Graduation
-
ఉద్యోగాలను మించి.. కెరీర్‌పై దృష్టి
సాక్షి, అమరావతి: మన దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లకు ఎంతో క్రేజ్ ఉంది. ఏటా లక్షలాదిమంది విద్యార్థులు ఐఐటీల్లో ప్రవేశాల కోసం పోటీ పడుతుంటారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక రూ.కోట్లలో ప్యాకేజీలతో ప్లేస్‌మెంట్స్ సాధిస్తుంటారు. అయితే.. ఐఐటీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో సగం మంది కెరీర్లో విభిన్న అవకాశాలను అన్వేషించడంపై మొగ్గు చూపుతున్నారు. ఈ అంశం ఇటీవల ఢిల్లీ ఐఐటీ ఎగ్జిట్ సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాది ఆగస్ట్‌లో డిగ్రీ పట్టా అందుకున్న 2,656 మంది విద్యార్థులపై ఎగ్జిట్ సర్వే నిర్వహించారు. పారిశ్రామిక రంగంపై 14 శాతం మంది దృష్టిఇదిలావుండగా.. దేశంలో ఐఐటీలతోపాటు ఇతర సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో 14 శాతం మంది పారిశ్రామిక రంగంపై దృష్టి సారిస్తున్నట్టుగ్లోబల్ యూనివర్సిటీ ఎంట్రప్రెన్యూరియల్ స్పిరిట్ స్టూడెంట్స్ సర్వే–2023 వెల్లడించింది. 57 దేశాల్లో చేపట్టిన సర్వే ఫలితాలు ఈ ఏడాది అక్టోబర్‌లో వెలువడ్డాయి. భారత గ్రాడ్యుయేట్లలో అత్యధికులు పారిశ్రామిక రంగంపై దృష్టి సారించినట్టు సర్వే పేర్కొంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత విద్యార్థులు అత్యధిక ఎంట్రప్రెన్యూర్షిప్ ఆలోచనలు కలిగి ఉన్నారని ఈ సర్వే తేల్చింది. ఎగ్జిట్ సర్వే ఏం తేల్చిందంటే..» 53.1 శాతం అంటే 1,411 మంది అందివచి్చన ఉద్యోగ అవకాశాల్లో కొనసాగుతామని వెల్లడించారు.» 8.4 శాతం అంటే 224 మంది స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపారు. 1.7 శాతం అంటే 45 మంది స్టార్టప్స్ కోసం పనిచేస్తామని వెల్లడించారు. 2.5 శాతం అంటే 66 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా రాణించాలని నిర్ణయించుకున్నారు. » 13.5 శాతం అంటే 359 మంది ఉన్నత చదువుల్లో రాణించాలని నిర్ణయించుకున్నారు. 1.8 శాతం అంటే 47 మంది పీహెచ్డీ, పరిశోధన రంగాల్లో అవకాశాల కోసం అన్వేషిస్తామన్నారు.» 321 మంది (12.1) శాతం మంది సివిల్స్, ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో రాణించేందుకు సన్నద్ధం అవుతామన్నారు. » 134 మంది విద్యార్థులు (5 శాతం మంది) మాత్రమే ఇంకా కెరీర్లో ఏం చేయాలో నిర్ణయించుకోలేదని వెల్లడించారు. -
గ్రాడ్యుయేట్లకు అమెరికా గ్రీన్ కార్డు: ట్రంప్
వాషింగ్టన్: జాతీయవాదిగా, వలసలను వ్యతిరేకించే నాయకుడిగా పేరుగాంచిన అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన ధోరణి మార్చుకున్నారు. అమెరికాలో చదువుకొనే విదేశీ విద్యార్థులకు తీపి కబురు చెప్పారు. తాజాగా ఆల్–ఇన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. అమెరికా కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విదేశీ విద్యార్థులకు అటోమేటిక్‌గా గ్రీన్ కార్డులు అందించే విధానం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత సొంత దేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సిన అవసరం ఉండదని, అమెరికాలోనే ఉండొచ్చని వెల్లడించారు. జూనియర్ కాలేజీల్లో చదువుకున్నవారికి సైతం గ్రీన్‌కార్డులు ఇస్తామన్నారు. ఇండియా, చైనా దేశాల విద్యార్థులు అమెరికా కాలేజీల్లో చదువుకొని, స్వదేశాలకు తిరిగివెళ్లి మల్టీ బిలియనీర్లుగా పైకి ఎదుగుతున్నారని, పరిశ్రమలు స్థాపించి, వేలాది మందికి ఉపాధి కలి్పస్తున్నారని చెప్పారు. వారు ఇక్కడే ఉండేలా చేస్తే అమెరికాకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థగా ట్రంప్ మరోసారి బరిలోకి దిగుతుండటం తెలిసిందే. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం: 105 ఏళ్ల బామ్మ మాస్టర్స్ డిగ్రీ
మధ్యలో వదిలేసిన చదువును పూర్తి చేయడం సామాన్య విషయం కాదు. అందుకు చాలా పట్టుదల కావాలి. పెళ్లి పిల్లలు తరువాత, పెళ్లికి ముందు వదిలివేసిన డిగ్రీ, లేదా ఇతర చదువు పూర్తి చేయమంటే.. ఇపుడేం చదువులే.. అని పెదవి విరుస్తారు చాలామంది. కానీ 105 ఏళ్ల బామ్మ ఏకంగా మాస్టర్స్ డిగ్రీ పట్టా పుచ్చుకుంది. చాలామందికి డిగ్రీ పట్టా పుచుకోవడం ఒక కలగా మిగిలిపోతుంది. కానీ 83 ఏళ్ల క్రితం మిస్ అయిన స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ (GSE) మాస్టర్స్ డిగ్రీని తాజాగా 105 ఏళ్ల వయసులో అందుకుంది. వర్జీనియా "జింజర్" హిస్లాప్ తాజాగా ఈ డిగ్రీని అందుకుంది. దీని కోసం ఎంతో కాలంగా వేచి ఉన్నానంటూ ఆమో భావోద్వేగానికి లోనైంది.1940లలో స్టాన్‌ఫోర్డ్‌లో అవసరమైన తరగతులను పూర్తి చేసింది వర్జీనియా . మాస్టర్స్ థీసిస్‌లో ఉండగా, రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. దీంతో చదువు మధ్యలోనే ఆగిపోయింది. మరోవైపుఆమె ప్రియుడితో పెళ్లి. భర్త జార్జ్ హిస్లోప్ యుద్ధంలో పనిచేయడానికి వెళ్లి పోయాడు. దీంతో అమెరికాలోని అనేకమంది ఇతర మహిళల్లాగానే వర్జీనియా కూడా చదువును త్యాగం చేయాల్సి వచ్చింది. అతనికి సాయం చేస్తూ, కుటుంబ పోషణపై దృష్టి పెట్టింది. తాజాగా ఇద్దరు పిల్లలు, నలుగురు మనుమలు , తొమ్మిది మంది మనవరాళ్లతో కూడిన తన కుటుంబంతో హాయిగా గడుపుతోంది. అటు వర్జీనియా వాషింగ్టన్ స్టేట్‌లోని పాఠశాల, కళాశాల బోర్డులలో దశాబ్దాలుగా పనిచేశారు. కానీ డిగ్రీ పట్టా పుచ్చుకోవాలనే తాపత్రయం ఆమెను ఊరికే కూర్చోనీయలేదు. పట్టుదలతో సాధించింది. ఈ ఏడాది జూన్ 16, ఆదివారం తన కల మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌ని దక్కించుకుంది. మనుమలు, మనువరాళ్లు, ఇతర కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య 2024 గ్రాడ్యుయేటింగ్ ఈవెంట్లో కాలేజీ డీన్ డేనియల్ స్క్వార్ట్జ్ ఆమెకు డిప్లొమాను అందజేస్తోంటే సంతోషంగా ఉప్పొంగిపోయింది. -
చదువు ఎంపికలో పిల్లల మాట కూడా వినండి
మార్కులు రాలేదని తల్లి పెద్ద ర్యాంకు రాలేదని తండ్రి ఫలానా కోర్సు చదవాలని తల్లి ఆ కాలేజీలోనే చేర్పిస్తానని తండ్రి టీనేజ్ పిల్లలకు ఇది కీలక సమయం. వారు ఇంటర్లో, డిగ్రీలో చేరాలి. కాని పిల్లల మాట వింటున్నారా? మీరే గెలవాలని పట్టుబడుతున్నారా? అప్పుడు పిల్లలు లోలోపల నలిగి పోవడం కన్నా ఏం చేయలేరు. పత్రికల్లో వస్తున్న ఘటనలు హెచ్చరిస్తున్నాయి. ఆచితూచి అడుగు వేయండి.‘నువ్వు ఆ కోర్సు చేయాలనేది మా కల’ అనే మాట తల్లిదండ్రుల నుంచి వెలువడితే అది పిల్లల నెత్తిమీద ఎంత బరువుగా మారుతుందో పిల్లలకే తెలుసు. టీనేజ్ మొదలయ్యి టెన్త్ క్లాస్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ ‘కలలు వ్యక్తపరచడం’ తల్లిదండ్రులు మొదలెడతారు. టెన్త్‌లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలో, ఇంటర్లో ఏ స్ట్రీమ్‌లోకి వెళ్లాలో, అందుకు ఏ కాలేజీలో చేరాలో, ఆ కాలేజీ ఏ ఊళ్లో ఉంటే బాగుంటుందో ఇన్ని డిసైడ్ చేసి పిల్లలకు చెబుతుంటారు. పిల్లలు వినాలి. వారికి ఏ అభిప్రాయం లేకుండా ఆ కోర్సు పట్ల ఆసక్తి ఉంటే మంచిదే. వారికి మరేదో ఇంటరెస్ట్ ఉండి, ఇంకేదో చదవాలని ఉంటే... ఆ సంగతి చెప్పలేకపోతే ఇబ్బంది. అది భవిష్యత్తును కూడా దెబ్బ కొట్టగలదు.ఏంటి... ఆ కోర్సా?ఆ ఇంట్లో తండ్రి అడ్వకేట్, తల్లి గవర్నమెంట్ ఉద్యోగి. కుమార్తెకు మేథ్స్గాని, బయాలజీగాని చదవాలని లేదు. హాయిగా టీచర్‌గా సెటిల్ అవ్వాలని ఉంది. తన స్కూల్లో చక్కగా తయారై వచ్చే టీచర్ పిల్లల పేపర్లు దిద్దే సన్నివేశం ఆ అమ్మాయికి ఇష్టం. తాను కూడా టీచరయ్యి పేపర్లు దిద్దాలని అనుకుంటుంది. టెన్త్ అవుతున్న సమయంలో ‘టీచర్ అవుతాను’ అని కూతురు అంటే తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ‘మన హోదాకు టీచర్ కావడం ఏం బాగుంటుంది... మన ఇళ్లల్లో టీచర్లు ఎవరూ లేరే’ లాంటి మాటలు చెప్పి ఎంపీసీలో చేర్పించారు. ఆ అమ్మాయి ఆ లెక్కలు చేయలేక తల్లిదండ్రులకు చెప్పలేక కుమిలిపోయింది. డిప్రెషన్ తెచ్చుకుంది. అదే ‘టీచర్ కావాలనుకుంటున్నావా? వెరీగుడ్. అక్కడితో ఆగకు. నువ్వు హార్వర్డ్‌లో ప్రోఫెసర్ అవ్వాలి. అంత ఎదగాలి’ అని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే హార్వర్డ్‌కు వెళ్లకపోయినా ఒక మంచి యూనివర్సిటీలో లెక్చరర్ అయినా అయ్యేది కదా.అన్నీ మాకు తెలుసుతల్లిదండ్రులకు అన్నీ మాకు తెలుసు అనే ధోరణి ఉంటుంది. నిజమే. కాని వాళ్లు ఇప్పుడున్న స్థితి రకరకాల ప్రయోగాలు చేసి రకరకాల దారుల్లో ప్రయత్నించి ఒక మార్గంలో సెటిల్ అయి ఉంటారు. తమ లాగే తమ పిల్లలు కూడా కొన్ని దారుల్లో నడవాలని అనుకోవచ్చు అని భావించరు. అన్నీ తమ ఇష్టప్రకారం జరగాలనుకుంటారు, ఓవర్ కన్సర్న్ చూపించి ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ఉదాహరణకు ఒకబ్బాయికి ‘నీట్’లో మెడిసిన్ సీటు వచ్చే ర్యాంకు రాలేదు. కాని డెంటిస్ట్రీ సీటు వచ్చే ర్యాంకైతే వచ్చింది. అబ్బాయికి ఆ కోర్సు ఇష్టమే. కాని తల్లిదండ్రులకు తమ కొడుకు ఎలాగైనా ఎంబిబిఎస్ మాత్రమే చదవాలనేది ‘కల’. ‘లాంగ్ టర్మ్ తీసుకో’ అని సూచించారు. లాంగ్ టర్మ్ అంటే ఒక సంవత్సరం వృథా అవుతుంది... పైగా ఈసారి ఎంట్రన్స్‌లో కూడా మంచి ర్యాంక్ వస్తుందో రాదో అనే భయం ఆ అబ్బాయికి ఉన్నా బలవంతం చేస్తే ఎంత చెప్పినా వినకపోతే ఆ అబ్బాయి ఉక్కిరిబిక్కిరి అవ్వడా?ప్రతిదీ నిర్ణయించడమేతల్లిదండ్రుల స్తోమత పిల్లలకు తెలుసు. వారు చదివించ దగ్గ చదువులోనే తమకు ఇష్టం, ఆసక్తి, ప్రవేశం ఉన్న సబ్జక్టును చదవాలని కోరుకుంటారు. పైగా తమ స్నేహితుల ద్వారా వారూ కొంత సమాచారం సేకరించి ఫలానా కాలేజీలో ఫలానా కోర్సు చదవాలని నిశ్చయించుకోవచ్చు. అయితే తల్లిదండ్రులు పిల్లల ఆసక్తికి ఏ మాత్రం విలువ లేకుండా ఎలాగైనా చేసి రికమండేషన్లు పట్టి తాము ఎంపిక చేసిన కాలేజీలోనే చదవాలని శాసిస్తారు. ఇది అన్నివేళలా సమంజసం కాదు. ఒత్తిడి వద్దుటీనేజ్ సమయంలో పిల్లల భావోద్వేగాలు పరిపక్వంగా ఉండవు. కొంత తెలిసీ కొంత తెలియనితనం ఉంటుంది. ఆసక్తులు కూడా పూర్తిగా షేప్ కావు. ఇంటర్, గ్రాడ్యుయేషన్ కోర్సులకు సంబంధించి, కాలేజీలకు సంబంధించి వారికి ఎన్నో సందేహాలుంటాయి. ఎంపికలు ఉంటాయి. ఇవాళ రేపు తల్లిదండ్రులు ‘తాము చదివించాలనుకున్న కోర్సు’ కోసం ఏకంగా పంజాబ్, హర్యాణ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు పంపుతున్నారు. ఇంట్లో ఉండి చదివే వీలున్నా రెసిడెన్షియల్ కాలేజీల్లో పడేస్తున్నారు. అంతంత మాత్రం చదువు చెప్పినా పర్లేదని మెడిసన్ పట్టా ఉంటే చాలని ఆసియా దేశాలకు సాగనంపుతున్నారు. పిల్లలతో ఎంతో మాట్లాడి, కౌన్సెలింగ్ చేసి, మంచి చెడ్డలన్నీ చర్చించి, వారికి సంపూర్ణ అవగాహన కలిగించి రెండు ఆప్షన్లు ఇచ్చి వారి ఆప్షన్లు కూడా పరిగణించి సానుకూలంగా ఒక ఎంపిక చేయడం ఎప్పుడూ మంచిది. లేదంటే ‘కోటా’ లాంటి కోచింగ్ ఊర్లలో జరుగుతున్న విషాదాలు, హైదరాబాద్‌లాంటి చోట్ల ఇల్లు విడిచి పోతున్న సంఘటనలు ఎదుర్కొనాల్సి వస్తుంది. -
యూకే పోస్టు–స్టడీ వీసాలు రద్దు!
లండన్: యునైటెడ్ కింగ్డమ్(యూకే)లోకి వలసలను అరికట్టడానికి ప్రధానమంత్రి రిషి సునాక్ కొత్తరకం ఆలోచనలు చేస్తున్నారు. యూకేలో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత రెండేళ్లపాటు ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకొనేందుకు వీలు కల్పించే పోస్టు–స్టడీ వీసాను రద్దు చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై సొంత మంత్రివర్గం నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడం గమనార్హం. యూకే పోస్టు–స్టడీ వీసా పథకం 2021లో ప్రారంభమైంది. దీనితో భారతీయ విద్యార్థులు అధికంగా ప్రయోజనం పొందుతున్నారు. యూకేలో యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ అభ్యసించిన తర్వాత రెండేళ్లదాకా ఇక్కడే ఉంటూ ఉద్యోగాలు చేసుకొనే వెసులుబాటు లభిస్తోంది. ఒకవేళ ఈ వీసాను రద్దుచేస్తే భారతీయ విద్యార్థులే ఎక్కువగా నష్టపోతారని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో యూకేలోకి వలసలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవన్నీ చట్టబద్ధంగానే జరుగుతున్నప్పటికీ ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయి. వలసలను అరికట్టే చర్యల్లో భాగంగా పోస్టు–స్టడీ వీసాలపై ఆంక్షలు విధించడమా లేక శాశ్వతంగా రద్దు చేయడమా అనే దానిపై ప్రధాని రిషి సునాక్ తర్జనబర్జన పడుతున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదనను పలువురు యూకే మంత్రులు వ్యతిరేకిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి గిలియన్ కీగన్, విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. -
స్నాతక పాఠం అంటే..?
ఒక వయసులో ఒక స్త్రీ ఒకపురుషుడికి నచ్చిందనీ, ఒక పురుషుడు ఒక స్త్రీకి నచ్చాడనీ...కాబట్టి కలసి జీవించడం... అనేది శాస్త్ర సమ్మతం కాదు. కాలం గడిచేకొద్దీ ధనం వెళ్ళిపోతుంది, నీ వాళ్ళనుకున్న వాళ్ళు వెళ్లిపోతారు, అధికారం పోతుంది, జ్ఞాపకశక్తి కూడా పోతుంది.. అన్నీ పోతాయి... అలాగే యవ్వనం కూడా. కానీ మిగిలిపోయేది ఏదయినా ఉంటే.. ఆ వ్యక్తి ధార్మికంగా బతికాడా..అన్నదే! పెళ్ళి ఎందుకు చేస్తున్నారు, వారిద్దర్నీ ఎందుకు కలుపుతున్నారు... ప్రస్థానం అంటే వారిద్దరూ కలిసి ఏం చేయాలి? అన్న దాని గురించి అవగాహన కల్పించడం కోసం గృహస్థాశ్రమ స్వీకారానికి ముందు గురువుని తీసుకొచ్చి మంచి విషయాలు చెప్పిస్తారు. దానిని స్నాతక పాఠం అంటారు. స్నాతక పాఠంగా కాకపోయినా పెద్దల్ని తీసుకొచ్చి ‘‘మీరు వివాహం చేసుకోవాలి. ఇద్దరూ అన్యోన్యంగా బతకడం మీద ఎన్నో జీవితాల అభ్యున్నతి ఆధారపడి ఉంది. ఈ ఏర్పాటు మీ వ్యక్తిగత జీవితం కోసం మాత్రమే కాదు సుమా! మీ పెద్దల కీర్తి ప్రతిష్ఠలు, నీ తోబుట్టువుల తృప్తి, మీ బిడ్డల భవిష్యత్తు.. ఇలా చాలా ముడిపడి ఉన్నాయి. ఇది తొందరపడి తీసుకునే నిర్ణయం కాదు. దీనిని మీరు లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని అవగాహనపరిచే ప్రయత్నం చేస్తారు. అది సనాతన ధర్మానికి ఉన్న గొప్పదనం. అన్నపానీయాలుగానీ, మరేవయినాగానీ వాటిని సంస్కరించకుండా స్వీకరించం. అటువంటి ఒక ఏర్పాటును నీవు జీవితంలోకి ఆహ్వానిస్తున్నావు.. ఇక అక్కడినుంచి నీ జీవితం పండవలసిన అవసరం ఉంది. ఇది బ్రహ్మచర్యం అన్న కట్టువిప్పి గృహస్థాశ్రమం అన్న కొత్తకట్టు వేయడం కాదు. బ్రహ్మచర్యం అన్న కట్టు విప్పేయడం అన్నమాట ఉండదు. కారణం – ఆ ఆశ్రమంలో క్రమశిక్షణ, విద్యాభ్యాసం, గురువుపట్ల చూపే గౌరవమర్యాదలు ...ఇవన్నీ ఉన్నాయి. గృహస్థాశ్రమంలోకి వచ్చినప్పుడు ఆ కట్టుబాటు ఎటు పోయింది? ఎటూ పోలేదు. దాని మీద మరో కట్టు వచ్చి చేరింది. కట్టుమీద కట్టు. ΄పొలంలో పచ్చిగడ్డికోసి మోపుకట్టిన తండ్రిని చూసి కొడుకు ‘‘మోపు గట్టిగా కట్టలేదు’’ అంటే తండ్రి బాధపడతాడని... ‘‘అది వదులుగా ఉన్నట్లుంది. ఎందుకైనా మంచిది, మరో కట్టు వేస్తాను’’ అని మోపును మోకాళ్ళతో అదిమి గట్టిగా కట్టి తలమీద పెట్టుకుని ఇంటిబాట పడతాడు. తండ్రి వేసిన కట్టును విప్పి ఆయనను అగౌరవ పరచలేదు. ఆ కట్టు వదులుగా ఉన్నందువల్ల ఎక్కడో దానంతట అదే జారిపోయింది. అంతే.గృహస్థాశ్రమం అన్న కట్టు వేసినప్పుడు బ్రహ్మచర్య నియమాలు జారిపోతాయి తప్ప బ్రహ్మచర్యంలో ఏ బంధాలున్నాయో అవి, అక్కడ అలవర్చుకున్న సంస్కారం మాత్రం జీవితాంతం ఉంటాయి. ఎప్పటికప్పుడు ఎలా సంస్కరిస్తే వ్యక్తి జీవితాన్ని పండించుకుంటాడో దానికి అవసరమయిన విషయాలను అందించి ఆశ్రమాన్ని మారుస్తారు. -
విద్యావంతులకు పెద్దపీట
సాక్షి, అమరావతి: 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు వైఎస్సార్సీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో విద్యావంతులకు పెద్దపీట వేశారు. వీరిలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన వారు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, ఇంజినీర్లు, సివిల్ సర్వెంటు, జర్నలిస్టు ఇలా అన్ని రకాల విద్యావంతులకు జాబితాలో సీఎం జగన్ చోటు కల్పించారు. ఈ జాబితాలో మొత్తం 200 మందికి గాను 77 శాతం మంది ఉన్నత విద్యావంతులున్నారు. 175 శాసనసభ స్థానాలకు వైఎస్సార్సీపీ ప్రకటించిన అభ్యర్థుల్లో 131 మంది గ్రాడ్యుయేషన్, ఆపై చదవులు చదివినవారు ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 47 మంది పోస్టు గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ చేసిన వారున్నారు. 13 మంది డాక్టర్లు, 11 మంది లాయర్లు, 34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్లు(ఎ.మహ్మద్ ఇంతియాజ్, ఆదిమూలపు సురేష్), ఒకరు డిఫెన్స్‌లో చేసినవారు (వాసుపల్లి గణేష్‌కుమార్), ఒక జర్నలిస్టు(కురసాల కన్నబాబు) ఉన్నారు. ఎంపీ అభ్యర్థుల్లో 88 శాతం డిగ్రీ, ఆపై చదివినవారే.. 25 లోక్‌సభ స్థానాలకు వైఎస్సార్సీపీ ప్రకటించిన అభ్యర్థుల్లో 22 మంది (88 శాతం) డిగ్రీ, ఆపై చదువులు చదివిన వారు ఉన్నారు. ఇందులో 11 మంది పోస్టు గ్రాడ్యుయేషన్, ఇద్దరు డాక్టరేట్ చేసిన వారు ఉన్నారు. లోక్‌సభ అభ్యర్థుల్లో సింహాద్రి చంద్రశేఖరరావు, గూడురి శ్రీనివాసులు, మద్దుల గురుమూర్తి, పి.అనిల్‌కుమార్ యాదవ్‌లు డాక్టర్లు కాగా.. నలుగురు లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్(వి.విజయసాయిరెడ్డి), ఒక మెడికల్ ప్రాక్టిషనర్ ఉన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు అవకాశం ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న పలువురికి వైఎస్సార్సీపీ టికెట్లు కేటాయించింది. మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్యకర్తల్లో 13 మందికి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీకి అవకాశం కల్పించింది. కర్నూలు మేయర్ బీవై రామయ్యకు కర్నూలు ఎంపీగా, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడుకి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్ పిరియ విజయకు ఇచ్ఛాపురం నుంచి అవకాశం కల్పించారు. సాధారణ కార్యకర్తలు లక్కప్ప, వీరాంజనేయులుకు మడకశిర, శింగనమల నుంచి పోటీకి అవకాశం కల్పించారు. పార్టిలో క్రియాశీల కార్యకర్తగా పనిచేసిన గూడూరి ఉమాబాలకు నరసాపురం ఎంపీ సీటు కేటాయించారు. కడప జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. జెడ్పీటీసీ సర్నల తిరుపతిరావుకు మైలవరం టికెట్ కేటాయించారు. వైఎస్సార్సీపీ నేత బలసాని కిరణ్‌కుమార్ ప్రత్తిపాడు నుంచి, గృహిణి మురుగుడు లావణ్య మంగళగిరి నుంచి పోటీç³డుతున్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తిరుపతి నుంచి, నెల్లూరు సిటీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ నెల్లూరు నుంచి, జెడ్పీటీసీ బూసినే విరూపాక్ష ఆలూరు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. -
అవమానించిన వాళ్లే అభినందిస్తున్నారు!
‘నువ్వేమైనా కలెక్టర్‌వా? డాక్టర్‌వా? లేకపోతే ఏమైనా కంపెనీకి ఓనర్‌వా? ఆఫ్టరాల్... సెక్యూరిటీ గార్డ్వి. సెక్యూరిటీ గార్డు కూతురు విదేశాల్లో చదవగలదా?’ అని ఆ గార్డు ముఖం మీదే కరుకుగా మాట్లాడారు చాలామంది. బాధ పెట్టే కామెంట్స్ ఎన్ని చెవిన పడ్డా కూతురిని విదేశాల్లో చదివించాలనే లక్ష్యం విషయంలో ఆయన ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. కట్ చేస్తే... యూకే లో ఒక యూనివర్శిటీ నుంచి సెక్యూరిటీ గార్డ్ కూతురు ధనుశ్రీ గైక్వాడ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ధనుశ్రీని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేయడం, ఆమె తన గ్రాడ్యుయేషన్ డిగ్రీని స్వీకరించడానికి వేదికపైకి వెళ్లడం, గ్రాడ్యుయేషన్ క్యాప్, గౌన్ ధరించిన ధనుశ్రీ తండ్రిని ఆనందంగా ఆలింగనం చేసుకోవడంలాంటి దృశ్యాలు వీడియోలో కనిపిస్తాయి. ఆయుష్మాన్ ఖురాన, ఈశా గుప్తాలాంటి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ వీడియోపై స్పందించారు. ‘నువ్వు గార్డువి మాత్రమే. నీ కూతురిని విదేశాల్లో చదివించడం అసాధ్యం’ అని తండ్రితో చెప్పిన ప్రతి ఒక్కరికీ వీడియోను షేర్ చేసింది ధనుశ్రీ గైక్వాడ్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోకు 20 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. -
‘గగన’ విజయం
సాక్షి, హైదరాబాద్: కలలు కన్నారు.. ఆ కలను నిజం చేసుకునేందుకు కష్టపడ్డారు.. వ చ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటూ గగనతలంలో విజయబావుటా ఎగురవేశారు ఈ యువ ఫ్లయింగ్ కేడెట్లు. ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం అయినా..అంతిమ లక్ష్యం మాత్రం భరతమాత సేవలో తాము ఉండాలన్నదే. ఆదివారం దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొని భారత వాయుసేనలోని వివిధ విభాగాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా యువ అధికారులు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు ఇలా పంచుకున్నారు. దేశ సేవలో నేను మూడో తరం.. దేశ సేవలో మా కుటుంబ నుంచి మూడో తరం అధికారిగా నేను ఎయిర్‌ఫోర్స్‌లో చేరడం ఎంతో సంతోషంగా ఉంది. మా తాతగారు పోలీస్ అఫీసర్‌గా చేశారు. మా నాన్న కర్నల్ రాజేశ్ రాజస్థాన్‌లో పనిచేస్తున్నారు. నేను ఇప్పుడు ఎయిర్ ఫోర్స్‌లో నావిగేషన్ బ్రాంచ్‌లో సెలక్ట్ అయ్యాను. వెపన్సిస్టం ఆపరేటర్‌గా నాకు బాధ్యతలు ఇవ్వనున్నారు. ఇది ఎంతో చాలెంజింగ్ జాబ్. శిక్షణ సమయంలో ఎన్నో కఠిన పరిస్థితులను దాటిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎలాంటి బాధ్యత అయినా నిర్వర్తించగలనన్న నమ్మకం పెరిగింది. మా స్వస్థలం జైపూర్. నేను బీటెక్ ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సిస్టం అమేథీలో చేశాను. – ఫ్లయింగ్ కేడెట్ థాన్యాసింగ్, జైపూర్ నాన్నే నాకు స్ఫూర్తి... మాది వికారాబాద్ జిల్లా చీమల్‌దరి గ్రామం. నాన్నపేరు శేఖర్. ప్రైవేటు ఉద్యోగి, అమ్మ బాలమణి టైలర్. చిన్నప్పటి నుంచి నాన్న స్ఫూర్తితోనే నేను డిఫెన్స్ వైపు రాగలిగాను. కార్గిల్ యుద్ధంలో సూర్యకిరణ్ పైలెట్ బృందం ఎంతో కీలకంగా పనిచేసిందన్న వార్తలను చూసి మా నాన్న నాకు సూర్యకిరణ్ అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచే నన్ను డిఫెన్స్‌కు వెళ్లేలా ప్రోత్స హించారు. అలా నేను ఏడో తరగతిలో డెహ్రాడూన్‌లోని రాష్ట్రాయ ఇండియన్ మిలిటరీ కాలేజ్‌కు ప్రవేశ పరీక్ష రాసి 8వ తరగతిలో చేరాను. అందులో రాష్ట్రానికి ఒక్క సీటు మాత్రమే కేటాయిస్తారు. అంత పోటీలోనూ నేను సీటు సాధించాను. అక్కడే ఇంటర్మీడియెట్ వరకు చదివాను. ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో రెండేళ్లు శిక్షణ తీసుకున్న తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి సెలక్ట్ అయ్యాను. – సూర్యకిరణ్, చీమల్‌దరి, వికారాబాద్ జిల్లా భారత సైన్యంలో చేరడం నా కల.. నా పేరు లతా కౌషిక్. మాది హరియాణా రాష్ట్రంలోని జజ్జర్ జిల్లా దుబల్దాన్ గ్రామం. మానాన్న రైతు. అమ్మ గృహిణి. నేను ఢిల్లీ యూనివర్సిటీలోని మిరండా కాలేజీలో బీఎస్సీ హానర్స్, మ్యాథ్స్ చదివాను. డిఫెన్స్ ఫోర్స్‌లో చేరడం ద్వారా దేశానికి, ప్రజల రక్షణకు పనిచేయవచ్చని నా కోరిక. ఆడపిల్ల డిఫెన్స్‌లోకి ఎందుకు అని ఏనాడు మా ఇంట్లో వాళ్లు అనలేదు. మా నాన్నతో సహా కుటుంబం అంతా నన్ను ప్రోత్సహించడంతోనే నేను ఎయిర్‌ఫోర్స్‌కి వచ్చాను. లక్ష్యం స్పష్టంగా ఉంటే ఏదీ మనల్ని అడ్డుకోలేదు. అన్ని పరిస్థితులు కలిసి వస్తాయి. – లతా కౌషిక్, ఫ్లయింగ్ ఆఫీసర్, హరియాణా ఎప్పుడూ ఫ్లైట్ ఎక్కని నేను ఫైటర్ పైలట్ అయ్యాను.. నాపేరు జోసెఫ్. నేను ఒక్కసారి కూడా ఫ్లైట్ ఎక్కలేదు. ఇప్పుడు ఏకంగా ఫైటర్ పైలెట్ కావడం సంతోషంగా ఉంది. మా సొంత ప్రాంతం గుంటూరు. నేను టెన్త్ వరకు గుంటూరులో చదివాను. ఎయిర్‌ఫోర్స్‌కి రావాలని అనుకోలేదు. ఇంటర్మిడియెట్ తర్వాత ఎన్డీఏ గురించి తెలుసుకుని ఈ కెరీర్‌ని ఎంచుకున్నాను. మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యాను. తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్లగలిగాను. అక్కడ నుంచి భారత వాయుసేనలో సెలక్ట్ అయ్యాను. మా తల్లిదండ్రు ల ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయికి చేరాను. పేరెంట్స్ సపోర్ట్ లేకుండా పిల్లలు ఏదీ సాధించలేరు. తల్లిదండ్రులు పూర్తిగా సహకరిస్తేనే పిల్లలు వారి కలలు నిజం చేసుకోగలుగుతారు. – జోసెఫ్, ఫైటర్ పైలట్, గుంటూరు -
సాయుధ దళాలు.. వినూత్నంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: సాయుధ దళాలలో సంప్రదాయ పద్ధతులకు తగిన ప్రాధాన్యం ఇస్తూనే.. కాలానుగుణంగా కొత్త ఆవిష్కరణలు తేవాల్సిన అవసరం ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. కొత్త ఆలోచనలు చేయకుండా చాలా కాలం ఒకే తరహా సంప్రదాయాలను అనుసరిస్తే వ్యవస్థలో జడత్వం వస్తుందని అభిప్రాయపడ్డారు. యువ అధికారులు తమలో నూతనత్వానికి, వినూత్న ఆలోచనలకు ఎప్పటికప్పుడు పదునుపెట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ( ఇఎ్క) జరిగింది. ఇందులో శిక్షణ పూర్తి చేసుకున్న 213 ఫ్లైట్ కేడెట్లు (వీరిలో 25 మంది మహిళలు) పాల్గొన్నారు. గౌరవ వందనం స్వీకరించి.. పరేడ్‌కు సమీక్ష అధికారిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొని యువ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. యువ కేడెట్లు భారత వాయుసేనలోని వివిధ విభాగాల్లో విధుల్లోకి చేరడానికి సూచికగా వారందరికీ అధికారిక హోదా కల్పిస్తూ రాష్ట్రపతి కమిషన్ (అధికారిక బ్యాడ్జ్‌లను)ను ప్రదానం చేశారు. తర్వాత రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగించారు. ‘‘నిరంతరం అభివృద్ధి చెందుతున్న కాలానికి అనుగుణంగా సంప్రదాయాలు, ఆవిష్కర ణల మధ్య సమతుల్యత సాధించండి. సంప్రదాయాన్ని మాత్రమే పాటిస్తే.. మనం ఎండిపోయిన సరస్సులా మారిపోతాం. మనం ప్రవహించే నదిలా ఉండాలి. ఇందుకు సంప్రదాయంతోపాటు కొత్తదనాన్ని తీసుకురావాలి. వాయుసేన అధికారులుగా మీరు ఆకాశంలో ఎగురుతూ ఉండండి. ఎక్కు వ ఎత్తును తాకండి, కానీ నేలతో మీ సంబంధాన్ని కొనసాగించండి’’అని పిలుపునిచ్చారు. అకాడమీలో భారత వాయుసేనకు చెందిన అధికారులతోపాటు నౌకాదళానికి చెందిన ఎనిమిది మంది అధికారులు, కోస్ట్ గార్డ్ (తీర రక్షక దళం) నుంచి 9 మంది, స్నేహపూర్వక దేశమైన వియత్నాం నుంచి ఇద్దరు అధికారులు కూడా ఫ్లయింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ నుంచి అవార్డులు అందుకున్నారు. శిక్షణలో టాపర్‌గా నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అతుల్ ప్రకాశ్ రాష్ట్రపతి ఫలకాన్ని చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ స్వోర్డ్ ఆఫ్ హానర్‌ను రాజ్‌నాథ్ చేతులమీదుగా అందుకున్నారు. గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్‌లలో మెరిట్లో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అమరీందర్ జీత్ సింగ్‌కు రాష్ట్రపతి ఫలకం లభించింది. అంతకుముందు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, యువ కేడెట్లతో ప్రమాణం చేయించారు. ఆకట్టుకున్న కవాతు శిక్షణలో ప్రథమస్థానంలో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అతుల్ ప్రకాశ్ ఆదివారం నాటి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు పరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా యువ ఫ్లయింగ్ కేడెట్లు చేసిన కవాతు ఆకట్టుకుంది. పరేడ్ అనంతరం భారత వాయుసేన నిర్వహించిన వైమానిక ప్రదర్శన అలరించింది. సారంగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృంద విన్యాసాలు, సుఖోయ్–30 ఎంకేఐ గగనతల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎయిర్‌ఫోర్స్ అధికారులతోపాటు యువ ఫ్లయింగ్ ఆఫీసర్ల తల్లిదండ్రులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. -
మానవతా విలువల్ని పరిరక్షిద్దాం
సుభాష్‌నగర్: మన జీవితాలు యంత్రాలతో ఎంతగానో పెనవేసుకుపోయాయని, వాటిని వినియోగిస్తూనే సమాజంలో మానవతా విలువల్ని కూడా పరిరక్షించేలా మనం ముందుకు సాగాలని మహీంద్రా యూనివర్శిటీ చాన్స్‌లర్ ఆనంద్ మహీంద్ర అన్నారు. బహదూర్‌పల్లిలోని మహీంద్ర యూనివర్సిటీలో శనివారం స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జున రావు, అప్‌గ్రేడ్ చైర్మన్ రొన్నీ స్రీవల తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం ఆనంద్ మహీంద్ర మాట్లాడుతూ భారత ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడవ పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉందని, 76 సంవత్సరాలుగా టెక్ మహీంద్ర కంపెనీ సేవలందించడం గర్వంగా ఉందన్నారు. విద్యార్థులు మానవాభివృద్ధికి దోహదపడే నూతన ఆవిష్కరణల దిశగా కృషి చేయాలన్నారు. టెక్ మహీంద్ర ఎండీ మోహిత్ జోషి, మహీంద్రా యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్ డాక్టర్ యాజులు మేదురి, యూనివర్సిటీ, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
చైనాను అధిగమించి.. దూసుకెళ్తున్నారు..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : అమెరికాలో గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ చదువుల కోసం వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల్లో చైనీయులు అధిక సంఖ్యలో ఉన్నారు. తర్వాత స్థానంలో భారత్ ఉంది. కానీ ఈ పరిస్థితి మరికొన్ని సంవత్సరాల్లోనే మారనుంది. త్వరలోనే భారత్ మొదటి స్థానంలోకి రానుంది. చైనా నుంచి వెళ్లే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటమే ఇందుకు కారణం. ఇటీవలి కాలం వరకు అమెరికా విద్యాసంస్థలు చైనా విద్యార్థులను చేర్చుకోవ డానికి అధిక ప్రాధాన్యతనిచ్చేవి. కోవిడ్ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ద్వైపాక్షిక సంబంధాలు కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేప థ్యంలో అమెరికా విద్యాసంస్థలు భారత్‌ను తమకు అనుకూలమైన అతిపెద్ద మార్కెట్‌గా పరిగణిస్తు న్నాయి. స్ప్రింగ్ స్నాప్‌షాట్ పేరిట ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) నిర్వహించిన సర్వే ఈ విషయం స్పష్టం చేస్తోంది. 2020 నుంచి 2023 నాటికి చైనా నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య 3,68,800 నుంచి 2,53,630కి తగ్గగా.. అదే సమయంలో భారత్ నుంచి వెళ్లే విద్యార్థుల సంఖ్య 1.90 లక్షల నుంచి 2.53 లక్షలకు పెరిగినట్లు ఐఐఈ పేర్కొంది. 2030కి 3.94 లక్షల మందితో భారత్ అగ్రస్థానానికి చేరుతుందని అంచనా వేసింది. భారత్ వైపే 57% సంస్థలు మొగ్గు గ్రాడ్యుయేషన్‌తో పాటు అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులను ఆకర్షించడానికి అమెరికా విద్యాసంస్థలు ప్రయత్ని స్తున్నాయి. ప్రతి పది మంది గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో నలుగురు విదేశీ విద్యార్థులు ఉండేలా ఈ రిక్రూట్మెంట్ విధానం కొనసాగుతోంది. 2023–24 విద్యా సంవత్సరంలో విదేశీ విద్యార్థుల చేరికకు సంబంధించి ఏప్రిల్ నుంచి మే మధ్య కాలంలో ఐఐఈ సర్వే నిర్వహించింది. మొత్తం 527 విద్యాసంస్థల నుంచి డేటా సేకరించింది. సుమారు 57 శాతం సంస్థలు భారత్ విద్యార్థులను ఎక్కువగా చేర్చుకోవడానికి ప్రయత్నించినట్లు వెల్లడించింది. 2022–23 కంటే 2023–24 విద్యా సంవత్సరంలో విదేశీ విద్యార్థుల నుంచి తమకు అధికంగా దరఖాస్తులు అందినట్లు 61 శాతం కాలేజీలు/యూనివర్సిటీలు వెల్లడిస్తే.. మరో 28 శాతం విద్యా సంస్థలు తమకు గత సంవత్సరం వచ్చిన మేరకు దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నాయి. మరో 12% విద్యా సంస్థలు మాత్రం తమకు దరఖాస్తులు తగ్గినట్లు తెలిపాయి. అమెరికాకు తగ్గిన ఆదాయం కోవిడ్ తరువాత గడిచిన రెండేళ్లుగా విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా, కోవిడ్ కంటే ముందున్న ఆదాయం రాలేదని ఐఐఈ సర్వే వెల్లడిస్తోంది. కోవిడ్‌కు ముందు 2018 విద్యా సంవత్సరంలో విదేశీ విద్యార్థుల నుంచి అమెరికాకు వచ్చే ఆదాయం దాదాపు 45 బిలియన్ డాలర్లు.. మన రూపాయల్లో అది రూ. 3.7 లక్షల కోట్లు. ఇప్పటివరకు ఏ విద్యా సంవత్సరంతో పోల్చినా ఇదే అత్యధిక ఆదాయం. కాగా అప్పట్లో ఏటా దాదాపు 11 లక్షల వరకు విదేశీ విద్యార్థులు అమెరికాలో విద్యాభాస్యం కోసం వచ్చేవారని పేర్కొంది. అయితే 2022–23లో విదేశీ విద్యార్థుల వల్ల అమెరికాకు 33.8 బిలియన్ డాలర్ల ఆదాయం మాత్రమే సమకూరింది. అంటే మన కరెన్సీలో ఇది రూ.2.7 లక్షల కోట్లు. అమెరికా విద్యా సంస్థలకు ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల నుంచి పోటీ ఎక్కువ అవుతున్నట్లు సర్వేలో తేలింది. అంటే ఈ దేశాల విద్యా సంస్థల్లో కూడా విదేశీ విద్యార్థులు అధిక సంఖ్యలో చేరుతున్నారన్నమాట. ప్రస్తుతం దాదాపు 10 లక్షల మంది వరకు విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉన్నారు. టాప్ టెన్ దేశాలివే.. విదేశీ విద్యార్థుల చేరికకు సంబంధించి ఐఐఈ గణాంకాల ప్రకారం.. గత సంవత్సరం చైనా, భారత్, దక్షిణ కొరియా, కెనడా, వియత్నాం, తైవాన్, సౌదీ అరేబియా, బ్రెజిల్, మెక్సికో, నైజీరియా దేశాలు వరుసగా తొలి పది స్థానాల్లో ఉన్నాయి. ఈ టాప్ టెన్ దేశాల విద్యార్థులే కాకుండా ఇతర దేశాల విద్యార్థులను సైతం అమెరికా విద్యాసంస్థలు ఆకర్షిస్తున్నాయి. 2021–22 సంవత్సరంలో 11వ స్థానంలో ఉన్న జపాన్ నుంచి 14 శాతం పెరుగుదల ఉండగా, చైనా నుంచి 8.6 శాతం తగ్గుదల కనిపించింది. 2023లో జపాన్ విద్యార్థుల సంఖ్యలో 33 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేసింది. నైజీరియా నుంచి కూడా అనూహ్యంగా విద్యార్థులు పెరిగినట్లు ఐఐఈ తెలిపింది ఇక సౌదీ అరేబియా నుంచి 17 శాతం మేర విద్యార్థులు తగ్గారు. అయితే 2030 నాటికి ఈ దేశం నుంచి విద్యార్థులు గణనీయంగా పెరగనున్నారు. తర్వాత నేపాల్, బంగ్లాదేశ్‌ల నుంచి కూడా విద్యార్థుల సంఖ్య పెరిగి ఆ రెండు దేశాలు టాప్ టెన్‌లో (8, 9 స్థానాల్లోకి)కి రానున్నాయి. ఇంగ్లిష్ మాట్లాడే ఇతర దేశాలకూ విద్యార్థులు విదేశీ విద్యార్థులకు అమెరికానే తొలి ప్రాధాన్యత అయినప్పటికీ..అమెరికాతో పాటు ఆంగ్లం మాట్లాడే ఇతర దేశాలకు కూడా విద్యార్థులు గణనీయ సంఖ్యలో వెళుతున్నారు. ఈ మేరకు ఆమెరికాకు విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్‌తో పాటు జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు విదేశాల నుంచి విద్యార్థులు వెళ్తున్నారు. ఆయా దేశాలు విదేశీ విద్యార్థులను ఆకట్టుకోవడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తున్నాయి. – డాక్టర్ ఎస్తేర్ డి బ్రిమ్మర్, ఈడీ, సీఈఓ, నేషనల్ అసోసియేషన్ ఫర్ ఫారిన్ స్టూడెంట్ ఎఫైర్స్ -
డియర్ అచ్చూ కంగ్రాట్స్! మురిసిపోయిన మంత్రి హరీశ్ రావు
సాక్షి, హైదరాబాద్/సిద్దిపేట జోన్: అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కుమారుడు అర్చిష్మాన్ పట్టభద్రుడయ్యాడు. భారత కాలమానం ప్రకారం గురువారం యూనివర్సిటీలో జరిగిన పట్టా ప్రదానోత్సవంలో అర్చిష్మాన్ సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. పట్టా ప్రదానోత్సవానికి హాజరైన మంత్రి హరీశ్ రావు తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ‘నా కుమారుడు అర్చిష్మాన్ కొలరాడో యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు గ్లోబల్ ఎంగేజ్మెంట్ అవార్డును కూడా అందుకున్నాడు’ అని పేర్కొన్నారు. డియర్ అచ్చూ.. కంగ్రాట్స్ అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన కుమారుడి ప్రతిభకు గర్వపడుతునట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని హరీశ్ ఆకాంక్షించారు. I am ecstatic to announce my son @tarchishman graduation 🎓 in Civil Engineering from University of Colorado at Boulder and also recipient of the Global Engagement Award! I couldn't be more proud of his remarkable achievement, which is a testament to his perseverance and passion… pic.twitter.com/Ecw8yPVgM9 — Harish Rao Thanneeru (@BRSHarish) May 12, 2023 -
CM Jagan Tweet: డియర్ హర్ష.. గర్వంగా ఉంది
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కుమార్తె హర్ష గ్రాడ్యుయేషన్ పూర్తిచేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్యారిస్‌లో జరిగిన ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కుమార్తెపై తనకున్న ప్రేమను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ ట్వీట్‌కు గ్రాడ్యుయేషన్ పట్టాతో ఉన్న హర్షతో సతీసమేతంగా దిగిన తన ఫొటోను సీఎం జతచేశారు. అంతేకాక.. ‘‘డియర్ హర్ష.. నీ అద్భుతమైన ఎదుగుదలను చూస్తే ఎంతో గర్వంగా ఉంది. నీకు ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ మెండుగా ఉంటాయి. ఈరోజు ఇన్సీడ్ ((INSEAD) బిజినెస్ స్కూల్ నుంచి డిస్టింక్షన్లో పాస్ కావడమే కాకుండా డీన్స్ లిస్ట్‌లో నీ పేరు చూసి గర్వపడుతున్నాను. భవిష్యత్తులో భగవంతుడు నీకు అన్ని విధాలుగా తోడుగా నిలవాలని కోరుకుంటున్నా’’.. అంటూ జగన్ ట్వీట్ చేశారు. Dear Harsha, it’s been a wonderful journey watching you grow up. God has been abundantly gracious. Today I’m proud to see you graduate from INSEAD with distinction and on the Dean’s list. Wishing you God’s very best! pic.twitter.com/7FuZcXp4uT — YS Jagan Mohan Reddy (@ysjagan) July 2, 2022 చదవండి: (CM YS Jagan: ఆదోని పర్యటనకు సీఎం జగన్) -
CM YS Jagan: సీఎం జగన్ పారిస్‌కు పయనం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారిస్‌కు బయలుదేరారు. తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో పారిస్ బయలుదేరారు. బుధవారం ఉదయం 5.10 గంటలకు పారిస్ చేరుకుంటారు. అక్కడ తన కుమార్తె గ్రాడ్యుయేషన్ కాన్వొకేషన్ వేడుకలో పాల్గొననున్నారు. తిరిగి జూలై 2న సాయంత్రం 4 గంటలకు పారిస్‌లో బయలుదేరి, 3వ తేదీ ఉదయం 6.45 గంటలకు గన్నవరం చేరుకుంటారు. చదవండి: (ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో 3 లక్షల మందికి కొత్త పింఛన్లు) -
వీఎస్‌యూ లోగిలి.. ఆనందాల కేళి
నెల్లూరు (అర్బన్): కొత్తకొత్త స్కిల్ డెవలప్మెంట్, రీసెర్చ్, ఉపాధి కోర్సులను ప్రవేశ పెడుతూ నాణ్యమైన విద్య, ఉద్యోగాల కల్పనకు కేంద్ర బిందువుగా మారి జిల్లాకే ప్రతిష్టాత్మకమైన విక్రమసింహపురి యూనివర్సిటీలో మంగళవారం స్నాతకోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. వెంకటాచలం మండలం కాకుటూరులోని యూనివర్సిటీ ప్రాంగణంలో 6, 7వ స్నాతకోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వర్సిటీ ఛాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్య అతిథిగా హైదరాబాద్‌కు చెందిన మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డీఎన్‌రెడ్డి హాజరయ్యారు. ప్రపంచీకరణకు అనుగుణంగా నైపుణ్యం మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డీఎన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచీకరణతో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నేటి యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, అప్పుడే ప్రపంచంలో ఎక్కడైనా రాణించగలరన్నారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జీఎం సుందరవల్లి మాట్లాడుతూ వర్సిటీ పరంగా సాధించిన ప్రగతిని వివరించారు. నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేసిన ఆచార్యులను అభినందించారు. రవీంద్ర సన్నారెడ్డికి గౌరవ డాక్టరేట్ శ్రీసిటీ సృష్టికర్త, మేనేజింగ్ డైరెక్టర్‌గా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న రవీంద్ర సన్నారెడ్డికి విక్రమసింహపురి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ డాక్టరేట్‌ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ తాను చిట్టమూరు మండలంలోని ఓ చిన్న పల్లెటూళ్లో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని కష్టపడి పైకి వచ్చానన్నారు. నేటి విద్యార్థులు కష్టపడితే ఏదైనా సాధించవచ్చన్నారు. ముగిసిన పర్యటన నెల్లూరు (క్రైమ్): అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పర్యటన ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం గవర్నర్ ప్రత్యేక హెలికాప్టర్లో గన్నవరం నుంచి బయలుదేరి విక్రమసింహపురి యూనివర్సిటీలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం రోడ్డు మార్గాన పొదలకూరురోడ్డులోని కేన్సర్ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి పోలీసు కవాతుమైదానంలో హెలిప్యాడ్ నుంచి విజయవాడుకు బయలుదేరారు. దేశాభివృద్ధికి నూతన ఆవిష్కరణలు కీలకం : గవర్నర్ వీఎస్‌యూ చాన్సలర్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ దేశాభివృద్ధికి యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణ జరగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. గాంధీ మహాత్ముడితో పాటు ఎంతో మంది త్యాగధనులు తమ ప్రాణాలు పణంగా పెట్టి స్వాతంత్య్రం సాధించారన్నారు. గాంధీజీ పిలుపు క్విట్ ఇండియా ఉద్యమంలో లక్షలాది మంది యువత పాల్గొన్నారన్నారు. ఇలాంటి స్వాతంత్య్రయోధులను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రపంచంలో భారత్ ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న దేశమన్నారు. దేశాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేసేందుకు, సమాజ ప్రగతి కోసం, మాతృభూమి గొప్ప తనం కోసం విద్యార్థులు పాటు పడాలన్నారు. అందుకు విద్య చక్కటి మార్గమన్నారు. విద్యార్థులు పట్టా అందుకోవడం జీవితంలో మధుర జ్ఞాపకమన్నారు. గ్రాడ్యుయేట్ అయిన ప్రతి విద్యార్థి ప్రయాణంలో కాన్వొకేషన్ ఒక మైలు రాయి అన్నారు. మానవత్వం మెలగడానికి ప్రాథమిక విలువలు విధిగా పాటించాలన్నారు. నూతన జాతీయ విద్యావిధానం 2020కి అనుగుణంగా అన్ని ప్రోగ్రాంల పాఠ్యాంశాలను ప్రభుత్వం సవరించిందన్నారు. 2025 నాటికి 1.20 కోట్ల మంది నైపుణ్యం ఉన్న యువత అవసరమన్నారు. అందుకనుగుణంగా యూనివర్సిటీలు విద్యార్థులను నైపుణ్య వంతులుగా తీర్చిదిద్దాలని కోరారు. గోల్డ్ మెడల్స్, డిగ్రీ పట్టాలు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. గోల్డ్ మెడల్స్, డిగ్రీ పట్టాలు అందజేత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా అత్యధిక మార్కులు సాధించి గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్, రీసెర్చ్ స్కాలర్స్‌గా పట్టాలు పొందిన 18 మందికి 26 గోల్డ్ మెడల్స్, కాన్వొకేషన్ పట్టాలు అందించారు. వీరితో మరో 250 మంది గ్రాడ్యుయేట్, పోస్ట్గ్రాడ్యుయేట్కు పట్టాలు అందించా రు. 1. పెనుమాల మనీషా, 2.దారా మాధవి, 3. ఎర్రగుడ్ల శ్రావ్యసుహిత్, 4. కారుమంచి వాసవి, 5. మూర్తి లోహిత (మూడు గోల్డ్ మెడల్స్), 6. షేక్ అఫ్సానా (మూడు గోల్డ్ మెడల్స్), 7. టాటా శ్రీనాథ్‌గౌడ్ (రెండు గోల్డ్ మెడల్స్), 8. పంచకట్ల జ్యోతి (రెండు గోల్డ్ మెడల్స్) 9. దేవరకొండ కల్పన, 10. పోలు అపర్ణ (రెండు గోల్డ్ మెడల్స్), 11. బొరిగి కిరణ్‌కుమార్, 12. రేవిల్ల వర్షిణి సాయిమమత, 13.తన్నీరు మల్లిక, 14. షేక్ ఫజులున్, 15. పోలిరెడ్డి శ్రీదేవి, 16.పల్నాటి సంధ్య (రెండు గోల్డ్ మెడల్స్), 17. పి.లిల్లీ, 18. గొల్లపల్లి సునీత అందుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎల్.విజయకృష్ణారెడ్డి, గవర్న ర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడి యా, కలెక్టర్ చక్రధర్‌బాబు, కమ్యూనిటీ డెవలప్మెంట్ చైర్మన్ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, జేసీ హరేందిరప్రసాద్, నగరపాలక సంస్థ కమిషనర్ జాహ్నవి, అధికారులు, డీన్ లు, అధ్యాపకులు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, రీసెర్చ్ స్కాలర్స్ పాల్గొన్నారు. చదవండి: (ప్రేమ వివాహం.. సాంబశివరావు చెవికొరికి, కర్రలతో దాడి) -
Sociology: సామాజిక శాస్త్రాన్ని అభ్యసించాలి
ప్రపంచంలో భారతదేశానికి ఒక విశిష్టస్థానం ఉండటానికి గల కారణం మనదేశ సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, కట్టుబాట్లు, విలువలు, జానపద రీతులు భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉండటమే. వీటి గురించి తెలిపేదే సామాజిక శాస్త్రం (సోషియాలజీ). సమాజ పరిణామ దశలనూ, సమాజంలోని మానవ సంబంధాలనూ, సమాజ మనుగడనూ; ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక అంశాలనూ ఇది వివరిస్తుంది. సమాజ మనుగడ సక్రమంగా, సరైన రీతిలో కొనసాగాలంటే సమాజం లోని అంతర్గత సంబంధాలు, సంస్కృతీ కరణ, సామాజికీకరణ, స్తరీకరణ ఏవిధంగా ఉండాలో తెలుపుతుంది. ప్రపంచీకరణలో భాగంగా జరిగే పాశ్చాత్యీకరణ మూలంగా క్రమేణా మన దేశంలో ఆచార సాంప్రదాయాలు, సంస్కృతి మార్పులకు గురవుతున్నాయి. అందులో భాగంగానే విద్యావ్యవస్థలో సైతం సమాజ శాస్త్రానికి క్రమంగా గుర్తింపు కరవవుతోంది. ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో సామాజిక శాస్త్రం ఒక సబ్జెక్టుగా దాదాపు కనుమరుగై పోయింది. కేవలం కొన్ని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుగానే ఇది అందుబాటులో ఉంది. (క్లిక్: 124–ఏ సెక్షన్‌ను ఎందుకు రద్దు చేయాలి?) గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు రకాల అంశాలను అధ్యయనం చేయడానికి సామాజిక శాస్త్రం తోడ్పడుతుంది. మానసిక రోగులను పరిరక్షించడానికీ తోడ్పడుతుంది. అంటే ప్రతి వైద్యశాలలో ఒక సామాజికశాస్త్ర నిపుణుడు ఉండాల్సిన అవసరం లేక పోలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల్లో ఈ కోర్సును ప్రవేశ పెట్టి, సమాజం గురించి సమగ్రంగా తెలుసుకునే వీలు కల్పిస్తూ, చదివిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది. (క్లిక్: ఒక కొత్త వ్యవస్థ అవసరం) – డాక్టర్ పోలం సైదులు ముదిరాజ్ తిరుమలగిరి, నాగర్ కర్నూల్ జిల్లా -
వలస కార్మికుల ఆశలు ఆవిరి
మోర్తాడ్ (బాల్కొండ): విదేశీ వలస కార్మికుల సంఖ్యను తగ్గించుకునే విషయంలో మొదట వెనక్కి తగ్గిన కువైట్ ప్రభుత్వం మళ్లీ చర్యలు తీసుకుంటోంది. డిగ్రీ పట్టా లేని 60 ఏళ్ల వయసు నిండిన విదేశీ వలస కార్మికుల వీసాల రెన్యువల్‌కు సానుకూలత తెలిపిన కువైట్ ప్రభుత్వం అంతలోనే మనసు మార్చుకుంది. తమ దేశంలో ఉన్న విదేశీ వలస కార్మికులలో 60 ఏళ్ల వయసు నిండినవారికి డిగ్రీ పట్టా లేకుంటే వారిని సొంత గడ్డకు పంపించాలని 2020 డిసెంబర్లో కువైట్ విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంది. తర్వాత ఈ నిబంధనను అమలు చేస్తే తమ దేశంలోని వివిధ కంపెనీలలో ఉన్న ఎంతో మంది నిపుణులను కోల్పోవలసి వస్తుందని భావించిన కువైట్ సడలింపులు ఇచ్చింది. దీని ప్రకారం 250 దినార్లు అంటే మన కరెన్సీలో రూ.60 వేల వరకు ఫీజును చెల్లించి 60 ఏళ్లు పైబడిన వలస కార్మికులు వీసాను రెన్యువల్ చేసుకోవచ్చని సూచించింది. దీంతో ఈ కేటగిరీలోని కార్మికులు కాస్త ఊరట చెందారు. సీనియారిటీ ఉన్న వలస కార్మికులకు రూ.50 వేలకు మించి వేతనాలు ఉన్నాయి. కువైట్ ప్రభుత్వం సూచించిన ఫీజు చెల్లిస్తే నెల నుంచి 40 రోజుల వేతనం ఖర్చు చేస్తే సరిపోతుందని వలస కార్మికులు భావించారు. కువైట్‌లోని ఆయిల్ కంపెనీలు, కన్స్ట్రక్షన్ కంపెనీలు, మాల్స్ ఇలా ఎన్నో రంగాల్లో 1.75 లక్షల మంది వరకు తెలంగాణకు చెందిన వలస కార్మికులు ఉంటారని అంచనా. ఇందులో డిగ్రీ పట్టా లేని 60 ఏళ్ల వయసు నిండిన వలస కార్మికుల సంఖ్య 30 వేల వరకు ఉంటుంది. కువైట్ ప్రభుత్వం ఇప్పుడు వీసాలను రెన్యువల్ చేయకపోవడంతో వీసా గడువు ముగిసిన వారు ఇంటికి చేరుకోవాల్సి వస్తోంది. చదవండి: విదేశాల్లో వైద్య విద్యకు ఎన్ఎంసీ కఠిన నిబంధనలు -
మన స్టార్ హీరోహీరోయిన్లు ఏం చదివారో తెలుసా?
సినీ పరిశ్రమలో స్టార్ హీరోహీరోయన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. తమ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని పరిశ్రమలో ఓ వెలుగువెలుగుతున్నారు. చదువుతో సంబంధం లేకుండా స్టార్లుగా ఎదిగిన మన హీరోహీరోయిన్లు ఏం చదివారనేది తెలుకోవాలని అందరికి ఆసక్తిగా ఉంటుంది. అయితే ఈ పరిశ్రమలో రాణించాలంటే చదవును పక్కన పెట్టాలనేది ప్రతిఒక్కరి ఉద్దేశం. అయితే మన స్టార్లలో చదువును మధ్యలో ఆపేసి పరిశ్రమలో సెటిలైయిపోయిన వారు కొందరు ఉంటే డిగ్రీ పట్టాలు పుచ్చుకుని ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగిన వారున్నారు. మరీ మన స్టార్ హీరోహీరోయిన్లు ఏఏ డిగ్రీలో పట్టాలు తీసుకున్నారో ఇక్కడ ఓ లుక్కేయండి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా నటుడిగా మారిన ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఈశ్వర్ మూవీతో హీరోగా వెండితెరకు పరిచయమైన ప్రభాస్ హైదరాబాద్‌లో నలంద కాలేజీలో ఇంటర్మిడియట్ చదివాడు. అనంతరం హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కాలేజీ నుంచి బీటేక్‌లో డిగ్రీ పట్టా పొందాడు. అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్‌గా టాలీవుడ్లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ గంగోత్రి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దీనికంటే ముందు మేనమామ మెగాస్టార్ చిరంజీవి డాడీ చిత్రంలో నటుడిగా పరిచమైన ఈ ఐకాన్ స్టార్ చెన్నైలోని ఎంఎస్ఆర్ కాలేజీ నుంచి బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) పూర్తి చేశాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో కృష్ణ ఘట్టమనేని వారసుడిగా, బాలనటుడిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు చెన్నైలోని లయోలా కాలేజీలో బ్యాచిలర్ ఆప్ కామర్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత హీరోగా మారి టాలీవుడ్లో సూపర్ స్టార్‌గా ఎదిగాడు. నాగార్జున్ అక్కినేని అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చి దక్షిణాదిలో వన్ ఆఫ్ ది లీడ్ యాక్టర్‌గా మారిపోయాడు నాగార్జున. అయితే నాగార్జున నటనకు ముందు అమెరికాలో జాబ్ చేసిన సంగతి తెలిసిందే. అమోరికాలోని మిచిగాన్ యూనివర్శిటీలో ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుమేషన్ పూర్తి చేశాడు. కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణం మూవీతో తెలుగు తెరపై మెరిసింది కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్. ఆ తర్వాత వెంటనే చందమామ, మగధీర వంటి చిత్రాల్లో నటించి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన కాజల్ ముంబైలోని కేసీ కాలేజీ నుంచి మాస్ మీడియాలో మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ స్పెషలైజేషన్‌లో డిగ్రీ పూర్తి చేసింది. శ్రుతీ హాసన్ విలక్షణ నటుడు కమల్ హాసన్ నట వారసురాలిగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రుతి హాసన్. ఆ తర్వాత నటిగా, గాయనీగా, మ్యూజిక్ కంపోజర్‌గా ఇక్కడ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న శ్రుతి ముంబైలోని సెయింట్ ఆండ్రీవ్ కాలేజీ నుంచి సైకాలజీలో పట్టా అందుకుంది. సాయి పల్లవి తెలుగు, తమిళ, మలయాళంలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సాయి పల్లవి నటనకు ముందు జార్జియాలోని బిలిసి మెడికల్ స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆ తర్వాత కొంతకాలం ట్రైనీ డాక్టర్ కూడా ఆమె పనిచేసింది. రకుల్ ప్రీత్ సింగ్ అటూ బాలీవుడ్, ఇటూ టాలీవుడ్లో హీరోయిన్గా సత్తా చాటుతోన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ యూనివర్సిటీ సంబంధించిన జీసస్ అండ్ మేరీ కాలేజీ నుంచి మేథమెటిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. దుల్కర్ సల్మాన్ మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేశాడు. పర్డ్యూ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్న దుల్కర్ సల్మాన్ సినిమాల్లోకి రాకముందు బిజినెస్ మేనేజర్‌గా పనిచేశాడు. -
ఆనందంలో మలాలా కుటుంబ సభ్యులు
నోబెల్ శాంతి బహుమతి గ్రహిత, పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూసఫ్ జాయ్ సంబరాల్లో మునిగిపోయారు. ప్రఖ్యాత ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసిన ఫొటోలను కూడా షేర్ చేశారు. ‘హ్యాపీ గ్రాడ్యుయేషన్ మలాలా’ అని రాసి ఉన్న కేక్‌ను కట్ చేశారు. ‘నేను ఆక్స్‌ఫర్డ్‌లో నా ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ డిగ్రీ పూర్తిచేశాను. దీనిపై నా ఆనందాన్ని, కృతజ్ఞతను తెలుపడానికి మాటలు రావడం లేదు. ఇక ముందు ఏం జరుగుతుందో నాకు తెలియదు. ప్రస్తుతానికి నెట్‌ఫ్లిక్స్, పుస్తకాలు చదవడం, నిద్ర పోవడం ఇదే నా పని’ అని మలాలా పేర్కొన్నారు. కాగా, బాలికల విద్య కోసం పోరాడిన మలాలా.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పాకిస్తాన్లో బాలికలను పాఠశాలల్లోకి అనుమతించాలని మలాలా ప్రచారం చేయడంతో.. 2012లో ఆమె ప్రయాణిస్తున్న స్కూలు బస్సుపై మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆమె గాయపడ్డారు. ఈ క్రమంలోనే మలాలా సేవకు గుర్తింపుగా 2014లో ఆమెను నోబెల్ శాంతి బహుమతి వరించిన విషయం తెలిసిందే. (చదవండి : ఆ దేశంలో టెలిగ్రామ్‌పై నిషేధం ఎత్తివేత!) Hard to express my joy and gratitude right now as I completed my Philosophy, Politics and Economics degree at Oxford. I don’t know what’s ahead. For now, it will be Netflix, reading and sleep. 😴 pic.twitter.com/AUxN55cUAf — Malala (@Malala) June 19, 2020 -
ఆనందంలో బచ్చన్ ఫ్యామిలీ
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనువరాలు నవ్య నవేలి నందా పట్టభద్రురాలైంది. న్యూయార్క్‌లోని ఫోర్డ్‌హమ్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ పూర్తిచేసింది. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. మనువరాలు పట్టభద్రరాలైన సందర్భంగా బిగ్‌బీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టారు. "నవ్య..ప్రతీ విద్యార్థి జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు గ్రాడ్యుయేషన్ డే. లాక్డౌన్ కారణంగా ఈవెంట్ క్యాన్సల్ అయిపోయింది. కానీ బాధపడకు. నిన్ను సంతోషపెట్టేందుకు మేమందరం నీతో పాటే ఉన్నాం. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాం. గాడ్ బ్లస్ యూ నవ్య "..అంటూ పోస్ట్ చేశారు. (రెండు రోజుల పని ఒక రోజులోనే పూర్తి: అమితాబ్ ) View this post on Instagram Grand daughter Navya .. the most important day in the life of a young student - Graduation Day .. ! She graduated from College in New York, but ceremony and presence got cancelled because of Corona and lockdown .. she could not go .. we too had all planned to be with her on this important occasion .. BUT .. she though wanted to wear that Graduation gown and Cap .. so staff stitched her an impromptu gown and cap .. and she wore it and celebrated at home in Jalsa .. So proud of you NAVYA .. god bless .. such a positive and happy attitude .. LOVE YOU💕💕💕💕 A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on May 6, 2020 at 7:22am PDT దీంతో పలువరు ప్రముఖులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఇక మేనకోడలు గ్రాడ్యుయేట్ కావడం పట్ల అభిషేక్ బచ్చన్ ఆనందం వ్యక్తం చేశారు. కంగ్రాట్స్ నవ్య అంటూ పోస్ట్ చేశారు. ఇక లాక్డౌన్ కారణంగా గ్రాడ్యేయేషన్ వేడుకకు వెళ్లలేని కారణంగా మనువరాలు నవ్య కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన డ్రెస్‌లో నవ్య ఫోటోలకు ఫోజులిస్తూ ఆనందంగా కనిపించింది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నిఖిల్ నందా, శ్వేతా బచ్చన్ నందా మొదటి సంతానమే నవ్య నందా. -
మన మట్టిలోనే ఉంది
కుమారి పుట్టింది కేరళలోని రామమంగళం. మధ్య తరగతి కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయదారులు. అక్షరం జీవితాన్ని వెలిగిస్తుందని నమ్మారు. పిల్లలిద్దరినీ చదివించి తీరాలనుకున్నారు. కుమారి, ఆమె తమ్ముడు.. ఇద్దరూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కుమారి... అమ్మానాన్నల పెద్ద బిడ్డ కావడంతో ఆ ఇద్దరిలో ముందుగా గ్రాడ్యుయేట్ అయ్యారు. అయితే ఆ రికార్డు ఆ ఇంటికి మాత్రమే పరిమితం కాలేదు. ఊరంతటికీ రికార్డే. కేరళ అక్షరాస్యతలో ముందున్నప్పటికీ... అప్పటివరకు ఆ ఊర్లో పట్టభద్రులైన వాళ్లు లేరు. కుమారి ఆ రికార్డును బ్రేక్ చేశారు. ఆమె ఆ చదువుతో తన కుటుంబ జీవితాన్ని నిర్మించుకుని అక్కడితో గిరిగీసుకుని ఉండి ఉంటే ఆమె గురించి ఇంతగా చెప్పుకోవడానికి ఏమీ ఉండేది కాదేమో. ఆమె తన గ్రామంలో తర్వాతి తరం పిల్లలందరినీ గ్రాడ్యుయేట్లను చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఇప్పటికి ఆ సంఖ్య వెయ్యి దాటింది. అత్తగారి మద్దతు కుమారి పెళ్లి శిబులాల్‌తో జరిగింది. అతడు ఇన్ఫోసిస్‌లో సీఈవో హోదాలో ఉన్నాడు. పెళ్లితో కేరళ వదిలి ముంబయి, ఆ తర్వాత యూఎస్‌కు వెళ్లారు కుమారి. కొన్నేళ్ల తర్వాత 1997లో కుటుంబంతో సహా ఇండియాకి తిరిగి వచ్చారామె. ఆమె చేయదలుచుకున్న విద్యాసేవకు అత్తగారి కుటుంబం సంపూర్ణంగా మద్దతునిచ్చింది. కుమారి 1999లో సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ (ఎస్డీఎఫ్), 2004లో అద్వైత్ ఫౌండేషన్ స్థాపించారు. హైస్కూల్ పూర్తయిన పిల్లలందరూ జూనియర్ కాలేజ్‌లో చేరేలా చూడడం, ఇంటర్ పూర్తయిన తర్వాత విధిగా గ్రాడ్యుయేషన్‌లో చేర్పించడం ఆమె తలకెత్తుకున్న బాధ్యత. పిల్లల వయసుల వారీగా విద్యాదాన్, విద్యారక్షక్, అద్వైత్ ఫౌండేషన్, అంకుర్ ఫౌండేషన్లను స్థాపించి వాటిని సంయుక్తంగా నిర్వహిస్తున్నారామె. అందరికీ తెలియాలి ‘‘పరోపకారంలో భారతదేశ సంస్కృతి మహోన్నతమైనది. అయినప్పటికీ గత ఏడాది 128 దేశాల వరల్డ్ గివింగ్ ఇండెక్స్ ర్యాంకులో భారతదేశానికి దక్కింది 82 స్థానం. ఇందుకు కారణం భారతదేశంలో, భారతీయుల్లో ఎదుటి వారికి ఇచ్చే గుణం లేదని కాదు. పరోపకారాలు పైకి తెలియకపోవడమే. ఎదుటి వ్యక్తి అవసరంలో ఉన్నట్లు గమనించినప్పుడు తమకు తోచిన సహాయం చేసేస్తారు. అంతేతప్ప ఒకరికి సహాయం చేయడానికి లెక్కలు, రిజిస్టర్లు మెయింటెయిన్ చేయరు. పరోపకారం చేసిన విషయానికి ప్రచారం కల్పించుకోకపోవడం, డాక్యుమెంట్లు తయారు చేసుకోలేకపోవడం, వాటిని ఇలాంటి పోటీలకు దరఖాస్తు చేసుకోకపోవడం వల్ల గణాంకాల ఆధారంగా వచ్చే ర్యాంకులలో పై స్థానాలకు చేరుకోవడం భారతదేశానికి కష్టమవుతోంది. నిజానికి భారతీయుల్లో సహాయం చేసేగుణం మెండు’’ అని చెప్పారు కుమారి. తమ కుటుంబం ఆర్థికంగా వెనుకపడిన కుటుంబాల పిల్లల ఉన్నత చదువుల కోసం చేస్తున్న సహాయాన్ని వివరిస్తూ... ‘‘ఇలాంటి కుటుంబాలు మనదేశంలో చాలానే ఉన్నాయి. ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చదివిస్తున్నామంటే అది ఆ ఒక్కరికి లేదా ఆ కుటుంబానికి మాత్రమే చేస్తున్న సహాయం కాదు. దేశానికి మనవంతుగా ఇస్తున్న సహకారం’’ అన్నారామె. – మంజీర -
‘ఇంటరే పాస్ అయ్యాడు.. ప్రధానిగా పనికి రాడు’
న్యూఢిల్లీ : గత ఎన్నికల్లో కేవలం ఇంటర్ పాస్ అయిన వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకున్నారు. కానీ ఈ సారి మాత్రం అలాంటి తప్పు చేయకండంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలను కోరారు. ఢిల్లీలో నిర్వహించిన విపక్షాల ర్యాలీలో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ యూనివర్సిటీ డిగ్రీ వివాదాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘గతంలో కేవలం ఇంటర్మీడియెట్ పాస్ అయిన వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకున్నారు. ఎలాంటి కాగితాల మీద సంతకం పెడుతున్నాడో.. ఏం నిర్ణయం తీసుకుంటున్నాడో అతనికి అర్థం కావడం లేదు. ప్రస్తుతం దేశంలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. వాటిని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవాలంటే విద్యావంతుడైన ప్రధాని కావాలి. అందుకే ఈ సారి ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి’ అని ప్రజలను కోరారు. అంతేకాక గతంలో మాదిరిగానే ఇంటర్ పాస్ అయిన వ్యక్తిని మరోసారి ప్రధానిగా ఎన్నుకోవద్దని తెలిపారు. అతను నియంతలా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నాడు అంటూ మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా సమర్థించారు. -
విద్యార్థిని గర్భవతి అయిందని..!
అమెరికాలోని మేరిల్యాండ్‌లో గర్భవతి అయిన ఓ విద్యార్థినిని స్నాతకోత్సవ వేడుకకు హాజరుకాకుండా నిషేధించడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ఈ విషయమై ప్రజల నుంచి, జాతీయ అబార్షన్ వ్యతిరేక సంఘాల నుంచి ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా.. వచ్చేవారం జరగనున్న స్నాతకోత్సవానికి సదరు విద్యార్థిని అనుమతించరాదన్న తన నిర్ణయంపై మేరిల్యాండ్ హాజర్స్టౌన్లోని హెరిటేజ్ అకాడమీ వెనుకకు తగ్గడం లేదు. సీనియర్ విద్యార్థిని అయిన మ్యాడీ రంక్లెస్ లైంగిక కలాపాల్లో పాల్గొనడం ద్వారా తమ పాఠశాల నిబంధనలను ఉల్లంఘించిందని, అందుకే సహ విద్యార్థులతోపాటు ఆమెకు స్నాతకోత్సవ వేదికపై డిప్లోమా పట్టా అందజేయడం లేదని పేర్కొంది. ఆమె గర్భవతి అయినందుకు కాదు.. కానీ అనైతిక చర్యల్లో పాల్గొన్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తల్లిదండ్రులకు స్కూల్ ప్రిన్సిపాల్ డేవిడ్ హాబ్స్ రాసిన లేఖలో పేర్కొన్నారు. 18 ఏళ్ల రంక్లెస్ 2009 నుంచి హెరిటేజ్ అకాడమీ స్కూల్లో చదువుతున్నది. గత జనవరిలో ఆమె గర్భవతి అని తేలింది. అప్పట్లో ఆమె తండ్రి స్కూల్ బోర్డు మెంబర్‌గా ఉండేవారు. మొదట ఆమెను స్కూల్ నుంచి బహిష్కరిస్తామని, విద్యార్థి కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తామని పాఠశాల యాజమాన్యం హెచ్చరించింది. ఏడాదిపాటు ఇంటివద్దే ఉండి చదుకోవాలని చెప్పింది. అయితే, తల్లిదండ్రులు విజ్ఞప్తి చేయడంతో 14మంది తోటి విద్యార్థులతో కలిసి ఆమె కూడా తరగతులకు హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, తోటి విద్యార్థుల తరహాలో ఆమె కూడా స్నాతకోత్సవ వేడుకలో డిప్లమా పట్టా అందుకోవడానికి పాఠశాల అనుమతించకపోవడాన్ని తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. స్కూలు యాజమాన్యం నిర్ణయం సరైనది కాదని అంటున్నారు. వారికి అమెరికాలోని హక్కుల సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. -
తీరని కోరిక అంటున్న హీరోయిన్!
చిన్పప్పుడు స్కూలుకు వెళ్లాలంటే పిల్లలు ఎవరైనా కాస్త బద్దకంగా కనిపిస్తారు. అదే కాస్త అలవాటు పడితే వారే స్కూలు జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇందుకు సెలబ్రిటీలు కూడా అతీతులు కాదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ముక్కుసూటిగా మాట్లాడుతుందన్న పేరు కూడా సోనమ్ సొంతం. తాను అనుకున్న విషయంపై నేరుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే కొంత మంది హీరోయిన్లలో సోనమ్ ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలబ్రిటీలకు కూడా చదువు కష్టాలు తప్పవని బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ అంటోంది. తన జీవితంలో ఇప్పటివరకూ తీరని కోరికల గురించి సోనమ్ మీడియాతో కొన్ని విషయాలు పంచుకుంది. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో చేయలేకపోయానే అనే వెలితి ఉంటుంది కదా.. తనకు కూడా అలాంటి విషయం ఒకటుందని సోనమ్ చెప్పింది. చదువు తనకు సమస్యగా మారిందని అభిప్రాయపడింది. కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలన్నది తన కల అని, అయితే ఇంటర్ తర్వాత చదువు సాగలేదని వివరించింది. యూనివర్సిటీకి వెళ్లి కనీసం గ్రాడ్యుయేషన్ ఐనా పూర్తి చేయాలని ప్రస్తుతం ఆ పనిలో ఉన్నానని ముప్పై ఏళ్ల సోనమ్ చెప్పుకొచ్చింది. అయినా తనకు అప్పుడే వయసు మించిపోలేదంటూ చిన్నగా నవ్వేసింది సోనమ్.