స్క్రీన్‌ టెస్ట్‌ | tollywood movies special screen test | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Fri, Mar 23 2018 4:22 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

tollywood movies special screen test - Sakshi

► బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌ తెలుగులో  ఒక ప్రముఖ హీరో సరసన నటిస్తోంది.  ఎవరా హీరో?
ఎ) ప్రభాస్‌ బి) మహేశ్‌బాబు   సి) ఎన్టీఆర్‌   డి) వరుణ్‌తేజ్‌

► ‘ఆపద్బాంధవుడు’  చిత్రంలో చిరంజీవి నాటకాలు వేస్తూ,  ఓ దేవుని పాత్రను పోషించాడు?  అది ఏ దేవుని పాత్రో తెలుసా?
ఎ) రాముడు  బి) కృష్ణుడు    సి) శివుడు     డి) వెంకటేశ్వరస్వామి

► అల్లు అర్జున్‌ నటిస్తున్న సినిమా పేరు ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఈ సినిమాలో ఆయన పక్కన నటిస్తున్న హీరోయిన్‌ ఎవరు?
ఎ) రాశీ ఖన్నా     బి) రకుల్‌ప్రీత్‌  సి) అనూ ఇమ్మాన్యుయేల్‌   డి) పూజా హెగ్డే

► ‘కుమారి 21 ఎఫ్‌’ చిత్రం ద్వారా హెబ్బాపటేల్‌ ఫేమస్‌ అయ్యారు. కొందరు అదే తనకు మొదటి సినిమా అనుకుంటారు. అంతకుముందే హెబ్బా ఒక మంచి సినిమాలో నటించింది. ఆ సినిమా పేరేంటి?
ఎ) అలా ఎలా   బి) అనగనగా ఓ రాత్రి    సి) అనగనగా ఓ ఊరిలో  డి) అనుకోకుండా

► రామ్‌చరణ్‌ నటిస్తున్న ‘రంగస్థలం’ చిత్రం ఏ కాలానికి సంబంధించిన కథో తెలుసా?
ఎ) 1960    బి) 1985  సి) 1990    డి) 1970

► ‘నిన్ను కోరి’ చిత్రం ద్వారా పేరు తెచ్చుకున్న దర్శకుడు శివ నిర్వాణ తాజా చిత్రంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. మరి చైతన్య ప్రక్కన హీరోయిన్‌ ఎవరో తెలుసా?  
ఎ) సమంత  బి) కాజల్‌ అగర్వాల్‌  సి) లావణ్యత్రిపాఠి డి) అనుపమ పరమేశ్వరన్‌

► పూజా హెగ్డే సరసన  తెలుగులో నటించిన మొదటి హీరో ఎవరు?
ఎ) అల్లు అర్జున్‌   బి) సాయిధరమ్‌ తేజ్‌  సి) వరుణ్‌ తేజ్‌  డి) అల్లు శిరీష్‌

► హీరో రామ్‌కు సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఆ సంస్థ పేరు స్రవంతి మూవీస్‌. కానీ ఆయన హీరోగా పరిచయమైన నిర్మాణ సంస్థ పేరేంటి?
ఎ) శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌  బి) 14 రీల్స్‌   సి) బొమ్మరిల్లు డి) సురేశ్‌ ప్రొడక్షన్స్‌

► ‘అంతం, రాత్రి’   సినిమాల ద్వారా  దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఒక నూతన సంగీత దర్శకుడిని తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఎవరతను?
ఎ) యం.యం.కీరవాణి   బి) మణిశర్మ   సి) రమణ గోగుల  డి) సందీప్‌ చౌతా

► దర్శకునిగా  ఎన్నో సూపర్‌ హిట్లు ఇచ్చిన యస్‌.వి.కృష్ణారెడ్డి ఓ పండగ పేరుతో విడుదలైన సినిమా ద్వారా హీరోగా మారారు.  ఆ సినిమా పేరేంటి?
ఎ) విజయదశమి  బి) దీపావళి  సి) సంక్రాంతి డి) ఉగాది

► నటుడు ఉదయ్‌ కిరణ్‌ని సిల్వర్‌ స్క్రీన్‌కి పరిచయం చేసిన దర్శకుడెవరో తెలుసా?
ఎ) వీవీ వినాయక్‌   బి) విజయ్‌ భాస్కర్‌  సి) తేజ   డి) త్రివిక్రమ్‌

► ‘జతకలిసే..  జతకలిసే జగములు  రెండు జతకలిసే’  పాట రచయిత ఎవరు?
ఎ) సిరివెన్నెల సీతారామశాస్త్రి  బి) శ్రీమణి  సి) రామజోగయ్య శాస్త్రి  డి) అనంత శ్రీరామ్‌

► ‘మనం పెరిగే కొద్దీ మన చుట్టూ ఉన్న మనుషులు మారొచ్చు.. ప్రపంచం మారొచ్చు కానీ ఒక్కటి మాత్రం ఎప్పటికీ మారదు శైలు, నేను నిన్ను చూసిన ప్రతిసారి ప్రేమలో పడటం’ అనే డైలాగ్‌ ‘నేను శైలజ’ సినిమాలోనిది. ఈ సినిమా స్టోరీ రైటర్‌ ఎవరో కనుక్కోండి?
ఎ) సంపత్‌ నంది  బి) కోన వెంకట్‌   సి) కిషోర్‌ తిరుమల  డి) పరుచూరి బ్రదర్స్‌

► ‘వాల్‌పోస్టర్‌’ అనే సినిమా బ్యానర్‌ను ప్రారంభించిన ప్రముఖ హీరో ఎవరు?
ఎ) కల్యాణ్‌రామ్‌  బి) నాని  సి) మంచు మనోజ్‌  డి) ‘అల్లరి’ నరేశ్‌

► ట్విట్టర్‌ అనే సామాజిక మాధ్యమంలో దర్శకుడు ఆర్జీవి చాలా ఫేమస్‌. ఆయన ట్విట్టర్‌ ఐడీ ఏంటో తెలుసా?
ఎ) జూమ్‌ఇన్‌ ఆర్జీవి   బి) ఐయామ్‌ ఆర్జీవి  సి) దిస్‌ ఈజ్‌ ఆర్జీవి    డి) ఆర్జీవి జూమ్‌ఇన్‌

► నటి కీర్తీ సురేశ్‌ అమ్మగారు మేనక కూడా తెలుగులో నటించారు. ఆమె నటించిన సినిమాలో ఇప్పటి స్టార్‌ హీరో నటì ంచారు. ఆ హీరో ఎవరో తెలుసా?
ఎ) బాలకృష్ణ    బి) చిరంజీవి  సి) నాగార్జున   డి) వెంకటేశ్‌

► ఈ ఫొటోలోని చిన్నారి ఇప్పుడు ప్రముఖ హీరోయిన్‌. ఆమె ఎవరు?
ఎ) హన్సిక  బి) రకుల్‌ప్రీత్‌సింగ్‌  సి) సమంత  డి) తాప్సీ
 

► ఎన్టీఆర్,  జయసుధ నటించిన  ఈ స్టిల్‌ ఏ సినిమాలోనిది?
ఎ) మనుషులంతా ఒక్కటే  బి) యుగపురుషుడు  సి) మహాపురుషుడు డి) మేజర్‌ చంద్రకాంత్‌

► తెలుగులో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) రాధ    బి) రాధిక  సి) విజయశాంతి    డి) సుహాసిని

► ‘బాహుబలి’లో రమ్యకృష్ణ పాత్రకు మొదట ఓ ప్రముఖ హీరోయిన్‌ను అనుకొన్నారు. కొన్ని కారణాల వల్ల ఆమె ఆ పాత్రను చేయలేకపోయారు. ఎవరా హీరోయిన్‌?
ఎ) టబూ బి) శ్రీదేవి సి) రేఖ డి) మాధురీ దీక్షిత్‌

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...   ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!


సమాధానాలు
1) ఎ 2) సి  3) సి 4) ఎ5) బి 6) ఎ 7) సి 8) సి  9) బి  10) డి 
11) సి 12) సి 13) సి 14) బి15) డి 16) బి  17) ఎ  18) సి 19) సి 20) బి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement