Nivedha Thomas
-
ఓటీటీలో తెలుగు సినిమా.. తిరుమల సీన్స్‌పై వివాదం!
ఇటీవల తిరుమల కొండపై వివాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే బిగ్ బాస్ ప్రియాంక మెట్లమార్గంలో ప్రాంక్ వీడియో చేయగా.. మరో యువతి పుష్ప సాంగ్ రీల్ చేసి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత వీరిద్దరు క్షమాపణలు కోరుతూ వీడియో రిలీజ్ చేశారు. తాజాగా తిరుమలలో మరో వివాదం చోటు చేసుకుంది.నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 35 చిన్నకథకాదు. ఈ మూవీ అంతా దాదాపుగా తిరుపతిలోనే తెరకెక్కించారు. అయితే కొన్ని సీన్స్ తిరుమలలో కూడా రూపొందించారు. శ్రీవారి ఆలయం ఎదురుగా అఖిలాండం వద్ద హీరో కూర్చొని ఉన్నట్లు దర్శకుడు చూపించారు. అంతేకాకుండా తిరుమల ఘాట్ రోడ్ సీన్లు కూడా తెరపై కనిపించాయి. కానీ తిరుమల కొండపై షూటింగ్‌లపై ఎప్పటి నుంచో ఆంక్షలు ఉన్నాయి. ఎవరు కూడా తిరుమల పరిసర ప్రాంతాలతో పాటు నడకదారి, ఘాట్ రోడ్లలో కూడా షూటింగ్స్ చేయడానికి అనుమతులు కూడా లేవు. దీంతో ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు కనిపించడంతో అది మరో వివాదానికి దారితీసింది.ఓటీటీలో స్ట్రీమింగ్..అయితే ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అందుబాటులో ఉంది. తన కుమారుడి చదవు కోసం ఓ తల్లి పడే తపన నేపథ్యంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రానికి నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించారు. -
ఓటీటీలో హిట్ సినిమా '35- చిన్న కథ కాదు' స్ట్రీమింగ్
'35–చిన్న కథ కాదు' సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే ప్రేక్షకులను మెప్పించింది. ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న తెలుగు, తమిళ, మలయాళంలో విడుదలయింది. అయితే, ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. అందుకు సంబంధించిన తాజా అప్డేట్ను మేకర్స్ ఇచ్చారు.నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ కథలో నివేదా మొదటిసారి తల్లి పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే, '35–చిన్న కథ కాదు' సినిమా త్వరలో ఓటీటీలో విడుదల కానున్నట్లు ఆహా ప్రకటించింది. అక్టోబర్ 2న ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్‌మీడియాలో ఆహా ప్రకటించింది.కథేంటంటే..తిరుపతికి చెందిన ప్రసాద్(విశ్వదేవ్ రాచకొండ) ఓ బస్ కండక్టర్. భార్య సరస్వతి(నివేదా థామస్), పిల్లలు అరుణ్, వరుణ్‌లతో కలిసి వెంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో నివాసం ఉంటాడు. సరస్వతికి భర్త, పిల్లలే ప్రపంచం. ఇద్దరి పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని తపన పడతారు. చిన్నోడు వరుణ్ బాగానే చదువుతాడు కానీ, పెద్దోడు అరుణ్‌కి మాత్రం వెనకబడతాడు. అలా అని వాడు తెలివి తక్కువ వాడేం కాదు. లెక్కలు తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటాడు.కానీ లెక్కల విషయానికొచ్చేసరికి మనోడికి చాలా డౌట్స్ వస్తాయి. సున్నాకి ఏమీ విలువ లేనప్పుడు దానిపక్కన ఒకటి వచ్చి నిలబడితే పది ఎందుకవుతుందంటూ ఫండమెంటల్స్‌నే ప్రశ్నిస్తాడు. దీంతో అరుణ్‌కి ‘జీరో’అని పేరు పెట్టి ఆరో తరగతి నుంచి డిమోట్ చేసి తమ్ముడు చదువుతున్న ఐదో తరగతి క్లాస్ రూమ్‌కి పంపిస్తారు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల అరుణ్ ఆ స్కూల్లో చదవాలంటే.. ఈ సారి లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా సాధించాల్సి వస్తుంది. ఆ కండీషన్ పెట్టిందెవరు? ఎందుకు పెట్టారు? లెక్కలపై అరుణ్‌కి ఉన్న సందేహాలకు సరైన సమాధనం చెప్పిందెవరు? పదో తరగతి ఫెయిల్ అయిన తల్లి సరస్వతి కొడుక్కి లెక్కల గురువుగా ఎలా మారింది? చివరకు అరుణ్ లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా తెచ్చుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ. Chinna Katha Kaadu ❤️Beautiful Blockbuster #35Movie coming soon on aha @i_nivethathomas @imvishwadev @PriyadarshiPN @Nanduemani @RanaDaggubati @nikethbommi pic.twitter.com/PG7nMLqFYf— ahavideoin (@ahavideoIN) September 27, 2024 -
‘35- చిన్న కథ కాదు’ రివ్యూ: చాలా పెద్ద కథే!
టైటిల్: 35- చిన్న కథ కాదునటీనటులు: నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణ తేజ, అభయ్, అనన్య తదితరులునిర్మాణ సంస్థలు: . సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ నిర్మాతలు: రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లిదర్శకత్వం: నందకిషోర్ ఇమానిసంగీతం: వివేక్ సాగర్విడుదల తేది: సెప్టెంబర్ 6, 2024టాలీవుడ్లో చిన్న సినిమాల సందడి ఇటీవలే కాలంలో ఎక్కువుగా కనిపిస్తుంది. స్టార్ హీరోలు తమ సినిమాలను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తుంటే.. చిన్న సినిమాలు తెలుగులో మాత్రమే విడుదలై విజయం సాధిస్తున్నాయి. కథలో కొత్తదనం ఉంటే హీరోహీరోయిన్లు ఎవరనేది పట్టించుకోకుండా థియేటర్స్‌కి వస్తున్నారు. అందుకే నూతన దర్శకనిర్మాతలు కొత్త కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. అలా ఈ వారం వచ్చిన చిన్న చిత్రమే ‘35-చిన్న కథ కాదు’. రానా లాంటి బడా స్టార్స్ ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘35-చిన్న కథ కాదు’పై ఆసక్తి పెరిగింది. భారీ అంచనాలతో రేపు(సెప్టెంబర్ 6) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రత్యేక ప్రీమియర్ షో వేశారు మేకర్స్. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..తిరుపతికి చెందిన ప్రసాద్(విశ్వదేవ్ రాచకొండ) ఓ బస్ కండక్టర్. భార్య సరస్వతి(నివేదా థామస్), పిల్లలు అరుణ్, వరుణ్‌లతో కలిసి వెంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో నివాసం ఉంటాడు. సరస్వతికి భర్త, పిల్లలే ప్రపంచం. ఇద్దరి పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని తపన పడతారు. చిన్నోడు వరుణ్ బాగానే చదువుతాడు కానీ, పెద్దోడు అరుణ్‌కి మాత్రం వెనకబడతాడు. అలా అని వాడు తెలివి తక్కువ వాడేం కాదు. లెక్కలు తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటాడు. కానీ లెక్కల విషయానికొచ్చేసరికి మనోడికి చాలా డౌట్స్ వస్తాయి. సున్నాకి ఏమీ విలువ లేనప్పుడు దానిపక్కన ఒకటి వచ్చి నిలబడితే పది ఎందుకవుతుందంటూ ఫండమెంటల్స్‌నే ప్రశ్నిస్తాడు. కొత్తగా వచ్చిన గణితం మాస్టారు చాణక్య(ప్రియదర్శి)తో పాటు ఏ ఉపాధ్యాయుడు తన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకకోవడంతో సున్నా మార్కులు తెచ్చుకుంటాడు. దీంతో అరుణ్‌కి ‘జీరో’అని పేరు పెట్టి ఆరో తరగతి నుంచి డిమోట్ చేసి తమ్ముడు చదువుతున్న ఐదో తరగతి క్లాస్ రూమ్‌కి పంపిస్తారు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల అరుణ్ ఆ స్కూల్లో చదవాలంటే.. ఈ సారి లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా సాధించాల్సి వస్తుంది. ఆ కండీషన్ పెట్టిందెవరు? ఎందుకు పెట్టారు? లెక్కలపై అరుణ్‌కి ఉన్న సందేహాలకు సరైన సమాధనం చెప్పిందెవరు? పదో తరగతి ఫెయిల్ అయిన తల్లి సరస్వతి కొడుక్కి లెక్కల గురువుగా ఎలా మారింది? చివరకు అరుణ్ లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా తెచ్చుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ. ఎలా ఉందంటే.. సినిమా అంటే ఐదారు పాటలు.. యాక్షన్, రొమాన్స్ కచ్చితంగా ఉండాలా? అవి ఉంటేనే సినిమా విజయం సాధిస్తుందా అంటే కచ్చితంగా నో అనే చెప్పాలి. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకున్నా..మంచి కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలెన్నో ఉన్నాయి. ‘35- చిన్నకథ కాదు’ కూడా ఆ కోవలోకి చేరే చిత్రమే అవుతుంది. నిజంగా ఇది చిన్న కథ కాదు. చాలా పెద్ద కథ. ఇందులో పిల్లలతో పాటు తల్లిదండ్రులు, సమాజం నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలను చర్చించారు. ప్రస్తుతం విద్యా విధానం ఎలా సాగుతుంది? ఎలా సాగితే పిల్లలకు ఉపయోగం అని తెలియజేసే చిత్రమిది. అలా అని ఈ కథ మొత్తం విద్యార్థుల చుట్టే తిరగదు. ఫ్యామిలీ ఎమోషన్స్, ఫన్, మదర్ సెంటిమెంట్ చుట్టూ కథనం సాగుతుంది. సాధారణంగా పిల్లల మదిలో రకరకాల అనుమాలు ఉంటాయి. కొన్ని సార్లు వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానమే ఉండదు. కొన్నింటికి సమాధానం ఉన్నా.. ఓపిగ్గా చెప్పలేక బెదిరించి తప్పించుకుంటాం. అలా కాకుండా వాళ్ల ప్రశ్నలకు అర్థమయ్యే రీతిలో సమాధానం చెబితే.. ఎలాంటి విషయాన్ని అయినా నేర్చుకోగలరు. ఇదే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. అందరికి లెక్కల్లో డౌట్స్ వస్తే.. ఈ సినిమాలోని అరుణ్ పాత్రకి లెక్కలపైనే డౌట్ వస్తుంది. విలువలేని సున్నాకు ముందు ఒకటి చేరిస్తే అది విలువైన పది గా ఎలా మారుతుంది? ఆ పదిని విలువ లేని సున్నాతో గుణిస్తే సున్నా ఎందుకు అవుతుందని ప్రశ్నిస్తాడు. అది తప్పని ఉదాహరణతో సహా నిరూపిస్తాడు. లెక్కల మాస్టరు సైతం సరైన సమాధానం చెప్పలేక.. ‘జీరో’ అని టైటిల్ పెట్టి ఇచ్చి చివర్లో కూర్చొబెడతాడు. అక్కడ నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. టెన్త్ ఫెయిల్ అయిన తల్లియే అతని ప్రశ్నలకు సమాధానం చెప్పడం.. చివరకు అరుణ్ గణితంలో పాస్ మార్కులు సంపాధించి జీరో నుంచి హీరోగా మారడం ఈ సినమా కథ. అయితే ఈ చిన్న పాయింట్ చుట్టు అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి. ఫస్టాఫ్‌లో ప్రసాద్, సరస్వతిల మధ్య వచ్చే సన్నివేశాలు భార్యభర్తలు ఎలా ఉండాలి? ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలో తెలియజేస్తాయి. స్కూల్ నేపథ్యంలో సాగే సీన్స్ మన బాల్యాన్ని గుర్తు చేస్తాయి. ఇంటర్వెల్ సీన్ ఎమోషనల్ టచ్ ఇస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథనం సీరియస్ మోడ్‌లో సాగుతుంది. కొడుకు కోసం తల్లి మళ్లీ చదవడం.. గణిత మాస్టారుకి కూడా సాధ్యం కానీ విధంగా ఈజీ వేలో లెక్కలు నేర్చించి, కొడుకును పాస్ చేయించుకోవడంతో కథ ముగుస్తుంది. అయితే క్లైమాక్స్ ముందే ఊహించినా..తెరపై చూసినప్పుడు భావోధ్వేగానికి లోనమవుతాం. తండ్రి మార్కుల వివరాలు చెబుతున్న క్రమంలో అరుణ్ అద్దంపై నీళ్లు చల్లి బొట్టు బిళ్లలను తుడిపేస్తుంటే.. ప్రేక్షకుడిలో కూడా విజయ గర్వంతో మురిసిపోతాడు. అయితే కథనం నెమ్మదిగా సాగడం.. కథలోని మెయిన్ పాయింట్ విషయంలో లాజిక్ మిస్ అవ్వడం ఈ సినిమాకు మైనస్. సాంకేతిక పరంగానూ కొన్ని లోపాలు ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఇది మెప్పించకపోవచ్చు కానీ.. ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలకు మాత్రం నచ్చుతుంది. వాళ్లు కచ్చితంగా చూడిల్సిన సినిమా ఇది. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో ప్రతి నటించిన ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా నివేదా థామస్ నటన సినిమాకు ప్లస్ అయింది. సాధారణ గృహిణి, ఇద్దరు పిల్లల తల్లి సరస్వతి పాత్రలో ఒదిగిపోయింది. సెకండాఫ్‌లో ఆమె నటన హైలెట్. కళ్లతోనే భావాన్ని పలికించింది. ఎమెషనల్ సీన్లలో అద్భుతంగా నటించింది. ఆమె భర్తగా విశ్వదేవ్ చక్కగా నటించాడు. లెక్కల మాస్టరు చాణక్యగా ప్రియదర్శి తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. అరుణ్, వరుణ్, కిరణ్ పాత్రల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్‌ల ఫెర్ఫార్మెన్స్ బాగుంది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. వివేక్ సాగర్ సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగానే సాగుతాయి. నేపథ్య సంగీతం చక్కగా ఉంది. సంభాషణలు బాగున్నాయి. ‘మనిషి మాటకి విలువ వినడంతో రాదు..పాటించడంతో వస్తుంది’, ‘పెరగలేనప్పడు కొంచెం తుంచాలి..అది కొడుకైనా..కొమ్మైనా!’, ‘చదువుకోవడం అంటే నేర్చుకోవడం’ లాంటి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘35: చిన్న కథ కాదు’ చిత్రానికి పిల్లలే హీరోలు: నిర్మాత
‘‘కన్నడలో ‘కాంతార’, మలయాళంలో ‘మంజుమ్మల్ బాయ్స్, తమిళంలో ‘మహారాజా’ తరహాలో తెలుగులో ‘35: చిన్న కథ కాదు’ సినిమా కూడా విజయం సాధిస్తుంది. బాపు, కె. విశ్వనాథ్, బాలచందర్గార్ల సినిమాలను గుర్తు చేస్తుంది’’ అన్నారు నిర్మాత సృజన్ యరబోలు. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘35: చిన్న కథ కాదు’. నంద కిశోర్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో సృజన్ మాట్లాడుతూ– ‘‘ఓ స్కూల్ పిల్లవాడికి లెక్కలు రాకపోతే ప్రత్యామ్నాయంగా ఏం చేయొచ్చని ఓ తండ్రి ఏం ఆలోచించాడు? అన్నదే కథ. ఈ చిత్రకథ తిరుపతి నేపథ్యంలో జరుగుతుంది. చెప్పాలంటే... కథలో తిరుపతి అనే ప్లేస్ కూడా ఓ క్యారెక్టర్లా ఆడియన్స్‌కు అనిపిస్తుంది. సినిమాలో మంచి మదర్ సెంటిమెంట్ ఉంది. మదర్ సెంటిమెంట్‌ను మించిన కమర్షియల్ అంశం ఏం ఉంటుంది? ఇంకా తండ్రీకొడుకులు, అన్నాచెల్లెళ్లు... ఇలా చాలా రిలేషన్స్ సినిమాలో ఉన్నాయి. స్కూల్ ఎపిసోడ్స్ బాగుంటాయి. ఓ విధంగా పిల్లలే ఈ సినిమాకు హీరోలనుకోవచ్చు. ప్రస్తుతం ‘గతం 2’, తరుణ్ భాస్కర్–ఈషా రెబ్బా కాంబినేషన్లోని సినిమాలు ఉన్నాయి. ‘మహారాజా’ తరహాలో ఓ థ్రిలర్ మూవీ కూడా ఉంది. రమ్యకృష్ణగారిని అనుకుంటున్నాం’’ అని అన్నారు. -
ప్రతివారం ఓ బాహుబలి రాదు
‘‘నా దృష్టిలో కథ అనేది ఓ ప్రయాణం. కానీ కొన్ని పరిమితుల కారణంగా కథారచయితలకు మనం ఎక్కువగా ఫ్రీడమ్ ఇవ్వడం లేదని నాకనిపిస్తుంటుంది. అందుకే ఎక్కువగా కొరియన్ సినిమాలను రీమేక్ చేస్తున్నాం. అయినా కథలో సోల్‌ను తీసుకుని, మన నేటివిటికీ తగ్గట్లుగా మార్పులు చేయడం అనేది సులువైన పనేం కాదు. ‘శాకిని డాకిని’ సినిమాకు అక్షయ్ అనే కుర్రాడు స్క్రీన్‌ప్లే అందించాడు’’ అన్నారు సునీత తాటి. రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శాకిని డాకిని’. సౌత్ కొరియన్ ఫిల్మ్ ‘మిడ్నైట్ రన్నర్స్’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. డి. సురేష్‌బాబు, సునీత తాటి, హ్యూన్యు థామస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా సునీత తాటి మాట్లాడుతూ– ‘‘ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసులు ఓ క్రైమ్‌ను ఎలా డీల్ చేశారు? అన్నదే ఈ సినిమా కథ. ‘మిడ్నైట్ రన్నర్స్’ చిత్రంలో హీరోలు నటించారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్స్‌ను పెట్టాం. ఇక మన దగ్గర కాస్త కథల కొరత ఉందని నా ఫీలింగ్. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లిన రాజమౌళిగారు ఉన్నారు. కానీ ప్రతి వారం ‘బాహుబలి’ లాంటి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చే సినిమాలు థియేటర్స్‌కు రావు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రీమేక్ రైట్స్ కావాలని కొందరు ఫిల్మ్‌మేకర్స్ నన్ను సంప్రదించారు. ఈ విషయాన్ని రాజమౌళిగారి దృష్టికి తీసుకుని వెళ్లాను’’ అని అన్నారు. ‘‘ఈ చిత్రంలో దామిని అనే పాత్ర పోషించాను. ఈ సినిమా నా కెరీర్లో ఓ మైల్‌స్టోన్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రెజీనా. ‘‘ఈ చిత్రంలో షాలిని పాత్ర చేశాను. ఈ సినిమా చూసేందుకు థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుల టికెట్ డబ్బులు వృథా కావనే నమ్మకం మాకుంది’’ అన్నారు నివేదా థామస్. చదవండి: (నన్నీ స్థాయికి తెచ్చింది చిన్న సినిమానే) -
షూటింగ్‌కి రెడీ
కరోనా బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్స్‌తో బిజీ కాబోతున్నారు శ్రుతీహాసన్. ఇటీవలే కొన్ని యాడ్స్ చిత్రీకరణల్లో పాల్గొన్నారామె. తాజాగా సినిమా చిత్రీకరణలకు కూడా సిద్ధమయ్యారు. అక్టోబర్ నుంచి ‘వకీల్ సాబ్’ చిత్రీకరణలో పాల్గొంటారట శ్రుతీహాసన్. పవన్ కల్యాణ్, అంజలి, నివేదా థామస్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ ‘పింక్’కి రీమేక్. ఇందులో పవన్ కల్యాణ్ భార్యగా శ్రుతీహాసన్ నటించనున్నారు. అయితే ఇందులో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందని సమాచారం. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. సంక్రాంతికి సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాతో పాటు రవితేజ ‘క్రాక్’లోనూ నటిస్తున్నారు శ్రుతి. ఆ సినిమా చిత్రీకరణ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘వి’ తర్వాత అభిమానులు పెరుగుతారనుకుంటున్నా!
