‘అదే నాకు పెద్ద విషయం’ | Chiranjeevi Praises Arjun Suravaram Teaser | Sakshi
Sakshi News home page

‘అర్జున్‌ సురవరం’ టీజర్‌పై ‘చిరు’ ప్రశంసలు

Published Tue, Mar 5 2019 6:08 PM | Last Updated on Tue, Mar 5 2019 8:14 PM

Chiranjeevi Praises Arjun Suravaram Teaser - Sakshi

‘కిరాక్‌ పార్టీ’ సినిమాతో గతేడాది పలకరించిన నిఖిల్‌కు చేదు అనుభవం ఎదురైంది. అయితే మళ్లీ సక్సెస్‌ సాధించాలని తమిళ రీమేక్‌పై కన్నేశాడు. తమిళ్‌లో సూపర్‌హిట్‌ అయిన కణిథణ్‌ చిత్రాన్ని తెలుగులో అర్జున్‌సురవరం పేరుతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టీజర్‌ను మహా శివరాత్రి సందర్భంగా సోమవారం విడుదల చేశారు.

ఈ మూవీ టీజర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి.. మిలియన్‌ వ్యూస్‌ను క్రాస్‌ చేసేసింది. అయితే ఈ మూవీ టీజర్‌ను మెగాస్టార్‌ చిరంజీవి వీక్షించారు. అంతేకాకుండా.. టీజర్‌చూసి చిత్ర నిర్మాతకు అభినందనలు తెలియజేశారట. ఇదే విషయాన్ని నిఖిల్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

‘మా నిర్మాత రాజ్‌కుమార్‌ ఓ మెసెజ్‌ను చాలా హ్యాపీగా ఫీల్‌ అవుతున్నాడు. అదెంటో చూద్దామని నేను ఆయన ఫోన్‌ను లాక్కున్నాను. ఓమైగాడ్‌.. ఆ మెసెజ్‌ చేసింది మన మెగాస్టార్‌. ఇదే మా లైఫ్‌కు పెద్ద విషయం. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోవడానికి పర్మిషన్‌ కూడా తీసుకున్నా’ను అంటూ ట్వీట్‌చేశారు. ఇంతకీ మన చిరు టీజర్‌ చూసి.. ‘ హాయ్‌.. డియర్‌ ప్రొడ్యుసర్‌ రాజ్‌కుమార్‌.. ఇప్పుడే అర్జున్‌సురవరం టీజర్‌ చూశాను. ఆసక్తికరంగా ఉంది. ఆల్‌ ది వెరీ బెస్ట్‌ టు నిఖిల్‌, డైరెక్టర్‌’ అంటూ ప్రశంసించారు.  ఠాగుర్‌ మధు నిర్మిస్తున్న ఈ మూవీని సంతోష్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement