excellence
-
ఉత్తముల లక్షణం
తమ ప్రతిభని ఎవరు ఎంత వరకు గ్రహించగలరో అంత వరకే ప్రదర్శిస్తారు ఉత్తములు. అంతే కాని తమకి ఉన్న పాండిత్యాన్ని అంతా ఎవరి వద్ద పడితే వారి వద్ద ప్రదర్శించరు.ఒకటవ తరగతి చదివే పిల్లలకి వ్యాకరణం బోధిస్తే కంగారు పడి మళ్ళీ దాని జోలికి వెళ్ళటానికి ఇష్టపడరు. వారికి అక్షరాలు చాలు. అంత మాత్రానికే తమకి ఎంతో తెలుసు అనుకుంటారు. తనకి ఎంత తెలుసు అని కాదు, ఎదుటివారికి ఏమి కావాలి? ఎంత వరకు అర్థం చేసుకోగలరు? అన్నది ప్రధానం. ఈ మాట తుంబురుడి గాన విద్యా ప్రావీణ్యం చూసిన నారదుడు అనుకున్నది. ఒక పాఠశాల వార్షికోత్సవంలో విద్యార్థుల కోసం పాడ మంటే రాగం, తానం, పల్లవి ఆలపిస్తే వారు జన్మలో శాస్త్రీయ సంగీతం జోలికి వెళ్లరు. అయినా ప్రతివారి వద్ద తమ ప్రతిభని ప్రదర్శించ వలసిన అవసరం లేదు. చెవిటి వాడి ముందు శంఖం ఊదితే కొరుకుడు పడటం లేదా? సహాయం చేయనా? అని అడుగుతాడు. అంతేకాదు ఎవరి వద్ద క్లుప్తంగా చె΄్పాలి, ఎవరి వద్ద వివరంగా చె΄్పాలి అన్నది కూడా తెలియ వలసిన అవసరం ఉంది. మాట నేర్పరితనంలో ఇది ప్రధానమైన అంశం. దీనికి హనుమ గొప్ప ఉదాహరణం. సీతాదేవిని చూచి వచ్చిన హనుమ తన కోసం ఎదురు చూస్తున్న అంగదాదులతో ముందుగా ‘చూడబడినది నా చేత సీత’ అని క్లుప్తంగా చెప్పి, సావకాశంగా కూర్చొన్న తరువాత వారి కోరిక పైన తాను బయలుదేరిన దగ్గరనుండి ఆ క్షణం వరకు జరిగినదంతా పూసగుచ్చినట్టు చె΄్పాడు. అందులో తన ప్రతాపం చాలా ఉంది. అది అంతా సత్యమే! అది విని ముఖ్యంగా యువరాజు, ఈ బృందనాయకుడు అయిన అంగదుడు, తన శక్తిని గుర్తించి, గుర్తు చేసి, వెన్నుతట్టి ప్రోత్సహించిన జాంబవంతుడు, కపులు సంతోషిస్తారు. పైగా కపివీరులు అవన్నీ తామే చేసినట్టు ΄÷ంగి ΄ోయారు. అదే విషయం సుగ్రీవ శ్రీరామచంద్రులతో క్లుప్తంగా చె΄్పాడు. వారు తన యజమానులు. వారి వద్ద ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వారి సమయం విలువైనది. పైగా రాజుల వద్ద దాసులు తమ ఘనత చెప్పుకోకూడదు. అది రాచమర్యాద కాదు. అందుకే తన ప్రతాపం ఎక్కడా మాటల్లో వ్యక్తం కాకుండా జాగ్రత్త పడ్డాడు. ఒక్క మాటలో సముద్రం లంఘించి వెళ్ళాను అని తేల్చి వేశాడు. అది మర్యాద మాత్రమే కాదు, వినయశీలత. విరాటరాజు కొలువులో ప్రవేశించటానికి వెడుతున్న పాండవులకు వారి పురోహితుడు ఇచ్చిన సూచనలు అందరికీ ఉపయోగ పడేవే. రాజుకన్న విలువైన వస్త్రాలు ఆభరణాలు ధరించ కూడదు, రాజుగారి భవనాని కన్న పెద్ద, ఎతై ్తన భవనంలో ఉండ కూడదు అన్నవి ఇక్కడ పేర్కొన దగినవి. తమ ఘనత సందర్భానుసారం ప్రకటించాలి. ఎదగటం లేదా ఒదగటం పరిస్థితులను అనుసరించి ఉండాలి. పిడుగుకి బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్టు ఉండరు తెలివైన వారు. దీనికి చక్కని ఉదాహరణ చెపుతాడు పింగళి సూరన.‘‘ఉత్తముల మహిమ నీరు కొలది తామర సుమ్మీ’’ అని. చెరువులో నీటి మట్టం పెరిగితే తామర కాడ చుట్లు విచ్చుకొని, పువ్వు గాని, మొగ్గ గాని ఆకు గానీ ఉపరితలం మీద తేలుతాయి. నీరు తగ్గితే కాడ చుట్టలు చుట్టుకొని పువ్వు మాత్రమే నీటి ఉపరితలం మీద ఉంటుంది. నీరు ఎండి΄ోతే దుంపలో తన జీవశక్తిని నిక్షిప్తం చేసి ముడుచుకొని ΄ోయి ఉంటుంది. నీరు నిండితే చిగురిస్తుంది. ఉత్తముల గొప్పతనం కూడా అంతే! – డా. ఎన్. అనంతలక్ష్మి -
ఎక్సలెన్స్ సెంటర్లుగా డైట్ కళాశాలలు
సాక్షి, అమరావతి: ప్రపంచ అవకాశాలను అందుకునేలా.. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన చేసే ఉపాధ్యాయులకు ఈ దిశగా శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో తొలివిడతగా మూడు జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఎంపిక చేసింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 125 డైట్ కళాశాలలను మోడల్ డైట్స్ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)గా ఎంపిక చేయగా.. వాటిలో రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు జిల్లాలకు చెందిన మూడు డైట్ కళాశాలలకు అవకాశం దక్కింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు, శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయ విద్యార్థులను నూతన విద్యా విధానానికి అనువుగా శిక్షణ ఇచ్చేందుకు వీటిని తీర్చిదిద్దనున్నారు. ఈ మూడు సెంటర్ల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.24 కోట్లను మంజూరు చేసింది. రాష్ట్రంలో మొత్తం 13 డైట్ కాలేజీలు ఉండగా.. మూడు కేంద్రాలకు మోడల్ డైట్ గుర్తింపు లభించింది. మిగిలిన డైట్ కేంద్రాలను 2028 నాటికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దనున్నారు. ఎన్ఈపీకి అనుగుణంగా మార్పు జాతీయ విద్యావిధానం–2020 (ఎన్ఈపీ) ప్రకారం డైట్ కళాశాలల్లో శిక్షణ పొందే ఉపాధ్యాయ విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ఇన్ సర్వీస్, ఇండక్షన్ శిక్షణ ఇవ్వనున్నారు. దీంతోపాటు విద్యార్థులకు, ఉపా«ద్యాయులకు విద్యా సంబంధ పరిశోధన చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు. వృత్తి విద్యా కోర్సులో భాగంగా పారిశ్రామిక భాగస్వాములతో సమన్వయం చేసుకుంటూ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అందుకు అవసరమైన సదుపాయాలను మోడల్ డైట్స్‌లో కల్పిస్తారు. ఎక్సలెన్స్ సెంటర్లుగా ఎంపికైన డైట్స్‌లో పూర్తి మౌలిక సదుపాయాలు, స్మార్ట్ తరగతి గదులు, ఐసీటీ ల్యాబ్ (కంప్యూటర్ ల్యాబ్స్), ప్రయోగశాలలు, భద్రత కోసం సీసీ కెమెరాలు, ప్రహరీ, ప్రథమ చికిత్స కిట్స్, స్టాఫ్ క్వార్టర్స్ (సిబ్బందికి వసతి), ఫర్నిచర్, కిచెన్ గార్డెన్, సోలార్ ప్యానల్స్, క్రీడా సౌకర్యాలు, విద్యార్థులకు వసతి గృహాలు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలతో తీర్చిదిద్దుతారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో 13 డైట్ సెంటర్లు ఉన్నాయని, వాటిలో ఈ ఏడాది మూడు సెంటర్లను కేంద్ర ప్రభుత్వం మోడల్ డైట్స్గా ఎంపిక చేసి 24 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తెలిపారు. త్వరలో వీటిలో అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. మిగిలిన 10 డైట్ కళాశాలలను 2028 సంవత్సరం నాటికి ఎక్సలెన్స్ సెంటర్లుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నట్టు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. -
పార్లమెంటే అత్యుత్తమం: ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ: దేశంలో పార్లమెంటే అత్యుత్తమమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తేల్చిచెప్పారు. రాజ్యాంగం మన పార్లమెంట్‌లోనే పురుడు పోసుకుందని గుర్తుచేశారు. రాజ్యాంగ రచనలో న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థ తదితరాల పాత్ర ఎంతమాత్రం లేదన్నారు. ప్రజల తీర్పును పార్లమెంట్ ప్రతిబింబిస్తుందని చెప్పారు. రాజ్యాంగ రూపశిల్పి పార్లమెంటేనని వివరించారు. తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్రావు జీవిత చరిత్ర గ్రంథాన్ని జగదీప్ ధన్‌ఖడ్ ఆదివారం పార్లమెంట్ ప్రాంగణంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ధన్‌ఖడ్ మాట్లాడారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకంపై కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ నడుమ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, దేశాభివృద్ధిని చూసి ఓర్వలేకే కొందరు విదేశాలకు వెళ్లి మన దేశంపై విషం చిమ్ముతున్నారని, మన ప్రజాస్వామ్యంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని ధన్‌ఖడ్ విమర్శించారు! అలాంటి వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఇటీవల బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం పార్లమెంటులో దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ పేరు ప్రస్తావించకుండా ధన్‌ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
విశాఖలో ఎస్టీపీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్
సాక్షి, అమరావతి: నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు దేశంలోనే తొలి ఇండ్రస్టియల్–4 సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ) రాష్ట్రంలో ఏర్పాటవుతోంది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్పత్తులు పెంచడానికి ఇది ఉపయోగపడనుంది. విశాఖపట్నం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)లో ఎల్రక్టానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ).. ఈ సీవోఈని ఏర్పాటు చేస్తోంది. ఎస్టీపీఐ ఏర్పాటు చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి 12 సీవోఈలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్టీపీఐ డైరెక్టర్ ఓంకార్ రాయ్ తెలిపారు. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన ఇండస్ట్రీస్–4 సీవోఈ విశాఖలో ఏర్పాటవుతోంది. వ్యయాలను తగ్గించే టెక్నాలజీ అభివృద్ధి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీ–4 టెక్నాలజీ అభివృద్ధిలో లక్సెంబర్గ్ ముందంజలో ఉందని, ఇప్పుడిదే స్థాయిలో విశాఖలో సీవోఈని ఏర్పాటు చేస్తున్నామని ఎస్టీపీఐ విశాఖ జాయింట్ డైరెక్టర్ ఎంపీ దుబే ‘సాక్షి’కి వివరించారు. ముఖ్యంగా ఉక్కు, అల్యూమినియం, విద్యుత్ ఉత్పత్తి వంటి భారీ పరిశ్రమల్లో ఆటోమేషన్ పెంచడం ద్వారా ఉత్పత్తి వ్యయాలను తగ్గించే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిపై ఈ సీవోఈ దృష్టిసారిస్తుందన్నారు. ఈ రంగంలో ప్రపంచ స్థాయి సాఫ్ట్వేర్ ఉత్పత్తులను రూపొందించడానికి ఎల్రక్టానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అండదండలు అందిస్తుందని తెలిపారు. ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా రాష్ట్రం భారీ పెట్టుబడులను ఆకర్షిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ప్రపంచ దేశాలకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అందించే విధంగా ఉత్పత్తులను తయారు చేయడానికి ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు ఉపయోగపడతాయన్నారు. సుమారు రూ.20 కోట్ల వ్యయంతో 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ సీవోఈ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కాగా, ప్రస్తుతం ఎస్టీపీఐ 13 సీవోఈలను కలిగి ఉండగా.. ఇప్పుడు మరో 12 సీవోఈలను ఏర్పాటు చేస్తోంది. ఎస్టీపీఐ ఇండియా.. బీపీవో స్కీమ్ ద్వారా దేశంలోనే తొలిసారిగా 10,365 మందికి ఉపాధి కల్పించి రికార్డు సృష్టించినట్టుగా.. ఈ సీవోఈ ఏర్పాటు ద్వారా విశాఖకు ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందన్న ఆశాభావాన్ని దుబే వ్యక్తం చేశారు. చదవండి: విపత్తుల్లోనూ 'పవర్'ఫుల్ నిత్య పెళ్లికూతురు కేసులో మరో మలుపు -
ఘనంగా ఐసీబీఎం స్కూల్ స్నాతకోత్సాహం
-
మల్బరీ సాగులో మహిళా రైతులు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లిలో పలువురు మహిళా రైతులు పట్టు పురుగుల పెంపకంలో పట్టు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, జగిత్యాల జిల్లాలు మల్బరిని విరివిగా సాగు చేస్తూ, మల్బరీ పట్టు ఉత్పత్తిలో ప్రముఖ స్థానం పోషిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా తుమ్మనపల్లికి చెందిన నర్ర ధనజ ఐదేళ్లుగా మల్బరీ సాగు చేస్తున్నారు. మల్బరీ సాగు ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించినందుకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో నర్ర ధనజ, స్వామిరెడ్డి దంపతులను సన్మానించారు. మల్బరీ సాగులో ప్రతి యేటా రూ.3 లక్షలు ఖర్చు చేసి రూ. 11 లక్షలు ఆదాయం పొందుతున్నట్లు ధనజ తెలిపారు. ఆమెతోపాటు ఆ ఊళ్లో అనేక మంది మహిళా రైతులు మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం చేపట్టి మంచి లాభాలు పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణ రైతాంగం అనాదిగా సాధారణంగా వరి, మొక్కజొన్న, పత్తి పంటలను సాగు చేస్తుండగా అతివృష్టి, అనావృష్టి వలన పంటలను నష్టపోయిన సందర్భాలు అనేకం. ఇదే సమయంలో తుమ్మనపల్లి మహిళా రైతులు తక్కువ కాలంలో ఎక్కువ లాభాలను ఆర్జించే మల్బరీ పంటపై దృష్టి సారించారు. పంట కాలం తక్కువ.. లాభం ఎక్కువ.. మల్బరీ సాగు పట్టు ఉత్పత్తిలో రెండు దశలు ఉంటాయి. మొదటిది మల్బరీ పంట సాగు, రెండోది మల్బరీ ఆకులు తినిపించి పట్టు పురుగులను పెంచడం. మొదట 8 నెలల పాటు మల్బరీ తోటను పెంచుతారు. మల్బరీ పంటకు ఎకరాకు సుమారు రూ.10 వేలు ఖర్చవుతుండగా, సుమారు రూ. 55 వేల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మల్బరీ తోటను ఒకసారి నాటితే 20 సంవత్సరాల పాటు సాగు చేయవచ్చు. సంవత్సరంలో సుమారు నాలుగు నుంచి ఆరు సార్లు పంటను పొందుతున్నారు. తుమ్మనపల్లిలో 50 మంది మహిళా రైతులు 2–3 ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ తోటలు పెంచుతున్నారు. మల్బరీ తోట పక్కనే షెడ్ నిర్మించుకుని శ్రద్ధగా పట్టు పురుగులు పెంచుతున్నారు. ఇక్కడి సాగు తీరును తెలుసుకునేందుకు ఇతర జిల్లాల నుంచి రైతులు వచ్చి చూసి వెళ్తుండటం విశేషం. – గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ అవగాహన పెంచుకుంటే నష్టం రాదు నాకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో మల్బరీ సాగు చేస్తున్నా. సంవత్సర కాలంలో నాలుగు నుంచి ఐదు సార్లు పట్టు గూళ్ల దిగుబడి పొందవచ్చు. తక్కువ వ్యవధిలో, తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందవచ్చు. అయితే, మల్బరీ పంట సాగుపై అవగాహన పెంచుకుంటే రైతులు నష్టపోయే పరిస్థితి ఉండదు. మా ఊళ్లో చాలా మంది రైతులు మల్బరీ పంటనే సాగు చేస్తూ లాభాలను గడిస్తున్నారు. – గోపగాని సరిత, మహిళా రైతు, తుమ్మనపల్లి హేళన చేసిన వారే సాగులోకి వస్తున్నారు నాకున్న మూడెకరాల వ్యవసాయ క్షేత్రంలో రెండు సంవత్సరాల నుంచి మల్బరీ సాగుచేస్తున్నా. మా కుటుంబ సభ్యుల సహకారంతో పట్టు పురుగుల పెంపకంపై అవగాహన కల్పించుకుని మల్బరీ పంట సాగు మొదలు పెట్టాను. మొదట్లో ఇరుగు పొరుగు వారు హేళనగా చూశారు. పంట చేతికి వచ్చిన తర్వాత లాభాల గురించి తెలుసుకుని వాళ్లు కూడా మల్బరీ సాగుకు ముందుకు వస్తున్నారు. ఆహార పంటల కంటే మల్బరీ సాగే ఉత్తమం. – నిమ్మల వనజారెడ్డి, మహిళా రైతు, తుమ్మనపల్లి ఆరేళ్లుగా మల్బరీ సాగు చేస్తున్నా నాకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో మల్బరీ సాగు చేపట్టేందుకు ఉద్యాన శాఖాధికారులను సంప్రదించాను. వారు మల్బరీ సాగు విధానం గురించి వివరించారు. గత ఆరు సంవత్సరాల నుంచి మల్బరీ సాగు చేస్తున్నా. మల్బరీ సాగులో ఏమైనా సందేహాలు వస్తే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకుంటున్నా. ఉద్యోగిలా నెల నెలా ఆదాయం పొందుతున్నా. సంతోషంగా ఉంది. – కాసిరెడ్డి కవిత, మహిళా రైతు, తుమ్మనపల్లి -
సబ్జెక్టుల్లో ప్రపంచంలోనే బెస్ట్ వర్సిటీలు ఇవే..
న్యూయార్క్: ప్రతి ఏడాది ప్రపంచంలో ఉత్తమ విశ్వవిద్యాలయాలను గుర్తించి వాటి జాబితాను విడుదల చేసినట్లుగానే ఈ ఏడాది కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో అత్యున్నత విశ్వవిద్యాలయాల జాబితాను క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకిగ్స్ సంస్థ విడుదల చేసింది. బోధన, అకాడమిక్ పనితీరు, వర్సిటీలో మౌలిక సదుపాయాలతోపాటు పరిశోధనలు, ఉద్యోగుల పనితీరు విద్యార్థుల పురోగతి వంటి అంశాల అధారంగా మొత్తం 16 ఉత్తమ వర్సిటీల జాబితాను ప్రకటించింది. అయితే, పైన తెలిపిన అంశాలను ప్రాథమికంగా సర్వే కోసం తీసుకున్నా.. కేవలం సబ్జెక్టుల ఆధారంగా మాత్రం అత్యుత్తమ సేవలు అందిస్తున్న బెస్ట్ యూనివర్సిటీల జాబితా ప్రకటించింది. అవి ఏంటంటే.. 1.హార్వార్డ్ యూనివర్సిటీ అమెరికా 2.మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికా 3.యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్, బ్రిటన్ 4.యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, బ్రిటన్ 5.వెజినింజెన్ యూనివర్సిటీ, నెదర్లాండ్ 6.ది రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, బ్రిటన్ 7.యూనివర్సిటీ ఆఫ్ సౌతర్న్ కాలిఫోర్నియా, అమెరికా 8.యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్, హాంకాంగ్ చైనా 9.ఈటీహెచ్ జూరిచ్, స్విట్జర్లాండ్ 10.యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, బ్రిటన్ 11.కొలరాడో స్కూల్ ఆఫ్ మైన్స్, అమెరికా 12.యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బార్కెలీ క్యాంపస్, అమెరికా 13.యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వానియా, అమెరికా 14.ది జులియార్డ్ స్కూల్, అమెరికా 15.యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ అమెరికా 16.యూనివర్సిటీ ఆఫ్కాలిఫోర్నియా, డేవిస్ క్యాంపస్, అమెరికా -
రాజాకు మరో అత్యున్నత పురస్కారం
తిరువంతపురం: మ్యూజిక్ మేస్ట్రో, పద్మభూషణ్ ఇళయరాజా(72) కు కేరళ ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారం లభించింది. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గాను రాష్ట్రప్రభుత్వ నిషగంధి పురస్కారం ఆయనను వరించింది. ఈనెల 20 జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారంతో పాటు లక్షన్నర రూపాయల నగదు, ఓ జ్ఞాపికను ఇసైజ్ఞాని అందుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిషగంధి పురస్కారానికి ఇళయరాజాను ఎంపికచేసినట్లు కేరళ పర్యాటక శాఖ మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. భారత చలన చిత్ర పరిశ్రమకు ఇళయరాజా చేసిన సేవలకు గాను ఈ అవార్డుతో సత్కరించినున్నామని వెల్లడించారు. జనవరి 20వ తేదీ నుంచి వారంరోజుల పాటు సాగనున్న నిషగంధి మ్యూజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్ ఆరంభ వేడుకల్లో ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ చేతుల మీదుగా ఈ అవార్డును ఇళయరాజా స్వీకరిస్తారు. ఈ వేడుకల్లో పలువురు నృత్య,సంగీత కళాకారులు తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. -
స్మార్ట్ తయారీకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
తెలంగాణలో ఏర్పాటుకు ప్రతిపాదన నీతి ఆయోగ్ సభ్యుడు సారస్వత్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్‌ను ప్రోత్సహించేందుకు తొలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను తెలంగాణలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ‘రక్షణ, అంతరిక్ష రంగానికి అవసరమైన పరికరాల తయారీలో ప్రముఖ కేంద్రంగా రూపొందేందుకు తెలంగాణలో అన్ని వసతులు, మానవ వనరులు ఉన్నాయి. అందుకే ఈ సెంటర్‌ను ఇక్కడ నెలకొల్పాలని కేంద్రానికి ప్రతిపాదించాం’ అని నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.సారస్వత్ సోమవారం వెల్లడించారు. హెచ్ఐసీసీలో జరుగుతున్న డిఫెన్స్, ఏరోసప్లై సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాలింగ్(ఎంఆర్వో) రంగంలో లాభదాయకత తగ్గిందని సారస్వత్ చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో విడిభాగాలపైన అధిక వ్యాట్‌తోపాటు ఇతర పన్నుల మూలంగా విమానయాన సంస్థలు సర్వీసింగ్ కోసం సింగపూర్, అబుదాబి వంటి దేశాలకు వెళ్తున్నాయని వెల్లడించారు. దేశంలో వడ్డీ రేట్లు ఇంకా ఎక్కువగా ఉన్నాయంటూ... ఇటువంటి అడ్డంకులను తొలగించినప్పుడే ఈ రంగం బలపడుతుందని చెప్పారు. భారత ఎంఆర్వో రంగం 2020 నాటికి రూ.16,900 కోట్లకు చేరుకుంటుందని ఆయన వెల్లడించారు. ఐదేళ్లలో రూ.13 వేల కోట్లు.. వైమానిక, రక్షణ ప్రాజెక్టులకై భారతీయ కంపెనీల నుంచి విడిభాగాలను ఎయిర్‌బస్ కొనుగోలు చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో దేశం నుంచి రూ.13,000 కోట్ల విలువైన విడిభాగాలను సమీకరించాలన్నది గ్రూప్ లక్ష్యమని ఎయిర్‌బస్ డిఫెన్స్, స్పేస్ ఇండియా హెడ్ వెంకట్ కట్కూరి వెల్లడించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 వేల మందికి ఎయిర్‌బస్ ఉపాధి కల్పిస్తోందని చెప్పారు. భారత్‌లో అవకాశాలతో పాటు అడ్డంకులూ ఉన్నాయన్నారు. కాగా, కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్ శర్మ పాల్గొని మాట్లాడారు. -
ఎయిర్‌ఫోర్స్.. అవకాశాలకు ఆకాశమే హద్దు
దేశ సేవలో పాలుపంచుకునే అవకాశంతోపాటు అత్యుత్తమ కెరీర్‌కు బాటలు వేసే వేదిక భారతీయ వాయుసేన. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో వివిధ హోదాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేషన్/ఇంజనీరింగ్, బీఈడీ ఉత్తీర్ణులు ఆయా కొలువులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష, వైద్య, శారీరక పరీక్షలు, మౌఖిక పరీక్ష.. ఇలా అన్ని దశలను దాటుకుని విజేతలైనవారు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ప్రవేశించవచ్చు. ఈ నేపథ్యంలో భారతీయ వాయుసేనలో ఉన్న వివిధ ఉద్యోగావకాశాలపై ప్రత్యేక ఫోకస్.. పదో తరగతితో పదో తరగతి ఉత్తీర్ణులు గ్రూప్-వై విభాగంలో మ్యుజీషియన్ ఉద్యోగాలు పొందొచ్చు. అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు కీ బోర్డ్/గిటార్/వయోలిన్ /శాక్సాఫోన్/జాజ్ డ్రమ్/సరోద్/వీణ/నాద స్వరం వంటి వాటిలో దేనిలోనైనా ప్రావీణ్యం ఉండాలి. వయోపరిమితి: నిర్దేశిత తే దీనాటికి 17-25 ఏళ్లు. ఎంపిక: రాత పరీక్ష, వాద్య పరికరంలో పరీక్ష ఆధారంగా. రాత పరీక్షలో భాగంగా ఇంగ్లిష్ డిక్టేషన్‌ను పరీక్షిస్తారు. దీంతోపాటు సంబంధిత వాద్య పరికరంలో అభ్యర్థి ప్రావీణ్యతను తెలుసుకుంటారు. 10+2తో ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ ఎగ్జామ్ (ఎన్డీఏ అండ్ ఎన్ఏ) ద్వారా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా ఉద్యోగం పొందొచ్చు. అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్‌లతో 10+2 ఉత్తీర్ణత. అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 16 1/2 నుంచి 19 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా. రాత పరీక్ష విధానం: ఇందులో రెండు పేపర్లుంటాయి. అవి.. 1. మ్యాథ్స్ (300 మార్కులు), 2. జనరల్ ఎబిలిటీ టెస్ట్ (600 మార్కులు). రెండో పేపర్ జనరల్ ఎబిలిటీ టెస్ట్‌లో భాగంగా పార్ట్-ఏ, పార్ట్-బీ అనే రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్-ఏలో ఇంగ్లిష్ 200 మార్కులకు, పార్ట్-బీలో జనరల్ నాలెడ్జ్ 400 మార్కులకు ప్రశ్నలడుగుతారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన వాటికి నెగెటివ్ మార్కులుంటాయి. ఒక్కో పేపర్ కాల వ్యవధి రెండున్నర గంటలు. నోటిఫికేషన్: ఏడాదికి రెండుసార్లు (మే, డిసెంబర్) వెబ్సైట్: www.upsc.gov.in ఎయిర్‌మెన్ ఉద్యోగాలు భారతీయ వాయుసేనలో గ్రూప్-ఎక్స్, గ్రూప్-వై విభాగాల్లో ఎయిర్‌మెన్ ఉద్యోగాల భర్తీకి ప్రతి ఏటా ఎంపిక నిర్వహిస్తారు. అర్హతలు: గ్రూప్- ఎక్స్ (ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ మినహా): 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్‌లతో 10+2 ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి. లేదా 50 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా (మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/కంప్యూటర్ సైన్స్/ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణత. వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 17 - 21 ఏళ్లు. గ్రూప్-వై (మ్యుజీషియన్, మెడికల్ అసిస్టెంట్ మినహా): 50 శాతం మార్కులతో ఏదైనా గ్రూప్‌తో 10+2 ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి. వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 17-21 ఏళ్లు. గ్రూప్-వై (మెడికల్ అసిస్టెంట్): 50 శాతం మార్కులతో ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీ/ఇంగ్లిష్‌లతో 10+2 ఉత్తీర్ణత. ఎంపిక: దేశవ్యాప్తంగా ఎంపిక పరీక్ష, రిక్రూట్మెంట్ ర్యాలీ, ఇంటర్వ్యూల ఆధారంగా. టెక్నికల్ విభాగాలవారికి ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది. రాత పరీక్ష: గ్రూప్- ఎక్స్ (టెక్నికల్ విభాగాలు) వారికి ఇంగ్లిష్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లపై పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి ఒక గంట (60 నిమిషాలు). గ్రూప్-వై (నాన్ టెక్నికల్) వారికి ఇంగ్లిష్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్‌లపై ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 45 నిమిషాలు. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. 10+2 స్థాయి సిలబస్‌పై ప్రశ్నలు అడుగుతారు. బీఈడీతో.. సంబంధిత డిగ్రీ, పీజీలతోపాటు బీఈడీ ఉత్తీర్ణులు గ్రూప్-ఎక్స్‌లో ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. బోధనలో రెండేళ్ల అనుభవం ఉండాలి. లేదా ఏదైనా పీజీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత. రెండేళ్లపాటు బోధనలో అనుభవం ఉండాలి. వయోపరిమితి: డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులకు 20-25 ఏళ్లు. పీజీ, బీఈడీ ఉత్తీర్ణులకు 20-28 ఏళ్లు. ఎంపిక: రాతపరీక్ష, శారీరక, వైద్య పరీక్షల ఆధారంగా. ఇంజనీరింగ్/గ్రాడ్యుయేషన్‌తో ఫ్లైయింగ్ బ్రాంచ్ దీనికి ఎంపికైనవారు ఫైటర్ పైలట్ లేదా హెలికాఫ్టర్ పైలట్ లేదా ట్రాన్స్పోర్ట్ పైలట్‌గా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వివిధ పద్ధతుల ద్వారా ఫ్లైయింగ్ బ్రాంచ్‌లో అవకాశాలు కల్పిస్తారు. అవి.. గ్రాడ్యుయేషన్, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ, ఎస్ఎస్సీ ఎంట్రీ గ్రాడ్యుయేషన్‌తో సీడీఎస్ఈ ద్వారా.. ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ (సీడీఎస్ఈ) ద్వారా ఫ్లైయింగ్ బ్రాంచ్‌లో ప్రవేశించొచ్చు. అర్హతలు: భారతీయ పౌరులై ఉండాలి. అవివాహితులై ఉండాలి. పురుషులు మాత్రమే అర్హులు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్/బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. 10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి. వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 19- 23 ఏళ్లు. నోటిఫికేషన్: ఏడాదికి రెండుసార్లు (జూన్, అక్టోబర్) మరిన్ని వివరాలకు వెబ్సైట్: www.upsc.gov.in ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ: నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ)లో ‘సి’ సర్టిఫికెట్ పొందినవారు ఎన్సీసీ స్పెషల్ ఎం ట్రీ ద్వారా ఫ్లైయింగ్ బ్రాంచ్‌లో ప్రవేశం పొందొచ్చు. అర్హతలు: భారతీయ పౌరులై ఉండాలి. అవివాహితులై ఉండాలి. 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. 10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్‌లు చదివుండాలి. లేదా 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. ఎన్సీసీ ఎయిర్‌వింగ్ సీనియర్ డివిజన్ నుంచి ‘సి’ సర్టిఫికెట్ పొంది ఉండాలి. వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 19-23 ఏళ్లు. దరఖాస్తు: ఎన్సీసీ ఎయిర్ స్క్వాడ్రన్స్/డెరైక్టర్ జనరల్, ఎన్సీసీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్ఎస్సీ (షార్ట్ సర్వీస్ కమిషన్) ఎంట్రీ: ఇందులో ప్రవేశానికి మహిళలు, పురుషులూ ఇద్దరూ అర్హులే. ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్సీఏటీ) ద్వారా ఇందులో అడుగుపెట్టొచ్చు. అర్హతలు: భారతీయ పౌరులై ఉండాలి. అవివాహితులై ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. 10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్‌లు చదివుండాలి. లేదా 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 19 - 23 ఏళ్లు. ప్రకటన: ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్‌కు ప్రతి ఏటా జూన్, డిసెంబర్లలో ప్రకటన వెలువడుతుంది. గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ ఇందులో మొత్తం ఐదు విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అవి.. అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్: ఇందులో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా, ఫైటర్ కంట్రోలర్‌గా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అర్హత: 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత లేదా 50 శాతం మార్కులతో పీజీ/తత్సమాన డిప్లొమా ఉత్తీర్ణత. అకౌంట్స్ బ్రాంచ్: వివిధ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించడంతోపాటు ఆడిటర్‌గా పనిచేయాల్సి ఉంటుంది. అర్హత: 60 శాతం మార్కులతో బీకాం ఉత్తీర్ణత లేదా 50 శాతం మార్కులతో ఎంకాం/సీఏ/ఐసీడబ్ల్యుఏ ఉత్తీర్ణత. లాజిస్టిక్స్ బ్రాంచ్: లాజిస్టిక్స్ బ్రాంచ్‌కు ఎంపికైనవారు ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన వివిధ వనరులు, వస్తు సేవలను నిర్వహించాలి. ఎక్విప్మెంట్ పర్యవేక్షణ చేయాలి. అర్హత: 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత లేదా 50 శాతం మార్కులతో పీజీ/తత్సమాన డిప్లొమా. ఎడ్యుకేషన్ బ్రాంచ్: అర్హత: 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత. మెటియొరాలజీ బ్రాంచ్: వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఫ్లైట్ ఆపరేటర్స్‌కు సలహాలను అందించడంతోపాటు ఇతర విధులు నిర్వహించాలి. అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా సైన్స్ స్ట్రీమ్‌తో పీజీ/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/జాగ్రఫీ/కంప్యూటర్ అప్లికేషన్స్/ఎన్విరాన్మెంటల్ సైన్స్/అప్లైడ్ ఫిజిక్స్/ఓషనోగ్రఫీ/అగ్రికల్చర్ మెటియొరాలజీ/ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్/జియోఫిజిక్స్/ఎన్విరాన్మెంటల్ బయాలజీ ఉత్తీర్ణత. 55 శాతం మార్కులతో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నికల్ బ్రాంచ్ టెక్నికల్ బ్రాంచ్‌కు ఎంపికైనవారు ఎయిర్‌ఫోర్స్‌లో అత్యాధునిక ఎక్విప్మెంట్కు ఇన్చార్జ్గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇందులో రెండు విధానాల ద్వారా ప్రవేశించొచ్చు. అవి.. యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ (యూఈఎస్), ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సు. రెండింటిలోనూ ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్: అర్హతలు: అవివాహితులై ఉండాలి. పురుషులు మాత్రమే అర్హులు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో బీఈ/బీటెక్ ప్రీ ఫైనలియర్ చదువుతుండాలి. వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 18-28 ఏళ్లు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్స్ ద్వారా.. అర్హతలు: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్/సంబంధిత బ్రాంచ్‌ల్లో ఉత్తీర్ణత. పర్మినెంట్ కమిషన్‌కు పురుషులు, షార్ట్ సర్వీస్ కమిషన్‌కు పురుషులు, మహిళలు అర్హులు. ఎంపిక: ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా. ప్రకటన: ప్రతి ఏటా జూన్, డిసెంబర్లలో. వెబ్సైట్: careerairforce.nic.in