స్క్రీన్‌ టెస్ట్‌ | Tollywood Movies Special Screen Test 22 March 2019 | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Fri, Mar 22 2019 3:11 AM | Last Updated on Thu, Aug 22 2019 9:35 AM

Tollywood Movies Special Screen Test 22 March 2019 - Sakshi

కొన్ని పాటలు పదే పదే పాడుకోవాలనేలా ఉంటాయి. ఎప్పటికీ వెంటాడుతుంటాయి. వాటినే ‘ఎవర్‌ గ్రీన్‌ సాంగ్స్‌’ అంటాం. ఆ పాత పాటలు రీమిక్స్‌ రూపంలో వస్తే.. అప్పటికే ఆ పాటలను ఎంజాయ్‌ చేసినవారికి ఆనందాన్నివ్వడంతో పాటు కొత్త తరానికి కూడా ఆ ట్యూన్స్‌ దగ్గరైపోతాయి. అలాంటి ఫేమస్‌ పాటలను కొన్నింటిని గుర్తుచేస్తూ ‘రీమిక్స్‌’పై ఈ వారం స్పెషల్‌ క్విజ్‌...

1. ‘రాముడు కాదు కృష్ణుడు’.. 1983లో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ జంటగా నటించిన చిత్రం. ఆ చిత్రంలోని ‘ఒక లైలా కోసం, తిరిగాను లోకం’ అనే సూపర్‌హిట్‌ సాంగ్‌ రీమిక్స్‌లో నాగచైతన్య నటించారు. ఆ పాటలోని మొదటి లైన్‌ను తన సినిమా పేరుగా పెట్టుకున్నారు చైతన్య. ఇందులో హీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) రకుల్‌ప్రీత్‌ సింగ్‌  బి) పూజా హెగ్డే  సి) నిధీ అగర్వాల్‌ డి) లావణ్యా త్రిపాఠి

2. ‘గ్యాంగ్‌లీడర్‌’ చిత్రంలోని ‘వానా వానా వెల్లువాయె, కొండాకోన తుళ్లిపోయె...’ అప్పట్లో పెద్ద హిట్‌. తండ్రి చిరంజీవి చేసిన ఆ పాట రీమిక్స్‌లో తమన్నాతో కలిసి ‘రచ్చ’ చిత్రంలో స్టెప్పులేశారు రామ్‌చరణ్‌. అప్పట్లో చిరంజీవి సరసన నటించిన హీరోయిన్‌ ఎవరో గుర్తున్నారా?
ఎ) వాణీ విశ్వనాథ్‌   బి) విజయశాంతి    సి) రాధిక     డి) రాధ

3. ఆత్రేయ స్వరపరచిన ‘ఓ బంగరు రంగుల చిలక పలకవే.. ఓ అల్లరి చూపుల రాజా ఏమని..’ పాట చలం హీరోగా నటించిన ‘తోటరాముడు’ చిత్రంలోనిది. కృష్ణ భగవాన్‌ హీరోగా నటించిన ఓ చిత్రంలో మరోసారి ఆ పాటను వినిపించాడు. ఆ సినిమాలో కృష్ణభగవాన్‌ సరసన హీరోయిన్‌గా నటించింది ఎవరో తెలుసా?
ఎ) సిమ్రాన్‌  బి) రమ్యకృష్ణ సి) నగ్మా డి) రవళి

4. ‘ఆర్య–2’ చిత్రంలోని ఐటెమ్‌ సాంగ్‌ ‘రింగ రింగ రింగ రింగ రింగ రింగారే’ పాట హిందీలో రీమిక్స్‌ నటించిన హీరో ఎవరో కనుక్కోండి?
ఎ) అజయ్‌ దేవ్‌గన్‌     బి) అక్షయ్‌ కుమార్‌    సి) షారుక్‌ ఖాన్‌     డి) సల్మాన్‌ ఖాన్‌

5. ‘గల గల పారుతున్న గోదారిలా...’ ఈ పాట మహేశ్‌బాబు నటించిన ‘పోకిరి’ చిత్రంలోనిది. కృష్ణ నటించిన ఓ సినిమాలోని పాట ఇది. అది ఏ సినిమానో తెలుసా?
ఎ) గౌరి      బి) సాక్షి     సి) పండంటి కాపురం    డి) అల్లూరి సీతారామరాజు

6. 1977లో యన్టీఆర్‌ నటించిన ‘యమగోల’ చిత్రంలోని సూపర్‌హిట్‌ సాంగ్‌ ‘ఓలమ్మి తిక్క రేగిందా, వొళ్లంతా తిమ్మిరెక్కిందా...’ను రీమిక్స్‌ చేసిన దర్శకుడెవరో చెప్పుకోండి?
ఎ) వీవీ వినాయక్‌      బి) శ్రీను వైట్ల        సి) ఎస్‌.ఎస్‌. రాజమౌళి     డి) కొరటాల శివ

7. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే..’ అంటూ సిల్వర్‌స్క్రీన్‌పై స్టెప్పులేసిన హీరో పవన్‌కళ్యాణ్‌. ఆయన సరసన నటించిన హీరోయిన్‌ ఎవరు?
ఎ) రాశి     బి) రేణూదేశాయ్‌    సి) శ్రియ     డి) భూమికా చావ్లా

8. ‘ఆకుచాటు పిందె తడిసే...’ అంటూ ‘వేటగాడు’ చిత్రంలో తన అందాలను ఆరబోశారు అందాల తార శ్రీదేవి. అదే ట్యూన్‌ను గుర్తు చేస్తూ ‘2002 వరకు చూడలేదే ఇంత సరుకు..’ అని జూనియర్‌ యన్టీఆర్‌ ‘అల్లరి రాముడు’ చిత్రంలో ఏ హీరోయిన్‌తో చిందేశారో గుర్తుందా?
ఎ) ఆర్తీ అగర్వాల్‌     బి) సదా     సి)  కీర్తీ చావ్లా    డి) అంకిత

9. కృష్ణ హీరోగా నటించిన ‘సింహాసనం’ చిత్రంలోని ‘ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ’ పాట ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఈ పాటను రీమిక్స్‌ చేసి తన సినిమాలో వాడుకున్న  హీరో ఎవరో తెలుసా?
ఎ) నితిన్‌      బి) నిఖిల్‌          సి) నవదీప్‌     డి) ‘అల్లరి’ నరేశ్‌

10. ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంలోని ‘మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల, మాపటేల కలుసుకో...’ అనే పాట చాలా ఫేమస్‌. ఆ పాటను తన ఆల్బమ్‌కి పేరుగా పెట్టుకున్న ప్రముఖ గాయని పేరేంటో కనుక్కోండి?
ఎ) చిత్ర     బి) స్మిత         సి) గీతామాధురి     డి) శ్రావణ భార్గవి

11. ‘దం^è వే మేనత్త కూతురా... వడ్లు దంచవే నా గుండెలదరా... దంచు దంచు బాగా దంచు’ అనే పాట ‘మంగమ్మ గారి మనవడు’ చిత్రంలోనిది. మళ్లీ ఆ పాటను హీరో నాని ‘రైడ్‌’ చిత్రంలో యూజ్‌ చేశారు. ‘రైడ్‌’ చిత్ర సంగీతదర్శకుడెవరో తెలుసా?
ఎ) హేమచంద్ర     బి) సాయికార్తీక్‌    సి) భీమ్స్‌         డి) శేఖర్‌ చంద్ర

12. నాగార్జున హీరోగా నటించిన ‘అల్లరి బుల్లోడు’ చిత్రంలోని ‘భీమవరం బుల్లోడా పాలు కావాలా మురిపాలు కావాలా...’ పాటను రీమిక్స్‌ చేసిన హీరో ఎవరో తెలుసా?
ఎ) నాని     బి) సుమంత్‌        సి) శర్వానంద్‌     డి) కల్యాణ్‌రామ్‌

13. ‘దేవదాసు’ చిత్రంలోని ‘పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో చలో..’ అనే పాట ఏ  హీరో కోసం మళ్లీ తయారయ్యిందో లె లుసా? (క్లూ: ‘ఆటాడుకుందాం రా’ అనే చిత్రం కోసం ఈ పాట మళ్లీ తయారయ్యింది)
ఎ) రానా     బి) నాగచైతన్య     సి) అఖిల్‌         డి) సుశాంత్‌

