peopel
-
పాకిస్తాన్లో భూకంపం.. 5.2 తీవ్రత నమోదు!
గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా భూకంప సంఘటనలు గణనీయంగా పెరిగాయి. ప్రతిరోజూ ఏదోఒకచోట భూమి కంపిస్తూనే ఉంది. ఒకే రోజులో అధిక భూకంపాలు వచ్చిన ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.2గా నమోదైంది. తెల్లవారుజామున 5.35 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. దీనిని గమనించిన ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ఏడాది టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. గత సెప్టెంబర్ 8న మొరాకోలో సంభవించిన భూకంపం, అక్టోబర్ 7న ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపం, నవంబర్ 3న నేపాల్‌లో సంభవించిన భూకంపాలు కూడా విధ్వంసాన్ని సృష్టించాయి. తరచూ భూకంపాలు చోటుచేసుకోవడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. ఇది కూడా చదవండి: బిర్సా ముండా ఎవరు? ప్రధాని మోదీ ఆయన జన్మస్థలికి ఎందుకు వెళుతున్నారు? -
సింధు ప్రజల ముఖ ఆకృతి ఎలా ఉండేది? శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఏమి తేలింది?
సింధు లోయ నాగరికతకు చెందిన ప్రజల ముఖాలు ఎటువంటి ఆకృతిలో ఉండేవనే ఇన్నాళ్ల సందేహాలకు ఇప్పుడు తెరపడింది. తాజాగా పరిశోధకులు సింధూ ప్రజల ముఖాకృతి ఇదేనంటూ ఒక ఫొటోను విడుదల చేశారు. సింధూ నాగరిత నాటి ఒక స్మశానవాటికలో లభ్యమైన రెండు పుర్రెల ఆధారంగా వాటి ముఖాలకు ఆకృతి తీసుకువచ్చి, లోకం ముందు ఉంచారు. ఈ ఫొటో ఇప్పుడు ఎంతో ఆసకికరంగా మారింది. ప్రపంచంలోని పురాతన నాగరికతలలో సింధు లోయ నాగరికత ఒకటి. ఈ నాగరికత క్రీ.పూ. 3300 నుండి 2500 వరకు కొనసాగింది. ప్రముఖ పత్రిక నేచర్‌లో ప్రచురితమైన పరిశోధనా వ్యాసంలోని వివరాల ప్రకారం సింధు లోయ నాగరికత 8000 సంవత్సరాల పురాతనమైనది. భారతదేశ చరిత్ర హరప్పా నాగరికతగా పేరొందినప్పటికీ, అది కూడా సింధు లోయ నాగరికతతో పాటు ప్రారంభమయ్యిందని చరిత్ర చెబుతోంది. మొహెంజొదారో, కలిబంగా, లోథాల్, ధోలావీరా, రాఖీగర్హి మొదలైనవి హరప్పా, సింధు లోయ నాగరికతలకు ప్రధాన కేంద్రాలుగా పరిగణిస్తారు. సింధు లోయ నాగరికతకు చెందిన పురాతన నగరం 2014లో హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలోని భిర్దానాలో కనుగొన్నారు. దీని స్థాపన సుమారు క్రీ.పూ. 7570 నాటిదని చెబుతారు. పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు సింధు లోయ నాగరికత అత్యంత అభివృద్ధి చెందిన నాగరికత అని అంటారు. సింధు లోయ నాగరికతను అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అయితే సింధూ ప్రజల ముఖ రూపాన్ని గుర్తించేందుకు చేసిన ప్రయత్నాలేవీ నేటివరకూ పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. అయితే తాజాగా పూరాతత్వ పరిశోధకులు క్రీ.పూ. 2273, 2616 నాటిదిగా అంచనా వేసిన సింధునాగరికత స్మశానవాటిక రాఖీగర్హి లో పరిశోధినలు సాగించారు. ఈ నేపధ్యంలో రాఖీగర్హిలో లభ్యమైన రెండు పుర్రెల కంప్యూటెడ్ టోమోగ్రఫీ డేటాను ఉపయోగించి క్రానియోఫేషియల్ రీకన్స్ట్రక్షన్ (సీఎఫ్ఆర్) విధానం ద్వారా సుమారు 4500 సంవత్సరాల క్రితం ఖననం చేసిన సింధు నాగరితక వ్యక్తులకు చెందిన ముఖాలను విజయవంతంగా పునర్నిర్మించామని శాస్త్రవేత్తలు తెలిపారు. సింధు నాగరికుల ముఖ స్వరూపాన్ని అంచనావేసేందుకు శాస్త్రీయంగా జరిగిన మొదటి ప్రయత్నం ఇదేనని వారు పేర్కొన్నారు. ఈ వివరాలను అనాటమికల్ సైన్స్ ఇంటర్నేషనల్ వాల్యూమ్- 95లో శాస్త్రవేత్తలు జూన్ లీ, వసంత్ షిండే, డాంగ్ హూన్ షిన్ షోలు పొందుపరిచారు. ఇది కూడా చదవండి: యూదుల ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది? జనాభా ఎంత? -
కరోనాకు మించిన విపత్తు: రాబోయే ఏళ్లలో 100 కోట్లమంది మృతి?
రాబోయే కాలం మానవులకు అత్యంత కష్టకాలంగా మారనుంది. కరోనా తరువాత వాతావరణ మార్పులు పెను వినాశనాన్ని తీసుకురాబోతున్నాయి. ఫలితంగా రాబోయే రోజుల్లో వంద కోట్ల మంది బలికానున్నారు. ఈ వంద కోట్ల మంది ఏదో ఒక ప్రాంతానికే చెందినవారేమీ కాదు.. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ మరణ మృదంగంలో సమిధలు కానున్నారు. వాతావరణ మార్పుల ప్రభావం గురించి శాస్త్రవేత్తలు ఏమి చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. భయపెడుతున్న గణాంకాలు యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్రన్ అంటారియో ఇటీవల వాతావరణ మార్పులపై పరిశోధన నిర్వహించింది. ఈ పరిశోధన ద్వారా భవిష్యత్తులో పెరగబోయే ఉష్ణోగ్రతలు మానవుల మరణాలకు ఎలా కారణమవుతాయో తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన గణాంకాలు రాబోయే తరానికి పెను ముప్పుగా పరిణమించనున్నాయని ఈ పరిశోధన నిర్వాహకులు జాషువా పియర్స్ హెచ్చరించారు. వాతావరణ మార్పుల కారణంగా సంభవించే మానవుల మరణాల సంఖ్యను ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ, ఇది 100 కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. మనిషి బతకాలంటే ఏం చేయాలి? ఈ విపత్తును నివారించడానికి మనుషులంతా ముందుగా వాతావరణ మార్పులపై దృష్టి సారించాలి. దీనితో పాటు కర్బన ఉద్గారాలను తీవ్రంగా పరిగణించాలి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలు కర్బన ఉద్గారాల కట్టడికి చర్యలు చేపట్టాలి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఏటా భూతాపం పెరుగుతున్న తీరు చూస్తుంటే రానున్న కాలంలో ప్రపంచం నిప్పుల కొలిమిలా మారనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ప్రపంచంలో శిలాజ ఇంధనాల వాడకాన్ని వీలైనంత త్వరగా నిలిపివేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శిలాజ ఇంధనాలు వాతావరణ మార్పులకు గల కారణాలలో ప్రధానమైనవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్ని ప్రభుత్వాలు కార్బన్ వేస్ట్ మేనేజ్మెంట్, కార్బన్ డయాక్సైడ్ను సహజంగా నిల్వ చేయడానికి దోహదపడేలా సాంకేతికతను అభివృద్ధి చేస్తే, వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉండదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఐబీఎంలో కూర్చుని రెజ్యూమ్ రూపొందించిన రతన్ టాటా -
ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ‘నీటిగండం’.. రాబోయే రోజుల్లో..
అసోంలోని వివిధ జిల్లాలకు చెందిన లక్షలాదిమంది ప్రజలు ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో రుతుపవనాలు ఇక్కడికి ప్రవేశించనున్నాయి. దీంతో మరింతగా వర్షాలు కురవనున్నాయి. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రం వరదల బారిన పడనుంది. రాబోయే కాలంలోనూ ఇదే ముప్పు కొనసాగనుందా? భారత వాతావరణశాఖ తాజాగా అసోంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని తెలియజేస్తూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. దీని ప్రకారం చూస్తే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఖాయమని తెలుస్తోంది. కాగా ఇప్పటికే వరదల కారణంగా లక్షమందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజిమెంట్ అధారిటీ(ఎఎస్డీఎంఏ) తెలిపిన వివరాల ప్రకారం అసోంలోని బక్సా, బార్పేట, దరంగ్, ఘెమాజీ, థుభరీ, కోక్రాజార్, లఖీపుర్, నల్బార్, సోనిత్పూర్, ఉదల్గురి జిల్లాలలో 1.9 లక్షలకు మించిన ప్రజలు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 780 గ్రామాలు నీట మునిగాయి. 10 వేల ఎకరాల్లోని పంట నీట మునిగింది. ఫలితంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాలను వరదలు చుట్టుముట్టాయి. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్థంభించింది. గత ఏడాది మే నెల నుంచే అసోంలో వరదలు మొదలయ్యాయి. సాధారణ వర్షపాతం కంటే అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. 2022 ముందు 10 ఏళ్లలో ఎప్పుడూ అసోంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తలేదు. గడచిన కొన్ని సంవత్సరాలుగా అసోంలో సంభవిస్తున్న వరదలు ప్రజలను మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వరదల కారణంగా ఊళ్లను చుట్టుముడుతున్న నీరు చాలా సమయం వరకూ అదే ప్రాంతంలో నిలిచిపోతోంది. ఇది ఎంతో ప్రమాదకరంగా మారుతోంది. గడచిన ఏడాదిలో భారీ వర్షాలు, వరదలు అసోంను అతలాకుతలం చేశాయి. ఏకంగా ఏడు నెలల పాటు అసోంలోని పలు జిల్లాలు నీటిలో మునిగే ఉన్నాయి. దీనికి ముందు 2019, 2020లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. గడచిన ఏడాది అసోంలో సంభవించిన వరదలకు 180 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కూడా చదవండి: కాశీకి వెళుతున్నారా? ఈ మార్పులు తెలియకపోతే.. దారి తప్పడు ఖాయం! -
అయినవారి మృతదేహాల కోసం...
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగి 6 రోజులు గడిచింది. బాధితులు ఇంకా తమవారి మృతదేహాల కోసం వెదుకులాట సాగిస్తూనే ఉన్నారు. ఇంకా 100 మృతదేహాలకు శవ పంచనామా పూర్తికాలేదు. దీంతో బాధితులు భువనేశ్వర్ ఎయిమ్స్ వద్ద పడరాని పాట్లు పడుతున్నారు. పలు మృతదేహాలను గుర్తించడంలో ఇబ్బందులు తలెత్తుతుండటంతో అధికారులు వాటికి డీఎన్ఏ పరీక్షలు చేయించాల్సివస్తోంది. ఇందుకోసం డీఎన్ఏ శాంపిల్స్‌ను భువనేశ్వర్ ఎయిమ్స్ వద్ద సేకరిస్తున్నారు. ఎయిమ్స్‌తోపాటు మరో ఐదు కేంద్రాలలోనూ డీఎన్ఏ శాంపిల్స్ సేకరణ జరుగుతోంది. మీడియాతో ఒక బాధితుడు మాట్లాడుతూ తన కుమారుని మృతదేహాన్ని గుర్తుపట్టినప్పటికీ తమకు దానిని అప్పటించడం లేదని ఆరోపించారు. డీఎన్ఏ రిపోర్టు వచ్చాకనే ఇస్తామంటున్నారని తెలిపారు. తన దగ్గర ప్రస్తుతం తిండికి కూడా ఖర్చులు లేవని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు చాలామంది బాధితులు తమ వారి డీఎన్ఏ రిపోర్టులు వచ్చాకనే మృతదేహాలను తీసుకు వెళుతున్నారు. మరికొందరైతే ఇక్కడి పరిస్థితులను చూసి, తమవారి మృతదేహాలు దొరుకుతాయనే ఆశను కూడా వదులుకున్నారు. మీడియాతో మాట్లాడిన ఒక బాధితుడు ఇప్పటివరకూ తన సోదరుని మృతదేహం లభ్యం కాలేదని, ఇక ఆశ వదులుకొని తిరిగి ఇంటికి వెళ్లిపోదామని అనుకుంటున్నానన్నాడు. ఇక్కడ వెదుకులాట సాగిస్తూ మూడు రోజులయ్యింది. అధికారులు డీఎన్ఏ ఇచ్చి వెళ్లిపొమ్మంటున్నారని తెలిపాడు. కాగా ఇప్పటి వరకూ 30 డీఎన్ఏ శాంపిల్స్ సేకరించారు. ఈ శాంపిల్స్‌ను ప్రభుత్వం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు పంపించాలనే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మృతదేహాలను కోల్డ్ రూమ్‌లలో ఉంచారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ ప్రమాదంలో మొత్తం 288 మంది మృతి చెందారు. 193 మృతదేహాలను, భువనేశ్వర్ తరలించారు. 94 మృతదేహాలను బాలాసోర్‌లో ఉంచారు. ఒక బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. భువనేశ్వర్ తరలించిన 193 మృతదేహాలలో 110 మృతదేహాలకు శవ పంచనామా పూర్తయ్యింది. ఇంకా 83 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. 200 మంది బాధితులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనలో దాదాపు 1000 మంది గాయపడ్డారు. చదవండి: పశ్చిమ బెంగాల్ యువకుని మృతదేహం బీహార్‌కు.. -
రాయ్‌బరేలీ ప్రజలకు కృతజ్ఞతలు
రాయ్‌బరేలీ: సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్నీ అందించిన రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలపడానికి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి విచ్చేశారు. సోనియా గాంధీ సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటిసారి రాయ్‌బరేలీకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం మధ్యాహ్నం ఫర్సాత్ గంజ్ విమానాశ్రయానికి చేరుకున్న సోనియా, ప్రియాంక అక్కడి నుంచి భుయేము అతిథి గృహానికి వెళ్లారని రాయ్‌బరేలీ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి లాల్‌కృష్ణ ప్రతాప్ తెలిపారు. అన్ని జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రియాంక గాంధీ సమీక్ష నిర్వహించనున్నారని చెప్పారు. ఆహ్వానించిన 2,500 మంది పార్టీ కార్యకర్తలతో సాయంత్రం జరిగే కృతజ్ఞత సమావేశంలో సోనియా, ప్రియాంక పాల్గొంటారని వెల్లడించారు. ఇటివల జరిగిన 17వ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కంచుకోటలా ఉన్న రాయ్‌బరేలీలో సోనియా గాంధీ మరోసారి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి దినేశ్ ప్రతాప్ సింగ్‌పై సోనియా 1, 67,178 మెజార్టీతో గెలుపొందారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కూడా సోనియా ఇదే నియోజకవర్గంలో 3,52,713 మెజార్టీతో బీజేపీ అభ్యర్థి అజయ్ అగర్వాల్‌పై విజయం సాధించారు. -
జగన్‌ను చూసేందుకు పోటెత్తిన జనం
-
బిగిసిన పిడికిళ్లు
-
జనహారతి
రాయలసీమ పుష్కరాలకు భారీగా తరలి వచ్చిన ప్రజలు వెయ్యిమంది తో సహస్త్ర హారతులు పాతముచ్చుమర్రి గ్రామంలో శుక్రవారం రాయలసీమ పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దాదాపు వెయ్యి మంది కృష్ణమ్మకు హారతి పట్టారు. ఈ వేడుకలను తిలకించేందుకు సమీప గ్రామాలైన నెహ్రూనగర్, పగిడ్యాల, పడమర వనుములపాడు, లక్ష్మాపురం, ప్రాతకోట, నందికొట్కూరు తదితర గ్రామాల నుంచి ప్రజలు వేలాదిగా తరలి వచ్చారు. పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ ప్రారంభపూజలు చేశారు. రాయలసీమ పుష్కర ఏర్పాట్లలో భాగస్వాములైన అందరికి రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించారు. – పగిడ్యాల