లాడుతూ ప్రేమించేటప్పుడు కెరీర్‌ను కలుపుకుంటే ఇలాంటివి జరగవు. ప్రేమే జీవితం కాదు. ప్రియురాలితో పాటు మన చుట్టూ ఉన్న బంధాలను సంతోష పెట్టాలి. -
దుమ్ము ధూళి దుమ్ము రేపుతోంది
రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ లె లుగులో రిలీజ్ చేయనున్నారు. ‘దర్బార్’లోని తొలి పాట ‘దుమ్ము ధూళి..’ ని ఇటీవల విడుదల చేశారు. అనిరుధ్ స్వరపరిచిన ఈ పాటకి అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ‘‘దుమ్ము ధూళి’ పాట ఇంటర్నెట్లో దుమ్ము రేపుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ పాటకు ఇప్పటికి 8 మిలియన్ వ్యూస్ వచ్చాయి’’అని చిత్రబృందం పేర్కొంది. అనంత శ్రీరామ్ మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్‌గారి సినిమా మొదటి పాటకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ పాటను రాసే అదృష్టం ‘పేట’ చిత్రానికి(మరణం మాస్ మరణం..) దక్కింది. ఇప్పుడు ‘దర్బార్’ చిత్రంలో ‘దుమ్ము ధూళి’ అన్నే పాటను రాశాను. ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు పాడారు. రజనీకాంత్‌గారి ‘కథానాయకుడు’ చిత్రానికి తొలిసారి పాట రాశా. ఆ తర్వాత ‘విక్రమసింహా’, ‘2.0’, ‘పేట’, ఇప్పుడు ‘దర్బార్’ చిత్రాలకు పాటలు అందించాను’’ అన్నారు. -
‘రారా.. జగతిని జయించుదాం..’
నేచురల్ స్టార్ నాని వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం 'నాని'స్ గ్యాంగ్ లీడర్'. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల తర్వాత భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేశారు. అనంత శ్రీరామ్ రచించిన 'రారా.. జగతిని జయించుదాం.. రారా చరితని లిఖించుదాం..' అంటూ సాగే పాటను అనిరుధ్ రవిచందర్ సంగీత నేతృత్వంలో పృథ్వీచంద్ర, బాషెర్‌మాక్స్ ఆలపించారు. ఈ పాటలోని ర్యాప్‌ను కూడా బాషెర్‌మాక్స్ క్రియేట్ చేశారు. చక్కని పదాలతో అనంతశ్రీరామ్ రాసిన ఈ పాట అందర్నీ ఇన్స్పైర్ చేసేలా ఉంది. అనిరుధ్ మ్యూజిక్ మెస్మరైజ్ చేసేలా ఉంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
కవితారేణువులు
-
స్టార్ రిపోర్టర్ - అనంతశ్రీరామ్
-
మన బాధ్యత
‘‘సామాజికంగా మన బాధ్యతలను, ఆదర్శవంతమైన విలువలను చూపించడంలో ‘హితుడు’ సినిమా విజయం సాధించిందని, ఇలాంటి చిత్రాలను ప్రోత్సహించడం మన బాధ్యత’’ అని పాటల రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. జగపతిబాబు, మీరానందన్ జంటగా, విప్లవ్ దర్శకత్వంలో సుంకర మధు మురళి నిర్మించిన ఈ చిత్రానికి మేధావులు, సినీ పరిశ్రమ నుంచి మంచి స్పందన లభిస్తోంది. సీనియర్ సంపాదకుడు ఏబీకె ప్రసాద్, తెలంగాణా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి ఈ చిత్రాన్ని చూసి, నిర్మాతను అభినందించారు. -
రాహుల్ నంబియార్ 'చెత్త' వీడియో ఆవిష్కరణ