దర్బార్‌లోకి ఎంట్రీ | Nivetha Thomas to play Rajinikanth's daughter in Darbar | Sakshi
Sakshi News home page

దర్బార్‌లోకి ఎంట్రీ

Published Fri, Apr 26 2019 1:19 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

Nivetha Thomas to play Rajinikanth's daughter in Darbar - Sakshi

లొకేషన్‌లో రజనీకాంత్‌, నివేదా థామస్‌

‘దర్బార్‌’లో ప్లేస్‌ కన్ఫార్మ్‌ చేసుకున్నారు హీరోయిన్‌ నివేదా థామస్‌. రజనీకాంత్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దర్బార్‌’. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఐపీఎస్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో రజనీకాంత్‌ నటిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది.

ఇటీవల ఈ సినిమా షూట్‌లోకి జాయిన్‌ అయ్యారు నయనతార. ఆమెతోపాటు నివేదా థామస్, కమెడియన్‌ యోగిబాబు కూడా ఈ ముంబై సెట్‌లో జాయిన్‌ అయ్యారు. లొకేషన్‌లో రజనీకాంత్, నివేదా, యోగిబాబు ఉన్న ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ఈ సినిమాలో రజనీకాంత్‌ కూతురి పాత్రలో నివేదా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ‘పాపనాశనం’ సినిమాలో కమల్‌హాసన్‌ కూతురిగా నటించారు నివేదా. ‘దర్బార్‌’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement