సినీ పరిశ్రమలో స్టార్ హీరోహీరోయన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. తమ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని పరిశ్రమలో ఓ వెలుగువెలుగుతున్నారు. చదువుతో సంబంధం లేకుండా స్టార్లుగా ఎదిగిన మన హీరోహీరోయిన్లు ఏం చదివారనేది తెలుకోవాలని అందరికి ఆసక్తిగా ఉంటుంది. అయితే ఈ పరిశ్రమలో రాణించాలంటే చదవును పక్కన పెట్టాలనేది ప్రతిఒక్కరి ఉద్దేశం. అయితే మన స్టార్లలో చదువును మధ్యలో ఆపేసి పరిశ్రమలో సెటిలైయిపోయిన వారు కొందరు ఉంటే డిగ్రీ పట్టాలు పుచ్చుకుని ఇండస్ట్రీలో స్టార్‌లుగా ఎదిగిన వారున్నారు. మరీ మన స్టార్ హీరోహీరోయిన్‌లు ఏఏ డిగ్రీలో పట్టాలు తీసుకున్నారో ఇక్కడ ఓ లుక్కేయండి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్
బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా నటుడిగా మారిన ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఈశ్వర్ మూవీతో హీరోగా వెండితెరకు పరిచయమైన ప్రభాస్ హైదరాబాద్‌లో నలంద కాలేజీలో ఇంటర్మిడియట్ చదివాడు. అనంతరం హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కాలేజీ నుంచి బీటేక్‌లో డిగ్రీ పట్టా పొందాడు.
అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్‌గా టాలీవుడ్‌లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ గంగోత్రి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దీనికంటే ముందు మేనమామ మెగాస్టార్ చిరంజీవి డాడీ చిత్రంలో నటుడిగా పరిచమైన ఈ ఐకాన్ స్టార్ చెన్నైలోని ఎంఎస్ఆర్ కాలేజీ నుంచి బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) పూర్తి చేశాడు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు
హీరో కృష్ణ ఘట్టమనేని వారసుడిగా, బాలనటుడిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు చెన్నైలోని లయోలా కాలేజీలో బ్యాచిలర్ ఆప్ కామర్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత హీరోగా మారి టాలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా ఎదిగాడు.
నాగార్జున్ అక్కినేని
అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చి దక్షిణాదిలో వన్ ఆఫ్ ది లీడ్ యాక్టర్‌గా మారిపోయాడు నాగార్జున. అయితే నాగార్జున నటనకు ముందు అమెరికాలో జాబ్ చేసిన సంగతి తెలిసిందే. అమోరికాలోని మిచిగాన్ యూనివర్శిటీలో ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుమేషన్ పూర్తి చేశాడు.
కాజల్ అగర్వాల్
లక్ష్మీ కళ్యాణం మూవీతో తెలుగు తెరపై మెరిసింది కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్. ఆ తర్వాత వెంటనే చందమామ, మగధీర వంటి చిత్రాల్లో నటించి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కాజల్ ముంబైలోని కేసీ కాలేజీ నుంచి మాస్ మీడియాలో మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ స్పెషలైజేషన్‌లో డిగ్రీ పూర్తి చేసింది.
శ్రుతీ హాసన్
విలక్షణ నటుడు కమల్ హాసన్ నట వారసురాలిగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రుతి హాసన్. ఆ తర్వాత నటిగా, గాయనీగా, మ్యూజిక్ కంపోజర్‌గా ఇక్కడ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న శ్రుతి ముంబైలోని సెయింట్ ఆండ్రీవ్ కాలేజీ నుంచి సైకాలజీలో పట్టా అందుకుంది.
సాయి పల్లవి
తెలుగు, తమిళ, మలయాళంలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సాయి పల్లవి నటనకు ముందు జార్జియాలోని బిలిసి మెడికల్ స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆ తర్వాత కొంతకాలం ట్రైనీ డాక్టర్ కూడా ఆమె పనిచేసింది.
రకుల్ ప్రీత్ సింగ్
అటూ బాలీవుడ్, ఇటూ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా సత్తా చాటుతోన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ యూనివర్సిటీ సంబంధించిన జీసస్ అండ్ మేరీ కాలేజీ నుంచి మేథమెటిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
దుల్కర్ సల్మాన్
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. పర్డ్యూ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్న దుల్కర్ సల్మాన్ సినిమాల్లోకి రాకముందు బిజినెస్ మేనేజర్‌గా పనిచేశాడు.
Comments
Please login to add a commentAdd a comment