ఫోనోగ్రాఫ్ లేదా గ్రామఫోన్ అనేది రికార్డు చేయబడిన ధ్వనులను ప్లే చేసే ఒక ఎలక్ట్రానిక్ పరికరం. పాతకాలంలో మ్యూజిక్ వినడానికి దీన్నే ఉపయోగించేవారు. ఆ రోజుల్లో దీని హవా ఎక్కువగా ఉండేది. 1900ల కాలంలో ప్రజల ఇళ్లల్లో ఎక్కువగా ఉండేది. అలాంటి గ్రామఫోన్ కంపెనీకి ప్రదర్శనకారిణిగా తొలి సంతంకం చేసిన భారతీయురాలు ఆమె. మన హిందుస్తానీ శాస్త్రీయ సంగీతాన్ని కేవలం మూడు నిమిషాల్లో రికార్డింగ్ చేసిన ఘనతను అందుకుంది కూడా. అంతేగాదు చాలా భాషల్లో పాటు పాడి ఏకంగా 600కు పైగా రికార్డింగ్‌లు చేశారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె గాత్రం రికార్డింగుల రూపంలో మన మధ్యే చిరంజీవిగా నిలిచిపోయింది. ఎవరామె అంటే.
ఆమె పేరు ఏంజెలీనా యోవార్డ్. జూన్ 26, 1873న జన్మించింది. ఆమె అర్మేనియన్ క్రైస్తవ తండ్రి, తల్లి విక్టోరియా హెమ్మింగ్స్‌లకు జన్మించారు. ఇక ఆమె అమ్మమ్మ హిందూ, తాత బ్రిటిష్. దీంతో ఆమె బాల్యం విభిన్న సంస్కృతుల మేళవింపుతో సాగింది. అయితే ఆమెకు ఇస్లాం మతం అంటే ఇష్టం. ఆ నేపథ్యంలోనే తన పేరు గౌహర్ జాన్‌గా మార్చుకుంది. అలా పేరు మార్చుకున్న తర్వాత ఆమె తన తల్లితో కలిసి కోల్‌కతాకు వెళ్లి నవాబ్ వాజిద్ అలీ షా ఆస్థానాలలో స్థిరపడింది.
తర్వాత 1887లో దర్భంగా రాజ న్యాయస్థానాలలో తన తొలి ప్రదర్శన ఇచ్చింది. ఇక అక్కడే బనారస్‌లోని ఒక ప్రొఫెషనల్ డ్యాన్సర్ నుంచి విస్తృతమైన నృత్య, సంగీతాల్లో శిక్షణ పొంది ఆస్థాన సంగీత విద్వాంసురాలుగా నియమితులైంది. అలా ఆమెకు "తొలి నృత్యకారిణి" అనే పేరు వచ్చింది.
కానీ ఆకాలంలో రికార్డింగ్ టెక్నాలజీ గ్రామఫోనే కాబట్టి. ఆ కంపెనీకి తన గాత్రం అందించిన తొలి భారతీయురాలుగా గౌహర్ జాన్ చరిత్రలో నిలిచిపోయింది. ఆమె ఆ గ్రామఫోన్‌లో ఎన్నో పాటలను రికార్డుచేసింది. ఆ కాలంలో వైశ్యలు బహిరంగా సభలు నిర్వహించి థుమ్రీలు, దాద్రా, కజ్రీ, హోరి, చైతి, భజనలు, ఖయాల్స్ పాడేవారు. ఇక్కడ గౌహర్ కూడా వేశ్య. ఆ కాలం ఆస్థాన నృత్యకారిణులను వేశ్యలగానే పరిగణించేవారు.
అయితే ఆమె విలక్షణమైనది ఎందుకంటే బ్రిటిషర్ల గ్రామఫోన్‌లో మన హిందూ సంగీతాన్ని వినేలా చేసింది ఆమెనే. అయితే ఇది మూడు నిమిషాల్లోనే రికార్డు చేయాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక డిస్క్ అంత సమయం వరకే రికార్డు చేయగలిగేది. గౌహర్ అంత నిడివిలో మన హిందుస్తానీ మ్యూజిక్‌ని స్వరపరిచి గానం చేయడం విశేషం.
అలా ఆమె మొత్తం పది వేర్వేరు భాషల్లో పాటలు పాడి 600కి పైగా రికార్డింగ్‌లు చేశారు. అంతేగాదు కృష్ణ భక్తికి సంబంధించిన రచనలు చేసేది.
విలాసవంతంమైన జీవితం..
ఇక ఆమె జీవనవిధానం అత్యంత విలాసవంతంగా ఉండేది. ఆ రోజుల్లో నాలుగు గుర్రాలతో నడిచే బగ్గీని కలిగిన సంపన్నుల్లో ఆమె ఒకరిగా ఉండేది. అంతేగాదు ఈ బగ్గీ కారణంగా వైస్రాయ్‌కి వెయ్యి రూపాయల జరిమానా కూడా చెల్లించేదట. ఇక ఆ రోజుల్లోనే తన పెంపుడు పిల్లికి పిల్లలు పుట్టారని ఏకంగా రూ. 20 వేలు ఖర్చుపెట్టి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చి అందర్నీ విస్తుపోయేలా చేసిందట.
ప్రేమలో విఫలం..
ఆమె ఎంతోమందిని ప్రేమించింది గానీ ఏదీ పెళ్లిపీటల వరకు రాలేదు. వాళ్లంతా ఆమె వెనుకున్న ఉన్న డబ్బు కోసమే తప్ప.. స్వచ్ఛమైన ప్రేమను పొందలేకపోయానని బాధపడుతూ ఉండేదట. ఇక గౌహర్ వయసు మీద పడటంతో నృత్యం, పాటలు పాడటం ఆపేసి ఒంటరిగా కాలం వెళ్లదీస్తుండేది.
అయితే అంత్యకాలంలో మహారాజా నల్వాడి కృష్ణరాజ వడియార్ IV రాష్ట్ర అతిథిగా, ఆస్థాన సంగీతకారిణిగా మైసూరుకు ఆహ్వానించారు. అయితే అక్కడకు వెళ్లిన 18 నెలలకే తుది శ్వాస విడిచింది. ఆమె నృత్యం, గానంలో తనదైన ముద్రవేయడంతో ఆ కాలంలోని పోస్ట్‌కార్డ్‌లు, అగ్గిపెట్టేలపై ఆమె ముఖ చిత్రాన్నే ముద్రించి గౌరవించారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా రికార్డింగ్ చేసిన పాటల రూపంలో మన మధ్య బతికే ఉంది.
(చదవండి: జుట్టు కుదుళ్లను బలోపేతం చేసే హెల్మెట్..!)
Comments
Please login to add a commentAdd a comment