Darbar
-
300కు పైగా సినిమాలు.. టాలీవుడ్ స్టార్ రైటర్ కన్నుమూత
టాలీవుడ్‌కు చెందిన పలు సినిమాలకు మాటల రచయితగా వ్యవహరించిన శ్రీ రామకృష్ణ (74) అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఇతర భాషల నుంచి టాలీవుడ్లోకి అనువాదం చెందిన చాలా సినిమాలకు తెలుగులో డైలాగ్స్ అందించిన మాటల రచయితగా శ్రీ రామకృష్ణకు మంచి గుర్తింపు ఉంది. అనారోగ్యంతో గత కొన్నిరోజులుగా చెన్నైలోని తేనపేటలో ఉన్న అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఆయన మరణించారు. శ్రీ రామకృష్ణ స్వస్థలం ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన తెనాలి కాగా 50 ఏళ్ల కిందట సినీ పరిశ్రమ అంతా చెన్నైలోనే ఉండేది. ఈ కారణంగా ఆయన అక్కడే స్థిరపడ్డారు. బొంబాయి, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, జెంటిల్మెన్, చంద్రముఖి తదితర 300కు పైగా చిత్రాలకు ఆయన మాటలు రాశారు. జీన్స్ సినిమా తెరకెక్కించే సమయంలో రామకృష్ణ దగ్గరే కొంతమేరకు తెలుగు నేర్చుకున్నానని బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. మణిరత్నం, శంకర్ వంటి స్టార్ డైరెక్టర్స్ అన్ని సినిమాలకు దాదాపు ఆయనే మాటల రచయితగా పనిచేశారు. రజనీకాంత్ దర్బార్ చిత్రానికి ఆయన చివరగా పనిచేశారు. శ్రీ రామకృష్ణ అంత్యక్రియలు చెన్నై సాలి గ్రామంలోని శ్మశాన వాటికలో నేడు జరుగుతాయని ఆయన కుమారుడు గౌతం తెలిపారు. -
అందుకే దర్బార్ ఫ్లాప్ అయింది: ఏఆర్ మురుగదాస్
కోలీవుడ్ టాప్ దర్శకుల్లో ఏఆర్ మురుగదాస్ ఒకరు. అజిత్ కథానాయకుడిగా దీనా చిత్రంతో తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆయన వరుసగా పలు చిత్రాలతో విజయపథంలో కొనసాగుతూ వచ్చారు. అయితే ఏఆర్ మురుగదాస్‌ను ఒకసారిగా డౌన్ ఫాల్ చేసిన చిత్రం దర్బార్. ఆ చిత్ర కథానాయకుడు రజనీకాంత్. భారీ అంచనాల మధ్య విడుదలైన దర్బార్ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. దీంతో మూడేళ్లుగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మెగా ఫోన్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. దర్బార్ దెబ్బతో తదుపరి విజయ్ హీరోగా చేయాల్సిన చిత్రం వెనక్కి వెళ్లిపోయింది. కాగా ఇటీవల ఓ భేటీలో రజనీకాంత్ తో చేసిన దర్బార్ చిత్రం ఫ్లాప్ కావడానికి కారణాన్ని సుమారు మూడేళ్ల తర్వాత ఏఆర్ మురుగదాస్ బయటపెట్టారు. రజనీకాంత్‌ను డైరెక్ట్ చేసే అవకాశం తనకు ఫిబ్రవరి నెలలో వచ్చిందనీ, జూన్ నెల ముంబాయిలో వర్షాల సీజన్ కావడంతో అలా చిత్ర షూటింగును హడావుడిగా పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. ఎందుకంటే ఆగస్టులో రజనీకాంత్ రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు చెప్పారన్నారు. తాను రజనీకాంత్‌కు వీరాభిమానిని. దీంతో ఆయనతో చిత్రాలు చేసే అవకాశాన్ని ఏ కారణంగాను వదులుకోకూడదని భావించానన్నారు. రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవడంతో ఆ సమయంలో దర్బారే ఆయన చివరి చిత్రం అనే ప్రచారం జరిగిందన్నారు. దీంతో ఫిబ్రవరిలో రజనీకాంత్ చిత్రాన్ని దర్శకత్వం వహించే అవకాశం రావడం మార్చి నెలలో షూటింగ్ ప్రారంభించి జూన్ నెలకంతా చిత్రాన్ని పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీంతో ఎలాగైనా రజనీకాంత్ చిత్రం చేసి హిట్ కొట్టాలని భావించానని, అయితే సరైన ప్రణాళిక లేకపోవడంతో దర్బార్ చిత్రం ఫ్లాప్ అయ్యిందని చెప్పారు. సాధారణంగా షూటింగ్‌కు ముందు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలకు చాలా సమయం అవసరం అవుతుందన్నారు. అది దర్బార్ చిత్రానికి లేకపోయిందని మురుగదాస్ పేర్కొన్నారు. -
అది జైలు కాదు దర్బార్.. ఢిల్లీ మంత్రి మరో వీడియో లీక్..
న్యూఢిల్లీ: అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేందర్ జైన్‌కు సంబంధించిన మరో వీడియోను బీజేపీ విడుదల చేసింది. సెప్టెంబర్ 12 నాటి ఈ వీడియోలో రాత్రి 8 గంటల సమయంలో సత్యేందర్ జైన్ సహచర ఖైదీలతో సమావేశమయ్యారు. అనంతరం అప్పటి తిహార్ జైలు సూపరింటెండెంట్ వచ్చి ఆయనను కలిశారు. ఈ వీడియోను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహ్జాద్ జై ట్వీట్ చేసి సైటర్లు వేశారు. సత్యేందర్ జైన్‌కు సంబంధించిన మరో వీడియో చూడండి. ఈసారి ఆయన దర్బార్‌లో జైలు సూపరింటెండెంట్ ఉన్నారు. జైలులో ఉంటూనే అత్యాచార నిందితుడితో మసాజ్ చేయించుకున్నాడు. పసందైన విందు చేశాడు. ఇప్పుడు జైలు గదిలోనే సమావేశాలు. ఇది ఆప్ అవినీతి థెరపీ. కానీ కేజ్రీవాల్ దీన్ని సమర్థిస్తారు. ఇప్పటికైనా సత్యేంజర్ జైన్‌పై ఆయన చర్యలు తీసుకుంటారా? అని షెహ్జాద్ ట్వీట్ చేశారు. ఈ వీడియోలోని జైలు సూపరింటెండెంట్‌ను అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. Yet another video of Tihar put out by media! This time the Satyendra ka Darbaar has Jail Superintendent who has now been suspended ! After maalish by child rapist & Nawabi meal now this! This is corruption therapy of AAP but Kejriwal ji defends this! Will he sack SJ now? pic.twitter.com/TiOMsa8Gyu — Shehzad Jai Hind (@Shehzad_Ind) November 26, 2022 సత్యేందర్ జైన్ జైలులో మసాజ్ చేయించుకున్న వీడియో ఇటీవలే వైరల్ అయింది. అయితే ఫిజియో థెరపీ అని ఆప్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. మసాజ్ చేసింది అత్యాచార కేసు నిందితుడు అని తర్వాత తెలిసింది. అనంతరం సత్యేంజర్ జైన్ జైలులో పసందైన విందు ఆరగించిన వీడియోను బీజేపీ విడుదల చేసింది. ఇప్పుడు మరో వీడియోను రిలీజ్ చేసి ఆప్‌పై విమర్శలు గుప్పించింది. చదవండి: ముంబై ఉగ్రదాడులకు 14 ఏళ్లు.. ట్వీట్‌తో జైశంకర్ నివాళులు -
సూపర్ స్పీడ్ మీద ఉన్న సూపర్ స్టార్.. మరో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్
యాభై ఏళ్ల కెరీర్లో రజనీకాంత్ నూటయాభై చిత్రాలకు పైగా చేశారు. ప్రస్తుతం 169 చిత్రంగా ‘జైలర్’లో నటిస్తున్నారు. ఏడు పదుల వయసులో ఉన్న సూపర్ స్టార్ సూపర్ స్పీడ్ మీద ఉన్నారు. ‘జైలర్’లో నటిస్తూనే మరో రెండు చిత్రాలు అంగీకరించారట. ఆ విశేషాల్లోకి వస్తే... రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘జైలర్’. ఆగస్ట్‌లో ఈ చిత్రం షూటింగ్ ఆరంభమైంది. రజనీ ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో రజనీ స్టయిలిష్ జైలర్‌గా కనిపించనున్నారని లుక్ స్పష్టం చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తమిళ సంవత్సరాది సందర్భంగా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. మరో మూడు నాలుగు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోతుంది. ఈలోపు తన రెండు కొత్త చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొనడానికి రెడీ అవుతున్నారట రజనీకాంత్. అయితే ఈ రెండు చిత్రాలను ఒకే సంస్థ నిర్మించనుండటం విశేషం. లైకాతో మళ్లీ... రజనీకాంత్ సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటైన ‘2.0’ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ రజనీతో ‘దర్బార్’ కూడా నిర్మించిన విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాలతో రజనీకి, లైకాకి మంచి అనుబంధం ఏర్పడింది. అందుకే రజనీతో మరో రెండు సినిమాలు నిర్మించాలనుకుని సూపర్ స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకుందట లైకా సంస్థ. ఇటీవల మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ని లైకా సంస్థనే విడుదల చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రజనీ ఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. లైకా సంస్థకు రజనీ చేయనున్న చిత్రాల దర్శకులు కూడా దాదాపు ఖరారయినట్లే. ఒకరు సిబి చక్రవర్తి, మరొకరు దేసింగు పెరియస్వామి. యువదర్శకులతో... తొలి చిత్రం ‘డాన్’ (2022)తో సూపర్ హిట్ డైరెక్టర్ అనిపించుకున్నారు సిబి చక్రవర్తి. ఈ యువదర్శకుడికి రజనీ చాన్స్ ఇవ్వడం విశేషం. ఇక మరో దర్శకుడు దేసింగు పెరియస్వామి కూడా యువ దర్శకుడే. ‘కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్’ (2020) వంటి హిట్ చిత్రంతో పెరియస్వామి దర్శకుడిగా పరిచయం అయ్యారు. తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’గా రిలీజైంది. పెరియస్వామికి కూడా రజనీ చాన్స్ ఇచ్చారట. ఇలా ఒకే బేనర్లో ఇద్దరు అప్‌కమింగ్ డైరెక్టర్లతో రజనీ చేయనున్న చిత్రాల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
'కడలి' హీరోతో మురగదాస్ సినిమా.. టీజర్ విడుదల
ఏఆర్ మురుగదాస్‌కు దర్శకుడిగా చిన్న గ్యాప్ వచ్చింది. రజనీకాంత్ హీరోగా ఈయన చేసిన దర్బార్ చిత్రం తరువాత మరో చిత్రం చేయలేదు. విజయ్‌తో ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత బాలీవుడ్ చిత్రం చేయబోతున్నట్లు గుసగుసలు వినిపించాయి. అయితే దీనికి సంబంధించిన అధికార ప్రకటన రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏఆర్ మురుగదాస్ చిత్ర నిర్మాణాన్ని పునః ప్రారంభించారు. పీపుల్ బుల్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి 1947 ఆగస్టు 16 అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. గౌతమ్ కార్తీక్, రేవతి జంటగా నటిస్తున్న ఈ చిత్రం స్వాతంత్య్ర పోరాట కాలంలో ఒక గ్రామీణ యువకుడు బ్రిటీష సైన్యంతో పోరాడే ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రం అని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. భావోద్వేగాలతో కూడిన సంఘటనలతో, ప్రేమను కలిపిన ఎంటర్టైన్మెంట్ కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సలహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఇమ్రాన్ ఖాన్ నాకు పెద్దన్న
లాహోర్: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ శనివారం కర్తార్‌పూర్ కారిడార్ గుండా వెళ్లి, పాకిస్తాన్ భూభాగంలోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. భారత్–పాకిస్తాన్ మధ్య నూతన స్నేహ అధ్యాయం ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల నడుమ వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భారత్–పాక్ మధ్య పరస్పర ప్రేమను తాను ఆశిస్తున్నానని పేర్కొన్నారు. 74 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న అడ్డుగోడలకు గవాక్షాలు తెరవాల్సిన అవసరం ఉందన్నారు. ఇరు కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరిచేందుకు చర్యలు తీసుకున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు సిద్ధూ కృతజ్ఞతలు తెలిపారు. అంతకముందు కర్తార్‌పూర్ కారిడార్ ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ సీఈఓ ముహమ్మద్ లతీఫ్ జీరో పాయింట్ వద్ద సిద్ధూకు స్వాగతం పలికారు. ఇమ్రాన్ ఖాన్ తనకు పెద్దన్న అని, తనకు గొప్ప గౌరవం, ఎంతో ప్రేమ లభించిందని సిద్ధూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కర్తార్‌పూర్ కారిడార్ అధికారిని ఆలింగనం చేసుకొని, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనకు పెద్దన్న అంటూ నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యల వీడియోను బీజేపీ సీనియర్ నేత అమిత్ మాలవియా ట్విట్టర్లో షేర్ చేశారు. సిద్ధూ గతంలోనూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాను ఆలింగనం చేసుకొని, పొగడ్తల వర్షం కురిపించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీకి సన్నిహితుడైన సిద్ధూ పాకిస్తాన్ నేతలను పొగడడం పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదని మాలవియా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సిద్ధూ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ తప్పుపట్టారు. పాకిస్తాన్ మన దేశంలోని పంజాబ్‌లోకి డ్రోన్లతో ఆయుధాలను, మాదక ద్రవ్యాలను, జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపిస్తోందని అన్నారు. అలాంటి పాక్ ప్రధానిని పొగడడం సరైంది కాదని హితవు పలికారు. సిద్ధూ వ్యాఖ్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జి రాఘవ్ చద్ధా అన్నారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ, ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ పాకిస్తాన్ పట్ల ప్రేమను దాచుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. తనపై వస్తున్న విమర్శలపై సిద్ధూ స్పందించారు. వారిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకోనివ్వండి అని బదులిచ్చారు. -
రజనీ ఫారిన్ కారు: ఇంత పెద్ద స్టోరీనా!
హైదరాబాద్: సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఇది ఒక పేరు కాదు ఒక బ్రాండ్. దేశవిదేశాల్లో అభిమానులు, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం. రజనీ సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. బెంగళూరులోని ఓ ట్రాన్స్ పోర్ట్ సర్వీసులో కండక్టర్‌గా ప్రారంభమైన ఆయన ప్రయాణం సూపర్‌స్టార్‌గా ఎదగడం వెనక ఎంతో శ్రమ, కష్టం ఉన్నాయి. అయితే తన సినిమా ప్రయాణంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని, అవమానపడిన ప్రతీసారి కసితో పనిచేశానని ‘దర్బార్’ ఆడియో ఫంక్షన్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ ఆడియో ఫంక్షన్లో రజనీ ఇచ్చిన స్పూర్తిదాయక స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (‘పెదరాయుడు’ స్పెషల్ వీడియో) ‘భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ‘16 వయతినిలే’ చిత్రంలోని పరట్టయి పాత్రతో నాకు తమిళనాడులో మంచి గుర్తింపు లభించింది. అప్పటికే పలు చిత్రాలు చేసినప్పటికీ పరట్టయి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే ఈ చిత్రం విడుదలైన రెండు వారాల తర్వాత ఓ నిర్మాత (పేరు చెప్పడం ఇష్టం లేదు) నుంచి కబురు వచ్చింది. ఓ పెద్ద హీరో చిత్రం అందులో నా పాత్ర చాలా విభిన్నంగా ఉండటంతో ఓకే చెప్పాను. పారితోషికం మాట్లాడుకొని డేట్స్ కూడా ఇచ్చాను. అయితే ఈ సినిమాలో నా పాత్ర కన్ఫర్మేషన్ కోసం అడ్వాన్స్ ఇవ్వమని అడిగాను. అయితే షూటింగ్‌కు వచ్చాక ఇస్తామని చెప్పారు. (రాయని డైరీ : రజనీకాంత్ (సూపర్ స్టార్)) షూటింగ్‌కు వెళ్లాక హీరో వచ్చే సమయం అయింది మేకప్ వేసుకొమ్మని అన్నారు. కానీ అడ్వాన్స్ ఇవ్వందే మేకప్ వేసుకోనని చెప్పా. అప్పుడే అంబాసిడర్ కారులో ఏవీఎమ్ స్టూడియో(షూటింగ్ జరిగే ప్రదేశం)కు వచ్చిన నిర్మాతకు ఈ విషయం తెలిశాక ఆగ్రహంతో ఊగిపోయారు. నువ్వేమైన పెద్ద స్టార్ అనుకుంటున్నావా? ఎన్ని చిత్రాలు చేశావు? నీకంటూ ఏం గుర్తింపు ఉంది? అంటూ శివాలెత్తారు. అంతేకాకుండా ఈ సినిమాలో నీకు అవకాశం లేదని చెప్పి వెళ్లిపొమ్మన్నారు. అయితే ప్రస్తుతం తన దగ్గర డబ్బులు లేవని కనీసం మీ కారులోనైనా ఇంటి దగ్గర దిగబెట్టాలని కోరా. అందుకు ఆయన అస్సలు ఒప్పుకోలేదు. డబ్బులు లేకుంటే నడుచుకుంటూ వెళ్లమని వెకిలిగా మాట్లాడారు. (నా బ్రాండ్ రెడ్‌ట్రీ) అప్పుడే అనుకున్నా ఏవీఎం స్టూడియోలో మరోసారి అడుగుపెడితే అది విదేశీ కారుతోనే అనుకున్నా. రెండున్నరేళ్ల తర్వాత ఓ పెద్ద చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. భారీ పారితోషికం ఇచ్చారు. వెంటనే ఫియట్ కారు కొని, ఓ విదేశీ వ్యక్తిని డ్రైవర్‌గా నియమించా. అంతేకాకుండా అతనికి ప్రత్యేకమైన సూట్ కుట్టించా. ఏవీఎం స్టూడియోలో ఫారిన్ కారు, డ్రైవర్, చేతిలో రెండు సిగరెట్లతో స్టైల్‌గా దిగి నా కల నెరవేర్చుకున్నా. అయితే సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే తెలివితేటలు, కష్టపడేతత్వం ఉంటేనే సరిపోదు. మనం ఉండే స్థానం, సమయం, ప్రజల ఆశీర్వాదం కూడా ముఖ్యం’ అని రజనీకాంత్ తన స్టైల్లో ఉపన్యాసాన్ని ముగించారు. (రోబో: హీరోయిన్ ఐశ్వర్య.. మరి హీరో ఎవరు?) -
‘దర్బార్’ డిస్ట్రిబ్యూటర్ల నిరాహార దీక్ష!
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ సినిమాతో దాదాపు రూ.70 కోట్లు నష్టపోయామని పంపిణీదారులు తెలిపారు. దీంతో ఈ చిత్ర పంపిణీదారులు హీరో రజనీకాంత్‌ను కలవడానికి చెన్నైలోని ఆయన ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు ఆయనను కలవకుండా వారిని అడ్డుకోవడంతో నిరాహార దీక్ష చేయాలని పంపిణీదారులు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత శనివారం తాము రజనీకాంత్‌ను కలిసేందుకు చెన్నైలోని ఆయన ఇంటికి వెళ్లామని చెప్పారు. ఇంటి సమీపంలోకి వెళ్లగానే పోలీసులు లోపలికి వెళ్లకుండా తమను అడ్డుకున్నారని, రజనీకాంత్ కూడా తమను కలవడాని ఇష్టపడలేదని చెప్పారు. దీంతో తాము నిరాశకు గురయ్యామన్నారు. ఈ క్రమంలో నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లు పంపిణీదారులు తెలిపారు. కాగా గతంలో రజనీ నటించిన లింగా చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కూడా రజనీ ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. దర్బార్ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు నష్టమా? కాగా రూ. 200 కోట్లతో నిర్మించిన దర్బార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్లు వసూలు చేసినప్పటికీ భారీ డిజాస్టర్‌గా నిలిచి పంపిణి దారులకు నష్టాన్నిచ్చింది. అయితే ఈ సినిమాకు రజనీ రూ. 108 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. దర్శకుడు ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించారు. ఇక గజిని, కత్తి వంటి సూపర్ హిట్లను అందించిన మురుగుదాస్.. రజనీతో తీసిన మొదటి సినిమా ఇది. -
దర్బార్ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు నష్టమా?
పెరంబూరు : దర్బార్ చిత్రం బయ్యర్లకు సుమారు రూ.20 కోట్లు నష్టం తెచ్చిపెట్టిందన్న వదంతులు ప్రచారమవుతున్నాయి. నష్టాన్ని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బయ్యర్లు శుక్రవారం చెన్నైలోని రజనీకాంత్ ఇంటికి చేరుకున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం గత నెల 8వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన నాలుగు రోజులకే దర్బార్ చిత్రం 100 కోట్లు వసూలు చేసిందని ప్రచారం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో కొందరు బయ్యర్లు దర్బార్ చిత్రం నష్టాన్ని తెచ్చిపెట్టిందని ప్రచారం సాగిస్తున్నారు. దర్బార్ చిత్రాన్ని దక్షిణ జిల్లాల హక్కులను మదురైకి చెందిన ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కొనుగోలు చేశాడు. దర్బార్ చిత్రం తనకు రూ.20 కోట్ల నష్టం వాటిల్లిందని చెబుతూ ఆ చిత్రానికి సంబంధించిన కలెక్షన్ల వివరాలను తీసుకుని చెన్నైకి చేరుకున్నారు. దర్బార్ చిత్రాన్ని డిస్టిబ్యూటర్లు మినిమమ్ గ్యారెంటీ విధానంతో కొనుగోలు చేశారు. కొందరు బయ్యర్లు లైకా ప్రొడక్షన్స్ కార్యాలయానికి వెళ్లి తమకు నష్టం వచ్చిందని మొరపెట్టుకున్నారు. లైకా సంస్థ నిర్వాహకులు తమకే రూ.40 కోట్లు నష్టం ఏర్పడినట్లు తెలిపిందని చెబుతూ దర్శకుడు ఎ.ఆర్.మురగదాస్ రూ.60 కోట్లు పారితోషికం తీసుకున్నారని, ఆయన్ను వెళ్లి అడగండి అని పంపించినట్లు సమాచారం. ఆ బయ్యర్లు మురుగదాస్ ఇంటికి వెళ్లగా, అక్కడ ఆయనకు సంబంధించిన వ్యక్తులు మురుగదాస్ లైకా సంస్థ అల్లు అర్జున్ హీరోగా నిర్మిస్తున్న చిత్ర షూటింగ్‌కు వెళ్లారని చెప్పారు. దీంతో రజనీకాంత్ ఇంటికి చేరుకున్నారు. విషయం తెలిసిన మీడియా అక్కడికి చేరుకుంది. మీడియాను చూసిన ఆ బయ్యర్లు అక్కడకు ఎందుకువచ్చామన్న బదులు చెప్పకుండా జారుకున్నారు. మొత్తం మీద దర్బార్ చిత్ర వ్యవహారం వివాదాస్పదంగా మారింది. నటుడు రజనీకాంత్ ఇటీవల కర్ణాటక రాష్ట్రం మైసూర్ సమీపంలోని బందీపురంలో నటించిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ డాక్యుమెంట్ చిత్రం వచ్చే ఏప్రిల్‌లో డిస్కవరీ ప్రచారం కానున్నట్టు తెలిసింది. -
రూ. 200 కోట్ల క్లబ్లో ‘దర్బార్’
సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన రజనీకాంత్ దర్బార్ భారీ కలెక్షన్లను కొల్లగొడుతోంది. దర్బార్ కలెక్షన్ల సునామీతో రూ. 200 కోట్ల క్లబ్లో చేరి మరో రికార్డు సొంతం చేసుకుంది. విడులైన పదకొండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దర్బార్ రూ. 200 కోట్లు రాబట్టిందని ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు త్రినాథ్ వెల్లడించారు. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లు రాబట్టిన రజనీకాంత్ ఐదో సినిమా ‘దర్బార్’ కావడం విశేషం. గతంలో రాజనీకాంత్ నటించిన ఎంతిరాన్, కబాలి, రోబో 2.ఓ, పేటా చిత్రాలు కూడా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల కలెక్షన్లను సాధించాయి. కాగా ఈ భారీ కలెక్షన్లలో అధికభాగం తమిళనాడు నుంచి సుమారు రూ. 80 కోట్లు వచ్చాయని త్రినాథ్ పేర్కొన్నారు. అదేవిధంగా ‘దర్బార్’ మూవీ కేరళలో రూ. 8 కోట్లు, కర్ణాటకలో రూ.19 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. చదవండి: దర్బార్: ట్విటర్లో ఏమంటున్నారంటే? రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ. 20 కోట్లు, హిందిలో రూ.8 కోట్లు రాబట్టిందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా విదేశాల్లో సుమారు రూ. 70 కోట్లు వసూలు చేసిందని తెలిపారు. కోలీవుడ్ అగ్ర దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ‘దర్బార్’ సంక్రాంతి కానుకగా ఈ నెల 9న విడుదలైన సంగతి తెలిసిందే. అభిమానులకు కావాల్సిన మాస్‌మసాలా అంశాలు, పోరాట సన్నివేశాలు రజనీని సూపర్‌స్టైలిష్‌గా చూపించిన ‘దర్బార్’ సినిమా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. ముంబై పోలీసు కమిషనర్ ఆదిత్య అరుణాచలంగా నటించిన రజనీకాంత్ నటన, స్టైల్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుండటంతో ఈ సినిమా భారీగా వసూళ్లు సాధిస్తోంది. చదవండి: దర్బార్ చిత్రంలో నయనతార పాత్ర దారుణం -
ఫస్ట్‌వీక్‌లో దర్బార్ వసూళ్ల సునామీ..
హైదరాబాద్ : సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన రజనీకాంత్ దర్బార్ తొలి వారంలో రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టింది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తమిళనాడులో ఫస్ట్‌వీక్‌లో ఏకంగా రూ 60 కోట్ల వరకూ రాబట్టింది. తమిళనాడులో 650కి పైగా స్ర్కీన్స్‌లో రిలీజైన దర్బార్ తొలిరోజే రూ 18 కోట్లు వసూలు చేసింది. సంక్రాంతి సెలవల కారణంగా తమిళనాడులో దర్బార్ భారీ వసూళ్లతో సత్తా చాటింది. చెన్నైలో తొలి వారంలో రూ 10 కోట్ల మార్క్‌ను దాటింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పాజిటివ్ టాక్‌తో ఈ మూవీ రూ 15 కోట్లుపైగా కలెక్ట్ చేసింది. సరిలేరు, అల వైకుంఠపురంలో వంటి భారీ సినిమాల నుంచి పోటీ ఎదురైనా ఈ స్ధాయి వసూళ్లను దర్బార్ రాబట్టడం విశేషమే. కేరళలో రూ 7 కోట్లు, కర్ణాటకలో రూ 14 కోట్లు, రెస్టాఫ్ఇండియాలో రూ 4 కోట్లుపైగా వసూళ్లను నమోదు చేసింది. దేశవ్యాప్తంగా రూ 100 కోట్లు కలెక్ట్ చేసిన దర్బార్ అమెరికాలో రూ 10 కోట్లు, గల్ఫ్‌లో రూ 11 కోట్లు రాబట్టింది. విదేశీ వసూళ్ల వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడైతే దర్బార్ వసూళ్లు ఓ రేంజ్లో ఉంటాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చదవండి : దర్బార్ చిత్రంలో నయనతార పాత్ర దారుణం -
దర్బార్ చిత్రంలో నయనతార పాత్ర దారుణం
అగ్రనటి నయనతార మరోసారి వార్తల్లోకెక్కింది. సంచలన నటిగానే కాదు లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న నటి నయనతార. లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటిస్తూ వాటి భారాన్నంతా తన భుజాలపైనే వేసుకుని విజయాల తీరం చేర్చుతున్న సత్తా కలిగిన నటి ఈ బ్యూటీ. అలాగని స్టార్ హీరోల చిత్రాలను పక్కన పెట్టడం లేదు. అయితే ఇలాంటి చిత్రాలతోనే ఈ అమ్మడు అభిమానుల నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది. మొన్న విజయ్‌తో, అటు మొన్న తెలుగులో చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాల్లోనూ నయనతార పాత్ర నామమాత్రంగానే ఉందనే విమర్శలు వచ్చాయి. ఇకపోతే ఇటీవల రజనీకాంత్‌కు జంటగా నటించిన దర్బార్ చిత్రంలో నయనతార పాత్ర ఇంకా దారుణం అనే విమర్శలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అందులో రజనీకాంత్‌కు కూతురుగా నటించిన నివేదా థామస్‌కు ఉన్న ప్రాముఖ్యతను కూడా నయనతారకు ఇవ్వలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాదు దర్బార్ చిత్రంలో ఒక జూనియర్ ఆర్టిస్ట్‌లా చూపించారనే ఆరోపణలు ఎక్కు పెడుతున్నారు. హీరోయిన్ సెంట్రిక్ కథా పాత్రల్లో నటిస్తూ తన ప్రతిభను నిరూపించుకుంటున్న నయనతార అసలు ఇలాంటి చిత్రాలను ఎందుకు ఒప్పుకోవాలనే ప్రశ్నలను అభిమానులు సంధిస్తున్నారు. ఇవి నయనతార దృష్టికి వచ్చింది. చదవండి: విఘ్నేశ్‌తో నయన్ తెగతెంపులు? ఇప్పటికే దర్బార్ చిత్రంలో ఆ చిత్ర దర్శకుడు ఏఆర్.మురుగదాస్ తన పాత్రకు ప్రాధాన్యత ఇవ్వలేదన్న ఆసంతృప్తితో ఉన్న నయనతార ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో అభిమానుల విమర్శలకు మరింత అశాంతికి గురవుతున్నట్లు సమాచారం. నిజానికి దర్శకుడు ఏఆర్.మురుగదాస్‌తో నయనతారకు చాలా కాలంగా కోల్డ్ వార్ జరుగుతోంది. గజని చిత్ర సమయంలోనే తన పాత్రను కట్ చేసి నటి ఆసిన్‌కు ప్రాధాన్యతనిచ్చారని విమర్శించింది. అంతే కాదు తాను చేసిన పెద్ద తప్పు గజని చిత్రంలో నటించడమేనని ఆ మధ్య పేర్కొంది. అలాంటిది దాదాపు 12 ఏళ్ల తరువాత ఇటీవల ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలోనూ నయనతారకు అన్యాయం జరిగిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో మరోసారి నయనతార ఏఆర్.మురుగదాస్‌పై అసంతృప్తితో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు మూక్కూత్తి అమ్మన్, నెట్రికన్ చిత్రాల్లో నటిస్తోంది.ఈ రెండు చిత్రాలు కథానాయకికి ప్రాముఖ్యత కలిగిన కథా చిత్రాలే అన్నది గమనార్హం. -
రజనీ జోరు.. దర్బార్‌కు భారీ వసూళ్లు
హైదరాబాద్: సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా సినిమా ‘దర్బార్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. పాజిటివ్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ. 150 కోట్లు వసూలు చేసింది. కోలీవుడ్ అగ్ర దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ‘దర్బార్’ సంక్రాంతి కానుకగా ఈ నెల 9న విడుదలైన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్‌కు కావాల్సిన మాస్‌మసాలా అంశాలు, ఫైట్లతోపాటు రజనీని సూపర్‌స్టైలిష్‌గా చూపించిన ‘దర్బార్’ సినిమా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. చాలాకాలం తర్వాత రజనీ పోలీస్ గెటప్‌లో కనిపించడం.. మురగదాస్ తనదైన శైలిలో తెరకెక్కించడం ఈ సినిమాకు కలిసివస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలై ఈ సినిమాకు తొలి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముంబై పోలీసు కమిషనర్ అయిన ఆదిత్య అరుణాచలం రజనీకాంత్ యాక్టింగ్, స్టైల్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుండటంతో ఈ సినిమా ఇప్పటికీ బలంగా వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా మొదటి రోజే ఏకంగా రూ. 36 కోట్ల వరకు వసూలు చేసింది. కేవలం తమిళనాడులోనే తొలిరోజు దాదాపు రూ. 19 కోట్ల వరకు రాబట్టింది. ఇటు దక్షిణాదిలోనే కాకుండా అటు బాలీవుడ్, ఓవర్సీస్లోనూ రజనీకి మంచి పట్టు ఉండటంతో అక్కడ కూడా ‘దర్బార్’భారీ వసూళ్లు రాబడుతోంది. -
వివాదాల 'దర్బార్'
దర్బార్ చిత్రం చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం దర్బార్. నయనతార నాయకిగా, నటి నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. గత గురువారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చిన ఈ చిత్రానికి టాక్ రకరకాలుగా వస్తున్నా, వసూళ్లను మాత్రం కొల్లగొడుతోంది. దర్బార్ చిత్రం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వివాదాల చుట్టూ తిరుగుతోంది. దర్శకుడు మురుగదాస్ చిత్రంలో రాజకీయాలు లేవంటూనే వివాదాస్పద సన్నివేశాలను జొప్పించి చర్చనీయాంవయానికి దారితీశారు. చదవండి: నితిన్ ఈజ్ బ్యాక్ అనేలా భీష్మ టీజర్ రజనీకాంత్‌పై కోర్టులో పిటిషన్ దర్బార్ చిత్ర వ్యవహారం నటుడు రజనీకాంత్‌పై కోర్టులో పిటిషన్ వరకూ దారితీసింది. ఈ చిత్రంలో పోలీసు అధికారులను కించపరచే విధంగా సంభాషణలు, సన్నివేశాలు ఉన్నాయంటూ తూత్తుక్కుడికి చెందిన మాజీ రక్షణదళ అధికారి మరియమైఖెల్ శుక్రవారం తూత్తుక్కుడి 3వ మేజిస్టేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో దర్బార్ చిత్రంలో యూనిఫామ్ సర్వీసర్ల(డిపార్ట్మెంట్)ను కించపరచేవిధంగా సన్నివేశాలు చోటుచేసుకున్నాయన్నారు. చిత్రంలో పోలీస్ అధికారిగా నటించిన నటుడు రజనీకాంత్ హిప్పీ జుత్తు, గడ్డంతో నటించడంతో పాటు నేను పోలీస్ కమిషనర్‌ను కాదు రౌడీని అని మాట్లాడతారన్నారు. ఇవి పోలీసులను, సైనికులను కించపరచేవిగా ఉన్నాయన్నారు. దర్బార్ చిత్రంలో పోలీస్ అధికారిగా నటించిన నటుడు రజనీకాంత్, దర్శకుడు ఏఆర్.మురుగదాస్, నిర్మాణ సంస్థలపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ ఈ నెల 21వ తేదీన రానుంది. కాగా మరో ఐఏఎస్ అధికారి అలెక్స్పాల్మీనన్ దర్బార్ చిత్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చిత్రంలో పోలీస్ అధికారి రజనీకాంత్‌ను నాలుగు రోజుల్లో ఫిట్నెస్ను నిరూపించుకోవాలని ఆయన ఆర్డర్ వేస్తారు. రజనీకాంత్ కూడా కసరత్తులు చేసి తన పిట్నెస్ను నిరూపించుకుని తన అధికారాన్ని కాపాడుకుంటారు. దీన్ని ఎగతాళి చేసే విధంగా ఐఏఎస్ అధికారి అలెక్స్‌పాల్ మీనన్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ నాలుగు రోజుల్లో తలైవర్ ఫిట్నెస్ను నిరూపింపజేసింది. తాన్యా చాలాగొప్ప హ్యూమన్ రైట్ వైలేషన్ అని అన్నారు. అదేవిధంగా దర్బార్ చిత్రం పేరును ప్రస్థావించకుండా అయ్యా, రేయ్ తమిళ దర్శకులా ఇకపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నేపథ్యంతో చిత్రాలు చేయకండి, మీ లాజిక్‌తో మా మెదడు అంతా మొద్దుమారిపోయ్యింది అని పేర్కొన్నారు. ఇప్పుడీయన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు దర్బార్ చిత్రం విడుదలైన రోజునే పైరసీ వచ్చేసింది. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతేకాకుండా చిత్రంలోని చర్చనీయాంశ సన్నివేశాలను కొందరు వాట్సాప్‌లో పోస్ట్ చేయడంతో పాటు దర్బార్ చిత్రాన్ని యూడు బిట్లుగా పూర్తి చిత్రాన్ని వాటాప్స్‌లో పోస్ట్ చేస్తామని, కాబట్టి ఎవరూ చిత్రాన్ని థియేటర్లకు వెళ్లి చూడవద్దు అని ప్రచారం జరుగుతోంది. దర్బర్ చిత్ర నిర్వాహకులు శనివారం చెన్నైలోని పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఈ వాట్సాప్ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. దర్బార్ చిత్రంపై కొందరు కుట్రపన్ని వసూళ్లను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వాట్సాప్‌లో దుష్ప్రచారం చేసే వారిని కనిపెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ సన్నివేశాలను తొలగించారు దర్బార్ చిత్రంలో చోటు చేసుకున్న వివాదాస్పద సంభాషణలు, సన్నివేశాలపై విమర్శనల వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చిత్రంలో డబ్బు ఉంటే జైలు నుంచి బయటకు వెళ్లి షాపింగ్ చేసి రావచ్చు అన్న సంభాషణలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. జయలలిత స్నేహితురాలు శశికళను ఉద్దేశించే ఆ సంభాషణలను పొందుపరిచినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర నిర్మాతలు స్పందించారు. ఆ సంభాషణలను వినోదం కోసమే పొందుపరచినట్లు, ఎవరినీ ఉద్దేశించి పెట్టలేదని వివరణ ఇచ్చారు. అంతేకాదు ఆ సంభాషణలు ఎవరినైనా బాధించినట్లైతే వాటిని చిత్రం నుంచి తొలగించడానికి సిద్ధమన్నారు. ఆ తరువాత వాటిని తొలగించారు కూడా. -
దుమ్ము దులుపుతున్న ‘దర్బార్’
