
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా(Kolkata)లో ఈరోజు(మంగళవారం) ఉదయం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత నమోదయ్యింది. భూకంప కేంద్రం బంగాళాఖాతంలో 91 కిలోమీటర్ల లోతున ఉంది. కోల్‌కతా సమీపంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నిర్ధారించింది.
తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంపం(Earthquake) ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించింది. జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించినట్లు ఇంతవరకూ తెలియరాలేదు. కోల్‌కతాలో భూ ప్రకంపనలకు సంబంధించిన వివరాలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
An earthquake with a magnitude of 5.1 on the Richter Scale hit the Bay of Bengal at 06:10 IST today
(Source - National Center for Seismology) pic.twitter.com/Fro47VpwTK— ANI (@ANI) February 25, 2025
కేమాన్ దీవులు, హోండురాస్ మధ్య సముద్రంలో గత 24 గంటల్లో రెండు భూకంపాలు నమోదయ్యాయి. రెండవ భూకంపం సోమవారం మధ్యాహ్నం 3:08 గంటలకు సంభవించింది. కేమన్ ఐలాండ్స్ విపత్తు నిర్వహణ సంస్థ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి ఎటువంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదు. ఆదివారం రాత్రి 7:30 గంటలకు సంభవించిన రెండవ భూకంపం 4.9 తీవ్రతతో నమోదైంది. ఇది గ్రాండ్ కేమన్ నుండి 242 కి.మీ దూరంలో 10 కి.మీ లోతులో నమోదైంది.
ఇది కూడా చదవండి: Mahashivratri: నేపాల్‌కు 10 లక్షలమంది భారతీయులు
Comments
Please login to add a commentAdd a comment