
ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగిలేలా ఉన్నాడు. కేకేఆర్, ఆర్సీబీ మధ్య రేపు (మార్చి 22) జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యే అవకాశముందని తెలుస్తుంది. రేపు మ్యాచ్ జరిగే సమయానికి (రాత్రి 7:30 గంటలకు) వర్షం పడే అవకాశాలు 90 శాతం ఉన్నాయని వాతావరణ నివేదికలు ఇదివరకే స్పష్టం చేశాయి. దీన్ని నిజం చేస్తూ ఇవాల్టి నుంచే వర్షం మొదలైంది.
NO RAIN pleaseeee!!!!pic.twitter.com/YgfkvBSfx0
— CricTracker (@Cricketracker) March 21, 2025
ఇవాళ రాత్రి 8 గంటల ప్రాంతంలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డన్స్ మైదానంలో వర్షం కురుస్తూ ఉండింది. ఇవాల్టి పరిస్థితి చూసి రేపటి మ్యాచ్ జరిగేనా అని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్ సమయానికి వర్షం తగ్గిపోవాలని దేవుడిని వేడుకుంటున్నారు. ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు చాలాకాలంగా కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీజన్ ఆరంభ మ్యాచ్ రద్దైతే వారి బాధ వర్ణణాతీతం.
మరోవైపు రేపటి మ్యాచ్‌కు ముందు ఈడెన్‌గార్డెన్స్‌లో ఐపీఎల్-18వ సీజన్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ ఓపెనింగ్ సెర్మనీ దాదాపుగా రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ సొంత మైదానంలో జరిగే తొలి మ్యాచ్ విజయం సాధించి సీజన్‌ను ఘనంగా ప్రారంభించాలని ప్లాన్ చేసింది. అయితే వారి ఆశలు వర్షార్పణం అయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో కేకేఆర్ కొత్త కెప్టెన్ ఆజింక్య రహానే సారథ్యంలో బరిలోకి దిగనుంది. గత సీజన్‌లో కేకేఆర్‌కు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు వెళ్లాడు.
ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా 'ఈ సాలా కప్ నమ్మదే' అనుకుంటూ ఉంది. అయితే వీరి ఆశలకు వర్షం ఆదిలోనే బ్రేకులు వేసేలా ఉంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ కూడా కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగుతుంది. రజత్ పాటిదార్ ఆర్సీబీ నూతన నాయకుడిగా నియమితుడయ్యాడు.
ఆర్సీబీ జట్టు..
రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్తిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భాండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిఖ్ సలాం ధార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్
కేకేఆర్ జట్టు..
అజింక్య రహానే (కెప్టెన్), మనీశ్ పాండే, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, అంగ్‌క్రిష్ రఘువంశీ, అనుకుల్ రాయ్, రమన్‌దీప్ సింగ్, వెంకటేశ్ అయ్యర్, మొయిన్ అలీ, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, క్వింటన్ డికాక్, రహ్మానుల్లా గుర్బాజ్, లవ్‌నిత్ సిసోడియా, వరుణ్ చక్రవర్తి, మయాంక్ మార్కండే, వైభవ్ అరోరార, హర్షిత్ రాణా, అన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా, స్పెన్సర్ జాన్సన్
Comments
Please login to add a commentAdd a comment