కాట్మాండు: నేపాల్‌లో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో నమోదైనట్లు నేపాల్ భూకంప అధ్యయన కేంద్రం పేర్కొంది. నేపాల్ రాజధాని నగరం కాట్మాండుకు 115 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం నిక్షిప్తమైనట్లు తెలిపింది. ఉదయం 5:42 గంటల సమయంలో లాంజంగ్ జిల్లాలోని భుల్‌భూలే వద్ద భూమి కంపించినట్లు భూకంప పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ లోక్బీజయ్ తెలిపారు. ఈ భూప్రకంపం వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. కాట్మాండు పరిసరాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
చదవండి: ట్యునీషియా తీరంలో బోటు మునక: 50 మంది గల్లంతు
నేపాల్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రత
Published Wed, May 19 2021 9:42 AM | Last Updated on Wed, May 19 2021 2:47 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment