
రజనీకాంత్, యోగ్‌రాజ్ సింగ్
అవును తలైవా (నాయకుడు) రజనీకాంత్‌తో తలపడుతున్నారట యోగ్‌రాజ్ సింగ్. ఇంతకీ ఎవరీ యోగ్‌రాజ్ సింగ్? అంటే క్రికెట్‌ను ఫాలో అయ్యేవాళ్లకు ఈ పేరు సుపరిచితమే. ఇండియన్ క్రికెట్ టీమ్ తరపున కొన్ని మ్యాచులు ఆడటంతో పాటు యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ అని చాలామందికి తెలుసు. క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత పంజాబీ ఇండస్ట్రీలో యాక్టర్‌గా సినిమాలు చేస్తున్నారాయన.
ఇప్పుడు రజనీకాంత్ తాజా చిత్రంలో నటిస్తున్నారని తెలిసింది. మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ చేస్తున్న చిత్రం ‘దర్బార్’. నయనతార కథానాయిక. 25 ఏళ్ల తర్వాత ఈ చిత్రంలో రజనీ పోలీస్ పాత్ర చేస్తున్నారు. ఇందులో యోగ్‌రాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. సినిమాలో వచ్చే ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్‌లో రజనీ, యోగ్‌రాజ్ తలపడనున్నారని తెలిసింది. యోగ్‌రాజ్ ఇది వరకు ‘సింగ్ ఈజ్ కింగ్, భాగ్ మిల్కా భాగ్’ వంటి బాలీవుడ్ సినిమాల్లో కనిపించారు. ‘దర్బార్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment