1. 1999లో విడుదలైన ‘నీ కోసం’ సినిమాకి ఆ చిత్రసంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌తో కలసి పనిచేసిన ఇప్పటి ప్రఖ్యాత సంగీత దర్శకుడెవరో తెలుసా?
ఎ) అనూప్ రూబెన్స్ బి) యస్‌యస్ తమన్ సి) దేవిశ్రీ ప్రసాద్ డి) మణిశర్మ
2. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘బిజినెస్‌మేన్’లో ‘సారొత్తారు... రొత్తా్తరు..’ పాటలో కనిపించే హీరోయిన్ ఎవరు?
ఎ) తమన్నా భాటియా బి) కాజల్ అగర్వాల్ సి) దిశా పాట్నీ డి) చార్మీ కౌర్
3. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’చిత్ర దర్శకుడు గౌతమ్ మీనన్. చాలా తక్కువ సమయం ఉండటంతో అందులోని ఏడు పాటలను ఏడు రోజుల్లో రాయాలని ఒక రచయితకు చెప్పారు గౌతమ్. ఎవరా రచయిత?
ఎ) అనంత శ్రీరామ్ బి) శ్రీమణి సి) ‘ సిరివెన్నెల’ సీతారామశాస్త్రి డి) వనమాలి
4. మహేశ్ బాబు, ప్రభాస్‌లను హీరోలుగా పరిచయం చేసిన దర్శకుడెవరో తెలుసా?
ఎ) కె. రాఘవేంద్రరావు బి) బి. గోపాల్ సి) జయంత్.సి. పరాన్జీ డి) శ్రీను వైట్ల
5. గుంటూరు జిల్లా చిర్రావురులో పుట్టిన గొప్ప నటి ఎవరో తెలుసా?
ఎ) సావిత్రి బి) జమున సి) శారద డి) వాణిశ్రీ
6. ‘క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్, దిల్’ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన దర్శకుడు ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు. ఆయనెవరు?
ఎ) ఎస్.ఎస్. రాజమౌళి బి) సుకుమార్ సి) బోయపాటి శ్రీను డి) కొరటాల శివ
7. 1985వ సంవత్సరంలో ‘నవ్ జవాన్’ అనే చిత్రంలో దేవానంద్ కూతురిగా నటించిందామె. అప్పుడామెకు 14 ఏళ్లు. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో చాలా బిజీగా నటించింది. 2011లో ఆమెకు కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ఇచ్చింది. ఎవరా హీరోయిన్?
ఎ) రేఖ బి) హేమమాలిని సి) టబు డి) మాధురీ దీక్షిత్
8. భారత సినీ ప్రపంచంలో యల్.వి. ప్రసాద్ పేరు తెలియనివారుండరు. ఆయన ఇంటిపేరే తెలుగు చిత్రసీమలో నాటి తరం నుంచి నేటి తరం నటీనటులు ఉన్న మరో పేరున్న కుటుంబానికి ఉంది.
ఆయన ఇంటి పేరేంటి?
ఎ) దగ్గుబాటి బి) నందమూరి సి) కొణిదెల డి) అక్కినేని
9. దర్శకుడు గౌతమ్ మీనన్ తీసిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన తెలుగు హీరో ఎవరో తెలుసా?
ఎ) సందీప్ కిషన్ బి) వరుణ్ సందేశ్ సి) సిద్ధార్థ్ డి) నాని
10. కంటిన్యూస్‌గా మూడు నాలుగు సంక్రాంతి పండగలకు సూపర్ హిట్ మూవీస్ ఇచ్చిన ఓ నిర్మాతను ‘సంక్రాంతి రాజు’ అనేవారు. ఆ నిర్మాత ఎవరో తెలుసా?
ఎ) కె.యల్.యన్ రాజు బి) యం.యస్ రాజు సి) ‘దిల్’ రాజు డి) జీవీజీ రాజు
11. బెంగుళూరులోని కళాక్షేత్ర అనే నాటక సమాజం నుంచి వచ్చిన ఈయన ప్రముఖ నటుడు. నెలకు 300 రూపాయల జీతంతో స్టేజి నాటకాలాడేవారు. తర్వాత దాదాపు 2000 వీధి నాటకాల్లో నటించారు. ఎవరా నటుడు కనుక్కోండి?
ఎ) ప్రకాశ్ రాజ్ బి) జయప్రకాశ్ రెడ్డి సి) గిరీశ్ కర్నాడ్ డి) బొమన్ ఇరానీ
12. 2000వ సంవత్సరంలో బాలీవుడ్ సింగర్ ఫాల్గుని పాతక్ రూపొందించిన వీడియో ఆల్బమ్‌లో ‘మేరి చూనర్ ఉద్ ఉద్ జాయో..’ అనే పాటలో నటించిన హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి?
ఎ) సిమ్రాన్ బి) త్రిష కృష్ణన్ సి) శ్రియా సరన్ డి) సదా
13. బ్యాడ్మింటన్‌లో మన దేశానికి ఎంతో గౌరవం తీసుకొచ్చిన పుల్లెల గోపీచంద్‌కు పార్టనర్‌గా ఆట ఆడిన తెలుగు హీరో ఎవరో తెలుసా?
ఎ) తరుణ్ బి) ప్రిన్స్ సి) సుధీర్ బాబు డి) సుమంత్
14. హీరో నాని ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నటిస్తున్నారు.ఈ సినిమాలో ఏ హీరోతో పాటు నాని నటిస్తున్నారో తెలుసా?
ఎ) వెంకటేశ్ బి) నాగార్జున సి) బాలకృష్ణ డి) చిరంజీవి
15. మొదటి సినిమాతోనే ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు సాధించడంతో పాటు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు కూడా అందుకున్న దర్శకుడెవరో తెలుసా?
ఎ) నీలకంఠ బి) శేఖర్ కమ్ముల సి) దేవా కట్టా డి) ఇంద్రగంటి మోహనకృష్ణ
16. మహేశ్‌బాబు నటì ంచనున్న తర్వాతి సినిమాలో హీరోయిన్ ఎవరు?
ఎ) పూజా హెగ్డే బి) కీర్తీ సురేశ్ సి) అనూ ఇమ్మాన్యుయేల్ డి) రాశీ ఖన్నా
17. నటుడు ఆది పినిశెట్టి ‘యూ టర్న్’ సినిమాలో ఓ పెద్ద హీరోయిన్ సరసన నటిస్తున్నారు. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?
ఎ) రకుల్ ప్రీత్ సింగ్ బి) సమంత సి) అనుపమా పరమేశ్వరన్ డి) కృతీ సనన్
18. సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ బాలీవుడ్ రీమేక్‌లోనటిస్తున్న హీరో ఎవరు?
ఎ) షాహిద్ కపూర్ బి) అర్జున్ కపూర్ సి) రణ్‌వీర్ సింగ్ డి) రణ్‌బీర్ కపూర్
19. పై ఫొటోలో నిచిన్నారిని గుర్తుపట్టండి?
ఎ) శ్రుతీహాసన్ బి) చార్మి సి) అనూ ఇమ్మాన్యుయేల్ డి) అనుపమా పరమేశ్వరన్
20. నాగార్జున, అమల నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో కనుక్కోండి?
ఎ) అంతం బి) శివ సి) వారసుడు డి) కిల్లర్
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు
1) సి 2 బి 3) ఎ 4) ఎ5) ఎ 6) బి 7) సి 8) డి 9) ఎ 10) బి
11) ఎ12) బి 13) సి 14) బి 15) డి 16) ఎ 17) బి 18) ఎ 19) బి 20) బి
నిర్వహణ: శివ మల్లాల
Comments
Please login to add a commentAdd a comment