
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దర్బార్. పేట సినిమాతో సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న రజనీ ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార రజనీ సరసన కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ లోకేషన్స్‌లో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా రజనీ పోలీస్ గెటప్‌కు సంబంధించిన లుక్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సూపర్‌స్టార్ లుక్ సూపర్బ్ అనిపించేలా ఉండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ స్టిల్స్‌లో రజనీ వయస్సు 20 ఏళ్లు తక్కువగా కనిపిస్తుందని సంబరపడిపోతున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈసినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుథ్ సంగీతమందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment