‘శ్వాస’ ఆగిపోయిందా? | Nikhil Siddharth And Nivetha Thomas Movie Swasa Is Stopped | Sakshi
Sakshi News home page

‘శ్వాస’ ఆగిపోయిందా?

Published Thu, Mar 7 2019 7:34 PM | Last Updated on Thu, Mar 7 2019 7:34 PM

Nikhil Siddharth And Nivetha Thomas Movie Swasa Is Stopped - Sakshi

‘కిరాక్‌ పార్టీ’తో ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయాడు నిఖిల్‌. సక్సెస్‌ ఫుల్‌గా సాగుతున్న ఈ యువ హీరో కెరీర్‌కు కిరాక్‌ పార్టీ అడ్డుకట్టవేసింది. అయితే ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలని ఓ తమిళ రీమేక్‌పై దృష్టి సారించాడు.

కోలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అయిన కణిథణ్‌ చిత్రాన్ని ‘అర్జున్‌ సురవరం’ పేరుతో టాలీవుడ్‌కు తీసుకువస్తున్నాడు. టీజర్‌తో ఈ మూవీ ఒక్కసారిగా భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. అయితే నిఖిల్‌ హీరోగా,నివేదా థామస్‌ హీరోయిన్‌గా అప్పట్లో శ్వాస అనే చిత్రం మొదలైంది. తాజాగా ఈ మూవీపై ఓ రూమర్‌ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ పక్కన పడేశారనీ, ఈ సినిమాను ఆపేశారని టాక్‌ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా స్పందించలేదు. అర్జున్‌ సురవరం తరువాత నిఖిల్‌ కార్తికేయ సీక్వెల్‌లో నటిస్తాడని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement