
రజనీకాంత్
ఓ అమ్మాయితో కలిసి రైల్వేస్టేషన్‌లో వెయిట్ చేస్తున్నారు ఓ పోలీసాఫీసర్. ఆ పోలీసాఫీసర్ ఎవరంటే రజనీకాంత్. అమ్మాయేమో నివేథా థామస్. రజనీకాంత్ హీరోగా ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దర్బార్’లో నివేథా కీలకపాత్ర చేస్తున్నారు. ఇందులో నయనతార కథా నాయికగా నటిస్తున్నారు. సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్ నటిస్తున్నారు. చెన్నైలో వేసిన రైల్వేస్టేషన్ సెట్‌లో ఇటీవల రజనీకాంత్, నివేదాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ జూలైకల్లా పూర్తవుతుందనే ప్రచారం జరిగింది. ఈ వార్తను మురుగదాస్ ఖండించారు. ‘దర్బార్’ షూటింగ్ ఆగస్టు వరకు జరుగుతుందని వెల్లడించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.