దేశ సేవలో పాలుపంచుకునే అవకాశంతోపాటు అత్యుత్తమ కెరీర్‌కు బాటలు వేసే వేదిక భారతీయ వాయుసేన. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో వివిధ హోదాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేషన్/ఇంజనీరింగ్, బీఈడీ ఉత్తీర్ణులు ఆయా కొలువులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష, వైద్య, శారీరక పరీక్షలు, మౌఖిక పరీక్ష.. ఇలా అన్ని దశలను దాటుకుని విజేతలైనవారు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ప్రవేశించవచ్చు. ఈ నేపథ్యంలో భారతీయ వాయుసేనలో ఉన్న వివిధ ఉద్యోగావకాశాలపై ప్రత్యేక ఫోకస్..
పదో తరగతితో
పదో తరగతి ఉత్తీర్ణులు గ్రూప్-వై విభాగంలో మ్యుజీషియన్ ఉద్యోగాలు పొందొచ్చు. అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు కీ బోర్డ్/గిటార్/వయోలిన్ /శాక్సాఫోన్/జాజ్ డ్రమ్/సరోద్/వీణ/నాద స్వరం వంటి వాటిలో దేనిలోనైనా ప్రావీణ్యం ఉండాలి. వయోపరిమితి: నిర్దేశిత తే దీనాటికి 17-25 ఏళ్లు.
ఎంపిక: రాత పరీక్ష, వాద్య పరికరంలో పరీక్ష ఆధారంగా. రాత పరీక్షలో భాగంగా ఇంగ్లిష్ డిక్టేషన్‌ను పరీక్షిస్తారు. దీంతోపాటు సంబంధిత వాద్య పరికరంలో అభ్యర్థి ప్రావీణ్యతను తెలుసుకుంటారు.
10+2తో
ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ ఎగ్జామ్ (ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ) ద్వారా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా ఉద్యోగం పొందొచ్చు.
అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్‌లతో 10+2 ఉత్తీర్ణత. అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు.
వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 16 1/2 నుంచి 19 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా.
రాత పరీక్ష విధానం: ఇందులో రెండు పేపర్లుంటాయి. అవి.. 1. మ్యాథ్స్ (300 మార్కులు), 2. జనరల్ ఎబిలిటీ టెస్ట్ (600 మార్కులు). రెండో పేపర్ జనరల్ ఎబిలిటీ టెస్ట్‌లో భాగంగా పార్ట్-ఏ, పార్ట్-బీ అనే రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్-ఏలో ఇంగ్లిష్ 200 మార్కులకు, పార్ట్-బీలో జనరల్ నాలెడ్జ్ 400 మార్కులకు ప్రశ్నలడుగుతారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన వాటికి నెగెటివ్ మార్కులుంటాయి. ఒక్కో పేపర్ కాల వ్యవధి రెండున్నర గంటలు.
నోటిఫికేషన్: ఏడాదికి రెండుసార్లు (మే, డిసెంబర్)
వెబ్‌సైట్: www.upsc.gov.in
ఎయిర్‌మెన్ ఉద్యోగాలు
భారతీయ వాయుసేనలో గ్రూప్-ఎక్స్, గ్రూప్-వై విభాగాల్లో ఎయిర్‌మెన్ ఉద్యోగాల భర్తీకి ప్రతి ఏటా ఎంపిక నిర్వహిస్తారు.
అర్హతలు: గ్రూప్- ఎక్స్ (ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్ మినహా): 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్‌లతో 10+2 ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి. లేదా 50 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా (మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/కంప్యూటర్ సైన్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణత.
వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 17 - 21 ఏళ్లు.
గ్రూప్-వై (మ్యుజీషియన్, మెడికల్ అసిస్టెంట్ మినహా): 50 శాతం మార్కులతో ఏదైనా గ్రూప్‌తో 10+2 ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి.
వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 17-21 ఏళ్లు.
గ్రూప్-వై (మెడికల్ అసిస్టెంట్): 50 శాతం మార్కులతో ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీ/ఇంగ్లిష్‌లతో 10+2 ఉత్తీర్ణత.
ఎంపిక: దేశవ్యాప్తంగా ఎంపిక పరీక్ష, రిక్రూట్‌మెంట్ ర్యాలీ, ఇంటర్వ్యూల ఆధారంగా. టెక్నికల్ విభాగాలవారికి ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది.
రాత పరీక్ష: గ్రూప్- ఎక్స్ (టెక్నికల్ విభాగాలు) వారికి ఇంగ్లిష్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లపై పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి ఒక గంట (60 నిమిషాలు). గ్రూప్-వై (నాన్ టెక్నికల్) వారికి ఇంగ్లిష్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్‌లపై ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 45 నిమిషాలు. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. 10+2 స్థాయి సిలబస్‌పై ప్రశ్నలు అడుగుతారు.
బీఈడీతో..
సంబంధిత డిగ్రీ, పీజీలతోపాటు బీఈడీ ఉత్తీర్ణులు గ్రూప్-ఎక్స్‌లో ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. బోధనలో రెండేళ్ల అనుభవం ఉండాలి. లేదా ఏదైనా పీజీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత. రెండేళ్లపాటు బోధనలో అనుభవం ఉండాలి.
వయోపరిమితి: డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులకు 20-25 ఏళ్లు. పీజీ, బీఈడీ ఉత్తీర్ణులకు 20-28 ఏళ్లు. ఎంపిక: రాతపరీక్ష, శారీరక, వైద్య పరీక్షల ఆధారంగా.
ఇంజనీరింగ్/గ్రాడ్యుయేషన్‌తో
ఫ్లైయింగ్ బ్రాంచ్
దీనికి ఎంపికైనవారు ఫైటర్ పైలట్ లేదా హెలికాఫ్టర్ పైలట్ లేదా ట్రాన్స్‌పోర్ట్ పైలట్‌గా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వివిధ పద్ధతుల ద్వారా ఫ్లైయింగ్ బ్రాంచ్‌లో అవకాశాలు కల్పిస్తారు. అవి.. గ్రాడ్యుయేషన్, ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ, ఎస్‌ఎస్‌సీ ఎంట్రీ
గ్రాడ్యుయేషన్‌తో సీడీఎస్‌ఈ ద్వారా..
ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ (సీడీఎస్‌ఈ) ద్వారా ఫ్లైయింగ్ బ్రాంచ్‌లో ప్రవేశించొచ్చు.
అర్హతలు:
భారతీయ పౌరులై ఉండాలి.
అవివాహితులై ఉండాలి.
పురుషులు మాత్రమే అర్హులు.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్/బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. 10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి.
వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 19- 23 ఏళ్లు.
నోటిఫికేషన్: ఏడాదికి రెండుసార్లు (జూన్, అక్టోబర్)
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: www.upsc.gov.in
ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ:
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ)లో ‘సి’ సర్టిఫికెట్ పొందినవారు ఎన్‌సీసీ స్పెషల్ ఎం ట్రీ ద్వారా ఫ్లైయింగ్ బ్రాంచ్‌లో ప్రవేశం పొందొచ్చు.
అర్హతలు:
భారతీయ పౌరులై ఉండాలి.
అవివాహితులై ఉండాలి.
60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. 10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్‌లు చదివుండాలి. లేదా 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్ సీనియర్ డివిజన్ నుంచి ‘సి’ సర్టిఫికెట్ పొంది ఉండాలి.
వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 19-23 ఏళ్లు.
దరఖాస్తు: ఎన్‌సీసీ ఎయిర్ స్క్వాడ్రన్స్/డెరైక్టర్ జనరల్, ఎన్‌సీసీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎస్‌ఎస్‌సీ (షార్ట్ సర్వీస్ కమిషన్) ఎంట్రీ:
ఇందులో ప్రవేశానికి మహిళలు, పురుషులూ ఇద్దరూ అర్హులే. ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌సీఏటీ) ద్వారా ఇందులో అడుగుపెట్టొచ్చు.
అర్హతలు:
భారతీయ పౌరులై ఉండాలి.
అవివాహితులై ఉండాలి.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. 10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్‌లు చదివుండాలి. లేదా 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 19 - 23 ఏళ్లు.
ప్రకటన: ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్‌కు ప్రతి ఏటా జూన్, డిసెంబర్‌లలో ప్రకటన వెలువడుతుంది.
గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్
ఇందులో మొత్తం ఐదు విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అవి..
అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్:
ఇందులో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా, ఫైటర్ కంట్రోలర్‌గా విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
అర్హత: 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత లేదా 50 శాతం మార్కులతో పీజీ/తత్సమాన డిప్లొమా ఉత్తీర్ణత.
అకౌంట్స్ బ్రాంచ్: వివిధ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించడంతోపాటు ఆడిటర్‌గా పనిచేయాల్సి ఉంటుంది.
అర్హత: 60 శాతం మార్కులతో బీకాం ఉత్తీర్ణత లేదా 50 శాతం మార్కులతో ఎంకాం/సీఏ/ఐసీడబ్ల్యుఏ ఉత్తీర్ణత.
లాజిస్టిక్స్ బ్రాంచ్: లాజిస్టిక్స్ బ్రాంచ్‌కు ఎంపికైనవారు ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన వివిధ వనరులు, వస్తు సేవలను నిర్వహించాలి. ఎక్విప్‌మెంట్ పర్యవేక్షణ చేయాలి.
అర్హత: 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత లేదా 50 శాతం మార్కులతో పీజీ/తత్సమాన డిప్లొమా.
ఎడ్యుకేషన్ బ్రాంచ్: అర్హత: 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత.
మెటియొరాలజీ బ్రాంచ్: వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఫ్లైట్ ఆపరేటర్స్‌కు సలహాలను అందించడంతోపాటు ఇతర విధులు నిర్వహించాలి. అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా సైన్స్ స్ట్రీమ్‌తో పీజీ/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/జాగ్రఫీ/కంప్యూటర్ అప్లికేషన్స్/ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/అప్లైడ్ ఫిజిక్స్/ఓషనోగ్రఫీ/అగ్రికల్చర్ మెటియొరాలజీ/ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్/జియోఫిజిక్స్/ఎన్విరాన్‌మెంటల్ బయాలజీ ఉత్తీర్ణత. 55 శాతం మార్కులతో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
టెక్నికల్ బ్రాంచ్
టెక్నికల్ బ్రాంచ్‌కు ఎంపికైనవారు ఎయిర్‌ఫోర్స్‌లో అత్యాధునిక ఎక్విప్‌మెంట్‌కు ఇన్‌చార్జ్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇందులో రెండు విధానాల ద్వారా ప్రవేశించొచ్చు. అవి.. యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ (యూఈఎస్), ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సు. రెండింటిలోనూ ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్:
అర్హతలు: అవివాహితులై ఉండాలి.
పురుషులు మాత్రమే అర్హులు.
ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో బీఈ/బీటెక్ ప్రీ ఫైనలియర్ చదువుతుండాలి.
వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 18-28 ఏళ్లు.
ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్స్ ద్వారా..
అర్హతలు: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్/సంబంధిత బ్రాంచ్‌ల్లో ఉత్తీర్ణత.
పర్మినెంట్ కమిషన్‌కు పురుషులు, షార్ట్ సర్వీస్ కమిషన్‌కు పురుషులు, మహిళలు అర్హులు.
ఎంపిక: ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా.
ప్రకటన: ప్రతి ఏటా జూన్, డిసెంబర్‌లలో.
వెబ్‌సైట్: careerairforce.nic.in
ఎయిర్‌ఫోర్స్.. అవకాశాలకు ఆకాశమే హద్దు
Published Mon, Feb 17 2014 12:02 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement