కారులో నుంచి బయటపడేదాన్ని! | Lavanya Tripathi speech about Arjun Suravaram | Sakshi
Sakshi News home page

నాకు నచ్చే పాత్రలు రావడం లేదు

Published Sun, Nov 24 2019 12:26 AM | Last Updated on Sun, Nov 24 2019 8:44 AM

Lavanya Tripathi speech about Arjun Suravaram - Sakshi

లావణ్యా త్రిపాఠి

‘‘ఒకేసారి నాలుగైదు సినిమాల్లో కనిపించేయాలనుకోవడం లేదు. ఒక దాని తర్వాత ఒక సినిమా చేసినా నాకు నచ్చిన సినిమాలే చేయాలనుకుంటున్నాను. చేసే ఒక్కటి అయినా మంచి సినిమా చేయాలి.  స్క్రిప్ట్‌ నాకు ఎగ్జయిటింగ్‌గా అనిపించకపోతే సినిమా అంగీకరించడం లేదు’’ అని లావణ్యా త్రిపాఠి అన్నారు. నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టీఎన్‌ సంతోష్‌ తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్‌ సురవ రం’. తమిళ చిత్రం ‘కణితన్‌’కి ఇది తెలుగు రీమేక్‌. బి.మధు సమర్పణలో రాజ్‌కుమార్‌ ఆకెళ్ల నిర్మించారు.

ఈ నెల 29న ఈ సినిమా రిలీజ్‌ కానున్న సందర్భంగా లావణ్యా త్రిపాఠి మాట్లాడుతూ – ‘‘మొదట ఈ సినిమాకు నో చెప్పాను. రీమేక్‌ సినిమాలో చేయడానికి ఏం ఉంటుంది? అనే ఉద్దేశంతో అలా అన్నాను. కానీ కథ వినగానే చాలా నచ్చింది. ఇందులో జర్నలిస్ట్‌ పాత్రలో కనిపిస్తాను. చాలా స్ట్రాంగ్‌ అమ్మాయిని. నకీలి సర్టిఫికెట్స్‌ మాఫీయా గురించి ఈ సినిమాలో చర్చించాం. దాని వల్ల టాలెంట్‌ ఉన్నవాళ్లు కూడా ఎలా నష్టపోతున్నారో చూపించాం. ఈ సినిమాలో కొన్ని రిస్కీ యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయి.

ఒక సన్నివేశంలో కారులో నుంచి బయటపడబోయేదాన్ని. కొంచెంలో మిస్‌ అయింది. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. కానీ ఆ ఎక్స్‌పీరియన్స్‌ థ్రిల్లింగ్‌గా ఉంది (నవ్వుతూ). ‘అర్జున్‌ సురవరం’ రిలీజ్‌ ఆలస్యం కావడంతో సినిమా ఏమైనా అవుడ్‌ డేట్‌ అయిపోతుందా, స్టేల్‌ అయిపోతుందా? అనే ఆలోచన నాక్కూడా వచ్చింది. కానీ మా ట్రైలర్‌ని చూసినవాళ్లందరూ ఫ్రెష్‌గానే ఉంది అంటున్నారు. ‘ఈ మధ్య వరుసగా సినిమాలు చేయడం లేదేంటి?’ అని కొంతమంది అడుగుతున్నారు.

సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ నాకు నచ్చిన పాత్రలు రావడం లేదు. ఈ గ్యాప్‌లో నాకు నచ్చిన ప్రదేశాలకు వెళుతున్నాను. కొత్త డ్యాన్స్‌ నేర్చుకుంటున్నాను. జిమ్నాస్టిక్స్‌ చేస్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాను. నెక్ట్స్‌ చేయబోయే సినిమాలో హాకీ ప్లేయర్‌గా కనిపిస్తాను. దానికోసం డిసెంబర్‌లో హాకీ శిక్షణ ప్రారంభిస్తాను. కాలేజీ రోజుల్లో మా అమ్మగారు కూడా హాకీ ఆడేవారట’’ అన్నారు.

‘అర్జున్‌ సురవరం’ ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరు కానున్నారు. ఈ నెల 29న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను 26న  హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. చిత్రబృందం తరఫున ఈ వేడుకకు చిరంజీవిని అహ్వానించారు నిఖిల్‌.

 చిరంజీవి, నిఖిల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement