Anupama Paramesvan
-
రౌడీ బాయ్స్ దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి ప్రత్యేక ఇంటర్వ్యూ
-
స్క్రీన్ టెస్ట్
2018 పలు విజయాలు, ఘన విజయాలతో పాటు పలువురు తారలను ఒకింటివాళ్లను కూడా చేసింది. తమ టాలెంట్‌ను నిరూపించుకున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎందరో ఉన్నారు. ఈ వారం ఇయర్ ఎండింగ్ స్పెషల్ క్విజ్.... 1. 2018లో ఈ ప్రముఖ హీరో సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. ఎవరా హీరో కనుక్కోండి? ఎ) మహేశ్‌బాబు బి) రామ్‌చరణ్ సి) ప్రభాస్ డి) యన్టీఆర్ 2. 2018లో 200 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా? ఎ) భరత్ అనే నేను బి) రంగస్థలం సి) గీత గోవిందం డి) అరవింద సమేత వీర రాఘవ 3. ఈ సంవత్సరం విడుదలైన ‘గీత గోవిందం’ చిత్రంలోని టాప్ సాంగ్ ‘ఇంకేం ఇంకేం.. ఇంకేం కావాలే...’ అనే పాట పాడిన గాయకుడెవరో తెలుసా? ఎ) సిథ్ శ్రీరామ్ బి) కైలాష్ ఖేర్ సి) యాసిన్ నజార్ డి) శ్రీరామచంద్ర 4. ఈ సంవత్సరం ఎక్కువ తెలుగు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) దేవిశ్రీ ప్రసాద్ బి) యస్.యస్. తమన్ సి) యం.యం. కీరవాణి డి) మిక్కీ జే మేయర్ 5. ‘ఆర్ఎక్స్–100’ చిత్రంతో హీరోగా ప్రయాణాన్ని మొదలు పెట్టిన నటుని పేరేంటి? ఎ) తేజస్ కంచర్ల బి) కార్తి్తకేయ సి) కల్యాణ్ దేవ్ డి) వైష్ణవ్ తేజ్ 6. ఈ సంవత్సరం మూడు తెలుగు హిట్ సినిమాల్లో నటించిన నటి ఎవరో కనిపెట్టండి? ఎ) సమంత బి) లావణ్యా త్రిపాఠి సి) రాశీ ఖన్నా డి) త్రిష 7. ఓ అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ 2018లో దర్శకునిగా మారారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో అందరి మనసులూ దోచుకున్నారు. ఆయనెవరు? ఎ) అజయ్ భూపతి బి) రాహుల్ సంకృత్యాన్ సి) వెంకటేశ్ మహా డి) శశికిరణ్ తిక్క 8. 2018లో ఓ కన్నడ నటుడు తెలుగు ప్రేక్షకులను తొలిసారి పలకరించారు. ఆ సినిమా పేరు ‘కె.జీ.ఎఫ్’. ఈ కన్నడ నటుని పేరేంటి? ఎ) గణేశ్ బి) యష్ సి) పునీత్ రాజ్‌కుమార్ డి) దునియా విజయ్ 9. 2018లో అకాల మరణం పొందిన కన్నడ రెబెల్‌స్టార్ ఎవరో తెలుసా? ఎ) రాజ్‌కుమార్ బి) విష్ణువర్థన్ సి) అంబరీష్ డి) దృవ్ శర్మ 10. నటునిగా అంతకుముందు చాలా సినిమాల్లో నటించారు. 2018లో ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాతో సోలో హీరోగా వచ్చిన ఆ నటుని పేరేంటి? ఎ) సత్యదేవ్ బి) శ్రీనివాసరెడ్డి సి) చైతన్య కృష్ణ డి) సత్యం రాజేశ్ 11. ఈ ఏడాది విడుదలైన ‘మహానటి’తో అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకున్న దర్శకుడెవరు? ఎ) నాగ్అశ్విన్ బి) వెంకీ కుడుముల సి) పరశురాం డి) విక్రమ్.