
ఫ్లయిట్‌లో నయనతార, రజనీ
కేసులు, నేరస్థులు, తుపాకులు, పరిశోధనలు.. వీటికి బ్రేక్ ఇచ్చారు రజనీకాంత్. కాస్త రిలీఫ్ కోసం ప్రేయసితో కలిసి డ్యూయెట్ పాడటానికి రెడీ అయిపోయారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ‘దర్బార్’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు.
ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జైపూర్‌లో ఆరంభం కానుంది. ఈ కొత్త షెడ్యూల్ ఆదివారం ప్రారంభం అవుతుంది. ఇందుకోసం నయనతార, రజనీ తదితరులు జైపూర్ ప్రయాణమయ్యారు. ఈ చిత్రంలో రజనీ పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారు. ఇప్పటివరకు జరిపిన షెడ్యూల్స్‌లో పరిశోధనలు, ఫైట్లు.. వీటికి సంబంధించిన సీన్స్ తీశారు. జైపూర్‌లో సాంగ్‌తో పాటు, కీలక సన్నివేశాల చిత్రీకరణకు ప్లాన్ చేశారు.