రజనీకాంత్ సినిమా అంటేనే అటు సినీ ఇండీస్ట్రీకి ఇటు ఆయన ఫ్యాన్స్‌కు పెద్ద పండగ. రజనీ సినిమా ప్రారంభం నుంచి విడుదలైన తర్వాత వచ్చే టాక్ వరకూ తలైవా ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక సినిమాపై కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా వాళ్ల జోరు మామూలుగా ఉండదు. అలాంటిది హిట్ టాక్ వస్తే ఇక ఏ రేంజ్లో వారి ఆనందం ఉంటుందో ఊహించుకోగలరు. ప్రస్తుతం ‘దర్బార్’ఫలితంతో ఆయన ఫ్యాన్స్ రెండు పండుగలు చేసుకుంటున్నారు. రజనీకాంత్ హీరోగా కోలీవుడ్ అగ్ర దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’ . సంక్రాంతి కానుకగా ఈ నెల 9న(గురువారం) విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు వేల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకపోతోంది. అంతేకాకుండా వసూళ్ల పరంగానూ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. చాలాకాలం తర్వాత పోలీస్ గెటప్‌లో కనిసిస్తుండటం, మురగదాస్ దర్శకత్వం వహిస్తుండటం, టీజర్, ట్రైలర్, పాటలు ఓ రెంజ్లో ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ భారీ అంచానల నడుమ విడుదలై ఈ సినిమాకు తొలి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మొదటి రోజే ఏకంగా రూ. 36 కోట్ల వరకు వసూలు చేసింది. కేవలం తమిళనాటనే దాదాపు రూ. 19 కోట్ల వరకు ఈ సినిమా వసూలు చేసిందంటే కోలీవుడ్‌లో రజనీ స్టామినా ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది. ఇక కేవలం దక్షిణాదినే కాకుండా బాలీవుడ్, ఓవర్సీస్లోనూ రజనీకి మంచి పట్టు ఉండటంతో అక్కడ కూడా ‘దర్బార్’భారీ వసూళ్లు రాబడుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే ‘దర్బార్’ రూ. 50 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఇక ఈ చిత్రం రెండో రోజు కూడా తన జోరును కొనసాగించింది. బాలీవుడ్లో తానాజీ, ఛపాక్ చిత్రాలు విడుదలైనప్పటికీ ‘దర్బార్’జోరు, హుషారు ఏమాత్రం తగ్గలేదు. ఆ చిత్రాలకు ధీటుగా పోటీనిస్తూ కలెక్షన్ల ప్రవాహాన్ని కొనసాగించింది. అదేవిధంగా శుక్రవారం తెలుగులో మరే సినిమా లేకపోవడం దర్బార్‌కు మరింత కలిసొచ్చింది. రెండో రోజు కూడా దాదాపు రూ. 50 కోట్ల పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఓవరాల్‌గా సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రజనీ దర్బార్ రూ. 100 కోట్ల మార్క్ దాటిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఏదేమైనప్పటికీ ‘రజనీ దర్బార్’బాక్సాఫీస్ వద్ద హిస్టరీ క్రియేట్ చేయబోతోందని అతడి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. నయనతార, నివేదా థామస్, సునీల్ శెట్టి, యోగిబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతమందించాడు. చదవండి: దర్బార్ : మూవీ రివ్యూ అమితాబ్ సూచనను పాటించలేకపోతున్నా -
‘జెంటిల్మన్’ మర్చిపోలేని అనుభవం: నివేదా
అప్పుడే ఎంతో ఫన్ అంటోంది నటి నివేదా థామస్. ఈ మలయాళ చిన్నది ఒక పక్క హీరోయిన్గా నటిస్తూనే, స్టార్ హీరోలకు వెండితెర కూతురిగా మారిపోతోంది. అలా మలయాళంలో మోహన్‌లాల్‌కు, తమిళంలో కమలహాసన్, రజనీకాంత్లకు ముద్దుల కూతురిగా మారిపోయింది. లక్కీగా ఈ మూడు చిత్రాలు నివేదా థామస్‌కు మంచి పేరు తెచ్చి పెట్టాయి, ముఖ్యంగా దర్బార్‌లో రజనీకాంత్‌కు కూతురుగా కీలక పాత్రను పోషించి మెప్పించింది. ఇంకా చెప్పాలంటే దర్బార్ చిత్రంలో హీరోయిన్ నయనతార పాత్ర కంటే నివేదా పాత్రకే అధిక ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంగా నటిగా నివేదా థామస్ అనుభవాలను చూద్దాం. చదువుకునే రోజుల్లోనే నటిగా రంగప్రవేశం చేశాను. అయినా నటనతో పాటు చదువుకు ప్రాముఖ్యతనిచ్చాను. అలా గత ఏడాదే చదువులో ఆర్కిటెక్చర్ పూర్తి చేశాను. దర్బార్ చిత్రంలో రజనీకాంత్‌తో నటించిన అనుభవం గురించి చెప్పాలంటే చాలానే ఉంది. ఆ చిత్ర షూటింగ్‌కు ముందే ఏవీఎం స్టూడియోలో ఫొటో షూట్ నిర్వహించారు. అప్పుడే రజనీకాంత్‌ను దగ్గరగా చూశాను. అదీ ఆదిత్య అరుణాచలం (దర్బార్ చిత్రంలోని పాత్ర) గెటప్‌లో చూశాను. అప్పుడే ఆయన సూపర్‌స్టార్ కంటే కూడా ఒక తండ్రిగా నా మనసులో నిలిచిపోయారు. ఇక దర్బార్ చిత్ర షూటింగ్లో కామెడీ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో రజనీకాంత్‌లో ప్రత్యేక ఎనర్జీని చూశాను. ఆయన్ని ఆట పట్టించే సన్నివేశాల్లో నటించడానికి నటుడు యోగిబాబు చాలా సంకటపడ్డారు. అప్పుడు రజనీ సార్‌ను చూడొద్దు. స్క్రిప్ట్‌లో ఉన్నది నువ్వు చెయ్యి కన్నా అని ఆయన ఎంకరేజ్ చేశారు. కామెడీ సన్నివేశాల్లో తమతో జాలీగా ఎంగేజ్ అయి చాలా సూచనలిచ్చేవారు. దాన్ని అవుట్‌పుట్ చూస్తే వేరే లెవల్‌గా ఉండేది. నిజం చెప్పాలంటే దర్బార్ చిత్ర షూటింగ్లో చాలా ఖుషీగా ఉన్నాను. కారణం పాపనాశం తరువాత చాలా గ్యాప్ తరువాత తమిళంలో మాట్లాడి నటించాను. అంతగా తమిళ చిత్రాలను మిస్ అయ్యాను. నా పాత్రకు ప్రాముఖ్యత ఉంటే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధం. కథానాయకిగా మాత్రమే నటిస్తానని, పలాన భాషలోనే నటిస్తానని నిబంధనలు లేవు. రజనీకాంత్‌లో కామెడీ సెన్స్ నాకు చాలా ఇష్టం. అలాంటి సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు ఆయన ఖుషీ అవుతూ మమ్మల్ని జాలీ పరిచేవారు. ఇకపోతే కమలహాసన్‌ను తొలిసారిగా పాపనాశం చిత్రంలో నాన్న గెటప్‌లోనే చూశాను. చిత్రం బాగా రావాలని ఆయన చూపే సిన్సియారిటీ నాకు చాలా నచ్చింది. అదే విధంగా విజయ్ కెమెరా వెనుక చాలా ప్రశాంతంగా ఉంటారు. అదే కెమెరా ముందుకు వచ్చే ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. నాకు సినిమా చేయాల్సింది ఇంకా చాలా ఉంది. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో చాలా చిత్రాల్లో నటించాలి. భాషను నేర్చుకోవడం అంటే నాకు చాలా ఆసక్తి. ఏ భాషనైనా చాలా త్వరగా సెట్ అయిపోతాను. అందుకే ఇతర భాషా చిత్రాల్లోనూ నటించాలని కోరుకుంటున్నాను. ఇక సినిమాలో మరచిపోలేని అనుభవం అంటే తెలుగులో నటించిన జెంటిల్మెన్ చిత్రమే. ఆ చిత్రం కోసం ఒక సారి కంటిన్యూగా రెండు రోజులు విరామం లేకుండా నటించాను. షూటింగ్ పూర్తి అయిన తరువాత 16 గంటల పాటు నిద్రపోయాను. ఆ సంఘటన ఎప్పటికీ మరచిపోలేను. డబ్బు మాత్రమే సంతోషాన్నివ్వదన్నది నమ్మే వ్యక్తిని నేను. ఖాళీ సమయం లభిస్తే నేను ఉండేది ఇంట్లోనే. అమ్మకు ఇంటి పనుల్లో సహాయం చేస్తాను. -
దర్బార్ : మూవీ రివ్యూ
టైటిల్: దర్బార్ జానర్: యాక్షన్ ఎంటర్టైనర్ నటీనటులు: రజనీకాంత్, నయనతార, నివేదా థామస్, యోగిబాబు, సునీల్ శెట్టి, సంగీతం: అనిరుద్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఏఆర్ మురుగదాస్ బ్యానర్: లైకా ప్రొడక్షన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ తనదైన స్టైల్లో బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సంబరాలను ప్రారంభించాడు. దర్బార్ సినిమాతో బాక్సాఫీస్ బరిలో పందెంకోడిలా దూకాడు. ఇది డబ్బింగ్ సినిమా అయినా.. తెలుగులో రజనీకాంత్‌కు ఉన్నఛరిష్మా, స్టామినాను చూసుకుంటే పెద్ద సినిమాగానే పరిగణించాలి. గతంలో కబాలి, కాలా, 2.0, పెట్టా వంటి సినిమాలతో తెలుగువారిని పలుకరించిన ఈ సూపర్‌స్టార్ తన స్టామినాకు తగ్గ హిట్‌ను అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో స్టార్ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తొలిసారి రజనీకాంత్ నటిస్తున్న సినిమా కావడం.. సంక్రాంతి బరిలో దిగుతుండటంతో ‘దర్బార్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు రజనీ సరసన నయనతార నటిస్తుండటం.. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లో ఆదిత్య అరుణాచలంగా రజనీ తనదైన లుక్స్‌తో మెస్మరైజ్ చేయడం సినిమాపై అంచనాలను పెంచింది. సంక్రాంత్రి కానుకగా తాజాగా ప్రేక్షకుల ముందుకు ‘దర్బార్’ ఏమేరకు ప్రేక్షకుల మెప్పించిందో తెలుసుకుందాం పదండి... కథ: ముంబై పోలీసు కమిషనర్ అయిన ఆదిత్య అరుణాచలం (రజనీకాంత్) ఒక్కసారిగా ఆవేశానికిలోనై.. రౌడీలను, గ్యాంగ్స్టర్లను విచ్చలవిడిగా కాల్చిచంపుతుంటాడు. అతని ఎన్కౌంటర్లపై విచారణ జరపడానికి వచ్చిన మానవహక్కుల కమిషన్ సభ్యులను కూడా బెదిరిస్తాడు. ఏదైనా పని చేపడితే.. దానిని కంప్లీట్‌గా క్లీన్ చేసే వరకు వదిలిపెట్టని ఆదిత్య అరుణాచలం ముంబైలో డ్రగ్స్, హ్యుమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్‌లను ఏరివేసే క్రమంలో కిరాతకుడైన విక్కీ మల్హోత్రా కొడుకు అజయ్ మల్హోత్రాను అరెస్టు చేస్తాడు. ఆదిత్య అరుణాచలం వ్యూహాలతో అనూహ్య పరిస్థితుల నడుమ జైల్లోనే అజయ్ హతమవ్వాల్సి వస్తోంది. దీంతో డ్రగ్‌లార్డ్, మొబ్స్టర్ అయిన హరిచోప్రా (సునీల్ శెట్టి) ప్రతీకారానికి తెగబడతాడు. ఆదిత్య కూతురితోపాటు విక్కీని కూడా చంపుతాడు. అతనెందుకు ఈ హత్యలు చేశాడు. గతంలో పోలీసులను సజీవదహనం చేసి ముంబై పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసిన హరిచోప్రా అసలు ఎవరు? ఈ చిక్కుముడులను ఆదిత్య అరుణాచలం ఎలా విప్పాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది మిగతా కథ.. నటీనటులు: దక్షిణాది వెండితెరపై ఇప్పటికీ తిరుగులేని సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆయనకు వయస్సు పెరుగుతున్నా.. రోజురోజుకు స్టామినా మాత్రం తగ్గడం లేదు. తనదైన స్టైల్, గ్లామర్, యాక్టింగ్, పంచ్ డైలాగులతో రజనీ ఇప్పటికీ వెండితెరమీద ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నాడు. తాజా సినిమా ‘దర్బార్’ కూడా పూర్తిగా రజనీ స్టైల్, మ్యానరిజమ్స్, పంచ్ డైలాగుల మీద ఆధారపడింది. ముంబై పోలీసు కమిషనర్‌గా రజనీ లుక్, స్టైల్, మ్యానరిజమ్స్ ఫ్యాన్స్‌తో అదరహో అనిపిస్తాయి. పోలీసు కమిషనర్‌గా రౌడీ మూకలను రప్ఫాడిస్తూనే.. ఇటు నయనతారతో మనస్సు గెలిచేందుకు ప్రయత్నించే పాత్రలో రజనీ అదరగొట్టాడు. తన ఏజ్‌కు తగ్గట్టు నడి వయస్సు పాత్ర పోషించిన రజనీ.. నయనతారతో మాట్లాడేందుకు, ఆమె ప్రేమ గెలిచేందుకు పడే పాట్లు ప్రేక్షకులను నవిస్తాయి. ఇక, హీరోయిన్గా నయనతార పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఇది ప్రధానంగా తండ్రీ-కూతురు మధ్య సెంటిమెంట్ కథ. తండ్రిగా రజనీ, కూతురిగా నివేదా థామస్ తెరపై అద్భుతంగా ఒదిగిపోయారు. స్నేహితుల్లా ఉండే తండ్రీ-కూతురు మధ్య సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. సెంకడాఫ్‌లో ఇద్దరి పాత్రలు, అభినయం ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తుంది. ఇక, విలన్‌గా సునిల్ శెట్టి ఓ మోస్తరుగా నటించాడు. రజనీ స్థాయికి తగ్గ విలన్ అయితే కాదు. యోగిబాబు కామెడీ అంతంతమాత్రమే ఉండగా.. ముంబై నేపథ్యం కావడంతో ఎక్కువశాతం నటులు కొత్తవాళ్లు, బాలీవుడ్ వాళ్లు సినిమాలో కనిపిస్తారు. విశ్లేషణ: రజనీకాంత్‌ను మరోసారి తెరమీద పోలీసు ఆఫీసర్‌గా చూపిస్తూ మురగదాస్ తీసుకొచ్చిన ‘దర్బార్’ సినిమాలో కథ అంత బలంగా కనిపించదు. ఇలాంటి రివేంజ్ డ్రామా కథలతో ఇప్పటివరకు చాలా సినిమాలే వచ్చాయి. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏమిటంటే అది కచ్చితంగా రజనీకాంత్. ప్రతి ఫ్రేములోనూ రజనీని స్టైలిష్‌గా చూపించడంలో, రజనీ స్టైల్స్, మ్యానరిజమ్స్ ఉపయోగించుకోవడం దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కానీ, కథ కొత్తది కాకపోవడం, క్లైమాక్స్ రోటిన్‌గా ఉండటంతో కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా కొంత బోర్ కొట్టవచ్చు. ఇక, సెకండాఫ్‌లో కథ కొంచెం నెమ్మదించినట్టు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా బాగున్నా.. క్లైమాక్స్ రోటిన్‌గానే అనిపిస్తుంది. ఈ సినిమాకు ప్రధాన బలం అనిరుద్ అందించిన నేపథ్య సంగీతం. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో చాలా సీన్లను అనిరుద్ ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు. ముఖ్యంగా రైల్వేస్టేషన్లో వచ్చే ఫైట్ సీన్లో ఫైట్ స్టైలిష్‌గా ఉండటంతోపాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్బ్‌గా అనిపిస్తుంది. అయితే, డబ్బింగ్ సినిమా కావడంతో పాటలు చాలావరకు రణగొణధ్వనుల్లా అనిపిస్తాయి. ఇక, సినిమాటోగ్రఫి బాగుంది. సినిమా నిర్మాణ విలువలూ రిచ్‌గా ఉన్నాయి. మొత్తానికీ ఈ సినిమా రజనీ ఫ్యాన్స్‌కు పండుగే అని చెప్పవచ్చు. బలాలు రజనీకాంత్ స్టైలిష్ లుక్, మ్యానరిజమ్ కూతురిగా నివేదా థామస్ నటన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బలహీనతలు రజనీ స్థాయికి తగ్గట్టు కథ బలంగా లేకపోవడం ఒకింత రోటిన్ కథ కావడం, రోటిన్ క్లైమాక్స్ - శ్రీకాంత్ కాంటేకర్ -
దర్బార్: ట్విటర్లో ఏమంటున్నారంటే?
సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఏర్పడ్డాయి. అంతేకాకుండా చాలా కాలం తర్వాత తలైవా పోలీస్ గెటప్‌లో కనిపిస్తుండటంతో థియేటర్లో రచ్చరచ్చే అని ఫ్యాన్స్ ఆనందపడ్డారు. ఇక సంక్రాంతి కానుకగా నేడు(గురువారం) ‘దర్బార్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ‘దర్బార్’ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విటర్లో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. రజనీ వన్ మ్యాన్ షోతో అదరగొట్టారని.. ఈ సినిమాతో అలనాటి తలైవాను మళ్లీ చూశామని తమిళ తంబిలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అనిరుధ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో రచ్చరచ్చ చేశాడంట. అదేవిధంగా ఇంటర్వెల్ సీన్ అదిరిపోయిందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే రేసు గుర్రం పరిగెట్టినట్టు పరిగెత్తిందని అందరూ చెబుతున్న కామన్ పాయింట్. సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు ఒక్క సెకన్ కూడా బోర్ కొట్టకుండా ఉందట. ఇక సెకండాఫ్‌లో డైరెక్టర్ తన క్రియేటివిటీని ప్రదర్శించాడని అంటున్నారు. దీంతో బొమ్మ బ్లాక్‌బస్టర్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘జెట్ స్పీడ్ స్క్రీన్ ప్లే, ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. కామెడీ, రొమాంటిక్, యాక్షన్స్ సీన్స్‌లో తలైవా అదరగొట్టాడు. విలన్ ఇంటర్వెల్‌కు ముందు రావడంతో అసల ఆట ఆరంభవుతుంది’అంటూ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘ఈ సినిమా రూ.400-500 కోట్లు వసూలు చేయకపోతే సినీ అభిమానులకు టేస్ట్ లేదని అర్థం’, ‘తలైవా వన్ మ్యాన్ షో. రజనీ ఎనర్జీ, స్టైల్, చరిష్మా అందరినీ ఇన్స్పైర్ చేసేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రజనీని చాలా కొత్తగా చూపించారు. ఘనవిజయాన్ని అందుకున్న ‘దర్బార్’ టీంకు శుభాకాంక్షలు’, ‘బొమ్మ బ్లాక్‌బస్టర్ హిట్’, అంటూ పలువురు నెటజన్లు ట్విటర్లో కామెంట్ చేస్తున్నారు. Hats off to Thalaivar and ARM. #Darbar Every minute enjoyable. No doubt , #Darbar going to be industrial hit and massive blockbuster. Only one super star and thalaivar. No one can stand in front of thalaivar. #DarbarThiruvizha#DarbarFDFS #DarbarThiruvizha — looking for good leader (@suchi2019) January 9, 2020 #Darbar 1st half - It's a complete Vishwaroopam of #SuperstarRajinikanth's charisma, energy & screen presence🙏👑 #Thalaivar pinni pedal edukaraaru. Ageless!#TharamMaaraSingle la avar panra dance, settai (enjoying Mahanadhi Kamal sir's kiss scene) etc vera ragam👌😎 Delightful — Kaushik LM (@LMKMovieManiac) January 9, 2020 -
ఆ అగ్రనటిపై దర్శకనిర్మాతలు గుర్రు!
