డబ్బింగ్‌ షురూ | Rajinikanth begins dubbing for AR Murugadoss Darbar | Sakshi
Sakshi News home page

డబ్బింగ్‌ షురూ

Published Fri, Nov 15 2019 4:28 AM | Last Updated on Fri, Nov 15 2019 4:28 AM

Rajinikanth begins dubbing for AR Murugadoss Darbar - Sakshi

రజనీకాంత్‌

‘దర్బార్‌’లో ఆదిత్య అరుణాచలం మాటల తూటాలు పేలుతున్నాయి. మరి.. ఈ దర్బార్‌ డైలాగ్స్‌ ప్రేక్షకులకు ఎంత కిక్‌ ఇస్తాయో తెలిసేది మాత్రం సంక్రాంతి పండక్కే. రజనీకాంత్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్‌’. ఇందులో నయతార కథానాయికగా నటించారు. నివేదాథామస్‌ కీలక పాత్రధారి. ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌ ఆదిత్య అరుణాచలం పాత్రలో నటించారు రజనీకాంత్‌. ఈ సినిమా డబ్బింగ్‌ కార్యక్రమాలు మొదలైనట్లు గురువారం చిత్ర దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ వెల్లడించారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించిన ‘దర్బార్‌’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement