నోటో: జపాన్‌లో భూకంపం సంభవించింది. ఉత్తర మధ్య ప్రాంతంలోని నోటోలో మంగళవారం రాత్రి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నోటో ద్వీపకల్పంలోని పశ్చిమ తీరంలో 10 కి.మీ. (6.2 మైళ్ళు) లోతులో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణశాఖ తెలిపింది.
ఈ ఏడాది ప్రారంభంలో సంభవించిన భారీ భూకంపం నుండి కోలుకుంటున్నంతలోనే ఇప్పుడు మరో భూపంపం సంభవించింది. భూకంపం తర్వాత ఎలాంటి సునామీ ముప్పు లేదని తెలుస్తోంది. ఈ భూకంపం కారణంగా ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు యూఎస్‌జీఎస్ పేర్కొంది. భూకంపానికి సంబంధించిన నష్టం గురించి తక్షణ నివేదికలేవీ లేవు. 2024, జనవరి ఒకటిన నోటో ప్రాంతంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. నాటి దుర్ఘటనలో 370 మందికి పైగా జనం మృతిచెందారు. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.
ఇది కూడా చదవండి: పరిహారం చెల్లించాకే భూసేకరణ
Comments
Please login to add a commentAdd a comment