14. ‘విష్ణు’ చిత్రంతో హీరోగా మంచు విష్ణు కెరీర్‌ మొదలైంది. ఆ చిత్రంలో యన్టీఆర్, సావిత్రి నటించిన ‘రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ..’ పాటను రీమిక్స్‌ చేశారు విష్ణు. ఆ పాట ఏ సినిమాలోనిదో తెలుసా?
ఎ) మిస్సమ్మ     బి) మాయాబజారు        సి) దేవత డి)     గుండమ్మ కథ

15. ‘ము, ము, ము, ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా...’ పాట అక్కినేని హీరోగా నటించిన ‘అదృష్టవంతులు’ చిత్రంలోనిది. ఆ పాటను హీరో నాగార్జున  సినిమాలో వాడారు. నాగార్జున సరసన హీరోయిన్‌గా నటించిన ఆ భామ ఎవరో తెలుసా?
ఎ) అనుష్క     బి) మీనా         సి) ప్రియమణి     డి) మమతా మోహన్‌దాస్‌

16. ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు, నేను రోమియోగా మారినది లగాయతు..’ పాట 1993లో నాగార్జున, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో వచ్చింది. 2018లో ‘సవ్యసాచి’ సినిమాలో ఆ పాట రీమిక్స్‌కు నాగచైతన్య, నిధీ అగర్వాల్‌ కాలు కదిపారు. 1993లో సినిమాకు, 2018లో సినిమాకు సంగీత దర్శకుడు ఒక్కరే. ఎవరా మ్యూజిక్‌ డైరెక్టర్‌ తెలుసా?
ఎ) ఇళయరాజా     బి) యం.యం. కీరవాణి    సి) మణిశర్మ     డి) కోటి

17. కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ‘పచ్చనికాపురం’. ఈ చిత్రంలోని సూపర్‌హిట్‌ సాంగ్‌ ‘వెన్నెలైనా చీకటైనా...’ పాటను రీమిక్స్‌ చేసిన హీరో ఎవరో తెలుసా?
ఎ) అల్లు శిరీష్‌     బి) సునీల్‌     సి) సుధీర్‌బాబు     డి) తరుణ్‌

18. ‘గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట...’ పాట ‘ఖైదీ నెంబర్‌ 786’ చిత్రంలోనిది. ‘అందం ఇందోళం, అధరం తాంబూలం’ పాట ‘యమకింకరుడు’ చిత్రంలోనిది. ఈ రెండు పాటలు చిరంజీవి హీరోగా నటించిన సినిమాల్లోనివే. ఆ పాటలను రీమిక్స్‌ చేసిన హీరో ఎవరు?
ఎ) వరుణ్‌ తేజ్‌     బి) అల్లు అర్జున్‌    సి) సాయిధరమ్‌ తేజ్‌         డి) రామ్‌చరణ్‌

19. ‘ఇప్పటికింకా నా వయసు 26లే, ఇప్పటికిప్పుడు నీ కోసం పెళ్లికి తయ్యారే..’ పాట కృష్ణభగవాస్, రఘుబాబు హీరోలుగా నటించిన కామెడీ సినిమాలోనిది. ఆ సినిమాలో వాళ్లిద్దరూ ఏ హీరోయిన్‌ను ఉద్ధేశించి ఈ పాట పాడుకున్నారో తెలుసా?
ఎ) సౌందర్య     బి) రజని         సి) రంభ     డి) సంఘవి

20. ‘ఆర్య’ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ ‘ఆ అంటే అమలాపురం’ పెద్ద హిట్‌. ఆ పాటను హిందీ చిత్రం ‘మాగ్జిమమ్‌’ కోసం వాడారు. హిందీలో ఈ ఐటెమ్‌ సాంగ్‌కు కాలు కదిపిన భామ ఎవరు?
ఎ) కత్రినాౖ కెఫ్‌      బి) కరీనా కపూర్‌        సి) మలైకా అరోరా     డి) హజెల్‌ కీచ్‌

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!


సమాధానాలు
1) బి 2) బి 3) ఎ 4) డి 5) ఎ 6) సి 7) డి 8) ఎ 9) డి 10) బి 11) ఎ
  12) బి 13) డి 14)ఎ 15) డి 16) బి 17) సి 18) సి 19) సి 20) డి


నిర్వహణ: శివ మల్లాల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement