Recording
-
'ది గ్రామఫోన్ గర్ల్': శాస్త్రీయ సంగీతాన్ని జస్ట్ మూడు నిమిషాల్లో..!
ఫోనోగ్రాఫ్ లేదా గ్రామఫోన్ అనేది రికార్డు చేయబడిన ధ్వనులను ప్లే చేసే ఒక ఎలక్ట్రానిక్ పరికరం. పాతకాలంలో మ్యూజిక్ వినడానికి దీన్నే ఉపయోగించేవారు. ఆ రోజుల్లో దీని హవా ఎక్కువగా ఉండేది. 1900ల కాలంలో ప్రజల ఇళ్లల్లో ఎక్కువగా ఉండేది. అలాంటి గ్రామఫోన్ కంపెనీకి ప్రదర్శనకారిణిగా తొలి సంతంకం చేసిన భారతీయురాలు ఆమె. మన హిందుస్తానీ శాస్త్రీయ సంగీతాన్ని కేవలం మూడు నిమిషాల్లో రికార్డింగ్ చేసిన ఘనతను అందుకుంది కూడా. అంతేగాదు చాలా భాషల్లో పాటు పాడి ఏకంగా 600కు పైగా రికార్డింగ్‌లు చేశారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె గాత్రం రికార్డింగుల రూపంలో మన మధ్యే చిరంజీవిగా నిలిచిపోయింది. ఎవరామె అంటే.ఆమె పేరు ఏంజెలీనా యోవార్డ్. జూన్ 26, 1873న జన్మించింది. ఆమె అర్మేనియన్ క్రైస్తవ తండ్రి, తల్లి విక్టోరియా హెమ్మింగ్స్లకు జన్మించారు. ఇక ఆమె అమ్మమ్మ హిందూ, తాత బ్రిటిష్. దీంతో ఆమె బాల్యం విభిన్న సంస్కృతుల మేళవింపుతో సాగింది. అయితే ఆమెకు ఇస్లాం మతం అంటే ఇష్టం. ఆ నేపథ్యంలోనే తన పేరు గౌహర్ జాన్‌గా మార్చుకుంది. అలా పేరు మార్చుకున్న తర్వాత ఆమె తన తల్లితో కలిసి కోల్‌కతాకు వెళ్లి నవాబ్ వాజిద్ అలీ షా ఆస్థానాలలో స్థిరపడింది. తర్వాత 1887లో దర్భంగా రాజ న్యాయస్థానాలలో తన తొలి ప్రదర్శన ఇచ్చింది. ఇక అక్కడే బనారస్‌లోని ఒక ప్రొఫెషనల్ డ్యాన్సర్ నుంచి విస్తృతమైన నృత్య, సంగీతాల్లో శిక్షణ పొంది ఆస్థాన సంగీత విద్వాంసురాలుగా నియమితులైంది. అలా ఆమెకు "తొలి నృత్యకారిణి" అనే పేరు వచ్చింది. కానీ ఆకాలంలో రికార్డింగ్ టెక్నాలజీ గ్రామఫోనే కాబట్టి. ఆ కంపెనీకి తన గాత్రం అందించిన తొలి భారతీయురాలుగా గౌహర్ జాన్ చరిత్రలో నిలిచిపోయింది. ఆమె ఆ గ్రామఫోన్‌లో ఎన్నో పాటలను రికార్డుచేసింది. ఆ కాలంలో వైశ్యలు బహిరంగా సభలు నిర్వహించి థుమ్రీలు, దాద్రా, కజ్రీ, హోరి, చైతి, భజనలు, ఖయాల్స్ పాడేవారు. ఇక్కడ గౌహర్ కూడా వేశ్య. ఆ కాలం ఆస్థాన నృత్యకారిణులను వేశ్యలగానే పరిగణించేవారు. అయితే ఆమె విలక్షణమైనది ఎందుకంటే బ్రిటిషర్ల గ్రామఫోన్‌లో మన హిందూ సంగీతాన్ని వినేలా చేసింది ఆమెనే. అయితే ఇది మూడు నిమిషాల్లోనే రికార్డు చేయాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక డిస్క్ అంత సమయం వరకే రికార్డు చేయగలిగేది. గౌహర్ అంత నిడివిలో మన హిందుస్తానీ మ్యూజిక్‌ని స్వరపరిచి గానం చేయడం విశేషం. అలా ఆమె మొత్తం పది వేర్వేరు భాషల్లో పాటలు పాడి 600కి పైగా రికార్డింగ్‌లు చేశారు. అంతేగాదు కృష్ణ భక్తికి సంబంధించిన రచనలు చేసేది. విలాసవంతంమైన జీవితం..ఇక ఆమె జీవనవిధానం అత్యంత విలాసవంతంగా ఉండేది. ఆ రోజుల్లో నాలుగు గుర్రాలతో నడిచే బగ్గీని కలిగిన సంపన్నుల్లో ఆమె ఒకరిగా ఉండేది. అంతేగాదు ఈ బగ్గీ కారణంగా వైస్రాయ్కి వెయ్యి రూపాయల జరిమానా కూడా చెల్లించేదట. ఇక ఆ రోజుల్లోనే తన పెంపుడు పిల్లికి పిల్లలు పుట్టారని ఏకంగా రూ. 20 వేలు ఖర్చుపెట్టి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చి అందర్నీ విస్తుపోయేలా చేసిందట. ప్రేమలో విఫలం..ఆమె ఎంతోమందిని ప్రేమించింది గానీ ఏదీ పెళ్లిపీటల వరకు రాలేదు. వాళ్లంతా ఆమె వెనుకున్న ఉన్న డబ్బు కోసమే తప్ప.. స్వచ్ఛమైన ప్రేమను పొందలేకపోయానని బాధపడుతూ ఉండేదట. ఇక గౌహర్ వయసు మీద పడటంతో నృత్యం, పాటలు పాడటం ఆపేసి ఒంటరిగా కాలం వెళ్లదీస్తుండేది. అయితే అంత్యకాలంలో మహారాజా నల్వాడి కృష్ణరాజ వడియార్ IV రాష్ట్ర అతిథిగా, ఆస్థాన సంగీతకారిణిగా మైసూరుకు ఆహ్వానించారు. అయితే అక్కడకు వెళ్లిన 18 నెలలకే తుది శ్వాస విడిచింది. ఆమె నృత్యం, గానంలో తనదైన ముద్రవేయడంతో ఆ కాలంలోని పోస్ట్‌కార్డ్‌లు, అగ్గిపెట్టేలపై ఆమె ముఖ చిత్రాన్నే ముద్రించి గౌరవించారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా రికార్డింగ్ చేసిన పాటల రూపంలో మన మధ్య బతికే ఉంది. (చదవండి: జుట్టు కుదుళ్లను బలోపేతం చేసే హెల్మెట్..!) -
జపాన్‌లో భూకంపం.. 6.4 తీవ్రత నమోదు
నోటో: జపాన్‌లో భూకంపం సంభవించింది. ఉత్తర మధ్య ప్రాంతంలోని నోటోలో మంగళవారం రాత్రి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నోటో ద్వీపకల్పంలోని పశ్చిమ తీరంలో 10 కి.మీ. (6.2 మైళ్ళు) లోతులో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణశాఖ తెలిపింది.ఈ ఏడాది ప్రారంభంలో సంభవించిన భారీ భూకంపం నుండి కోలుకుంటున్నంతలోనే ఇప్పుడు మరో భూపంపం సంభవించింది. భూకంపం తర్వాత ఎలాంటి సునామీ ముప్పు లేదని తెలుస్తోంది. ఈ భూకంపం కారణంగా ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు యూఎస్జీఎస్ పేర్కొంది. భూకంపానికి సంబంధించిన నష్టం గురించి తక్షణ నివేదికలేవీ లేవు. 2024, జనవరి ఒకటిన నోటో ప్రాంతంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. నాటి దుర్ఘటనలో 370 మందికి పైగా జనం మృతిచెందారు. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఇది కూడా చదవండి: పరిహారం చెల్లించాకే భూసేకరణ -
పోలీస్ స్టేషన్లో రికార్డింగ్ నేరం కాదు: బాంబే హైకోర్టు
ముంబై: పోలీసు స్టేషన్లో అధికారులతో సంభాషణను రికార్డ్ చేయడం అధికారిక రహస్యాల చట్టం ప్రకారం నేరం కాదని బాంబే హైకోర్టు పేర్కొంది. పోలీస్ స్టేషన్లో బెదిరింపు సంభాషణను రికార్డ్ చేసినందుకు గూఢచర్యం ఆరోపణలతో ఇద్దరు సోదరులపై నమోదైన అభియోగాలను కొట్టివేస్తూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.ఈ కేసు హైకోర్టుకు చేరిన దరిమిలా దీనిపై విచారణ జరిగింది. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) కింద వారిపై నేరపూరిత కుట్ర ఆరోపణలను రద్దు చేయడానికి నిరాకరిస్తూనే, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు సోదరులపై గూఢచర్యం ఆరోపణలను కోర్టు రద్దు చేసింది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) ప్రకారం ఈ రికార్డింగ్ పోలీస్ స్టేషన్లో జరిగిందని జస్టిస్ విభా కంకన్‌వాడి, జస్టిస్ ఎస్జీ చపాల్గావ్కర్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.అధికారిక రహస్యాల చట్టం- 1923లో నిషేధిత ప్రదేశం అంటే ఏమిటో తెలిపారు. అయితే దానిలో పోలీస్ స్టేషన్ అనేది లేదు. అందుకే వారిపై అధికారిక రహస్యాల చట్టం కింద మోపిన అభియోగాలు నిరాధారమైనవని తెలియజేస్తూ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. మహారాష్ట్రకు చెందిన సోదరులు సుభాష్, సంతోష్ రాంభౌ అథారేలపై నేరపూరిత కుట్రతో పాటు, అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినట్లు 2022 జూలై 19న పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. సుభాష్ ఒక పోలీసు అధికారితో జరిపిన సంభాషణను రికార్డ్ చేసిన దరిమిలా వారిపై కేసు నమోదయ్యింది.2022, ఏప్రిల్ 21న ముగ్గురు వ్యక్తులు అథారే ఇంటిలోకి అక్రమంగా చొరబడి, వారి తల్లిపై దాడి చేసిన ఘటనపై ఆ సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిని నాన్-కాగ్నిజబుల్ (ముందస్తు కోర్టు అనుమతి లేకుండా పోలీసులు అరెస్టు చేయలేని నేరాలు) నేరంగా పోలీసులు నమోదు చేయడంపై అథారే సోదరులు అసంతృప్తితో పోలీసులను ప్రశ్నించారు. ఈ కేసులో ఇన్వెస్టిగేటింగ్ అధికారితో జరిగిన సంభాషణను వారు రికార్డ్ చేశారు. ఈ నేపధ్యంలో ఆ అధికారి వారితో ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని బెదిరించారు.కాగా ఈ రికార్డింగ్‌ను వారు పోలీసు డైరెక్టర్ జనరల్‌కు పంపారు. ఈ నేపధ్యంలో ఆ సోదరులపై అధికారిక రహస్యాల చట్టం- 1923 ఉల్లంఘన కింద కేసు నమోదయ్యింది. అయితే ఈ ఎఫ్ఐఆర్ ప్రతీకార చర్యలా ఉందని, కల్పిత సాక్ష్యాధారాల ఆధారంగా కేసు నమోదు చేశారని, అందుకే దానిని రద్దు చేయాలని ఆ సోదరుల తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు. దీనిపై ప్రాసిక్యూషన్ తన వాదనలో వారు చేసిన రికార్డింగ్ పోలీసు సిబ్బందిని బెదిరించినట్లుగా ఉందని పేర్కొన్నారు.సెక్షన్ 2(8) కింద నిషేధించబడిన స్థలం అనే నిర్వచనంలో పోలీసు స్టేషన్ లేదని నొక్కి చెబుతూ, అధికారిక రహస్యాల చట్టం దీనికి వర్తించదని హైకోర్టు తెలిపింది. అలాగే ఈ ఉదంతంలో కుట్ర, నేరపూరిత బెదిరింపు ఆరోపణలకు సంబంధించి తదుపరి చర్యలకు సాక్ష్యాధారాలు అవసరమా కాదా అని నిర్ధారించే బాధ్యతను దిగువ కోర్టుకు అప్పగించింది. ఈ కేసులో అధికారిక రహస్యాల చట్టం కింద వచ్చిన ఆరోపణలను కోర్టు రద్దు చేసింది. అథారే సోదరుల తరఫున న్యాయవాది ఏజీ అంబేద్కర్ వాదనలు వినిపించగా, పోలీసు సిబ్బంది తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్ఆర్ దయామ వాదనల్లో పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: మరణశిక్షను ఆపిన సుప్రీంకోర్టు -
నల్లగొండలో విషాదం
-
Shraddha Walkar Case: కీలక ఆధారంగా ఆమె వాయిస్ రికార్డు..
యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధా వాకర్ హత్యకేసులో ప్రధాన నిందితుడు అఫ్తాబ్ పూనావాలా నేరం చేశాడనేందుకు కీలక సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టుకి సమర్పించారు. వాటిలో కోర్టులో ప్లే చేసిన శ్రద్ధా వాయిస్ రికార్డు క్లిప్ ఈ కేసుకి కీలకంగా మారింది. ఈ మేరకు ఈ కేసుకి సంబంధించిన వాదనలు సోమవారం సాకేత్ కోర్టులో జరిగాయి. పోలీసులు నిందితుడు అఫ్తాబ్ పూనావాలాని కోర్టులో హజరుపరిచారు. ఈ కేసు విచారణకు శ్రద్ధ తడ్రి కూడా హజరయ్యారు. కోర్టులో ఢిల్లీ పోలీసులు అతడు నేరం చేశాడని రుజువు చేసేందుకు విశ్వసనీయమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు. అందుకు సంబంధించిన ఆధారాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అమిత్ ప్రసాద్, మధుకర్ పాండేలు కోర్టుకి సమర్పించారు. ఈ కేసుకి సంబంధించి నేరం చేయడానికి దారితీసిన ఆరు పరిస్థితులు, ముగ్గురు ప్రత్యక్ష సాక్ష్యలను గురించి కోర్టుకి వివరించారు. అలాగే ఆమె హత్యకు ముందు చివరిసారిగా చూసిన వారి గురించి కూడా కోర్టుకి తెలిపారు. ఈ నేరం సహజీవనం కారణంగా జరిగిందని, అతడితో రిలేషన్ షిప్లో ఉన్నంత కాలం ఆమె హింసకు గురైందని చెప్పారు. అలాగే శ్రద్ధా నవంబర్ 23, 2022న ముంబైలోని వసాయి పోలీస్టేషన్‌కి చేసిన ఫిర్యాదు కూడా ఈ హత్య కేసుకి బలమైన ఆధారమని చెప్పారు . అలాగే శ్రద్ధా ప్రాక్టో యాప్ ద్వారా వైద్యుల నుంచి కౌన్సిలింగ్ తీసుకుంటున్న విషయం గురించి పేర్కొన్నారు. ఆ ఆన్లైన్ కౌన్సిలింగ్లో వైద్యులకు అఫ్తాబ్ తనను వెంటాడి వెతికి మరీ చంపేస్తాడని చెబుతున్న ఆడియో క్లిప్‌ను సైతం కోర్టులో ప్లే చేశారు. ఆ క్లిప్‌లో ఒక రోజు అఫ్తాబ్ తన గొంతు పట్లుకున్నట్లు వైద్యులకు చెబుతున్నట్లు వినిపిపిస్తుంది. శ్రద్ధాకు సంబంధించిన మూడు డిజిల్ మొబైల్ ఫోన్లను కూడా కోర్టుకి సమర్పించారు. అలాగే శ్రద్ధా బ్యాంకు లావాదేవీలను నిర్వహించి ఫ్రిజ్, రంపం, నీళ్లు, క్లినర్, అగరబత్తులను కొన్న ఆధారాలను సైతం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. పైగా అఫ్తాబ్ నేరాన్ని కప్పిపుచ్చేందుకు ఆమె బతికే ఉందన్నట్లు ఆమె సోషల్ మీడియా ఖాతాను నిర్వహించాడని ఢిల్లీ పోలీసుల తరుఫు న్యాయవాదులు కోర్టుకి విన్నవించారు. అతను హత్య చేశాడనేందుకు పూర్తి ఆధారాలు ఉన్నాయి కావున భారత శిక్షాస్మృతి ప్రకారం 302/201 సెక్షన్ల కింది నిందితుడిని తగిన విధంగా శిక్షించాలని న్యాయవాదులు కోర్టుని కోరారు. అదనపు సెషన్స్ జడ్జి మనీషా ఖురానా కకర్ డిల్లీ పోలీసుల తరుఫు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత వాటిపై ప్రతిస్పందించడానికి లీగల్ ఎయిడ్ కౌన్సిల్(ఎల్ఏసీ) జావేద్ హుస్సేన్‌కి కొంత సమయం ఇచ్చారు. ఈ మేరకు జడ్డి ఈ కేసుకి సంబంధించి తదుపరి వాదనల కోసం మార్చి 25కి వాయిదా వేసింది. (చదవండి: ఇందిరా గాంధీ టైంలోనే హక్కులను హరించబడ్డాయ్!: కేంద్ర మంత్రి) -
అది ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ వాయిస్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తన ఫోన్‌ను ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన స్నేహితుడు లంకా రామశివారెడ్డి కొట్టిపారేశారు. అది ఫోన్ ట్యాపింగ్ కాదని.. ఫోన్లో తాను రికార్డ్ చేసిన వాయిస్ మాత్రమేనని స్పష్టం చేశారు. రామశివారెడ్డి బుధవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ఇంత రాద్ధాంతం చేస్తాడనుకోలేదు.. ‘నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నా స్నేహితుడే. ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఆ తర్వాత ఆయన రాజకీయాలు వైపు వెళ్లగా.. నేను కాంట్రాక్టర్‌గా మారాను. డిసెంబర్లో నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోటంరెడ్డి ప్రభుత్వ అధికారుల మీద, ఆయనకు కలిగిన ఇబ్బందుల మీద సుదీర్ఘంగా మాట్లాడారు. అదే రోజు సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నాకు ఫోన్ చేశాడు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశం విషయాలపై చర్చించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల విషయంలో తొందరపాటుగా మాట్లాడకుండా ఉంటే బాగుండేదని సలహా ఇచ్చాను. నియోజకవర్గ నిధులు, కాంట్రాక్టు పనులు, ఇతర పరిణామాలన్నీ సుదీర్ఘంగా చర్చించుకున్నాం. అవన్నీ కూడా నా ఫోన్లో ఆటోమేటిక్‌గా రికార్డయ్యాయి. నేను చెన్నై వెళ్లినప్పుడు.. కోటంరెడ్డితో ఫోన్లో మాట్లాడిన వాయిస్ రికార్డును నా స్నేహితుడికి పంపాను. అది యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప.. కావాలని చేసింది కాదు. ఆ తర్వాత అది కాస్తా వైరల్ అయ్యింది. ఇంత పెద్ద వివాదం అవుతుందని ఊహించలేదు. కోటంరెడ్డి అనవసరంగా చిన్న విషయంపై ఇంత రాద్ధాంతం చేస్తాడని అనుకోలేదు. రెండు, మూడు రోజుల్లో సమసిపోతుందనుకున్నా. అందుకే ఇంతకాలం బయటకు రాలేదు. కానీ కోటంరెడ్డి కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో నాకు కొంత ఆందోళన కలిగింది. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఇప్పుడు బయటకు వచ్చా. కోటంరెడ్డి కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసినా ఫర్వాలేదు. నాది ఆండ్రాయిడ్ ఫోన్. ప్రతి ఫోన్ కాల్ రికార్డ్ అవుతుంది. గత 5 నెలలుగా నేను వాడుతున్న ఫోన్‌ను చెక్ చేసుకోండి. అన్ని కాల్స్ రికార్డ్ అయిన విషయం తెలుస్తుంది. ఎవరు వచ్చినా.. నా ఫోన్ ఇస్తా.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి నిజాలు తెలుసుకోవచ్చు. నేను వాయిస్ రికార్డు పంపిన నా స్నేహితుడి పేరును విచారణ అధికారులకు చెబుతా. ఆయన పేరు ఇప్పుడు బహిరంగంగా చెప్పి.. ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు’ అని లంకా రామశివారెడ్డి వివరణ ఇచ్చారు. -
జూమ్ యూజర్లకు అలర్ట్..!
కరోనా రాకతో ఉద్యోగులు, విద్యార్థులు పూర్తిగా ప్రముఖ వీడియో మీటింగ్ యాప్లికేషన్ జూమ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. తాజాగా జూమ్ ప్లాట్‌ఫాంలో బగ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో యాప్‌ను యూజ్ చేయనప్పుడు ఆటోమేటిక్‌గా జూమ్ రికార్డు చేస్తోన్నట్లు పలువురు యూజర్లు నివేదించారు. యాపిల్ మ్యాక్ వాడే వారిలో..! యాపిల్‌కు చెందిన మ్యాక్ ల్యాప్‌ట్యాప్స్‌లో ఈ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. యాపిల్ మ్యాక్ ల్యాప్టాప్స్లోని జూమ్ యాప్‌లో బగ్ ఉన్నట్లు ఆయా యాపిల్ మ్యాక్ యూజర్లు నివేదిస్తున్నారు. యూజర్లు జూమ్ ఫ్లాట్‌ఫాంను ఉపయోగించని సమయంలో కూడా జూమ్ యాప్ మైక్రోఫోన్‌ను, వీడియోను ఆన్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా యాపిల్ మ్యాక్ యూజర్లు ఆందోళనకు గురవుతున్నారు. కాగా పలుమార్లు ఈ సమస్యపై ఫిర్యాదు రావడంతో సమస్యను పరిష్కరించడానికి జూమ్ గత ఏడాది డిసెంబర్లోనే వెర్షన్ 5.91.(3506) అప్డేట్ను విడుదల చేసింది. కాగా తాజా అప్డేట్ సమస్యను పరిష్కరించలేదు. ఈ సమస్య తిరిగి ఆయా యాపిల్ మ్యాక్ యూజర్లకు వచ్చినట్లు తెలుస్తోంది. మైక్రోఫోన్, వీడియో ఆన్‌లో ఉన్నప్పుడు యాపిల్ మ్యాక్ తన యూజర్లను అలర్ట్ చేస్తోంది. కాగా ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని జూమ్ తెలిపింది. చదవండి: గూగుల్ అనూహ్య నిర్ణయం..! ఆ సేవలు పూర్తిగా షట్‌డౌన్..! -
కొండపల్లి నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ ఉత్కంఠకు తెర
సాక్షి, అమరావతి: కొండపల్లి చైర్మన్, వైస్ చైర్మన్‌కు సంబంధించిన ఎన్నికలను బుధవారం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయాలని హైకోర్టు సూచించింది. కేశినేని నాని తన ఓటుహక్కు వినియోగించుకోవచ్చన్న కోర్టు.. నాని ఓటు హక్కు కోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటుందని తెలిపింది. అప్పటి వరకు ఫలితాలను ప్రకటించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది.కాగా, హైకోర్టు ప్రతి సభ్యుడికి ప్రత్యేకంగా.. భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది. -
ఐమాక్స్ వీడియో రికార్డింగ్ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం...!
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ మార్కెట్లలోకి సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఫ్లాగ్షిప్ సిరీస్‌లో భాగంగా హానర్ మ్యాజిక్ 3, హానర్ మ్యాజిక్ 3 ప్రో, హానర్ మ్యాజిక్ 3 ప్రో ప్లస్ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. అద్బుతమైన ఐమాక్స్ వీడియో రికార్డింగ్ ఫీచర్ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం. హనర్ మ్యాజిక్ 3 మోడల్ ధరలు సుమారు రూ. 52,800 నుంచి ప్రారంభమౌతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్లలో రిలీజ్ కానుంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మార్కెట్లలోకి లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. హానర్ మ్యాజిక్ 3 స్మార్ట్ఫోన్లు 8జీబీ, 12 జీబీ ర్యామ్‌తో, 128 జీబీ, 256 జీబీ, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లతో మార్కెట్లలోకి రానుంది. హానర్ మ్యాజిక్ 3 బ్రైట్ బ్లాక్, డాన్ బ్లూ, గ్లేజ్ వైట్, గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. హానర్ మ్యాజిక్ 3 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు 6.76-అంగుళాలు (1344x2772) డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888+ ప్రాసెసర్ 13ఎంపీ ఫ్రంట్ కెమెరా రియర్ కెమెరా 50ఎంపీ వైడ్ సెన్సార్ + 64 ఎంపీమోనోక్రోమ్ సెన్సార్+ 64 ఎంపీ+ 64 ఎంపీ 8 జీబీ, 12 జీబీ ర్యామ్ ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ 128 జీబీ, 256 జీబీ, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 4600mAh బ్యాటరీ టైప్ సీ పోర్ట్ 5జీ సపోర్ట్, బ్లూటూత్ 5.2 50వాట్స్ చార్జింజ్ సపోర్ట్ -
సొంత స్టూడియోలో ఇళయరాజా రికార్డింగ్
సంగీత దర్శకుడు ఇళయరాజా బుధవారం తన సొంత స్టూడియోలో రికార్డింగ్ కార్యక్రమాలను ప్రారంభించారు. నలభై ఏళ్లుగా చెన్నై సాలిగ్రామంలోని ప్రసాద్ స్టూడియోలో ఇళయరాజా తన సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. అయితే ప్రసాద్ స్టూడియో నుంచి ఆయన్ను ఖాళీ చేయించే వ్యవహారంలో ఆ స్టూడియో అధినేతలకు, ఇళయరాజాకు మధ్య తలెత్తిన వివాదం పోలీస్ కేసులు, కోర్టుల వరకు వెళ్లింది. ఈ పరిస్థితుల్లో ప్రసాద్ స్టూడియోలో తనకు సంబంధించిన సంగీత పరికరాలను, ఇతర సామగ్రిని ఇళయరాజా స్వాధీనం చేసుకున్నారు. టీ నగర్‌లోని ఎంఎం థియేటర్‌ను సొంతంగా కొనుగోలు చేసి దాన్ని రికార్డింగ్ థియేటర్‌గా నిర్మించుకున్నారు. దానికి ‘ఇళయరాజా స్టూడియో’ అని నామకరణం చేశారు. ఆ రికార్డింగ్ థియేటర్లో ఇళయరాజా బుధవారం సంగీత కార్యక్రమాలను నిర్వహించారు. హాస్యనటుడు సూరి కథానాయకుడిగా దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న చిత్రానికి సంబంధించిన పాటలను ప్రప్రథమంగా రికార్డ్ చేశారు. -
జనబాహుళ్యంలోకి అన్నమయ్య సంకీర్తనలు
2162 సంకీర్తనల రికార్డింగ్ పూర్తి ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మునిరత్నం వెల్లడి తిరుపతి కల్చరల్: పదకవితా పితామహుడు అన్నమయ్య భక్తి సంకీర్తనల్లోని అర్థాన్ని, పరమార్థాన్ని జన బాహుళ్యంలోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు కృషి చేస్తోందని ఆ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మునిరత్నంరెడ్డి తెలిపారు. శ్రీవారి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకుని అన్నమాచార్య మందిరంలో బుధవారం ‘అన్నమయ్య సంకీర్తన శ్రీపాదుక’, ‘అన్నమయ్య వేంకటనాథ వైభవం’ సీడీలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఇప్పటి వరకు 2,162కు పైగా అన్నమయ్య సంకీర్తనలను స్వరపరచి రికార్డింగ్ పూర్తి చేశామన్నారు. అన్నమయ్య సంకీర్తనల విశిష్టతను భక్తులకు తెలియజేసేందుకు ప్రతి నెలా శ్రవణా నక్షత్రం రోజున సీడీలను ఆవిష్కరిస్త్నుట్లు చెప్పారు. బాల, యువ, నిష్ణాతులైన కళాకారులతో సంకీర్తనలను స్వరపరచి, గానం చేసి, రూపొందిస్తున్న సీడీలకు విశేష స్పందన లభిస్తోందన్నారు. మరో 25 సీడీలు ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ‘అన్నమయ్య సంకీర్తన శ్రీపాదుక’ సీడీలోని సంకీర్తనలను హైదరాబాద్‌కు చెందిన సత్తిరాజు వేణుమాధవ్ స్వరపరచి గానం చేశారు. అలాగే ‘అన్నమయ్య వేంకటనాథ వైభవం’ సీడీలోని సంకీర్తనలను తిరుపతికి చెందిన పి.రామనాథన్ స్వరపరచగా రమణవాణి , సరస్వతి ప్రసాద్ గానం చేశారు. కార్యక్రమంలో టీటీడీ అధికారులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. -
జైల్లో రికార్డింగ్ డ్యాన్స్‌లు
-
మంత్రి ఫోన్ సంభాషణలు రికార్డు!
