రాజ్‌కుమార్, నిఖిల్, ‘ఠాగూర్’ మధు
నిఖిల్ సిద్ధార్థ్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్‌ఎల్ పి అండ్ ఔరా ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. పతాకాలపై టి. ఎన్. సంతోష్ దర్శకత్వంలో రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయాలనుకున్నారు. అయితే వాయిదా వేశారు. మే 1న విడుదల చేయనున్నట్లు శనివారం చిత్రబృందం ప్రెస్‌మీట్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ– ‘‘హ్యాపీడేస్’ నుండి ‘అర్జున్ సురంవరం’ వరకు 16 చిత్రాలు చేశాను.
అన్ని సినిమాల్లోకి ఈ చాలా బాధ్యత గల సినిమా ఇది. టాప్ రిపోర్టర్ అవ్వాలనుకునే అర్జున్ క్యారెక్టర్‌ని ఈ చిత్రంలో ప్లే చేస్తున్నాను. ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా, పడగొట్టాలన్నా మీడియాకి పవర్ ఉంటుంది. మీడియాలో ఉన్న పాజిటివ్, నెగిటివ్ అన్ని విషయాలు ఈ చిత్రంలో చూపిస్తున్నాం. నా కెరీర్‌లోనే మోస్ట్ రెస్పాన్సిబుల్‌గా ఫీలై ఒళ్లు దగ్గర పెట్టుకొని చేసిన సినిమా ఇది. ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. సినిమా అంతా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మే 1న రిలీజ్ చేస్తున్నాం.
నైజామ్ ఏషియన్ సునీల్ విడుదల చేస్తున్నారు. ఆయనకి థ్యాంక్స్. నా సినిమాలు పోస్ట్‌పోన్ అయిన ప్రతిసారీ హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. మా చేతిలో మంచి సినిమా రెడీగా ఉంది. అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైనా సినిమా బాగా రావడానికి నిర్మాతలు ‘ఠాగూర్’ మధు, రాజ్‌కుమార్ ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు’’ అన్నారు. నిర్మాత రాజ్‌కుమార్ ఆకెళ్ల మాట్లాడుతూ – ‘‘సినిమా బాగుండాలని కాంప్రమైజ్ కాకుండా చేశాం. సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. ఇప్పుడు ఎన్నికల జోరు ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ సలహా మేరకు మే 1న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు ‘ఠాగూర్’ మధు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment