
గౌహతి: ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో భూమి కంపించింది. ఈరోజు (గురువారం) తెల్లవారుజామున 2:25 గంటలకు 5.0 తీవ్రతతో భూ ప్రకంపనలు(Earthquake) చోటుచేసుకున్నాయి. ఇది సంభవించినప్పుడు చాలా మంది గాఢ నిద్రలో ఉన్నారు. అయితే ఈ ప్రకంపనలు వారిని నిద్ర నుంచి మేల్కొలిపి, ఇళ్ల నుంచి బయటకు పరుగెత్తేలా చేశాయి.
భూకంప కేంద్రం అస్సాం(Assam)లోని మోరిగావ్‌లో ఉన్నట్లు గుర్తించారు. గౌహతితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. మోరిగావ్‌లో 16 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. అయితే, ఈ ప్రకంపనల కారణంగా ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు తెలియరాలేదు.
An earthquake with a magnitude of 5.0 on the Richter Scale hit Morigaon, Assam at 2.25 am today
(Source - National Center for Seismology) pic.twitter.com/iowhZjOJHk— ANI (@ANI) February 26, 2025
ఎన్‌సీఎస్ తెలిపిన వివరాల ప్రకారం అస్సాంతో పాటు, మేఘాలయ(Meghalaya), పశ్చిమ బెంగాల్, బీహార్ వరకు భూ ప్రకంపనలు కనిపించాయి. భూకంపం భయంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ డేటా ప్రకారం భూకంపాల పరంగా ఈశాన్య భారతదేశం జోన్- 5లోకి వస్తుంది. ఇటువంటి జోన్ 5లో తేలికపాటి నుండి మితమైన తీవ్రతతో భూకంపాలు సంభవిస్తుంటాయి.
ఇది కూడా చదవండి: ఆకట్టుకున్న మహా కుంభమేళా చివరి హారతి