
వయసు పెరుగుతున్న కొద్దీ రజనీకాంత్‌లో ఎనర్జీ, స్టయిల్, చరిష్మా కూడా పెరుగుతున్నాయి. సినిమా సినిమాకు మరింత ఫ్రెష్ లుక్‌లోకి మారిపోతున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. నయనతార కథానాయిక. లైకా సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ సెకండ్ లుక్‌ను ఓనమ్ సందర్భంగా బుధవారం రిలీజ్ చేశారు. ఫైట్‌కు రెడీ అవుతున్నట్టు గుర్రుగా చూస్తున్నారు రజనీ. ‘మరింత యవ్వనంగా, అందంగా, తెలివిగా, కఠినంగా రజనీకాంత్‌ను చూపించబోతున్నాం’ అని మురుగదాస్ పేర్కొన్నారు. ఇందులో పోలీస్ అధికారి పాత్రలో రజనీ కనిపిస్తారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ‘దర్బార్’ రిలీజ్ కానుంది.