నాని, సుధీర్‌బాబు, అదితీ రావు హైదరీ, నివేధా థామస్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శనివారం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్న సందర్భంగా నాని చెప్పిన విశేషాలు. ► కొత్త కంటñ ంట్‌తో వచ్చే సినిమా చూడాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ టైమ్‌లో ‘వి’ సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశం రావటం అదృçష్టంగానే భావించాలి. ఇంత మంచి సినిమాని థియేటర్లో చూస్తే బావుండేదే అనిపిస్తుంది. కానీ, తప్పదు. ఓటీటీ ఓ కొత్త ఎక్స్పీరియన్స్. నా ప్రతి సినిమాని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఉదయం 8.45 షోను కర్టెన్ పక్కన నిలబడి చూసేవాణ్ణి. అది మిస్ కాకూడదని థియేటర్ ఫీలింగ్ కోసం మా ఫ్యామిలీకి ఓ షో వేస్తున్నాను. ► ఇంద్రగంటిగారితో నా ఫస్ట్ సినిమా ‘అష్టా చమ్మా’ చేశాను. ఈ పన్నెండేళ్లలో నేను, ఆయన వ్యక్తిగతంగా కొంచెం కూడా మారలేదు. కానీ వృత్తిపర ంగా దర్శకునిగా ఇంద్రగంటిగారు, నటునిగా నేను, కెమెరామేన్‌గా విందా చాలా గొప్పగా ఎదిగాం అనిపించింది. ఈ ‘వి’ సినిమాకి హీరో ఇంద్రగంటిగారే. మా ‘అష్టా చమ్మా’ రిలీజ్ రోజునే ఈ సినిమా కూడా విడుదలవ్వటం అనుకోకుండా జరుగుతోంది. ► ‘వి’ సినిమా మొదలైన 20 నిమిషాల తర్వాత వస్తాను. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అవుతుందనుకుంటున్నా (న వ్వుతూ). ఇప్పుడు జనరేషన్ ఆడపిల్లలు బ్యాడ్బాయ్స్నే ఇష్టపడుతున్నారు. కావాలంటే చూడండి రానా, సోనూ సూద్‌లకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ‘వి’ కథ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. చాలామంది చివరికి వచ్చేసరికి నాని హీరో అవుతాడు, సుధీర్ విలనవుతాడని రాస్తున్నారు. అసలు అలాంటిదేం లేదు. లైఫ్ అంతా సాఫీగా నడుస్తోన్న ఒక సెలబ్రిటీ పోలీస్ లైఫ్‌లోకి ఒకడొచ్చాడు. ఇంతే సినిమా. సినిమా చూసిన ప్రేక్షకులు ఆ పాత్రలకు కనెక్ట్ అయి చిన్న ఎమోషన్ ఫీలవుతారు. ► ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాను ఇలా (ఓటీటీలో) విడుదల చేస్తున్నందుకు ‘దిల్’ రాజుగారు చాలామందికి సమాధానం చెప్పాలి. ఆయన కూడా ఓ డిస్ట్రిబ్యూటర్. రాజుగారూ.. మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా మీతో పాటు మేమున్నాం అని నావైపు నుండి పూర్తిగా సపోర్ట్ చేశాను. నిర్మాతకు నష్టం రాకుండా చూసుకోవటం మన బాధ్యత. ► లాక్డౌన్ ముందు రాజమండ్రిలో 20 రోజులు, పళనిలో 15 రోజులు షూటింగ్ చేశాను. షూటింగ్ చేసొచ్చిన ప్రతిసారీ మా అబ్బాయి జున్ను కొత్తగా కనిపిస్తుంటాడు. త్వరగా పెరిగిపోతున్నాడే, ఇలాంటి క్యూట్ ఏజ్‌ను మిస్ అవుతున్నానే అనుకునేవాణ్ణి. ఈ లాక్డౌన్లో 24 గంటలూ వాడితో టైమ్ స్పెండ్ చేస్తున్నాను. ► నటులందరూ బాధ్యతగా ఉండి నిర్మాతకు డబ్బు రాకపోతే అసలు రూపాయి కూడా తీసుకోకుండా పని చేయొచ్చు. అంతేకానీ ఒక్కో నటునికి 20 శాతం, 30 శాతం కట్ చేయాలని చాంబర్ రూల్ పెట్టిందని కాకుండా ఎవరికి వారు తీసుకోవాల్సిన డెసిషన్ ఇది. అంతేకానీ ఈ సమస్యను జనరలైజ్ చెయ్యకూడదు. ► ‘టక్ జగదీష్’ సినిమా 50 శాతం పూర్తయింది. అక్టోబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ‘శ్యామ్‌సింగరాయ్’ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ‘టక్ జగదీష్’ పూర్తవ్వగానే అది మొదలవుతుంది. మరో రెండు కథలు ఓకే చేశాను. ఒకటి కొత్త దర్శకుడు, మరోటి ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్‌తో చేస్తాను. ► జనరల్‌గా నేను ఫిట్నెస్ మీద పెద్దగా శ్రద్ధ పెట్టను కాబట్టి ఇప్పుడొచ్చిన గ్యాప్‌లో ఫుల్‌గా ఫిట్నెస్ పెంచుకుని సిక్స్‌ప్యాక్ చేద్దామనుకున్నాను. అలాగే పియానో నేర్చుకుందామనుకున్నాను. మా అమ్మ దగ్గర వంట నేర్చుకుందామనుకున్నాను. కానీ ఏమీ చేయలేదు. తినడం.. పడుకోవటం.. మా జున్నుతో ఆడుకోవటంతోనే ఆరు నెలలు గడిచిపోయాయి. -
మహేశ్ చిత్రంలో నివేదా?
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే సందర్భంగా విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఎంతగా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా అరవింద్ స్వామి నటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. (మహేశ్‌తో 'జనగణమన' నా డ్రీమ్) తాజాగా ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఆ పాత్ర కోసం నివేదా థామస్‌ను చిత్ర బృందం ఎంపిక చేసిందని టాక్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఆమెతో చర్చలు జరిపారని తెలుస్తోంది. నటన పరంగా మంచి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో నివేదా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘దర్బార్’ చిత్రంలో ఈ మలయాళ ముద్దుగుమ్మ రజనీకాంత్ కూతురుగా నటించి ఆకట్టుకుంది. (మహేశ్-సితు పాప స్విమ్మింగ్ పోటీ) కాగా ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యేందుకు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోపు పాటలను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డారు చిత్రబృందం. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న తమన్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. అంతేకాకుండా షూటింగ్‌కు అన్నీ కుదిరాక చిత్రీకరణ స్టార్ట్ చేసేందుకు ఓ సెట్‌ను సిద్ధంగా ఉంచాలనే ఆలోచనలో ఉన్నారు టీమ్. బ్యాంకు మోసాల బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివెంజ్ డ్రామాయే ఈ చిత్రం అని, ఓ బ్యాంకు మేనేజర్ కొడుకుగా మహేశ్ పాత్ర ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. (మహేశ్ సరసన కీర్తి) -
విడుదల వాయిదా
తన 25వ చిత్రాన్ని ఈ నెల 25న ఆడియన్స్‌కు చూపించాలనుకున్నారు నాని. అయితే ప్లాన్ మారింది. కరోనా వైరస్ కారణంగా ‘వి’ చిత్రం విడుదల వాయిదా పడింది. నాని, సుధీర్‌బాబు, అదితీ రావ్ హైదరీ, నివేదా థామస్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మించారు. ఇది నాని కెరీర్లో 25వ సినిమా. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు నాని. ఉగాది రోజున ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను ఏప్రిల్‌కు వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘మార్చిలో కరోనాను చంపేద్దాం. ఏప్రిల్ నెలలో ఉగాదిని జరుపుకుందాం’’ అని ట్వీట్ చేశారు నాని. -
ఉగాదికి రెడీ
నానీతో ‘అష్మాచమ్మా, జెంటిల్మన్’, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి వారిద్దరి కలయికలో తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘వి’. అదితీరావు హైదరీ, నివేదా థామస్ కథానాయికలుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేష¯Œ ్స పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 17న విడుదల చేస్తున్నారు. సినిమాను ఉగాది సందర్భంగా మార్చి 25న రిలీజ్ చేస్తున్నారు. నాని 25వ చిత్రం ‘వి’. ఇందులో నాని రాక్షసుడి తరహా పాత్రలో కనిపించనున్నారు. ఆయన బారి నుంచి అందర్నీ కాపాడే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్‌బాబు నటించారు. ఇటీవల వీరిద్దరి పాత్రల లుక్స్‌ను విడివిడిగా విడుదల చేసిన చిత్రబృందం ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఉన్న పోస్టర్‌ను విడుదల చేసింది. సుధీర్‌బాబు స్టైలిష్ లుక్‌తో కనబడుతుంటే.. నాని మెలితిప్పిన మీసాలతో రగ్డ్ లుక్‌లో కనబడుతున్నారు. ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు త్వరలో పూర్తి కానున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, నేపథ్య సంగీతం: తమన్, కెమెరా: పి.జి.విందా. -
విగాదికి కలుద్దాం
హీరో నాని ఉగాది వేడుకలు ‘వి’సెట్లో జరిగాయి. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్‌బాబు నటించిన చిత్రం ‘వి’. నివేదా థామస్, అదితీరావు హైదరి కథానాయికలుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించారు. ఈ చిత్రంలో పోలీసాఫీసర్ పాత్రలో సుధీర్ బాబు నటించగా, నాని విలన్ పాత్ర చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కెరీర్లో తొలిసారి నాని విలన్ పాత్ర పోషిస్తున్న చిత్రం ఇది. ‘‘సంక్రాంతి రోజున ముగిస్తున్నాము. ఉగాది రోజు మొదలెడదాము’’ అని పేర్కొన్నారు నాని. ‘‘వి’ చిత్రీకరణ ముగిసింది. ఓ మంచి భావోద్వేగంతో కూడిన ప్రయాణం ముగిసింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరు బాగా కష్టపడ్డారు. ఉగాదికి కౌంట్‌డౌన్ మొదలైంది. అతి త్వరలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తాం’’ అని పేర్కొన్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ. ‘వి’ చిత్రం ఉగాది సందర్భంగా ఈ ఏడాది మే 25న విడుదల కానుంది. -
సెన్సేషనల్ అవుతుందనుకోలేదు: అల్లు అర్జున్
‘‘నాకు చిరంజీవిగారంటే ప్రాణం. ఇక్కడ చాలామంది పవన్ కల్యాణ్ గురించి మాట్లాడమంటున్నారు.. మీకోసం అంటున్నా పవర్‌స్టార్‌గారు.. కానీ, నాకు మాత్రం చిరంజీవిగారంటే ప్రాణం.. ఈ కట్టె కాలేంత వరకూ ఆయన అభిమానినే.. చిరంజీవిగారి తర్వాత నేను అంతగా అభిమానించేది రజనీకాంత్గారినే. ఆయన రోల్ మోడల్’’ అన్నారు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో...’. మమత సమర్పణలో అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘మ్యూజికల్ కన్సర్ట్’లో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘నా సినిమాలకు చాలా గ్యాప్ వచ్చింది.. నేను ఇవ్వలా.. వచ్చింది. ‘సరైనోడు, దువ్వాడ జగన్నాథమ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాల తర్వాత సరదాగా ఉన్న కథతో సినిమా చేయాలనుకున్నా. కథలు విన్నా.. నచ్చలేదు. ఆ తర్వాత త్రివిక్రమ్‌గారు, నేను కూర్చుని, కథ అనుకుని తీయడంతోనే ఈ గ్యాప్ వచ్చింది. సినిమా రిలీజ్లో గ్యాప్ ఉంటుంది కానీ, ఉత్సవాల్లో కాదు. మా ఆవిడకి సంగీతమంటే చాలా ఇష్టం.. మ్యూజిక్ బ్యాండ్ కల్చర్ హైదరాబాద్‌లో బాగా పెరిగింది. శనివారం అందరూ వెళుతుంటారు. నేను ఖాళీగా ఉన్న రోజుల్లో మా ఆవిడ నన్ను తీసుకెళ్లింది.. ముందు నచ్చేది కాదు. కానీ, ఖాళీగా ఉన్న రోజుల్లో మనం ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత సేఫ్ (నవ్వుతూ).. అందుకే తనవెంట వెళ్లేవాణ్ణి.. అందరి మ్యూజిక్ బ్యాండ్స్‌లో నా పాట ఉండాలి అని తమన్, త్రివిక్రమ్‌గారితో అన్నాను. నేను ఒట్టేసి చెబుతున్నా ‘సామజ వరగమన...’ పాట ఇంత సెన్సేషనల్ అవుతుందని కలలో కూడా అనుకోలేదు. ఓ రోజు మా ఆవిడ ఇంటికొచ్చి.. ‘ఎక్కడ చూసినా ఈ పాటే ప్లే చేస్తున్నారు.. విసుగొస్తోంది.. పైగా అందరూ నన్ను చూసి పాడుతుండటంతో సిగ్గుతో వచ్చేశా’ అని చెప్పినప్పుడు నాకు అనిపించింది.. ప్రపంచం ముందు వచ్చే హీరోయిజం కన్నా భార్య ముందు వచ్చే హీరోయిజంలో చాలా హాయి ఉంటుందని. అంత గొప్ప పాట రాసిన సీతారామశాస్త్రిగారికి, పాడిన సిద్ శ్రీరామ్‌గారికి, మంచి సంగీతం అందించిన తమన్‌గారికి, వీరి ముగ్గుర్ని బాగా కోఆర్డినేట్ చేసిన త్రివిక్రమ్‌గారికి, ఈ సినిమాలో పాటలు రాసిన వారందరికీ థ్యాంక్స్.నా ‘జులాయి’ సినిమాతో ఆరంభమైన హారికా అండ్ హాసినీ బ్యానర్ ఇంత పెద్ద స్థాయికి వచ్చినందుకు రాధాకృష్ణగారు, వంశీలను అభినందిస్తున్నా. నాకు తెలిసి మూడుసార్లు ఏ డైరెక్టర్‌తోనూ చేయలేదు.. నాకు నా మీద ఉన్న నమ్మకం కంటే నాపై త్రివిక్రమ్‌గారికి ఉన్న నమ్మకం ఎక్కువ.. నాకు హిట్ సినిమాలు ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్.. ఈ సినిమాతో మరో హిట్ ఇవ్వబోయేది కూడా ఆయనే. ఏడాదిన్నరగా ఇంటిలో ఉన్నా నాకు ఈ గ్యాప్ ఒక్క సెకనులా అనిపించిందంటే అది నా అభిమానుల వల్లే.. ఎవరికైనా అభిమానులుంటారు.. నాకు ఆర్మీ ఉంది’’ అల్లు అర్జున్ అన్నారు. పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలోని ప్రతి పాటా ఓ ఆణిముత్యంలా రాశారు రచయితలందరూ. అల్లు అర్జున్ మంచి సంస్కారవంతుడు. ‘సామజ వరగమన..’ పాటని 13కోట్ల మంది విన్నారట. అంటే.. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల వారూ మనసుతో విన్నారు. ఈ పాటని నేను చాలా కుర్రతనంతో రాశానని చాలా మంది అన్నారు.. నేను కుర్రాణ్ణి కాదు.. అల్లు అర్జున్‌ని అయిపోయానిక్కడ. అంత స్పష్టంగా నాతో పాట రాయించుకున్నాడు త్రివిక్రమ్. తమన్ మంచి సంగీతం ఇచ్చాడు’’ అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘మేం సపోర్ట్‌గా ఉన్నా ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే నా ఫ్రెండ్ రాధాకృష్ణ కష్టపడటం వల్లే.. త్రివిక్రమ్ మాకు చిన్న కథ చెప్పి ఇంత పెద్ద సినిమా తీశాడు. సినిమా విడుదలకు ముందే హిట్ టాక్ వచ్చింది మీ వల్లే (అభిమానులు). 2019కి నేను వీడ్కోలు చెప్పడానికి తమన్ ‘ప్రతిరోజూ పండగే’ సినిమా ఇచ్చాడు.. 2020కి స్వాగతం పలకడానికి ‘అల వైకుంఠపురములో’ ఇచ్చాడు.. థ్యాంక్యూ తమన్’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘బన్నీ డ్యాన్సులతో, తమన్ పాటలతో, త్రివిక్రమ్‌గారు పంచ్‌లతో ఇరగ్గొట్టేస్తారు.. ఇక సినిమా బాగుందని మెగాఫ్యాన్స్ అంటే చాలు.. ఈ సంక్రాంతికి ఇరగ్గొట్టేస్తారు’’ అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘సీతారామశాస్త్రిగారు, తమన్ ఓ మధ్యాహ్నం కూనిరాగం తీసుకుంటూ పాడిన ఒక పాట ఇన్ని కోట్ల మంది హృదయాలను తాకింది. అదే ‘సామజవరగమన..’. తన వయసు నుంచి దిగి సీతారామశాస్త్రిగారు, తన స్థాయి నుంచి ఎక్కి తమన్ ఇద్దరూ కలసి ఈ చిత్రానికి ఈ స్థాయిని తీసుకొచ్చారు. సంగీతాన్ని గౌరవించాలనే మ్యూజికల్ నైట్ ఈవెంట్ పెట్టాం. ‘జులాయి’ అప్పుడు బన్నీ పెళ్లి కాని యువకుడు. ఇప్పుడు ఇద్దరు బిడ్డల తండ్రి. తన తాలూకు మెచ్యూరిటీ ఈ సినిమాలోనూ పెట్టాడు. మేం కన్న కల మీ అందరికీ ఓ జ్ఞాపకం అవ్వాలి. మేం అడిగిందల్లా ఇచ్చారు నిర్మాతలు అల్లు అరవింద్, రాధాకృష్ణ. సంగీతం అంటే మనసు దురదపెట్టినప్పుడు గోక్కునే దువ్వెన లాంటిది. తల దురద పెడితే గోక్కోవడానికి దువ్వెన ఉంటుంది కానీ మనసు దురద పెడితే కావాల్సింది సంగీతమే. వేటూరి, ఆ తర్వాత సీతారామశాస్త్రిగార్లు ‘వాడు సినిమా వాడురా నుంచి ఆయన సినిమాకు పాటలు రాస్తాడు’ అనే స్థాయిని తీసుకొచ్చిన వ్యక్తులు. ఈ సినిమాకు మొదలు, ముగింపు అల్లు అర్జున్. ఇందులో అల్లు అయాన్, అల్లు అర్హా నటించారు’’ అన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ– ‘‘మీ (ఫ్యాన్స్)లాగా నేను కూడా బన్నీకి పెద్ద అభిమానిని. ఒక అభిమానిగా ఉంటేనే ఇంత బాగా కంపోజ్ చేయగలం. త్రివిక్రమ్‌గారు లేకుంటే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాణ్ణి కాదు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసినీ టీమ్ రేయింబవళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డారు’’ అన్నారు. నటి టబు మాట్లాడుతూ– ‘‘చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చితే నాకు మంచి రీ ఎంట్రీ అవుతుంది’’ అన్నారు. నిర్మాతలు రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ, ‘బన్నీ’ వాస్, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, కృష్ణచైతన్య, నటులు సునీల్, సముద్ర ఖని, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, నటీనటులు రోహిణి, సుశాంత్, అల్లు శిరీశ్, డ్రమ్స్ శివమణి, గాయకుడు సిద్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
పింక్ రీమేక్‌లో అంజలి?
రెండేళ్ల క్రితం బాలీవుడ్లో విడుదలైన ‘పింక్’ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. అనిరుద్ధ రాయ్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, తాప్సీ, కృతీ కల్హరీ, ఆండ్రియా టారియంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నిర్మాత బోనీకపూర్ ‘పింక్’ చిత్రాన్ని గత ఏడాది తమిళంలో ‘నేర్కొండ పార్వై’గా రీమేక్ చేశారు. ఇప్పుడు ‘పింక్’ చిత్రం తెలుగులో రీమేక్ కానుంది. ‘దిల్’ రాజు, బోనీ కపూర్ నిర్మించనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. ‘ఓ మై ఫ్రెండ్, ఎమ్సీఏ’ చిత్రాల ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. తమన్ స్వరకర్త. ఈ సినిమాలో కథ రీత్యా ముగ్గురు అమ్మాయిల పాత్రలు ఉంటాయి. వీరిలో ఇద్దరు అమ్మాయిలుగా అంజలి, నివేదా థామస్ నటించబోతున్నారని లేటెస్ట్ టాక్. ఇక హిందీ ‘పింక్’లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది. -
ఈ ఉగాదికి హింసే!
‘‘ఈ క్షణం నుంచి నా శత్రువులకి నా దయా దాక్షిణ్యాలే దిక్కు’ అన్నాడు షేక్స్పియర్. అదే నేనూ అంటున్నాను. శత్రువులందరూ జాగ్రత్తగా ఉండండి’’ అంటున్నారు నాని. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్‌బాబు హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘వి’. నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘వయొలెన్స్ (హింస) కావాలన్నారుగా. ఇస్తాను. ఉగాదికి సాలిడ్‌గా ఇస్తాను’’ అని ట్వీటర్లో పేర్కొన్నారు నాని. ఈ సినిమాలో సుధీర్‌బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో, నాని విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇది నాని 25వ చిత్రం కూడా కావడం విశేషం. ఈ సినిమాకు సంగీతం: అమిత్ త్రివేది. -
క్రైమ్ పార్ట్నర్
ఓ నేరస్తుడ్ని పట్టుకోవడానికి అఖిల్ వేయనున్న ప్లాన్‌కు హెల్ప్ చేయడానికి రెడీ అవుతున్నారట నివేదా థామస్. ‘అ!, కల్కి’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా నివేథా ధామస్ పేరును చిత్రబృందం పరిశీలిస్తోందని తెలిసింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాతో బిజీగా ఉన్నారు అఖిల్. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మతో చేయనున్న సినిమా ఆరంభం అవుతుంది. -
ఇది సమష్టి విజయం
‘‘బ్రోచేవారెవరురా’ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇందులో ప్రతి ఒక్కరూ బాగా చేశారు. ఇది మా టీమ్ సమష్టి కృషితో సాధించిన విజయం’’ అన్నారు దర్శకుడు వివేక్ ఆత్రేయ. శ్రీవిష్ణు, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. సత్యదేవ్, నివేతా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించారు. విజయ్‌కుమార్ మన్యం నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ‘‘సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది’’ అని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘థాంక్స్ మీట్’లో విజయ్‌కుమార్ మన్యం మాట్లాడుతూ –‘‘మా సినిమా చూసి ప్రోత్సహించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. కేటీఆర్‌గారు, సురేశ్‌బాబుగారు, వెంకటేశ్‌గారు, నానిగారు, అనిల్ రావిపూడి, తరుణ్ భాస్కర్, రామ్.. ఇలా మా సినిమా గురించి మంచి మాటలు చెప్పిన అందరికీ థ్యాంక్స్. మంచి కలెక్షన్లు, మంచి ఓపెనింగ్స్ రావడానికి మంచి రివ్యూలు దోహదపడ్డాయి’’ అన్నారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘మా సినిమా చూసి సురేష్‌బాబుగారు బావుందన్నారు. ప్రీ రిలీజ్‌కి రామ్‌గారు, రోహిత్‌గారు వచ్చారు. దానివల్ల అందరికీ రీచ్ అయింది. ముందు రోజు నానిగారు చూసి బావుందని చెప్పడంతో అందరూ థియేటర్లకు వచ్చి మెచ్చుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. -
బ్రోచేవారెవరురా థ్యాంక్స్ మీట్
శ్రీవిష్ణు, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బ్రోచేవారెవరురా. సత్యదేవ్, నివేతా పేతురాజ్, రాహుల్ రామక్రిష్ణ, ప్రియదర్శి ఇతర ప్రధాన పాత్రలో నటించారు. విజయ్‌కుమార్ మన్యం నిర్మించిన ఈ సినిమా జూన్ 28న విడుదలై భారీ వసూళ్లు సాధిస్తూ దూపసుకుపోతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ థాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంల్లో ముఖ్య అతిథులుగా దర్శకులు శివ నిర్వాణ, తరుణ్ భాస్కర్ పాల్గొన్నారు. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘మా సినిమాను అందరూ చూసి చాలా బావుందన్నారు. సురేష్ బాబు గారు మెచ్చుకున్నారు. ప్రీ రిలీజ్‌కి రామ్ గారు, రోహిత్ గారు వచ్చారు. దాని వల్ల అందరికీ రీచ్ అయింది. ముందు రోజు నానిగారు చూసి బావుందని చెప్పడంతో అందరూ థియేటర్లకు వచ్చి మెచ్చుకోవడం ఆనందంగా ఉంది. సినిమాను పైరసీలో చూడొద్దు. మంచి థియేటర్లో చూస్తే బావుంటుంది’ అన్నారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ ‘ఆడియన్స్‌కి ధన్యవాదాలు. ప్రెస్ వాళ్లందరూ ఫోన్ చేసి సినిమా గురించి ప్రశంసించారు. ప్రతీ ఒక్కరూ బాగా చేశారు. ఇది మా టీం అందరి సమిష్టి కృషితో సాధించిన విజయం. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ మాట్లాడుతూ ‘వివేక్ చాలా మంచి స్టోరీ రాసుకున్నారు. నిర్మాతకు తొలి సినిమాకే ఇంత పెద్ద హిట్ రావడం ఆనందంగా ఉంది. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ బావుంది. మా లిరిసిస్ట్లు అందరికీ ధన్యవాదాలు. సౌండ్ డిజైన్ చాలా బావుంది’ అన్నారు. నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ ‘సినిమా చాలా బావుంది. గత రెండు, మూడు వారాలుగా థియేటర్లలో చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. ఆడియన్స్ ఇలాంటి సినిమాలు చూడబట్టే కొత్త సినిమాలతో మేం కూడా ముందుకొస్తున్నాం. వివేక్ చాలా జీనియస్. నిర్మాత సినిమా మీద ఇంత ప్యాషన్‌తో చేసినందుకు థాంక్స్. నా పాత్రను చూసి అందరూ నవ్వుతుంటే చాలా ఆనందంగా ఉంది’ అన్నారు . నిర్మాత విజయ్‌కుమార్ మన్యం మాట్లాడుతూ ‘సినిమా చూసి ఎంకరేజ్ చేసిన ప్రేక్షకులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు. అనిల్‌రావిపూడి, తరుణ్ భాస్కర్, రామ్, సురేశ్‌బాబు గారు, నానిగారు, వెంకటేశ్‌గారు, కె.టి.ఆర్‌గారు సహా అందరికీ థాంక్స్. మంచి కలెక్షన్లు రావడానికి, మంచి ఓపెనింగ్స్ రావడానికి మంచి రివ్యూలు దోహదపడ్డాయి. ప్రతీ రివ్యూలోనూ మా టీమ్‌ని ప్రశంసించినందుకు ధన్యవాదాలు’ అన్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ‘2019లో నాకు నచ్చిన సినిమా అని చాలా మంది చెప్పారు. నాకు టిక్కెట్లు దొరకలేదు. వివేక్ నాకు ఒక టికెట్ ఇప్పిస్తే బావుంటుంది. నేను రేపు 11కి ఏఎంబీలో చూస్తాను. మనస్ఫూర్తిగా చెప్పాలంటే వివేక్ ఆత్రేయకి ఇది వెల్ డిసర్వ్డ్ సక్సెస్. ఆయన ప్రతీ డీటైల్‌ను కేర్ ఫుల్‌గా చేశారు. ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి నేను. తన పర్సనల్ జర్నీ కూడా నాకు తెలుసు. ఆయన ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలి’ అన్నారు. దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ ‘నేను కథ రాసేటప్పుడు హ్యూమర్ రావాలంటే దీన్ని పారామీటర్‌గా తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇటీవల నేను, వివేక్, గౌతమ్ తిన్ననూరి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాం. అందులో భాగంగా వివేక్ని నెక్స్ట్ ఏ సినిమా తీయబోతున్నారు అని అడిగితే ‘ఏదైనా నా స్ట్రగుల్, నా పెయిన్ నుంచి వస్తుంది’ అని చెప్పాడు. తను అలా చెప్పడం నాకు నచ్చింది. సెకండ్ ఫిల్మ్ అనేసరికి ఆబ్లిగేషన్‌లో పడకుండా, అడ్వాన్సుల్లో పడకుండా ఉండటం చాలా ఆనందంగా ఉంది. నివేదాకు క్లాసికల్ డ్యాన్స్ బాగా వచ్చు. నేను నిన్నుకోరిలో పిచ్చిపిచ్చిగా చేయించాను. ఈ సినిమాలో చాలా బాగా చేసింది. ఈ సినిమాలో కథ బావుండాలని అందరూ కృషి చేశారు. అదే ఈ సినిమాకు పెద్ద సక్సెస్. ఇప్పటిదాకా శ్రీవిష్ణు చేసిన సినిమాల్లోకి ఈ సినిమా పెద్ద సక్సెస్ అని అనిపించింది’ అన్నారు. -
‘బ్రోచేవారెవరురా’ మూవీ రివ్యూ
-
‘బ్రోచేవారెవరురా’ మూవీ రివ్యూ
టైటిల్ : బ్రోచేవారెవరురా నటీనటులు : శ్రీ విష్ణు, నివేదా థామస్, సత్యదేవ్, నివేథా పేతురాజ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తదితరులు సంగీతం: వివేక్‌సాగర్ నిర్మాత : విజయ్ కుమార్ మన్యం దర్శకత్వం : వివేక్ ఆత్రేయ మెంటల్ మదిలో చిత్రంలో ఆకట్టుకున్న వివేక్ ఆత్రేయ.. మొదటి ప్రయత్నంలోనే మెప్పించాడు. విభిన్న కథనంతో, తనదైన శైలితో తెరకెక్కించిన ప్రేమ కథను తెరపై అందంగా చూపించాడు. మొదటి ప్రయత్నంలో సున్నితమైన భావోద్వేగాలతో కూడిన కథ, కథనంతో ప్రయోగం చేయగా.. రెండో సారి అలాంటి కథాకథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓ అమ్మాయి ఇంట్లో, సమాజంలో పడే కష్టాలు, ఎదురయ్యే బాధలను కథగా మలుచుకుని చేసిన ప్రయత్నమే ‘బ్రోచేవారెవరురా’. మరి ఈసారి వివేక్ ప్రయత్నం ఫలించిందా? ఆయనకు మరో విజయం లభించిందా? తెలియాంటే.. కథేంటో ఓసారి చూద్దాం. కథ ఓ అమ్మాయి తన ఇష్టాలను, కష్టాలను తల్లిదండ్రులతో చెప్పుకోవాలనుకుంటుంది. అమ్మాయి పడే కష్టాలను, ఆమె ఇష్టాలను, సమాజంలో ఆమెకు ఎదురయ్యే వేదింపులను నిర్భయంగా కన్నవారితో చెప్పుకునే స్వేచ్చను ఇవ్వాలి. అలా కాకుండా తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమగా మాట్లాడలేనప్పుడు.. స్నేహితులతోనే, ఇంకెవరితోనో చెప్పుకుంటారు. తండ్రి నిరాదరణకు గురైన ఓ అమ్మాయి.. ఇంటిని కాదనకుని బయటకు వెళ్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేదే ఈ కథ. దీంట్లో మిత్ర(నివేదా థామస్), రాహుల్ ( శ్రీ విష్ణు), విశాల్ (సత్యదేవ్), షాలిని (నివేథా పేతురాజ్) పాత్రలకు ఉన్న సంబంధమేంటనేది థియేటర్లో చూడాలి. నటీనటులు: మిత్ర పాత్రలో నివేదా థామస్ అద్భుతంగా నటించింది. తండ్రి ప్రేమకు దూరమైన మిత్ర క్యారెక్టర్లో నివేదా నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. లుక్స్ పరంగానూ నివేదా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అల్లరి చిల్లరగా తిరిగే రాహుల్ పాత్రలో శ్రీ విష్ణు మెప్పించాడు. తనకు అలవాటైన నటనతో రాహుల్ పాత్రలో ఈజీగా జీవించేశాడు. సినీ హీరోయిన్ షాలినీగా నివేధా పేతురాజ్, డైరెక్షన్ కోసం ప్రయత్నించే విశాల్‌గా సత్యదేవ్ బాగానే నటించారు. శ్రీ విష్ణు స్నేహితులుగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి గుర్తుండే పాత్రలో నటించారు. మిగతా నటీనటులంతా తమ పరిధి మేరకు మెప్పించారు. విశ్లేషణ ఓ చిన్న పాయింట్‌ను తీసుకున్న వివేక్ ఆత్రేయ.. తను అల్లిన కథ, కథనాన్ని పేర్చిన విధానం ఆకట్టుకుంటుంది. చిత్రంలో జరిగే ప్రతీ సన్నివేశానికి.. మళ్లీ ఎక్కడో లింక్ చేసి రాసిన కథనానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మిత్ర పాత్రలో అమ్మాయి పడే కష్టాలను చూపిస్తూనే.. తండ్రి అనే వాడు ఎలా ఉండకూడదో చూపించాడు. ప్రేక్షకులకు ఏదో మెసెజ్ ఇస్తున్నట్లు కాకుండా.. కథనంలో భాగంగా తన మాటలతోనే ప్రేక్షకుడిని అర్థమయ్యేట్లు చెప్పాడు. ఓ వైపు నవ్విస్తూనే మరోవైపు ఆలోచించేలా చేశాడు. కథనం స్లోగా నడస్తున్నా.. ఎంటర్టైన్మెంట్ను మిస్ చేయకుండా.. తను అనుకున్న కథను, తను చెప్పదల్చుకున్న పాయింట్‌ను ప్రేక్షకులకు విసుగు రాకుండా చెప్పాడు. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని పడిపడి నవ్వేలా చేసిన వివేక్.. కొంచెంకొంచెంగా అసలు పాయింట్‌ను చెబుతూ ఉంటాడు. చివరకు ఓ అమ్మాయికి తల్లిదండ్రులు, ఇళ్లే సురక్షితమని ముగించేస్తాడు. ఈ కథలో తిప్పిన ప్రతీ మలుపు ఆసక్తికరంగా ఉండటం, ఎంటర్టైన్మెంట్ పార్ట్‌ను ఎక్కడా వదలకపోవడంలోనే వివేక్ పనితనం అర్థమవుతోంది. వివేక్‌సాగర్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం బాగుంది. ఎక్కడా కూడా పాటలు స్పీడ్ బ్రేకుల్లా అనిపించవు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగం సినిమా విజయవంతం కావడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ నటీనటులు కథ దర్శకత్వం మైనస్పాయింట్స్ స్లో నెరేషన్ బండ కళ్యాణ్,సాక్షి వెబ్ డెస్క్. -
నా నటనలో సగం క్రెడిట్ అతనిదే
‘‘సినిమా రిలీజైన తర్వాత తెలుస్తుంది.. మనం చిన్న సినిమా చేశామా? పెద్ద సినిమా చేశామా? అని. ‘మెంటల్ మదిలో’ సినిమా చూశా. వివేక్ ఆత్రేయ చాలా బాగా తీశాడు. ఇలాంటి ప్రతిభ ఉన్న డైరెక్టర్‌కి ‘బ్రోచేవారెవరురా’ సినిమాకి మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు’’ అన్నారు హీరో రామ్. శ్రీవిష్ణు, నివేదా థామస్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. విజయ్ కుమార్ మన్యం నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రామ్ మాట్లాడుతూ– ‘‘నిన్నుకోరి’లో తొలి షాట్ చూసిన తర్వాత నివేదా మంచి నటి అని తెలిసింది. వివేక్ మ్యూజిక్ బావుంటుంది. నా ఫేవరేట్ లిరిసిస్ట్ రామజోగయ్యశాస్త్రి. ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమాలో ‘తదుపరి జన్మకైనా...’ పాట రాశారు. ఈ సినిమాకి కూడా మంచి పాటలు రాశారు. శ్రీవిష్ణుని ఫస్ట్ టైమ్ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ టైమ్‌లో కలిశా. ఆ సినిమాలో నా నటనలో సగం క్రెడిట్ శ్రీవిష్ణుదే. తను చాలా మంచి నటుడు. నాకు నటన నేర్పించిన అరుణ భిక్షుగారు ఈ చిత్రానికి చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘మంచి సినిమాలు తీయగానే సురేష్ బాబుగారిలాంటి వాళ్లు ఇన్వాల్వ్ అయి సపోర్ట్ చేస్తున్నారు.. ఇందుకు చాలా హ్యాపీ. నేను చిన్నప్పటి నుంచి వెంకటేష్‌గారికి వీరాభిమానిని. ఈ సినిమాలో నేను ఆయన ఫ్యాన్‌గా చేయడం ఆనందంగా ఉంది. ‘బ్రోచేవారెవరురా’ కథని వివేక్ ఆత్రేయ చెప్పినప్పుడు చాలా నచ్చింది. మిత్ర పాత్రలో నివేదా బాగా నటించారు. ఆ పాత్రకోసం, కేవలం మహిళల కోసం ఈ సినిమా చేశా’’ అన్నారు. ‘‘ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు సురేష్ బాబు. ‘‘మహిళలు చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు నివేదా థామస్. ‘‘విజువల్‌గా సినిమా రిచ్‌గా ఉంటుంది’’ అన్నారు విజయ్ కుమార్ మన్యం. ‘‘ఈ చిత్రం గురించి నేను మాట్లాడటం కన్నా సినిమా చూస్తేనే మంచిది’’ అన్నారు వివేక్ ఆత్రేయ. ‘‘ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నా’’ అన్నారు నారా రోహిత్. -
అది ఇంకా ప్రశ్నే
‘బ్రోచేవారెవరురా అంటే కాపాడేవారు ఎవరురా అని అర్థం. ఈ సినిమాలో ఏ రెండు పాత్రలను తీసుకున్నా ఏదో ఓ సందర్భంలో ఒక పాత్ర మరో పాత్రను కాపాడుతుంది. దాంతో ‘బ్రోచేవారెవరురా’ అనే టైటిల్ బావుంటుందని పెట్టాం’’ అని దర్శకుడు వివేక్ ఆత్రేయ అన్నారు. శ్రీవిష్ణు, నివేదా థామస్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. మన్యం విజయ్‌కుమార్ నిర్మాత. సత్యదేవ్, నివేదా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించారు. సురేశ్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తున్న ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా వివేక్ ఆత్రేయ పంచుకున్న విశేషాలు... ► ఈ కథను నా మొదటి సినిమా ‘మెంటల్ మదిలో’ తర్వాతే రాసుకున్నాను. ఫస్ట్ రాజ్ కందుకూరిగారి బ్యానర్లో చేద్దామనుకున్నాను. ప్రొడక్షన్ ఆలస్యం అవుతుండటంతో ‘మళ్లీ ఏదైనా ప్రాజెక్ట్ కలసి చేద్దాం’ అని రాజ్సార్తో చెప్పి బయటకు వచ్చేశా. ► కథ రాసుకున్నప్పుడు శ్రీవిష్ణుని మనసులో పెట్టుకునే రాసుకున్నాను. వేరే వాళ్లకు కథ చెప్పినా, ఫైనల్‌గా విష్ణుతోనే చేశాను. ‘మెంటల్ మదిలో’ అప్పుడు మా కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇందులో ఉమెన్ హెరాస్మెంట్ పాయింట్‌ని టచ్ చేస్తూ లైట్ హార్ట్ కామెడీగా తెరకెక్కించాం. ప్రతి మహిళ చూడాల్సిన సినిమా ఇది. మిత్ర అనే పాత్ర నివేదా థామస్ తప్ప ఎవరూ చేయలేరు అన్నట్టుగా చేసింది. ► ఇందులో ఆర్3 బ్యాచ్ (శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ) ఐదేళ్లుగా ఇంటర్ చేస్తుంటారు. వాళ్లకు మిత్రా (నివేదా థామస్) పరిచయం అవుతుంది. తన వల్ల వీళ్ల లైఫ్ ఎలా మారింది అనేది కథ. ఇందులో సినిమా హీరోయిన్గా నివేదా పేతురాజ్, దర్శకుడు కావాలనే పాత్రలో సత్యదేవ్ చేశారు. ► ‘మెంటల్ మదిలో’ నచ్చింది, హిట్ అని కొందరంటారు. కొందరేమో ఇంకా బావుండాల్సింది అంటారు. సో ఫస్ట్ సినిమా హిట్టా లేదా? నాకు రావాల్సినంత పేరు వచ్చిందా? లేదా అనేది నాకింకా ప్రశ్నే. ఆ విషయాన్ని మెల్లిగా పట్టించుకోవడం మానేశాను. ‘బ్రోచేవారెవరురా’ తర్వాత ఏ సినిమా చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. -
ఆగస్ట్‌లో గుమ్మడికాయ
ఓ అమ్మాయితో కలిసి రైల్వేస్టేషన్లో వెయిట్ చేస్తున్నారు ఓ పోలీసాఫీసర్. ఆ పోలీసాఫీసర్ ఎవరంటే రజనీకాంత్. అమ్మాయేమో నివేథా థామస్. రజనీకాంత్ హీరోగా ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దర్బార్’లో నివేథా కీలకపాత్ర చేస్తున్నారు. ఇందులో నయనతార కథా నాయికగా నటిస్తున్నారు. సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్ నటిస్తున్నారు. చెన్నైలో వేసిన రైల్వేస్టేషన్ సెట్లో ఇటీవల రజనీకాంత్, నివేదాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ జూలైకల్లా పూర్తవుతుందనే ప్రచారం జరిగింది. ఈ వార్తను మురుగదాస్ ఖండించారు. ‘దర్బార్’ షూటింగ్ ఆగస్టు వరకు జరుగుతుందని వెల్లడించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
ఎంట్రీ అప్పుడే
నాని, సుధీర్‌బాబు హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘వి’. ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అదితీరావు హైదరీ, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సుధీర్‌బాబు వర్కౌట్స్ చేసి బరువు కూడా తగ్గారు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. ఇందులో సుధీర్‌బాబు పోలీసాఫీసర్‌గా కనిపిస్తారని, నానిది విలన్ పాత్ర అని టాక్. జూలై రెండోవారంలో నాని ఈ సినిమా షూటింగ్ లొకేషన్లో జాయిన్ అవ్వనున్నట్లు తెలిసింది. శ్రీవెంకటేశ్వర కియేషన్స్ పతాకంపై అనిత సమర్పణలో శిరీష్, లక్ష్మణ్, హర్షిత్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి.. నాని ప్రస్తుతం ఏం చేస్తున్నారు అంటే ‘గ్యాంగ్‌లీడర్’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 30న విడుదల కానుంది. -
వ్యూహమా? విక్టరీయా?
నాని, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘అష్టా చమ్మా, జెంటిల్ మన్’ చిత్రాలు ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే సుధీర్‌బాబు, ఇంద్రగంటి కలయికలో వచ్చిన ‘సమ్మోహనం’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్లో ‘వి’ పేరుతో ఓ సినిమా రూపొందనుంది. ‘వి’ అంటే విక్టరీ అని ఊహించవచ్చు. నాని, సుధీర్‌బాబు హీరోలుగా, అదితీరావు హైదరీ, నివేదా థామస్ హీరోయిన్లుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంలో 36వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. అనిత సమర్పణలో శిరీష్, లక్ష్మణ్, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు త్రినాథరావు నక్కిన కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు శ్రీరామ్ వేణు క్లాప్ ఇచ్చారు. ‘ఎఫ్2’ డైరెక్టర్ అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. తనికెళ్ల భరణి, వి.కె. నరేష్, రోహిణి, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి పాటలు: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, కెమెరా: పి.జి.విందా, సంగీతం: అమిత్ త్రివేది. -
దర్బార్‌లోకి ఎంట్రీ
‘దర్బార్’లో ప్లేస్ కన్ఫార్మ్ చేసుకున్నారు హీరోయిన్ నివేదా థామస్. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఐపీఎస్ పోలీసాఫీసర్ పాత్రలో రజనీకాంత్ నటిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా షూట్‌లోకి జాయిన్ అయ్యారు నయనతార. ఆమెతోపాటు నివేదా థామస్, కమెడియన్ యోగిబాబు కూడా ఈ ముంబై సెట్లో జాయిన్ అయ్యారు. లొకేషన్లో రజనీకాంత్, నివేదా, యోగిబాబు ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో రజనీకాంత్ కూతురి పాత్రలో నివేదా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ‘పాపనాశనం’ సినిమాలో కమల్‌హాసన్ కూతురిగా నటించారు నివేదా. ‘దర్బార్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
కాపాడేవారెవరు రా?
‘‘బ్రోచేవారెవరురా... అంటూ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ టైటిల్ చెప్పగానే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. దాని అర్థం‘కాపాడేవారు ఎవరురా?’ అని చెప్పారు. కథ విన్నాక టైటిల్ ఈ సినిమాకు సూట్ అవుతుందనిపించింది’’ అని శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు, నివేదా థామస్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. మన్యం విజయ్‌కుమార్ నిర్మాత. సత్యదేవ్, నివేదా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం దర్శకుడు అనిల్ రావిపూడి రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘శ్రీవిష్ణు చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాకు నేను క్లాప్ కొట్టాను. ఆ సినిమా బాగా ఆడింది. ‘బ్రోచేవారెవరురా’ ట్రైలర్ చాలా ఫన్నీగా, హాంటింగ్‌గా ఉంది. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ‘మెంటల్ మదిలో’ సినిమాతో ఆల్రెడీ వివేక్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు చేసిన ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘వివేక్ ఫస్ట్ ఈ కథ చెప్పగానే బాగా నచ్చింది. అందరికీ కనెక్ట్ అయ్యే కథ ఇది. అద్భుతమైన క్వాలిటీతో మన్యం విజయ్‌గారు నిర్మించారు. ఆయన మన్యం పులిలా విజృంభించి మరిన్ని సినిమాలు తీయాలి’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘ఇది టీమ్ వర్క్. ఇందులో ‘మంత్ర’ అనే పాత్ర చేశాను’’ అన్నారు నివేదా థామస్. ‘‘మెంటల్ మదిలో’ చూసి వివేక్‌తో ఓ సినిమా చేయాలనుకున్నాను. లక్కీగా ఈ ప్రాజెక్ట్ సెట్టయింది. యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ తమ సపోర్ట్ అందించారు. జూన్‌లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత విజయ్‌కుమార్. -
ఈ సక్సెస్ మా నాన్నగారికి అంకితం
‘‘షూటింగ్‌కు అందరికంటే ముందు వచ్చే ప్రొడక్షన్ యూనిట్, ఆలస్యంగా వెళ్లే లైట్మేన్లు, మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్లే డ్రైవర్స్. ఇలా చాలా డిపార్ట్మెంట్స్ కష్టం ఈ సినిమాలో ఉంది. సినిమా బావుంటుందని అందరం నమ్మి పని చేశాం’’ అని కల్యాణ్‌రామ్ అన్నారు. కెమెరామేన్ కేవీ గుహన్ తెలుగులో తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘118’. కల్యాణ్‌రామ్ హీరోయిన్గా, షాలినీ పాండే, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు. మహేశ్ యస్ కోనేరు నిర్మాత. మార్చి 1న రిలీజ్ అయిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా చిత్రబృందం సక్సెస్‌మీట్ ఏర్పాటు చేసి, సినిమాలో పని చేసిన అందరికీ షీల్డ్‌లను బహూకరించారు. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ – ‘‘సినిమా ఇంత పెద్ద సక్సెస్ చేసి నన్ను రుణపడిపోయేలా చేశారు. నివేదా ఈ సినిమాకు సెకండ్ హీరో. సినిమాకు పని చేసిన అందరికీ థ్యాంక్స్. గుహన్‌గారి నెక్ట్స్ సినిమా కూడా నాతోనే చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ కాంప్లిమెంట్ తారక్ ఇచ్చాడు. తనకు థ్యాంక్స్. జయాపజయాలు పెక్కన పెట్టి ప్రతి సినిమాకు ‘ఆల్ ది బెస్ట్ నాన్న’ అని నాన్నగారు (హరికృష్ణ) చెబుతుండేవారు. ఈ విజయాన్ని ఆయనకు అంకితమిస్తున్నాను’’ అన్నారు. ‘‘డిస్ట్రిబ్యూటర్‌గా 23 ఏళ్లు పూర్తి చేశాను. అందులో కొన్ని బ్యూటిఫుల్ మెమొరీస్ ఉన్నాయి. వాటిలో ఈ సినిమా కూడా ఉంటుంది. మంచి సినిమా డిస్ట్రిబ్యూట్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది’’ అన్నారు. ‘‘కల్యాణ్‌రామ్‌గారితో మరో సినిమా చేయాలనుకుంటున్నాను. డైరెక్టర్ కావాలనుకుంటున్న కలను ఆయన నిజం చేశారు. 118 నిర్మాత మహేశ్ బాగా ప్రమోట్ చేశారు. సక్సెస్‌తో పాటు గౌరవం కూడా తెచ్చిపెట్టింది’’ అన్నారు. ‘‘మంచి ప్రయత్నం అని అందరూ అభినందిస్తున్నారు. పని చేసిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు షాలినీ పాండే. ‘‘కథ వినగానే సినిమాలో భాగం అవ్వాలనుకున్నాను. కాన్సెప్ట్ సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు షాలినీ పాండే. -
‘శ్వాస’ ఆగిపోయిందా?
‘కిరాక్ పార్టీ’తో ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయాడు నిఖిల్. సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న ఈ యువ హీరో కెరీర్‌కు కిరాక్ పార్టీ అడ్డుకట్టవేసింది. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఓ తమిళ రీమేక్‌పై దృష్టి సారించాడు. కోలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన కణిథణ్ చిత్రాన్ని ‘అర్జున్ సురవరం’ పేరుతో టాలీవుడ్‌కు తీసుకువస్తున్నాడు. టీజర్‌తో ఈ మూవీ ఒక్కసారిగా భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. అయితే నిఖిల్ హీరోగా,నివేదా థామస్ హీరోయిన్గా అప్పట్లో శ్వాస అనే చిత్రం మొదలైంది. తాజాగా ఈ మూవీపై ఓ రూమర్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పక్కన పడేశారనీ, ఈ సినిమాను ఆపేశారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా స్పందించలేదు. అర్జున్ సురవరం తరువాత నిఖిల్ కార్తికేయ సీక్వెల్లో నటిస్తాడని సమాచారం. -
సొంత సినిమా సక్సెస్ అయినట్టుగా అనిపిస్తోంది
‘‘పటాస్’ తర్వాత కల్యాణ్‌రామ్, మా కాంబినేషన్లో హిట్ కొట్టాం. ‘118’ రెగ్యులర్ మూవీ కాదు. కొత్త ప్రయత్నం. రివ్యూస్, ఆడియన్స్ రెస్పాన్స్ రెండూ పాజిటివ్‌గానే ఉన్నాయి’’ అని ‘దిల్’ రాజు అన్నారు. కల్యాణ్ రామ్ హీరోగా కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకె క్కిన చిత్రం ‘118’. నివేదా «థామస్, షాలినీ పాండే కథానాయికలు. మహేశ్ కోనేరు నిర్మించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోందని ప్రముఖ నిర్మాత, ఈ చిత్ర పంపిణీదారులు ‘దిల్’ రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘118’ సినిమాను ఏపీ, తెలంగాణలలో రిలీజ్ చేశాం. రెండు రోజులకు మూడు కోట్ల షేర్ వచ్చింది. గుహన్‌గారితో 20 ఏళ్ల అనుబంధం ఉంది. మా సొంత సినిమా సక్సెస్ అయినట్టుగా అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘కొత్త సినిమాలు తీయడానికి ప్రేక్షకుల స్పందన ప్రేరణ ఇస్తుంది. నాకు ‘దిల్’రాజుగారు గాడ్ బ్రదర్‌లాగా. ఆయన చేతి నుంచి సినిమా రిలీజ్ అవ్వడం సంతోషం’’ అన్నారు గుహన్. ‘‘‘పటాస్’ రిలీజ్ అయి నాలుగేళ్లయింది. అప్పుడూ ‘దిల్’ రాజుగారే సినిమాను పంపిణీ చేశారు. ఆ రోజు మమ్మల్ని నమ్మారు. మళ్లీ ఇప్పుడు. నా ప్రతి సినిమాను రాజుగారికి చూపిస్తా (నవ్వుతూ)’’ అన్నారు కల్యాణ్ రామ్. ‘‘ఫీడ్‌బ్యాక్ వింటుంటే చాలా çహ్యాపీగా ఉంది. ఫస్ట్ మాకు ధైర్యాన్ని ఇచ్చింది తారక్‌గారు. ఆ తర్వాత రాజుగారు’’ అన్నారు మహేశ్ కోనేరు. -
తారక్... నీ నమ్మకం నిజమైంది
కల్యాణ్‌రామ్, నివేథా థామస్, శాలిని పాండే ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘118’. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మించారు. ప్రముఖ కెమెరామెన్ కె.వి.గుహన్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా మారారు. శుక్రవారం చిత్రం విడుదలైంది. ఫస్ట్ షోకే మంచి టాక్ తెచ్చుకుందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ– ‘‘తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులందరికి థ్యాంక్స్. గుహన్‌గారు నాలో ఏం చూశారో నాకు ఇప్పటికీ తెలియదు. ఈ రోజు మా నిర్మాత మహేశ్ నవ్వు చూస్తున్నాను. ‘నా నువ్వే’ సినిమా రిలీజైనప్పుడు ఆయన ఎంత బాధపడ్డాడో నాకింకా గుర్తే. అప్పుడు నేను ‘మనం కొత్తగా చేయాలని ట్రై చేస్తాం, కొన్ని వర్కవుట్ అవ్వవు. నో ప్రాబ్లమ్, మన ‘118’ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది’ అని తనతో చెప్పాను. అదే నిజం అయ్యింది. మన నిర్మాత నవ్వుతూ ఉండటం కంటే ఓ హీరోకి ఏం కావాలి. మా ఎడిటర్ తమ్మిరాజు ఈ సినిమాను న మ్మి మా కంటే ఎక్కువ వర్క్ చేసారు. శేఖర్ చంద్ర ఉన్నది ఒకటే పాట కదా అని అనుకోకుండా ఈ సినిమాకు అద్భుతమైన రీరికార్డింగ్‌ను అందించారు. యన్టీఆర్ని ఉద్దేశించి... నాన్నా.. తారక్ నీ నమ్మకం నిజమైంది. ఫస్ట్ నువ్వే ఈ సినిమాని చూశావు. ఖచ్చితంగా హిట్ అవుతుంది’ అని చెప్పావు. మా కథ మీద నమ్మకంతో సినిమా కొన్న ‘దిల్’ రాజు, లక్ష్మణ్‌లకు థ్యాంక్స్’’ అన్నారు. మహేశ్ కోనేరు మాట్లాడుతూ– ‘‘గుహన్‌గారు తాను నమ్మినది తీశారు. ఈ రోజు సినిమాకు ఇంత మంచి పేరు రావటానికి కారణం అదే. కలెక్షన్లు బావున్నాయి’’ అన్నారు. గుహన్ మాట్లాడుతూ– ‘‘నేను కెమెరా ముందుకు రావటానికి ఇష్టపడను. ఈరోజు గర్వంగా కెమెరా ముందు మాట్లాడుతున్నాను. నేను తమిళ్ అయినా తెలుగు పరిశ్రమ నన్ను కన్నబిడ్డలా ఆదరించింది. కల్యాణ్‌రామ్ ఈ కథ విని ఎలా ఓకే చేశారు? అని నాకు ఓ కాల్ వచ్చింది. దానికి ఓ కొత్త విషయం చెప్పటానికి చాలా టాలెంట్ కావాలి. అది కల్యాణ్ గారిలో ఉంది అన్నాను’’ అని చెప్పారు. ‘‘క్రిటిక్స్ చాలామంది రాశారు ఇలాంటి స్క్రిప్ట్‌తో సినిమా తీయాలంటే చాలా గట్స్ కావాలని’’ అన్నారు నివేదా. సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర, మాటల రచయిత ‘మిర్చి’ కిరణ్, ఎడిటర్ తమ్మిరాజు, విలన్ పాత్రధారి హబీబ్ తదితరులు పాల్గొన్నారు. -
హీరోలతో పోలికెందుకు పెట్టరు?
‘‘ఫలానా హీరోయిన్ కంటే బాగా చేశారు? అని బాగా నటించినప్పుడు ఇతర హీరోయిన్లతో పోలిక పెడుతుంటారు. మరి.. హీరోతో ఎందుకు పెట్టరు? ఎప్పుడూ హీరోయిన్లతోనే పోటీ పెడుతుంటారు. నేనెవర్నీ పోటీగా ఫీల్ అవ్వను. నాకు నేనే పోటీగా ఫీల్ అవుతాను. స్వీయ పరిశీలన చేసుకుంటాను. నాకు నేను సవాల్ విసురుకుంటా’’ అని నివేదా థామస్ అన్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి గుహన్ దర్శకునిగా పరిచయం అవుతున్న చిత్రం ‘118’. కల్యాణ్‌రామ్, నివేదా థామస్, షాలీని పాండే హీరోహీరోయన్లు మహేశ్ కోనేరు నిర్మించారు. శుక్రవారం చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా నివేదా చెప్పిన విశేషాలు. ► పదే పదే వచ్చే ఒక కలను ఫాలో అయ్యే ఓ హీరో కథే ఈ చిత్రం. సస్పెన్స్ థ్రిల్లర్. మిస్టరీ ఉంటుంది. హీరో ఆ కల గురించి లోతుగా అన్వేషణ చేస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్న అంశాల ఆధారంగా స్క్రీన్‌ప్లే ఉంటుంది. సినిమా నిడివి చాలా తక్కువ. చివరి 20 నిమిషాలు సినిమా హైలైట్‌గా ఉంటుంది. గుహన్‌గారి లైఫ్‌లోని కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. కొంచెం ఫిక్షన్ కూడా ఉంది. సినిమా కాబట్టి కొంచెం లిబర్టీ తీసుకునే వీలు ఉంటుంది. ► నాకు వచ్చిన కలే మళ్లీ మళ్లీ రాదు. ఏదైనా కొత్త ప్లేస్‌లోకి వచ్చినప్పుడు ఇంతకుముందు ఏమైనా వచ్చానా? అనే ఫీలింగ్ మాత్రం కలుగుతుంది అప్పుడప్పుడు. కానీ అది కొన్ని సెకన్లపాటే ఉంటుంది. ఒక అమ్మాయి ఓ సమస్యలో పడినప్పుడు ఏం చేస్తుందో ఈ సినిమాలో నా పాత్ర అదే చేస్తుంది. నా పాత్ర గురించి ఇప్పుడు పెద్దగా చెప్పను. ఎందుకంటే సినిమాలో కీలకమైన పార్ట్ అది. ఫస్ట్‌టైమ్ నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకున్న సినిమా ఇది. ► ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకలో తారక్ వంటి మంచి నటుడు నాకు అప్రిషియేషన్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నా పెర్ఫార్మెన్స్ను ఆడియన్స్ కూడా మెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ‘అన్వేషణ’ సినిమాను నేను చూడలేదు. ఆ సినిమాతో ఈ సినిమాను ఎందుకు పోల్చుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అలాగే హాలీవుడ్ మూవీ ‘ఫైనల్ డెస్టినేషన్’ సిరీస్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుందా? అంటే.. అది ఆడియన్స్ వెండితెరపై చూడాలి. ► సినిమాలో నా స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉందా? లేక తక్కువగా ఉందా? అనే అంశాలను పెద్దగా పట్టించుకోను. నేను చేస్తున్న పాత్రకు ఎంత వరకు న్యాయం చేస్తున్నానన్నదే నాకు ముఖ్యం. ఈ సినిమాలో నా స్క్రీన్ టైమ్ దాదాపు 20 నిమిషాలే ఉంటుంది. ‘నిన్నుకోరి, జెంటిల్మన్’ చిత్రాల్లో ఎక్కువ ఉంటుంది. వెంట వెంటనే సినిమాలు చేయడం కన్నా మంచి సినిమాలు చేయాలనుకుంటాను. కొత్త విషయాలు నేర్చుకుంటూ యాక్టర్‌గా మెరుగవ్వాలని కోరుకుంటాను. అన్నిరకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను. నేను చేసిన సినిమాలను ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లో చూస్తాను. అది కూడా నిలబడే చూస్తాను. నెర్వస్ వల్ల కాదు. అదో ఫీలింగ్. ► ‘బ్రోచేవారెవరురా’ అనే కామెడీ చిత్రం, ‘శ్వాస’ అనే ట్రావెల్ ఫిల్మ్ చేయబోతున్నాను. మరికొన్ని సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాది తమిళ సినిమా కూడా చేస్తాను. మలయాళ సినిమాలు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాదిలో నావి ఐదు సినిమాలు ఉంటాయి. రిలీజ్‌ల పరంగా నా కెరీర్లో ఇదో బిగ్గెస్ట్ ఇయర్‌గా ఉండొచ్చు. -
మెప్పించే వరకూ ట్రై చేస్తూనే ఉంటా
‘‘ఇంతింతై వటుడింతింతై అన్నట్టు.. ఎప్పుడూ మంచి సినిమాలు చేయాలి, కొత్తదనాన్ని అందించాలని కల్యాణ్‌లో ఓ తపన ఉంది. కొత్త వాళ్లకి అవకాశం ఇవ్వాలనే తపనే ఆయనచేత ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ అనే సంస్థ స్థాపించి ‘అతనొక్కడే’ సినిమా తీశారు’’ అని నటుడు బాలకృష్ణ అన్నారు. కల్యాణ్ రామ్ హీరోగా కె.వి.గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘118’. నివేథా థామస్, షాలినీ పాండే కథానాయికలు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మించిన ఈ సినిమా మార్చి 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ–‘‘కోడి రామకృష్ణగారి దర్శకత్వంలో వచ్చిన ‘బాలగోపాలుడు’ చిత్రంలో కల్యాణ్‌రామ్ బాలనటుడిగా పరిచయం అయ్యా రు. ఇవాళ కోడి రామకృష్ణగారు మనమధ్య లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం. ఆయన దర్శకత్వంలో ‘మంగమ్మగారి మనవడు, ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణయ్య, మువ్వ గోపాలుడు, బాలగోపాలుడు, భారతంలో బాలచంద్రుడు’ వంటి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించే అవకాశం నాకు కలిగింది. ‘118’ ఈ టైటిల్ చూస్తే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా వీల్లేదు.. కానీ యువతరానికి కనెక్ట్ అయ్యేలా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చిత్రం ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. గుహన్‌గారు ఇంకా ఎన్నో మంచి సినిమాలకు దర్శకత్వం వహించాలి. నాకు ఈ అవకాశం కల్యాణ్‌రామ్, తారక్‌లు కల్పించారు. ఎన్నో సినిమాలు చేస్తూ కళామతల్లికి మన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘గుహన్‌గారు నాకు చాలా ఏళ్లుగా పరిచయం. మేమిద్దరం ‘బాద్షా’ చిత్రం చేశాం. కష్టపడే మనస్తత్వం కలిగిన కెమెరామెన్ ఆయన. అంతే ఇంట్రెస్ట్‌తో ఆయన ‘118’ సినిమాతో మీ ముందుకొస్తున్నారు. నేను కచ్చితంగా చెబుతున్నా గుహన్సార్.. ఇది ఫెంటాస్టిక్ ఫిల్మ్ అవుతుంది. నివేథగారితో ‘జై లవ కుశ’ సినిమాలో పనిచేశా. ‘118’ సినిమా చూశా. ఓ సీన్లో నివేథ నటన చూసి కన్నీళ్లు వచ్చాయి. షాలినీగారు ఎంతో హుందాగా తన కష్టాన్ని జోడించి చక్కని నటన కనబరిచారు. మాకు బాగా కావాల్సిన వ్యక్తి మహేశ్. ఈ సినిమా ద్వారా ఓ అద్భుతమైన హిట్ సాధించి, ఇంకెన్నో మంచి సినిమాలు తీయడానికి తన పరంపరని ఈ చిత్రంతో మొదలుపెట్టాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నా. ఎప్పుడూ ఓ కొత్త చిత్రాన్ని అందించాలి, ఓ కొత్త ధోరణిలో కథ చెప్పాలని అన్నయ్య పడే కుతూహలం బహుశా ఇంకెవరిఎవరిలోనైనా ఉంటుందేమో కానీ, నేను మాత్రం ఆయనలోనే చూశాను. ఇప్పటి వరకూ ఆయన చేసిన చిత్రాల్లో నాకు బాగా నచ్చిన సినిమా ఇది.. ఆయన నటన కావొచ్చు.. డైరెక్టర్‌గారికి, నిర్మాతగారికి అందించిన సపోర్ట్ కావొచ్చు. ఓ నటుడు కంప్లీట్‌గా పాత్రకి సరెండర్ అయిపోతేకానీ ఇలాంటి నటన కనబరచడం కుదరదు.. హ్యాట్సాఫ్ కల్యాణ్ అన్న! ఈ సినిమా హిట్ అందిస్తుందని, ఇంకెన్నో మంచి చిత్రాలు చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుందని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నా.’’ అన్నారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘నిజంగా ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు.. మైండ్ బ్లాంక్ అయిపోయింది. బాబాయ్, తారక్ అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా మాట్లాడాలనుంది. కానీ, ఈ సారి సినిమా విడుదల తర్వాత మాట్లాడదామని అనుకున్నా. మనందరి దేవుడు నందమూరి తారకరామారావుగారు.. ఆ దేవుడి ఆశీర్వాదం వల్లే మేం ముగ్గురం ఇక్కడ ఉంటున్నాం. ప్రతిసారి ఏదో ఒక కొత్తదనాన్ని మీ ముందు ఉంచాలనే తపనతో ట్రై చేస్తున్నాను.. ఫెయిల్ అవుతున్నా.. ఈ విషయం నాకూ తెలుస్తోంది.. మీకూ బాధ ఉంది.. ప్రతిసారీ ట్రై చేస్తున్నావ్ హిట్ రాదేంటి? అని. బట్.. ‘టెంపర్’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో తమ్ముడు చెప్పినట్టు ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాం.. అదే మళ్లీ చెబుతున్నా.. మిమ్మల్ని మెప్పించే వరకూ ట్రై చేస్తూనే ఉంటా. ఈ సినిమాపై చాలా నమ్మకం ఉంది. గుహన్‌గారికి, టీమ్‌కి థ్యాంక్స్’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘గుహన్ అసిస్టెంట్ కెమెరామెన్‌గా నాకు పరిచయం.. ‘ఖుషి’ సినిమా చేశాడు. ఆయన ఈ రోజు కల్యాణ్‌రామ్‌గారితో తీసిన ‘118’ సినిమా ట్రైలర్ చూస్తుంటేనే ఎంత నావల్‌పాయింట్ తీసుకున్నాడో అర్థం అవుతోంది. సినిమా సినిమాకి ఏదో కొత్తదనం చేయాలని కల్యాణ్‌రామ్‌గారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పీఆర్వోగా స్టార్ట్ అయిన మహేశ్ నిర్మాతగా మారి నందమూరి ఫ్యామిలీతో అన్ని సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా మా సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ’’ అన్నారు. కె.వి. గుహన్ మాట్లాడుతూ– ‘‘కల్యాణ్‌సార్.. కొత్తగా చేయాలనే మీ ఐడియాకి థ్యాంక్స్. అందువల్లే మీరు నా లైన్‌ని, కథని విన్నారు. చిన్న లైన్‌గా అనుకున్న ఈ కథ ఇంతవరకూ వచ్చిందంటే అది మీవల్లే.. నాకు చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ఈ స్క్రిప్ట్ మొత్తుం నివేథా చుట్టూ నడుస్తుంది. స్క్రిప్ట్‌లోని తన పాత్రకి నటనతో ఊపిరి పోశారు. ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత షాలినీ క్రేజ్ ఏంటో నాకు తెలుసు. ‘118’ సినిమా కథని ఎంచుకున్నందుకు థ్యాంక్స్. నిర్మాత కోనేరుగారు గ్రేట్ సపోర్ట్ ఇచ్చారు. టీమ్ అందరి సహకారం వల్లే ఈ సినిమా ఇంతబాగా చేయగలిగా. ‘దిల్’రాజుగారు మా సినిమా చూసి, నచ్చడంతో విడుదల చేస్తూ మా టీమ్‌కి ఎనర్జీ ఇచ్చారు’’ అన్నారు. ఈ వేడుకలో చిత్రనిర్మాత మహేశ్ కోనేరు, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, షాలినీ పాండే, నివేథా థామస్ సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే కథ
నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన చిత్రం ‘118’. నివేదా థామస్, షాలినీ పాండే కథానాయికలుగా నటించారు. మహేశ్ కోనేరు నిర్మించారు. సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహన్ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ– ‘‘ఈ కథ ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. కానీ మనం పట్టించుకోం.. వదిలేస్తాం. ట్రైలర్‌ను లోతుగా గమనిస్తే సినిమా ఏంటో అర్థమైపోతుంది. నివేదా థామస్ పాత్ర ఆధారంగానే సినిమా అంతా సాగుతుంది. ఆమె బాగా నటించారు. గుహన్‌గారి సినిమాటోగ్రఫీ గురించి చెప్పేంత పెద్దవాడిని కాదు నేను. కానీ పక్కాగా ప్లాన్ చేసి ఈ సినిమాను బాగా తెరకెక్కించారు. నిర్మాత మహేశ్ నాకు కుటుంబ సభ్యుడితో సమానం. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో చేద్దామనేంత బాగా నచ్చింది ఈ సినిమా స్క్రిప్ట్. అయితే పూర్తి కథ విని మహేశ్ నిర్మించడానికి రెడీ అయ్యారు. తమ్మిరాజుగారి సపోర్ట్ మర్చిపోలేనిది. మార్చి 1న సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మంచి కథతో మిళితమైన థ్రిల్లర్ చిత్రమిది. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకునిగా మారిన తర్వాత ఒక సినిమా కోసం టీమ్ ఎంత కష్టపడతారో అర్థం అయింది. కల్యాణ్‌రామ్‌గారి యాక్టింగ్ సూపర్. ఒక వ్యక్తిగా ఆయన ఎంతగానో సపోర్ట్ చేశారు. నివేదా థామస్ ఓ బాధ్యతాయుతమైన పాత్రలో నటించారు. షాలినీ పాండే నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నిర్మాత మహేశ్‌గారికి థ్యాంక్స్. శేఖర్‌చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు’’ అన్నారు కె.వి. గుహన్. ‘‘కల్యాణ్‌రామ్‌గారి నటన, గుహన్‌గారి టేకింగ్, నివేదా, షాలినీల పెర్ఫార్మెన్స్... ఇలా అన్నీ బాగా కుదిరాయి. ఇది నాకు స్పెషల్ మూవీ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది’’ అన్నారు మహేశ్ కోనేరు. ‘‘118 అంటే ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే. తక్కువ టైమ్‌లో చాలా ఎక్కువగా వర్క్ చేసిన చిత్రమిది. చాలెంజింగ్‌గా అనిపించింది’’ అన్నారు నివేధా థామస్. -
‘118’ నుంచి లిరికల్ వీడియో సాంగ్!
‘పటాస్’ మూవీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఎమ్మెల్యే, నా నువ్వేలాంటి సినిమాలు చేసినా.. ఆశించినంత ఫలితాన్నివ్వలేదు. మరోసారి సూపర్‌హిట్‌ను కొట్టేందుకు డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ.. టీజర్‌తో బాగానే ఆకట్టుకుంది. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో అర్జున్‌రెడ్డి బ్యూటీ షాలిని పాండే హీరోయిన్గా నటిస్తోంది.తాజాగా ఈ సినిమాలోంచి చందమామే అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. షాలిని పాండే, కళ్యాణ్ రామ్‌ల కెమిస్ట్రీ బాగుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రం ఏమేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి. నివేదా థామస్ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు. కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
ఆసక్తికరమైన టైటిల్‌తో కళ్యాణ్ రామ్!
‘పటాస్’ చిత్రంతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు నందమూరి కళ్యాణ్‌రామ్. అయితే అప్పటినుంచీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేక మళ్లీ వెనుకబడ్డాడు. అయినా సరే ఎలాగైనా విజయం సాధించాలని.. కొత్తగా ట్రై చేసి తమన్నాతో కలిసి ‘నా నువ్వే’ అంటూ ప్రేక్షకులను పలకరించాడు. కానీ అదికూడా సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అయితే మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కళ్యాణ్‌రామ్ సిద్దమవుతున్నాడు. సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందబోతున్న ఈ చిత్రం టైటిల్‌ను సోమవారం రివీల్చేశారు. ‘118’ గా రాబోతోన్న ఈ చిత్రంలో నివేదా థామస్, షాలినీ పాండేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కెవి గుహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయనున్నారు. Here we go.. #118 is the title of our next with @NANDAMURIKALYAN and KV Guhan.. A slick and suspenseful action thriller your way. #NKR16 pic.twitter.com/kS0vuMglvj — East Coast Prdctns (@EastCoastPrdns) December 3, 2018 -
వైరల్ : పార్టీలో నివేదా డ్యాన్స్!
క్యూట్ లుక్స్‌తో, న్యాచురల్ యాక్టింగ్‌తో కుర్ర హృదయాలను కొల్లగొట్టారు నివేదా థామస్. జెంటిల్మెన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దు గుమ్మ.. నిన్నుకోరి, జై లవకుశలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే ఆ మధ్య చదువు కోసం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన నివేదా.. ఇటీవలె పలు ప్రాజెక్ట్‌లతో బిజీ అయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నివేదా.. తాజాగా ఓ వీడియోను పోస్ట్‌చేశారు. ఇందులో నివేదా డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ప్రభుదేవా హీరోగా వచ్చిన గులేభకావలి సినిమాలోని సాంగ్‌కు.. నివేదా వేసిన స్టెప్స్ అదిరిపోయాయని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. తన సోదరులతో కలిసి ఆడిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘మీరు పార్టీని ఎలా ఎంజాయ్ చేస్తారు?.. మీ హీల్స్‌ను విసిరేయండి..వెళ్లి డ్యాన్స్చేయండి’ అంటూ కామెంట్‌తో పాటు వీడియోను పోస్ట్ చేశారు. నిఖిల్ హీరోగా చేస్తోన్న‘శ్వాస’ సినిమాలో నివేదా హీరోయిన్గా నటిస్తున్నారు. -
నిఖిల్..నివేద..‘శ్వాస’ కొత్త చిత్రం ప్రారంభం
-
స్క్రీన్ టెస్ట్
1. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ద్వారా సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమైన కథానాయిక ఎవరు? ఎ) నివేథా థామస్ బి) అనూ ఇమ్మాన్యుయేల్ సి) మెహరీన్ డి) నభా నటేశ్ 2.చిరంజీవి 151వ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న తమిళ నటుడెవరో తెలుసా? ఎ) విజయ్ బి) విజయ్ సేతుపతి సి) ధనుశ్ డి) అజిత్ 3. జగపతిబాబు విలన్‌గా టాప్ గేర్‌లో ఉన్నారు. ఆయన విలన్‌గా నటించిన మొదటి సినిమాకు దర్శకుడెవరో తెలుసా? ఎ) బోయపాటి శ్రీను బి) శ్రీను వైట్ల సి) వంశీ పైడిపల్లి డి) సుకుమార్ 4. ‘ఎఫ్ 2’ మల్టీస్టారర్ చిత్రంలో ఓ హీరోగా ప్రముఖ హీరో వెంకటేశ్ నటిస్తున్నారు. మరో హీరో ఎవరో కనుక్కోండి? ఎ) అఖిల్ బి) వరుణ్ తేజ్ సి) నాగచైతన్య డి) నాగశౌర్య 5 1938లో వచ్చిన ‘మాలపిల్ల’ చిత్రానికి దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) కె.వి. రెడ్డి బి) చిత్రపు నారాయణరావు సి) చిత్తూరు వి.నాగయ్య డి) గూడవల్లి రామబ్రహ్మం 6. ‘మోసగాళ్లకు మోసగాడు’ 1971లో విడుదలైంది. ఈ చిత్రంలో హీరో కృష్ణ సరసన నటించిన కథానాయిక ఎవరు? ఎ) విజయనిర్మల బి) విజయ లలిత సి) విజయ శాంతి డి) జయలలిత 7. ‘ అహ నా పెళ్లంట’ చిత్రంలో హాస్యానికి పెద్ద పీట వేశారు దర్శకులు జంధ్యాల. ఈ చిత్రంలో పిసినారి పాత్రలో ఒదిగి పోయిన నటుడెవరో లె లుసా? ఎ) బ్రహ్మానందం బి) కోట శ్రీనివాసరావు సి) సుత్తి వీరభద్రరావు డి) సుత్తివేలు 8. నాట్య మయూరి సుధాచంద్రన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం పేరేంటి? ఎ) అశ్విని బి) మయూరి సి) శారధ డి) శాంభవి 9 ‘‘పంచదార బొమ్మా బొమ్మా పట్టుకోవద్దనకమ్మా’’ పాట సంగీత దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) మణిశర్మ బి) దేవీశ్రీ ప్రసాద్ సి) యం.యం.కీరవాణి డి) యస్.యస్. తమన్ 10. అనుష్క ‘భాగమతి’ చిత్రంలో ఓ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఆమె ఏ ఆఫీసర్‌గా కనిపిస్తారో తెలుసా? ఎ) పోలీస్ బి) డాక్టర్ సి) టీచర్ డి) కలెక్టర్ 11.‘మగాళ్లు ఒట్టి మాయగాళ్లు’ అని హీరో గోపీచంద్‌ను ఉద్దేశించి పాడే హీరోయిన్ ఎవరు? ఎ) కాజల్ అగర్వాల్ బి) భావన సి) ప్రియమణి డి) విమలా రామన్ 12.‘వి.ఐ.పి 2’ చిత్రంలో హీరో ధనుష్‌తో పోటాపోటీగా నటించిన బాలీవుడ్ నటి ఎవరో తెలుసా? ఎ) కాజోల్ బి) ఐశ్వర్వారాయ్ సి) కత్రినా కైఫ్ డి) ఆలియా భట్ 13. ‘అమ్మాయిలను ఇంప్రెస్ చేస్తే పడరు... ఇంప్రెస్ అయితేనే పడతారు’ అనే డైలాగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ఏ హీరోతో చెప్తుందో కనుక్కోండి? (క్లూ: ఈ డైలాగ్ రచయిత, దర్శకుడు వేగేశ్న సతీశ్) ఎ) రామ్ బి) శర్వానంద్ సి) అల్లు అర్జున్ డి) సాయిధరమ్ తేజ్ 14. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన చివరి చిత్రం ఏంటో తెలుసా? ఎ) పరమ వీర చక్ర బి) ఎర్రబస్సు సి) మేస్త్రి డి) యంగ్ ఇండియా 15.తొలి భారతీయ చిత్రనిర్మాతగా ప్రసిద్ధి కెక్కిన నిర్మాత ఎవరు? ఎ) రఘుపతి వెంకయ్యనాయుడు బి)దాదాసాహెబ్ ఫాల్కే సి) హెచ్.యం.రెడ్డి డి) పోతిన శ్రీనివాసరావు 16 . ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంలో సిద్ధార్థ్ సరసన హీరోయిన్గా నటించింది త్రిష. ఆమె స్నేహితురాలిగా నటించిన తెలుగు హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి? ఎ) వేదా బి) మధుశాలిని సి) స్వాతి డి) సోనియా 17.మణిరత్నం దర్శకత్వం వహించిన ‘నవాబ్’ చిత్రంలో నటుడు అరుణ్ విజయ్ భార్యగా ఐశ్వర్యా రాజేశ్ నటించారు. ఆమె ఓ ప్రముఖ తెలుగు నటి మేనకోడలు. ఎవరా నటి? ఎ) హేమ బి) ప్రగతి సి) శ్రీలక్ష్మీ డి) రజిత 18.‘ముద్దబంతి పూవులో మూగబాసలు... మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు..’ పాట పాడిన గాయని ఎవరో తెలుసా? ఎ) చిత్ర బి) పి. సుశీల సి) యస్. జానకి డి) వాణీ జయరాం 19. పై ఫొటోలో ఉన్న చిన్నారి ఒకప్పటి విశ్వ సుందరి.ఎవరు? ఎ) సుస్మితాసేన్ బి) ఐశ్వర్యారాయ్ సి) ప్రియాంకాచోప్రా డి) యుక్తాముఖి 20. ‘ఇంద్రజిత్’ చిత్రంలోని ఈ స్టిల్‌లో యస్వీఆర్తో ఉన్న హీరోయిన్ ఎవరు? ఎ) షావుకారు జానకి బి) కృష్ణకుమారి సి) అంజలీదేవి డి) జమున మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు: 1) సి 2) బి 3) ఎ 4) బి 5) డి 6) ఎ 7) బి 8) బి 9) సి 10) డి 11) సి 12) ఎ 13) బి 14) బి 15) బి 16) ఎ 17) సి 18) ఎ 19) ఎ 20) సి నిర్వహణ: శివ మల్లాల -
చెడుగుడు
తప్పు చేశారో లేదో తెలుసుకోవడానికి చర్చలు పెడితే ఓకే. కానీ తప్పు చేసినవాడు ఎవరో తెలిసి, ఎదురుగా ఉంటే పౌరుషం ఉన్న కుర్రాడు ఊరుకుంటాడా? చెడుగుడు ఆడే స్తాడు. ప్రస్తుతం కల్యాణ్ రామ్ ఇదే చేస్తున్నారు. తప్పు చేసిన విలన్లను తుక్కురేగ్గొడుతున్నారు. కేవీ గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నివేథా థామస్, షాలినీ పాండే కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలోని కల్యాణ్‌రామ్ క్యారెక్టర్లో మస్త్ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయట. క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఉంటుందని వినికిడి. ఈ పవర్‌పుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను సిల్వర్ స్క్రీన్ పై చూడాలంటే ఇంకాస్త టైమ్ ఉంది. -
టైటిల్ కమింగ్ సూన్
ఈ ఏడాది ఆల్రెడీ రెండుసార్లు థియేటర్స్‌లో కనిపించిన కల్యాణ్ రామ్ మరో సినిమాతో రెడీ అవుతున్నారు. కెమెరామేన్ కేవీ గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ ఓ థ్రిల్లర్ మూవీలో హీరోగా యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. నివేథా థామస్, షాలినీ పాండే హీరోయిన్స్‌గా యాక్ట్ చేస్తున్నారు. మహేశ్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టాకీపార్ట్ కంప్లీట్ అయిందని సమాచారం. కేవలం సాంగ్స్ షూటింగ్ వరకూ బ్యాలెన్స్ ఉందట. ఈ చిత్రం టైటిల్‌ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ సెకండ్ వీక్‌లో ప్రకటించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంగీతం: శేఖర్ చంద్ర. -
స్క్రీన్ టెస్ట్
1. ప్రపంచ సంగీత దినోత్సవం ఎప్పుడో తెలుసా? ఎ) జూన్ 21 బి) జూన్ 24 సి) జూన్ 15 డి) జూన్ 19 2. ‘‘గురుబ్రహ్మలారా.. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి..’’అనే పాట ‘స్టూడెంట్ నం1’ సినిమాలోనిది. ఈ చిత్ర సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) మణిశర్మ బి) ఎం.ఎం. కీరవాణి సి) రమణ గోగుల డి) చక్రి 3. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాలో రాక్‌స్టార్ పాత్రలో నటించిన హీరో ఎవరో గుర్తు తెచ్చుకోండి? ఎ) అల్లు అర్జున్ బి) రామ్ చరణ్ సి) మహేశ్‌బాబు డి) రామ్ 4. ‘‘రాకాసి రాకాసి నను రబ్బరు బంతిల ఎగరేసి..’’ అనే పాటను పాడిన హీరో ఎవరు? ఎ) ఎన్టీఆర్ బి) నాగచైతన్య సి) శింబు డి) రానా దగ్గుబాటి 5. పాత తరం హీరోయిన్లలో ఓ హీరోయిన్ మాత్రం తన పాటలను తనే పాడుకునేవారు. ఎవరామె? ఎ) జమున బి) వాణిశ్రీ సి) సావిత్రి డి) భానుమతి 6. డాక్టర్ సి. నారాయణ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్‌గా ఉన్నప్పుడు సినీరంగంలోకి ప్రవేశించారు. సుమారు ఎన్ని పాటలు ఆయన కలం నుండి జాలువారాయో కనుక్కోండి? ఎ) సుమారు 1000 బి) 1800 పాటలు సి) దాదాపు 3000 డి) సుమారు 1500 7. ‘మహానటి’ చిత్రంలో ‘మూగ మనసులు’ అనే పాటను అద్భుతంగా పాడిన గాయని ఎవరో తెలుసా? ఎ) శ్రేయా ఘోషల్ బి) గంటా వెంకటలక్ష్మీ సి) చారులత మణి డి) సునీత 8. ‘మనం’ చిత్రంలో చిన్న పాత్రలో తళుక్కున మెరిసిన ఈ బ్యూటీ మంచి నటే కాదు. సింగర్ కూడా. ఎవరా బ్యూటీ? ఎ) రకుల్ ప్రీత్ సింగ్ బి) రాశీ ఖన్నా సి) శ్రియా సరన్ డి) నివేథా థామస్ 9. ప్రభాస్ నటించిన ‘మిర్చి’ చిత్రంలో ‘డార్లింగే ఓసి నా డార్లింగే’ అనే సూపర్ హిట్ పాట పాడిన గాయని ఎవరో తెలుసా? (డి) ఎ) మాళవిక బి) శ్రావణ భార్గవి సి) కౌసల్య డి) గీతామాధురి 10. ‘రేసుగుర్రం’ సినిమాలో ‘‘సినిమా సూపిత్త మామా నీకు సినిమా సూపిత్త మామా’’... అనే స్పీడ్ సాంగ్ సింగిన సింగర్ ఎవరో కనుక్కోండి? ఎ) హేమచంద్ర బి) కారుణ్య సి) సింహా డి) శ్రీరామచంద్ర 11. ‘జ్ఞాన దేసిగన్’ ఆయన అసలు పేరు. భారతీయ సినీ ప్రపంచంలో 7000 పాటలకు పైగా కంపోజ్ చేసిన సంగీత దర్శకధీరుడీయన. ఎవరతను? ఎ) ఇళయరాజా బి) మాస్టర్ వేణు సి) చక్రవర్తి డి) తాతినేని చలపతిరావు 12. హీరోగా మోహన్‌బాబు చేసిన అన్ని సినిమాల్లో దాదాపుగా ఈ సింగర్ పాడిన పాట ఒకటుంటుంది. ఎవరా సింగర్? ఎ) ఏసుదాస్ బి) రామకృష్ణ సి) శంకర్ మహాదేవన్ డి) హరిహరన్ 13. ‘జాణవులే నెర జాణవులే..’ అనే పాట చాలా పెద్ద హిట్. ఆ పాటలో నటించిన నటి ఎవరో గుర్తు తెచ్చుకోండి? ఎ) జ్యోతిలక్ష్మీ బి) అనురాధ సి) సిల్క్‌స్మిత డి) జయమాలిని 14. సంగీతం నేర్చుకోవటం కోసం తన వేలికున్న ఉంగరాన్ని అమ్మి విజయనగరంలో వారాలబ్బాయిగా తిరిగిన సింగర్ ఎవరో తెలుసా? ఎ) ఘంటసాల బి) యస్పీ బాలసుబ్రహ్మణ్యం సి) మొహమ్మద్ రఫీ డి) పీబీ శ్రీనివాస్ 15. ‘ముత్యాలముగ్గు’ సినిమాలోని ‘ము త్యమంతా పసుపు’..., ‘సీతామాలక్ష్మి’ సినిమాలోని ‘సీతాలు సింగారం’... పాటలకు ఐదేసి నిమిషాల వ్యవధిలో బాణీలు కుదిరాయి. ఆ రెండు సినిమాలకు సంగీత దర్శకులు ఒక్కరే... ఎవరా సంగీత దర్శకుడు? ఎ) కె.వి.మహదేవన్ బి) యస్పీ కోదండపాణి సి) రమేశ్ నాయుడు డి) టి.వి.రాజు 16. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘మహాత్మ’ సినిమాకు సంగీతదర్శకుడీయన. ఆ తర్వాత తమిళ, తెలుగు ప్రేక్షకులకు నటునిగా దగ్గరయ్యారు. ఎవరా హీరో ? ఎ) యస్.యస్. తమన్ బి) విజయ్ ఆంటోని సి) జీవీ. ప్రకాష్ కుమార్ డి) అనిరు«ద్ 17. ‘తమ్ముడు ఒరే తమ్ముడు.. ఈ తికమక లె గులే ప్రేమంటే’ అనే పాటను హమ్ చేసిన హీరో ఎవరో తెలుసా? ఎ) బాలకృష్ణ బి) నాగార్జున సి) చిరంజీవి డి) వెంకటేశ్ 18. ‘ప్రణామం ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికే ప్రణామం’ అనే పాట రచయితెవరో తెలుసా? ఎ) అనంతశ్రీరాం బి) సిరివెన్నెల సి) రామజోగయ్య శాస్త్రి డి) శ్రీమణి 19. తన జీవితంలో దాదాపు 48000 పాటలను ఆలపించిన ప్రముఖ గాయని ఎవరో తెలుసా? ఎ) పి. సుశీల బి) యస్. జానకి సి) చిత్ర డి) వాణీ జయరాం 20. పై ఫొటోలోని దృశ్యం ‘తకిట తథిమి తకిట తథిమి తందాన’ అనే పాటలోనిది. ఈ ఫొటో ఏ సినిమాలోనిదో తెలుసా? ఎ) శుభసంకల్పం బి) సిరివెన్నెల సి) స్వాతిముత్యం డి) సాగరసంగమం మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (ఎ) 2) (బి) 3) (సి) 4) (ఎ) 5) (డి) 6) (సి) 7) (ఎ) 8) (బి) 9) (డి) 10) (సి) 11) (ఎ) 12) (ఎ) 13) (సి) 14) (ఎ) 15) (ఎ) 16) (బి) 17) (సి) 18) (సి) 19) బి 20) డి నిర్వహణ: శివ మల్లాల -
ఇంకో సినిమా
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మలయాళ కథానాయికల హవా కొనసాగుతోంది. కీర్తీ సురేశ్, అనుపమా పరమేశ్వరన్, అనూ ఇమ్మాన్యుయేల్, నివేథా థామస్, మాళవికా నాయర్.. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మల్లో నివేథా కొంచెం స్లో అయ్యారు. దానికి కారణం ఉంది. ‘జెంటిల్మెన్’, ‘నిన్ను కోరి, జై లవ కుశ’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారీ మాలీవుడ్ బ్యూటీ. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చినా ఒప్పుకోకుండా స్టడీస్‌పై కాన్సన్ట్రేట్ చేసి, డిగ్రీ పూర్తి చేశారు నివేథా. స్మాల్ బ్రేక్‌కి కారణం ఇదే. కొంచెం స్లో అయిన నివేథా ఇప్పుడు సినిమాలు చేసే విషయంలో స్పీడ్ పెంచారు. ప్రస్తుతం కల్యాణ్‌రామ్‌తో ఓ సినిమా చేస్తోన్న ఈ బ్యూటీ తాజాగా మరో చిత్రం అంగీకరించారట. ‘మెంటల్ మదిలో, నీదీ నాదీ ఒకే కథ’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణుతో జోడీ కట్టనున్నారట ఆమె. ‘మెంటల్ మదిలో’ చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ శ్రీవిష్ణుతో ఓ సినిమా తెరకెక్కించనున్నారట. ఈ చిత్రంలోనే నివేథా నటించనున్నారట. నటనకు అవకాశం ఉన్న పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చే నివేథా ఇక పైనా అలాంటివే చేయాలనుకుంటున్నారు. -
కునుకు కరువాయె...
నిద్రలేకుండా వర్క్ చేస్తున్నారు కొందరు హీరోహీరోయిన్లు. సిల్వర్‌స్క్రీన్‌పై ఎగ్జామ్స్ కోసం నిద్రపోవడం లేదు. కనులకు కునుకుని దూరం చేసి సెట్లో వర్క్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ముందుగా టీ టౌన్లోకి వస్తే.. అల్లుడు నిద్రపోకుండా స్టెప్పులేస్తున్నాడు. అబ్బాయి చిందేస్తుంటే అమ్మాయి ఊరుకుంటుందా? ఆమె కూడా పాదం కలిపి పాట అందుకుంది. ఇంతకీ... ఈ అల్లుడు అడ్రెస్ ఎక్కడో తెలుసా? కేరాఫ్ శైలజారెడ్డి. ఇప్పుడు అర్థం అయ్యింటుంది ఇదంతా ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా గురించి అని. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అత్తయ్య శైలజారెడ్డి పాత్రలో నటి రమ్యకృష్ణ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నైట్ షూట్ జరుగుతోంది. నాగచైతన్య, అనూలపై సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారని సమాచారం. మరో తెలుగు హీరో కల్యాణ్ రామ్‌కి కూడా నిద్ర నహీ. గుహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నివేథా థామస్ కథానాయికగా నటిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా కోసం నైట్ షూట్ చేశారు. ప్రస్తుతం సింగపూర్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోన్న కథానాయిక రాశీ ఖన్నా కూడా రెండు మూడు రోజుల క్రితం కంటిన్యూస్‌గా నైట్షూట్స్లో పాల్గొన్నారు. కానీ తెలుగు సినిమా కోసం కాదు. కోలీవుడ్ సినిమా కోసం. కార్తీక్ తంగవేల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అడంగామారు’ సినిమా చిత్రీకరణను రాత్రివేళ జరిపారు. మరో బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్ అయితే ‘అలారం లేకుండా గురువారం హాయిగా నిద్రపోయాను’ అన్నారు. ఆమె ఎందుకలా అన్నారంటే.. కోలీవుడ్‌లో కార్తీ, బాలీవుడ్లో అజయ్‌దేవగన్ సినిమాల షెడ్యూల్స్‌లో పాల్గొని అలసిపోయారు. కార్తీతో చేస్తోన్న సినిమా కోసం చెన్నైలో నైట్ షూట్స్‌లో పాల్గొన్నారామె. ఈ సినిమా చెన్నై షెడ్యూల్ చివరి రోజు తల్లి సెట్స్‌కు రావడంతో ఆమె ఆనందం డబులైంది. తమిళ సినిమా షూట్ కంప్లీటైన వెంటనే అజయ్ దేవగన్æ సినిమా కోసం ముంబై వెళ్లారు రకుల్. ఈ సినిమాకు అకివ్ అలీ దర్శకుడు. ఎలాగూ బీటౌన్ తలుపు తట్టాం కదా. అక్కడ కూడా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నవాళ్ల గురించి చెప్పుకుందాం. నిద్రకు నో చెప్పి, షూటింగ్‌కు యస్ చెప్పారు హృతిక్ రోషన్. ‘సూపర్ 30’లో ఆయన బీహార్ గణిత శాస్త్రవేత్త ఆనంద్‌కుమార్ పాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానున్న ఈ సినిమా నైట్ షూట్లో పాల్గొంటూ హృతిక్ డే టైమ్‌లో నిద్రపోతున్నారు. ఇక బాలీవుడ్ భామల విషయానికొస్తే.. ‘నమస్తే ఇంగ్లాండ్’ సినిమా కోసం లండన్‌లో టైమ్‌కి నిద్రపోవడం లేదు కథనాయిక పరిణీతీ చోప్రా. విఫుల్ షా దర్శకత్వంలో అర్జున్ కపూర్, పరిణీతీ చోప్రా జంటగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ నైట్ టైమ్‌లో జరుగుతోంది. ఫోర్ డేస్ బ్యాక్ సాంగ్‌ను కూడా షూట్ చేశారు. నిద్ర లేకుండా వర్క్ చేయడం బాధగా ఉందా? అంటే... ‘అలా ఏం లేదు.. వర్క్ ఈజ్ వర్షిప్’ అంటున్నారు తారలందరూ. ఏం డెడికేషన్ గురూ.సినిమా అంటే నైన్ టు సిక్స్ జాబ్ కాదు. గంటలతో సంబంధం లేదు. రాత్రీ పగలూ తేడా లేదు. ఎప్పుడంటే అప్పుడు షూటింగ్లో పాల్గొనాల్సిందే. మరి.. సినిమానా? మజాకానా? ఆనంద్, రాశీ ఖన్నా, ‘జయం’ రవి తల్లితో రకుల్, అనూ ఇమ్మాన్యుయేల్, హృతిక్ -
హ్యాపీ టు బిగిన్
యాక్టింగ్ కెరీర్‌ను స్టార్ట్ చేసి రయ్ రయ్‌మంటూ దూసుకెళ్తున్న టైమ్‌లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘జై లవ కుశ’ చిత్రం తర్వాత మరో సినిమాకు కథానాయిక నివేథా థామస్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ఆమె పెళ్లి చేసుకోబోతున్నారని కొన్ని, లేదు లేదు చదువు కోసం సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టారని మరికొన్ని వార్తలు ఇండస్ట్రీలో వినిపించాయి. సినిమాలకు ఆమె బ్రేక్ ఇచ్చిన మాట నిజమే కానీ అది శాశ్వతంగా కాదు. తాత్కాలికంగానే. ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేషన్‌ను కంప్లీట్ చేయడం కోసం సినిమాలకు స్మాల్ బ్రేక్ ఇచ్చారు నివేథ. సక్సెస్‌ఫుల్‌గా స్టడీస్‌ను కంప్లీట్ చేసిన తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. కల్యాణ్‌రామ్ హీరోగా గుహన్ దర్శకునిగా పరిచయం అవుతున్న చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతోన్న ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారామె. ప్రస్తుతం ఈ చిత్రం నైట్ షూట్ జరుగుతోంది. ‘‘మళ్లీ సినిమాలు చేయడం హ్యాపీ. వెరీ హ్యాపీ టు బిగిన్’’ అన్నారు నివేథ. -
కాలేజ్ డేస్.. హ్యాపీ డేస్
కాలేజీ రోజులు ఎప్పుడూ హ్యాపీడేసే. ఎగ్జామ్స్, ల్యాబ్స్, అటెండెన్స్.. ఇలా.. చదివేటప్పుడు కొంచెం కష్టంగా ఉన్నా గడిచిపోయిన ఆ మూమెంట్స్‌ని తలుచుకుంటే ఎవరైనా నోస్టాల్జియా ఫీల్ అవుతారు. ఇప్పుడు హీరోయిన్ నివేథా థామస్ కూడా అదే ఫీలింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే నివేథ ఆర్కిటెక్చర్ డిగ్రీ పూర్తి చేశారు. కాలేజ్ డేస్‌ను గుర్తుచేసుకుంటూ ‘‘ఐదేళ్లు.. ముగింపు దశకు వచ్చేశాయి. 5 ఇయర్స్.. స్టడీయింగ్, ట్రావెలింగ్, కేస్ స్టడీ కోసం సిటీలు, దేశాలు తిరిగొచ్చాం. కాలేజ్ టూర్ మిస్ కాకూడదని మూవీ డేట్స్ రీ–షెడ్యూల్ చేసుకున్నాను. సెట్స్‌లో డ్రాఫ్టింగ్ చేసేదాన్ని, ఏరోప్లైన్లో స్కెచ్‌లు గీసేదాన్ని. ఒకేసారి ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేయడం. సెమిస్టర్ హాలిడేస్‌లో మూవీస్‌కు డేట్స్ ఇవ్వడం. కొన్నిసార్లు అవి కూడా ఇవ్వకుండా డిగ్రీ కంప్లీట్ చేయడం కోసం కష్టపడటం. ఇలా అన్నీ దాటుకొని డిగ్రీ కంప్లీట్ చేశాను. ఈరోజు ఇంత స్పెషల్‌గా ఉండటానికి కారణం నా వర్క్‌ని అభినందించిన వాళ్లంతా ఈ జర్నీలో నాతో ఉండటం. నా స్టడీ బ్రేక్స్, మూవీ బ్రేక్స్ అన్నింట్లో ఉన్నారు. నా లైఫ్‌లో నాకు మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ రోజున అందరికీ గ్రేట్‌ఫుల్‌గా థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. కాలేజ్ డేస్ ఆర్ హ్యాపీడేస్’’ అని పేర్కొన్నారు నివేథ. ‘జై లవకుశ’ సినిమా తర్వాత డిగ్రీ కంప్లీట్ చేయడం కోసం ఏ సినిమా సైన్ చేయలేదు నివేథ. ఇప్పుడు కల్యాణ్ రామ్‌తో ఓ చిత్రం, నారా రోహిత్ మరో సినిమా అంగీకరించారు. -
స్క్రీన్ టెస్ట్
1. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మొదటి సినిమా దర్శకుడెవరో గుర్తుందా? ఎ) వి.ఆర్. ప్రతాప్ బి) ఎస్.ఎస్. రాజమౌళి సి) వీవీ వినాయక్ డి) బి. గోపాల్ 2. ‘షాక్’ సినిమాలో హీరో రవితేజ పక్కన హీరోయిన్గా నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) శ్రియ బి) జ్యోతిక సి) స్నేహ డి) తనూ రాయ్ 3. 200 కోట్ల క్లబ్లో చేరిన సినిమా ‘రంగస్థలం’. తెలుగు, హిందీ భాషలో చేసిన ‘జంజీర్’ తో కలిపి హీరోగా చరణ్ కు ఇది ఎన్నో సినిమా? ఎ) 8 బి) 9 సి) 12 డి) 11 4. ‘మహానటి’ చిత్రంలో చిన్నప్పటి సావిత్రి పాత్రను పోషించిన ఈ బాలనటి పేరు సాయి తేజస్విని. ఈ పాప ఒక ప్రముఖ నటుని మనవరాలు. ఎవరా నటుడు? ఎ) భానుచందర్ బి) సుమన్ సి) జగపతి బాబు డి) రాజేంద్రప్రసాద్ 5.‘ఒకరాజు ఒకరాణి’ చిత్రానికి దర్శకత్వం వహించింది ‘యోగి’. ఆ చిత్రానికి ప్రఖ్యాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ విభాగానికి పనిచేశారు. ఆయన ఏ విభాగానికి పనిచేశారో తెలుసా? ఎ) కథా రచయిత బి) మాటల రచయిత సి) పాటల రచయిత డి) కథ–మాటలు 6. ‘భరత్ అనే నేను’ సినిమాలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మహేశ్‌బాబు స్పీకర్ పాత్రలో ఉన్న జయలలితను ఏమని సంభోదించారో తెలుసా? ఎ) స్పీకర్ గారు బి) డియర్ స్పీకర్ గారు సి) మేడమ్ స్పీకర్ డి) సభాపతి గారు 7. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా? ఎ) సుమారు 150 కోట్లు బి) దాదాపు 100 కోట్లు సి) 85 కోట్లు డి) సుమారు 300 కోట్లు 8. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తమిళంలో బిజీగా ఉన్నారు. ఆమె ఏ హీరోతో నటిస్తున్నారో తెలుసా? ఎ) విజయ్ బి) సూర్య సి) విజయ్ సేతుపతి డి) అజిత్ 9. చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి సంగీత దర్శకునిగా ఇప్పుడు యం.యం.కీరవాణి చేస్తున్నారు. ఈ సినిమాకి మొదట అనుకొన్న సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) దేవిశ్రీ ప్రసాద్ బి) ఏ.ఆర్. రహమాన్ సి) మణిశర్మ డి) అనూప్ రూబెన్స్ 10. పలు బ్లాక్బాస్టర్ సినిమాలకు రచయిత అయిన ఈయన ‘నేను తను ఆమె’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు (సినిమా రిలీజవ్వలేదనుకోండి). ఆ రచయిత ఎవరబ్బా? ఎ) జనార్థన మహర్షి బి) వక్కంతం వంశీ సి) పరుచూరి బ్రదర్స్ డి) కోన వెంకట్ 11. నేను అమితాబ్ » చ్చన్కు వీరాభిమానిని అని ఈ టాలీవుడ్ హీరో ఎప్పుడూ చెప్తారు. ఆ హీరో ఎవరో? ఎ) బాలకృష్ణ బి) రవితేజ సి) వెంకటేశ్ డి) చిరంజీవి 12. 2001లో రిలీజైన ‘ఖుషీ’లో భూమిక చావ్లా హీరోయిన్. 2010లో ‘ఖుషీ’ సినిమాను కన్నడ భాషలోకి రీమేక్ చేశారు. అందులో హీరోయిన్ ఎవరో కనుక్కోండి? (ఆమె తెలుగు సినిమాల్లో ఫేమస్ హీరోయిన్) ఎ) తమన్నా భాటియా బి) శ్రియా సరన్ సి) ఆర్తీ అగర్వాల్ డి) ప్రియమణి 13. ‘సరైనోడు’ సినిమాలో అల్లు అర్జున్‌తో ‘బ్లాక్‌బస్టర్ బ్లాక్‌బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫే బ్లాకు బస్టరే...’ అనే పాటలో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) అంజలి బి) సమంత ∙సి) క్యాథరిన్ థెరిస్సా డి) రకుల్ ప్రీత్ సింగ్ 14. ‘జ్ఞాపకాలు చెడ్డవైనా, మంచివైనా ఎప్పుడూ మనతోనే ఉంటాయి, మోయక తప్పదు’ అనే డైలాగ్‌ను హీరో వరుణ్ తేజ్ ఓ సినిమాలో చెప్పారు. ఆ డైలాగ్‌ను రాసిందెవరో తెలుసా? ఆయన దర్శకుడు కూడా? ఎ) శ్రీను వైట్ల బి) శ్రీకాంత్ అడ్డాల సి) క్రిష్ జాగర్లమూడి డి) వెంకీ అట్లూరి 15. ‘ప్రేమంటే ఇదేరా’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా? (ఈ బ్యూటీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్ ఓనర్) ఎ) శిల్పా శెట్టి బి) మనీషా కొయిరాల సి) ప్రీతీ జింతా డి) దీప్తి భట్నాగర్ 16. తాప్సీ తన మొదటి తెలుగు సినిమాలో ఏ హీరో సరసననటించారో గుర్తుందా? ఎ) మంచు మనోజ్ బి) మంచు విష్ణు సి) గోపీచంద్ డి) రవితేజ 17. మనం ఏ సినిమాకెళ్లినా ‘ఈ నగరానికేమైంది’ అని ఒక గవర్నమెంట్ యాడ్ దర్శనమిస్తుంది. ఇప్పుడు అదే పేరుతో ఓ సినిమాను రూపొందిస్తున్నారు ఓ దర్శకుడు. గతంలో ఇతను ఒకే ఒక్క మూవీ తీశాడు. అది సూపర్‌హిట్. ఇది తన రెండో సినిమా. ఎవరా దర్శకుడు? ఎ) సంకల్ప్ రెడ్డి బి) వెంకీ కుడుముల సి) వెంకీ అట్లూరి డి) తరుణ్ భాస్కర్ 18. రామ్‌చరణ్‌తో దర్శకుడు సుకుమార్ ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. సుకుమార్ తర్వాతి సినిమా ఏ హీరోతో ఉంటుందో కనుక్కోండి? ఎ) అల్లు అర్జున్ బి) మహేశ్ బాబు సి) రామ్ చరణ్ డి) యన్టీఆర్ 19. పై ఫొటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టండి? ఎ) నివేదా థామస్ బి) అనూ ఇమ్మాన్యుయేల్ సి) అనుపమా పరమేశ్వరన్ డి) కేథరిన్ 20. ప్రఖ్యాత నటి భానుమతి నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో కనుక్కోండి? ఎ) ధర్మపత్ని బి) వరవిక్రయం సి) స్వర్గసీమ డి) మల్లీశ్వరి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) బి 3) డి 4) డి 5) సి 6) సి 7) డి 8) బి 9) బి 10) డి 11) బి 12) డి 13) ఎ 14) డి 15) సి 16) ఎ 17) డి 18) బి 19) బి 20) డి -నిర్వహణ: శివ మల్లాల -
సస్పెన్స్ థ్రిల్లర్ స్టార్ట్
కల్యాణ్ రామ్ మాంచి జోరుమీదున్నారు. మార్చిలో ‘ఎంఎల్ఏ’గా ప్రేక్షకుల్ని అలరించిన ఆయన నటించిన తాజా చిత్రం ‘నా నువ్వే’ మే 25న విడుదల కానుంది. ‘నా నువ్వే’ నిర్మాణ సంస్థలోనే కల్యాణ్‌రామ్ హీరోగా మరో సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. ఛాయాగ్రాహకుడు కె.వి.గుహన్ దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు నందమూరి హరికృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో జూనియర్ ఎన్టీఆర్ క్లాప్ ఇచ్చారు. నందమూరి రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ఇందులో నివేథా థామస్, షాలినీ పాండే హీరోయిన్లు. ఈ సందర్భంగా మహేశ్ కోనేరు మాట్లాడుతూ– ‘‘మే 2న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు శేఖర్ చంద్రగారు చాలా మంచి సంగీతాన్ని అందిస్తారనే సంగతి తెలిసిందే. ఆయన మా సినిమాకు సంగీతం అందించనుండటం హ్యాపీ’’ అన్నారు. ‘‘ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. కథ చాలా బాగా వచ్చింది’’ అన్నారు గుహన్. ‘‘తెలుగులో నా రెండో సినిమా ఇది. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో భాగమవడం ఆనందంగా ఉంది’’ అన్నారు షాలినీ పాండే. ‘‘ఈ చిత్రకథని గుహన్‌గారు తమిళంలో వినిపించారు. తెలుగు సినిమాలకు ఆరు నెలలు దూరంగా ఉన్నా. మహేశ్‌గారితో చాలా కాలంగా అనుబంధం ఉంది. ఆయనతో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు నివేథా థామస్. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర పాల్గొన్నారు. -
ఘట్టం ఏదైనా.. పాత్ర ఏదైనా.. నేను రెడీ!
జై లవకుశ’ ట్రైలర్లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఇది. ఎన్టీఆరే కాదు, ఇప్పుడు సినిమా కూడా రెడీ! విడుదలకు వారం ముందే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందీ సినిమా. ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మించిన ‘జై లవకుశ’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సిన్మా ట్రైలర్లో మ్యాగ్జిమమ్ కథేంటో చెప్పేశారు. కానీ, చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడదే ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కలిగిస్తోంది. జై లవ కుశలు ఓ తల్లి కడుపున పుట్టిన బిడ్డలే. అయితే... ముగ్గురిలో పెద్దోడు ‘జై’ చిన్నప్పుడే తమ్ముళ్లకు దూరమై రావణుడిలా ఎదుగుతాడు. లవకుశలు రామలక్ష్మణుల్లా ఎదుగుతారు. మళ్లీ కొన్నాళ్ల తర్వాత ముగ్గురూ కలుస్తారు. అప్పుడు ఏం జరిగింది? ‘మనమనేది అబద్ధం. నేను అనేదే నిజం’ అన్న ‘జై’ తమ్ముళ్లతో ఎలా కలిశాడు? అనేది ఈ 21న థియేటర్లలో చూడాలి. ‘‘ఘట్టం ఏదైనా... పాత్ర ఏదైనా... తారక్ (ఎన్టీఆర్) ఎంత అద్భుతంగా నటిస్తాడో ఈ సినిమా చెబుతుంది. మూడు పాత్రలో తారక్ జీవించాడు’’ అన్నారు కల్యాణ్‌రామ్. రాశీఖన్నా, నివేథా థామస్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఛోటా కె. నాయుడు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
జూలియట్.. ఇడియట్ల ప్రేమ
దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన అజయ్ వోధిరాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్. నవీన్ చంద్ర, నివేదా థామస్ జంటగా కొత్తపల్లి అనురాధ సమర్పణలో కొత్తపల్లి ఆర్.రఘుబాబు, కె.బి.చౌదరి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. నవీన్‌చంద్ర మాట్లాడుతూ– ‘‘ప్రతి లవర్ ఒక ఇడియట్టే. నేనొక ఇడియట్ లాంటి లవర్‌లా సినిమాలో కనిపిస్తా. విలువలున్న ప్రేమకథ ఇది’’ అన్నారు. ‘‘ఓ జూలియట్, ఓ ఇడియట్ ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్నదే ఈ మూవీ. నవీన్‌ను ఇప్పటికీ ‘అందాలరాక్షసి’ నవీన్ అంటుంటారు. ఈ సినిమాతో ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’ నవీన్ అంటారు’’ అన్నారు అజయ్ వోధిరాల. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవితేజ, లైన్ ప్రొడ్యూసర్: సురేష్ కొండవీటి. -
నీ కోసం పాత్రలు సృష్టిస్తారు : స్టార్ డైరెక్టర్
గత శుక్రవారం రిలీజ్ అయిన నిన్నుకోరి సినిమాపై ఇప్పటికీ ప్రశంసల జల్లు కురుస్తోంది. నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ లు లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన ఈ ట్రయాంగ్యులర్ లవ్ స్టోరి, సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. రిలీజ్ సమయంలో కేవలం క్లాస్ ఆడియన్స్‌ను మాత్రమే అలరిస్తుందని భావించినా.. ప్రస్తుతం అన్ని సెంటర్ల నుంచి మంచి రిపోర్ట్స్ వస్తున్నాయని సంబరపడిపోతున్నారు చిత్రయూనిట్. ఇటీవల నాని నటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్, ప్రశంసలు కురింపించటం తెలిసిందే. తాజాగా మరో సెలబ్రిటీ ఈ లిస్ట్ చేరిపోయాడు. వరుస బ్లాక్ బస్టర్లను అందిస్తున్న దర్శకుడు కొరటాల శివ నిన్నుకోరి యూనిట్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. 'నిన్ను కోరి సినిమా చూశాను. మంచి ఎంటర్టైనర్. సినిమాలో ప్రతీ సన్నివేశం ఆకట్టుకుంది. దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత డివివి దానయ్య, కోన వెంకట్‌లకు శుభాకాంక్షలు. నాని నటన సూపర్బ్. కామెడీ, ఎమోషన్స్ చాలా బాగా పండించాడు. నివేదాథామస్ ఇక నుంచి నీకోసం రచయితలు పాత్రలు సృష్టిస్తారు' అంటూ ట్వీట్ చేశాడు. Watched #NinnuKori.An amazing entertainer.Loved every moment of it.Congrats to dir shiva nirvana @DVVEnts,@konavenkat99 and the entire team — koratala siva (@sivakoratala) 11 July 2017 Commendable job by @NameisNani.Be it fun, be it emotions,u just excelled in all. And @i_nivethathomas, many will start writing great for u. — koratala siva (@sivakoratala) 11 July 2017 -
ఇడియట్‌తో జూలియట్!
నవీన్‌చంద్ర, నివేదా థామస్ జంటగా నటిస్తున్న చిత్రం ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’. దర్శకుడు సుకుమార్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన అజయ్ వోధిరాల దర్శకత్వంలో అనురాగ్ ప్రొడక్షన్స్‌పై కొత్తపల్లి ఆర్. రఘుబాబు, కేబీ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ‘‘అజయ్ కథ నచ్చడంతో సినిమా రంగంలోకి వచ్చాం. లాజిక్, మ్యాజిక్ ఉన్న సున్నితమైన ప్రేమకథా చిత్రమిది. షూటింగ్ చివరి దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులూ జరుగుతున్నాయి. త్వరలో ట్రైలర్, ఆడియో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ని విడుదల చేసిన సుకుమార్‌గారికి ధన్యవాదాలు. లాజికల్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నా. నవీన్ చంద్ర, నివేదాల సహజ నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్థర్ ఎ. విల్సన్–గిరీష్ గంగాధరన్, సంగీతం: రతీష్ వేగ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవితేజ, లైన్ ప్రొడ్యూసర్: సురేష్ కొండవీటి, సమర్పణ: కొత్తపల్లి అనురాధ. -
ఓ పల్లవి... రెండు చరణాలు!
పాట పల్లవితో మొదలవుతుంది. పల్లవి వెంట చరణాలు వస్తాయి. అది తెలిసిందే. ‘నిన్ను కోరి’ అనే కవితాత్మక టైటిల్‌తో వస్తున్న సినిమా కథలో హీరోయిన్ నివేదా థామస్ పల్లవి అయితే.. ఆమెను రెండు చరణాలు వెంటాడతాయి. మరి, ఆ చరణాలు ఎవరంటే... హీరోలు నాని, ఆది పినిశెట్టి. ఓ చరణం (నాని) విశాఖలో పల్లవి చదువుతున్నప్పుడు వెంట పడితే... రెండో చరణం (ఆది) అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు వెంట పడుతుంది. మరి, జీవితం చివరి వరకు ఏ చరణంతో అడుగులు వేయాలని పల్లవి నిర్ణయించుకుందనేది జూలై 7న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా చూసి తెలుసుకోమంటున్నారు నిర్మాత డీవీవీ దానయ్య. శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆయన నిర్మించిన ఈ సినిమా ఆ రోజే విడుదల కానుంది. ఈ నెల 29న ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నారు. అన్నట్టు... సినిమాలో హీరోయిన్ పేరు పల్లవి. -
లవ కుశలు కమింగ్ సూన్!
జై–లవ–కుశ... ముగ్గురూ అన్నదమ్ములా? స్నేహితులా? శత్రువులా? ఈ ప్రశ్నలకు సమాధానం దసరాకి దొరుకుతుంది. ఈ ముగ్గురూ ఎలా ఉంటారు? అనడిగితే.. ‘జై’ మాత్రం ఇలా ఉంటాడు అని టకీమని చెప్పేయొచ్చు. ఈ మధ్యే కదా జై జోరుగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. జై సై్టలిష్ లుక్కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మరి ‘లవ’, ‘కుశ’ లుక్స్ ఎలా ఉంటాయి? అనే చర్చ ఫిల్మ్‌నగర్‌లో జోరుగా సాగుతోంది. వాళ్లిద్దరూ కూడా ఆన్ ది వే. జస్ట్ పది, పదిహేను రోజుల్లో ఈ ఇద్దరి లుక్స్ తెలిసిపోతాయి. ‘జై’గా ఎన్టీఆర్ మాస్‌గా కనిపించి మార్కులు కొట్టేశారు. లవ్ అలియాస్ ఎన్. లవకుమార్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అట. ఆ గెటప్పూ బాగుంటుందని ఊహించవచ్చు. మరి.. కుశ ఏం చేస్తాడు? అనుకుంటున్నారా? ఫిల్మ్‌నగర్ టాక్ ప్రకారం కుశ డ్యాన్స్ మాస్టర్ అట. ఈ గెటప్పూ అదిరిపోయేలా ఉంటుందట. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ‘జై లవ కుశ’ టీజర్ వచ్చే నెల మొదటి వారంలో విడుదల కానుంది. కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, నివేదా థామస్ కథానాయికలు. హీరోయిన్ నందిత ఓ కీ రోల్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ ఏడాది దసరాకు సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. -
వైజాగ్ బీచ్ రోడ్డులో 'నిన్ను కోరి'
వరుస సక్సెస్‌లతో సూపర్ ఫాంలో ఉన్న నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా నిన్ను కోరి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. నాని సరసన నివేదా థామస్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా థియట్రికల్ ట్రైలర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 7న రిలీజ్ అవుతోంది. -
కొత్త దర్శకుడితో నాని
ప్రస్తుతం యంగ్ హీరో నాని ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలను రిలీజ్ చేసిన ఈ యంగ్ హీరో మరో సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. కెరీర్ పరంగా మంచి జోరు మీద ఉన్న ఈ నేచురల్ స్టార్ ముందు ముందు కూడా అదే ఫాంను కంటిన్యూ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా తన ఇమేజ్ను కాపాడు కుంటూనే కొత్త దర్శకులతో సినిమాలకు సై అంటున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కుతున్న నేనులోకల్ సినిమాలో నటిస్తున్న నాని, ఈ సినిమా తరువాత ఓ కొత్త దర్శకుడితో కలిసి పనిచేయనున్నాడు. టీచింగ్ ఫీల్డ్ నుంచి దర్శకుడిగా మారుతున్న శివ శంకర్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు నాని రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా రచయిత కోన వెంకట్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నాని సరసన జెంటిల్మన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నివేదా థామస్ మరోసారి నానితో జతకడుతుండగా, సరైనోడు సినిమాలో నెగెటివ్ రోల్‌తో ఆకట్టుకున్న ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎక్కువగా భాగం ఫారిన్లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
అఖిల్ సరసన మలయాళీ భామ..?
తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నటవారసుడు అఖిల్, రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దాదాపు ఏడాది కాలంగా సరైన కథ, దర్శకుడి కోసం ఎదురుచూసిన ఈ యంగ్ హీరో ఇటీవల విక్రమ్ కుమార్‌తో రెండో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే సినిమా ఏ జానర్లో ఉంటుందన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్గా మలయాళీ బ్యూటి నివేదా థామస్ నటించనుందట. నాని హీరోగా తెరకెక్కిన జెంటిల్మన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేదా, తొలి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా అఖిల్ లాంటి క్రేజ్ స్టార్ సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. -
కుర్రాళ్లంతా జెంటిల్మన్లే.. - హీరో నాని
విజయవాడ (గాంధీనగర్) : నేటితరం కుర్రాళ్లంతా జెంటిల్మన్లే అని హీరో నాని అన్నారు. శ్రీదేవి బ్యానర్‌పై శివలెంక కృష్ణమోహన్ నిర్మించిన ‘జెంటిల్మెన్’ సినిమా విజయోత్సవంలో భాగంగా సోమవారం చిత్ర యూనిట్ నగరంలో సందడి చేసింది. చిత్రం ప్రదర్శిస్తున్న కపర్ధి థియేటర్లో ప్రేక్షకుల మధ్య ఉత్సాహంగా గడిపింది. చిత్రాన్ని ఆదరించి ఘనవిజయం అందించిన ప్రేక్షకులకు యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ తాను చల్లపల్లి అబ్బాయినేనని, తనకు విజయవాడతో ఎంతో అనుబంధం ఉందన్నారు. తన బంధువులంతా విజయవాడలోనే ఉంటారని చెప్పారు. జెంటిల్మెన్ చిత్రానికి కుర్రాళ్లే బాక్సాఫీస్ హిట్ అందిం చారని పేర్కొన్నారు. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ తాను, నాని కాంబినేషన్లో మూడేళ్ల క్రితం నిర్మించిన ‘అష్టాచెమ్మా’ చిత్రం విజయం సాధించిందని, ఇప్పుడు జెంటిల్మెన్ అంతకన్నా ఘనవిజయం సాధించిందన్నారు. హీరోయిన్లు నివేదా థామస్, సురభి మాట్లాడుతూ ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తమకెంతో సంతోషానిచ్చిందన్నారు. సినిమాలో డైలాగులు చెప్పి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, ఏపీ ఫిలిం చాంబర్ కార్యదర్శి ప్రసాద్, గీతా పిక్చర్స్ మేనేజర్ గిరి, కపర్ధి థియేటర్ మేనేజర్ మోహన్‌రావు, చిత్ర పంపిణీదారులు రాజేష్ పాల్గొన్నారు. బస్టాండ్‌లో థియేటర్ ఆలోచన బాగుంది విజయవాడ (బస్‌స్టేషన్) : విజయవాడలో సినిమాలకు ఒక ప్రత్యేకత ఉందని, ఏ సినిమా అయినా ఇక్కడ హిట్ అంటే.. మిగతా ప్రాంతాల్లోనూ అదే టాక్ తెచ్చుకుంటుందని హీరో నాని తెలిపారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ ఎరైవల్ బ్లాక్‌లోని వైస్క్రీన్ థియేటర్లో జెంటిల్మెన్ చిత్రబృందం సోమవారం సందడి చేసింది. యూనిట్‌కు థియేటర్ అధినేత యార్లగడ్డ వెంకటరత్నకుమార్ స్వాగతం పలికారు. సినిమా విజయోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి పంచారు. ఈ సందర్భంగా హీరో నాని విలేకరులతో మాట్లాడుతూ జెంటిల్మెన్ సినిమాను ఆదరించి విజయం చేకూర్చిన ప్రేకక్షులకు రుణపడి ఉంటానన్నారు. బస్టాండ్‌లో సినిమా థియేటర్ నిర్మించాలన్న ఆలోచన బాగుందన్నారు. -
మేం టచ్‌లోనే ఉన్నాం!
‘‘కథ వింటా. నచ్చితే హీరో, డెరైక్టర్ ఎవరని ఆలోచిస్తా. కథ ఎంపికలో తుది నిర్ణయం నాదే. తర్వాత వచ్చే గెలుపోటములకు నా బాధ్యత కూడా ఉందని భావిస్తా. ఓటమి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా. గ్లామర్ అంటే స్కిన్ షో కాదు. దానివల్లే చిత్రాలు విజయవంతం అవుతాయన్నది నేను నమ్మను. గ్లామర్ కంటే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలకే నా ప్రాధాన్యం’’ అని కథానాయిక నివేదా థామస్ అన్నారు. నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘జెంటిల్మన్’ చిత్రం ద్వారా టాలీవుడ్‌కి పరిచయమయ్యారామె. ఈ చిత్రం మంచి గుర్తింపు తెచ్చిందని నివేదా థామస్ చెబుతూ - ‘‘కో-డెరైక్టర్ సురేష్‌గారు నేను నటించిన మలయాళం, తమిళ చిత్రాలు చూసి మోహనకృష్ణగారికి చెప్పారు. ఆయనకు కూడా ఈ చిత్రంలో క్యాథరిన్ పాత్రకు సరిపోతానని అనిపించడంతో తీసుకున్నారు. మోహనకృష్ణసార్ కథ చెప్పగానే నచ్చి, ఎలాగైనా ఈ చిత్రం చేయాలనుకున్నా. నా నటనకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. కమల్‌హాసన్‌గారి ‘పాపనాశం’లో మంచి పాత్ర చేశా. నాకు ఆయనంటే చాలా ఇష్టం. ఆయన తర్వాత నాకిష్టమైన యాక్టర్ నానీనే. తన సినిమాలన్నీ చూశాను. నాని నటన సహజంగా ఉంటుంది. ఈ చిత్రం చేసేటప్పుడు హీరోయిన్ సురభితో మంచి స్నేహం కుదిరింది. నేను చెన్నై, తను ఢిల్లీలో ఉంటాం. ఫోన్ ద్వారా టచ్‌లోనే ఉన్నాం. ఈ చిత్రం షూటింగ్‌లోనే తెలుగు నేర్చుకున్నా. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాలనుకున్నా. పరీక్షలు ఉండటంతో కుదరలేదు. నెక్ట్స్ సినిమాకు తెలుగులో డబ్బింగ్ చెబుతా. ప్రస్తుతం ఆర్కిటెక్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నా. ప్రస్తుతానికి తెలుగు, తమిళం, మలయాళంలో కొత్త చిత్రాలేవీ అంగీకరించలేదు’’ అన్నారు.