దక్షిణాది అగ్రనటి నయనతారపై తాజాగా విమర్శల దాడి జరుగుతోంది. సంచలన నటి మాత్రమే కాకుండా, అగ్రకథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. అంతేకాదు దక్షిణాదిలోనే అత్యధిక పారితోíÙకం డిమాండ్ చేస్తున్న నటిగానూ ఈ అమ్మడికి పేరుంది. ఆ మధ్య యువ హీరోలతో జత కట్టిన నయనతార ఇప్పుడు వరుసగా స్టార్ హీరోలతోనే నటిస్తోంది. నటుడు విజయ్‌తో రొమాన్స్ చేసిన బిగిల్(తెలుగులో విజిల్) ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అదేవిధంగా చిరంజీవితో సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించింది. తాజా రజనీకాంత్‌తో జత కట్టిన దర్బార్ చిత్రం గురువారం తెరపైకి రానుంది. ప్రస్తుతం తన ప్రియుడిని నిర్మాతగా చేసి నెట్రికన్ అనే చిత్రంతో పాటు, ఆర్జే.బాలాజీ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న మూక్కుత్తి అమ్మన్ అనే భక్తిరస కథా చిత్రంలో నటిస్తోంది. ఈ రెండూ కథానాయకి పాత్రలకు ప్రాధ్యానత కలిగిన చిత్రాలే కావడం విశేషం. ఇలా నటిగా బిజీగా ఉన్న నయనతార ఇటీవల ఒక టీవీ చానల్ నిర్వహించిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది అనడం కంటే విమర్శలను కొని తెచ్చుకుందనే చెప్పాలి. కారణం లేకపోలేదు. నయనతార తాను నటించిన చిత్రాకు సంబంధించి ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గనదనే విషయం తెలిసిందే. చిత్రంలో నటించామా, అంతటితో తన పని అయిపోయ్యింది అని సరిపెట్టుకుంటోంది. ఈ వ్యవహారంలో నయనతారపై చాలా కాలంగా అసంతృప్తి దర్శక నిర్మాతల్లో రగులుతోంది. అయితే అదంతా లోలోనే మండుతోంది. కారణం తను అగ్ర నటిగా వెలుగొందడం కావచ్చు. కాగా ఇటీవల అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల పారితోషకం డిమాండ్ చేస్తూ నటిస్తున్న నయనతార ఆ చిత్రాల ప్రమోషన్‌కు మాత్రం రాదు గానీ, అవార్డుల అందుకోవడానికి మాత్రం రెడీ అవుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. కోట్లలో పారితోషకం చెల్లిస్తున్న నిర్మాతల చిత్రాల వ్యాపారం కోసం చేసే కార్యక్రమాల్లో పాల్గొనవలసిన బాధ్యత నటీనటులకు ఉంటుందని, దాన్ని నయనతార విస్మయిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్, విజయ్ వంటి వారు కూడా తమ చిత్రాల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, అలాంటిది నయనతార వారి కంటే ఎక్కువా? అనే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం నడిగర్ సంఘం వరకూ వెళ్లిందని, ఆమె పారితోషికం విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి సంఘం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ విషయం ఇలా ఉంటే, నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌శివన్ సహజీవినం సాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వారి మధ్య ప్రేమకు బ్రేకప్ అయ్యిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనికి ఫుల్స్టాప్ పెట్టే విధంగా నటి నయనతార ఇటీవల అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి ధరించి వెళ్లిన చీరతోనే ప్రియుడు విఘ్నేశ్‌శివన్‌తో సెల్ఫీ దిగి ఆ ఫొటోను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడీ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
మలేషియా: దర్బార్ సినిమాకు హైకోర్టు షాక్
సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా సినిమా ‘దర్బార్’కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వేల థియేటర్లలో ఈ నెల 9న దర్బార్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మలేసియాలో ఈ సినిమా విడుదల విషయమై మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. మలేసియాలో తమిళులు అధికం. అక్కడ రజనీకాంత్ సినిమాలు బాగా ఆడుతాయి. ఈ నేపథ్యంలో మలేసియాలో దర్బార్ సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. అయితే, రజనీకాంత్ గత సినిమా 2.0కు సంబంధించి నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్.. ఒక మలేషియా సంస్థకు రూ. 23 కోట్లు బకాయి పడింది. ఈ బకాయి చెల్లించకుండానే లైకా సంస్థ తాజాగా తన సినిమా ‘దర్బార్’ను మలేసియాలో విడుదల చేస్తుండటంతో సదరు సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో మలేసియాలో దర్బార్ విడుదలపై స్టే విధించాలని కోరింది. దీనికి స్పందించిన హైకోర్టు మలేసియాలో దర్బార్ విడుదలకు రూ. 4.90 కోట్ల డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ డబ్బు డిపాజిట్ చేయనిపక్షంలో మలేసియాలో దర్బార్ సినిమా విడుదల ఉండబోదని తెలుస్తోంది. -
దర్బార్ ప్రీరిలీజ్ ఫంక్షన్
-
సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు
‘‘రజనీకాంత్‌గారితో సినిమా చేయాలని 15 ఏళ్లగా అనుకుంటున్నా. కానీ కుదర్లేదు. ఫైనల్‌గా ఆయనతో సినిమాకి కాల్ వచ్చింది. ఆ న్యూస్ బయటకు వచ్చేసింది. నా మిత్రులందరూ ఫోన్ చేసి అభినందించారు. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు. తుది నరేషన్‌లోనూ సినిమా కుదరకపోవచ్చు. అలా జరగకూడదనుకున్నాను. అందుకే ఏ మార్పు సూచించినా నాలుగైదు ఆపషన్స్ ఉండేట్టు కథ తయారు చేసుకుని రజనీసార్ దగ్గరకు వెళ్లాను’’ అని దర్శకుడు మురుగదాస్ అన్నారు. రజనీకాంత్, నయనతార జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్ తెలుగులో ఈ నెల 9న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మురుగదాస్ మీడియాతో మాట్లాడారు. ► చెన్నైకి 200 కిలోమీటర్ల దూరంలో మా స్వగ్రామం. అక్కడ కేవలం 2 థియేటర్స్ ఉండేవి. చిన్నప్పుడు అమ్మతో కలసి రజనీగారి సినిమా చూశాను. రజనీగారిది ఈ ఊరే. థియేటర్లో ఉంటారు అనుకునేవాణ్ణి. ఓసారి అక్క వాళ్ల ఇంటికి వెళ్తే ఆ ఊరి థియేటర్లోనూ ఉన్నారు. రజనీగారిది మన ఊరు కదా ఇక్కడికి ఎలా వచ్చారు అని నాకు డౌట్ వచ్చింది. అది సినిమా, ఆయన నటుడు అని వివరించి చెప్పారు మా అక్క. నా 5వ తరగతిలో చెన్నై టూర్ వెళ్లాను. చెన్నైలో రజనీసార్ ఎక్కడ అని చూస్తూ ఉండేవాణ్ణి. ఆ తర్వాత అసిస్టెంట్ దర్శకుడిగా ఉన్నప్పుడు రజనీగారిని దూరంగా చూశాను. ‘గజిని’ అప్పుడు డైరెక్ట్‌గా కలిసే అవకాశం వచ్చింది. ► తమిళ ‘గజిని’ రిలీజ్ అయ్యాక రజనీగారు ఫోన్ చేశారు. తమిళంలో మంచి సినిమా రిలీజ్ అయితే అభినందించడం ఆయనకు అలవాటు. ఆ టీమ్‌తో సంభాషిస్తారు. ‘గజని’ అప్పుడు నాకు ఆ అవకాçశం కలిగింది. ఆయన ‘శివాజీ’ చేస్తున్న సమయంలో మేం కలిసి సినిమా చేయాలనుకున్నాం. అప్పుడు ‘గజిని’ హిందీ రీమేక్‌తో నేను, ‘రోబో’తో ఆయన బిజీగా ఉన్నాం. ఏడాదిన్నర క్రితం మళ్లీ సినిమా చేయాలనుకున్నాం. ఈసారి అవకాశం మిస్ అవ్వకూడదు అనుకున్నాను. ► రజనీకాంత్ గారిని నేను ఎలా చూడాలనుకుంటున్నానో, ఆయన్ను స్క్రీన్ మీద చూసి ఎలా ఎంజాయ్ చేశానో అది ఈ జనరేషన్ వాళ్లకు కూడా కనెక్ట్ అయ్యేలా ‘దర్బార్’లో చూపించాను. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగే పోలీస్ కథ ఇది. సమాజంలో జరిగే అన్యాయాలకు తనదైన శైలిలో న్యాయం చేసే పోలీస్ కథ. ఇందులో ఫ్యాన్స్ ఆయన్నుంచి ఆశించే మేనరిజమ్స్, స్టయిల్స్ అన్నీ ఉంటాయి. రజనీగారితో ఈ ప్రయాణంలో చాలా తెలుసుకున్నాను. దేవుడి గురించి ఆయన చాలా విషయాలు చెప్పారు. నాకో పుస్తకం కూడా ఇచ్చారు. ► సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియా. సినిమా కేవలం వినోదంగానే ఉండకూడదని నా అభిప్రాయం. అందుకే సందేశం ఇవ్వాలనుకుంటాను. ఆ సందేశం వల్ల ఒక్క రాత్రిలో జనాలు మారిపోతారని కాదు. కానీ ఓ ఆలోచన కలుగుతుంది. మెల్లిగా తెలుసుకుంటారు. కమర్షియల్ సినిమాలో, పెద్ద హీరోల సినిమాల్లో సందేశం జోడిస్తే ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది. ► రజనీకాంత్‌గారు మేకప్ వేసుకొని కేరవేన్ నుంచి బయటకు వచ్చాక మళ్లీ లంచ్ బ్రేక్, షూటింగ్ ప్యాకప్ అప్పుడే లోపలికి వెళ్తారు. షూటింగ్ లేట్ అయినా సహకరిస్తారు. ► మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్‌గా ఎదిగిన అమ్మాయి నయనతార. ఆమె ఎదుగుదలను మనం గౌరవించాలి. చాలా గ్యాప్ తర్వాత నయనతార, రజనీసార్ కలసి యాక్ట్ చేశారు. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు. ఎన్వీ ప్రసాద్‌గారితో ఎప్పటి నుంచో నాకు పరిచయం ఉంది. ఆయన నిర్మాతలా కాకుండా ఫ్యామిలీ మెంబర్లా ఉంటారు. నా తదుపరి చిత్రం గురించి నిర్ణయించుకోలేదు. ‘తుపాకీ’ సీక్వెల్ ఆలోచన ఉంది. ► ఈ సినిమాలో హీరో పాత్రకు ఓ పవర్ఫుల్ పేరు పెట్టాలి. ఏం పెట్టాలా అని ఆలోచించాను. షూటింగ్లో ఆలోచిద్దామనుకున్నా. హీరో వేసుకునే పోలీస్ యూనిఫామ్ మీద నేమ్‌ప్లేట్ తయారు చేయాలని ముందే అడిగేసరికి మా నాన్న పేరు (అరుణాచలం) మా అబ్బాయి (ఆదిత్య) పేర్లు కలిపి ఆదిత్యాఅరుణాచలం అని పెట్టా. ► ప్రస్తుతం కొత్త కొత్త దర్శకులు కొత్త కొత్త ఆలోచనలతో సినిమాలు తీస్తున్నారు. నా అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా డైరెక్టర్స్ అవుతున్నారు. నేను ఇచ్చిన కథతో శరవణన్ అనే అతను ‘రాంగీ’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో త్రిష కథానాయిక. ► తెలుగులో స్ట్రయిట్‌గా నేను తీసిన సినిమాలు సరిగ్గా ఆడలేదు. స్టార్‌డమ్‌ను అంచనా వేయడంలోనో ఇంకేదో విషయంలోనో మిస్ అయ్యాను. మహేశ్‌బాబు లాంటి సూపర్‌స్టార్, కష్టపడే హీరోకు హిట్ ఇవ్వలేదని బాధపడ్డాను. సినిమా రిలీజ్ అయిన 10 రోజుల తర్వాత కూడా నన్ను ప్రోత్సహించేలా మెసేజ్‌లు పంపారు మహేశ్‌గారు. ఆయన చర్మం రంగు కంటే ఆయన మనసు ఇంకా తెలుపు. సినిమాను ఇంతలా ప్రేమించే హీరోకు హిట్ ఇవ్వలేకపోయాననే బాధ ఎప్పటికీ ఉంటుంది. -
‘దర్బార్’ ప్రీ రిలీజ్ వేడుక
-
తక్కువగా ఆశ పడితే సంతోషంగా ఉంటాం
‘‘1976లో తెలుగులో నా ‘అంతులేని కథ’ సినిమా విడుదలైంది.. ఇçక్కడున్న వారిలో 99శాతం మంది అప్పుడు పుట్టి ఉండరు. తమిళ ప్రేక్షకులు నన్ను ఎంతగా ప్రేమిస్తారో తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ప్రేమించడం నా పూర్వజన్మ సుకృతం’’ అన్నారు రజనీకాంత్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్, నయనతార జంటగా రూపొందిన చిత్రం ‘దర్బార్’. ఎ. సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. ఈ నెల 9న ‘దర్బార్’ విడుదల కానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో రజనీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఎన్వీ ప్రసాద్‌గారు నాకు 20ఏళ్లుగా తెలుసు.. సినిమా ఆడినా, ఆడకున్నా ఒకేలా ఉంటారాయన. మామూలుగా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌ను ఆయన కొంచెం లో ప్రొఫైల్‌లో చేసేవారు. కానీ ‘దర్బార్’ సినిమా హిట్ అని తెలిసిపోయినట్టుంది ఆయనకు.. అందుకే ఇంత భారీ వేడుక ప్లాన్ చేశారు. నా వయసు 70 ఏళ్లు.. ఇంకా నేను హీరోగా నటిస్తున్నానంటే ప్రేక్షకుల అభిమానం, ప్రోత్సాహమే కారణం.. అవే నా ఎనర్జీ. ఈ వయసులోనూ మీరు ఇంత సంతోషంగా, ఉత్సాహంగా ఎలా ఉన్నారని కొందరు అడుగుతారు.. నేను వారికి చెప్పేది ఒక్కటే. తక్కువగా ఆశ పడండి.. తక్కువ ఆలోచనలు పెట్టుకోండి.. తక్కువగా భోజనం చేయండి, తక్కువగా నిద్రపోండి.. తక్కువగా వ్యాయామాలు చేయండి.. ఇవన్నీ చేస్తే సంతోషంగా ఉంటాం (నవ్వుతూ). తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. ‘పెదరాయుడు, బాషా, నరసింహా, చంద్రముఖి, రోబో’ వంటి సినిమాలు రజనీ ఉన్నాడని బాగా ఆడలేదు.. ఆ సినిమాలు బాగున్నాయి.. వాటిల్లో రజనీ ఉన్నాడంతే. అందరూ సక్సెస్ఫుల్ సినిమా తీయాలి, బాగా ఆడాలని తీస్తారు. సినిమా తీసేటప్పుడు ఓ మ్యాజిక్ జరుగుతుంది, ఆ సినిమా బాగా వస్తుంది. అయితే అది మన చేతుల్లో ఉండదు. ‘దర్బార్’ చేసేటప్పుడు ఆ మ్యాజిక్ మాకు తెలిసిపోయింది. మురుగదాస్‌గారితో పని చేయాలని 15ఏళ్లుగా చూశాను కానీ కుదర్లేదు.. ఇప్పుడు కుదిరింది. సుభాస్కరన్‌గారు పెద్ద వ్యాపారవేత్త. సినిమాలంటే ఇష్టంతో తీస్తున్నారు.. ఇప్పుడు మన ‘బాహుబలి’లాగా ‘పొన్నియిన్ సెల్వన్’ అనే ప్యాన్ ఇండియన్ ఫిల్మ్ తీస్తున్నారు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ట్రైలర్ చివరలో రజనీసార్ నడుచుకుంటూ వచ్చే షాట్‌కి నేను ఫిదా అయిపోయా. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఇరగదీస్తున్న మురుగదాస్‌గారికి సెల్యూట్. రజనీ సార్ ‘జీవన పోరాటం’ సినిమా టైమ్‌లో నేను పిల్లాణ్ణి.. ఆ సినిమాలో ఆయన స్టైల్ చూసి, అలా చేయాలని ప్రయత్నించా. కానీ, రాలేదు’’ అన్నారు. మురుగదాస్ మాట్లాడుతూ–‘‘నా కెరీర్లో ఇది చాలా ముఖ్యమైన సినిమా.. ఎందుకంటే రజనీగారితో నేను చేసిన తొలి మూవీ. అలాగే నేను తీసిన తొలి పోలీస్ స్టోరీ. పదిహేనేళ్ల క్రితం రజనీగారిని ప్రేక్షకులు ఎలా చూశారో ఆ స్టైల్, ఆ మాస్ అంశాలన్నీ ‘దర్బార్’లో ఉన్నాయి. ఇలాంటి ప్యాన్ ఇండియన్ సినిమా చేయడానికి అవకాశం ఇచ్చిన సుభాస్కరన్ సార్‌కి ధన్యవాదాలు. సుభాస్కరన్‌గారు నిజమైన హీరో. భవిష్యత్‌లో ఆయన లైఫ్ స్టోరీ ఒక బయోపిక్‌గా రావొచ్చు. అంత మంచి లైఫ్ స్టోరీ ఆయనది. రజనీగారికి ప్రత్యర్థిగా ఉండే బలమైన పాత్రని సునీల్శెట్టిగారు బ్యాలెన్స్ చేశారు’’ అన్నారు. నివేదా థామస్ మాట్లాడుతూ– ‘‘ఇంత పెద్ద సినిమాలో ఈ పాత్రకి నేను సరిపోతానని అవకాశం ఇచ్చిన మురుగదాస్‌గారికి చాలా థ్యాంక్స్. షూటింగ్లో రజనీ సార్ ఎలా మాట్లాడుతున్నారు? ఎలా నటిస్తున్నారని చూస్తూనే ఉండేదాన్ని. విజయ్, అజిత్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, నాని.. ఇలా అందర్నీ మనం అభిమానిస్తాం. వాళ్లందరికీ కామన్‌గా నచ్చే ఒక యాక్టర్ రజనీ సార్’’ అన్నారు. పాటల రచయిత భాస్కరభట్ల మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్‌గారి ‘2.ఓ’కి ఓ పాట, ‘పేట’కి ఓ పాట రాసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ‘దర్బార్’లో రెండు పాటలు రాశా’’ అన్నారు. సంగీత దర్శకుడు అనిరుద్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా నాకు ప్రత్యేకం.. ఎందుకంటే నా మనసుకు బాగా దగ్గరైన చిత్రమిది. ఈ అవకాశం ఇచ్చిన రజనీసార్‌కి, తన కలల చిత్రంలో చాన్స్ ఇచ్చిన మురుగదాస్‌కి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘రజనీగారిని అందరూ సూపర్‌స్టార్ అని పిలుస్తారు. కానీ, నా వరకు ఆయన గాడ్ ఆఫ్ సినిమా. ఆయన నుంచి ఎంతో కొంత నేర్చుకోవచ్చు. సెట్లో మురుగదాస్‌గారు మా అందరికీ గురువు’’ అన్నారు బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి. ‘‘రజనీకాంత్‌గారితో తొలిసారి ‘దళపతి’ సినిమాకు చేశాను. ఆయన ఎనర్జీలో మార్పు లేదు’’ అన్నారు కెమెరామేన్ సంతోష్ శివన్. ఈ వేడుకలో నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, కేకే రాధామోహన్, దర్శకులు వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, మారుతి, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, పాటల రచయిత కృష్ణకాంత్, గాయకుడు శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కొత్త లుక్కు... అదిరిపోయే కిక్కు
కొత్త ఏడాది వచ్చింది. వస్తూ వస్తూ సినిమాల కొత్త పోస్టర్లను, కొత్త చిత్రాల ప్రకటనలను మోసుకొచ్చింది. తెలుగు సినిమాకు కొత్త శోభను అలంకరించి ప్రేక్షకులకు అదిరిపోయే కిక్కు ఇచ్చింది. రజనీకాంత్ ‘దర్బార్’ ఈ నెల 9న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకడు. ఆర్మీమేజర్ అజయ్ కృష్ణగా మహేశ్‌బాబు నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. హీరో అల్లుఅర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘అల..వైకుంఠపురములో..’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. రవితేజ నటిస్తున్న ‘డిస్కోరాజా, క్రాక్’ చిత్రాల కొత్త లుక్స్ విడుదలయ్యాయి. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ‘డిస్కోరాజా’ చిత్రం ఈనెల 24న విడుదల కానుంది. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ‘క్రాక్’ వేసవిలో విడుదల అవుతుంది. ఈ నెల 15న ‘ఎంత మంచివాడవురా’ విడుదల కానుంది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన చిత్రం ఇది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ‘నిశ్శబ్దం’ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేరోజు ‘అశ్వథ్థామ’గా వస్తున్నారు నాగశౌర్య. రమణతేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నితిన్‌ను ‘భీష్మ’గా మార్చారు దర్శకుడు వెంకీ కుడుముల. ఫిబ్రవరిలో ‘భీష్మ’ విడుదల కానుంది. పులివాసు దర్శకత్వంలో కల్యాణ్ దేవ్ నటిస్తున్న ‘సూపర్‌మచ్చి’ పోస్టర్ని విడుదల చేశారు. అజయ్ కథుర్వర్, డింపుల్ జంటగా వేణు ముల్కల దర్శకత్వంలో తెరకెక్కించిన ‘విశ్వక్’ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ‘హిట్’ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ని విడుదల చేశారు. ఫిబ్రవరి 28న సినిమా విడుదలకానుంది. నిర్మాత రాజ్‌కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా నటించిన ‘చూసీ చూడంగానే..’ సినిమాను ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రవిబాబు దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి ‘క్రష్’ అనే టైటిల్ ఖరారు చేశారు.రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా జంటగా బి. శశికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘22’ మూవీ టైటిల్ యానిమేషన్ లోగోని న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేశారు. ఇంకా ‘నా పేరు రాజా: ఈడోరకం’, ‘ఏమైపోయావే’, ‘ఒక చిన్న విరామం’, ‘అనుభవించు రాజా’ వంటి సినిమాల ప్రకటనలు, వీటికి సంబంధించిన ఫస్ట్‌లుక్, కొత్త లుక్‌లు కూడా ప్రేక్షకులకు కనువిందు చేశాయి. ఓసారి కోలీవుడ్ కాలింగ్ బెల్ కొడితే.. సూర్య హీరోగా ‘గురు’ ఫేమ్ సుధాకొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శూరారై పొట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’!) సెకండ్లుక్ను విడుదల చేశారు. కార్తీ ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రానికి ‘మాస్టర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. -
ఈ స్టార్ హీరోను కొత్తగా చూపించాలనుకున్నా’
రాజకీయాలకనుగుణంగా దర్బార్ చిత్రంలో రజనీకాంత్ పాత్రను రూపొందించలేదని ఈ చిత్ర దర్శకుడు ఏఆర్.మురుగదాస్ పేర్కొన్నా రు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా దర్బార్ ఫీవర్ నడు స్తోంది. ఎక్కడ చూసినా ఈ చిత్రం గురించిన చర్చే. అందుకు కారణం చిత్ర కథానాయకుడు సూపర్‌స్టార్ కావడమే. దీనికి దర్శకుడు ఏఆర్.మురుగదాస్. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి చిత్రం దర్బార్ కావడం ఈ క్రేజ్‌కు మరో కారణం. ఇక అగ్రనటి నయనతార నాలుగోసారి రజనీకాంత్‌తో జత కట్టడం, యువ సంగీతతెరంగం అనిరుద్ సంగీతాన్ని అందించడం, లైకా సంస్థ రాజీలేని నిర్మాణం వెరసి దర్బార్ అంచనాలను పైపైకి పెంచేస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే సుమారు 10 ఏళ్ల తరువాత రజనీకాంత్ పోలీస్ అధికారిగా నటించడం కూడా అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న రజనీ దర్బార్ 2020 జనవరి 9వ తేదీన ఒక ప్రభంజనం సృష్టించడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు ఏఆర్.మురుగదాస్ శనివారం ఉదయం స్థానిక టీ.నగర్‌లోని లైకా సంస్థ కార్యాలయంలో మీడియాను కలిశారు. దర్బార్ అంటే? దర్బార్ అంటే రూలింగ్ చేసే స్థలం అనవచ్చు. దర్బార్ చిత్రం గురించి చెప్పండి? చిత్ర కథ గురించి ఇప్పుడే రివీల్ చేయలేను గా నీ, ఇది పూర్తిగా ముంబైలో చిత్రీకరించిన చిత్రం. రజనీకాంత్ పోలీస్‌కమిషనర్‌గా నటించారు. ఈ చిత్ర కథకు ఎక్కడ బీజం పడింది? ఒకసారి రజనీకాంత్‌ను కలవడానికి కారులో వెళుతున్నాం. నిర్మాత థానునే రజనీకాంత్‌కు నన్ను పరిచయం చేశారు. అలా కారులో పయనిస్తుండగానే కథ గురించి ఆలోచించాను. రజనీకాంత్ గత పదేళ్లుగా చేస్తున్నవేంటి? చేయని విషయాలు ఏంటి. అన్న దాని గురించి బేరీజు వేసుకున్నాను. రజనీకాంత్‌ను ప్రస్తుతం చేస్తున్న చిత్రాలకు భిన్నంగా చూపించాలన్న విషయంలో చాలా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాను. పదేళ్లుగా ఆయన నటించిన చిత్రాలకు భిన్నంగా, కొత్తగా రజనీకాంత్‌ను చూపించాలనుకున్నాను. అలాగని కోట్లకు పడగలెత్తిన రజనీకాంత్ మోసానికి గురై ఆస్తులు పోగొట్టుకుని తిరిగి సంపాందించుకోవడం లాంటి కథను, డాన్ ఇతివృత్తంతో కూడిన కథను ఆయనతో చేయాలనిపించలేదు. మరో విషయం ఏమిటంటే తుపాకీ చిత్రం షూటింగ్ సమయంలో మిలటరీ నేపథ్యంలో చిత్రం చేస్తే, హర్బర్‌లో షూటింగ్ చేస్తే ఆ చిత్రాలు ఆడవు అని అర్థం చేసుకున్నాను. అలాంటి ఆలోచనలోంచి పుట్టిందే పోలీస్అధికారి పాత్ర. రజనీకాంత్‌ను కలిసినప్పుడు యూండ్రుముఖం చిత్రంలో అలెక్స్ పాండియన్‌ను పూర్తి స్థాయిలో చూపించాలనుకుంటున్నట్లు చెప్పారు. అది విన్న ఆయన బాగుంది చేద్దాం అని చెప్పారు. రజనీకాంత్‌ను పోలీస్ గెటప్‌లో మీసం, గెడ్డంతో చూపించడానికి కారణం? నిజానికి పోలీసులకు గడ్డం ఉండదు. అలా ఉండాలంటే రీజన్ ఉండాలి. గెడ్డం లేకపోతే ముఖానికి అలెర్జీ వస్తుందనో, ఏదైనా మొక్కుబడి లాంటి రీజన్లతో పై అధికారి వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఒక పోలీస్అధికారి సూచనలను తీసుకున్నాం. అలా ఒక రీజన్‌తో దర్బార్ చిత్రంలో రజనీకాంత్‌కు గడ్డెం, మీసం పెట్టాం. మహిళల రక్షణ గురించి ఏమైనా చెప్పారా? అలాంటి చిన్న చిన్న అంశాలు ఉంటాయి. అవి రియలిస్టిక్‌గా ఉంటాయి. నిజానికి మహిళా రక్షణ చట్టాలు ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో చాలా బాగా అమలవుతున్నాయి. తమిళనాడులో కూడా అలాంటి చట్టాలు అమలయితే బాగుంటుంది. దర్బార్ చిత్ర ట్రైయిలర్ చూస్తుంటే రక్తపాతం అధికంగా ఉన్నట్లు తెలుస్తోందే? దీన్ని పాన్ ఇండియా చిత్రంగా ఉండాలని భా వించాం. తమిళం, తెలుగు భాషలతో పాటు హిందీలోనూ రూపొందించ తలపెట్టాం. బాలీవుడ్ చిత్రా ల్లో కాస్త వైలెన్స్ అధికంగా ఉంటేనే అక్కడ ప్రేక్షకులు చూస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫాన్ ఇండియా చిత్రంగా దర్బార్‌ను తెరకెక్కించాం. ఈ చిత్ర షూటింగ్లో రజనీకాంత్‌ను చాలా దగ్గరుండి చూశారు. ఆయన గురించి? రజనీకాంత్ చాలా ఆశ్యర్యకరమైన వ్యక్తి. షూ టింగ్ ముగిసిన తరువాత ఆయన్ని చూడడానికి వేలాది మంది అభిమానులు ఎదురుచూస్తుంటా రు. ఒక సూపర్‌స్టార్, త్వరలో రాజకీయరంగ ప్ర వేశం చేయబోతున్న వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రజనీకాంత్ అలాంటివేవీ లేకుండా చాలా సహజంగా అందరిని పలకరిస్తూ, వారితో ఫొటోలు దిగుతూ ఎంతో నిరాడంబరతను ప్రదర్శిస్తారు. అంతే కాదు నేను ఏ ప్రశ్ర అడిగినా, అది వ్యక్తిగతం అయినా, రాజకీయపరమైనదైనా, ఆధ్యాత్మికపరమై నది అయినా అన్నింటికీ బదులిచ్చేవారు. ముఖ్యంగా నటనపై ఆయనకు ఉన్న తపన నన్ను ఎంతగానో ఆశ్చర్యచకితుడిని చేసింది. ప్రతి సన్నివేశం గురించి బాగుందా? అని అడుగుతారు. అంత డెడికేషన్స్ ఈ తరం నటుల్లో చాలా తక్కువే ఉంటుంది. రజనీకాంత్ త్వరలో రాజకీయరంగప్రవేశం చేయనున్నారు.ఈ చిత్రం ఆయన రాజకీయాలకు ఎంత వరకూ ఉపయోగపడుతుంది? నిజం చెప్పాలంటే రజనీకాంత్ రాజకీయాలకు ఉ పయోగపడేలా దర్బార్ చిత్ర కథను తయారు చేయలేదు. అలాంటి వాటిని అవైడ్ చేశాం. అయితే చిత్రంలో చిన్న చిన్న సన్నివేశాలు అలాంటివి ఉంటాయి. ఎంజీఆర్ రాజకీయ రంగప్రవేశానికి ముందు ఉలగం చుట్రుం వాలిబర్ చిత్రం చేశారు. ఆ చిత్రం ఆయన రాజకీయా రంగప్రవేశానికి తోడ్పడింది? నిజమే. అయితే ఎంజీఆర్ నటించిన ఉలగం చుట్రుం వాలిబర్ చిత్రం వేరు. రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్ర కథ వేరు. ఎంజీఆర్ ఉలగం చుట్రుం వాలిబర్ జేమ్స్‌బాండ్ తరహా కథతో కూడినది. దర్బార్ ఒక పవర్ఫుల్ పోలీస్అధికారి ఇతి వృత్తంతో కూడిన చిత్రం. రజనీకాంత్ ఆలోచనలు చాలా యంగ్‌గా ఉంటాయి. ఆయనలో ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు. 40 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తారు. రజనీ రాజకీయ ప్రవేశం గురించి? ఆయన రాజకీయ రంగ ప్రవేశం గురించి చెప్పేటంతటి వాడిని కాదు. అయితే ఆయనలో ప్రజలకు మంచి చేయాలన్న తపన మాత్రం ఉంది. చదవండి: అమితాబ్ సూచనను పాటించలేకపోతున్నా ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటించాలని ఉంది -
డుమ్ డుమ్ డుమ్
‘డుమ్ డుమ్ డుమ్ గట్టి మేళం మోగేట్టు...’ అంటూ సాగే పెళ్లి పాటను ‘దర్బార్’ చిత్రబృందం గురువారం విడుదల చేసింది. రజనీకాంత్, నయనతార జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ సినిమాలోని రెండో పాట (డుమ్ డుమ్..)ను గురువారం రిలీజ్ చేశారు. కృష్ణకాంత్ రచించిన ఈ పాటను నకాష్ అజీజ్ పాడారు. అనిరుధ్ సంగీత దర్శకుడు. గేయరచయిత కృష్ణకాంత్ మాట్లాడుతూ – ‘‘రజనీకాంత్‌గారికి పాట రాసే అవకాశం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. ఇదంతా ఓ కలలా ఉంది. సినిమాలో ఓ యువ జంటకు పెళ్లయ్యే సందర్భంలో వచ్చే పెళ్లి పాట ఇది. భార్యాభర్తల అన్యోన్యతకు సంబంధించి చిన్న ఫిలాసఫీ ఉన్న పాట. ఈ అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా: సంతోష్ శివన్. -
దుమ్మురేపుతున్న ‘డుమ్ డుమ్’ పాట
రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ తెలుగులో రిలీజ్ చేయనున్నారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో రజనీ ఇంట్రడక్షన్ సాంగ్ 'దుమ్ము ధూళి' విడుదలైంది. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకువెళుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాటకి అనంత శ్రీరామ్ సాహిత్యం అందిచగా, ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. 'డుమ్ డుమ్' అంటూ సాగే ఈ పాట రజనీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. పెళ్లికి ముందు, తర్వాత భార్యభర్తలు ఎలా ఉండాలి అనే అంశాన్ని పాట రూపంలో చక్కగా తెలియజేశారు. పెళ్లి నేపథ్యంలో వచ్చే ఈ ఎనర్జిటిక్ సాంగ్‌కు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా, మకాష్ అజీజ్ ఆలపించాడు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
రజనీ కొత్త చిత్రానికి కుదిరిన ముహూర్తం
తమిళ తలైవా రజనీకాంత్.. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారే తప్పితే అది కార్యరూపం దాల్చడంలో అలసత్వం వహిస్తున్నారని కొంతమంది అభిమానులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై నోరు విప్పని రజనీ సినిమాల్లో మాత్రం స్పీడు పెంచాడు. రాజకీయాల కోసం రజనీ సినిమాలు వదిలేయలేదని మరికొంతమంది అభిమానులు ఆనందరపడుతున్నారు. ఈ క్రమంలో రజనీ తాజాగా నటించిన ‘దర్బార్’ విడుదలకు సిద్ధంగా ఉండగా మరో సినిమా పట్టాలెక్కించాడు. ఇది రజనీకాంత్‌కు 168వ సినిమా కాగా, దీనికి సంబంధించిన షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. యాక్షన్ డైరెక్టర్ శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రజనీకాంత్‌తో సంగీత దర్శకుడు డి ఇమ్మాన్ తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తొలి రోజు షూటింగ్లో పాల్గొన్నారు. పాటతో సినిమా చిత్రీకరణ ప్రారంభమైందని సంగీత దర్శకుడు డి ఇమ్మాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రజనీతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘నిరాడంబరంగా కనిపించే రజనీ సర్, తన మాటలతో చుట్టూరా ఉండేవారిలో చైతన్యం తీసుకువస్తాడు. అతని శక్తి చూస్తే ఔరా అనిపించక మానదు’ అంటూ క్యాప్షన్ జోడించాడు. సన్‌పిక్చర్స్ ఆధ్వర్యంలో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. ప్రస్తుతం రజనీకాంత్ దర్బార్ సినిమా భారీ అంచనాల నడుమ జనవరి 9న బాక్సాఫీస్ బరిలో దిగనుంది. (చదవండి: అమితాబ్ రాజకీయాల్లోకి వెళ్లొద్దన్నారు) -
డబ్బే నాకు సామర్థ్యాన్ని ఇచ్చింది..
తమిళనాడు, పెరంబూరు: నటనలో నేను సాధించానని అనుకోవడం లేదు అని సూపర్‌స్టార్ రజనీకాంత్ పేర్కొన్నారు. దక్షిణాది సూపర్‌స్టార్‌గా కొనియాడబడుతున్న ఈయన తాజాగా నటించిన చిత్రం దర్బార్. నయనతార నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో లైకా సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతికి తెరపైకి రానుంది. కాగా దర్బార్ హిందీలోనూ విడుదల కానుండడంతో ఇటీవల చిత్ర యూనిట్ ముంబైలోనూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు రజనీకాంత్ ఇచ్చిన సమాధానాలను చూద్దాం. ప్ర: నటనలో మీకింత సామర్థ్యం ఎక్కడ నుంచి వచ్చింది? జ: నిజం చెప్పాలంటే డబ్బే నాకు సామర్థ్యాన్ని ఇచ్చింది. తీసుకున్న పారితోషికానికి తగ్గట్టుగా నేను ఆ పాత్రలకు న్యాయం చేయాలి. ఇక నటించడం అన్నది నాకు చాలా ఆసక్తి. కెమెరా ముందుకు రావడం, వెలుగులో ఉండడం నాకు ఇష్టం. అదే నాకు సమర్థతను కలిగిస్తుంది. ప్ర: నటుడిగా ఎంత వరకూ ఎదిగానని అనుకుంటున్నారు? జ: వాస్తవంగా చెప్పాలంటే నేను నటుడిగా ఎదగలేదనే భావిస్తాను.ఆరంభంలో కొంచెం బిడియంగానూ, బెదురుగానూ ఉండేది. నటించగా నటించగా ఆత్మవిశ్వాసం పెరిగింది. మరో విషయం ఏమిటంటే నేను దర్శకుల నటుడిని. నటన అనేది నాకిచ్చిన పాత్రల పరిస్థితిని బట్టి ఉంటుంది. ఎలానో ప్రేక్షకులకు నేను నచ్చేశాను. అంతే కానీ నటనలో నేనే ఎదిగానని భావించడం లేదు.అప్పుడు ఇప్పుడు ఓకే రజనీకాంత్ ప్ర: గత 8 నుంచి 12 ఏళ్లలో అమితాబ్ నటించిన చిత్రాల్లో ఏ చిత్రానైనా రీమేక్ చేయాలనిపించిన చిత్రం ఉందా? జ: షమితాబ్ చిత్రం ప్ర: మీకు ప్రపంచ వ్యాప్తంగా అబిమానులు ఉన్నారు. అయినా ఒకే ఒక్క హాలీవుడ్లో మాత్రమే నటించారే? జ: మంచి కథ, అవకాశాలు రాలేదు. అలాంటి అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తాను. ప్ర:ముంబైలో మీకు నచ్చింది? జ: ఒకటని కాదు ముంబై అంటేనే చాలా ఇష్టం, ప్ర:మీ చిత్రంలో నటించిన సునిల్‌శెట్టి గురించి? జ: ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. ముఖ్యంగా వరుసగా చిత్రాలు చేస్తున్న సునిల్‌శెట్టి ఆయన తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోతే నటనను దూరంగా పెట్టి ఆయనకు వైద్యం చేయించడానికే సమయాన్ని కేటాయించారు. అలా నాలుగేళ్ల విరామం తరువాత ఇప్పుడు మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు సునిల్‌శెట్టి. -
అమితాబ్ సూచనను పాటించలేకపోతున్నా
పెరంబూరు: బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్ తనను రాజకీయాల్లోకి వెళ్లొద్దని హితవు చెప్పారని సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ చెప్పారు. తలైవా అని ఎంతో అభిమానంగా పిలుచుకునే ఆయన అభిమానులు చాలా కాలంగా రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. అలా సుమారు 25 ఏళ్ల వారి ఆకాంక్షను నెరవేర్చడానికి రజనీకాంత్ సిద్ధమయ్యారు. గత రెండేళ్ల క్రితం అంటే 2017 డిసెంబర్ నెలలో రాజకీయాల్లోకి వస్తున్నట్లు బహిరంగంగా వెల్లడించారు. అంతే కాదు ఎంజీఆర్ బాటలో పయనిస్తానని, తమిళనాడు రాజకీయాల్లో ఆయన లేని లోటును తాను మాత్రమే భర్తీ చేయగలనని చాలా ఆవేశంగానే పేర్కొన్నారు. దీంతో ఆయన అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోయాయి. అయితే ఆ తరువాత రాజకీయపరంగా వార్తల్లో ఉన్నారు గానీ ఇప్పటి వరకూ పార్టీని ప్రకటించలేదు. దీంతో రజనీ రాజకీయం అన్నది మాటల్లోనే కానీ, చేతల్లో కార్యరూపం దాల్చదు అనే ప్రచారాన్ని ఆయన ప్రతి కూల వర్గం గొంతెత్తి మరీ ప్రచారం చేసుకుంటోంది. అయితే ఇటీవల కమలహాసన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్ మరోసారి రాజకీయంగా కాక పుట్టించే వ్యాఖ్యలు చేశారు. కమలహాసన్ తన చిరకాల మిత్రుడని, అవసరం అయితే ఆయనతో కలిసి రాజకీయాల్లో పని చేస్తానని పేర్కొన్నారు, అంతే కాదు 2020లో అద్భుతాన్ని చూస్తారని పేర్కొన్నారు..దీంతో కమలహాసన్, రజనీకాంత్ కలిసి రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది. అంతే కాదు నిజం గానే వీరిద్దరూ కలుస్తారా? అలా కలిసి పోటీ చేసినా గెలవగలరా? ఒక వేళ గెలిస్తే సీఎం గద్దెనెక్కేది ఎవరూ? లాంటి రకరకాల ప్రశ్నలతో కూడిన వార్తలు ప్రచారం అవుతున్నాయి. కాగా తాజాగా రజనీకాంత్ తన రాజకీయ ప్రస్థావనను తీసుకొచ్చారు. అమితాబ్ సూచనను పాటించలేకపోతున్నా రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం దర్బార్. దీంతో సోమవారం దర్బార్ చిత్ర యూనిట్ ముంబైలో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో పాల్గొన్న రజనీకాంత్ మాట్లాడుతూ హిందీ చిత్రసీమలో సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్ రాజకీయాలోక్కి రావద్దని తనకు చెప్పారన్నారు. అయితే ఆయన సూచనను తాను పాఠించలేకపోతున్నానని అన్నారు. దీంతో ఆయన రాజకీయరంగ ప్రవేశం నిశ్చయం అని చెప్పకనే చెప్పారు. దీంతో రజనీకాంత్ అభిమానులిప్పుడు ఆనందంతో పండగ చేసుకుంటున్నారు. నిజానికి రజనీకాంత్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించారో, అప్పటి నుంచే అందుకు కార్యాచరణను మొదలెట్టారు. తన అభిమాన సంఘాలను రజనీప్రజా సంఘాలుగా మార్చి వారిలో కొందరికి కార్య నిర్వహణ బాధ్యతలను కట్టబెట్టేశారు. వారంతా రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదుకు కార్యోన్ముఖులయ్యారు. అలా రజనీకాంత్ టార్గెట్ కోటి మందిని సభ్యులుగా నమోదు చేసినట్లు సమాచారం. కాగా రజనీకాంత్ 2020 జనవరిలోనే రాజకీయ పార్టీని ప్రకటించనున్నారని, ఆయన ప్రజా సంఘ నిర్వాహకులు దృఢంగా చెబుతున్నారు. -
ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటించాలని ఉంది
‘ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటించాలని ఉంది’ అని సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘దర్బార్’ ట్రైలర్‌ను ముంబైలో సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనను మీరు ఇంకా చేయాల్సిన పాత్రలు ఏమైనా ఉన్నాయా అని అడగ్గా.. ‘నేను ఇప్పటి వరకు 160 సినిమాల్లో నటించాను. సినీ ఇండస్ట్రీకి వచ్చి 45 ఏళ్లు గడిచిపోయాయి. నాకు ట్రాన్స్‌జెండర్ పాత్ర చేయాలని ఉంది’ అని చెప్పుకొచ్చారు. అయితే దర్శకులు ఎవరైనా.. ట్రాన్స్‌జెండర్ పాత్ర చేయాలని మిమ్మల్ని సంప్రదించారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘అలాంటిదేం లేదు. ఇప్పటి వరకు ఎవరు నన్ను సంప్రదించలేదు. మొదటిసారిగా నా కోరికను వ్యక్తపరిచాను’ అని చెప్పారు. (అదిరిపోయిన ‘దర్బార్’ ట్రైలర్) అలాగే గత 45 సంవత్సరాల నుంచి తనకు మరాఠి సినిమాలలో నటించాలనే కోరిక ఉందని, నటించే అవకాశం వచ్చినా కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని చెప్పారు. ఆ సమయం వచ్చినప్పుడు తప్పక మరాఠి సినిమాలు చేస్తానని పేర్కొన్నారు. ఇక దర్బార్ సినిమాలో.. బెంగుళూరు మరాఠి కుటుంబం నుంచి వచ్చి ముంబై పోలీసు కమిషనర్‌గా ఎదిగిన వ్యక్తి పాత్రలో రజనీ కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర గురించి చెబుతూ.. నిజానికి నాకు సీరియస్ పోలీస్ అధికారిగా విధులు నిర్వహించే పాత్రల కంటే వినోదభరితమైన పాత్రలు చేయడం అంటేనే ఇష్టం అని చెప్పారు. కాగా ‘దర్బార్’ దర్శకుడు మురుగదాస్ ఈ సినిమాలో తనను భిన్నమైన పోలీసు అధికారి పాత్రలో చూపిస్తానని చెప్పడంతో.. ఈ సినిమాకు ఓకే చెప్పానని రజనీ చెప్పుకొచ్చారు. ఇక దర్బార్ షూటింగ్లో భాగంగా ముంబైలో 90 రోజులు ఉండాల్సి వచ్చిందని, ఈ క్రమంలో తనకు ముంబై, ఇక్కడి ప్రజలు బాగా నచ్చారని పేర్కొన్నారు. -
అదిరిపోయిన ‘దర్బార్’ ట్రైలర్
-
అదిరిపోయిన ‘దర్బార్’ ట్రైలర్
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. ఈ చిత్రం ట్రైలర్ సోమవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.‘ వాడు పోలీసాఫీసరా సర్..హంతకుడు’, ‘ఆదిత్యా అరుణాచలం కమిషనర్ ఆఫ్ ముంబై’ అనే డైలాగులతో షురూ అయ్యే ట్రైలర్ రజనీ అభిమానులను అలరించేలా ఉంది. ‘ఆ చూపేంటి..ఒరిజిల్ గానే విలనమ్మా..ఇదేలా ఉంది’, ‘ ఐయామ్ ఏ బ్యాడ్ కోప్’ అంటూ రజనీకాంత్ చెప్పే సంభాషణలు హైలెట్‌గా నిలిచాయి. దర్భార్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. రజనీకాంత్ ఇందులో పోలీస్ అధికారి ఆదిత్యా అరుణాచలం పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
‘ఫుల్ యాక్షన్ ట్రైలర్‌కు సిద్దంగా ఉండండి’
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దర్బార్’. చాలా కాలం తర్వాత రజనీ పోలీస్ గెటప్‌లో అలరించనుండటంతో ఈ చిత్రంపై భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. అంతేకాకుండా విభిన్న కథలతో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల ఎక్స్‌పర్ట్‌గా పేరుగాంచిన మురుగదాస్ డైరెక్ట్ చేస్తుండటం ఈ సినిమాకు డబుల్ ప్లస్ కానుంది. కాగా ఇప్పటికే విడుదలైన రజనీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, పాటలు సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి. తాజాగా రజనీ ఫ్యాన్స్‌కు హుషారు కలిగించే వార్తను ‘దర్బార్’టీమ్ ప్రకటించింది. ‘దర్బార్’మూవీ ట్రైలర్‌ను డిసెంబర్ 16(సోమవారం) సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘హలో ఫ్రెండ్స్. ఈ విషయాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు చిత్ర ట్రైలర్ విడుదల కాబోతుంది. దర్బార్ యాక్షన్ ట్రైలర్‌తో ఎంజాయ్ చేయడానికి సిద్దంగా ఉండండి’అంటూ మురుగదాస్ ట్వీట్ చేశాడు. షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అంతేకాకుండా మూవీ ప్రమోషన్స్ కూడా భారీగా నిర్వహిస్తున్నాయి సినిమా యూనిట్. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా నివేదా థామస్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు. -
‘దర్బార్’ ఆడియో ఫంక్షన్
-
రజనీ సినిమాలో వారిద్దరూ!
సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం దర్బార్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి పాటను ఇటీవలే విడుదల చేయగా.. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రజనీ తదుపరి చిత్రం తలైవార్ 168 సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్తలు కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. రజనీ తదుపరి సినిమాను తామే నిర్మిస్తున్నామని సన్ పిక్చర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంతిరన్, పేట వంటి బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత ఈ కాంబినేషనన్లో రూపొందనున్న తలైవార్ 168కు శివ దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఈ చిత్రంలో సీనియర్ నటి మీనా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అంతేకాదు గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో రజనీ కూతురుగా కీర్తి సురేష్, భార్యగా ఖుష్బూ నటించనున్నారంటూ వార్తలు ప్రచారమవుతున్నాయి. అయితే మూవీ యూనిట్ మాత్రం ఇందుకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. రెండు నెలలుగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైన చిత్రబృందం.. కమెడియన్ సూరి మాత్రం రజనీతో కలిసి నటించే అవకాశం దక్కించుకున్నట్లు పేర్కొంది. ఈ విషయం గురించి సూరి మాట్లాడుతూ... రజనీతో స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న తన కల నిజమైందని సంతోషం వ్యక్తం చేశాడు. సూపర్‌స్టార్‌తో ఇంతవరకు సెల్ఫీ తీసుకునే అవకాశం రాలేదని.. ఇప్పుడు ఆయన పక్కన కనిపించే అదృష్టం వరించిందంటూ ఓ వీడియోను విడుదల చేశాడు. ఇక రజనీ- మీనా కాంబినేషన్లో తెరకెక్కిన ముత్తు సినిమా హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అదే విధంగా కథానాయకుడు సినిమాలోనూ వీరిద్దరూ తెరను పంచుకున్నారు. -
దుమ్ము ధూళి దుమ్ము రేపుతోంది
రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ లె లుగులో రిలీజ్ చేయనున్నారు. ‘దర్బార్’లోని తొలి పాట ‘దుమ్ము ధూళి..’ ని ఇటీవల విడుదల చేశారు. అనిరుధ్ స్వరపరిచిన ఈ పాటకి అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ‘‘దుమ్ము ధూళి’ పాట ఇంటర్నెట్లో దుమ్ము రేపుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ పాటకు ఇప్పటికి 8 మిలియన్ వ్యూస్ వచ్చాయి’’అని చిత్రబృందం పేర్కొంది. అనంత శ్రీరామ్ మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్‌గారి సినిమా మొదటి పాటకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ పాటను రాసే అదృష్టం ‘పేట’ చిత్రానికి(మరణం మాస్ మరణం..) దక్కింది. ఇప్పుడు ‘దర్బార్’ చిత్రంలో ‘దుమ్ము ధూళి’ అన్నే పాటను రాశాను. ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు పాడారు. రజనీకాంత్‌గారి ‘కథానాయకుడు’ చిత్రానికి తొలిసారి పాట రాశా. ఆ తర్వాత ‘విక్రమసింహా’, ‘2.0’, ‘పేట’, ఇప్పుడు ‘దర్బార్’ చిత్రాలకు పాటలు అందించాను’’ అన్నారు. -
దూసుకెళ్తున్న రజినీ ‘దుమ్ము.. దూళి’
రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దర్బార్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన దర్బార్.. ఫస్ట్ సాంగ్‌ను చిత్ర బృందం బుధవారం యూట్యూబ్‌లో విడుదల చేసింది. తమిళ్‌తో పాటు, తెలుగు, హిందీలో కూడా ఈ సాంగ్ విడుదల అయింది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు తెలుగులో అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాశారు. తెలుగులో ‘దుమ్ము.. దూళి’ అని సాగే ఈ పాట.. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దీంతో రజినీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్.. ఐపీఎస్ ఆఫీసర్ ఆదిత్య అరుణాచలంగా కనిపించనున్నారు. చాలా కాలం తర్వాత రజినీ పోలీసు అధికారిగా కనిపిస్తున్న చిత్రం ఇదే. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించారు. రజనీకాంత్ కూతురిగా నివేథా దామస్ నటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘దర్బార్’ చిత్రం జనవరి 9న విడుదల కానుంది. -
అభిమానులకు రజనీ బర్త్‌డే గిఫ్ట్ అదేనా?
రజనీకాంత్ పుట్టినరోజు అంటే ఆయన అభిమానులకు పండుగనే. ఆ రోజు తమ అభిమాన నటుడు అందుబాటులో ఉండకపోయినా, అభిమానులు ఆయన పుట్టినరోజును ఆర్భాటాలతో జరుపుకుంటారు. ఈ ఏడాది రజనీ బర్త్‌డే సందర్భంగా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఎదురుచూస్తోంది. రజనీకాంత్ నటించిన పేట చిత్రం గత ఏడాది సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆయన దర్బార్ చిత్రంలో నటిస్తున్న విషయం విధితమే. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో అగ్రనటి నయనతార నాయకిగా నటించింది. ఏఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి తెరపైకి తీసుకురానున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి, కాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 7న విడుదల చేయనున్నట్లు సమాచారం. మరో విశేషం ఏమిటంటే రజనీకాంత్ 25 ఏళ్ల క్రితం నటించిన బాషా చిత్రం ఎంత సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ చిత్రంతోనే ఆయన దక్షిణ భారత సూపర్‌స్టార్ అయ్యారు. రజనీ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిన ఈ చిత్రాన్ని సురేశ్‌కృష్ణ దర్శకత్వంలో సత్యమూవీస్ సంస్థ నిర్మించింది. రజనీకాంత్ 70వ పుట్టిన రోజు సందర్భంగా బాషా చిత్రాన్ని డిజిటలైజ్ చేసిసరికొత్తగా డిసెంబర్ 11న తమిళనాడులోని ప్రధాన నగరాల్లో విడుదలచేయనున్నట్లు సత్యామూవీస్ వర్గాలు వెల్లడించాయి. రజనీకాంత్ అభిమానులకు బర్త్‌డే కానుక అని సంస్థ పేర్కొంది. ఇటీవలే ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డును అందుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు బాషా చిత్ర రీ రిలీజ్ సర్ప్రైజే అవుతుంది. -
వారికంటే ముందే రానున్న రజనీ!
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా క్రేజీ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్లో వస్తున్న సెన్సేషనల్ మూవీ ‘దర్బార్’. చాలా కాలం తర్వాత రజనీ పోలీస్ గెటప్‌లో కనిపిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా వెరైటీ కథలతో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల ఎక్స్‌పర్ట్‌గా పేరుగాంచిన మురుగదాస్ డైరెక్ట్ చేస్తుండటం ఈ సినిమాకు డబుల్ ప్లస్ కానుంది. కాగా ఇప్పటికే విడుదలైన రజనీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లు సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి. షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అయితే ఈ చిత్ర విడుదల తేదీపై గందరగోళం నెలకొంది. సినిమా ప్రారంభం నుంచే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. అయితే సంక్రాంతి బరిలో ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’వంటి భారీ చిత్రాలు వస్తుండటంతో తెలుగులో దర్బార్‌కు థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో చిత్ర నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు. మహేశ్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు జనవరి 12న వచ్చే అవకాశం ఉండటంతో.. దర్బార్‌ను జనవరి 12 న కాకుండా 15న విడుదల చేయాలని నిర్మాతలు తొలుత భావించారు. అయితే వారి నిర్ణయాన్ని మరోసారి మార్చుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా లైకా ప్రొడక్షన్స్ తన అధికారిక వెబ్సైట్లో దర్బార్ విడుదల తేదీ జనవరి 9వ తేదీ అని పేర్కొంది. దీంతో సంక్రాంతి బరిలో మహేశ్ బాబు, అల్లు అర్జున్‌ల కంటే ముందే రజనీ థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉంది. ఆ రెండు భారీ చిత్రాల విడుదలకు మూడు రోజుల ముందు అన్ని థియేటర్లలో విడుదల చేసి అధిక లాభం పొందేందుకు లైకా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల టాక్ ఇక డిసెంబర్ 12న రజనీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్దమవుతున్నట్లు సమాచారం. అయితే ఆ రోజు కుదరకపోతే డిసెంబర్ 7న నిర్వహించాలని భావిస్తోంది. ఇక లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా నివేదా థామస్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు. -
రజనీ అభిమానులకు మరో పండుగ
తమిళ సినిమా: సూపర్‌స్టార్ ఈ ఒక్క పేరు చాలు అభిమానులు సంతోషంలో మునిగితేలడానికి. అవును రజినీకాంత్ అభిమానులకు సూపర్‌స్టార్ అన్నది ప్రాణవాయువు లాంటిదేనని చెప్పవచ్చు. తలైవా (నాయకుడు) అన్నది ఆ తరువాతనే. అందుకే సూపర్‌స్టార్ పట్టాన్ని అంత సులభంగా వదులుకోవడానికి రజనీకాంత్ సిద్ధంగా లేరని చెప్పవచ్చు. సినిమాలకు దూరమై రాజకీయల్లోకి ప్రవేశిస్తే సూపర్‌స్టార్ పట్టాన్ని మరో హీరో తన్నుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకే రజనీకాంత్ వరుసగా చిత్రాలను చేసుకుంటూ పోతున్నారనిపిస్తోంది. ఈయన ప్రస్తుతం దర్బార్ చిత్రంలో నటిస్తున్నారు. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇందులో అగ్రనటి నయనతార నాయకిగా నటించింది. షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. చిత్ర మోషన్ పోస్టర్‌ను ఇటీవలే విడుదల చేశారు. తమిళ వెర్షన్‌ను రజనీకాంత్ మిత్రుడు, మక్కళ్‌నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ ఆన్లైన్లో ఆవిష్కరించగా, హిందీ వెర్షన్‌ను సల్మాన్‌ఖాన్, తెలుగు వెర్షన్‌ను మహేశ్‌బాబు, మలయాళ వెర్షన్‌ను మోహన్‌లాల్ వంటి స్టార్ నటులు ఆవిష్కరించి సూపర్ పబ్లిసిటీని అందించారు. చాలా కాలం తరువాత ఆయన పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్న చిత్రం దర్బార్. చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా రజనీకాంత్‌కు డిసెంబర్ 12న పుట్టిన రోజు. అది అభిమానులకు పండుగరోజు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అంతకు ముందు అంటే డిసెంబర్ 7న వారికి మరో పండుగరోజు కాబోతోంది. అవును ఆ రోజున దర్బార్ చిత్ర ఆడియో ఆష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఈ వేడుకను చెన్నైలో భారీ ఎత్తున నిర్వహించడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. అయితే చిత్ర కథానాయకి నయనతార ఇందులో పాల్గొంటుందా అన్నది ఆసక్తిగా మారింది. -
డబ్బింగ్ షురూ
‘దర్బార్’లో ఆదిత్య అరుణాచలం మాటల తూటాలు పేలుతున్నాయి. మరి.. ఈ దర్బార్ డైలాగ్స్ ప్రేక్షకులకు ఎంత కిక్ ఇస్తాయో తెలిసేది మాత్రం సంక్రాంతి పండక్కే. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. ఇందులో నయతార కథానాయికగా నటించారు. నివేదాథామస్ కీలక పాత్రధారి. ఈ చిత్రంలో పోలీసాఫీసర్ ఆదిత్య అరుణాచలం పాత్రలో నటించారు రజనీకాంత్. ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలైనట్లు గురువారం చిత్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ వెల్లడించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ‘దర్బార్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
మామ వర్సెస్ అల్లుడు
మామాఅల్లుళ్ల సవాల్ సినిమాల్లో భలే సరదాగా ఉంటాయి. నువ్వా? నేనా? అని మామా అల్లుళ్లు తలపడటం సినిమాల్లో చూస్తుంటాం. ఇప్పుడు తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర మామాఅల్లుళ్లు రజనీకాంత్, ధనుష్ తలపడే అవకాశం కనిపిస్తోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. నయనతార కథానాయిక. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ఎప్పుడో ప్రకటించింది. మరోవైపు దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘పటాస్’. మెహరీన్, స్నేహా కథానాయికలు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ‘పటాస్’ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. దాంతో వచ్చే ఏడాది పొంగల్‌కి బాక్సాఫీస్ దగ్గర మామాఅల్లుళ్ల క్లాష్ ఏర్పడనుందని భావిస్తున్నారంతా. ఏం జరుగుతుందో చూడాలి. -
అరుణాచలం దర్బార్
రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘అరుణాచలం’ చిత్రం ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సుందర్ సి. దర్శకత్వంలో 1997లో విడుదలైన ఈ సినిమాలో అరుణాచలంగా అలరించిన రజినీ మరోసారి ‘దర్బార్’ చిత్రంలో అరుణాచలం పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ‘దర్బార్’ సినిమా తెలుగు మోషన్ పోస్టర్ని గురువారం హీరో మహేశ్‌బాబు విడుదల చేశారు. ‘‘రజనీకాంత్ సార్ నటించిన ‘దర్బార్’ మోషన్ పోస్టర్ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. మీపై ఈ ప్రేమ, అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. మురుగదాస్ సార్, చిత్రబృందానికి నా అభినందనలు’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మహేశ్‌బాబు. పవర్ఫుల్ పోలీసాఫీసర్ ఆదిత్య అరుణాచలంగా కొత్త లుక్‌లో రజనీని చూసి, ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘దర్బార్’ మోషన్ పోస్టర్ని తమిళ్లో కమల్‌హాసన్, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో మోహన్‌లాల్ విడుదల చేశారు. ‘‘అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా రూపొందుతోంది. అన్ని రకాల వాణిజ్య హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం సినిమా మీద అంచనాలను మరింత పెంచింది. ఇప్పటికే విడుదలైన రజనీ పోస్టర్స్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. 2020 సంక్రాంతి కానుకగా ‘దర్బార్’ సినిమా విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
మరోసారి ‘అరుణాచలం’గా వస్తున్న రజనీ
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటేనే ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో అందరికీ తెలిసిందే. అందులోనూ క్రేజీ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్, రజనీ కాంబినేషన్లో వస్తున్న చిత్రం అంటూ అంచనాలు పీక్స్‌లో ఉండటం ఖాయం. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘దర్బార్’. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో రజనీ పోలీస్ గెటప్‌లో కనిపించనున్నాడు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం భారీ ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా దర్బార్ మూవీ మోషన్ పోస్టర్‌ను గ్రాండ్‌గా విడుదల చేసింది చిత్ర యూనిట్. దీనిలో భాగంగా ‘దర్బార్’ చిత్ర తమిళ, మలయాల, హిందీ, తెలుగు మోషన్ పోస్టర్లను కమల్ హాసన్, మోహన్ లాల్, సల్మాన్ ఖాన్, మహేశ్ బాబు వంటి స్టార్ల చేతుల మీదుగా విడుదల చేయించింది. ప్రస్తుతం రజనీ దర్బార్ మూవీ మోషన్ పోస్టర్ నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ‘ఆదిత్య అరుణాచలం’గా రజనీ విలన్లు రఫ్పాడించనున్నాడు. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే తలైవా పదాలతో పాటు, రజనీ అడుగుల చప్పుడు హార్ట్ బీట్‌ను పెంచేస్తున్నాయి. దీంతో ‘దర్బార్’ బాక్సాపీస్ వద్ద దంచికొట్టడం ఖాయమని రజనీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, నివేధా థామస్, మరియు సునీల్ షెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం సంక్రాతికి విడుదల కానుంది. -
దుమ్ములేపుతున్న ‘దర్బార్’ మోషన్ పోస్టర్
-
రజనీకాంత్ ‘వ్యూహం’ ఫలించేనా!?
తమిళసినిమా: రజనీకాంత్ ఈ ఐదక్షరాల పేరు ఆలిండియా లెవల్లోనే ఒక అద్భుతం. రజనీ సినిమాలు వస్తున్నాయంటే బాక్సాఫీస్ షేక్ అవుతోంది. ఫ్యాన్స్ సెలబ్రేషన్ మూడ్‌లోకి వెళ్లిపోతారు. అలాంటి రజనీ త్వరలోనే మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చాలాకాలం తరువాత ఆయన పోలీసు ఆఫీసర్‌గా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న చిత్రం దర్బార్.. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ అదుర్స్ అనిపించింది. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తనదైన స్టైల్లో చెక్కుతున్నారు. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, రజనీకాంత్ నటించబోయే మరో కొత్త సినిమాకు కూడా రంగం సిద్ధమైంది. దర్శకుడు శివ డైరెక్షన్లో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మింస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి ప్రస్తుతం పలు ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్‌స్టార్ రజనీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కానుందని, ఈ సినిమా కోసం ఒక టైటిల్ కూడా పరిశీలనలో ఉందని టాక్ స్ప్రెడ్ అయ్యింది. దర్శకుడు శివకు ‘వీ’ సెంటిమెంట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు అజిత్ హీరోగా చేసిన నాలుగు చిత్రాల టైటిల్స్ వీతోనే మొదలయ్యాయి. వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం ఇలా శివ ‘వీ’ టైటిల్ చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌తో చేసే చిత్రానికి ‘వీ’ సెంటిమెంట్ కలిసివచ్చేలా.. ‘వ్యూహం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ‘వ్యూహం’ సినిమా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి కూడా పనికొచ్చేలా ఉంటుందని అంటున్నారు. ఇందులో నటి జ్యోతిక, కీర్తీసురేశ్ హీరోయిన్లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. నటుడు సూరి, వివేక్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. రజనీకాంత్ 168వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి 2020లో సమ్మర్స్పెషల్గా తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారు. -
హిట్ కాంబోలో రజనీ మరోసారి..
జయాపజయాలతో సంబంధం లేకుండా సూపర్‌స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే ‘పేట’ చిత్రంతో హిట్ కొట్టిన తలైవా ప్రస్తుతం దర్బార్తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఇదే జోష్‌లో మరో సినిమాకు రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దర్బార్ తదుపరి తమ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కే సినిమాలో రజనీ నటించనున్నారని సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.‘ ఎంతిరన్, పేట వంటి బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్, సన్ పిక్చర్స్ మెగా కాంబినేషన్లో తలైవార్ 168వ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తారు’ అంటూ రజనీ, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్, శివ ఫొటోలతో కూడిన వీడియోను ట్విటర్ షేర్ చేసింది. కాగా ఈ కాంబినేషన్లో రూపొందిన రోబో, పేట చిత్రాలు సూపర్ హిట్ కావడంతో.. ప్రస్తుతం రజనీ 168వ సినిమా కూడా రికార్డులు తిరగరాసి హ్యాట్రిక్ హిట్‌గా నిలుస్తుందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక తెలుగులో దరువు, శంఖం, శౌర్యం వంటి సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు శివ.. వేదాలం, వివేగం, విశ్వాసం వంటి చిత్రాలతో తమిళ స్టార్ హీరో అజిత్‌కు హిట్లు ఇచ్చి ఫుల్‌ఫాంలో ఉన్న సంగతి తెలిసిందే. After the blockbuster hits Enthiran and Petta, the mega hit combo of Superstar @rajinikanth and @sunpictures come together for the third time for Thalaivar 168, Superstar’s next movie, directed by @directorsiva#Thalaivar168BySunPictures pic.twitter.com/AL5Z6ryjbG — Sun Pictures (@sunpictures) October 11, 2019 -
రజనీ రఫ్ఫాడిస్తారంటున్న అభిమానులు..
సూపర్‌స్టార్ రజనీకాంత్ విజయాపజయాల గురించి పట్టించుకోకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ పరంపరలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. అయితే ‘పేట’ చిత్రం హిట్ అవడంతో తలైవాకు మంచి బూస్ట్ దొరికింది. ఆ సక్సెస్ హుషారును కొనసాగించడానికి దర్బారు చిత్రంతో రెడీ అవుతున్నాడు. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏఆర్.మురుగదాస్ తెరకెక్కించారు. ‘పేట’కు సంగీతాన్ని సమకూర్చిన అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికీ పని చేస్తున్నారు. 25 ఏళ్ల తర్వాత మళ్లీ పోలీసాఫీసర్‌గా కనిపించనున్న రజనీ రఫ్ఫాడిస్తారని అభిమానులు అంటున్నారు. దర్బార్ ఫస్ట్‌లుక్ పోస్టర్లో రజనీకాంత్ స్టైల్ అద్భుతంగా ఉందని ప్రశంసలు వెల్లువెత్తాయి. మరి పోస్టర్‌నే ఇంత ఆసక్తికరంగా మలిచారంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అని అభిమానులు భారీ అంచనాలు పెట్టేసుకున్నారు. కాగా దర్బార్ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ట్వీట్ చేసిన ఫొటోను బీఆర్ రాజు నెటిజన్లతో పంచుకున్నాడు. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల మందుకు రానుంది. ఇక పేట సక్సెస్‌తో ట్రాక్‌లో పడ్డ రజనీ కాంత్ అదే జోరును కొనసాగిస్తాడా అనేది చూడాలి! Superstar #Rajinikanth's #DARBAR shoot wrapped up. Pongal Release #DarbarPongal @rajinikanth @ARMurugadoss @anirudhofficial @santoshsivan @sreekar_prasad @LycaProductions pic.twitter.com/AGu8Fv590y — BARaju (@baraju_SuperHit) October 4, 2019 -
మరింత యవ్వనంగా..
వయసు పెరుగుతున్న కొద్దీ రజనీకాంత్‌లో ఎనర్జీ, స్టయిల్, చరిష్మా కూడా పెరుగుతున్నాయి. సినిమా సినిమాకు మరింత ఫ్రెష్ లుక్‌లోకి మారిపోతున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. నయనతార కథానాయిక. లైకా సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ సెకండ్ లుక్‌ను ఓనమ్ సందర్భంగా బుధవారం రిలీజ్ చేశారు. ఫైట్‌కు రెడీ అవుతున్నట్టు గుర్రుగా చూస్తున్నారు రజనీ. ‘మరింత యవ్వనంగా, అందంగా, తెలివిగా, కఠినంగా రజనీకాంత్‌ను చూపించబోతున్నాం’ అని మురుగదాస్ పేర్కొన్నారు. ఇందులో పోలీస్ అధికారి పాత్రలో రజనీ కనిపిస్తారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ‘దర్బార్’ రిలీజ్ కానుంది. -
తలైవా మరో చిత్రానికి సిద్ధం!
నటుడు రజనీకాంత్ రాజకీయా రంగప్రవేశం సంగతి ఏమోగానీ, ఆయన సినిమాలను మాత్రం వరుసగా చేసుకుంటూ పోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇంతకు ముందుకంటే రజనీకాంత్ తన చిత్రాల వేగాన్ని పెంచారని చెప్పవచ్చు. ఇంతకు ముందు సినిమాల మధ్య గ్యాప్ తీసుకునేవారు. ఇటీవల కబాలి, కాలా, పేట, దర్బార్ అంటూ వరుసగా చిత్రాలు చేసుకుంటూపోతున్నారు. ప్రస్తుతం దర్బార్ చిత్రంలో నటిస్తున్నారు. నయనతార నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వచ్చే సంక్రాంతికి తెరపైకి తీసుకురావడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక నెక్ట్సేంటీ? అన్న ప్రశ్నకు సమాధానం రెడీ అయిపోయ్యింది. రజనీకాంత్‌ను శివ డైరెక్ట్ చేయనున్నారు. ఈ దర్శకుడు వరుస హిట్లతో జోరు మీదున్నారు. వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం వంటి విజయవంతమైన చిత్రాలను చేసిన శివ తాజాగా రజనీకాంత్ కోసం సూపర్ కథను సిద్ధం చేశారు. అది రజనీకాంత్‌కు నచ్చడంతో తెరకెక్కనుంది. అయితే నటుడు సూర్య హీరోగానూ శివ ఒక చిత్రం చేయనున్నారు. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత రజనీకాంత్ నటించే చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రానికి డీ.ఇమాన్ సంగీతాన్ని అందించనున్నారన్నది తాజా సమాచారం. 100 చిత్రాలకు పైగా చేసిన డీ.ఇమాన్ ఇప్పటి వరకరూ రజనీకాంత్ చిత్రానికి పనిచేయలేదన్నది గమనార్హం. తాజా ఆ అవకాశాన్ని దర్శకుడు శివ కల్పించినట్లు తెలిసింది. అజిత్ హీరోగా శివ దర్శకత్వం వహించన విశ్వాసం చిత్రానికి డీ.ఇమాన్ అందించిన సంగీతం బాగా ప్లస్ అయ్యిందనే టాక్ వచ్చింది. దీంతో దర్శకుడు శివ తాను రజనీకాంత్ హీరోగా రూపొందించనున్న చిత్రానికి డీ.ఇమాన్నే సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా శివతో చేసే చిత్రం తరువాత రజనీకాంత్ కేఎస్.రవికుమార్ దర్శకత్వంలోనూ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు చిత్రాల తరువాత ఆయన రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు ఒక టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. -
మళ్లీ ముంబై
జైపూర్‌లో పని పూర్తి చేసుకొచ్చారు ఆఫీసర్ రజనీకాంత్. మకాం మళ్లీ ముంబైకి షిఫ్ట్ అయిందని తెలిసింది. ఇంకొన్ని రోజులైతే ఆపరేషన్ పూర్తయిపోతుందట. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దర్బార్’. నయనతార కథానాయిక. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. 25 ఏళ్ల తర్వాత మళ్లీ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు రజనీకాంత్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అంతకుముందు ముంబైలో భారీ షెడ్యూల్ జరిగింది. ప్రస్తుతం జరుగుతున్నది చివరి షెడ్యూల్ అని సమాచారం. ఇటీవలే జైపూర్‌లో ఓ గ్రాండ్ సాంగ్‌ను రజనీ, నయనతారపై చిత్రీకరించారట. షూటింగ్ లొకేషన్లో ఓ స్టిల్ ఇటీవలే రిలీజ్ అయింది. సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా విలన్లుగా నటించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే రజనీ సోదరుడు సత్యనారాయణ రావ్ మోకాలికి ఆపరేషన్ జరిగింది. ‘దర్బార్’ షూటింగ్ నుంచి కొన్ని గంటలు బ్రేక్ తీసుకుని, ఆస్పత్రికి వెళ్లి అన్నయ్యను పరామర్శించారు రజనీ. -
పండగే పండగ
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దర్బార్’ చిత్రీకరణ పూర్తి కావొస్తోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. దీంతో రజనీ తర్వాతి చిత్రం ఏంటీ? అనే చర్చ మొదలైంది. రజనీకాంత్ తర్వాతి సినిమాకు శివ దర్శకత్వం వహించనున్నారట. ఇంతకుముందు అజిత్‌తో ‘వేదాలం, వీరమ్, వివేగమ్, విశ్వాసం’ వంటి మాస్ సినిమాలు తీశారు శివ. రజనీకాంత్‌కు కూడా ఆయన ఓ మాస్ స్టోరీని చెప్పారని, వీరి కాంబినేషన్లో సినిమా ఆల్మోస్ట్ ఒకే అయిపోయిందని చెన్నై టాక్. వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం ఇప్పుడు కోడంబాక్కమ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ప్రచారమే నిజమైతే.. రజనీ అభిమానులకు వచ్చే ఏడాది డబుల్ ధమాకాయే. సంక్రాంతికి ఒక సినిమా, దీపావళికి ఒక సినిమా అంటే అభిమానులకు పండగే కదా. -
చలో జైపూర్
కేసులు, నేరస్థులు, తుపాకులు, పరిశోధనలు.. వీటికి బ్రేక్ ఇచ్చారు రజనీకాంత్. కాస్త రిలీఫ్ కోసం ప్రేయసితో కలిసి డ్యూయెట్ పాడటానికి రెడీ అయిపోయారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ‘దర్బార్’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జైపూర్‌లో ఆరంభం కానుంది. ఈ కొత్త షెడ్యూల్ ఆదివారం ప్రారంభం అవుతుంది. ఇందుకోసం నయనతార, రజనీ తదితరులు జైపూర్ ప్రయాణమయ్యారు. ఈ చిత్రంలో రజనీ పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారు. ఇప్పటివరకు జరిపిన షెడ్యూల్స్‌లో పరిశోధనలు, ఫైట్లు.. వీటికి సంబంధించిన సీన్స్ తీశారు. జైపూర్‌లో సాంగ్‌తో పాటు, కీలక సన్నివేశాల చిత్రీకరణకు ప్లాన్ చేశారు. -
అభిమానులూ రెడీయా!
సినిమా ఫస్ట్‌లుక్ విడుదల కాకముందే తమ అభిమాన హీరో లుక్స్ కొన్నింటిని ఫ్యాన్స్ రెడీ చేసి సంబరపడుతుంటారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి సందడి చేస్తుంటారు. ఈ విషయం గురించి ఆలోచించినట్లున్నారు ‘దర్బార్’ చిత్రబృందం. అందుకే కొన్ని పోస్టర్స్‌ను డిజైన్ చేసే అవకాశాన్ని ఫ్యాన్స్‌కే వదిలేశారు. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. ఇందులో ఐïపీఎస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు రజనీ. ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్టు చేసినప్పటికీ ఈ సినిమా లొకేషన్ స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటితో కొన్ని ఫ్యాన్‌మేడ్ పోస్టర్స్ రెడీ అవుతున్నాయి. దీంతో చిత్రబృందమే రెండు హై క్వాలిటీ ఫొటోస్‌తో పాటు తమిళ, ఇంగ్లీష్ వెర్షన్ టైటిల్స్ లోగోలను రిలీజ్ చేసింది. వాటితో క్రియేటివ్ పోస్టర్ డిజైన్ చేయమనే బంపర్ ఆఫర్ ఫ్యాన్స్‌కి ఇచ్చారు. నచ్చిన పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేస్తామని ఏఆర్ మురుగదాస్ వెల్లడించారు. అభిమానులూ.. రెడీయా! -
సెల్యూట్ ఆఫీసర్
‘దర్బార్’లో రజనీకాంత్ రాజసం మామూలుగా లేదు. ఇక్కడున్న ఫొటో చూశారుగా.. ఐపీఎస్ ఆఫీసర్‌గా రజనీ ఎలా ఉన్నారో! మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు రజనీకాంత్. ముంబై నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ముంబైలో ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుందని టాక్. ఆగస్టు చివరికల్లా షూట్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు మురుగదాస్. తాజాగా ఈ సినిమాలోని రజనీ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇదివరకు కూడా ఈ సినిమా స్టిల్స్ లీక్ అయినప్పటికీ ఖాకీడ్రెస్‌లో రజనీ ఉన్న లుక్ బయటకు రావడం ఇదే తొలిసారి. ఇందులో బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్ విలన్లుగా నటిస్తున్నారు. నివేదా థామస్, యోగిబాబు కీలకపాత్రలు చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
వైరల్ అవుతున్న రజనీ స్టిల్స్!
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దర్బార్. పేట సినిమాతో సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న రజనీ ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార రజనీ సరసన కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ లోకేషన్స్‌లో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా రజనీ పోలీస్ గెటప్‌కు సంబంధించిన లుక్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సూపర్‌స్టార్ లుక్ సూపర్బ్ అనిపించేలా ఉండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ స్టిల్స్‌లో రజనీ వయస్సు 20 ఏళ్లు తక్కువగా కనిపిస్తుందని సంబరపడిపోతున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈసినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుథ్ సంగీతమందిస్తున్నాడు. -
తలైవాతో తలపడుతున్నారు
అవును తలైవా (నాయకుడు) రజనీకాంత్‌తో తలపడుతున్నారట యోగ్రాజ్ సింగ్. ఇంతకీ ఎవరీ యోగ్రాజ్ సింగ్? అంటే క్రికెట్‌ను ఫాలో అయ్యేవాళ్లకు ఈ పేరు సుపరిచితమే. ఇండియన్ క్రికెట్ టీమ్ తరపున కొన్ని మ్యాచులు ఆడటంతో పాటు యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ అని చాలామందికి తెలుసు. క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత పంజాబీ ఇండస్ట్రీలో యాక్టర్‌గా సినిమాలు చేస్తున్నారాయన. ఇప్పుడు రజనీకాంత్ తాజా చిత్రంలో నటిస్తున్నారని తెలిసింది. మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ చేస్తున్న చిత్రం ‘దర్బార్’. నయనతార కథానాయిక. 25 ఏళ్ల తర్వాత ఈ చిత్రంలో రజనీ పోలీస్ పాత్ర చేస్తున్నారు. ఇందులో యోగ్రాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. సినిమాలో వచ్చే ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్‌లో రజనీ, యోగ్రాజ్ తలపడనున్నారని తెలిసింది. యోగ్రాజ్ ఇది వరకు ‘సింగ్ ఈజ్ కింగ్, భాగ్ మిల్కా భాగ్’ వంటి బాలీవుడ్ సినిమాల్లో కనిపించారు. ‘దర్బార్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
ఆగస్ట్‌లో గుమ్మడికాయ
ఓ అమ్మాయితో కలిసి రైల్వేస్టేషన్లో వెయిట్ చేస్తున్నారు ఓ పోలీసాఫీసర్. ఆ పోలీసాఫీసర్ ఎవరంటే రజనీకాంత్. అమ్మాయేమో నివేథా థామస్. రజనీకాంత్ హీరోగా ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దర్బార్’లో నివేథా కీలకపాత్ర చేస్తున్నారు. ఇందులో నయనతార కథా నాయికగా నటిస్తున్నారు. సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్ నటిస్తున్నారు. చెన్నైలో వేసిన రైల్వేస్టేషన్ సెట్లో ఇటీవల రజనీకాంత్, నివేదాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ జూలైకల్లా పూర్తవుతుందనే ప్రచారం జరిగింది. ఈ వార్తను మురుగదాస్ ఖండించారు. ‘దర్బార్’ షూటింగ్ ఆగస్టు వరకు జరుగుతుందని వెల్లడించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా రజనీ
ముంబైలోని మాఫియాను గడగడలాడించడానికి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా మారారు రజనీకాంత్. ప్రజలను భయపెడుతున్న గ్యాంగ్‌స్టర్స్‌కు తూటాతో సమాధానం చెబుతున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత రజనీకాంత్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. అందులోనూ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించబోతున్నారట రజనీ. అలాగే ఈ సినిమాలో ఆయన రెండు పాత్రలు చేస్తున్నారని ప్రచారం జరగుతోంది. ఇటీవల ముంబైలో మొదలైన ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. ముఖ్యంగా ముంబైలోని ఓ కాలేజీలో వేసిన పోలీస్ ఇన్వెస్టిగేషన్ రూమ్ సెట్లో రజనీకాంత్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారని తెలిసింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ 29న స్టార్ట్ చెన్నైలో మొదలవుతుందని తెలిసింది. బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ ‘దర్బార్’లో ఓ విలన్‌గా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. -
రజనీ రాజకీయం ఆలస్యం అమృతమే!
పెరంబూరు: రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించి అటు అభిమానులు, ఇటు రాజకీయ వాదులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశాన్ని వాయిదా వేస్తూ రావడం ఆయన అభిమానుల్లో నైరాశ్యానికి దారి తీస్తుందనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణరావ్ మాత్రం ఆలస్యం అమృతమే నంటున్నారు. రజనీకాంత్ కంటే ఆయన రాజకీయ ప్రవేశం గురించి సత్యనారాయణరావ్‌నే ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఈయన ఏ సందర్భంలో అయినా రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం తథ్యం అనే మాటనే వాడుతుంటారు. తాజాగా శనివారం కూడా ఇదే పాట పాడారు. తిరుచ్చి, ఒలైయూర్ సమీపంలోని కుమారమంగళంలో రజనీకాంత్ తల్లిదండ్రులకు ఆయన అభిమానులు స్మారక మంటపాన్ని కట్టించారు. రెండు నెలల క్రితం దీని ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. కాగా ఈ స్మారక మంటపం మండలపూజా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రజనీ సోదరుడు సత్యనారాయణరావ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్షాలు సమృద్ధిగా కురవాలని, వ్యవసాయం బాగా పండాలని ఈ పూజా కార్యక్రమంలో కోరుకున్నట్లు తెలిపారు. ప్రజలు తమపై చూపుతున్న ప్రేమాభిమానాలకు రుణపడి ఉంటామన్నారు. తమ తల్లిదండ్రుల స్మారక మంటపాన్ని సందర్శంచడానికి రజనీకాంత్ దర్బార్ చిత్ర షూటింగ్ ముగించుకుని వస్తారని చెప్పారు. అదే విధంగా ఈ నెల 23న రాజకీయ రంగప్రవేశం గురించి ఆయన మంచి నిర్ణయాన్ని తీసుకుంటారని అన్నారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారని అన్నారు. రాజకీయ ప్రవేశం గురించి రజనీకాంత్ కచ్చితంగా వెల్లడిస్తారని, ఆ తరువాత ప్రజలకు మంచే జరుగుతుందని అన్నారు. ఆయన పలు రకాల పథకాలను సిద్ధం చేశారని తెలిపారు. రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం ఆలస్యం అయినా అది మంచికేనని, రాజకీయాల్లోకి రావడం మాత్రం పక్కా అని సత్యనారాయణరావ్ వక్కాణించారు. -
అల్లుడికి మరో చాన్స్
చెన్నై : అల్లుడు ధనుష్‌కు తలైవా మరో చాన్స్ ఇవ్వడానికి ఫిక్సయినట్టున్నారు. రజనీకాంత్ ఎప్పటినుంచో రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నారు. ఆయన అభిమానులు త్వరగా రాజకీయ పార్టీని ప్రారంభించాలని కోరుకుంటున్నారు. ఇవి రెండూ నిజమే అయినా రజనీకాంత్‌ను మాత్రం సినిమాలు వదల బొమ్మాళి వదలా! అని అంటున్నాయి. రజనీకాంత్‌కు కాలా చిత్రమే చివరిది అనే ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత పేట చిత్రం చేసేశారు. అదీ హిట్ అయ్యి కూర్చుంది. తాజాగా ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ చేస్తున్నారు. నయనతార నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ముంబైలో ముమ్మరంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. తదుపరి కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటించడానికి రజనీకాంత్ పచ్చజెండా ఊపినట్లు ప్రచారంలో ఉంది. తాజాగా తన అల్లుడు ధనుష్‌కు మరో అవకాశం ఇవ్వాలని రజనీకాంత్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నటుడు ధనుష్ హీరోగా బిజీగా ఉన్నారు. అయితే ఈయన తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో, వండర్‌బార్ ఫిలింస్ నష్టాల్లో ఉందనే వదంతి ప్రచారంలో ఉంది. ఈ విషయం రజనీకాంత్ దృష్టికి వెళ్లడంతో అల్లుడిని నష్టాల్లోంచి బయడ పడేసేందుకు ఆయన సంస్థలో ఒక చిత్రం చేయాలని నిర్ణయించుకున్నట్లు తాజాగా టాక్ స్ప్రెడ్ అయ్యింది. ధనుష్ ఇంతకుముందు తన మామ రజనీకాంత్ హీరోగా కాలా చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర సక్సెస్ వారి అంచనాలను రీచ్ కాలేదనే టాక్ ప్రచారంలో ఉంది. దీంతో వండర్‌బార్ ఫిలింస్ సంస్థకు రజనీకాంత్ మరో చాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం. దీనికి పేట చిత్రం ఫేమ్ కార్తీక్‌సుబ్బరాజ్‌ను దర్శకుడిగా ఎంపిక చేయాలని ధనుష్ భావిస్తున్నారు. కార్తీక్‌సుబ్బరాజ్ ధనుష్ హీరోగా ఒక చిత్రం చేయనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అయితే రజనీకాంత్, కార్తీక్‌సుబ్బరాజ్‌ల కాంబినేషన్లో చిత్రం చేయడానికి ధనుష్ సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం దర్బార్ 2020 ప్రథమార్థంలో తెరపైకి వచ్చే అవకాశం ఉంది. దీంతో రజనీకాంత్ వండర్‌బార్ ఫిలింస్ సంస్థలో నటించే చిత్రం ఈ ఏడాది చివర్లో గానీ, వచ్చే ఏడాది మొదట్లోగానీ సెట్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
దర్బార్‌పై రాళ్లు
ఏదో సినిమాలో హీరో అంటాడు ‘అభిమానాన్ని ఆపలేం సార్’ అని. నిజమే. అభిమానాన్ని ఆపితే వచ్చేది ఆగ్రహమే. ఇప్పుడు అలాంటి ఆగ్రహానికే గురవుతున్నారు ‘దర్బార్’ చిత్రబృందం. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దర్బార్’. నయనతార కథానాయిక. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. 25 ఏళ్ల తర్వాత మళ్లీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు రజనీకాంత్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఓ కళాశాలలో జరుగుతోంది. రజనీకాంత్ సినిమా అంటే ఆసక్తి చూపనివారు ఎవరుంటారు? దాంతో అత్యుత్సాహంతో రజనీ ఫోటోలు తీసి ఆన్లైన్లో షేర్ చేస్తున్నారు కొందరు. దీంతో షూటింగ్‌స్పాట్‌లో ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు బయటకు వస్తున్నాయి. ఇది చిత్రబృందానికి ఇబ్బందిగా మారింది. దాంతో సూపర్ స్టార్‌ని చూడ్డానికి లొకేషన్‌కి వస్తున్న స్టూడెంట్స్‌ను దూరంగా ఉంచాలని భావించింది చిత్రబృందం. మా అభిమానాన్నే అడ్డుకుంటారా? అని ఆగ్రహించిన స్టూడెంట్స్ సెట్‌పై రాళ్లు విసిరారు. ఈ సంఘటన తర్వాత షూటింగ్ లొకేషన్ మార్చాలనే ఆలోచనలో ఉందట టీమ్. -
‘దర్బార్’ టీంపై రాళ్ల దాడి..?
రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దర్బార్’ చిత్రబృందంపై దాడి జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబైలోని ఓ కాలేజ్‌లో జరుగుతుంది. ఈక్రమంలో సదరు కాలేజ్ స్టూడెంట్స్ షూటింగ్ స్పాట్‌వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ సిబ్బంది వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆగ్రహించిన విద్యార్థులు కళాశాల భవనం మీదకు వెళ్లి.. చిత్రబృందంపై రాళ్ల దాడి చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు మురగదాస్ ఈ విషయాన్ని కాలేజ్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడమే కాక లోకేషన్ చేంజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీని గురించి ఇంతవరకూ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దర్బార్ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార రజనీ సరసన కథానాయికగా నటిస్తోంది. అయితే ఇటీవల ప్రారంభమైన ఈ సినిమాపై లీకు వీరులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా రజనీతో పాటు నయనతార ఉన్న ఫొటో ఒకటి నెట్లో హల్చల్ చేస్తోంది. దీంతో చిత్రయూనిట్ లీకులను ఆపేందుకు చర్యలు తీసుకుంటోంది. సెట్లోకి విజిటర్స్ రాకుండా నిషేధం విధించారు. ఈ క్రమంలో కాలేజ్ విద్యార్థులను కూడా అనుమతించకపోవడంతో.. వారు ఇలా దాడికి పాల్పడినట్లు సమాచారం. -
‘దర్బార్’ సెట్లో ఆంక్షలు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దర్బార్. పేట సినిమాతో సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న రజనీ ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార రజనీ సరసన కథానాయికగా నటిస్తోంది. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమాపై లీకు వీరులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఇప్పటికే రజనీ లుక్కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా రజనీతో పాటు నయనతార ఉన్న ఫొటో ఒకటి నెట్లో హల్చల్ చేస్తోంది. దీంతో చిత్రయూనిట్ లీకులను ఆపేందుకు చర్యలు తీసుకుంటోంది. సెట్లోకి విజిటర్స్ రాకుండా నిషేదం విదించటంతో పాటు సెల్ఫొన్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌ల వాడకం పై ఆంక్షలు విదిస్తున్నారు. మరి ఈ చర్యలతో అయిన లీకులు ఆగుతాయేమో చూడాలి. -
దర్బార్‌లోకి ఎంట్రీ
‘దర్బార్’లో ప్లేస్ కన్ఫార్మ్ చేసుకున్నారు హీరోయిన్ నివేదా థామస్. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఐపీఎస్ పోలీసాఫీసర్ పాత్రలో రజనీకాంత్ నటిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా షూట్‌లోకి జాయిన్ అయ్యారు నయనతార. ఆమెతోపాటు నివేదా థామస్, కమెడియన్ యోగిబాబు కూడా ఈ ముంబై సెట్లో జాయిన్ అయ్యారు. లొకేషన్లో రజనీకాంత్, నివేదా, యోగిబాబు ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో రజనీకాంత్ కూతురి పాత్రలో నివేదా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ‘పాపనాశనం’ సినిమాలో కమల్‌హాసన్ కూతురిగా నటించారు నివేదా. ‘దర్బార్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
‘దర్బార్’లో నయన్ ఎంట్రీ
సూపర్‌స్టార్ దర్బార్‌లోకి లేడీ సూపర్‌స్టార్ ఎంటర్ అయ్యింది. రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం దర్బార్. ఇందులో నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంతో పాటు, తెలుగు, కన్నడం భాషల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్న నయనతార తాజాగా విజయ్‌తో కలిసి అట్లీ దర్శకత్వంలో నటిస్తూ వచ్చింది. ఇదిలా ఉండగా ఈ నెల 10వ తేదీన దర్బర్ చిత్రం షూటింగ్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రజనీకాంత్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు ఏఆర్.మురుగదాస్. తాజాగా మంగళవారం నటి నయనతార దర్బార్ చిత్రంలోకి ఎంటర్ అయ్యింది. ఇప్పుడు రజనీకాంత్, నయనతారలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలిసింది. ఇంతకు ముందే చెప్పినట్లుగా ఇందులో నయనతార, రజనీకాంత్‌కు జంటగా కాకుండా ఆయన పాత్రకు ధీటైన పాత్రలో నటించనున్నారట. పాత్ర చిత్రం అంతా ఉండటంతో 60 రోజులు కాల్షీట్స్ కేటాయించినట్లు సమాచారం. దర్బార్ చిత్రాన్ని ఏకధాటిగా మూడు నెలల పాటు షూటింగ్ నిర్వహించి పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్రణాళికను రచించినట్లు తెలిసింది. ఈ సినిమాలో రజనీకాంత్‌కు కూతురుగా నటి నివేదా థామస్ నటిస్తోంది. విలన్‌గా బాలీవుడ్ నటుడు ప్రతీక్బాబర్ నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో రజనీకాంత్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా, సమాజ సేవకుడిగా రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు తెలిసింది. భారీఎత్తున్న నిర్మిస్తున్న లైకా సంస్థ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో పొంగళ్కు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం, సంతోష్‌శివన్ ఛాయాగ్రహణ అందిస్తున్నారు. -
ఆమె లవ్ లాకప్‌లో ఖైదీ అయ్యాడా!
ముంబై గ్యాంగ్స్టర్ల గుండెల్లో దడ పుట్టిస్తున్నాడు ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్. అతని హృదయంలో ప్రేమ పుట్టించడానికి ఓ అందమైన అమ్మాయి మంగళవారం ముంబై వెళ్లింది. మరి.. ఆ పోలీసాఫీసర్ మనసుకు ఎలా బేడీలు పడ్డాయి? ఆమె లవ్ లాకప్‌లో ఖైదీ అయ్యాడా? అన్న విషయాలను మాత్రం ‘దర్బార్’ చిత్రంలో చూడాల్సిందే. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో రజనీకాంత్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్లో మంగళవారం నయనతార జాయిన్ అయ్యారు. ఇంతకుముందు ‘చంద్రముఖి’(2005)లో రజనీ సరసన నటించిన నయనతార ఆయన హీరోగా నటించిన ‘కథానాయకుడు’ (2008)లో స్పెషల్‌సాంగ్ చేశారు. అలాగే ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో నయనతార దాదాపు 14 ఏళ్ల తర్వాత నటిస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో 2005లో వచ్చిన ‘గజినీ’ సినిమాలో ఓ కీలక పాత్ర చేశారు నయనతార. ‘‘నయనతారతో కలిసి మళ్లీ వర్క్ చేయడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు మురుగదాస్. ఈ చిత్రాన్ని అనిరు«థ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ‘దర్బార్’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. -
దర్బార్ విలన్
‘దర్బార్’లో రజనీకాంత్‌కు విలన్ పాత్రలో సవాల్ విసరడానికి సిద్ధం అవుతున్నారు బాలీవుడ్ యాక్టర్ ప్రతీక్ బబ్బర్. ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘దర్బార్’. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది. ఈ చిత్రంలో నటించడం గురించి ప్రతీక్ మాట్లాడుతూ – ‘‘రజనీసార్ లాంటి లెజెండ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో విలన్‌గా నటించబోతున్నాను. ఈ చాన్స్‌ని వినియోగించుకోవడం కోసం 200 శాతం కష్టపడతాను. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు జీవితంలో ఎప్పుడూ రావు’’ అన్నారు. ఈ సినిమాలో మెయిన్ విలన్ కొడుకు పాత్రలో ప్రతీక్ కనిపిస్తారట. -
సయ్యాటలు కాదా? జగడమేనా!
సినిమా: కోలీవుడ్‌లో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాక్‌గా మారిన చిత్రం దర్బార్. కారణం టాప్ స్టార్స్ కలయికలో రూపొందుతుండడమే కాదు. చాలా ఆసక్తికరమైన అంశాలను చోటుచేసుకున్న చిత్రం దర్బార్. ప్రధాన అంశం ఇది సూపర్‌స్టార్ దర్బార్ కావడం. రెండో అంశం లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించడం. మూడోది సంచలన దర్శకుడు ఏఆర్.మురుగదాస్ దర్శకుడు కావడం. ఇవి చాలవా? దర్బార్ ప్రత్యేకతకు. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ క్రేజీ చిత్రానికి యువ సంగీతదర్శకుడు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తుండడం మరో విశేషం. ఇటీవలే దర్బార్ చిత్ర షూటింగ్‌ను ముంబైలో ప్రారంభించారు.ఇందులో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచా రం ఒక పక్క జరుగుతున్నా, ఆయన చాలా కాలం తరువాత ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారన్న ప్రచారం మరో పక్క జరుగుతోంది. కాగా చంద్రముఖి, కుశేలన్ చిత్రాల తరువాత రజనీకాంత్, నయనతార కలిసి నటిస్తున్న చిత్రం దర్బార్. దీంతో వీరిద్దరూ జంటగా నటిస్తున్నారని అనుకుంటున్న తరుణంలో జంటగా కాదు మరోలా నటిస్తున్నారనే టాక్ తాజాగా స్ప్రెడ్ అయ్యింది. వేరేలా అంటే అసలు ఇందలో రజనీకాంత్‌కు జోడీనే లేదని, తండ్రీ, కూతుళ్ల మధ్య ప్రేమానుబంధాలను ఆవిష్కరించే ఈ చిత్రంలో రజనీకాంత్‌కు కూతురిగా నటి నివేదా థామస్ నటించబోతోందని సమాచారం. మరి నయనతార పాత్రేంటి అనే ఆసక్తి కలగవచ్చు. దర్బార్‌లో రజనీకాంత్, నయనతారల మధ్య సరసాలు ఉండవట. జగడమేనట. అంటే ఇందులో నయనతార ప్రతికథానాయకి పాత్రలో నటిస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. పాత్రకు ప్రాముఖ్యత ఉండడంతో నటించడానికి అంగీకరించిందని, అంతే కాకుండా ఈ చిత్రం కోసం సంచలన నటి నయతార ఏకంగా 60 రోజులు కాల్షీట్స్ కేటాయించిందని సమాచారం. ఈ బ్యూటీ చిత్రం అంతా కనిపిస్తుందట. దర్బార్ టైటిల్ విడుదలతోనూ చిత్రంపై హైప్ పెరిగిపోయింది. ఇప్పుడు నయనతార విలనీయం అనగానే దర్బార్ చిత్రంపై మరింత ఆసక్తి కలుగుతోంది కదూ! అయితే ఈ విషయం గురించి స్పష్టమైన ప్రకటన చిత్ర వర్గాల నుంచి రావలసి ఉందన్నది గమనార్హం. -
హీరోయిన్‌కు షాక్ ఇచ్చిన రజనీకాంత్
అనుకున్నవన్నీ జరగవు. అనుకోనివి జరగకమానవు. ఇదే జీవితం. సరిగ్గా నటి కీర్తీసురేశ్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఈ వర్ధమాన నటి మహానటి సావిత్రిగా నటిస్తానని ఊహించి ఉండదు. కానీ అది జరిగింది. ఆ చిత్రం కీర్తీసురేశ్ నటన జీవితంలో కలికితరాయిగా నిలిచిపోయేలా అమరింది. కీర్తీసురేశ్ గురించి రాసినా, మాట్లాడినా మహానటి ప్రస్తావన లేకుండా ఉండదు. అలాంటి నటికి కోలీవుడ్‌లో సూపర్ చాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయ్యిందనే విషయం తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కీర్తి అవకాశానికి సూపర్‌స్టారే అడ్డం పడ్డారని టాక్‌స్ప్రెడ్ అయ్యింది. రజనీకాంత్ ప్రస్తుతం దర్బార్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నయనతార కథానాయకిగా నటిస్తోంది. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే ఈ చిత్రం ముంబైలో ప్రారంభం అయ్యింది. ఈ మూవీలో ముందుగా రజనీకాంత్‌కు జంటగా దర్శకుడు మురుగదాస్ నటి కీర్తీసురేశ్‌నే ఎంపిక చేశారట. అయితే రజనీకాంత్ హీరోయిన్గా నయనతారను ఎంపిక చేయమని చెప్పడంతో దర్శకుడు మురుగదాస్‌కు మరో దారి లేక ఆమెనే ఎంపిక చేసినట్లు టాక్ వైరల్ అవుతోంది. కీర్తీసేరేశ్ తనకు జంటగా సెట్ అవ్వదని రజనీకాంత్ చెప్పారట. అలా ఆయన కీర్తీసురేశ్‌కు అడ్డుపడ్డారన్నమాట. ఇకపోతే నటి నయనతార ఇప్పటికే రజనీకాంత్‌తో రెండు చిత్రాల్లో హీరోయిన్గా నటించడంతో ఆమె తనకు జంటగా బాగుంటుందని రజనీకాంత్ అభిప్రాయపడ్డారట. అలా కోలీవుడ్‌లో సూపర్ చాన్స్‌ను కోల్పోయిన కీర్తీసురేశ్‌కు టాలీవుడ్లో మాత్రం మెగా చాన్స్ లభించినట్లు తెలుస్తోంది. అవును త్వరలో ఈ చిరునవ్వుల చిన్నది చిరంజీవికి జంటగా నటించబోతోందనే ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం మళయాళం, తెలుగు చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ త్వరలో బాలీవుడ్లో అడుగు పెట్టడానికి రెడీ అవుతోంది. -
డైరీలో ఖాళీ ఇల్లే!
వేగం పెంచారు రజనీకాంత్. అరవైలలో ఇరవైల దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఒక సినిమా పూర్తి కావడం ఆలస్యం మరో సినిమా సైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ‘దర్బార్’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయింది. అప్పుడే ఈ ప్రాజెక్ట్ తర్వాత చేయబోయే రెండు సినిమాలకు డేట్స్ ఇచ్చేశారట రజనీ. తనకు ‘ముత్తు, నరసింహ’ వంటి హిట్స్ ఇచ్చిన దర్శకుడు కేయస్ రవికుమార్ డైరెక్షన్లో ఓ మూవీ, ‘చతురంగవైటై్ట, ఖాకీ’ వంటి హిట్స్ ఇచ్చిన దర్శకుడు హెచ్. వినోద్‌తో మరో సినిమా అంగీకరించారట. ఈ మూడు సినిమాలతో రజనీ డైరీ 2021 వరకూ ఖాళీ ఇల్లే (లేదు). ఈ సినిమాలు పూర్తయిన తర్వాత 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మీద పూర్తిస్థాయిలో దృష్టిపెట్టే ఆలోచనలో రజనీ ఉన్నట్టు తమిళనాడు టాక్. ‘దర్బార్’ 2020 సంక్రాంతికి రిలీజ్. -
రజనీకాంత్ రిటైర్మెంట్..!
సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ రిటైర్మెంట్పై చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. బాబా సినిమా సమయంలోనే రిటైర్మెంట్పై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే రజనీ మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి రజనీ రిటైర్మెంట్ వార్తలు తెరమీదకు వచ్చాయి. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ సినిమాలో నటిస్తున్న రజనీ, తరువాత మరో రెండు సినిమాలు మాత్రమే చేయనున్నారట. తనతో ఎన్నో సూపర్ హిట్స్ అందించిన కేయస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా, వినోద్ దర్శకత్వంలో మరో సినిమా చేసి రిటైర్మెంట్ ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంపై రజనీ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే రాజకీయ పార్టీని ప్రకటించిన రజనీ ఈ లోక్‌సభ ఎలక్షన్లకు దూరంగా ఉంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి నటనకు గుడ్‌బై చెప్పి పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నారు రజనీ కాంత్. -
రజినీ ‘దర్బార్’ ప్రారంభం
-
సూపర్ స్టార్ ‘దర్బార్’
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల పేటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీ మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేయనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రజనీ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దర్బార్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. టైటిల్ లోగోతో పాటు సినిమాలో రజనీ లుక్‌ను కూడా రివీల్ చేశారు చిత్రయూనిట్. రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనున్న ఈ మూవీ 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.స్వరాలందించనున్నాడు. -
ఇప్పుడు మా వంతు...
చైతన్యం పశ్చిమ బెంగాల్‌లోని సెక్స్ వర్కర్లు కొన్నేళ్లుగా నాయకులకు మూడంటే మూడు విన్నపాలు వినిపించుకుంటున్నారు. ఒకటి: అయ్యా, అక్రమ రవాణా నిరోధక చట్టంలోని 3, 4, 18, 20 సెక్షన్లను రద్దు చేయండి. వాటిని అడ్డం పెట్టుకుని, మా జీవితాలను నరకప్రాయం చేస్తున్నవారి నుండి మాకు రక్షణ కల్పించండి. రెండు: మా వృత్తిని కూడా కార్మిక శాఖ పరిధిలోకి తెచ్చి, చట్ట ప్రకారం మాకు లభించవలసిన హక్కులు, సదుపాయాల విషయమై మాకు భరోసా ఇవ్వండి. మూడు: ‘దర్బార్’ ఏర్పాటు చేసిన స్వయం నియంత్రణ మండలికి ప్రభుత్వ ఆమోదం లభించేలా చూడండి. దర్బార్ అంటే ‘దర్బార్ మహిళా సమన్వయ కమిటీ’. ఈ కమిటీ ఏర్పాటు చేసుకున్న స్వయం నియంత్రణ మండలికి ఆమోదం లభించినట్లయితే చిన్న పిల్లల్ని పడుపువృత్తిలోకి రాకుండా నిరోధించడానికి సాధ్యం అవుతుంది.అలాగే బలవంతంగా ఈ విషవలయంలోకి తోసివేయబడిన వారికి విముక్తి కల్పించడానికి వీలవుతుంది. అయితే ఈ మూడు విన్నపాలూ ఇంతవరకూ పట్టించుకున్నవారే లేదు. ‘‘నోట్లు రాని పనులు నాయకులు చేయరనీ, ఓట్లు పోగొట్టుకునే పనిని పార్టీలు చేయవనీ అంటారు. బహుశా సెక్స్‌వర్కర్ల అభ్యర్థనల మన్నింపు తమకు లాభం కన్నా, నష్టమే ఎక్కువ తెచ్చిపెడతాయనుకున్నారేమో ఎవరూ మా సంక్షేమం గురించి పట్టించుకోలేదు’’ అని ‘దర్బార్ మహిళా సమన్వయ కమిటీ’ కార్యదర్శి భార తీ దేవ్ వ్యాఖ్యానించారు. పడువువృత్తికి కేంద్రంగా పేరుమోస్తున్న సోనాగచీ సహా, పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాలలో సుమారు 65 వేల మంది వరకు సెక్స్ వర్కర్లు, వారి కుటుంబాల వారు ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వీరు చేసే అభ్యర్థనలు ఈ మూడే. అందుకే ఈసారి ఎన్నికల్లో ఏ అభ్యర్థికీ ఓటు వేయకూడదని వీరంతా గట్టిగా నిర్ణయించుకున్నారు. అంటే ‘నోటా’ మీట నొక్కబోతున్నారు! ‘‘మాకెవరూ ఏమీ చేయట్లేదు. మేమెందుకు వారికి ఓటేయాలి?’’ అని కాస్త ఆవేదనతో కూడిన ఆగ్రహంతో అంటున్నారు భార తీ దేవ్. పశ్చిమబెంగాల్లో తొలి విడతగా ఏప్రిల్ 17న నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. మిగతా 38 స్థానాలకు నాలుగు విడతలుగా మే 12 వరకు ఎన్నికలు జరుగుతాయి. వీటిల్లో ఏ ఎన్నికల్లోనూ ఏ పార్టీ అభ్యర్థికీ ఓటు వేయకూడదని, నోటా (నన్ ఆఫ్ ది అబౌవ్) మీటను నొక్కాలని ‘దర్బార్’ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు సుమన్ మైత్రా అనే బెంగాలీ దర్శకుడు సోనాగచీ సెక్స్‌వర్కర్ల దయనీయ స్థితిగతులపై ‘ది బెస్ట్ సెల్లర్’ అనే హిందీ చిత్రం తీశారు. ఈ ఏడాది జరగబోయే గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించాక, మిగతా ప్రాంతాలలోనూ ఆ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ‘‘ఇదొక చీకటి సినిమా. వాస్తవాలతో అల్లిన కథనం. సోనాగచీలో పుట్టిపెరిగిన అను, ఆయేషా అనే ఇద్దరు అక్కచెల్లెళ్ల చుట్టూ స్క్రీన్‌ప్లే అంతా నడుస్తుంది’’ అంటున్నారు మైత్రా. నాయకులు, ప్రభుత్వాలు పట్టించుకోని సామాజిక అంశాలను ఏ దేశంలోనైనా కళాకారులే కదా మీద వేసుకునేది.