దూసుకెళ్తున్న రజినీ ‘దుమ్ము.. దూళి’ | Rajinikanth Darbar Movie First Song Released | Sakshi
Sakshi News home page

దూసుకెళ్తున్న రజినీ ‘దుమ్ము.. దూళి’

Published Wed, Nov 27 2019 9:34 PM | Last Updated on Wed, Nov 27 2019 9:47 PM

Rajinikanth Darbar Movie First Song Released - Sakshi

రజినీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దర్బార్‌. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించిన దర్బార్‌.. ఫస్ట్‌ సాంగ్‌ను చిత్ర బృందం బుధవారం యూట్యూబ్‌లో విడుదల చేసింది. తమిళ్‌తో పాటు, తెలుగు, హిందీలో కూడా ఈ సాంగ్‌ విడుదల అయింది. అనిరుధ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు తెలుగులో అనంత్‌ శ్రీరామ్‌ లిరిక్స్‌ రాశారు. తెలుగులో ‘దుమ్ము.. దూళి’ అని సాగే ఈ పాట.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. దీంతో రజినీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఈ చిత్రంలో రజనీకాంత్‌.. ఐపీఎస్‌ ఆఫీసర్‌ ఆదిత్య అరుణాచలంగా కనిపించనున్నారు. చాలా కాలం తర్వాత రజినీ పోలీసు అధికారిగా కనిపిస్తున్న చిత్రం ఇదే. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించారు. రజనీకాంత్‌ కూతురిగా నివేథా దామస్‌ నటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘దర్బార్‌’ చిత్రం జనవరి 9న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement