రాజాకు మరో అత్యున్నత పురస్కారం
రాజాకు మరో అత్యున్నత పురస్కారం
Published Fri, Jan 1 2016 3:13 PM | Last Updated on Sun, Sep 3 2017 2:55 PM
తిరువంతపురం: మ్యూజిక్ మేస్ట్రో, పద్మభూషణ్ ఇళయరాజా(72) కు కేరళ ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారం లభించింది. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గాను రాష్ట్రప్రభుత్వ నిషగంధి పురస్కారం ఆయనను వరించింది. ఈనెల 20 జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారంతో పాటు లక్షన్నర రూపాయల నగదు, ఓ జ్ఞాపికను ఇసైజ్ఞాని అందుకోనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ నిషగంధి పురస్కారానికి ఇళయరాజాను ఎంపికచేసినట్లు కేరళ పర్యాటక శాఖ మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. భారత చలన చిత్ర పరిశ్రమకు ఇళయరాజా చేసిన సేవలకు గాను ఈ అవార్డుతో సత్కరించినున్నామని వెల్లడించారు. జనవరి 20వ తేదీ నుంచి వారంరోజుల పాటు సాగనున్న నిషగంధి మ్యూజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్ ఆరంభ వేడుకల్లో ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ చేతుల మీదుగా ఈ అవార్డును ఇళయరాజా స్వీకరిస్తారు. ఈ వేడుకల్లో పలువురు నృత్య,సంగీత కళాకారులు తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
Advertisement
Advertisement