1. ప్రపంచ సంగీత దినోత్సవం ఎప్పుడో తెలుసా?
ఎ) జూన్ 21 బి) జూన్ 24 సి) జూన్ 15 డి) జూన్ 19
2. ‘‘గురుబ్రహ్మలారా.. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి..’’అనే పాట ‘స్టూడెంట్ నం1’ సినిమాలోనిది. ఈ చిత్ర సంగీత దర్శకుడెవరో తెలుసా?
ఎ) మణిశర్మ బి) ఎం.ఎం. కీరవాణి సి) రమణ గోగుల డి) చక్రి
3. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాలో రాక్‌స్టార్ పాత్రలో నటించిన హీరో ఎవరో గుర్తు తెచ్చుకోండి?
ఎ) అల్లు అర్జున్ బి) రామ్ చరణ్ సి) మహేశ్‌బాబు డి) రామ్
4. ‘‘రాకాసి రాకాసి నను రబ్బరు బంతిల ఎగరేసి..’’ అనే పాటను పాడిన హీరో ఎవరు?
ఎ) ఎన్టీఆర్ బి) నాగచైతన్య సి) శింబు డి) రానా దగ్గుబాటి
5. పాత తరం హీరోయిన్లలో ఓ హీరోయిన్ మాత్రం తన పాటలను తనే పాడుకునేవారు. ఎవరామె?
ఎ) జమున బి) వాణిశ్రీ సి) సావిత్రి డి) భానుమతి
6. డాక్టర్ సి. నారాయణ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్‌గా ఉన్నప్పుడు సినీరంగంలోకి ప్రవేశించారు. సుమారు ఎన్ని పాటలు ఆయన కలం నుండి జాలువారాయో కనుక్కోండి?
ఎ) సుమారు 1000 బి) 1800 పాటలు సి) దాదాపు 3000 డి) సుమారు 1500
7. ‘మహానటి’ చిత్రంలో ‘మూగ మనసులు’ అనే పాటను అద్భుతంగా పాడిన గాయని ఎవరో తెలుసా?
ఎ) శ్రేయా ఘోషల్ బి) గంటా వెంకటలక్ష్మీ సి) చారులత మణి డి) సునీత
8. ‘మనం’ చిత్రంలో చిన్న పాత్రలో తళుక్కున మెరిసిన ఈ బ్యూటీ మంచి నటే కాదు. సింగర్ కూడా. ఎవరా బ్యూటీ?
ఎ) రకుల్ ప్రీత్ సింగ్ బి) రాశీ ఖన్నా సి) శ్రియా సరన్ డి) నివేథా థామస్
9. ప్రభాస్ నటించిన ‘మిర్చి’ చిత్రంలో ‘డార్లింగే ఓసి నా డార్లింగే’ అనే సూపర్ హిట్ పాట పాడిన గాయని ఎవరో తెలుసా? (డి)
ఎ) మాళవిక బి) శ్రావణ భార్గవి సి) కౌసల్య డి) గీతామాధురి
10. ‘రేసుగుర్రం’ సినిమాలో ‘‘సినిమా సూపిత్త మామా నీకు సినిమా సూపిత్త మామా’’... అనే స్పీడ్ సాంగ్ సింగిన సింగర్ ఎవరో కనుక్కోండి?
ఎ) హేమచంద్ర బి) కారుణ్య సి) సింహా డి) శ్రీరామచంద్ర
11. ‘జ్ఞాన దేసిగన్’ ఆయన అసలు పేరు. భారతీయ సినీ ప్రపంచంలో 7000 పాటలకు పైగా కంపోజ్ చేసిన సంగీత దర్శకధీరుడీయన. ఎవరతను?
ఎ) ఇళయరాజా బి) మాస్టర్ వేణు సి) చక్రవర్తి డి) తాతినేని చలపతిరావు
12. హీరోగా మోహన్‌బాబు చేసిన అన్ని సినిమాల్లో దాదాపుగా ఈ సింగర్ పాడిన పాట ఒకటుంటుంది. ఎవరా సింగర్?
ఎ) ఏసుదాస్ బి) రామకృష్ణ సి) శంకర్ మహాదేవన్ డి) హరిహరన్
13. ‘జాణవులే నెర జాణవులే..’ అనే పాట చాలా పెద్ద హిట్. ఆ పాటలో నటించిన నటి ఎవరో గుర్తు తెచ్చుకోండి?
ఎ) జ్యోతిలక్ష్మీ బి) అనురాధ సి) సిల్క్‌స్మిత డి) జయమాలిని
14. సంగీతం నేర్చుకోవటం కోసం తన వేలికున్న ఉంగరాన్ని అమ్మి విజయనగరంలో వారాలబ్బాయిగా తిరిగిన సింగర్ ఎవరో తెలుసా?
ఎ) ఘంటసాల బి) యస్పీ బాలసుబ్రహ్మణ్యం సి) మొహమ్మద్ రఫీ డి) పీబీ శ్రీనివాస్
15. ‘ముత్యాలముగ్గు’ సినిమాలోని ‘ము త్యమంతా పసుపు’..., ‘సీతామాలక్ష్మి’ సినిమాలోని ‘సీతాలు సింగారం’... పాటలకు ఐదేసి నిమిషాల వ్యవధిలో బాణీలు కుదిరాయి. ఆ రెండు సినిమాలకు సంగీత దర్శకులు ఒక్కరే... ఎవరా సంగీత దర్శకుడు?
ఎ) కె.వి.మహదేవన్ బి) యస్పీ కోదండపాణి సి) రమేశ్ నాయుడు డి) టి.వి.రాజు
16. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘మహాత్మ’ సినిమాకు సంగీతదర్శకుడీయన. ఆ తర్వాత తమిళ, తెలుగు ప్రేక్షకులకు నటునిగా దగ్గరయ్యారు. ఎవరా హీరో ?
ఎ) యస్.యస్. తమన్ బి) విజయ్ ఆంటోని సి) జీవీ. ప్రకాష్ కుమార్ డి) అనిరు«ద్
17. ‘తమ్ముడు ఒరే తమ్ముడు.. ఈ తికమక లె గులే ప్రేమంటే’ అనే పాటను హమ్ చేసిన హీరో ఎవరో తెలుసా?
ఎ) బాలకృష్ణ బి) నాగార్జున సి) చిరంజీవి డి) వెంకటేశ్
18. ‘ప్రణామం ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికే ప్రణామం’ అనే పాట రచయితెవరో తెలుసా?
ఎ) అనంతశ్రీరాం బి) సిరివెన్నెల సి) రామజోగయ్య శాస్త్రి డి) శ్రీమణి
19. తన జీవితంలో దాదాపు 48000 పాటలను ఆలపించిన ప్రముఖ గాయని ఎవరో తెలుసా?
ఎ) పి. సుశీల బి) యస్. జానకి సి) చిత్ర డి) వాణీ జయరాం
20. పై ఫొటోలోని దృశ్యం ‘తకిట తథిమి తకిట తథిమి తందాన’ అనే పాటలోనిది. ఈ ఫొటో ఏ సినిమాలోనిదో తెలుసా?
ఎ) శుభసంకల్పం బి) సిరివెన్నెల సి) స్వాతిముత్యం డి) సాగరసంగమం
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు
1) (ఎ) 2) (బి) 3) (సి) 4) (ఎ) 5) (డి) 6) (సి) 7) (ఎ) 8) (బి) 9) (డి) 10) (సి)
11) (ఎ) 12) (ఎ) 13) (సి) 14) (ఎ) 15) (ఎ) 16) (బి) 17) (సి) 18) (సి) 19) బి 20) డి
నిర్వహణ: శివ మల్లాల
Comments
Please login to add a commentAdd a comment