1. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మొదటి సినిమా దర్శకుడెవరో గుర్తుందా?
ఎ) వి.ఆర్. ప్రతాప్ బి) ఎస్.ఎస్. రాజమౌళి సి) వీవీ వినాయక్ డి) బి. గోపాల్
2. ‘షాక్’ సినిమాలో హీరో రవితేజ పక్కన హీరోయిన్‌గా నటించిన హీరోయిన్ ఎవరు?
ఎ) శ్రియ బి) జ్యోతిక సి) స్నేహ డి) తనూ రాయ్
3. 200 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమా ‘రంగస్థలం’. తెలుగు, హిందీ భాషలో చేసిన ‘జంజీర్’ తో కలిపి హీరోగా చరణ్ కు ఇది ఎన్నో సినిమా?
ఎ) 8 బి) 9 సి) 12 డి) 11
4. ‘మహానటి’ చిత్రంలో చిన్నప్పటి సావిత్రి పాత్రను పోషించిన ఈ బాలనటి పేరు సాయి తేజస్విని. ఈ పాప ఒక ప్రముఖ నటుని మనవరాలు. ఎవరా నటుడు?
ఎ) భానుచందర్ బి) సుమన్ సి) జగపతి బాబు డి) రాజేంద్రప్రసాద్
5.‘ఒకరాజు ఒకరాణి’ చిత్రానికి దర్శకత్వం వహించింది ‘యోగి’. ఆ చిత్రానికి ప్రఖ్యాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ విభాగానికి పనిచేశారు. ఆయన ఏ విభాగానికి పనిచేశారో తెలుసా?
ఎ) కథా రచయిత బి) మాటల రచయిత సి) పాటల రచయిత డి) కథ–మాటలు
6. ‘భరత్ అనే నేను’ సినిమాలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మహేశ్‌బాబు స్పీకర్ పాత్రలో ఉన్న జయలలితను ఏమని సంభోదించారో తెలుసా?
ఎ) స్పీకర్ గారు బి) డియర్ స్పీకర్ గారు సి) మేడమ్ స్పీకర్ డి) సభాపతి గారు
7. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?
ఎ) సుమారు 150 కోట్లు బి) దాదాపు 100 కోట్లు సి) 85 కోట్లు డి) సుమారు 300 కోట్లు
8. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తమిళంలో బిజీగా ఉన్నారు. ఆమె ఏ హీరోతో నటిస్తున్నారో తెలుసా?
ఎ) విజయ్ బి) సూర్య సి) విజయ్ సేతుపతి డి) అజిత్
9. చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి సంగీత దర్శకునిగా ఇప్పుడు యం.యం.కీరవాణి చేస్తున్నారు. ఈ సినిమాకి మొదట అనుకొన్న సంగీత దర్శకుడెవరో తెలుసా?
ఎ) దేవిశ్రీ ప్రసాద్ బి) ఏ.ఆర్. రహమాన్ సి) మణిశర్మ డి) అనూప్ రూబెన్స్
10. పలు బ్లాక్‌బాస్టర్ సినిమాలకు రచయిత అయిన ఈయన ‘నేను తను ఆమె’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు (సినిమా రిలీజవ్వలేదనుకోండి). ఆ రచయిత ఎవరబ్బా?
ఎ) జనార్థన మహర్షి బి) వక్కంతం వంశీ సి) పరుచూరి బ్రదర్స్ డి) కోన వెంకట్
11. నేను అమితాబ్ » చ్చన్‌కు వీరాభిమానిని అని ఈ టాలీవుడ్ హీరో ఎప్పుడూ చెప్తారు. ఆ హీరో ఎవరో?
ఎ) బాలకృష్ణ బి) రవితేజ సి) వెంకటేశ్ డి) చిరంజీవి
12. 2001లో రిలీజైన ‘ఖుషీ’లో భూమిక చావ్లా హీరోయిన్. 2010లో ‘ఖుషీ’ సినిమాను కన్నడ భాషలోకి రీమేక్ చేశారు. అందులో హీరోయిన్ ఎవరో కనుక్కోండి? (ఆమె తెలుగు సినిమాల్లో ఫేమస్ హీరోయిన్)
ఎ) తమన్నా భాటియా బి) శ్రియా సరన్ సి) ఆర్తీ అగర్వాల్ డి) ప్రియమణి
13. ‘సరైనోడు’ సినిమాలో అల్లు అర్జున్‌తో ‘బ్లాక్‌బస్టర్ బ్లాక్‌బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫే బ్లాకు బస్టరే...’ అనే పాటలో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
ఎ) అంజలి బి) సమంత ∙సి) క్యాథరిన్ థెరిస్సా డి) రకుల్ ప్రీత్ సింగ్
14. ‘జ్ఞాపకాలు చెడ్డవైనా, మంచివైనా ఎప్పుడూ మనతోనే ఉంటాయి, మోయక తప్పదు’ అనే డైలాగ్‌ను హీరో వరుణ్ తేజ్ ఓ సినిమాలో చెప్పారు. ఆ డైలాగ్‌ను రాసిందెవరో తెలుసా? ఆయన దర్శకుడు కూడా?
ఎ) శ్రీను వైట్ల బి) శ్రీకాంత్ అడ్డాల సి) క్రిష్ జాగర్లమూడి డి) వెంకీ అట్లూరి
15. ‘ప్రేమంటే ఇదేరా’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా? (ఈ బ్యూటీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్ ఓనర్)
ఎ) శిల్పా శెట్టి బి) మనీషా కొయిరాల సి) ప్రీతీ జింతా డి) దీప్తి భట్నాగర్
16. తాప్సీ తన మొదటి తెలుగు సినిమాలో ఏ హీరో సరసననటించారో గుర్తుందా?
ఎ) మంచు మనోజ్ బి) మంచు విష్ణు సి) గోపీచంద్ డి) రవితేజ
17. మనం ఏ సినిమాకెళ్లినా ‘ఈ నగరానికేమైంది’ అని ఒక గవర్నమెంట్ యాడ్ దర్శనమిస్తుంది. ఇప్పుడు అదే పేరుతో ఓ సినిమాను రూపొందిస్తున్నారు ఓ దర్శకుడు. గతంలో ఇతను ఒకే ఒక్క మూవీ తీశాడు. అది సూపర్‌హిట్. ఇది తన రెండో సినిమా. ఎవరా దర్శకుడు?
ఎ) సంకల్ప్ రెడ్డి బి) వెంకీ కుడుముల సి) వెంకీ అట్లూరి డి) తరుణ్ భాస్కర్
18. రామ్‌చరణ్‌తో దర్శకుడు సుకుమార్ ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. సుకుమార్ తర్వాతి సినిమా ఏ హీరోతో ఉంటుందో కనుక్కోండి?
ఎ) అల్లు అర్జున్ బి) మహేశ్ బాబు సి) రామ్ చరణ్ డి) యన్టీఆర్
19. పై ఫొటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టండి?
ఎ) నివేదా థామస్ బి) అనూ ఇమ్మాన్యుయేల్ సి) అనుపమా పరమేశ్వరన్ డి) కేథరిన్
20. ప్రఖ్యాత నటి భానుమతి నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో కనుక్కోండి?
ఎ) ధర్మపత్ని బి) వరవిక్రయం సి) స్వర్గసీమ డి) మల్లీశ్వరి
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు
1) ఎ 2) బి 3) డి 4) డి 5) సి 6) సి 7) డి 8) బి 9) బి 10) డి
11) బి 12) డి 13) ఎ 14) డి 15) సి 16) ఎ 17) డి 18) బి 19) బి 20) డి
-నిర్వహణ: శివ మల్లాల
Comments
Please login to add a commentAdd a comment