-
మంత్రి ఫోన్ సంభాషణలు రికార్డు!
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్, సంభాషణల రికార్డింగ్ ఘటనలు సృష్టించిన ప్రకంపనలు ఆగకముందే దాదాపు అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సంభాషణను ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్త రికార్డ్ చేయడం సంచలనం సృష్టించింది. అయితే ఇది గమనించిన మంత్రి భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లోనే జరిగిన ఈ ఘటనపై మంత్రి షాక్ తిన్నట్లు తెలుస్తోంది. కాగా శ్రీశైలం పాలక మండలిలో పార్టీకి చెందిన ఓ నేతకి అవకాశం కల్పించే విషయాన్ని మంత్రి మాణిక్యాల రావు కర్నూలు జిల్లా నేతలు, ఇతర కార్యకర్తలతో ఫోన్ లో మాట్లాడుతుండగా ఓ కార్యకర్త రహస్యంగా ఈ సంభాషణలను రికార్డు చేశాడన్న వార్త కలకలం రేపింది. -
ఇకపై అంతా ‘భద్రం’..!
సాక్షి, ముంబై: మహానగర పాలక సంస్థ (బీఎంసీ) స్థాయీ సమితిలో జరిగే వివిధ అంశాలపై జరిగే చర్చల్లో కార్పొరేటర్ల వ్యాఖ్యలను రికార్డు చేయాలని పరిపాలన విభాగం నిర్ణయించింది. దీంతో అందుకు అవసరమైన ఆధునిక విద్యుత్ యంత్ర సామగ్రి, సిబ్బందిని సమకూర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే ఆదేశించారు. పార్లమెంట్లో జరుగుతున్న కార్యకలాపాలను రికార్డు చేస్తున్నారు. అదేవిధంగా లోక్‌సభ న్యూస్ చానెల్ ద్వారా బయట ప్రపంచానికి ప్రసారం చేస్తున్నారు. ఇలా చేయడంవల్ల తమ ప్రాంత ప్రతినిధి లోక్‌సభలో ఏం మాట్లాడుతున్నారు..? ఏ సమస్యలపై చర్చిస్తున్నారు...? అనేది ఇంట్లో కూర్చున్న సామాన్య ప్రజలకు సైతం తెలుస్తోంది. ఇదే తరహాలో విధానసభ, విధాన పరిషత్‌లో జరిగే కార్యకలాపాలను కూడా చిత్రీకరిస్తున్నారు. ఇదే తరహాలో బీఎంసీకి చెందిన స్థాయీ సమితీతిలో కార్పొరేటర్లు అనేక డిమాండ్లపై, అభివృద్ధి పనులపై, బిల్లుల మంజూరుపై జరుపుతారు. అందులో ఏ కార్పొరేటర్... ఏ అంశాలపై మాట్లాడుతున్నారు..? బయటకు తెలియదు. తమ పరిధిలోని కార్పొరేటర్ అభివృద్థి పనులపై ఎలాంటి చర్చలు జరిపారనేది ఆయా డివిజన్ల ప్రజలకు తెలియాలంటే వారి మాటలు రికార్డు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరేళ్ల కిందటే అప్పటి ప్రతిపక్ష నాయకుడు రాజ్‌హంస్ సింగ్ సభాగృహంలో ప్రతిపాదించారు. అప్పటినుంచి ఆ డిమాండ్‌పై చర్చ జరుగుతూనే ఉంది. ఎట్టకేలకు బీఎంసీ పరిపాలనా విభాగం కార్యకలాపాల రికార్డింగ్‌కు మంజూరునిచ్చింది. అయితే ఈ ప్రక్రియ నిమిత్తం సభాగృహంలో అనేక మార్పులు చేపట్టాల్సి ఉంటుంది. అలాగే ఆధునిక సాంకేతిక పరికరాలను కొనుగోలు చేయాలి. కార్పొరేటర్ల మాటలను రికార్డు చేయడానికి, వాటిని భద్రపర్చడానికి ప్రత్యేకంగా ఒక లైబ్రరీ కావాలి. అందుకు అవసరమైన నిధులు బీఎంసీ ఆర్థిక బడ్జెట్లో మంజూరు చేయాల్సి ఉంటుందని కమిషనర్ కుంటే వివరించారు.