గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా భూకంప సంఘటనలు గణనీయంగా పెరిగాయి. ప్రతిరోజూ ఏదోఒకచోట భూమి కంపిస్తూనే ఉంది. ఒకే రోజులో అధిక భూకంపాలు వచ్చిన ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున పాకిస్తాన్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.2గా నమోదైంది.
తెల్లవారుజామున 5.35 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. దీనిని గమనించిన ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.
ఈ ఏడాది టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. గత సెప్టెంబర్ 8న మొరాకోలో సంభవించిన భూకంపం, అక్టోబర్ 7న ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపం, నవంబర్ 3న నేపాల్‌లో సంభవించిన భూకంపాలు కూడా విధ్వంసాన్ని సృష్టించాయి. తరచూ భూకంపాలు చోటుచేసుకోవడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి: బిర్సా ముండా ఎవరు? ప్రధాని మోదీ ఆయన జన్మస్థలికి ఎందుకు వెళుతున్నారు?
Comments
Please login to add a commentAdd a comment