
అనంత శ్రీరామ్
రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ లె లుగులో రిలీజ్ చేయనున్నారు. ‘దర్బార్’లోని తొలి పాట ‘దుమ్ము ధూళి..’ ని ఇటీవల విడుదల చేశారు. అనిరుధ్ స్వరపరిచిన ఈ పాటకి అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ‘‘దుమ్ము ధూళి’ పాట ఇంటర్‌నెట్‌లో దుమ్ము రేపుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ పాటకు ఇప్పటికి 8 మిలియన్ వ్యూస్ వచ్చాయి’’అని చిత్రబృందం పేర్కొంది.
అనంత శ్రీరామ్ మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్‌గారి సినిమా మొదటి పాటకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ పాటను రాసే అదృష్టం ‘పేట’ చిత్రానికి(మరణం మాస్ మరణం..) దక్కింది. ఇప్పుడు ‘దర్బార్’ చిత్రంలో ‘దుమ్ము ధూళి’ అన్నే పాటను రాశాను. ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు పాడారు. రజనీకాంత్‌గారి ‘కథానాయకుడు’ చిత్రానికి తొలిసారి పాట రాశా. ఆ తర్వాత ‘విక్రమసింహా’, ‘2.0’, ‘పేట’, ఇప్పుడు ‘దర్బార్’ చిత్రాలకు పాటలు అందించాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment