2018 పలు విజయాలు, ఘన విజయాలతో పాటు పలువురు తారలను ఒకింటివాళ్లను కూడా చేసింది. తమ టాలెంట్‌ను నిరూపించుకున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎందరో ఉన్నారు. ఈ వారం ఇయర్ ఎండింగ్ స్పెషల్ క్విజ్....
1. 2018లో ఈ ప్రముఖ హీరో సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. ఎవరా హీరో కనుక్కోండి?
ఎ) మహేశ్‌బాబు బి) రామ్‌చరణ్ సి) ప్రభాస్ డి) యన్టీఆర్
2. 2018లో 200 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా?
ఎ) భరత్ అనే నేను బి) రంగస్థలం సి) గీత గోవిందం డి) అరవింద సమేత వీర రాఘవ
3. ఈ సంవత్సరం విడుదలైన ‘గీత గోవిందం’ చిత్రంలోని టాప్ సాంగ్ ‘ఇంకేం ఇంకేం.. ఇంకేం కావాలే...’ అనే పాట పాడిన గాయకుడెవరో తెలుసా?
ఎ) సిథ్ శ్రీరామ్ బి) కైలాష్ ఖేర్ సి) యాసిన్ నజార్ డి) శ్రీరామచంద్ర
4. ఈ సంవత్సరం ఎక్కువ తెలుగు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన సంగీత దర్శకుడెవరో తెలుసా?
ఎ) దేవిశ్రీ ప్రసాద్ బి) యస్.యస్. తమన్ సి) యం.యం. కీరవాణి డి) మిక్కీ జే మేయర్
5. ‘ఆర్‌ఎక్స్–100’ చిత్రంతో హీరోగా ప్రయాణాన్ని మొదలు పెట్టిన నటుని పేరేంటి?
ఎ) తేజస్ కంచర్ల బి) కార్తి్తకేయ సి) కల్యాణ్ దేవ్ డి) వైష్ణవ్ తేజ్
6. ఈ సంవత్సరం మూడు తెలుగు హిట్ సినిమాల్లో నటించిన నటి ఎవరో కనిపెట్టండి?
ఎ) సమంత బి) లావణ్యా త్రిపాఠి సి) రాశీ ఖన్నా డి) త్రిష
7. ఓ అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ 2018లో దర్శకునిగా మారారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో అందరి మనసులూ దోచుకున్నారు. ఆయనెవరు?
ఎ) అజయ్ భూపతి బి) రాహుల్ సంకృత్యాన్ సి) వెంకటేశ్ మహా డి) శశికిరణ్ తిక్క
8. 2018లో ఓ కన్నడ నటుడు తెలుగు ప్రేక్షకులను తొలిసారి పలకరించారు. ఆ సినిమా పేరు ‘కె.జీ.ఎఫ్’. ఈ కన్నడ నటుని పేరేంటి?
ఎ) గణేశ్ బి) యష్ సి) పునీత్ రాజ్‌కుమార్ డి) దునియా విజయ్
9. 2018లో అకాల మరణం పొందిన కన్నడ రెబెల్‌స్టార్ ఎవరో తెలుసా?
ఎ) రాజ్‌కుమార్ బి) విష్ణువర్థన్ సి) అంబరీష్ డి) దృవ్ శర్మ
10. నటునిగా అంతకుముందు చాలా సినిమాల్లో నటించారు. 2018లో ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాతో సోలో హీరోగా వచ్చిన ఆ నటుని పేరేంటి?
ఎ) సత్యదేవ్ బి) శ్రీనివాసరెడ్డి సి) చైతన్య కృష్ణ డి) సత్యం రాజేశ్
11. ఈ ఏడాది విడుదలైన ‘మహానటి’తో అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకున్న దర్శకుడెవరు?
ఎ) నాగ్‌అశ్విన్ బి) వెంకీ కుడుముల సి) పరశురాం డి) విక్రమ్.కె.కుమార్
12. రజనీకాంత్, శంకర్‌ల విజువల్ వండర్ ‘2.ఓ’. ఆ విజువల్ వండర్‌కు పనిచేసిన కెమెరామెన్ ఎవరో తెలుసుకుందామా?
ఎ) పి.సి. శ్రీరామ్ బి) కబీర్ లాల్ సి) నిరవ్ షా డి) కె.కె. సెంథిల్‌కుమార్
13. ఈ ఏడాది మూడు చిత్రాల ద్వారా ప్రేక్షకులకు కనిపించిన హీరో ఎవరో తెలుసా? (అందులో ఓ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమలోకి ఎంటరయ్యారా హీరో)
ఎ) నాని బి) విజయ్ దేవరకొండ సి) నాగచైతన్య డి) అఖిల్
14. ‘కలర్స్’ స్వాతి ఈ ఏడాది వివాహం చేసుకుంది. అతని పేరు వికాస్ వాసు. మరి స్వాతి భర్త ఏం చేస్తారో తెలుసా?
ఎ) డాక్టర్ బి) యాక్టర్ సి) బిజినెస్‌మేన్ డి) పైలెట్
15. ఈ సంవత్సరం బాలీవుడ్ నటీనటులు దీపికా, రణ్‌వీర్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారు ఏ తేదీన వివాహం చేసుకున్నారో చెప్పుక్కోండి? (క్రింద ఇచ్చిన తేదీల్లో ఈ హీరోయిన్ మ్యారేజ్ డేట్‌తోపాటు ఈ ఏడాది పెళ్లయిన వేరే హీరోయిన్లవీ ఉన్నాయి)
ఎ) డిసెంబర్ 1 బి) డిసెంబర్ 13 సి) నవంబర్ 14 డి) ఆగస్టు 30
16. బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా ఈ ఏడాది అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహమాడారు. ఆమెకంటే వయసులో అతను ఎంత చిన్నవాడో తెలుసా?
ఎ) ఏడేళ్లు బి) పదేళ్లు సి) రెండేళ్లు డి) ఐదేళ్లు
17. ఈ ఏడాది ఒకే హీరోతో రెండు విజయాలను సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ఏది?
ఎ) గీతా ఆర్ట్స్ బి) వైజయంతీ మూవీస్ సి) మైత్రీ మూవీ మేకర్స్ డి) సురేశ్ ప్రొడక్షన్స్
18. ‘రంగస్థలం’ చిత్రంలోని ‘జిల్ జిల్ జిల్ జిల్ జిగేల్ రాణి...’ అనే ఐటమ్ సాంగ్‌లో మొదటిసారి నటించిన టాప్ హీరోయిన్ ఎవరు?
ఎ) తమన్నా బి) కాజల్ అగర్వాల్ సి) పూజా హెగ్డే డి) కియారా అద్వానీ
19. ‘దారి చూడు దుమ్ము చూడూ మామా...’ అనే పాటతో సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయ్యారీయన. 2018లో సిల్వర్ స్క్రీన్‌పై తన రచనతో, యాసతో వెలుగులోకొచ్చిన ఈ రాయలసీమ రైటర్ ఎవరో కనుక్కోండి?
ఎ) మేర్లపాక గాంధీ బి) పెంచల్ దాస్ సి) జి.ఆర్ మహర్షి డి) ప్రసన్నకుమార్ బెజవాడ
20. 2018లో తెలుగు తెరపై కనిపించని టాప్ హీరోయిన్ ఎవరో కనుక్కోండి?
ఎ) సాయిపల్లవి బి) నయనతార సి) రకుల్ ప్రీత్ సింగ్ డి) అనుపమా పరమేశ్వరన్
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు
1) సి 2) బి 3) ఎ 4) బి 5) బి 6) ఎ 7) సి 8) బి 9) సి 10) ఎ 11) ఎ
12) సి 13) బి 14) డి 15) సి 16) బి 17) ఎ 18) సి 19) బి 20) సి
నిర్వహణ: శివ మల్లాల
Comments
Please login to add a commentAdd a comment