కె.కుమార్ 12. రజనీకాంత్, శంకర్ల విజువల్ వండర్ ‘2.ఓ’. ఆ విజువల్ వండర్‌కు పనిచేసిన కెమెరామెన్ ఎవరో తెలుసుకుందామా? ఎ) పి.సి. శ్రీరామ్ బి) కబీర్ లాల్ సి) నిరవ్ షా డి) కె.కె. సెంథిల్‌కుమార్ 13. ఈ ఏడాది మూడు చిత్రాల ద్వారా ప్రేక్షకులకు కనిపించిన హీరో ఎవరో తెలుసా? (అందులో ఓ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమలోకి ఎంటరయ్యారా హీరో) ఎ) నాని బి) విజయ్ దేవరకొండ సి) నాగచైతన్య డి) అఖిల్ 14. ‘కలర్స్’ స్వాతి ఈ ఏడాది వివాహం చేసుకుంది. అతని పేరు వికాస్ వాసు. మరి స్వాతి భర్త ఏం చేస్తారో తెలుసా? ఎ) డాక్టర్ బి) యాక్టర్ సి) బిజినెస్‌మేన్ డి) పైలెట్ 15. ఈ సంవత్సరం బాలీవుడ్ నటీనటులు దీపికా, రణ్వీర్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారు ఏ తేదీన వివాహం చేసుకున్నారో చెప్పుక్కోండి? (క్రింద ఇచ్చిన తేదీల్లో ఈ హీరోయిన్ మ్యారేజ్ డేట్‌తోపాటు ఈ ఏడాది పెళ్లయిన వేరే హీరోయిన్లవీ ఉన్నాయి) ఎ) డిసెంబర్ 1 బి) డిసెంబర్ 13 సి) నవంబర్ 14 డి) ఆగస్టు 30 16. బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా ఈ ఏడాది అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహమాడారు. ఆమెకంటే వయసులో అతను ఎంత చిన్నవాడో తెలుసా? ఎ) ఏడేళ్లు బి) పదేళ్లు సి) రెండేళ్లు డి) ఐదేళ్లు 17. ఈ ఏడాది ఒకే హీరోతో రెండు విజయాలను సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ఏది? ఎ) గీతా ఆర్ట్స్ బి) వైజయంతీ మూవీస్ సి) మైత్రీ మూవీ మేకర్స్ డి) సురేశ్ ప్రొడక్షన్స్ 18. ‘రంగస్థలం’ చిత్రంలోని ‘జిల్ జిల్ జిల్ జిల్ జిగేల్ రాణి...’ అనే ఐటమ్ సాంగ్‌లో మొదటిసారి నటించిన టాప్ హీరోయిన్ ఎవరు? ఎ) తమన్నా బి) కాజల్ అగర్వాల్ సి) పూజా హెగ్డే డి) కియారా అద్వానీ 19. ‘దారి చూడు దుమ్ము చూడూ మామా...’ అనే పాటతో సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయ్యారీయన. 2018లో సిల్వర్ స్క్రీన్‌పై తన రచనతో, యాసతో వెలుగులోకొచ్చిన ఈ రాయలసీమ రైటర్ ఎవరో కనుక్కోండి? ఎ) మేర్లపాక గాంధీ బి) పెంచల్ దాస్ సి) జి.ఆర్ మహర్షి డి) ప్రసన్నకుమార్ బెజవాడ 20. 2018లో తెలుగు తెరపై కనిపించని టాప్ హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) సాయిపల్లవి బి) నయనతార సి) రకుల్ ప్రీత్ సింగ్ డి) అనుపమా పరమేశ్వరన్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) బి 3) ఎ 4) బి 5) బి 6) ఎ 7) సి 8) బి 9) సి 10) ఎ 11) ఎ 12) సి 13) బి 14) డి 15) సి 16) బి 17) ఎ 18) సి 19) బి 20) సి నిర్వహణ: శివ మల్లాల -
సూపర్ చార్జ్డ్!
ఎనర్జీకి ఎగ్జామ్‌పుల్‌గా ఉంటారు హీరో రామ్. ఆ ఎనర్జీతో సిల్వర్ర్ స్కీన్‌పై మరోసారి మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నారాయన. ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మార్చి 8న స్టార్ట్ కానుంది. ‘‘నా నెక్ట్స్ సినిమా మార్చి 8న స్టార్ట్ కానుంది. సూపర్ చార్జ్డ్’’ అని పేర్కొన్నారు హీరో రామ్. బ్యూటీఫుల్ లవ్‌స్టోరీగా రూపొందనున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ అని సమాచారం. -
ఇంత గ్రాండ్‌గా జరుపుకోవడం ఇదే ఫస్ట్ టైమ్
‘‘నాకు అమ్మాయిలు లేరు. అనుపమా పరమేశ్వరన్ నాకు అమ్మాయిలాంటిది. తను మంచి నటి. అందరితో కలుపుగోలుగా ఉంటుంది. తన పుట్టినరోజుని అందరి సమక్షంలో సెలబ్రేట్ చేయడం ఆనందంగా ఉంది. ఇదే రోజు మా అబ్బాయి వల్లభ పుట్టినరోజు కావడం విశేషం’’ అన్నారు నిర్మాత కె.ఎస్. రామారావు. సాయిధరమ్‌తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు ఓ చిత్రం నిర్మిస్తున్నారు. చిత్రకథానాయిక అనుపమ పుట్టినరోజును హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. కె.ఎస్. రామారావు మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథా చిత్రమిది. సోమవారం ప్రారంభమైన కొత్త షెడ్యూల్లో సాయిధరమ్‌తేజ్ జాయిన్ అయ్యారు. ఏప్రిల్ 20 వరకు ఈ షెడ్యూల్ నాన్‌స్టాప్‌గా జరుగుతుంది’’ అన్నారు. ‘‘ఇంత గ్రాండ్‌గా నా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడం ఇదే మొదటిసారి. కె.ఎస్.రామారావుగారు, సాయిధరమ్ సహా యూనిట్‌కు థ్యాంక్స్’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్. సాయిధరమ్‌తేజ్, దర్శకుడు కరుణాకరన్, సహ నిర్మాత కె.ఎ.వల్లభ, సినిమాటోగ్రాఫర్ అండ్రూస్, మాటల రచయిత ‘డార్లింగ్’ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
అటు లవ్... ఇటు ఫైట్
సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కరుణాకరన్ దర్శకత్వంలో కేయస్ రామారావు ఓ చిత్రం నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. చక్కని ప్రేమకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఒకవైపు ఈ ప్రేమకథలో నటిస్తోన్న సాయిధరమ్ మరోవైపు ఓ యాక్షన్ మూవీలో నటించడం విశేషం. సాయిధరమ్ తేజ్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో ఈ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకి ఫస్ట్ ‘ఇంటెలిజెంట్’ అని టైటిల్ అనుకున్నారనే వార్త వినిపించింది. ఇప్పుడు ‘ధర్మాభాయ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ చిత్రం కోసం యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారట. ఇందులో తేజ్ సాఫ్ట్వేర్ కుర్రాడిగా నటిస్తున్నారట. అటు లవ్.. ఇటు యాక్షన్ మూవీస్‌లో నటిస్తూ సాయిధరమ్ ఫుల్ బిజీ. -
హీరోయినా? హెడ్ మాస్టారా? అన్ని క్వశ్చన్స్ ఏంట్రా బాబు!
‘నీ ఫ్రెండ్స్ దగ్గర నీకు నచ్చని విషయం ఏంటి?’– రామ్‌ని అనుపమ అడిగింది. వెంటనే ఆన్సర్ చెప్పాడు. ‘మరి, నచ్చింది?’– నెక్ట్స్ క్వశ్చన్! మళ్లీ ఆన్సర్ చెప్పాడు. ‘ఫ్రెండ్‌కి, బెస్ట్ ఫ్రెండ్‌కి తేడా ఏంటి?’– వన్ మోర్ క్వశ్చన్! ఈసారీ ఆన్సర్ చెప్పాడు. ‘మరి, బెస్ట్ ఫ్రెండ్‌కి, లవర్‌కి?’– మళ్లీ ఇంకో క్వశ్చన్, ఆన్సర్ కామన్! అక్కడితో అనుపమ ఆగలేదు. ‘అయ్య బాబోయ్... అనుపమా పరమేశ్వరన్ హీరోయినా? హెడ్ మాస్టారా? అన్ని క్వశ్చన్స్ ఏంట్రా బాబు’ అని అబ్బాయిలంతా అనుకునేలా ఇంకొక క్వశ్చన్ ‘నిన్నెవరైనా లవ్ చేస్తే... తన దగ్గర్నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేసేదేంటి?’ అని అడిగింది! అప్పటివరకూ కూల్ ఆన్సర్స్ ఇచ్చిన రామ్, ఈసారి చిన్న ఝలక్ ఇచ్చాడు. ‘ఏడవడం’ అని చెప్పాడు. లవ్ చేసిన అమ్మాయిని ఏడిపించాలని ఎవరైనా అనుకుంటారా? కానీ, రామ్ ఫీలింగ్ మాత్రం అదే! అప్పుడు అనుపమ ఏం అడిగిందో తెలుసా? ‘నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా?’ అని! ‘మనకింకా ఆ అదృష్టం కలగలేదు’ అని రామ్ చెప్పగానే... ‘డోంట్ వర్రీ. తొందరలోనే ఏడుస్తావ్!’ అని అనుపమ రిప్లై ఇచ్చింది. ఓహ్... లవ్‌ని ఇలా కూడా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చా? అనుకున్నారు ఆడియన్స్! ఇదంతా ‘ఉన్నది ఒకటే జిందగీ’ ట్రైలర్లో మేటర్. సిన్మా కాన్సెప్ట్ కన్వే చేసేలా ట్రైలర్ కట్ చేశారు. అందులో డైలాగ్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటు న్నాయి. రామ్, అనుపమ, లావణ్యా త్రిపాఠి ముఖ్య తారలుగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో కృష్ణచైతన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ కానుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచచిన పాటల్ని, ట్రైలర్‌ని శుక్రవారం విడుదల చేశారు. ‘‘సినిమా ఇండస్ట్రీకి ఎందుకొచ్చానో ఈ సినిమాతో అర్థమైంది’’ అన్నారు రామ్. ‘‘దర్శకుడు కిశోర్ తిరుమల సినిమా కోసం ఏం చేసినా తన గుండె లోతుల నుంచే చేస్తాడు’’ అన్నారు ‘స్రవంతి’ రవికిశోర్. -
అందమైన జీవితంలో...
‘జీవితం ఎంతో అందమైనది కదూ... తల్లిదండ్రుల ప్రేమానుగారాలు, టీనేజ్‌లో ప్రేమాయణాలు, అలకలు, సరదాలు... జీవితంలో ఎన్ని ఉంటాయో కదూ’ అని చెబుతున్నారు అనుపమా పరమేశ్వరన్. ‘ఓకే బంగారం’ ఫేమ్ దుల్కర్ సల్మాన్‌కి జోడీగా ఆమె నటించిన మలయాళ సినిమా ‘జొమోంటే సువిశేషంగాళ్’. ఐశ్వర్యా రాజేశ్ మరో హీరోయిన్. మలయాళంలో 50కోట్ల వరకూ వసూలు చేసిన ఈ సినిమాను పత్తిపాటి శైలజ సమర్పణలో మేఘవర్ష క్రియేషన్స్ పతాకంపై ‘అందమైన జీవితం’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ నెల 13న తీసుకొస్తున్నారు నిర్మాత పత్తిపాటి శ్రీనివాసరావు. ఆయన మాట్లాడుతూ–‘‘తండ్రీకొడుకల మధ్య అనుబంధాన్ని, ప్రేమికుల మధ్య ఉన్న ప్రేమను అద్భుతంగా ఆవిష్కరించే చిత్రమే ‘అందమైన జీవితం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విద్యాసాగర్. -
ఒకరు మిస్... ఇంకొకరు యస్!
చేతిదాకా వచ్చింది.. ఇక సెట్లోకి వెళ్లడమే ఆలస్యం... ఇంతలోనో ఏదో అయింది.. వచ్చిన ఛాన్స్ చేజారింది.. ఒకరికి ‘మిస్’ అయిన ఛాన్స్ ఇంకొకరికి వెళితే.. ‘యస్’ చెప్పకుండా ఉంటారా? చెప్పినవాళ్లు సెట్లోకి.. మిస్సయిన వాళ్లు వేరే సెట్లోకి.. ఇంతకీ ఎవరు ‘మిస్’ చేసుకున్నారు? ఎవరు ‘యస్’ చెప్పారు? రండి... తెలుసుకుందాం. జస్ట్ మిస్! అనూహ్యంగా తుపాన్ వస్తే ఢిల్లీ–హైదరాబాద్ ఫ్లైట్ మధ్యలో గోవాలోనే ల్యాండ్ అయినట్టు, అనుపమా పరమేశ్వన్ ముహూర్తం కూడా జరగక ముందు చరణ్–సుక్కు ఫ్లైట్ నుంచి కిందకు దిగారు. ఇప్పుడిప్పుడే తెలుగు తెరపై మెల్లగా అడుగులు వేయడం ప్రారంభించారు అనుపమ. ‘అ ఆ’, ‘ప్రేమమ్’, ‘శతమానం భవతి’... ఈ మలయాళ ముద్దుగుమ్మ ఇప్పటివరకూ తెలుగులో మూడు సినిమాలే చేసినా నటిగా మంచి గుర్తింపే వచ్చింది. అదే రామ్‌చరణ్ సినిమాలో ఛాన్స్ తెచ్చిపెట్టింది. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ హీరోగా మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించే సినిమాలో మొదట అనుపమను హీరోయిన్గా ఎంపిక చేశారు. ఇంకేముంది... అమ్మాయి ఎగిరి గంతేసింది. అంతలోనే పెద్ద కుదుపు. ఆమెను తప్పించి, కథానాయికగా సమంతను తీసుకున్నారు. పారితోషకం విషయంలో బెట్టు చేయడంతోనే అనుపమను సినిమా నుంచి తొలగించారనే వార్తలొచ్చాయి. వాటిని నిర్మాణ సంస్థ ఖండించింది. కారణాలు ఏవైనా అనుపమకు ఓ స్టార్ పక్కన నటించే ఛాన్స్ దూరమైంది. ఆమె స్థానంలో చరణ్–సుక్కు ఫ్లైట్ ఎక్కిన సమంతకు హీరో, దర్శకుడు ఇద్దరితోనూ ఇదే మొదటి సినిమా. ఈ సినిమా మిస్సయిన అనుపమ ఫీలింగ్ ఎలా ఉందంటే, ‘అవకాశం చేజారవచ్చు.. బయటవాళ్లు అనుకుంటున్నట్లుగా యూనిట్ సభ్యులతో నాకేం పొరపొచ్ఛాలు లేవు. మేం ఫ్రెండ్లీగానే ఉన్నాం’’ అని క్లారిఫై చేశారామె. జ్యోతిక తప్పుకుంటే నిత్యా ఒప్పుకున్నారు నిత్యా మీనన్ ఓ చిత్రానికి సంతకం చేసారంటే... అందులో కచ్చితంగా కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు ఫిక్సవుతారు. లేదంటే కనీసం కుటుంబంతో కలసి చూసేలా ఉంటుందనుకుంటారు. రీ–ఎంట్రీ తర్వాత జ్యోతిక కూడా అచ్చంగా అటువంటి పేరే తెచ్చుకున్నారు. పెళ్లి తర్వాత నటనకు ఓ కామా పెట్టిన జ్యోతిక.. తన పిల్లలు కాస్త పెద్దవాళ్లయిన తర్వాత మళ్లీ సినిమాలు చేయాలనుకున్నప్పుడు... బోలెడంతమంది దర్శక, నిర్మాతలు ఆమెకు కథలు వినిపించారు. తొందరపడి ఏదొకటి చేయకుండా ‘36 వయదినిలే’, ‘మగళిర్ మట్టుమ్’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో విషయమున్న కథలకు ఓటేశారు జ్యోతిక. ఈ టైమ్‌లోనే అట్లీ దర్శకత్వంలో తమిళ హీరో విజయ్ చేస్తున్న సినిమాలో ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా నటించమని జ్యోతికను సంప్రదించారు. అంతే కాదు... ఆమె నటిస్తున్నట్టు ప్రకటించారు. విజయ్–జ్యోతికలది హిట్ కాంబినేషన్. తమిళ ‘ఖుషి’తో పాటు ఈ ఇద్దరూ మరో సినిమా చేశారు. కట్ చేస్తే... వారంలోపే జ్యోతిక నటించడం లేదనే వార్త బయటకొచ్చింది. ఆ వెంటనే నిత్యా మీనన్‌కి పిలుపొచ్చింది. విజయ్ సినిమా కావడంతో నిత్యా మీనన్ కూడా చకచకా సంతకం చేశారు. జ్యోతిక ఎందుకు నటించనన్నారో.. నిత్యా ఎందుకు అంగీకరించారో... ఆ పాత్ర ప్రాముఖ్యత ఏంటో... సినిమా విడుదల తర్వాత తెలుస్తుంది. క్లాష్.. క్లాష్...! మామూలుగా దర్శకుడు గౌతమ్ మీనన్ సినిమాలంటే హీరోయిన్లకు మంచి ప్రాముఖ్యం ఉంటుంది. అందుకే ఆయనతో సినిమా చేసే ఛాన్స్ ఎప్పుడొస్తుందా? అని కొంతమంది ఎదురు చూస్తారు. ఇక విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సినిమా ఛాన్స్ అంటే.. డబుల్ ధమాకానే. ‘ధృవ నక్షత్రం’తో అనూ ఇమ్మాన్యుయేల్‌కి ఆ డబుల్ ధమాకా వచ్చింది. విక్రమ్‌తో ఆమె ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. కానీ, అప్పటికే అంగీకరించిన సినిమాలతో ‘ధృవ నక్షత్రం’ షెడ్యూల్స్ క్లాష్ కావడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక సినిమా నుంచి తప్పుకున్నారామె. అదే టైమ్‌లో ‘పెళ్లి చూపులు’లో నటించిన తెలుగమ్మాయి రీతూ వర్మ దర్శకుడు గౌతమ్ మీనన్ చూపుల్లో పడడం.. ఆమెను హీరోయిన్గా ఎంపిక చేయడం జరిగాయి. ఇందులో విక్రమ్, రీతూ వర్మలవి టిపికల్ హీరో హీరోయిన్ పాత్రలు కాదట. హాలీవుడ్ సై్టల్లో వాళ్ల క్యారెక్టర్లు డిఫరెంట్‌గా డిజైన్ చేశారట గౌతమ్ మీనన్. రీతూ వర్మకు తొలి భారీ చిత్రమిదే. సెట్స్‌ని టచ్ చేయకుండానే... ఓ అడుగు ముందుకు... మరో అడుగు వెనక్కి... కథానాయిక లావణ్యా త్రిపాఠి తీరిది. తెలుగులో తొలి సినిమా ‘అందాల రాక్షసి’తోనే ఈ ఉత్తరాది బ్యూటీ ప్రేక్షకుల మనసు దోచేశారు. ఆ తర్వాత కెరీర్లో కంటిన్యూ స్‌గా హిట్స్ పడ్డాయి. కానీ, ఎక్కువ సినిమాలు చేయడంలో ఇతర హీరోయిన్లతో పోలిస్తే... లావణ్యా త్రిపాఠి ఓ అడుగు వెనకే ఉన్నారు. తాజాగా రవితేజ ‘టచ్ చేసి చూడు’ ఛాన్స్ లావణ్య చేజారిందని ఫిల్మ్‌నగర్‌లో ఓ వార్త వినిపిస్తోంది. విక్రమ్ సిరిని దర్శకునిగా పరిచయం చేస్తూ, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్న ‘టచ్ చేసి చూడు’లో రాశీఖన్నా, లావణ్యా త్రిపాఠిలను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. ప్రస్తుతం రాశీఖన్నాతో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మరో కథానాయిక లావణ్యా త్రిపాఠి సీన్స్ ఏప్రిల్‌లో చిత్రీకరించడా నికి ప్లాన్ చేశారు. అప్పుడు లావణ్య చిత్రీకరణలో పాల్గొంటే ఫిల్మ్‌నగర్ టాక్ నిజం కాదని అర్థం. ఓ కథానాయిక స్థానంలో మరొకర్ని ఎంపిక చేయడం కొత్తేమీ కాదు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. రామ్‌చరణ్ ‘ఎవడు’లో ముందు సమంతను తీసుకుని, కొన్ని సీన్లు చిత్రీకరించారు. ఏమైందో ఏమో.. చివరకు, ఆమె స్థానంలో శ్రుతీహాసన్ నటించారు. ఇలా శ్రుతి ఖాతాలో ఓ సినిమా చేరితే.. మరో సినిమా చేజారింది. అదే ‘ఊపిరి’. నాగార్జున, కార్తీ చేసిన ఈ చిత్రంలో ముందు శ్రుతీనే తీసుకున్నారు. నిర్మాతలతో ఏవో సమస్యలు రావడంతో శ్రుతీహాసన్ తప్పుకున్నారు. అప్పుడు తమన్నా ఆ సినిమాలో నటించారు. తమన్నా ఈ విధంగానే మరో తమిళ చిత్రంలో అవకాశం దక్కించుకున్నారు. అదే ‘పెళ్లి చూపులు’ రీమేక్. ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ నిర్మాత. ముందు తెలుగులో నటించిన రీతూ వర్మనే తమిళ రీమేక్‌లోనూ తీసుకోవాలనుకున్నారు. చివరకు తమన్నాను ఎంపిక చేశారు. ఈ నిర్ణయం రీతూకి మంచి చేసింది. ఎలాగంటే.. ఈ సినిమాకి కేటాయించాలనుకున్న డేట్స్‌ను ఓ పెద్ద సినిమాకి ఇచ్చారు. అదే విక్రమ్–గౌతమ్‌ల ‘ధృవ నక్షత్రం’. కథానాయికలే కాదు... దర్శకులు, వాళ్ల కథలు కూడా ఓ హీరో నుంచి మరో హీరో దగ్గరికి వెళ్తుంటాయి. ఇదీ కొత్త విషయమేమీ కాదు. ప్రస్తుతం హీరోలు చేస్తున్న సినిమాలు కొన్నిటిని ఓ లుక్కేస్తే... ఎన్టీఆర్ 27వ చిత్రానికి కొబ్బరికాయ కొట్టకముందు రవితేజ కోసం దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) ఓ కథ సిద్ధం చేశారు. ఆ కథతోనే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారా? లేక వేరే కథతోనా? అన్నది దర్శకుడే చెప్పాలి. రవితేజ నుంచి బాబీ.. ఎన్టీఆర్ దగ్గరికి వస్తే.. ఎన్టీఆర్ నుంచి దర్శకుడు అనిల్ రావిపూడి.. రవితేజ దగ్గరికి వెళ్లారు. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి తీస్తున్న ‘రాజా.. ద గ్రేట్’ కథ రామ్ నుంచి ఎన్టీఆర్, అక్కణ్ణుంచి రవితేజ దగ్గరకి వెళ్లింది. ఎన్టీఆర్ సినిమాతో రచయిత వక్కంతం వంశీ దర్శకునిగా పరిచయం కావాలనుకున్నారు. ఆయన రెడీ చేసిన కథ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లకు అంతగా నచ్చకపోవడంతో అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లారు. ఇక, గౌతమ్ మీనన్ ‘ధృవ నక్షత్రం’లోనూ ముందు అనుకున్న హీరో విక్రమ్ కాదు.. సూర్య. కథలో సూర్య చాలా మార్పులు చెప్పడంతో గౌతమ్ చేయనని చెప్పేశారట. రెండేళ్ల తర్వాత విక్రమ్‌తో అదే కథతో సినిమా తీస్తున్నారు.