recter scale
-
పాకిస్తాన్లో భూకంపం.. 5.2 తీవ్రత నమోదు!
గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా భూకంప సంఘటనలు గణనీయంగా పెరిగాయి. ప్రతిరోజూ ఏదోఒకచోట భూమి కంపిస్తూనే ఉంది. ఒకే రోజులో అధిక భూకంపాలు వచ్చిన ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.2గా నమోదైంది. తెల్లవారుజామున 5.35 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. దీనిని గమనించిన ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ఏడాది టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. గత సెప్టెంబర్ 8న మొరాకోలో సంభవించిన భూకంపం, అక్టోబర్ 7న ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపం, నవంబర్ 3న నేపాల్‌లో సంభవించిన భూకంపాలు కూడా విధ్వంసాన్ని సృష్టించాయి. తరచూ భూకంపాలు చోటుచేసుకోవడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. ఇది కూడా చదవండి: బిర్సా ముండా ఎవరు? ప్రధాని మోదీ ఆయన జన్మస్థలికి ఎందుకు వెళుతున్నారు? -
నేపాల్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రత
కాట్మాండు: నేపాల్‌లో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో నమోదైనట్లు నేపాల్ భూకంప అధ్యయన కేంద్రం పేర్కొంది. నేపాల్ రాజధాని నగరం కాట్మాండుకు 115 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం నిక్షిప్తమైనట్లు తెలిపింది. ఉదయం 5:42 గంటల సమయంలో లాంజంగ్ జిల్లాలోని భుల్‌భూలే వద్ద భూమి కంపించినట్లు భూకంప పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ లోక్బీజయ్ తెలిపారు. ఈ భూప్రకంపం వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. కాట్మాండు పరిసరాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. చదవండి: ట్యునీషియా తీరంలో బోటు మునక: 50 మంది గల్లంతు -
శ్రీకాకుళంలో స్వల్పంగా కంపించిన భూమి
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో గురువారం భూమి స్వల్పంగా కంపించింది. ఎచ్చర్ల, పొందూరు, రణస్థలం, శ్రీకాకుళం మండలాల్లో భూమి కంపించినట్లు తెలిసింది. రిక్టర్ స్కేలుపై ఎంత నమోదయిందనే సమాచారం ఇంకా రాలేదు. మరోసారి కంపిస్తుందోమోనని జిల్లా వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.